జనం..జనం..జగన్ ప్రభంజనం.
-ఏడాదిలోనే కూటమికి ముచ్చెమటలు.
-రెచ్చగొట్టి మరీ జగన్‌ను బైటకు రప్పించిన కూటమి.
-పరదాల చాటు బతుకని నిందించిన కూటమి.
-జగన్ బైటకు వస్తే భరించలేకపోతున్న తెలుగు దేశం.
-పరామర్శలకే ఇంత జనం వస్తే పోరాటాలకు ఎంత మంది వస్తారో!
-సభలు పెడితే ఎలా వుంటుందో!
-ఊహలకందని కలలు పట్టపగలు చూపిస్తున్న జగన్.
-కూటమికి నిద్ర లేని రాత్రులే అంటున్న జగన్.
-అదేం జనం..ఎందుకంత ప్రజాభిమానం.
-జగనంటే ఎందుకంత మమకారం.
-జగన్‌ను చూడడానికి ఎగబడుతున్న జనం.
-ఎటు చూసినా ఇసుకేస్తే రాలనంత జనం.
-కట్టడి చేయలేక చేతులెత్తేస్తున్న యంత్రాంగం.
-జగన్ బయటకొస్తున్నాడంటే చాలు..ఊర్లన్నీ జనసంద్రం.
-చెక్ పోస్ట్‌లు ఎన్ని పెట్టినా తోసుకొస్తున్న జనం.
-కాలి నడకన కదులుతున్న జనం.
-పొలాలు, తోటలను దాటు కుంటూ వస్తున్న అభిమానం.
-జనాగ్రహానికి, జగన్ అభిమానం తోడైంది.
-జగన్‌కు జనం బ్రహ్మ రథం పడుతోంది.
హైదరాబాద్,నేటిధాత్రి: ఏం జనం..ఏం జనం..ఉప్పెనలా వస్తున్నారు. వెల్లువను తలపిస్తున్నారు. ఉరలెక్తుకుంటూ వస్తున్నారు. నిర్భంధాలను చేధించుకుంటూ వస్తున్నారు. తమ అభిమాన నాయకుడు జగన్ చూసేందుకు లక్షల మంది ఎగబడుతున్నారు. ఇలా గతంలో ఏ నాయకుడి కోసం జనం వచ్చింది లేదు. ఎంతటి విపత్కరమైన పరిస్ధితులనైనా ఎదుర్కొంటామని ముందుకు రాలేదు. ఇదేం అభిమానం. ఒక నాయకుడి మీద ప్రజలు ఇంతగా మమకారం పెంచుకునే రోజులు ఇంకా వున్నాయా? నిజంగానే అది జనమేనా…పూల వనమా? అన్నట్లు జెండాలు పట్టకొని జనం వస్తుంటే పూల వనాలు నడుచుకుంటూ వస్తున్నట్లున్నాయి. శవమెత్తిని జన తాండవం కనిపిస్తోంది. జనమంతా ఒక్కసారిగా రోడ్ల మీదకు వచ్చి తండోప తండాలుగా కదులుతుంటే జన జాతరను తలపిస్తోంది. జగన్‌ను దీవించేందుకు ప్రతి ఇంటి నుంచి ఒకరు వచ్చినట్లు కనిపిస్తోంది. ఇదేం.జనం..ఇదేం అభిమానం.. అదేం మమకారం..ఇంతలా జగన్ కోసం జనం ఎందుకు పరిపతిస్తున్నారు. జగన్‌ను చూసి ఎందుకు మురిసిపెతున్నారు. ఒక్కసారి జగన్‌ను చూస్తే చాలని ఎందుకనుకుంటున్నారు. జగన్ కొత్తగా వచ్చిన నాయకుడు కాదు. ఈ సారే జనం ముందుకు రావడం లేదు. 2010 నుంచి జనంలోనే వుంటున్నాడు. దివంగత వైఎస్ మరణించిన తర్వాత ఆయన ఇంటిలో వున్నది తక్కువ. జనంలో వున్నదే ఎక్కువ. ఓదార్పు యాత్రపేరుతో ఊరూరు జగన్ తిరిగాడు. తర్వాత జరిగిన ఎన్నికల సమయాల్లోనూ వస్తున్నాడు. 2017లో పాదయాత్ర చేపట్టారు. ఊరూ వాడ, రాష్ట్ర మంతా తిరిగారు. జనం ముందుకు వచ్చి, ప్రజలకు భరోసా కల్పించారు. 2019 ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచారు. కాని 2024 ఎన్నికల్లో ఊహించని విధంగా పరాజయం పాలయ్యారు. ఎన్నికల ముందు జరిగిన ఎన్నికల సభలకు జనం లక్షలాదిగా హజరయ్యారు. జగన్ ఎన్నికల సభలన్నీ విజయవంతమయ్యాయి. కాని జగన్ ఓడిపోయారు. ఏపిలో ప్రభుత్వం మారి సరిగ్గా ఏడాది పూర్తవుతోంది. ఇప్పుడు జగన్ ప్రజల కోసం అడుగు పెడుతున్నారు. అ ంతే జనం తండోపతండాలుగా ఆయన కోసం వస్తున్నారు. ఆయనతో కలిసి సాగుతున్నారు. జగన్ చూడాలిన ఉవ్విల్లూరుతున్నారు. అది ఎలా వుందంటే జనం, జనం ప్రభంజనం అన్నట్లు వుంది. జగనంటే జనానికి ఎందికింత అభిమానం అనే ప్రశ్న అందరిలో ఉత్పన్నమయ్యేలా వుంది. జగన్‌ను చూడడానికి ఇంతగా ఎతబడడానికి కారణం కూడా ఎవరికీ బోధపడడడం లేదు. సహజంగా ఓటమి పాలైన పార్టీ నాయకులు ఏడాది కాలంలో జనంలోకి వస్తే ఇంతటి ప్రజాదరణ ఏ నాయకుడికి దక్కలేదు. దేశంలో ఏ నాయకుడు కోసం ఇలా జనం ఎగబడి రాలేదు. నిజానికి అవి సభలు కాదు. ర్యాలీలు కాదు. కేవలం ఓదార్పులు. రైతుల కోసం, చనిపోయిన పార్టీ నాయకుల కుటుంబాలను పరామర్శించడానికి జగన్ వెళ్తుంటేనే ఇంతలా జనం ఊర్లకు ఊర్లు దాటి, ఎంత దూరమైన వాస్తున్నారంటే సామాన్యమైన విషయం కాదు. అంతే కాదు పోలీసుల నిర్భంధాలను చేదించుకుంటూ వాగులు, వంకలు దాటుకుంటూ, కొండలు ఎక్కి దిగితూ వస్తున్నారంటే మామూలు విషయం కాదు. రోడ్లపై జగన్‌ను చూసేందుకు వెళ్లే జనాన్ని కట్టడి చేస్తున్నారని తెలిసి, పొలాల గట్లపైన, తోటల మధ్య నుంచి వెళ్తున్నారు. జగన్‌కు జై కొడుతున్నారు. ఇలా వస్తున్న జనాన్ని చూసియంత్రాంగం కూడా చేతులెత్తేయక తప్పడం లేదు. జగన్ బైటకొస్తే ఊర్లన్నీ జనసంద్రాలౌతున్నాయి. పల్లెల్లో ఎక్కడ చూసినా జన నినాదమే వినిపిస్తోంది. పుట్టల్లో నుంచి చీమలు వచ్చినట్లు జనం జగన్ నినాదాలు చేసుకుంటూ, అలుపు, సొలుపు లేకుండా వస్తున్నారు. జగన్‌కు మేమున్నామని ధైర్యం నింపుతున్నారు. జగన్ తమకోసమున్నాడని సంబరపడుతున్నారు. జగన్‌ను చూసిన ఆనందంలో పరవశించి పోతున్నారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టినా సరిపోవడం లేదు. ఎక్కడికక్కడ కాలి నడకన కూడా జనం వెళ్లి తమ నాయకుడిని చూడడం అనేది గతంలో కనిపించేది. ఇప్పుడు జగన్ కోసం జనం అలా వెళ్లడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఏడాది కాలంలోనే జగన్ కూటమి ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. అయితే ఇక్కడొక విషయం చెప్పుకోవాలి. నిజానికి జగన్ కూటమి ప్రభుత్వానికి కొంత సమయం ఇద్దామనే అనుకున్నారు. అందుకే ఆయన ఏడాది కాలంగా ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు, ఆరోపణలు చేయకుండా వుంటున్నారు. వైసిపి నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నా చూద్దాం? ఇంకా ఏన్ని నిర్భందాలు పెడతారో అని అనుకుంటూనే వున్నారు. కాని జగన్ బైటకు రాలేదు. జగన్ పిరికి వాడంటూ, ప్యాలెస్ చుట్టూ కంచెలు ఏర్పాటు చేసకున్నారంటూ తెలుగుదేశం, జనసేన నాయకులు పదే పదే విమర్శిస్తూ వుండేవారు. వాటిని జగన్ ఎప్పుడూ పట్టించుకోలేదు. దాంతో పదే పదే పరదాల చాటు నాయకుడు జగన్ అంటూ ఇటీవల ఎద్దేవా చేయడం మరీ విపరీతతం చేస్తూ వస్తున్నారు. జగన్‌ది పరదాల చాటు బతుకంటూ నిందించడం మొదలు పెట్టారు. ఒక్కసారిగా జగన్ బైటకు రావడంతో తెలుగుదేశం పార్టీ తట్టుకోలేకపోతోంది. తెలుగుదేశం శ్రేణులకు ముచ్చెమటలు పడుతున్నాయి. జగన్ పరామర్శలకు వస్తేనే ఇంత జనం వస్తే, ఇక ఆయన పాదయాత్ర చేయాలనుకుంటున్నారు. ఆ సమయంలో పరిస్దితి ఎలా వుంటుందో ఊహించుకుంటేనే కూటమి నాయకులకు తడిసిపోయేలా వుంది. ఇప్పుడే కూటమి పాలకులకు ఊహలకందని కలలు పట్టపగలే వచ్చేలా చేస్తున్నాడు. అనవసరంగా జగన్‌ను కెలికి తప్పు చేశామన్న భావన కలిగేలా చేశాడు. కూటమికి నాయకులకు నిద్రలేని రాత్రులు ఇప్పటి నుంచే మొదలైనట్లు కనిపిస్తోంది. ఏడాది పాలన తర్వాత కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో పెరుతున్న వ్యతిరేకత, జనాగ్రహానికి జగన్ అబిమానం తోడైంది. జగన్‌కు జనం బ్రహ్మరథం పడుతోంది. అయితే పాలకులెప్పుడూ తమకు వ్యతిరేక నినాదాలు వినలేరు. ప్రతిపక్షాలు ఎదుగుతుంటే చూడలేరు. ప్రతిపక్షాలను అణిచి వేయకుండా వుండలేరు. నిర్భంధాల నుంచి ఎన్ని పాఠాలు నేర్చుకున్నా పాలకులు మారరు. ప్రశాంతంగా ప్రతిపక్షాలను రాజకీయాలు చేసుకోనివ్వరు. ప్రతిపక్షాలు పాలకపక్షాల మీద పై చేయి సాధించడం తట్టుకోలేరు. రాజరికమైనా,ప్రజాస్వామ్యమైనా సరే ప్రశ్నను పాలకులు వినలేరు. ప్రశ్నించేవారిని చూసి సహించలేరు. రాజులు తమ సామంత రాజుల నుంచి నిరసన ఒప్పుకోరు. ప్రజాస్వామ్యంలో పాలక పక్షం ప్రతిపక్షం ఎదుగుతుంటే చూడలేరు. నిర్భంధం నుంచే ఏ పార్టీ అయినా సరే పాలక పక్షమౌతుంది. ఆ సంగతి తెలిసి కూడా నిర్భంధాలను విధించకుండా ఏ పాలకుడు వుండలేరు. ప్రపంచమంతా ఇదే అనుసరిస్తుంది. చరిత్రలో ఎన్ని సాక్ష్యాలున్నా పట్టించుకోరు. జనంలోకి జగన్ రావడాన్ని కూటమి ప్రభుత్వం సహించలేకపోతోంది. దాంతో ప్రజల నుంచి కూడా ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. గతాన్ని కూడా ఓసారి మననం చేసుకోవాలి. గత ప్రజాస్వామ్య స్పూర్తి ఈ మధ్య మరింత దెబ్బతింటోంది. జగన్ ప్రజల్లోకి వెళ్తున్నారు. అడుగడుగునా జగన్‌కు ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. జగన్ చూడడం కోసం జనం ఎగబడుతున్నారు. అంటే ఎంతో నిర్భంధం వుంటే తప్ప ఇలాంటి పరిస్ధితులు ప్రజాస్వామ్యంలో చూడలేం. జగన్ కాలు బైట పెడితే చాలు జనం తండోపతండాలుగా వేలల్లో వస్తున్నారు. జగన్ వస్తున్నాడని తెలిస్తే మూడురోజుల ముందు నుంచే ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. ఈ మధ్య జగన్ గుంటూరులోని ఓ గ్రామానికి వెళ్తుంటే అడుగుగడునా సుమారు 84 కిలోమీటర్ల పొడువునా జగన్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఇది కూటమి ప్రభుత్వానికి ఆశనిపాతంలా మారింది. నిన్న జగన్ చిత్తూరు జిల్లాలోని బంగారు పాలెంకు వెళ్లారు. అక్కడ జగన్ వెంట 500 మందికి మించకుండా వుండాలని ప్రభుత్వం షరతుపెట్టింది. వేలాది మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసింది. ప్రజలు కొండలు, గుట్టలు ఎక్కి మరీ వచ్చారు. గుంటూరు పర్యటనలో వేలాదిగా తరలిని జనం, ఇప్పుడు లక్షల్లోకి చేరుకుంటోంది. జనం ప్రభంజనం కనిపిస్తోంది. నిజం చెప్పాలంటే జగన్‌ను అలా వదిలేస్తే పోయేది. ప్రజలు ప్రతిపక్షంగా జగన్ తనపాత్ర పోషించేందుకు ప్రజల్లోకి వెళ్లొద్దని పాలకులు నిర్ణయం తీసుకొని నిర్భంధాల విధిస్తే పరిస్ధితి ఇలాగే వుంటుంది. చివరికి ఇది ఆదిపత్య రాజకీయాలే కాదు, కక్షపూరిత రాజకీయాలకు దారి తీస్తుంది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిదికాదు. పాలక, ప్రతిపక్షాల మధ్య రాజకీయ మాటల సంవాద సమరం వుండాలే కాని, నిర్భంధం వుండొద్దు. వుంటే రియాక్షన్ ఇలాగే వుటుంది. అక్కడ వుంది జగన్ మరి.