`రాములమ్మ ధైర్యం.. తెలంగాణ నినాదం!
`రాములమ్మ నోట జై తెలంగాణ మాట!
`తెలంగాణకు ఏదో జరిగే అవకాశం కనిపిస్తున్నట్లు కనిపెట్టారా!
`తెలంగాణ మీద మళ్ళీ కుట్రలు మొదలైనట్లు పసిగట్టారా?
`అందుకే జై తెలంగాణ అని గట్టిగా నినదించారా!
`తెలంగాణ ప్రజలు జై తెలంగాణ అని అనాలని సూచించారు.
`గుండెల మీద చేయి వేసుకొని తెలంగాణ నినాదం చేయాలని చెప్పారు.
`తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యమ నాయకురాలు రాములమ్మ.
`తెలంగాణ కోసం జీవితం త్యాగం చేసిన పోరాట యోధురాలు.
`వందలాది మంది యువత ఆత్మ బలిదానాలతో తెచ్చుకున్న తెలంగాణ.
`తెలంగాణపై కుట్రలు జరగకుండా అప్రమత్తంగా వుండాలని చెప్పారు.
`రాజకీయంగా ఏదో జరుగుతోందని రాములమ్మ ఆందోళన చెందుతోందా!
`రాజకీయ తెర వెనుక ఏపి శక్తులు తెలంగాణను తెర్లు చేయాలని చూస్తున్నాయా!
`రాములమ్మ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా కళకళం సృష్టించాయి!
`కాంగ్రెస్ నాయకులు తెలంగాణ నినాదం చేయకపోవడంపై స్పందించారా?
`తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ జై తెలంగాణ అనకపోతే తప్పుడు సంకేతాలు వెళ్లవా!
`జై తెలంగాణ అనడానికి ఇబ్బంది ఏమిటి?
హైదరాబాద్,నేటిధాత్రి:
షీ ఈస్ ది గ్రేట్ లీడర్ ఆఫ్ మోడరన్ తెలంగాణ. షీ వాస్ స్రగుల్ ఫర్ తెలంగాణ స్టేట్. షీ ఈస్ బ్రేవ్ లీడర్ ఆఫ్‌ది తెలంగాణ. షీ ఈస్ వన్ ఆఫ్‌ది ప్రొటెక్టర్ ఆఫ్ తెలంగాణ. యస్.. షీ ఈస్ వండర్ లీడర్ ఆఫ్ తెలంగాణ. ఈ రెండు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీలో జై తెలంగాణ అని నినదించిన ఏకైక నాయకురాలు ఎమ్మెల్సీ రాములమ్మ. ఇంత కాలానికి సూటిగా, స్పష్టంగా అందరి గుండెలు అదిరేలా జై తెలంగాణ అని చెప్పిన ఏకైక నాయకురాలు విజయశాంతి. రాజకీయాల కోసం, ఓట్ల కోసం జై తెలంగాణ అనడం వేరు. విజయశాంతి చెప్పిన ఒక మాట తెలంగాణ వున్నంత వరకు ప్రజలు మర్చిపోనంత గొప్పగా చెప్పారు. హనుమంతుని గుండెల్లో శ్రీరాముడున్నట్లే, ప్రతి తెలంగాణ వాదిలోనూ జై తెలంగాణ నినాదం వుండాలన్నారు. తెలంగాణ వచ్చినా, ఎంత కాలమైనా తెలంగాణను కాపాడుకోవాల్సిన బాద్యత ప్రజలదే అన్నారు. తెలంగాణ ప్రజలు ఎప్పుడూ తెలంగాణ నినాదాన్ని మర్చిపోవొద్దన్నారు. తెలంగాణ పదాన్ని గుండెల్లో పెట్టుకొని స్మరించాలని చూసించారు. బోనాల పండుగ సంబరాలలో ఆమె జై తెలంగాణ అని మరోసారి గర్జించారు. తెలంగాణ మొత్తం వినేలా జై తెలంగాణ అని నినదించారు. ఇంత కాలానికి మనసు నిండా నిండిన ఉద్వేగంతో జై తెలంగాణ అని నినదించిన ఏకైక నాయకురాలు విజయశాంతి. ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్‌లో జై తెలంగాణ అని ఒక్క విజయశాంతి మాత్రమే అంటున్నారు. విజయశాంతి గొప్పదనం, గొప్ప గుణం ఈ రోజు తెలంగాణ ప్రజలకు మరోసారి తెలిసింది. అప్పుడై, ఇప్పుడైనా, ఎప్పుడైనా తెలంగాణ కోసం మాట్లాడేది ఒక్క విజయశాంతి మాత్రమే అని మరోసారి నిరూపించారు. తెలంగాణపై దుష్టశక్తులు పన్నాగం పన్నుతున్నాయని తెలంగాణ ప్రజలను హెచ్చరించారు. తెలంగాణను వదిలేయలేక, తెలంగాణ మీద ఆదిపత్యం లేక కొంత మంది మళ్లీ కుట్రలు చేస్తున్నారని చెప్పారు. అదీ విజయశాంతి అంటే..ఎందుకంటే ఆమె ఎవరికీ భయపడే నాయకురాలు కాదు. తాను ఏమి చెప్పాలనుకుంటున్నారో చెప్పేస్తారు. ఏది చెప్పారో దానికి కట్టుబడి వుంటారు. ఎందుకంటే ఆమెకు తెలంగాణ అంటే ప్రాణం. ఆమె ప్రతి క్షణం తెలంగాణ కోసమే ఆలోచిస్తుందనే మరోసారి నిరూపించారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్‌పార్టీ. తెలంగాణ తెచ్చిన పార్టీ కాంగ్రెస్‌పార్టీ. ఆ పార్టీలోనే తెలంగాణ అనే నినాదం వినిపించకపోతే కాంగ్రెస్‌కు తీరని నష్టం. జై తెలంగాణ నినాదం ఏ ఒక్కరి సొత్తు కాదు. ఏ ఒక్క పార్టీకి పెటెంట్ కాదు. జై తెలంగాణ అనేది అన్ని పార్టీల నినాదం. విధానం. అందుకే అన్ని పార్టీలు జై తెలంగాణ అనాలి. లేకుంటే ప్రజలు కూడా ఏదొ ఒక పార్టీకి చెందిన నినాదమని భావించే ప్రమాదముంది. ఆ అవకాశం కాంగ్రెస్ పార్టీ కల్పిస్తోంది. అందరూ జై తెలంగాణ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు అనడం లేదు? జై తెలంగాణ అని ఎన్నికల సమయంలో ప్రతి చోట అన్నారు. తెలంగాణ ఇచ్చిన రుణం తీర్చుకుందామని చెప్పారు. తెలంగాణ ఇచ్చింది, తెచ్చింది కాంగ్రెస్ పార్టీయే అని ఎన్నికల సమయంలో అన్నారు. ఇప్పుడు జై తెలంగాణ అనడానికి విచ్చిన ఇబ్బంది ఏమిటని సగటు తెలంగాణ వాదులు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ మాట చెప్పకపోతే భవిష్యత్తులో పార్టీకి కూడా ఇబ్బందికరమే అని ఆమె గ్రహించారు. అందుకే రాములమ్మ ఆందోళన వ్యక్తం చేశారు. కాకపోతే తెలంగాణ రాజకీయాల్లో ఏదో జరుగుతోందని ఆమె గుర్తించినట్లున్నారు. అందుకే ఆమె సంఘర్షణ పడుతన్నాట్టున్నారు. అందుకే బోనాల పండుగ సమయంలో అమ్మవారి ఆలయంలో జై తెలంగాణ అని అనాలని అందరికీ చెప్పారు. తెలంగాణ వ్యతిరేక శక్తులు మళ్లీ మొదలయ్యాయని ఆమె సూటిగా చెప్పారు. అంటే తెలంగాణ రాజకీయాల్లోకి ఏపి శక్తులు జొరపడుతున్నాయని ఆమె హెచ్చిరించనట్లే లెక్క బోనాల సందర్భంగా ఎమ్మెల్సీ విజయశాంతి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. తెలంగాణ విషయంలో ఆమె పడుతున్న ఆందోళన ఆమెలో స్పష్టంగా కనిపించింది. తెలంగాణపై ఏదో కుట్ర జరుగుతోందా? అని ఆందోళన చెందుతున్నారా? అర్ధం కావడం లేదు. కాకపోతే ఏదో ఒక సంఘర్ణణ మాత్రం విజయశాంతిలో వున్నట్లు మాత్రం ఆమె మాటల ద్వారా అర్దమౌతోంది. లేకుంటే ఇలాంటి వ్యాఖ్యలు ఎప్పుడూ ఆమె చేయలేదు. పదేళ్ల కాలంలో కూడా తెలంగాణ కుట్రలు జరుగుతున్నట్లు వెల్లడిరచలేదు. కాని ఇప్పుడు విజయశాంతి తెలంగాణపై ఏదో జరుగుతుందన్న అనుమానం మాత్రం ఆమె వ్యక్తంచేసినట్లున్నారు. ఎందుకంటే తెలంగాణ అనేది రాములమ్మకు ప్రాణం. తెలంగాణ మీద ఒక తల్లికి వుండే మమకారం. తెలంగాణ కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన నాయకురాలు విజయశాంతి. తన సినీ జీవితం ఉచ్చ దశలో వున్నప్పుడు ఆమె తెలంగాణ ప్రజల కోసం వదులుకున్నారు. పేరుకు పేరు, డబ్బుకు డబ్బు సంపాదించుకునే రంగాన్ని వదిలేసుకున్నారు. తెలంగాణ ఉద్యమానికి వచ్చిన సమయంలో ఆమెతో సినిమాలు తీయడానికి నిర్మాతలు ఆమె ఇంటి ముందు క్యూలలో వుండేవారు. ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు హీరోలకు సమానమై, పెద్ద పెద్ద సినిమాలు తీయడానికి నిర్మాతలు ఎదురుచూస్తున్న రోజుల్లో తెలంగాణ కోసం అన్నీ వదులుకున్నారు. నా తెలంగాణ ప్రజలు గోస పడుతుంటే, నేను సంతోషంగా వుండడం ఎందుకు అనుకున్నారు? నా ప్రజల కోసమే నా జీవితం అనుకున్నారు. నా ప్రజల తోనే నా జీవన ప్రయాణం అనుకున్నారు. నా ప్రజల ఆర్తిని కోసమే ఉద్యమిస్తానని వచ్చారు. నా తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చడం కోసం నేను సైతం అని వచ్చారు. తెలంగాణ ఉద్యమం కోసం సమిదైనా పరవాలేదనుకొని వచ్చారు. ఎందుకంటే గత అనుభవాలు అనేకం వున్నాయి. ఏపి, తెలంగాణ కలిపిన నాటి నుంచి తెలంగాణ పోరాటం సాగుతూనే వుంది. రెండు రాష్ట్రాలను కలిపిన రోజు నుంచే ఉద్యమం తెలంగాణ ప్రజలు ఉద్యమం సాగించారు. అలా మొదలైన తెలంగాణ పోరాటం ఆమెకు తెలుసు. 1969లో వందలాది మంది విద్యార్ధులు చినిపోయారు. పోలీసు తూటాలకు బలయ్యారు. ఎంతోమంది ఉద్యమ నాయకులు వచ్చారు. కాని తెలంగాణ కల నెరవేరలేదు. ప్రజల్లో ఆకాంక్ష తీరలేదు. తెలంగాణ కళ్లారా చూడాలనుకున్న 1969 రోజులు నిజం కాలేదు. అయినా తెలంగాణ ఉద్యమం ఆగలేదు. అరవై సంవత్సరాలుగా రగులుతున్నా కాని, తెలంగాణ రాలేదు. అందుకే నా ప్రజల కోసం నాజీవితం అంకితమని రాములమ్మ వచ్చారు. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో తొలిసారి రaాన్సీ రాణి కదన రంగంలోకి దూకినట్లు తెలంగాణ ఉద్యమంలోకి రాములమ్మ వచ్చారు. తొలి దశ తెలంగాణ ఉద్యమంలో సదా లక్ష్మి లాంటి వారు కనిపించినా, ఉద్యమ రంగంలో ఒక్కరైపోరాటం చేయలేదు. కాని విజయశాంతి ధీర వనితగా మలితరం ఉద్యమానికి ఊపిరి పోశారు. లక్షలాది మంది తెలంగాణ వాదులను కదిలించారు. తల్లి తెలంగాణ పార్టీని ఏర్పాటు చేశారు. తెలంగాణ కోసం ఆమె సినీ జీవితాన్ని, కేరిర్‌ను వదులుకున్నారు. తాను సినిమా సంపాదనంతా తెలంగాణ కోసం ధారపోశారు. పబ్లిక్ మీటింగులకు ఎంతో ఖర్చు చేశారు. అయినా ఆమె ఏనాడు బాధపడలేదు. నా తెలంగాణ కోసమనుకున్నారు. నా తెలంగాణ భవిష్యత్తు తరాల సంతోషం కోసం ఖర్చు చేస్తున్నానకున్నారు. సినిమాలన్నీ పక్కన పెట్టారు. ఒక్క తెలంగాణ ఉద్యమమే ఊపిరిగా బతుకుతున్నారు. పద్నాలుగేళ్లు సుధీర్ఘ ఉద్యమ ప్రయాణం సాగించారు. వ్యక్తిగత జీవితాన్ని కూడా ఆమె తెలంగాణ ఉద్యమానికి అంకితం చేశారు. క్షేత్ర స్ధాయిలోనే కాదు, పార్లమెంటులో కూడ ఆమె చేసిన పోరాటం దేశమంతా చూసింది. అలా తెలంగాణ సాదనలో ముందున్న ఏకైక మహిళా నాయకురాలు విజయశాంతి. అలాంటి నాయకురాలు ఇప్పుడు నా తెలంగాణ మళ్లీ కుట్రల పాలయ్యేలా వుందని ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా వుండాలని కోరుతున్నారు. రాజకీయాల్లో ఎక్కడో తేడా కొడుతోందని గమనించినట్లున్నారు. అప్పుడు తెలంగాణ కోసం కొట్లాడాం..ఇప్పుడు తెలంగాణను రక్షించుకునేందుకు కొట్లాడేందుకు సిద్దంగా వుండాలన్నారు. అంటేనే ఏదో రాజకీయ తెరవెనుక జరుగుతోందని తెలుసుకున్నారు. అందుకే తెలంగాణ రక్షణ కోసం రాములమ్మ మళ్లీ రంగలోకి దిగారు. తెలంగాణను కాపాడుకునే పోరాటాన్ని చేయడానికి సిద్దంగా వున్నారు.