పంతుళ్లు..వ్యాపారాలు!?

`’’నేటిధాత్రి’’ పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు!

`రాష్ట్ర వ్యాప్తంగా ‘‘నేటిధాత్రి’’ ప్రతినిధులు సేకరించిన ఆసక్తికరమైన అంశాలు.

`లెక్కలు చెప్పక చిట్టి లెక్కలేసుకుంటున్నారు?

`చదువు చెప్పమంటే పైసలు లెక్కలు చూసుకుంటున్నారు.

`బడి వేళల్లో కూడా చిట్టీల ముచ్చట్లు పెడుతున్నారు.

`వానా కాలం సదువులకు పిల్లలు అలవాటు పడుతున్నారు.

`బడికి కూడా పోకుండా వ్యాపారాలు చేసుకుంటున్న పంతుళ్లున్నారు.

`బడికిపోయినా తూతూ మంత్రంగా పాఠాలు చెబుతున్నారు.

`సిలబస్‌ అయిపోయిందని చేతులు దులుపుకుంటున్నారు.

`సగానికి పైగా పంతుల్లు చేస్తున్నది ఇదే!

`వ్యాపారం చేసుకోవడం తప్పు కాదని బకాయిస్తున్నారు.

`ఉద్యోగులు లంచాలు తీసుకుంటే తప్పు లేదా? అని ఎదురు ప్రశ్నిస్తున్నారు.

`అదనంగా ఆదాయం మాకేమైనా వుందా? అంటున్నారు.

`అన్నామలై, అలగప్పా సర్టిఫికేట్‌ ఉపాధ్యాయులు కొందరు చదువు చెప్పడం లేదు!

`2010కి ముందు అప్పాయింట్లైన టీచర్లు రకరకాల వ్యాపారాలు సాగిస్తున్నారు.

`ఆ తర్వాత అప్పాయింట్‌ అయిన టీచర్లు చదువు బాగానే చెబుతున్నారు.

`గురుకుల, రెసిడెన్షియల్‌ టీచర్లు బాగా పని చేస్తున్నారు.

`ప్రాధమిక, మాధ్యమిక ఉపాధ్యాయులు చిట్టిలు ఎక్కువగా నడుపుతున్నారు!

`ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు రియల్‌ వ్యాపారాలు సాగిస్తున్నారు!

`పల్లెల్లో టీచర్లు ఎవరూ వుండడం లేదు.

`పని చేసే చోట నివాసం ఎవరూ వుండడం లేదు.

`సొంత ఊర్లు వదిలిపెట్టి పక్కనున్న నగరాలలో గృహాలు నిర్మించుకున్నారు.

`చాలా మంది హైదరాబాద్‌ లో నివాసం వుంటున్నారు.

`నిత్యం హైదరాబాదు నుంచి వచ్చి వెళ్లిపోతున్నారు.

`లెక్చరర్లు గౌరవంగా ఉద్యోగాలు చేస్తున్నారు!

`ప్రొఫెసర్లు విద్యా వ్యవస్థ మీద ఆందోళన చెందుతున్నారు!

హైదరాబాద్‌,నేటిధాత్రి:                              టీచర్లు చిట్టీలు..ఉద్యోగులు లంచాలు. అవును ఈ చర్చ ఇప్పటిది కాదు. ఇప్పుడే పుట్టుకొచ్చింది కాదు. కాని ఎప్పటికీ మానుకోని వ్యవసనంగా మారిపోయింది. రాష్ట్రంలో చాలా మంది టీచర్లు చిట్టీలు, ఫైనాన్స్‌, రియల్‌ వ్యాపారాలు విరివిగా సాగిస్తున్నారు. మాయ మాటలు రాని కొంత మంది టీచర్లు తప్ప, చాలా వరకు చదువు చెప్పడం మానేశారు. వ్యాపారాలలో మునిగి తేలుతున్నారు. నిజానికి టీచర్లైనంత మాత్రాన వ్యాపారాలు సాగి ంచొద్దన్నదేమీ లేదు. కాని ప్రభుత్వ జీతం తీసుకుంటూ, గురుతర బాద్యతను వదిలేసి వ్యాపారాలు సాగిస్తున్నారు. ఇదే అసలైన చిక్కు. బతకలేక బడిపంతులైనా కావాలని గతంలో అనుకునేవారు. కాని ఇప్పుడు బతకనేర్వాలంటే చాలు బడి పంతులైతే చాలు అనుకుంటున్నారు. ఇలా వ్యాపారాలు సాగిస్తున్న వారిలో యువకులైన ఉపాద్యాయులు కాకుండా, సీనియర్‌ టీచర్లు ఎక్కువగా ఇలాంటి వ్యాపారాలు సాగిస్తున్నారు. జూనియర్‌ టీచర్ల మీద పెత్తనం చేస్తూ, వారి చేత చిట్టీలు కట్టిస్తూ, భూములుకొనుగోలు చేయిస్తున్నారు. ముఖ్యంగా రెండు వేల సంవత్సరానికి అటూ, ఇటు టీచర్లైన వారే ఈ వ్యాపారులు ఎక్కువగా వ్యాపారాలు సాగిస్తున్నారు. వారిలో ముఖ్యంగా అలగప్పా యూనివర్సిటీ నుంచి బిఈడీ చేసిన కొందరు టీచర్లు ఈ వ్యాపారాలు విరివిగా సాగిస్తున్నారు. చదువు చెప్పడం వారికి ఇష్టం లేదు. చదువు చెప్పే ఓపిక వారిలో లేదు. చదువు చెప్పాలన్న దృక్పధం కూడా వారిలో లేదు. వాళ్లలో చాలా మంది హెడ్‌ మాస్టర్లయ్యారు. స్కూల్‌ను చేతుల్టో పెట్టుకొని ఆడిస్తున్నారు. ఇలా అలగప్పా యూనివర్సిటీ నుంచి ఇంగ్లీష్‌ టీచర్లుగా పనిచేస్తున్న వారు చాల మంది ఇదే వ్యాపారాలను ఎంచుకున్నారు. అంతే కాకుండా హిందీ టీచర్లుగా పని చేస్తున్న వారు ఈ మూడు వ్యాపారాలలో మునిగిపోతున్నారు. ఇక్కడ విశేషమేమిటంటే మితగా సబ్జెక్టులు నేర్పే వారు మాత్రం ఈ వ్యాపారాలు చేయడం లేదని తేలింది. ముఖ్యంగా తెలుగు టీచర్లు ఈ వ్యాపారాలలో ఎక్కువగా లేరు. ముఖ్యంగా అలగప్పా యూనివర్సిటీ నుంచి పట్టా పొంది టీచర్లు అయిన వారికి సబ్జెక్టు మీద పెద్దగా పట్టు లేదు. హిందీ బోధించే టీచర్లులో కూడా సరైన స్కిల్‌ లేదు. అందుకే తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వ స్కూళ్లలో చదవే విద్యార్ధులకు ఈ రెండు సబ్జెక్టులలో బోర్డర్‌ మార్కులు దాటడం లేదు. మిగతా సబ్జెక్టులలో ప్రభుత్వ పాఠశాల పిల్లలు బాగానే రాణిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టిపెట్టాల్సిన అవసరం వుంది. ఈ సమయంలో టీచర్లు అయిన వారు చెప్పే విషయాలు గమ్మత్తుగా వుంటాయి. మాకు జీతం తప్ప మరే మార్గం లేదంటారు. అంటే ఉద్యోగుల్లా లంచాలు లేవని దాని అర్దం. అందుకే వ్యాపారాలు సాగిస్తున్నామని చెప్పుకుంటున్నారు. ఇలా వ్యాపారాలు సాగించే టీచర్లు యూనియన్‌ నాయకులకు అత్యంత ఆప్తులుగా వుంటారు. ఎందుకంటే యూనియన్‌ కార్యకలాపాలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తుంటారు. యూనియన్‌లో మండల స్దాయి నుంచి, జిల్లా, రాష్ట్ర స్దాయి పదవులు చేపడుతూ నాయకులుగా చెలామణి అవుతుంటారు. పైగా టీచర్లలలో అనేక యూనియన్లు వున్నాయి. ఇవి కూడా వారికి బాగా కలిసి వస్తోంది. దాంతో బోధన తప్ప అన్నీ చేస్తున్నారు. విద్యా వ్యవస్ధను భ్రష్టుపట్టిస్తున్నారు. ఎప్పుడైతే అలగప్పా యూనివర్సీటీ సర్టిఫికెట్లు రద్దు తర్వాత రాష్ట్ర స్ధాయిలో శక్షణ పొందిన వాళ్లు నిపుణులుగా విద్యాబోధన చేస్తున్నారు. అయితే వారు కూడా సీనియర్ల దారిలో నడుస్తున్నారు. బోధన సాగిస్తూనే ఇతర వ్యాపారాల మీద వ్యాపకాలు నిర్వహిస్తున్నారు. పిల్లలకు చదువు చెప్పాల్సిన సమయంలో స్కూళ్లో కూడా సెల్‌ఫోన్లలోనే వ్యవహారమంతా నడిపిస్తుంటారు. ఆన్‌ పేమెంట్లు వచ్చిన తర్వాత స్కూల్‌ సమయంలోనే ఈ వ్యాపారాలు విరివిగా సాగిస్తున్నారు. ఇంతకు ముందు క్యాష్‌లతో పని కావడంతో, స్కూల్‌ సమయం అయిపోయిన తర్వాత వ్యాపారాలు సాగించేవారు. కాని ఎప్పుడైతే ఆన్‌లైన్‌ పేమెంట్లు వచ్చాయో అప్పటి నుంచి స్కూళ్లలోనే వ్యాపారాలు మొదలు పెడుతున్నారు. ఇటు చిట్టీలు, ఫైనాన్సులు మిత్తిలు, భూముల ముచ్చట తప్ప మరో పని లేకుండాపోయింది. నాలుగు ముక్కలు పుస్తకంలోవున్నది వున్నట్లు చదవడం, పిల్లల్ని చదువుకొమ్మని చెప్పడం తప్ప మరేం పనులుచేయడం లేదు. విద్యార్దులే గైడ్‌లను ఫాలో అవుతూ చదువుకుంటున్నారు. ముక్కీ మూలిగీ అన్నట్లు పాసౌతుతున్నారు. ఇప్పటికైనా సరే విద్యా వ్యవస్ధ బాగు పడాలంటే టీచర్లు స్కూల్‌కు వచ్చిన తర్వాత సెల్‌ ఫోన్‌ వినియోగించకుండా ఆదేశాలు జారీ చేయాలి. ప్రతి టీచర్‌ స్కూల్‌కు ఖచ్చితంగా హజరు కావాలని ఆదేశాలు జారీ చేయాలి. అప్పుడే విద్యా వ్యవస్ధ బాగు పడుతుంది. పల్లెల్లో పనిచేసే చాలా మంది టీచర్లు ఊర్లలో వుండడం లేదు. ఒకప్పుడు టీచర్లు ఎక్కడికి ట్రాన్స్‌ఫర్లు అయితే అక్కడికి వెళ్లి నివాసం వుండేవాళ్లు. కాని ఇప్పుడు వంద కిలోమీటర్ల దూరమైనా సరే టీచర్లు పట్టణాలలోనే వుంటున్నారు. నిత్యం హైదరాబాద్‌ నుంచి వరంగల్‌ వరకు కూడా టీచర్లు వస్తూ వెళ్తున్నారు. కాని చదువు చెప్పే చోట నివాసం వుండడం లేదు. తమ పిల్లల చదువు కోసమని కొందరు. వాళ్ల పిల్లలు మాత్రం స్కూల్‌ దశనుంచే కార్పోరేట్‌ స్కూళ్లలో చదవిస్తున్నారు. దాంతో హైదరాబాద్‌ చుట్టపక్కల వంద కిలోమీటర్ల దూరంలో పనిచేసే చోట వున్నా వెళ్లి వస్తున్నారు. విచిత్రమేమిటంటే సొంత ఊరి స్కూల్‌లో పనిచేస్తున్నా సరే, నిత్యం హైదరాబాద్‌కు వెళ్తున్నారు. పక్కనే వుండే పట్టణాల్లో సొంత ఇండ్లు కట్టుకొని అక్కడే నివాసముంటున్నారు. ఆలస్యంగా రావడం, లేటౌతుందని వెళ్లిపోవడం పరిపాటిగా మారిపోయింది. కొందరు టీచర్లు ట్రైన్‌లలో వెళ్తున్నారు. మరి కొంత మంది టీచర్లు నలుగురు కలిసి కార్లలో వెళ్తున్నారు. ఎందుకంటే జీతాలు కూడా అంతే స్ధాయిలో వున్నాయి. వ్యాపారాలతో మరింత సంపాదన అందుతోంది. మొత్తం మీద సమయంతా ప్రయాణాలు, వ్యాపారాలలో గడుపుతున్నారు. పాఠాలు చెప్పడం మర్చిపోయారు. రేపటి తరాన్ని తయారు చేయాల్సిన గురు స్ధానంలో వుంటూ పాఠాలు చెప్పడం మానేశారు. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్ల కోసం ప్రయత్నాలు సాగిస్తుంటారు. కాసుల కక్కుర్తితో చదువు చెప్పాల్సిందిపోయి, వ్యాపారాలు సాగిస్తున్నారు. జిల్లాలలో అక్రమ వడ్డీ వ్యాపారాలు సాగిస్తున్నారు. టీచర్లు పోటీ పడి మరీ చిట్టీల వ్యాపారాలు, వడ్డీ వ్యాపారాలు సాగిస్తున్నారు. జిల్లాల్లో ఉపాద్యాయులు పోటీలు పడి మరీ చిట్‌ ఫండ్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. తమ బంధువుల పేరుతో ఫైనాన్స్‌ వ్యాపారాలు సాగిస్తున్నారు. నిజానికి చిట్‌ ఫండ్‌ వ్యాపారం నిర్వహించాలంటే 1982 చిట్‌ ఫండ్‌ ఆక్ట్‌ ప్రకారం నిర్వహించాలి. అందుకు జిల్లా రిజిస్ట్రార్‌ శాఖనుంచి అన్ని అనుమతులు పొందాలి. కాని అవేవీ వీరికి పట్టడం లేదు. ప్రజల అవసరాలను ఆసరా చేసుకొని ఇష్టానుసారం అదిక వడ్డీకి రుణాలు ఇస్తున్నారు. చిన్న చిన్న వ్యాపారులకు రోజు వారి ఫైనాన్సులు నడుపుతున్నారు. ఇలా పల్లె, పట్ణణం అనే తేడా లేకుండా ఉపాద్యాయులు ఈ రకమైన దందాలు నిర్వహించుకుంటూ, పిల్లలకు పాఠాలు చెప్పడం మర్చిపోయారు. విద్యా వ్యవస్ధను భ్రష్టు పట్టిస్తున్నారు. ఇదిలా వుంటే రియల్‌ వ్యాపారాల్లోనూ టీచర్లదే హవా అని తెలుస్తోంది. వెంచర్లలో పెట్టుబడులు పెట్టే వారు కొందరైతే, వ్యాపారం పేరుతో పిల్లల తల్లిదండ్రులు, ఇతరులకు ప్లాట్లు అమ్మకాలు సాగిస్తున్నారు. సహజంగా టీచర్లు అంటే ఒక నమ్మకం. ఒకభరోసా. ఇదే వారికి వరంగా మారింది. ముఖ్యంగా యూనియన్‌ కార్యాకలాపాలు నిర్వహించే ఉపాద్యాయులే ఇలాంటి వ్యాపారాలు ఎక్కువగా సాగిస్తున్నారు. ఇలా సంపాదించిన వాళ్లు ఎమ్మెల్సీ లాంటి ఎన్నికల్లో పోటీ చేసిన వారున్నారు. వీటితోపాటు ప్రైవేటు కాలేజీలు, విద్యా సంస్ధలకు పిఆర్వోలుగా పనిచేస్తున్నవారున్నారు. ప్రైవేటు విద్యా సంస్ధలలో బాగస్వాములుగా వున్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్దికి దోహడపడాల్సిన వాళ్లు, ఇలా ప్రైవేటు స్కూళ్లను బినామీల పేరుతో ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రభుత్వ బడులకు రావాల్సిన పిల్లలను తమ ప్రైవేటు స్కూళ్లకు వెళ్లేలా చేస్తున్నారు. ప్రభుత్వ విద్యకు తూట్లు పొడుస్తున్నారు. పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్య పెంచాల్సిన బాద్యతను గాలికి వదిలేస్తున్నారు. ఇలాంటి వారు ఉపాధ్యాయ వృత్తికే తీరని మచ్చగా మిగులుతున్నారు. అలాంటి ఉపాద్యాయులపై వరుస కథనాలు మీ నేటిధాత్రిలో…

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version