రాజాసాబ్‌కు కష్టం టీమ్‌ హెచ్చరిక.

 రాజాసాబ్‌కు కష్టం టీమ్‌ హెచ్చరిక…

ప్రభాస్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్‌ కామెడీ హారర్‌ ఫిల్మ్‌ ‘ది రాజా సాబ్‌’. ఇప్పుడీ చిత్రానికి  లీకుల కష్టం మొదలైంది. టీజర్‌లోని కొన్ని విజువల్స్‌ను నెట్టింట లీక్‌ చేశారు. దీనిపై టీమ్‌ స్పందించింది.

ప్రభాస్‌ (Prabhas) హీరోగా మారుతి (Maruthi) దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్‌ కామెడీ హారర్‌ ఫిల్మ్‌ ‘ది రాజా సాబ్‌’. (The raja saab) జూన్‌ 16న ఈ సినిమా టీజర్‌ విడుదల కానున్న విషయం తెలిసిందే.
ఇప్పుడీ చిత్రానికి  లీకుల కష్టం మొదలైంది. టీజర్‌లోని కొన్ని విజువల్స్‌ను నెట్టింట లీక్‌ చేశారు. దీనిపై టీమ్‌ స్పందించింది.
లీక్‌ కంటెంట్‌ను షేర్‌ చేసే వాళ్లపై  కఠిన చర్యలు తీసుకుంటామని టీమ్‌ హెచ్చరించింది. ఎవరైనా ‘రాజాసాబ్‌’ కంటెంట్‌కు సంబంధించిన అనధికారక వీడియోలు, ఫొటోలు, షేర్‌ చేస్తే వారి సోషల్‌ మీడియా అకౌంట్‌ను తక్షణమే నిలిపివేసేలా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. సినిమాటిక్‌ అనుభూతి అందించేందుకు చిత్రబృందం ఎంతో కష్టపడుతోందని దానికి అందరూ సహకరించాలని కోరింది.
ప్రభాస్‌ నటిస్తున్న తొలి హారర్‌ చిత్రమిది. దీంతో అందరి దృష్టి ఈ చిత్రంపై ఉంది. డిసెంబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. టీజర్‌ను ఈ నెల 16న విడుదల చేయనున్నట్లు టీమ్‌ ఇప్పటికే ప్రకటించింది. ఈ సినిమా కోసం వేసిన భారీ సెట్‌లో ఈవెంట్‌ చేయాలను కుంటున్నారని తెలిసింది. మాళవిక మోహనన్‌, నిధీ అగర్వాల్‌, రిద్థికుమార్‌ కథానాయికలు. సంజయ్‌దత్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. 
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version