టీమ్‌లో నుంచి అతడ్ని తీసెయ్..

టీమ్‌లో నుంచి అతడ్ని తీసెయ్.. పంత్‌-గంభీర్ వీడియో వైరల్!

టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్, పించ్ హిట్టర్ రిషబ్ పంత్‌ మాట్లాడుకుంటున్న ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అతడ్ని తీసెయ్ అంటూ గౌతీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో విజయానికి చేరువలో ఉంది టీమిండియా. ఇంకో 7 వికెట్లు తీస్తే గెలుపు మనదే. లీడ్స్ టెస్ట్‌లో ఓడి సిరీస్‌లో 0-1తో వెనుకబడిన గిల్ సేన.. తాజా మ్యాచ్‌లో ఐదో రోజు గనుక చెలరేగి ఆడితే సిరీస్‌ను సమం చేయొచ్చు. దీంతో ప్రత్యర్థి బ్యాటర్ల పని పట్టేందుకు కెప్టెన్ శుబ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్‌తో కలసి స్కెచ్ వేస్తున్నాడు హెడ్ కోచ్ గౌతం గంభీర్. ఏయే బ్యాటర్‌ను ఎలా ఔట్ చేయాలా? అని పథకాలు రచిస్తున్నాడు. ఈ తరుణంలో అతడ్ని తీసెయ్ అంటూ పంత్‌తో గంభీర్ మాట్లాడుతున్న ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలేం జరిగిందంటే..

కపిల్ శర్మ షోలో గంభీర్, పంత్, అభిషేక్ శర్మ సందడి చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో పంత్-కపిల్ మధ్య సాగిన జోక్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఐపీఎల్‌లో అందరికంటే ఎక్కువ శాలరీ (రూ. 27 కోట్లు) అందుకున్నావ్ కదా.. నీ టీమ్‌లో ఏదైనా తక్కువ వేతనం అందుకునే ఆటగాడు నీ కంటే బాగా ఆడితే ఏం చేస్తావంటూ పంత్‌ను ఆటపట్టించాడు కపిల్. నువ్వు స్టేజ్ మీద ఉన్నప్పుడు నీ కంటే ఇంకెవరైనా బాగా కామెడీ చేస్తే ఏం చేస్తావంటూ కపిల్‌కు రివర్స్‌ కౌంటర్ వేశాడు పంత్. వీళ్ల మధ్య ఇలా జోక్స్ సాగుతుండగా మధ్యలో గంభీర్ కలుగజేసుకున్నాడు.

టీమ్‌లో నుంచి అతడ్ని తీసేస్తానని చెప్పమంటూ పంత్‌కు సూచించాడు గంభీర్. నీ కంటే ఎవరైతే బాగా ఆడతారో ఆ ప్లేయర్‌ను డ్రాప్ చేస్తానని చెప్పమని గంభీర్ అన్నాడు. దీంతో పంత్, అభిషేక్, కపిల్ సహా షోలోని వారంతా నవ్వుల్లో మునిగిపోయారు. గంభీర్ ఎక్కువగా సైలెంట్‌గా ఉంటాడు. అలాంటోడు జోక్ వేయడం, అది బాగా పేలడంతో అంతా పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పంత్-గంభీర్ మామూలోళ్లు కాదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇది నిజంగానే అమల్లో పెడతారా? ఏంటి అంటూ సెటైర్స్ వేస్తున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version