నల్ల బ్యాడ్జీలతో ఉపాధ్యాయుల నిరసన…

నల్ల బ్యాడ్జీలతో ఉపాధ్యాయుల నిరసన

సర్వీసులో ఉన్న టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి

జాతీయ పెన్షన్ పథకం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి

జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలి…

తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ డిమాండ్

కేసముద్రం/ నేటి ధాత్రి

 

ఆల్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్స్ ఏ ఐ జె ఏ సి టి ఓ, ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న ‘ఉపాధ్యాయ హక్కుల పరిరక్షణ’ పోరాటానికి ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ( యు.ఎస్.పి.సి) సంపూర్ణ మద్దతు ప్రకటించింది.ఈ పోరాటంలో భాగంగా నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి ఆధ్వర్యంలో కేసముద్రం మండలంలోని అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు కూడా నేడు తమ తమ పాఠశాలల్లో జేబుకు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా విధానాలపై తీవ్రమైన నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించకుండా చేసిన విద్యా ప్రయోగాలు భవిష్యత్తు తరాలకు తీవ్రమైన అన్యాయం చేస్తాయనీ, ఉపాధ్యాయుల ఆత్మగౌరవం, హక్కులు, రిటైర్మెంట్ భద్రత, విద్యార్థుల భవిష్యత్తు అన్నీ ఒక్కటే నని, వీటిని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉందనీ అన్నారు.
సర్వీసులో ఉన్న టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని,
జాతీయ పెన్షన్ పథకం (ఎన్ పి ఎస్) ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని( ఓ పి ఎస్) పునరుద్ధరించాలని,
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాథమికోపాధ్యాయులకు ఓటు హక్కు కల్పించాలనీ,
జాతీయ విద్యా విధానం (ఎన్ ఈ పి) ను రద్దు చేయాలనీ,
పాఠశాలల విలీనం, మూసివేతలను వెంటనే నిలిపివేయాలనీ ఆయన డిమాండ్ చేశారు. అనంతరం డిటిఎఫ్ అధ్యక్షులు కీర్తి నాగయ్య మాట్లాడుతూ
ఉపాధ్యాయులు పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని,రాష్ట్ర-జిల్లా-మండల శాఖలు ఇచ్చే పిలుపులకు తక్షణమే స్పందిస్తూ, రాబోయే కార్యక్రమాలను విజయవంతం చేయాల్సిందిగా ఉద్యోగ ఉపాధ్యాయులందరికి సూచించారు. తదుపరి డ్యూటీ ఉపాధ్యక్షులు భూక్య శ్రీను మాట్లాడుతూ
ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయ సమస్యలను చర్చకు తీసుకుని నిర్ణయాత్మక చర్యలు తీసుకోకపోతే, పోరాటాన్ని మరింత తీవ్రతరం చేయడం తప్ప మరో మార్గం లేదనీ హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో టి పి టి ఎఫ్ అధ్యక్షులు గుండు సురేందర్ తో పాటు, యుటిఎఫ్ అధ్యక్షులు భూక్య శ్రీనివాస్, డిటిఎఫ్ అధ్యక్షులు కీర్తి నాగయ్య, టి పి టి ఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి నరసింహ రాజు, మండల కార్యదర్శి మోహన్ కృష్ణ, వీసం నర్సయ్య, ఊటుకూరి ప్రణయ్ కుమార్, ఉపాధ్యాయులు వెలమాల భాస్కర్, అప్పాల నాగరాజు, ఉప్పరపల్లి పి జి హెచ్ ఎం చంద్రశేఖర్, దురేష్, వినోద్ రాజ్, సంపత్, సురేష్, బిజయ్,తండా సదానందం,యం .యాకాంబ్రం కె. రాములు ,రాము , అలీ ,శ్రీనివాస్, బాలాషౌరెడ్డి బిక్షపతి , లింగయ్య, నాగరాజు, నాగేందర్,హరికృష్ణ, ,కృష్ణ ,గోపి, రవీందర్,సూర్యనారాయణ శివ, పార్వతి తదితరులు పాల్గొన్నారు.

విద్య రంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలి…

విద్య రంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలి

ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం అందించాలి

జైపూర్,నేటి ధాత్రి:

 

 

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో పిడిఎస్యు చెన్నూర్ ఏరియా మహాసభ నిర్వహించి నూతన కమిటీ శుక్రవారం ఎన్నుకున్నారు. జిల్లా ఉపాధ్యక్షుడు పి.సికిందర్ ఆధ్వర్యంలో సభను ప్రారంభించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పిడిఎస్యు జిల్లా ఇంచార్జి డి.బ్రహ్మానందం,జిల్లా అధ్యక్షుడు రెడ్డి చరణ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేక విధానాల అవలంబిస్తూ ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేయడానికి కుట్రలు పన్నుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు ఉదయం గ్రామీణ ప్రాంతం నుండి వచ్చి సాయంత్రం వరకు కళాశాలలో ఉన్నప్పటికీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం లేక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది.ప్రభుత్వం మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తామని కమిటీలు వేసినప్పటికీ కమిటీలకే, మాటలకే పరిమితమైంది తప్ప ఎక్కడ అమలు గాని పరిస్థితి ఉందన్నారు.ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చేముందు విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కరించడంలో ప్రధాన పాత్ర పోషిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల గురించి పట్టించుకునే పరిస్థితి లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విద్యా కాషాయకరణ పెంచి పోషిస్తూ విద్యార్థుల మెదళ్లను మతోన్మాదం వైపు మళ్లించే ప్రయత్నం చేస్తుందని వారు అన్నారు.కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పిడిఎస్యు జిల్లా నాయకులు మనోహర్,అంజి, రాహుల్,అవినాష్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version