అంబేద్కర్ నేషనల్ అవార్డుకు కిరణ్ ఎంపిక.
చిట్యాల, నేటిదాత్రి :
స్పూర్తి సర్వీసెస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ ఆకుల రమేష్.
చిట్యాల మండల కేంద్రానికి చెందిన అంబేద్కర్ యువజన సంఘం మండల సీనియర్ నాయకులు గురుకుంట్ల కిరణ్ అంబేద్కర్ నేషనల్ అవార్డుకు ఎంపికైనట్లు స్ఫూర్తి సర్వీసెస్ సొసైటీ ఇండియా ఎన్జీవోస్ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డాక్టర్ ఆకుల రమేష్ తెలిపారు. చిట్యాల మండల అంబేద్కర్ యువజన సంఘంలో గత 15 సంవత్సరాలుగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిస్తూ , భావజాలాన్ని ముందుకు తీసుకెళ్ళుచూ మరియు మహనీయుల కార్యక్రమాలను నిర్వహిస్తూ మృతుల కుటుంబాలను , పరామర్శించి సహాయ సహకారాలు అందించాడని, దళితులపై, మహిళలపై జరుగుతున్న సంఘటనలను ఖండిస్తూ వారికి అండగా నిలబడ్డారని , సామాజిక సేవ కార్యక్రమాలు అనేకం చేశాడని అన్నారు . అతను చేస్తున్న సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేయడం జరిగిందని డాక్టర్ రమేష్ చెప్పారు. అంబేద్కర్ నేషనల్ అవార్డుకు ఎంపికైన గురుకుంట్ల కిరణ్ కు నవంబర్ 5న సిటీ కల్చరల్ సెంటర్ ఆడిటోరియం ఆర్టిసి క్రాస్ రోడ్ ముషీరాబాద్ వివేక నగర్ కవాడిగూడ హైదరాబాద్* లో ఈ అవార్డు అందించడం జరుగుతుందని తెలిపారు. కిరణ్ మట్లాడుతూ నాకు ఈ అవార్డు ఎంపిక చేసిన డాక్టర్ ఆకుల రమేష్ గారికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.
