మల్లాపూర్ మండలం మొగిలి పేట నడుకుడా కొత్తదామరాజు పల్లి

మల్లాపూర్ నేటి ధాత్రి

మల్లాపూర్ మండలం మొగిలి పేట నడుకుడా కొత్తదామరాజు పల్లి సంగెం శ్రీరాంపూర్ ఓబులాపూర్ పలు గ్రామాలలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు విడుదల చేపించి కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభం చేసి అదే విధంగా ఎస్ డి ఎఫ్ నిధులు ల నుండి శ్రీ కృష్ణ యాదవ సంఘ అభివృద్ధి కొరకు నిధులు మంజూరు చేసిన జువ్వాడి వారికి ప్రోస్టింగ్ పత్రాన్ని అందజేశారు.ఒక్క మొగిలి పేట గ్రామానికి 25 లక్షల నిధులు మంజూరు అయ్యాయి. అనంతరం లబ్దిదారులకు నూతన రేషన్ కార్డు లను పంపిణీ చేసిన మన కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు .
అనంతరం మొగిలిపేట గ్రామంలో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు ఆధ్వర్యంలో టిఆర్ఎస్ . బీజేపీ పార్టీ ల నుండి పలువురు నాయకులు. మహిళలు కాంగ్రెస్ పార్టీ లో చేరిక, నర్సింగరావు వెంట మల్లాపూర్ మండల కేంద్రంలోని పలు గ్రామాల కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.

దేశవ్యాప్తంగా ఎస్సీ సబ్ ప్లాన్ చట్టాన్ని అమలు చేయాలి.

దేశవ్యాప్తంగా ఎస్సీ సబ్ ప్లాన్ చట్టాన్ని అమలు చేయాలి.

దళిత హక్కుల పోరాట సమితి(డిహెచ్పిఎస్)జాతీయ కౌన్సిల్ సభ్యులు బోయిని అశోక్

కరీంనగర :నేటిధాత్రి

కరీంనగర్ జిల్లా డిహెచ్పిఎస్ కౌన్సిల్ సమావేశం బద్దం ఎల్లారెడ్డి భవన్లో జిల్లా ఉపాధ్యక్షులు కెలపాక వినోద్ అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా జాతీయ కౌన్సిల్ సభ్యులు బోయిని అశోక్ మాట్లాడుతూ ఈనెల 10,11,12 తేదీలలో వేములవాడలో జరుగు రాష్ట్రస్థాయి సమావేశాలను జయప్రదం చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ సంక్షేమం పేరిట గడిచిన ఏడు దశాబ్దాలుగా అనేక పథకాలు ప్రవేశపెట్టి ఎంతో గొప్పగా అమలు చేస్తున్నట్టు చెప్పినప్పటికీ ఈవర్గాల్లో వెనుకబాడుతనం పేదరికం పోలేదని ఇప్పటికీ సమాజంలో అత్యంత పేదరికం అనుభవించే వారే దళితులు అని అన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి బోయిని తిరుపతి మాట్లాడుతూ ప్రత్యేక చట్టాలు సదుపాయాలు సబ్ ప్లాన్ తదితర సౌకర్యాలు కల్పించామని చెప్తున్నప్పటికీ దళితుల బతుకులు మౌలికమైన మార్పు రావటం లేదని ఈవిషయాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ,ఎస్టీల విద్య సామాజిక వికాసంతో పాటు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అవసరమైన కార్యచరణ రూపొందించి అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
సమాజంలో అత్యంత వెనుకబడిన వర్గాలైన ఎస్సీలకు జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు కేటాయించాలని అన్నారు. ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లు అమలు చేయడం మూలంగా దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతున్న అన్నారు
ఈనెల 10వ తేదీ నుండి వేములవాడలో జరిగే రాష్ట్రస్థాయి శిక్షణ శిబిరాలకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో మేధావులైనటువంటి దళిత ప్రొఫెసర్స్ వచ్చి రాష్ట్ర శిక్షణ శిభిరాలలో దళితులపై జరుగుతున్న దాడులు సమస్యలపై ప్రసంగిస్తారని వారు తెలిపారు. ఈసమావేశంలో కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బోయిని తిరుపతి ఉపాధ్యక్షులు గంగాధర రఘు, కార్యదర్శి ఖండే ఎల్లయ్య, నాయకులు కొంకటి మొగిలి, చంచల భీమయ్య, రమేష్, మొగిలి, పరశురాములు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version