ప్రోటోకాల్ ప్రకారంగా గ్రామ సభలు నిర్వహించాలి

ప్రోటోకాల్ ప్రకారంగా గ్రామ సభలు నిర్వహించాలి

మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు

దుగ్గొండి,నేటిధాత్రి:

99 రోజుల పాటు ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక పట్ల రేపటి నుండి నిర్వహించే గ్రామ సభలను ప్రోటోకాల్ ప్రకారంగా గ్రామ సభలు నిర్వహించాలని మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు అన్నారు.బుధవారం దుగ్గొండి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు,గ్రామ పంచాయతీల ప్రత్యేక అధికారులతో గ్రామ సభల నిర్వహణ పట్ల ఎంపిడిఓ లెక్కల అరుంధతి అధ్యక్షతన ఆవాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో సమ్మక్క, ఎంపీఓ మోడెం శ్రీధర్ గౌడ్, ఎంఈఓ వెంకటేశ్వర్లు,ఎస్సై రణధీర్ రెడ్డి,వివిధ శాఖల అధికారులు,కార్యదర్శులు పాల్గొన్నారు.

సబ్సిడీ రుణాల గడువు పెంచాలని డిమాండ్

సబ్సిడీ రుణాల గడువును పెంచాలి

తెలంగాణ మాదిగ జర్నలిస్టులఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి కోడెపాక భాస్కర్

పరకాల,నేటిధాత్రి

 

రాష్ట్ర వ్యాప్తంగాఎస్సీ కులస్తులకు జీవనోపాధి కల్పించి వారి అభివృద్ధి చెందుటకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలను అందించుటకు ఈనెల 24 వరకు ఉన్న గడువును అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14 వరకు పొడిగించాలని తెలంగాణ మాదిగ జర్నలిస్టులఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి కోడెపాక భాస్కర్ అన్నారు.వ్యాపారానికి సంబంధించిన యూనిట్లను కూడా ప్రవేశపెట్టి ఎక్కువ యూనిట్లను పెంచాలని దరఖాస్తు చేయడానికి కులము,ఆదాయం సర్టిఫికెట్లు తప్పనిసరి కాబట్టి రెండు రోజులు సెలవులు ఉండడం వలన రెవెన్యూ కార్యాలయం నుండి సర్టిఫికెట్లు అందక చాలామంది కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తు చేయలేకపోయారని రాష్ట్ర ప్రభుత్వము జిల్లా కలెక్టర్ ఆలోచన చేసి గడువు తేదీని పొడగించాలని కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version