గీత పని వారల సమస్యల పరిష్కారానికై జరిగే రాష్ట్రస్థాయి సదస్సుని జయప్రదం చేయండి
గీత పని వారలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి
పెండింగ్ లో ఉన్న గీత పని వారల 13 కోట్ల ఎక్స్ గ్రేషియోలను వెంటనే విడుదల చేయాలి
గీత పని వారల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎర్ర. రమేష్ గౌడ్
రామన్నపేట నేటిదాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా
రామన్నపేట మండల కేంద్రంలోని గౌడ సంఘం కమిటీ హాల్ దగ్గర గీత పనివారల సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో కరపత్రాన్ని విడుదల చేశారు, ఈ సందర్భంగా గీత పనివారల సంఘం జిల్లా సహయ కారదర్శి ఎర్ర రమేష్ గౌడ్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఇచ్చిన హామీలను, ఇంతకుముందు ఉన్న జీవోల ప్రకారం గీత పని వారల సమస్యలైనా చనిపోయిన వారికి ,శాశ్వత వికలాంగులకు ఎక్స్ గ్రేషియో లను విడుదల చేయాలని, 50 సంవత్సరాలు నిండి మూడు నాలుగు ఏళ్లు అవుతున్నా గీత పని వాళ్లకు పింఛన్లను ఇంకా మంజూరు చేయలేదని, భర్త చనిపోతే భార్యలకు పింఛన్లను పునరుద్ధరణ చేయలేదని, 560 జీవో ప్రకారం 5 నుంచి 10 ఎకరాలు ప్రతి గీత సొసైటీకి ఇవ్వాలని, కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రభుత్వం ఇచ్చిన హామీలైన ఐదు లక్షలను 10 లక్షలకు పెంచుతానని 2000 ఉన్న పింఛన్ ను 5000 చేస్తానని ,ప్రమాదకరమైన గీత వృత్తిలో తాటిచెట్టు ఎక్కి పడి చనిపోకుండా ఉండడానికి ప్రతి ఒక్కరికి సేఫ్టీ కిట్లు పంపిణీ చేస్తానని ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని రాష్ట్రవ్యాప్త సదస్సు బషీర్ బాగ్ లోని ప్రెస్ క్లబ్ లో 22న జరుపుతున్న సదస్సుకు గీత పని వారలంతా హాజరై విజయవంతం చేయాలని కోరారు.. కరపత్రం విడుదల చేసిన వారిలో గీత పని వారల సంఘం మండల అధ్యక్షులు గంగాపురం వెంకటయ్య, గీతపని వారల సంఘం సీనియర్ నాయకులు బాలగోని మల్లయ్య, గంగాపురం గంగాపురం యాదయ్య, లగ్గొని యాదయ్య, బాలగోని నరసింహ,కూనూరు కృష్ణ, చెరుకు శివరాజ్,గంగాపురం సైదులు, వీరమల్ల ముత్తయ్య, పల్లె మల్లేష్, వీరమల్ల నరసింహ తదితరులు పాల్గొన్నారు.
