అలాంటి వారు మాకు అక్కర్లేదు.. యూకే ప్రధానిపై ట్రంప్ ఫైర్…

అలాంటి వారు మాకు అక్కర్లేదు.. యూకే ప్రధానిపై ట్రంప్ ఫైర్

యూకే ప్రధాని కీర్ స్టార్మర్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫైర్ అయిపోయారు. యుద్ధం ముగిశాక అమెరికా వెంట వస్తామనే వారు తమకు అవసరం లేదని సోషల్ మీడియాలో ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రిటన్ ప్రధాని స్టార్మర్‌పై (Keir Starmer) మండిపడ్డారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికాల మిలిటరీ చర్యలకు మొదట్లో సహకరించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు (Donald Trump). ఘర్షణలు మొదలైన ఇన్నాళ్లకు యూకే ప్రభుత్వం ఈ విషయంపై దృష్టిసారించిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. మధ్య ప్రాచ్యంలో యుద్ధ విమాన వాహక నౌకలను మోహరించిందని చెప్పారు. అయితే, యుద్ధంలో తాము గెలిచామని, ఇప్పుడు సాయపడతామని వచ్చే వారు తమకు అవసరం లేదంటూ సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్ ద్వారా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని అంత తేలిగ్గా మర్చిపోమని కూడా చెప్పారు.

ఇరాన్‌పై సైనిక చర్యకు మద్దతుగా యూకే తొలుత రంగంలోకి దిగకపోవడాన్ని ప్రధాని కీర్ స్టార్మర్ ఇటీవల సమర్థించుకున్నారు. ఈ చర్యలకు న్యాయపరమైన, ప్రణాళికా పరమైన సంసిద్ధతను నిర్ధారించుకునేందుకు కొంత సమయం పట్టిందని చెప్పారు. ఇరాన్ మిసైల్ నిల్వలపై బ్రిటన్ స్థావరాల నుంచి దాడులకు కూడా అనుమతించామని తెలిపారు.

ఇక యూకే ప్రధానిపై గతంలోనూ ట్రంప్ విరుచుకుపడ్డారు. ఆయన విన్‌స్టన్ చర్చిల్ లాంటి ప్రధాని కాదని అన్నారు. జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్‌తో ఓవల్ ఆఫీస్‌లో ఇటీవల జరిగిన సమావేశం సందర్భంగా ఈ కామెంట్స్ చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version