అలాంటి వారు మాకు అక్కర్లేదు.. యూకే ప్రధానిపై ట్రంప్ ఫైర్…

అలాంటి వారు మాకు అక్కర్లేదు.. యూకే ప్రధానిపై ట్రంప్ ఫైర్

యూకే ప్రధాని కీర్ స్టార్మర్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫైర్ అయిపోయారు. యుద్ధం ముగిశాక అమెరికా వెంట వస్తామనే వారు తమకు అవసరం లేదని సోషల్ మీడియాలో ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రిటన్ ప్రధాని స్టార్మర్‌పై (Keir Starmer) మండిపడ్డారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికాల మిలిటరీ చర్యలకు మొదట్లో సహకరించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు (Donald Trump). ఘర్షణలు మొదలైన ఇన్నాళ్లకు యూకే ప్రభుత్వం ఈ విషయంపై దృష్టిసారించిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. మధ్య ప్రాచ్యంలో యుద్ధ విమాన వాహక నౌకలను మోహరించిందని చెప్పారు. అయితే, యుద్ధంలో తాము గెలిచామని, ఇప్పుడు సాయపడతామని వచ్చే వారు తమకు అవసరం లేదంటూ సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్ ద్వారా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని అంత తేలిగ్గా మర్చిపోమని కూడా చెప్పారు.

ఇరాన్‌పై సైనిక చర్యకు మద్దతుగా యూకే తొలుత రంగంలోకి దిగకపోవడాన్ని ప్రధాని కీర్ స్టార్మర్ ఇటీవల సమర్థించుకున్నారు. ఈ చర్యలకు న్యాయపరమైన, ప్రణాళికా పరమైన సంసిద్ధతను నిర్ధారించుకునేందుకు కొంత సమయం పట్టిందని చెప్పారు. ఇరాన్ మిసైల్ నిల్వలపై బ్రిటన్ స్థావరాల నుంచి దాడులకు కూడా అనుమతించామని తెలిపారు.

ఇక యూకే ప్రధానిపై గతంలోనూ ట్రంప్ విరుచుకుపడ్డారు. ఆయన విన్‌స్టన్ చర్చిల్ లాంటి ప్రధాని కాదని అన్నారు. జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్‌తో ఓవల్ ఆఫీస్‌లో ఇటీవల జరిగిన సమావేశం సందర్భంగా ఈ కామెంట్స్ చేశారు.

కెనడాకు వార్నింగ్.. ఆ వంతెనను బ్లాక్ చేస్తామంటూ అమెరికా అధ్యక్షుడి బెదిరింపు..

కెనడాకు వార్నింగ్.. ఆ వంతెనను బ్లాక్ చేస్తామంటూ అమెరికా అధ్యక్షుడి బెదిరింపు..

అమెరికా నుంచి ఇప్పటివరకు పొందిన అన్ని ప్రయోజనాలకు ప్రతిఫలంగా తమకు తగిన మూల్యం చెల్లించాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని కెనడాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు దిగారు.అమెరికా నుంచి ఇప్పటివరకు పొందిన అన్ని ప్రయోజనాలకు ప్రతిఫలంగా తమకు తగిన మూల్యం చెల్లించాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని కెనడాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు దిగారు. వాణిజ్య ఒప్పందాల విషయంలో ఇటీవల ఇరు దేశాల మధ్య విబేధాలు తలెత్తిన సంగతి తెలిసిందే. పైగా, చైనాతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునేందుకు కెనడా ఆసక్తి చూపుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో కెనడాపై ట్రంప్ విరుచుకుపడ్డారు (Trump warns Canada).

కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్‌ను అమెరికాలోని మిచిగాన్‌తో కలుపుతూ నిర్మించిన గోర్డీ హోవే ఇంటర్నేషనల్ బ్రిడ్జ్‌ను (Cross border bridge news) కెనడా ప్రభుత్వానికి చెందిన విండర్స్-డెట్రాయిట్ బ్రిడ్జ్ అథారిటీ అనే సంస్థ నిర్మించిందని, ఈ ప్రాజెక్టుకు అయిన మొత్తం ఖర్చును కెనడా ప్రభుత్వమే భరించిందని ఆ వంతెన ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. ఈ ఏడాదిలో ఈ బ్రిడ్జ్‌ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ట్రంప్, పుతిన్ భేటీ వాయిదా.. ఎందుకంటే..

ట్రంప్, పుతిన్ భేటీ వాయిదా.. ఎందుకంటే..?

 

ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ఫుల్ స్టాప్ పెట్టేందుకు తాను, రష్యా అధ్యక్షుడు పుతిన్ హంగేరి రాజధాని బుడాపేస్ట్‌లో సమావేశం అవుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల ప్రకటించారు. అయితే ఈ సమావేశం వాయిదా ప్రస్తుతానికి వాయిదా పడింది. మళ్లీ భవిష్యత్తులో ఈ సమావేశం జరుగుతుందనే అంశంపై స్పష్టత లేదని వైట్ హౌస్ వెల్లడించింది.

 రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో హంగేరి రాజధాని బుడాపేస్ట్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరగాల్సిన సమావేశం వాయిదా పడింది. ఉక్రెయిన్‌పై కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించేందుకు రష్యా సుముఖత వ్యక్తం చేయ లేదు. ఈ నేపథ్యంలో ఈ సమావేశం వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ ఇరు దేశాల విదేశాంగ మంత్రులు ఫోన్లు ద్వారా చర్చించుకున్నారు. అనంతరం ఈ ప్రకటన జారీ అయింది. ట్రంప్, పుతిన్‌ల మధ్య బుడాపెస్ట్‌లో సమావేశం జరగనుందంటూ గత వారం ఒక ప్రకటన వెలువడిన విషయం విదితమే.

అయితే ఈ సమావేశం నిలిచిపోయేందుకు స్పష్టమైన కారణాలు అయితే లేవని అమెరికా స్పష్టం చేసింది. ఈ అంశంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఉపయోగం లేని ఈ భేటీ ద్వారా సమయం వృధా చేసుకోవాలంటూ తనదైన శైలిలో ఆయన తెలిపారు. ఈ చర్చల వల్ల ఎలాంటి ఆశాజనక పరిణామాలు ఉండవని ట్రంప్ వెల్లడించారు. అయితే రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం కొన్ని నెలలుగా సాగుతోంది.దాంతో ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణపై చర్చలకు ట్రంప్, పుతిన్ ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా వీరు మరికొద్ది రోజుల్లో బుడాపేస్ట్‌లో సమావేశం కావాల్సి ఉంది. ఇక వీరి భేటీపై అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ సైతం స్పందించింది. భవిష్యత్తులో వీరి భేటీ సందేహమేనంటూ అనుమానం వ్యక్తం చేసింది. అయితే ఈ కాల్పుల విరమణకు ముందు ఉక్రెయిన్ మరిన్ని భూభాగాలను వదులుకోవడానికి అంగీకరించాలంటూ మాస్కో చాలా కాలంగా డిమాండ్ చేస్తోన్న విషయం విదితమే.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version