ఆధారాలు బయటపెడితే నన్ను బదనాం చేస్తారా..

ఆధారాలు బయటపెడితే నన్ను బదనాం చేస్తారా.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై కవిత ధ్వజం

 

సీఎం రేవంత్‌రెడ్డి, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ బ్యాంక్‌కు మూసీ పరివాహక ప్రాంత భూములను కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

 సీఎం రేవంత్‌రెడ్డి (CM RevanthReddy), హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ బ్యాంక్‌కు మూసీ పరివాహక ప్రాంత భూములను కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈరోజు(ఆదివారం) హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు మూసీపై కాంగ్రెస్ ప్రభుత్వం డీపీఆర్‌ను ఎందుకు విడుదల చేయట్లేదని ప్రశ్నించారు.ఫేజ్- వన్‌కి సంబంధించిన డీపీఆర్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం చూపెట్టిందని ప్రస్తావించారు. పూర్తి డీపీఆర్ ఇవ్వకపోవడం వెనుక మోసం ఉందని ఆరోపించారు. ఫ్రీ ఫీజబులిటీ రిపోర్టులో రూ.5,641 కోట్లు ఖర్చు అవుతుందని ఈ ప్రభుత్వం చెప్పిందని గుర్తుచేశారు.

రేవంత్‌రెడ్డి జూనియర్ యోగిలా మారారు.. హరీశ్‌రావు సెటైర్లు…

రేవంత్‌రెడ్డి జూనియర్ యోగిలా మారారు.. హరీశ్‌రావు సెటైర్లు

సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండున్నర సంవత్సరాల్లో ఒక్క ఇల్లు కట్టలేదు కానీ లక్ష ఇళ్లను కాంగ్రెస్ సర్కార్ కూల్చిందని ధ్వజమెత్తారు.

సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండున్నర సంవత్సరాల్లో ఒక్క ఇల్లు కట్టలేదు కానీ లక్ష ఇళ్లను కాంగ్రెస్ సర్కార్ కూల్చిందని ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డి జూనియర్ యోగిలాగా (ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్) మారారని ఎద్దేవా చేశారు. బుల్డోజర్లతో ఇళ్లను కూల్చడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహించారు. కేసీఆర్‌ది అభివృద్ధి మంత్రం అయితే రేవంత్‌రెడ్డిది విధ్వంసమని ఆరోపించారు. ఈరోజు(ఆదివారం) ముషీరాబాద్ భోలక్‌పూర్‌లో అంజుమన్ గర్ల్స్ హైస్కూల్‌లో నిర్వహించిన రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో హరీశ్‌రావు పాల్గొన్నారు. ముస్లిం మహిళలకు రేషన్ కిట్స్ అందజేశారు. హరీశ్‌రావు వెంట ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ ఎమ్మెల్సీ సలీం ఉన్నారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడారు.
షాదీముబారక్‌ అమలు చేయడం లేదు..

మైనార్టీ నాయకులు సలీం రూ.10వేలతో కిట్లను పంపిణీ చేశారని హరీశ్‌రావు ప్రశంసించారు. కేసీఆర్ నిరుపేదల గురించి ఆలోచించి షాదీ ముబారక్ పథకంతో లక్ష రూపాయలను అందించేవారని ప్రస్తావించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక షాదీముబారక్‌ను అమలు చేయడం లేదని దుయ్యబట్టారు. ఈ రెండున్నర సంవత్సరాల్లో ఒక్క మంచి పనైనా చేశారా..? అని ప్రశ్నించారు. ఇమామ్, మోజమ్‌లకు వేతనం పెంచుతామన్నారని, తులం బంగారం ఇస్తామన్నారని.. ఏ ఒక్కటి అయినా ఇచ్చారా.? అని నిలదీశారు. కేసీఆర్ హయాంలో తాగునీటి ఇబ్బందులు పరిష్కరించామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజలందరూ ఇబ్బందుల్లో ఉన్నారని ఫైర్ అయ్యారు.

ఆధునీకరించిన తెలంగాణ శాసనమండలి భవనం ప్రారంభం…

ఆధునీకరించిన తెలంగాణ శాసనమండలి భవనం ప్రారంభం

హైదరాబాద్‌లోని అసెంబ్లీ ప్రాంగణంలో ఆధునీకరించిన తెలంగాణ శాసనమండలి భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్‌తో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

హైదరాబాద్‌: అసెంబ్లీ ప్రాంగణంలో ఆధునీకరించిన తెలంగాణ శాసనమండలి భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఆధునిక సౌకర్యాలతో రూపుదిద్దుకున్న ఈ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version