ఆర్చరీలో తెలుగమ్మాయి రెండు ప్రపంచ రికార్డులు
సింగపూర్‌లో జరుగుతున్న ఆసియాకప్ స్టేజ్ 2 అండర్-21 ఆర్చరీ ర్యాంకింగ్ రౌండ్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి బుద్ధె షణ్ముఖి నాగసాయి…
సింగపూర్‌లో జరుగుతున్న ఆసియాకప్ స్టేజ్ 2 అండర్-21 ఆర్చరీ ర్యాంకింగ్ రౌండ్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి బుద్ధె షణ్ముఖి నాగసాయి…
సచిన్ టెండూల్కర్‌తో పోల్చితే. కోహ్లీకి బౌలింగ్ చేయడం తనకు ఎంతో కష్టంగా అనిపించేదని ఇంగ్లండ్ మాజీ పేసర్ జిమ్మీ అండర్సన్ చెప్పాడు. విరాట్ టెక్నిక్, పోరాటపటిమన.
అవి చీకటి రోజులు
లండన్: గత దేశవాళీ సీజన్‌లో పరుగుల వరద పారించిన కరుణ్ నాయర్‌కు ఎట్టకేలకు ఎనిమిది సంవత్సరాల విరామం తర్వాత జాతీయ జట్టులో చోటు లభించింది. ఈ నేపథ్యంలో…
న్యూఢిల్లీ: లండన్: గత దేశవాళీ సీజన్‌లో పరుగుల వరద పారించిన కరుణ్ నాయర్‌కు ఎట్టకేలకు ఎనిమిది సంవత్సరాల విరామం తర్వాత జాతీయ జట్టులో చోటు లభించింది. ఈ నేపథ్యంలో తన క్రికెట్ కెరీర్‌లో ఎత్తుపల్లాలను తలుచుకుంటూ 33 ఏళ్ల నాయర్ ఉద్వేగానికి గురయ్యాడు. ‘2022 ఏడాది చివరి రోజులు నా కెరీర్‌లో అత్యంత చీకటిమయం’ అని ఆర్.అశ్విన్ యూట్యూబ్ చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో నాయర్ తెలిపాడు. దేశవాళీ పోటీల్లో సత్తా చాటినా జాతీయ జట్టులో చోటు దక్కకపోవడంతో తీవ్ర ఆవేదనకు లోనైన కరుణ్.. ‘డియర్ క్రికెట్. నాకు మరో అవకాశం ఇవ్వు’ అంటూ 2022 డిసెంబరులో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం సంచలనం రేపింది. ‘గత రెండు మూడు సంవత్సరాలుగా నాకు అండగా నిలిచిన వారికి కృతజ్ఞతలు. ఈ సమయంలో ప్రతి క్షణం ఎంత విలువైనదో తెలుసుకున్నా. దాంతో ప్రతి రోజును కొత్తగా భావించా’ అని కరుణ్ తెలిపాడు. సెహ్వాగ్ తర్వాత టెస్ట్‌ల్లో త్రిశతకం బాదిన భారత క్రికెటర్‌గా రికార్డులకెక్కిన నాయర్‌ను 2018లో ఎలాంటి కారణం చూపకుండా టీమిండియానుంచి తప్పించడం గమనార్హం.
మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ వాతావరణ శాఖ జారీ చేసింది.
ముంబై, జూన్ 17: మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వీటి కారణంగా 18 మంది మృతి చెందారు. 65 మంది గాయపడ్డారు. ఈ మేరకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. భారీ వర్షాలు, రోడ్డు ప్రమాదాలు, పిడుగుపాటు, నీట మనిగి పోవడం కారణాల వల్ల ఈ మృతులు సంభవించాయని వివరించింది. రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని.. ఈ నేపథ్యంలో గత 24 గంటలుగా భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పింది.
రాజధాని ముంబై మహానగరంతోపాటు ముంబై శివారు ప్రాంతం, రత్నగిరి, సిందుదుర్గ్, రాయ్‌గఢ్ తదితర జిల్లాల్లో భారీగా వర్షం కురిసిందని తెలిపింది. మరోవైపు పశ్చిమ మహారాష్ట్రలోని అరంజ్ అలర్ట్ జారీ చేసినట్లు పేర్కొంది. అలాగే పుణె, కోల్హపూర్, సతారాతోపాటు రాయ్‌గఢ్ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. జూన్ 15 నుంచి 18వ తేదీ వరకు మహారాష్ట్రకు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక సహాయక చర్యలు కొనసాగుతోన్నాయి. అలాగే లోతట్టు ప్రాంతాల్లో.. నీట ముంపునకు గురైన వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇంకోవైపు భారీ వర్షాల కారణంగా ముంబై మహానగరంలో రహదారులపై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఇక నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో 24 గంటల్లో గుజరాత్, విదర్భా, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలోని పలు ప్రాంతాల్లో విస్తరించనున్నాయని తెలిపింది. అలాగే పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బిహార్, తూర్పు ఉత్తరప్రదేశ్‌లో మరో మూడు రోజుల్లో ఇవి విస్తరిస్తాయని పేర్కొంది. అయితే ఈ మరణాలు జూన్ 1వ తేదీ నుంచి నేటి వరకు చోటు చేసుకున్నవని వివరించింది.
కేరళలో..
అదీకాక.. కేరళలో జూన్ 18 వరకు విస్తృతంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ చేసింది. దీంతో జిల్లా ఉన్నతాధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది.
న్యూఢిల్లీలో..
ఇక ఈ రోజు సాయంత్రం లేదా రాత్రికి దేశ రాజధాని న్యూఢిల్లీలో సైతం సాధారణ వర్షాలు లేకుంటే.. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశముందని వివరించింది.
కర్ణాటకలో..
అలాగే కర్ణాటకలో సైతం భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది ఈ జూన్ మాసంలో సగటు కంటే 110 శాతం అధిక వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ విభాగం పేర్కొంది.
మళ్లీ వస్తున్న హనుమాన్ జంక్షన్
అర్జున్, జగపతిబాబు, వేణు హీరోలుగా 2001లో వచ్చిన ‘హనుమాన్ జంక్షన్’ చిత్రం మళ్లీ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది…
అర్జున్, జగపతిబాబు, వేణు హీరోలుగా 2001లో వచ్చిన ‘హనుమాన్ జంక్షన్’ చిత్రం మళ్లీ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఎడిటర్ మోహన్ నిర్మించిన ఈ చిత్రంతోనే ఆయన తనయుడు మోహన్ రాజా దర్శకుడిగా పరిచయమయ్యారు. లయ, స్నేహ, విజయలక్ష్మి హీరోయిన్లుగా నటించిన ‘హనుమాన్ జంక్షన్’ చిత్రాన్ని ఈ నెల 28న మళ్లీ థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. పూర్తి స్థాయి కామెడీ ఎంటర్‌టైనర్స్ తక్కువగా వస్తున్న ప్రస్తుత తరుణంలో ‘హనుమాన్ జంక్షన్’ మళ్లీ తన మ్యాజిక్‌తో మెస్మరైజ్ చేస్తుందని దర్శకనిర్మాతలు చెప్పారు.
ఓ వివాహ వెబ్‌సైట్‌లో బిజినెన్ మ్యాన్‌గా పరిచయం చేసుకున్నాడు. కొన్నాళ్లకు పరిచయం ఆన్‌లైన్ నుంచి ఆఫ్‌లైన్‌కు మారింది. ఓ హోటల్‌లో అప్పుడప్పుడూ కలుసుకునేవారు. ఆమె నుంచి రూ.లక్షల్లో డబ్బు కూడా తీసుకున్నాడు.
ఓ వివాహ వెబ్‌సైట్(Website)లో బిజినెన్ మ్యాన్‌గా పరిచయం చేసుకున్నాడు. కొన్నాళ్లకు పరిచయం ఆన్‌లైన్ నుంచి ఆఫ్‌లైన్‌కు మారింది. ఓ హోటల్‌లో అప్పుడప్పుడూ కలుసుకునేవారు. ఆమె నుంచి రూ.లక్షల్లో డబ్బు కూడా తీసుకున్నాడు. పెళ్లి చేసుకోవాలని, డబ్బు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తే ఇద్దరూ కలిసి ఉన్నప్పటి వీడియోలు వైరల్ చేస్తానని మహిళను బెదిరించడంతో పాటు ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
నగరంలోని ఓ మహిళకు షాదీ డాట్ కామ్‌లో ముంబైకి చెందిన కల్ఫేష్ కక్కడ్‌తో 2022లో పరిచయం ఏర్పడింది. ఆమెతో పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అప్పుడప్పుడు నగరానికి వచ్చి ఆమెను కలిసేవాడు. జనవరి 23న కల్ఫేష్ నగరానికి వచ్చి బేగంపేట(Begumpet)లో ఉన్న ఓ హోటల్‌లో దిగి ఫోన్ చేయడంతో ఆమె అక్కడికి వెళ్లింది. తన వ్యాపార అభివృద్ధికి డబ్బు కావాలని కోరడంతో రెండు విడతలుగా రూ.24లక్షలు ఇచ్చింది.
ఆ తర్వాత ముఖం చాటేయడంతో తన డబ్బు తిరిగి ఇవ్వాలని, పెళ్లి చేసుకోవాలని పలుమార్లు ఆయనను ఫోన్‌లో నిలదీయడంతో మనం కలిసి ఉన్నప్పుడు తీసిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. దీంతో బాధితురాలు ఈనెల 14న బేగంపేట పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
విభిన్న కథతో
‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన సుహాస్, శివానీ నగరం మరోసారి జంటగా తెరపై కనిపించనున్నారు. వీర్దిద్దరూ కలసి…
‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన సుహాస్, శివానీ నగరం మరోసారి జంటగా తెరపై కనిపించనున్నారు. వీర్దిద్దరూ కలసి నటించనున్న కొత్త చిత్రం సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. గోపీ అచ్చర ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్నారు. ముహూర్తం షాట్‌కు సత్యదేవ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నాగ్ అశ్విన్ క్లాప్ కొట్టారు. వంశీ నందిపాటి ఫస్ట్ షాట్‌కు దర్శకత్వం వహించారు. విభిన్న కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని మేకర్స్ తెలిపారు. షణ్ముఖ ప్రశాంత్ ఈ చిత్రానికి కథను అందించారు.
ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చెర్మన్ శివకుమార్ గారికి ఘనంగా స్వాగతం పలికిన మెదపల్లి తాజా మాజీ సర్పంచ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ గారు భారత రాష్ట సమితి రజతోత్సవం లో భాగంగా బి ఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు ఆదేశానుసారం అమెరికాలో జరిగిన రజతోత్సవంలో భాగంగా పాల్గొని తిరిగి స్వదేశానికి విచ్చేసిన సందర్భంగా మెదపల్లి తాజా మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ మరియు ,ఝరాసంగం మండల బి ఆర్ యస్ పార్టీ యువనాయకులు sk షోయల్ ఘనంగా స్వాగతం పలకడం జరిగింది .ఇట్టి కార్యక్రమం లో జహీరాబాద్ మాజీ ఎంపీపీ విజయకుమార్.
ఝరసంగం మండల బి ఆర్ యస్ పార్టీ ఉపాధ్యక్షులు మాణికప్రభు పాటిల్ .యువనాయకులు నవీన్ పాటిల్ శివకుమార్ .సంగారెడ్డి జిల్లా వీరశైవ లింగాయత్ యువజన సంయుక్త కార్యదర్శి పోలీస్ ప్రవీణ్ పాటిల్.తదితరులు పాల్గొన్నారు.
అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తన కెనడా పర్యటనను అర్ధాంతరంగా ముగించుకున్నారు. ఆయన అమెరికా బయలుదేరి వెళ్లనున్నారు.
రవితేజ కథానాయకుడిగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఇటీవలె ఓ చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ‘ఆర్‌టీ 76’ వర్కింగ్ టైటిల్…
రైతు నేస్తం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా,
జహీరాబాద్ నేటి ధాత్రి:
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల కోసం రూపొందించిన ‘రైతునేస్తం’ కార్యక్రమం సోమవారం సాయంత్రం 4 గంటలకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 566 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం కల్పించబడి ఉండగా, తాజాగా మరో 1,034 వేదికల్లో ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. ఈ కార్యక్రమాన్ని ఝరాసంగం మరియు కప్పుడ్ రైతు వేదిక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులు వీక్షించడం జరిగింది.
దీనిలో భాగంగా ప్రస్తుతం మండలానికి ఒక రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ఉండగా దీనికి అదనంగా తాజాగా మండలానికి మరో 2 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం కల్పించి ప్రతీ మంగళవారం నిర్వహించే రైతునేస్తం ద్వారా శాస్త్రవేత్తలతో ముఖాముఖి, ఆదర్శరైతుల అనుభవాలు, కొత్త పంటల సాంకేతికతపై చర్చలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్టు స్థానిక వ్యవసాయ అధికారి వెంకటేశ్ వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి సుధాకర్, మండల అధ్యక్షులు హన్మంతరావు పాటిల్,ఆలయ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ పటేల్ ఛైర్మన్ , పాక్స్ చైర్మన్ గౌస్ ఉద్దీన్, మాజీ ఎంపీపీ దేవదాస్, వ్యవసాయ విస్తరణ అధికారులు సుకుమార్, సంపత్ కుమార్, ఙ్ఞానం, రేణుక, వేదవతి భారతి, హరికృష్ణ, తాజా మాజీ ప్రజాప్రతినిధులు
శ్రీకాంత్ రెడ్డి, మల్ల రెడ్డి, ఆరిఫ్, శ్రీనివాస్ రెడ్డి, స్వామి,ఇతర రైతులు పాల్గొన్నారు..
ఇల్లు కొనుగోలు చేసే సమయంలో చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ తరహాలోనే నాలా ఆక్రమించి నిర్మాణం చేపట్టారా అన్నది కూడా చెక్ చేసుకోవాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పౌరులకు సూచించారు.
ప్రజావాణికి దృష్టికి వచ్చిన కొన్ని ఫిర్యాదులు
– ఘట్‌కేసర్ మండలం పోచారం మునిసిపాలిటీ పరిధి కొర్రెముల గ్రామం సర్వే నంబర్ 739 నుంచి 749 వరకు ఉన్న 147 ఎకరాల్లో ఏకశిలానగర్ లే అవుట్‌ను 1985లో అభివృద్ధి చేశారు. 2006లో అందులోని 47 ఎకరాలను వ్యవసాయ భూమిగా చూపుతూ ఓ వ్యక్తి లే అవుట్ స్వరూపం మార్చారు. ఇదే లే అవుట్‌లో రెండు బడా రియల్ ఎస్టేట్ సంస్థలు ప్రహరీలు నిర్మించి కొంత మేర కాజేశాయి.
– కొర్రెములలోని సర్వే నంబర్ 796లో 11.20 ఎకరాల భూమి ఉండగా, ఇందులో 7.20 ఎకరాల్లో మెడికల్ కళాశాల ఏర్పాటు చేశారు.
– పంజాగుట్ట ఆఫీసర్స్ కాలనీలో 1000 చ.గ పార్కు స్థలంలో సగం జాగాలో దుర్గాభవానీ ఆలయం నిర్మించారు. మిగతా 500 గజాల స్థలం కబ్జాకాకుండా పార్కు అభివృద్ధి చేయాలి.
– అల్వాల్ మండలం జొన్నబండ గ్రామంలోని వజ్ర ఎన్‌క్లేవ్‌లో 900 చ.గల పార్కు స్థలం కబ్జా అవుతోంది.
– తూముకుంట మునిసిపాలిటీ దేవరయాంజల్ గ్రామంలోని తురకొని కుంట శిఖం భూమిలో వేయింగ్ మిషన్ ఏర్పాటు చేస్తున్నారని సీతారామచంద్ర స్వామి దేవస్థానం భూముల పరిరక్షణ సమితి ప్రతినిధులు ఫిర్యాదు చేశారు.
టీ వై జె ఎఫ్ జర్నలిస్టు పిల్లలకు 100 శాతం ఫీజు రాయితీ
◆ టీ వై జె ఎఫ్ జహీరాబాద్ అధ్యక్షులు అనిల్ కుమార్
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి/జహీరాబాద్:నిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు విద్యాసంస్థల్లో నూటికి నూరు శాతం ఫీజు రాయితీని కల్పించాలని ( టీ వై జె ఎఫ్) తెలంగాణ యూత్ జర్నలిస్టు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు తనుగుల జితేందర్ రావు, ఆదేశాల మేరకు జహీరాబాద్ అధ్యక్షులు అనిల్ కుమార్, ఉపాధ్యక్షుడు నగేష్, ఆధ్వర్యంలో సోమవారం నాడు సంగారెడ్డిలో డిఈఓ వెంకటేశ్వర్లు ను కలిసి వినతి పత్రం సమర్పించారు. టీ వై జె ఎఫ్ జహీరాబాద్ అధ్యక్షులు అనిల్ కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి తమ సంఘం పాటుపడుతుందని వివరించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలు కోసం జర్నలిస్టులు నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో చాలామంది జర్నలిస్టులు తమ కుటుంబాన్ని కూడా పట్టించుకోవడంలేదని అన్నారు పేద మధ్యతరగతి వర్గాల వారే ఎక్కువమంది జర్నలిస్టులు ఉన్నారని చెప్పారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో వారి పిల్లలకు ఫీజు రాయితీ కల్పించడం ద్వారా ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. అంతేకాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా అర్హులైన వారికి అందించాలని విజ్ఞప్తి చేశారు. సంగారెడ్డి జిల్లాలో ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రైవేటు విద్యాసంస్థల్లో నూటికి నూరు శాతం ఫీజు రాయితీని జర్నలిస్టుల పిల్లలకు కల్పించాలని డీఈఓ ను కోరారు గతంలో కొందరు ప్రైవేటు విద్యాసంస్థలవారు డీఈవో ఉత్తర్వులను కూడా అమలు చేయలేదని ఆరోపించారు ఈసారి ఆ విధంగా కాకుండా కచ్చితంగా ప్రతి విద్యా సంస్థ వారు అమలు చేసే విధంగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు దీనికి డీఈఓ వెంకటేశ్వర్లు సానుకూలంగా స్పందించారు. జర్నలిస్టు పిల్లలకు నూటికి నూరు శాతం రాయితీని అందే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఝరాసంగం మండల టీ వై జె ఎఫ్ అధ్యక్షులు ఎర్రోళ్ల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
కోహీర్: కుళ్లిన శవం లభ్యం.
జహీరాబాద్ నేటి ధాత్రి:
కోహిర్ మండలం కొత్తూరు – బి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై కుళ్లిన శవం లభ్యమైనట్లు ఎస్సై సోమవారం తెలిపారు.16.06.2025 నాడు మద్యాహ్నం 13.30 గంటలకు కొత్తూర్-డి గ్రామ శివారులో గల నేషనల్ హైవే-65 రోడ్డు పక్కన గల పొదలలో ఒక మగ మనిషి శవం కుళ్లిన స్తితిలో ఉన్నది, అతని వయస్సు అందజ 40-45 సం,ల మద్యన ఉంటుంది, అతడి శరీరం మీద ఎరుపు మరియు నలుపు గెత్తల షర్ట్, బ్రౌన్ కలర్ బనియన్ దరించి దాని మీద “S” అని, షర్ట్ కాలర్ పట్టి మీద మరియు బటన్స్ కింద “హై డిమాండ్ ప్రీమియం షైర్ట్స్” అనే స్టికర్ ఉంది, ఎవరైనా ఈ వ్యక్తిని గుర్తిస్తే ఈ దిగువన ఉన్న ఫోన్ నంబర్స్ కి కాంటాక్ట్ చేయగలని అన్నారు.
DSP Zaheerabad – 8712656708
CIP Zaheerabad Town – 8712656731
SIP Kohir – 8712656765
కేవలం నెల రోజుల వ్యవథిలో అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూర్చిన నాలుగు సినిమాల నుండి నాలుగు సింగిల్స్ రాబోతున్నాయి.
అమ్మో అమ్మాయేనా… ఎల్లోరా శిల్పమా అని పాడుకుంటున్నారు ఆ అమ్మడిని చూసి నెటిజన్లు. అమ్మడికి పట్టిన అదృష్టాన్ని చూసి కొందరు మధ్యలో ట్రోల్ చేశారు కానీ రీసెంట్ గా వదిలిన శాంపిల్ ను చూసి నోరెళ్ల బెడుతున్నారు. అవమానించిన వాళ్లే ఔరా అంటున్నారు. ఇంతకీ ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా… మోనాలిసా గురించి.
ఈ భామ ఇటీవల ఒక మ్యూజిక్ వీడియోలో నటించింది. అది రీసెంట్ గా యూట్యూబ్‌లో రిలీజ్ అయ్యి రచ్చ చేస్తోంది. ఉత్కర్ష్ సింగ్ (Utkarsh Singh)తో కలిసి మోనాలిసా ఆ సాంగ్‌లో ఎంబ్రాయిడరీ లెహంగా, క్లాసీ జ్యువెలరీతో ఫుల్ స్టన్నింగ్‌గా కనిపించింది. ఆమె డాన్స్, ఎక్స్‌ప్రెషన్స్ చూసి ఫ్యాన్స్ ఫ్లాట్ అవుతున్నారు. ఈ అమ్మాయి… హీరోయిన్స్‌కి ఏం తక్కువ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. అంతేకాదు.. ఈ సాంగ్‌ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులు తెగ చూసేస్తున్నారు.
సనోజ్ మిశ్రా (Sanoj Mishra) డైరెక్ట్ చేస్తున్న హిందీ సినిమాలో ఈ భామ లీడ్ రోల్‌లో కనిపించబోతోంది. యాక్టింగ్ స్కిల్స్ పెంచుకోవడానికి ఫుల్ ట్రైనింగ్ తీసుకుంటూ, సినిమా ఎంట్రీ కోసం ఎగ్జైట్‌మెంట్‌తో ఎదురుచూస్తోంది. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన ‘సాద్గి’ సాంగ్ లింక్‌కి లైక్స్, కామెంట్స్ జోరు చూస్తే, ఆమె క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థమవుతుంది. పూసల అమ్మాయి నుంచి కలల రాణిగా మారిన మోనాలిసా జర్నీ చూస్తే, ఎవరైనా సరే అవకాశం వస్తే ఆకాశం అందుకోవచ్చని నిరూపించేలా ఉంది. ఇక ఇప్పుడు ఈ భామ సినిమా రంగంలో ఎలా రాణిస్తుందో చూడాలి!
ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
◆ సప్లిమెంటరీ పరీక్షలో ఫెయిల్ అవడంతో అఘాయిత్యం
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్: ఇంటర్మీడియట్లో ఫెయిల్అయి
నందుకు మనస్థాపానికి గురై వెంకట రమణ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. జహీరాబాద్ పట్టనంలో నివాసం ఉంటున్న రాయిపల్లి కృష్ణ కుమారుడు వెంకటరమణ (19) డాక్టర్ ఆర్ఎల్ఆర్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. మృతుడు అడ్వాన్స్ సప్లిమెంటరీ రాశాడు. సోమవారం మధ్యానం 12 గంటలకు ఇంటర్ సప్లి రిజల్ట్స్ రావడంతో ఒక సబ్జెక్టు ఫెయిల్ అయ్యాడు. దీంతో మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ కు తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వెంకట రమణ తల్లి వెంకటరమ ణకు ఫోన్ చేస్తే లిఫ్ట్చేయడంలేదని స్నేహితులకు ఫోన్ చేసి ఇంటికి వెళ్ళి చూడమని చెప్పింది.దీంతో తన స్నేహితులు ఇంటికి వెళ్లి చూడగా ఉరేసు కుని ఉన్నారు. స్నేహితులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరీ క్షించిన వైద్యులు వెంకట రమణ మృతిచెందినట్లు ధృవీకరించారు. వెంకట్ రమణ మృతిపై తండ్రి కృష్ణ జహీరాబాద్ టౌన్ పీఎస్ లో ఎలాంటి అను మానాలు లేవని పేర్కొన్నట్లు ఎస్ఐ. కె. వినయ్ కుమార్ పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
అందుకే పాకిస్థాన్‌లో విడుదల చేయలేదు.
ఆమిర్‌ఖాన్ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘దంగల్’. 2016లో విడుదలైన ఈ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా రెండు వేల కోట్ల రూపాయలకు…
ఆమిర్‌ఖాన్ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘దంగల్’. 2016లో విడుదలైన ఈ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా రెండు వేల కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాఽధించింది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని ఆమిర్‌ఖాన్ వెల్లడించారు. తాజాగా ఓ టెలివిజన్ షో పాల్గొన్న ఆయన ‘దంగల్’ను పాకిస్థాన్‌లో విడుదల చేయకపోవడం వెనుకున్న కారణాన్ని వివరించారు. ‘గీతా ఫొగట్ విజయం సాధించిన అనంతరం జాతీయ పతాకం నింగిలోకి ఎగురుతూ ఉండగా… జాతీయ గీతం వినిపించే దృశ్యాలు సినిమా నుంచి తొలగించండి లేదంటే చిత్ర ప్రదర్శనకు అంగీకరించం’ అని పాకిస్థాన్ సెన్సార్ బోర్డు షరతు విధించింది. ఇదే విషయమై చిత్ర సహ నిర్మాణ సంస్థ డిస్నీ నన్ను సంప్రదించగా నష్టం వచ్చినా సరే.. మనం సినిమాని పాకిస్థాన్‌లో విడుదల చేయడం లేదు అని ఖరాఖండిగా చెప్పేశాను’ అని ఆమిర్‌ఖాన్ వివరించారు. ‘మీ జాతీయ పతాకాన్ని తొలగించండి, మీ జాతీయ గీతాన్ని తీసివేయండి అనే వారితో నాకు పనేంటి. అలాంటి వ్యాపారం అక్కర్లేదని చెప్పేశాను’ అంటూ ఆయన ఆ నాటి విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
నాపై ప్రభాస్‌కు ఉన్న నమ్మకమే రాజాసాబ్
ప్రభాస్ కథానాయకుడిగా మారుతి తెరకెక్కిస్తున్న హారర్ కామెడీ ‘రాజాసాబ్’.
మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధికుమార్ కథానాయికలు.
సంజయ్‌దల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్…
ప్రభాస్ కథానాయకుడిగా మారుతి తెరకెక్కిస్తున్న హారర్ కామెడీ ‘రాజాసాబ్’.
మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధికుమార్ కథానాయికలు.
సంజయ్‌దల్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.
డిసెంబరు 5న చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
సోమవారం టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్.
వింటేజ్ లుక్‌లో ప్రభాస్ చేసిన హంగామా, అదిరిపోయే విజువల్స్, నేపథ్య సంగీతం సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి.
ముఖ్యంగా ప్రభాస్ సంభాషణలు, ఆయన చేసిన కామెడీ అభిమానులను ఖుషీ చేశాయి.
మారుతి టేకింగ్ ప్రధానాకర్షణగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో మారుతి మాట్లాడుతూ ‘ఓ రోజు యువీ వంశీ నిన్ను ప్రభాస్ పిలుస్తున్నారు అని చెప్పారు.
ఆయన్ని కలిసేందుకు ముంబై వెళ్లా.
‘నువ్వు చేసిన ‘ప్రేమకథా చిత్రమ్’, ‘భలేభలే మగాడివోయ్’ లాంటి వినోదాత్మక కథ రెడీ చెయ్యి.
సినిమా చేద్దాం’ అని అన్నారు.
‘పక్కా కమర్షియల్’ చిత్రం ఫ్లాప్ అవ్వడంతో నాతో సినిమా చెయ్యాలనుకున్న నిర్మాత వెనక్కి వెళ్లారు.
అయినా నాపై నమ్మకంతో ప్రభాస్ ఈ సినిమాను చేశారు.
ఆయనకు నాపై ఉన్న నమ్మకమే ఈ సినిమా.