ఘనంగా అయ్యప్పస్వామి అభిషేకాలు
ఉత్తర నక్షత్రం సందర్భంగా మహాదివ్య పడిపూజ
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట పట్టణంలోని శ్రీ ధర్మ శాస్త అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్పస్వామికి ఘనంగా అష్టాభిషేకాలు నిర్వహించారు.అయ్యప్పస్వామి ఉత్తర నక్షత్ర జాతకంతో జన్మించిన నేపథ్యంలో ప్రతీ నెల వచ్చే ఉత్తర నక్షత్ర గడియలు వస్తున్న తరుణంలో నర్సంపేట శ్రీ ధర్మ శాస్త దేవాలయ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో గత ఐదు నెలలుగా ప్రత్యేక పడిపూజలు నిర్వహిస్తున్నారు.కాగా బుదవారం దేవాలయ ట్రస్టు చైర్మన్ సింగిరికొండ మాధవశంకర్ గుప్తా, అధ్యక్షుడు సైపా సురేష్ ఆధ్వర్యంలో దేవాలయంలో అయ్యప్పస్వామి పడిపూజ నిర్వహించారు.ఉదయం గర్భగుడిలో సుప్రభాతంతో మొదలై హోమం కార్యక్రమం,ప్రత్యేక పూజలు చేపట్టారు.అనంతరం అయ్యప్పస్వామి ఉత్తర నక్షత్ర పడిపూజ, అభిషేకం,అన్నదాన దాతగా వంగేటి పద్మావతి గోవర్ధన్ కుటుంబం ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు దేవేశ్ మిశ్రా బృందం వేధ మంత్రోచ్చారణతో మహాదివ్య పడిపూజ చేపట్టారు.ముందుగా 18 కలశాల పూజలు,మెట్ల పూజలు చేశారు.ఈ సందర్భంగా అయ్యప్పస్వామికి నెయ్యి, తేనే,చక్కర,పంచాంతృతం,గంధం,
విభూదితో అష్టాభిషేకాలు,కలశాభిషేకాలు చేపట్టారు. అనంతరం పుష్పాభిషేకం చేశారు.ఈ నేపథ్యంలో పడునెట్టాంబడిపై కర్పూర జ్యోతులతో వెలిగించడంతో భక్తులు మురిసిపోయారు.కళ్యాణరాముడు సురేష్,రంగనాథ్ బృందం ఆలపించిన భజన పాటలతో,భక్తుల శరణఘోషతో దేవాలయ ప్రాంగణం ఎంతగానో మారుమ్రోగింది.అనంతరం మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం దాత వంగేటీ పద్మావతి గోవర్ధన్ కుటుంబం ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో దేవాలయ ట్రస్టు కోశాధికారి దొడ్డ రవీందర్ గుప్తా,శ్రీరాం ఈశ్వరయ్య ఇరుకుల్ల వీరలింగం,భూపతి లక్ష్మీనారాయణ,బండారుపల్లి చెంచారావు,దొడ్డ వేణు,మల్యాల రాజు,మల్యాల ప్రవీణ్,భీరం నాగిరెడ్డి,రాంచందర్,కర్ణాకర్,మండల వీరస్వామి గౌడ్,బాదం అనిల్,శ్రీనివాస్,గురుస్వాములు సంజీవ రావు, యాదగిరి,అనిల్,ఆలయ గుమస్తా దేశి రాము అర్చకులు ఫ్రాన్స్,శివాంకిత్,ఆనంద్,తో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.