చేయి కోల్పోయిన కార్మికుడు ముంగి పరిశ్రమలో ఘోరం
◆ పవర్ ప్రెస్ యంత్రం మీదపడి చేతి కోల్పోయిన కార్మికుడు
◆ రూ.20లక్షల నష్టపరిహారం ఇవ్వాలని సీఐటీయూ డిమాండ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణ పరిధిలోని ముంగి పరిశ్రమ యాజమాన్యం అనుసరిస్తున్న కార్మికుల భద్రతా చర్యల వైఫల్యం కారణంగా జరిగిన ప్రమాదంలో ఓ కార్మికుడు తన చేయిని కో ల్పోవాల్సి వచ్చింది. పవర్ ప్రెస్ మిషన్ నెంబ ర్.1ఫేయిలై కార్మికుడిపై పడడంతో మిషన్ ఆ పరేటర్ కే.గణేష్ కుడి చేయిని కోల్పోయాడు. స్థానిక పరిశ్రమలో తరచూ ఇలాంటి ఘోరాలు సర్వసాధారణమని కార్మికులు ఆరోపిస్తున్నారు. కర్ణాటక రేకుల్గి గ్రామానికి చెందిన క్షతగాత్రుడు గణేష్ 13 ఏళ్లుగా కాంట్రాక్టు కార్మికునిగానే పనిచేస్తూ కుటుంబానికి పోషిస్తున్నాడు. అకస్మా త్తుగా పవర్ ప్రెస్ మిషన్ ఫెయిలై చేయిపై పడటంతో జరిగిన ప్రమాదంలో తన కుడి చేయి మొత్తం నుజ్జు నుజ్జునుజ్జె రెండు ముక్కలైంది.
వెంటనే ఆయనను స్థానిక ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించడంతో వైద్యులు శస్త్ర చికిత్స ద్వారా చేయి తొలగించి చికిత్స చేశారు. ఆయనకు భార్య ఇద్దరు ఆడ, ఒక మగ సంతానం ఉన్నారు. కార్మికుడిని ఆదుకోవాలని సీఐటీయూ పారిశ్రామిక క్లస్టర్ కన్వీనర్ యస్.మహిపాల్ డిమాండ్ చేశారు. అదే పరిశ్రమలో కార్మికుడిని పర్మినెంట్ ఉద్యోగిగా తీసుకోవాలని, రూ.20 లక్షల నష్టపరిహారం చెల్లిం చాలని, వైద్య ఖర్చులు పూర్తిగా యాజమాన్యమే భరించాలని, ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.