పెయింటర్‌గానే ఎక్కువ సంపాదన..

పెయింటర్‌గానే ఎక్కువ సంపాదన

దాదాపు మూడు దశాబ్ధాల క్రితమే క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన ఇంగ్లండ్‌ మాజీ వికెట్‌ కీపర్‌ జాక్‌ రస్సెల్‌ ఇప్పుడు కాన్వాస్‌ పెయింటర్‌గా స్థిరపడ్డాడు. 1988-1998 మధ్య తను…

లండన్‌: దాదాపు మూడు దశాబ్ధాల క్రితమే క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన ఇంగ్లండ్‌ మాజీ వికెట్‌ కీపర్‌ జాక్‌ రస్సెల్‌ ఇప్పుడు కాన్వాస్‌ పెయింటర్‌గా స్థిరపడ్డాడు. 1988-1998 మధ్య తను 54 టెస్టులు, 40 వన్డేలు ఆడాడు. కళ్లకు నల్లటి గ్లాసులు, తలకు పనామా టోపీ, పొడవాటి మీసాలతో విలక్షణంగా కనిపించే రస్సెల్‌ 90 దశకంలో క్రికెట్‌ ఫ్యాన్స్‌ను అమితంగా ఆకట్టుకునేవాడు. క్రికెట్‌ నుంచి వైదొలిగాక పెయింటింగ్‌లో బిజీ అయ్యానని చెప్పాడు. అంతేకాకుండా క్రికెట్‌ ఆడే సమయంలోకన్నా ఇప్పుడే ఎక్కువగా సంపాదిస్తున్నట్టు రస్సెల్‌ తెలిపాడు. అయితే ధన సంపాదన కోసమే పెయింటింగ్స్‌ వేయడం లేదని, బొమ్మలు గీయడం తనకో వ్యసనమని తేల్చాడు. భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్నందున తాను రంజిత్‌ సింగ్‌జీ బొమ్మను సైతం చిత్రించినట్టు పేర్కొన్నాడు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version