కోహ్లీ-గిల్ సేమ్ టు సేమ్.. ఇది కదా కావాల్సింది!

కోహ్లీ-గిల్ సేమ్ టు సేమ్.. ఇది కదా కావాల్సింది!

టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బాటలో నడుస్తున్నాడు శుబ్‌మన్ గిల్. బ్యాటర్‌గానే కాదు.. సారథ్యంలోనూ అతడ్ని దింపేస్తున్నాడు. అసలేం జరిగిందంటే..

విరాట్ కోహ్లీ.. ఈ పేరు చెప్పగానే సెంచరీలు, రికార్డులు, భారీ ఫ్యాన్ ఫాలోయింగే గుర్తుకొస్తాయి. క్రికెట్ మైదానంలో లెక్కలేనన్ని రికార్డులతో దిగ్గజ స్థాయిని అందుకున్నాడు విరాట్. అయితే కోహ్లీ అంటే పరుగులు, మైలురాళ్లే కాదు.. అగ్రెషన్ కూడా గుర్తుకొస్తుంది. ప్రత్యర్థులతో ఢీ అంటే ఢీ అనడం, అవసరమైతే బాహాబాహీకి దిగడం, స్లెడ్జింగ్ చేయడానికి కోహ్లీ వెనుకాడడు. అందుకే అతడి సారథ్యంలో భారత్‌ను చూసి అంతా భయపడేవారు. అదే ఇప్పటివరకు కొనసాగుతూ వచ్చింది. దీన్ని నయా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మరింత ముందుకు తీసుకెళ్లేలా కనిపిస్తున్నాడు.

దమ్ముంటే ఆడమంటూ..

గిల్ అనగానే కామ్, కూల్ యాటిట్యూడ్ అనే అంతా అనుకునేవారు. కానీ లార్డ్స్ టెస్ట్‌లో శుబ్‌మన్ రూటు మార్చి తనలోని అగ్రెషన్‌ను బయటకు తీశాడు. మూడో రోజు ఆట ముగింపు సమయంలో ఓవరాక్షన్ చేసిన ఆతిథ్య జట్టు ఓపెనర్లు జాక్ క్రాలే, బెన్ డకెట్‌కు మీదకు దూసుకెళ్లాడు గిల్. దమ్ముంటే ఆడండి.. నాటకాలు ఎందుకు చేస్తున్నారంటూ వాళ్లతో బాహాబాహీకి దిగాడు. మాటలతో ఇచ్చిపడేసిన భారత నూతన సారథి.. వేళ్లు చూపిస్తూ బాడీ లాంగ్వేజ్‌తోనూ ప్రత్యర్థులను భయపెట్టాడు. దీంతో కోహ్లీ-గిల్ సేమ్ టు సేమ్ అంటూ అభిమానులు పోల్చడం షురూ చేసేశారు..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version