హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు

హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు
వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి పట్టణంలో హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం నాడు చింతల హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు . ఈ పూజా కార్యక్రమంలో పట్టణ ఆవోప అధ్యక్షులు కలకొండ శ్రీనివాసులు
గోకారం రాజు కటకం శ్రీధర్ చిదేరే వెంకటేష్. నూకల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి వార కళ్యాణం.

అంగరంగ వైభవంగా శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి వార కళ్యాణం
చిల్పూర్(జనగాం)నేటి ధాత్రి

 

భక్తుల కోరిన కోర్కెలు తీర్చుతూ దినదినాభివృద్ధి చెందుతూ భక్తుల కొంగు బంగారంగా నిలుస్తున్న చిల్పూర్ గుట్ట చిల్పూర్ మండల కేంద్రంలోని కొలువైన శ్రీ ముగ్గులు వెంకటేశ్వర స్వామి వార కళ్యాణ మహోత్సవం శనివారం ఆలయ కార్య నిర్వహణ అధికారిని లక్ష్మీ ప్రసన్న ,ఆలయ ప్రధాన అర్చకులు రంగాచార్యులు,కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛరణల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది.ఈ సందర్భంగా ఆలయ అర్చకుల శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలలో భాగంగా హారతులు, అభిషేకాలు,అర్చనలు నిర్వహించారు.ఇందులో భాగంగా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై కళ్యాణ మహోత్సవంలో పాల్గొని భగవంతునికి ప్రత్యేక పూజలు నిర్వహించి భగవంతుని కృపకు పాత్రులు అయ్యారు.దీంతో ఆలయ పరిసరాలు ఓం నమో వెంకటేశాయ నామస్మరణలతో మారుమోగాయి. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

సీతారాముల కళ్యాణ తలంబ్రాలు పంపిణీ.

సీతారాముల కళ్యాణ తలంబ్రాలు పంపిణీ

నర్సంపేట డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ

నర్సంపేట,నేటిధాత్రి:

 

భద్రాద్రి శ్రీ సీతారాములు కళ్యాణ తలంబ్రాలు ముందస్తుగా బుకింగ్ చేసుకున్న డిపో ఉద్యోగులు, సీతా రాముల భక్తులకు నర్సంపేట డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ శనివారం ఆర్టీసి డిపో వద్ద తలంబ్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిఎం మాట్లాడుతూ సీతా రాముల కళ్యాణం ప్రత్యక్షంగా చూడలేకపోయినా భక్తులకు తలంబ్రాలు, ముత్యాలు, బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించిన ఆర్టీసీ ఎం.డి సజ్జనార్ , దేవాదాయశాఖ ధన్యవాదములు తెలిపారు. పవిత్ర శుభాకార్యలకు ఈ తలంబ్రాలు అక్షింతలుగా ఉపయోగ పడతాయని పేర్కొన్నారు. బుకింగ్ ఏజెంట్లుగా చేసిన డిపో ఉద్యోగులు కార్గో మార్కెటింగ్ ఎగ్సిగీటివ్ నరేందర్,రవీందర్, రాంబాబు, పుష్పలీల, ఎడిసి నారాయణలను అభినందించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఇంజనీర్ ప్రభాకర్జ్ ఆఫీస్ స్టాఫ్ వెంకటరెడ్డి శ్రీను,కిషోర్, ఎస్డిఐ వెంకటేశ్వర్లు, బాబు, డిపో ఉద్యోగులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సాయి బాబా ఆలయంలో కాశీ విశ్వనాథ.

సాయి బాబా ఆలయంలో కాశీ విశ్వనాథ స్వామి విగ్రహ ప్రతిష్టాపన…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

రామకృష్ణాపూర్ పట్టణం లోని ఏ జోన్ సూపర్ బజార్ శ్రీ శిరిడి సాయిబాబా ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మితమైన పరివార దేవత సహిత శ్రీ కాశీ విశ్వనాథ స్వామి స్థిర ప్రతిష్ట కార్యక్రమాలు మూడు రోజులపాటు వైభవంగా జరిగాయి. శుక్రవారం ఉదయం గర్తన్యాసం,బీజన్యాసం, రత్నన్యాసం తో మొదలై యంత్ర ప్రతిష్టాపన తదుపరి దేవత స్థాపన, ప్రాణ ప్రతిష్ట,కళ్యాణసం, మహాబలిహరణ,నేత్రోన్మిలనం, మహా పూర్ణాహుతి, శాంతి కళ్యాణం, ఆశీర్వచనం, తీర్థ ప్రసాద వినియోగం అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

వాలయ పునర్నిర్మాణానికి.

వాలయ పునర్నిర్మాణానికి
2 లక్షల 16 వేలువిరాళం.

చిట్యాల,నేటిధాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నవాబుపేట గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శివాలయానికి ఏలేటి రామయ్య పల్లి గ్రామ వాస్తవ్యులు కీర్తి శేషులు ఏలేటి నర్సయ్య, లింగమ్మ, ముత్తమ్మ గార్ల జ్ఞాపకార్థం కొత్తూరు వెంకటమ్మ – స్వామీరెడ్డి మరియు కొత్తూరు మల్లారెడ్డి – హేమ, కొత్తూరు నర్సింహా రెడ్డి(డాక్టర్) – శిరీష , కొత్తూరు విజందర్ రెడ్డి – సుష్మ దంపతులు కలిసి శివాలయానికి విరాళంగా 216000/- రూపాయలు అక్షరాల (రెండు లక్షల పదహారు వేల రూపాయలు) ఇవ్వడం జరిగింది… ఈ కార్యక్రమం లో శివాలయ కమిటీ సభ్యులు ఆలయ కమిటీ అధ్యక్షులు కసిరెడ్డి రత్నాకర్ రెడ్డి,ఉపాధ్యక్షులు మోతుకూరి నరేష్,బిళ్ళ సత్యనారాయణ రెడ్డి, మందల రాఘవరెడ్డి,కాల్వ సమ్మిరెడ్డి,బొమ్మ శంకర్, కొక్కుల సారంగం, మోతుకూరి రాజు,చెక్క నర్సయ్య,సర్వ శరత్, తీగల నాగరాజు,అనగాని రాజయ్య,తిప్పణవేణి రవి, ప్రధాన అర్చకులు రఘునందన్ తదితరులు పాల్గొన్నారు.

సాంప్రదాయాలకు ప్రతీక పండుగలు.

సాంప్రదాయాలకు ప్రతీక పండుగలు

గంగాధర మండలం ఇస్లాంపూర్ లో రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ట, ఉప్పరమల్యాలలో పోచమ్మ బోనాలలో పాల్గొన్న ఎమ్మెల్యే

గంగాధర నేటిధాత్రి:

 

 

తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా పండుగలు నిలుస్తాయని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు.
గంగాధర మండలం ఇస్లాంపూర్ లో నూతనంగా నిర్మించిన ఎల్లమ్మ దేవాలయంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఎమ్మెల్యేను సన్మానించారు.అనంతరం ఉప్పరమల్యాల లో నిర్వహించిన పోచమ్మ బోనాలలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.నెత్తిన బోనమెత్తి గ్రామస్తులతో కలిసి పోచమ్మ ఆలయానికి తరలి వెళ్లారు.
పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కలు చెల్లించుకున్నారు.ఈ కార్యక్రమంలో జాగిరపు శ్రీనివాస్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిర్మల్ రావు సింగిల్ విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్,ముద్దం జమున నగేష్ ,వంగ శ్రీధర్ గౌడ్, దోమకొండ మహేష్,కర్ర బాపు రెడ్డి, దోర్నాల శ్రీనివాస్ రెడ్డి, వేముల అంజి,మార్కెట్ కమిటీ డైరెక్టర్లు దీకొండ మధు, పెంచాల చందు, ముచ్చె శంకర్, తదితరులు పాల్గొన్నారు.

తాండా అభివృద్ధికి అందరూ కలిసి కట్టుగా ఉండాలి.

తాండా అభివృద్ధికి అందరూ కలిసి కట్టుగా ఉండాలి.

దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తా.

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి.

(నేటి ధాత్రి)

 

 

మహ్మద్ ఖాన్ పల్లి తాండా సమస్యలు తీరుస్తానని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. మహబూబ్ నగర్ నగరపాలక పరిధిలోని మహ్మద్ ఖాన్ పల్లి తాండా 16వ వార్డులో కొలువైన శ్రీ వీర ఆంజనేయ స్వామి దేవాలయ ఆవరణలో జరిగిన ధ్వజస్థంభం ప్రతిష్టాపన మహోత్సవానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శ్రీ వీరాంజనేయ స్వామి సంపూర్ణ కటాక్షం గ్రామ ప్రజలందరి పైన ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ గ్రామంలో ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయాన్ని అందరం కలిసి అన్నివిధాలా అభివృద్ధి చేసుకుందాం అన్నారు.

MLA

 

 

దేవాలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. గ్రామ అభివృద్ధికి గ్రామ ప్రజలంతా కలిసి కట్టుగా ఉండాలని ఆయన సూచించారు. అనంతరం అర్చకులు ఎమ్మెల్యేకు వేద ఆశీర్వాదం అందించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, నాయకులు మోతిలాల్, జాజి మొగ్గ నర్సింహులు, దేవేందర్ నాయక్, అబ్దుల్ హక్, శ్రీనివాస్ యాదవ్, జోజ్య నాయక్ , డి.ఎం.నాయక్, మాజీ ఎంపిటిసి గోపి నాయక్, శరత్ చంద్ర, హన్మంతు నాయక్ , కృష్ణ, కుమార్, రవి నాయక్, శంకర్ నాయక్, గోపాల్, చర్ల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

శ్రీరామ్ మందిర్ ఆలయంలో ప్రత్యేక పూజలు.!

శ్రీరామ్ మందిర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి. 

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

శ్రీరామ్ మందిర్ ఆలయం లో శ్రీ సీతారాముల స్వామి వారికి తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం ఆలయ అర్చకులు శాలువాతో వారిని సన్మానించారు.

Temple.

ఈకార్యక్రమంలో జహీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పి.నర్సింహారెడ్డి,సత్వార్ సోసైటి చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి,అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పి.నాగిరెడ్డి,రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కార్యదర్శి హర్షవర్ధన్ రెడ్డి,డా౹౹చంద్రశేఖర్,బి.మల్లికార్జున్,శివాజీ సేన నాయకులు వంశీకృష్ణ గోడ్కే,శ్రీనివాస్ మరియు అర్చకులు,భక్తులు మరియు తదితరులు పాల్గొన్నారు. 

శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం నూతన కమిటీ ఎన్నిక.

శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం నూతన కమిటీ ఎన్నిక. 

రామడుగు, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం కేంద్రంలో నూతన హనుమాన్ సేవ కమిటీ అధ్యక్షులుగా చిలువేరి కనకయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా కడారి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా సముద్రాల రమేష్, క్యాషియర్ గా జవ్వాజి అజయ్, కమిటీ మెంబర్ లుగా బొజ్జ తిరుపతి, నీలం ప్రశాంత్, మాడిశెట్టి జయంత్, మండల లక్ష్మణ్, మూల వంశీ, పూరెల్ల రాహుల్, చిట్యాల కమలాకర్, చిట్యాల శివకుమార్, మాడిశెట్టి శ్రీసాయి, బాసరవేణి కళ్యాణ్, కీర్తి కుమార్, బొమ్మరవేణి శ్రీనివాస్ ఈరెళ్ళ అంజయ్య, బసవేణి మధు, ఒంటెల ఆదిత్య రెడ్డి, మామిడి రాజకుమార్, తదితరులను ఎన్నుకున్నారు.

శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి చైర్మన్ అప్నగారి.!

శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి చైర్మన్ అప్నగారి.శేఖర్ పాటిల్ శుభాకాంక్షలు తెలిపిన మొహమ్మద్ సుల్తాన్ సలావుద్దీన్.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

సోమవారం నాడు శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి చైర్మన్ అప్నగారి.శేఖర్ పాటిల్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఇదిలాపల్లి మైనారిటీ నాయకులు మొహమ్మద్ సుల్తాన్ సలావుద్దీన్ నాయకులు శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి టెంపుల్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయ కమిటీ ఏర్పడడంతో శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా శాలువాలతో ఘనంగా సత్కరించారు శుభాకాంక్షలు తెలిపిన నాయకులకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం.

వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం.

నర్సంపేట,నేటిధాత్రి:

 

శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకొని దుగ్గొండి మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ ఆంజనేయ దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా దేవాలయం ప్రాంగణంలో మహాగణపతి హోమాన్ని నిర్వహించారు.దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శ్రీ సీతారాముల కల్యాణ వేడుకల సందర్భంగా గ్రామంలోని పలువురి ఇండ్ల నుండి హైందవ ధర్మం, సాంప్రదాయ పద్ధతిలో సీతమ్మ రాములోరు, లక్ష్మణుడు, ఆంజనేయుని పంచలోహ విగ్రహాలను డప్పు చప్పుళ్ళు,మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుతో దేవాలయానికి తీసుకొచ్చే క్రమంలో మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు.కళ్యాణ మహోత్సవ నిర్వాహకులు కందుల కుమారస్వామి ఆధ్వర్యంలో జరిగాయి.

Wedding.

సీతారాముల కళ్యాణాన్ని పేద పండితులు గణేష్ శర్మ నిర్వహిస్తున్న క్రమంలో భక్తులు గ్రామస్తులు మహిళలు భక్తిశ్రద్ధలతో తిలకించారు. సీతమ్మతల్లికి గత 12 సంవత్సరాలుగా 1 గ్రాము బంగారం చొప్పున పుస్తెలను తాళ్ల రవీందర్ బహుకరించారు. నూనె పూర్ణచందర్ రూ.15 వేలు విరాళం అందించగా మరో రూ.5 వేలు ఉప్పునూతల పుల్లాచారి అందజేశారు. అలాగే ఆవాల రవీందర్ రెడ్డి దంపతులు బంగారాన్ని బహూకరిస్తున్నట్లు తెలిపారు.

ఘనంగా అన్నదాన కార్యక్రమం..

Wedding.

 

శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అనంతరం చంద్రయ్యపల్లి గ్రామానికి చెందిన కక్కెర్ల మమత నరేష్ గౌడ్ దంపతులు మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు టు పల్లాటి భవానికేశవరెడ్డి, ఆరేల్లి వీరేశం గౌడ్,నూనె రాములు,బొమ్మినేని సాంబారెడ్డి,బొమ్మినేని సుధాకర్ రెడ్డి, ఈర్ల నరేష్, కక్కెర్ల ఆనందం గౌడ్, కామెడీ మల్లారెడ్డి, పల్లాటి చిన్న సంజీవరెడ్డి,మాజీ ఉపసర్పంచ్ మొద్దు రాఘవులు,కందుల శ్రీనివాస్ గౌడ్,గడ్డమీద బిక్షపతి,సురేష్,ముంజ శరత్, కొమ్ముక శ్రీరామ్,ములుగు బిక్షపతి, కొమ్ముక అశోక్,కట్టయ్య, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. 

దక్షిణ కాశీగా ప్రసిద్ది చెందిన,.!

దక్షిణ కాశీగా ప్రసిద్ది చెందిన, శ్రీ కేతకి సంగమేశ్వర దేవాలయ నూతన కమిటీ చైర్మన్ గా ఎన్నికైన ఎ. చంద్రశేఖర్ పాటిల్ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న

★ జహీరాబాద్ ఎంపీ. సురేష్ కుమార్ షెట్కార్ గారు
★ మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ ఎ చంద్రశేఖర్ గారు

జహీరాబాద్. నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంగం మండల కేంద్రంలో నెలకొన్న శ్రీ కేతకి సంగమేశ్వర దేవాలయ నూతన కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ పాటిల్ గారి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని ఛైర్మెన్ మరియు కమిటీ సభ్యులు సత్కరించిన జహీరాబాద్ ఎంపీ. సురేష్ కుమార్ షెట్కార్, మరియు మాజీ మంత్రివర్యులు డాక్టర్ చంద్రశేఖర్.మరియు వారు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి ఎల్లవేళలా అండగ ఉండి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం అని పేర్కొన్నారు.

Sangameshwara Temple.

 

అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి,ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా గ్రంథయాల చైర్మన్ అంజయ్య ,మాజీ జిల్లా పరిషత్ ఛైర్మెన్ సునీతా పాటిల్ , జహీరాబాద్ నియోజకవర్గ మండలాల అధ్యక్షులు హన్మంతరావు పాటిల్, శ్రీనివాస్ రెడ్డి, భాస్కర్ రెడ్డి,రామలింగారెడ్డి, కండేం నర్సింలు ,మాక్సూద్,నర్సాసింహ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్షద్ అలీ,మాజీ ఇండస్ట్రియల్ ఛైర్మెన్ తన్వీర్, మాజీ ఎంపిపి దేవదాస్ గారు,మాజీ ఎంపిటిసిలు అశోక్ ,శంకర్ పాటిల్,వైస్ ఎంపిపి షాకిర్ , కాగ్రెస్ నాయకులు హుగ్గేలి రాములు,యువజన జిల్లా అధ్యక్షులు నరేష్ గౌడ్, మాజీ యువజన జిల్లా అధ్యక్షులు ఉదయ్ శంకర్ పాటిల్,మరియు కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు తథిదరులు పాల్గొన్నారు.

సీతారాముల కళ్యాణం కన్నుల నిండుగా వైభోగం.

సీతారాముల కళ్యాణం కన్నుల నిండుగా వైభోగం.

* కమనీయ కన్నుల రమణీయ సీతమ్మ తల్లి రామయ్య తండ్రి వరియించిన అపురూప దృశ్యం.

మరిపెడ/కురవి నేటిధాత్రి.

 

 

మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని నల్లెల్ల గ్రామపంచాయతీలో కురవి మండల కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు అంబటి వీరభద్ర గౌడ్ శకుంతల, బండి ఉప్పలయ్య గౌడ్ ఉమా దంపతుల ఆధ్వర్యంలో సీతారాములవారి కల్యాణం వైభవంగా నిర్వహించడం జరిగింది, ప్రతి గ్రామంలో అత్యంత వైభవంగా ప్రతి ఏటా నిర్వహించే వివాహ వేడుక సీతారాముల వివాహ వేడుక అని, సీతారాముల జంట ఎంతోమందికి ఆదర్శం అని, ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ, ఒకరి మాటకు ఒకరు వింటూ, ఆది దంపతులుగా ప్రజలందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన దంపతులు సీతారాములు అని, ఆ తల్లిదండ్రుల ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని కాంక్షిస్తూ, ప్రతి ఒక్కరు సుఖః సంతోషాలతో వర్ధిల్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్న అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బండి మల్లయ్య గౌడ్,గౌడ సంఘం అధ్యక్షుడు బండి సుధాకర్ గౌడ్, బండి సైదులు,మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆవుల కందయ్య,మంద వీరన్న,తోట నారాయణ,బండి సైదులు తదితరులు పాల్గొన్నారు.

అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం.

కన్నుల వింపుగా అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం.

శ్రీ ఉమామహేశ్వర ఆలయ కమిటీ అధ్యక్షులు ఆకుల సుభాష్ ముదిరాజ్

నేటి దాత్రి….

 

గణపురం మండలం ధర్మరావుపేట గ్రామంలో శివాలయం ఆదివారం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీరామనవమి వేడుకల సందర్భంగ శివాలయం కళ్యాణ మంటపంలో ఆదివారం ఉదయం 10:30 గంటలకు పుష్యమి నక్షత్రం మిథున లగ్నంలో పచ్చని పందిల్లో వరుడు వైపు ఆకుల సుభాష్ కుటుంబం నిలువగా వధువు కుటుంబంగా కన్న రాజన్న కుటుంబం ప్రతి సంవత్సరం అనవయితీగా వస్తుంది శివాలయం ఆలయ అర్చకులు లంక రాజేశ్వరరావు శర్మ ఆధ్వర్యంలో ఆలయ అర్చకుల వేదమంత్రోచ్ఛారణల మధ్య శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు.

Wedding.

 

సీతారాముల కళ్యాణ మహోత్సవం తిలకించేందుకు గ్రామస్తులు, , వివిధ గ్రామాల నుంచి,భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణమంతా రామనామ స్మరణంతో మార్మోగింది. సీతారాముల కళ్యాణ వేడుకను కనులారా వీక్షించి భక్తులు తన్మయత్వం పొందారు. ఈ కార్యక్రమం శ్రీ ఉమామహేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా సాయంకాలం పుర విధుల్లో ఊరేగింపు కార్యక్రమం కోలాటలతో భక్తి పాటలతో వైభోపెతంగా జరిగింది

సీతారాములవారి కల్యాణ మహోత్సవం.

నస్పూర్ గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాములవారి కల్యాణ మహోత్సవం
ముఖ్య అతిథులుగా లోపాల్గొన్న మంచిర్యాల డిసీపి భాస్కర్ మంచిర్యాల రూరల్ సి ఐ అశోక్ కుమార్

నస్పూర్ నేటిదాత్రి

 

నస్పూర్ గ్రామంలోని అతి పురాతనమైన శ్రీ సీతారామాలయంలో సీతారాముల వారి కళ్యాణం అత్యంత వైగోపేతంగా కన్నుల పండుగా జరిగినది ఈ సందర్భంగా గ్రామ నాయకులు ప్రజలు ఆలయ కమిటీ ఆలయ అర్చకుల సమక్షంలో సీతారాములవారి కల్యాణం జరిపించడం జరిగినది సకలజనులు శ్రీరామచంద్రమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొంది సుఖసంతోషాలతో వర్ధిల్లాలని వేదపండితులు దేవరాజు రంజిత్ శర్మ మంత్రోచ్ఛారణతో ప్రజలను ఆ శ్రీరామచంద్రుడు ఆశీర్వదించే విధంగా మంత్ర వేదాలతో గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉండాలని రాములవారి కళ్యాణాన్ని జరిపించారు

DCP Bhaskar

అదేవిధంగా శ్రీరామచంద్ర మూర్తి వారి యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ తల్లిదండ్రుల పట్ల రాములవారు ఎంతటి విధేయత కలిగి ఉండేవారో వివరించారూ భక్తులందరూ శ్రీరాముని తల్లిదండ్రులను గౌరవించాలని ఆకాంక్షించారు కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా మంచిర్యాల డిసిపి భాస్కర్ మంచిర్యాల రూరల్ సిఐ అశోక్ కుమార్ మరియు ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు సీతారాముల కళ్యాణానంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుపబడినది ఇట్టి కార్యక్రమాన్ని రా చకొండ కృష్ణారావు అండ్ బ్రదర్స్ నిర్వహించినారు ఆలయ కమిటీ సభ్యులు రాచకొండ గోపాలరావు రాచకొండ వెంకటేశ్వరరావు (బుజ్జన్న) మార్కెట్ కమిటీ డైరెక్టర్ దొనపల్లి లింగయ్య ఇరికిల్ల పురుషోత్తం గడ్డం సత్యా గౌడ్ కోయిల వెంకటేష్ గరిసె రామస్వామి భీమయ్య సందీప్ బండం గోపాల్ కుందరపు రమేష్ కొయ్యలరమేష్ సిరిపురం శ్రీనివాస్ కిష్టయ్య కమిటీ సభ్యులు పాల్గొన్నారు పాల్గొన్నారు

కేతకీ సంగమేశ్వర దేవస్థానం చైర్మన్ గా అప్నగారి.

కేతకీ సంగమేశ్వర దేవస్థానం చైర్మన్ గా అప్నగారి.శేఖర్ పాటిల్

◆ కేతకీ సంగమేశ్వర దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా నూతన చైర్మన్ & పాలక మండలి సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం గ్రా౹౹ & మం౹౹ శ్రీ కేతకీ సంగమేశ్వర దేవస్థానం ఆలయంలో సోమవారం రోజున శ్రీ.సంగమేశ్వర స్వామి వారికి తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారికీ పాలభి శేకం నిర్వహించారు.ముందుగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు.అనంతరం శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి దేవస్థానం నూతన పాలక మండలి చైర్మన్.అప్నగారి.

Temple

 

శేఖర్ పాటిల్ మరియు కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా చైర్మన్ మరియు కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర సెట్విన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి .ఈకార్యక్రమంలో ఝరాసంగం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హన్మంత్ రావు పాటిల్,జహీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పి.నర్సింహారెడ్డి,మాజీ మున్సిపల్ చైర్మన్ మంకాల్ సుభాష్ గారు,సత్వార్ సోసైటి చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి,అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పి.నాగిరెడ్డి,జిల్లా యూత్ మాజీ అధ్యక్షుడు ఉదయ్ శంకర్ పాటిల్,రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కార్యదర్శి హర్షవర్ధన్ రెడ్డి,బి.మల్లికార్జున్ మరియు ఝరాసంఘం మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,ఆలయం ఈవో&అర్చకులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఆలయపున నిర్మాణానికి రంగాచార్యులు.!

ఆలయపున నిర్మాణానికి రంగాచార్యులు లక్ష 16 వేల విరాళం.

చిట్యాల, నేటిధాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నవాబుపేట గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శివాలయానికి లక్షణాచార్యులు (మూకయ్య) గారి చిన్న కుమారుడు రంగాచార్యులు శివాలయానికి విరాళంగా 116000/- రూపాయలు అక్షరాల (ఒక లక్ష పదహారు వేల రూపాయలు) ఇవ్వడం జరిగింది… ఈ కార్యక్రమం లో శివాలయ కమిటీ సభ్యులు ఆలయ కమిటీ అధ్యక్షులు కసిరెడ్డి రత్నాకర్ రెడ్డి,ఉపాధ్యక్షులు మోతుకూరి నరేష్,బిళ్ళ సత్యనారాయణ రెడ్డి, మందల రాఘవరెడ్డి,కాల్వ సమ్మిరెడ్డి,బొమ్మ శంకర్, కొక్కుల సారంగం, మోతుకూరి రాజు,చెక్క నర్సయ్య,సర్వ శరత్, తీగల నాగరాజు,అనగాని రాజయ్య,తిప్పణవేణి రవి, ప్రధాన అర్చకులు రఘునందన్ తదితరులు పాల్గొన్నారు.

ముత్యాల తలంబ్రాలను సమర్పించిన.!

ముత్యాల తలంబ్రాలను సమర్పించిన మాజీ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ ఆర్సీ జీవెలర్స్ అధినేత కలకొండ రమేష్ చంద్ర. 

వనపర్తి నేటిదాత్రి :

 

వనపర్తి లో సీతారాముల కళ్యాణం సందర్భంగా వనపర్తి పట్టణం లోని అన్ని దేవాలయాలకు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ ఆర్యవైశ్య సంగం మాజీ రాష్ట్ర రాజకీయ కార్యదర్శి మాజీఎంపీ రావు ల చంద్రశేఖర్ రెడ్డి శిష్యులు కలకొండ రమేష్ చంద్ర ముత్యాల తలంబ్రాలు సమర్పించారు . రామాలయం వెంకటేశ్వర దేవాలయం బాలాంజనేయ కన్యకపర్మేశ్వరి దేవాలయం నాగవరం మర్రికుంట పీర్లగుట్ట రాంనగర్ కాలనీ రాజానగరం జగత్పల్లి అచ్యుతాపురం దేవాలయాల్లో ముత్యాల తలంబ్రాలు అందచేశారు ఈ కార్యక్రమం లో
ఉంగ్లం తిరుమల్ ఆవుల రమేష్ మారం బాలీశ్వరయ్య విశ్వనాథం కలకొండ అనంతమ్మ జగదీష్తదితరులు పోల్గొన్నారు

ఝరాసంగం సంగమేశ్వరుడికి వారోత్సవ పూజలు.

ఝరాసంగం సంగమేశ్వరుడికి వారోత్సవ పూజలు.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల కేంద్రములోని శ్రీ కేతకీ ఉమా సంగమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం విశేష పూజలను నిర్వహించారు. వారోత్సవ పూజల సందర్భంగా లింగ రూపంలో కొలువైన శివ మహాదేవునికి అభిషేకాలు, అలంకరణ గావించి కర్పూర హారతులతో మంగళ నీరాజనాలను సమర్పించారు. స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వేకువజామునుండే భక్తులు బారులు తీరారు.

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో.!

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో సీతారాముల కళ్యాణం
వనపర్తి నేటిదాత్రి :

వనపర్తి పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు . కళ్యాణోత్సవంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం కన్వీనర్ పూరి బాలరాజ్ శెట్టి దంపతులు వాసవి క్లబ్ వనపర్తి పట్టణ అధ్యక్షులు చిగుళ్ల పల్లి శ్రీనివాలు వనిత క్లబ్ అధ్యక్షురాలు సువర్ణ కె బుచ్చయ్య దంపతులు కూర్చున్నారు ఆలయ పూజారి చంద్రశేఖర్ శర్మ కళ్యాణోత్సవం ప్రత్యేక పూజలు చేయించారు అనంతరం పట్టణ ఆర్యవైశ్యులకు అన్నదానం ఏర్పాటు చేశారు వనపర్తి ఆర్యవైశ్య సంగం మాజీ అధ్యక్షులు ఆకుతోట దేవరాజ్ లగిశేట్టి అశోక్ లగిశెట్టి రమేష్ లింగం హరినాథ్ పట్టణ బీజేపీ మాజీ అధ్యక్షుడు బచ్చురాం కాంగ్రెస్ పార్టీ నేత చుక్కయ్య శెట్టి న్యాయవాది బాస్కర్ వజ్రాల సాయిబాబా వై వెంకటేష్ కొండ విశ్వనాథం పూరిరిసురేష్ యువజన సంఘం అధ్యక్షులు బచ్చు వెంకటేష్ అమరవాది నరేందర్ ప్రధాన కార్యదర్శి కల్వ బూపేష్.కుమార్ శెట్టి కొండ ప్రశాంత్ ఆర్యవైశ్యులు బచ్చురాం ఎలిశెట్టి వెంకటేష్ వజ్రాల సాయిబాబా మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీమతి కలకొండ భాగ్యలక్ష్మి ప్రధాన కార్యదర్శి శ్రీమతి అనoత ఉమావతి కొండూరు మంజుల ప్రవీణ్ పిన్నo వసంత సహాయనిధి వైస్ చైర్మన్ శ్రీమతి కొండూరు మంజుల పురుషోత్తం పట్టణ ఆర్యవైశ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈసందర్భంగా వాసవి క్లబ్ తరుపున సీతారాముల కళ్యాణం సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించామని వాసవి క్లబ్ అధ్యక్షులు ఉపాధ్యాయులు శ్రీనివాసులు ఒకప్రకటనలో తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version