ఝరాసంగం పంచాయతీ కార్యాలయంలో ఘనంగా బాబు జగజ్జీవన్ రామ్ జయంతి..
జహీరాబాద్. నేటి ధాత్రి:
భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రాం 117వ జయంతి వేడుకలు ఝరాసంగం మండల కేంద్రమైన గ్రామపంచాయతీలో ఘనంగా జరిగాయి. ప్రముఖులు ఆయన చిత్రపటాన్ని స్పెషల్ ఆఫీసర్ హర్షవర్ధన్ రెడ్డి గ్రామ కార్యదర్శి వీరన్న పటేల్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గొప్ప రాజకీయ వేత్తగా సామాజిక సమానత్వం కోసం జీవిత కాలం పోరాడారని పలువురు నాయకులు కొనియాడారు. అనేక పదవులను చేపట్టి తనదైన ముద్రను వేశారని వెల్లడించారు. జగ్జీవన్‌రాం జీవిత పర్యంతం బడుగు వర్గాల అభ్యున్నతికై కృషి చేశారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇస్మాయిల్ సాబ్ సంగమేశ్వర్ నర్సింలు మోహన్ ఏ వన్ మరియు తదితరలు పాల్గొన్నారు.
శ్రీ సీతారామ కల్యాణం పురస్కరించుకని మంచిర్యాల జిల్లా మందమర్రి పంచముఖి హనుమాన్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి అట్టహాసంగా శోభాయాత్ర నిర్వహించారు. దేవతామూర్తుల ఉత్సవ విగ్రహాలు ప్రత్యేక వాహనంపై ఉంచి సింగరేణి కార్మికవాడల మీదుగా శోభాయాత్ర సాగింది. భక్తిపాటలపై హనుమాన్ దీక్ష స్వాములు నృత్యాలు చేస్తూ స్థానిక ఆలయం నుంచి మార్కెట్ మీదుగా ర్యాలీ సాగింది. అంతకు ముందు పూజారులు కృష్ణకాంతాచార్యులు, శ్రీకాంతాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
జహీరాబాద్ లో మహిళను హత్య చేసిన నిందితుడు పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్లో పత్రిక ప్రకటన లో డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి వివరాలు వెల్లడించారు. సత్యారం రమేశ్ అనే వ్యక్తి చిలమామిడి గ్రామానికి చెందిన మ్యాతరి లక్ష్మితో సహజీవనంచేస్తున్నాడు. అయితే, అతని ప్రవర్తన సరిగ్గా లేకపోవడంతో లక్ష్మి అతనికి దూరమైంది. కోపోద్రిక్తుడైన రమేశ్, తొలుత ఆమెపై పెట్రోల్ పోసి దాడి చేయడానికి ప్రయత్నించగా, స్థానికుల కారణంగా అది విఫలమైంది. తర్వాత, ఆమె ఇంటికి వెళ్లి గొడవ పెట్టుకొని, ఖాళీ గ్యాస్ సిలిండర్తో తలపై కొట్టి ఆమెను హత్య చేశాడు. అనంతరం మృతురాలి సెల్ఫోన్ తీసుకొని అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. జహీరాబాద్ బస్టాండ్ వద్ద హైదరాబాద్కు పారిపోడానికి ప్రయత్నిస్తుండగా, పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ నిందితుడిని త్వరగా పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని, సమర్థవంతంగా చర్యలు తీసుకుని అతడిని అరెస్ట్ చేసి న్యాయమూర్తి ముందు హాజరుపరిచామని తెలిపారు. ఈ ఆపరేషన్ పాల్గొన్న పోలీసు అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ శివలింగం, ఎస్పై కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు.
మందమర్రి మండలం వ్యవసాయ శాఖ రెవెన్యూ శాఖ మరియు పోలీస్ శాఖ వారు ఆధ్వర్యంలో సారంగపల్లి గ్రామ పంచాయతీలో కార్యాలయంలో రైతు లతో నిషేధిత గ్లసిల్ పత్తి విత్తనాల వినియోగం నిషేధిత గ్లోపోనేటు వినియోగం వల్ల కలుగు నష్టాలపై అవగాహన ఈ కార్యక్రమం పోలీసు వారు మరియు రెవెన్యూశాఖ వ్యవసాయ శాఖ నిర్వహించిన ప్రజలకు అవగాహన సదస్సు ర్యాలీ నిర్వహించరు ఈ కార్యక్రమం లో వ్యవసాయ శాఖ ఏవో కిరణ్మయి ఏ ఈ ఓ తిరుపతి మండల ప్రజా పరిషత్ ఆఫీసర్ రాజేశ్వర్ పంచాయతీ కార్యదర్శి సవ్య పోలీస్ శాఖ మందమర్రి ఎస్సై రాజశేఖర్ ఏ.స్ఐ మజీద్ ఖాన్ పోలీస్ సిబ్బంది మాజీ సర్పంచ్ పాల్గొన్నారు
హన్మకొండ జిల్లా పరకాల పట్టణ బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా పెండెల భద్రయ్య ఎన్నికయ్యారు.ఉపాధ్యక్షునిగా కూకట్ల శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శిగా,మేకల శ్రవణ్ కుమార్,జాయింట్ సెక్రెటరీ గా దొగ్గేల రమేష్,ఆర్గనైసింగ్ సెక్రటరీ గా ఎండి.సబీర్, ట్రేసరర్ గా రాహుల్ విక్రమ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా గుర్రం ప్రవీణ్ లు ఎన్నికైనట్లుగా ఎన్నికల అధికారి పెద్దబోయిన వేణు ప్రకటించారు.
ప్రశ్నించే వారిపై దాడి కొరకు ప్రైవేటు వ్యక్తులకు ఏర్పాటు చేసిన యజమాన్యం.
మహదేవపూర్- నేటి ధాత్రి:
బొమ్మపూర్ ఎలికేశ్వరం పేరుతో నిర్వహిస్తున్న రెండు ఇసుక వారిలో అక్రమ ఇసుక రవాణా నేటికీ ఆగలేదు, టి ఎస్ ఎం డి సి ఉన్నత అధికారులు సందర్శించిన లెక్క చేయకుండా,బొమ్మ పూర్ ఎల్కేశ్వరం క్వారీలు ఇసుక అక్రమ రవాణా, అడ్డగోలు వసూళ్ల పర్వాన్ని దర్జాగా కొనసాగిస్తున్నాయి, ప్రస్తుతం ఇసుక క్వారీ వద్ద లోడింగ్ కొరకు 200 రూపాయలు, టిఎస్ఎండిసి, సీరియల్ తో పాటు బేబీ వద్ద రెండు వందల రూపాయలు, వసూలు చేయడం జరుగుతుంది. ఇసుక అక్రమ విషయంలో లోడింగ్ అనంతరం ఎలాంటి కాంటా పైనుండి లారీలు తీసుకువెళ్తే సరిపోతుంది. లారీలో ఎంత ఇసుక లోడింగ్ చేశారు అవసరం లేదు, వి బిల్ 200 ఇస్తే సరిపోతుంది. ప్రస్తుతం ఎలికేశ్వరం బొమ్మపూర్ 2 క్వారీల వద్ద టీఎస్ ఎంబీసీ తోపాటు క్వారీ యజమాన్యం సూపర్వైజర్లు లారీ వద్ద నుండి 6 నుండి 800 రూపాయల వరకు, వసూలు చేయడం జరుగుతుంది, మరోవైపు అదనపు బకెట్ అక్రమ ఇసుక రవాణా, పెద్ద మొత్తంలో కొనసాగడం జరుగుతుందని స్పష్టమవుతుంది.
తాజాగా ఇసుక క్వారీల యజమాన్యం, బయటి వ్యక్తులకు ప్రశ్నించకుండా ప్రైవేట్ వ్యక్తులను దాడుల కొరకు ఏర్పాటు చేశారు, లోడింగ్ వద్ద టీఎస్ఎండిసి అధికారులు ఎవరూ లేకుండా లారీల్లో ఇసుక లోడింగ్ ప్రక్రియను కొనసాగించడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ రెండు ఇసుక క్వారీల్లో, లోడింగ్ నుండి మొదలుకొని ఎక్కడ చూసినా, నోట్ల కట్టలు దర్శనమిస్తున్నాయి. సుమారు ప్రతిరోజు ఈ రెండు ఇసుక క్వారీలకు 220నుండి 250 వరకు ఇసుక లారీలు ఇసుక నింపుకొనుటకు పెద్ద మొత్తంలో రావడంతో, అక్రమ వసూళ్లు ,అక్రమ ఇసుక రవాణాకు, బొమ్మపూర్, ఎలేకేశ్వరం, పేరుతో నిర్వహించబడుతున్న ఈ రెండు ఇసుక క్వారీలు పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకుంటుంది.టీఎస్ఎండిసి అధికారి ఈ రెండు ఇసుక క్వారీల పై కన్నెత్తి చూడకపోవడం, టీఎస్ఎండిసి మేనేజింగ్ డైరెక్టర్ తోపాటు ప్రిన్సిపల్ సెక్రటరీ, ప్రభుత్వ ఆదేశాలు డొంట్ కేర్ అంటూ యజమాన్యం అక్రమ దందాను మూడు పూలు ఆరు కాయలుగా కొనసాగిస్తుంది.
`సిఎం. రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటిల అభిప్రాయమే ఫైనల్
`రోజుకో వార్తతో ఆశావహుల లీకులు
`డీల్లీలో పెద్ద ఎత్తున పైరవీల ప్రయత్నాలు
`అధిష్టానం ఇంత వరకు ఎవరికీ అప్పాయింట్ ఇవ్వలేదు
`నాయకుల బెదిరింపులన్నీ ఉత్తమాటలే
`అధికార పార్టీకి రాజీనామా చేసేంత ధైర్యం ఎవరూ చేయలేరులే!
`ఇప్పటికే పదవులున్న కుటుంబాలకు చోటు దక్కదు
`పార్టీ గెలుపుకు పని చేసిన వారికే గుర్తింపు
`సిఎం. రేవంత్ అభిప్రాయమే ఫైనల్
`అధిష్టానం పూర్తిగా రేవంత్ నిర్ణయాలకే విలువ
`నాలుగు మంత్రులు కాదు..ఆరుగురి ప్రమాణం కోసమే వాయిదా
`విజయశాంతికి మంత్రి వర్గంలో చోటు
`తెలంగాణ ఇచ్చిన వెంటనే పార్టీలో చేరిన తొలి నాయకురాలు
`తెలంగాణ కోసం పార్టీ పెట్టి కొట్లాడిన ఏకైక నాయకురాలు
`ఇప్పటికైనా ఆమె సేవలు వినియోగించుకోవాలని నిర్ణయం
`నల్గొండ జిల్లా నుంచి ఒకరికి అవకాశం
`రెడ్డి సామాజిక వర్గానికి మాత్రం కాదు
`వెంకట స్వామి కుటుంబానికి ఇవ్వడం కుదరదు!
`అధిష్టానం ఆశీస్సులు, రేవంత్ రెడ్డి మెప్పులు వున్న వారికే పదవులు
`జాప్యానికి ప్రత్యేక కారణమేమీ లేదు
`మంత్రుల తొలగింపు ప్రస్తావనే లేదు
`శాఖల మార్పులకు ఆస్కారమే లేదు
హైదరాబాద్,నేటిధాత్రి: తన రాజకీయాన్ని తనే బైటేసుకోవడంలో కాంగ్రెస్‌ను మించిన పార్టీ మరొకటి వుండదు. కాంగ్రెస్‌పార్టీ అంటేనే గ్రూపు రాజకీయాలు. అయితే గతంలో గ్రూపుల మాటలు, చెప్పే చాడీలు బాగా చెల్లేవి. కాని కొన్ని సంవత్సరాలుగా ఆ చెప్పుడు మాటలకు పెద్దగా విలువ వుండడం లేదు. అయినా కాంగ్రెస్ నాయకుల తీరు మారడం లేదు. ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఎన్ని రకాల మాటలు మాట్లాడినా పార్టీ అధిష్టానం ముందు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి మాటలకు వుండే విలువ వేరు. ఈ సంగతి తెలిసినాకొంత మంది సీనియర్లు తమ పూర్వపు అలవాటును మానుకోవడం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్‌లోకి రేవంత్‌రెడ్డి రాకముందు ఒకలెక్క. రేవంత్ రెడ్డి పిసిసి. అయిన తర్వాత ఒక లెక్క. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో సిఎం. రేవంత్‌రెడ్డి మాటకు వున్న విలువ మరొకరికి వుండదు. కాని తమ మాట చెల్లుతున్నట్లుగా, తమకు అదిష్టానం వద్ద అందరికంటే విలువెక్కువ అనిచెప్పుకోవడంలో చాలా మంది సీనియర్ ముందున్నారు. వారి మాటలకు ఎక్కడా విలువ లేదని తెలుసు. అయినా రాజకీయాల్లో వెనుకబడ్డామన్న నిజాన్ని వారు ఒప్పుకోలేరు. పైగా పార్టీని అదికారంలోకి తీసుకురావడం వారి వల్ల కాలేదన్నది కూడా సత్యం. అయినా తమకు ప్రాదాన్యత కోసం పాకులాడడం వారు మానుకోవడం లేదు. ప్రతి దానిలోనూ పుల్లలు పెట్టడం ఆపడంలేదు. ప్రత్యర్ధి పార్టీల మీద వారి ప్రతాపం కనిపించదు. బిఆర్‌ఎస్ మీద ఆరోపణలు చేయడానికి ధైర్యం చాలదు. బిజేపి మీద నోరు పారేసుకునేందుకు ధైర్యం చేయలేరు. కాని సొంత పార్టీ మీద మాత్రం లేనిపోని లీకులిచ్చి, పార్టీ పరువు తీయడం మాత్రం చాలా మందికి తెలుసు. అందుకే వారిని పార్టీ అదిష్టానం ఏనాడో పక్కన పెట్టింది. కాకపోతే రాజకీయ పార్టీలలో మంచిచెడు రెండూ వుంటాయి. పార్టీని పట్టుకొని వేళాడుతూనే, మరో పక్క పార్టీని ముంచే నాయకత్వం చేస్తూ వుండేవారు వుంటారు. వారిని పార్టీలు పక్కన పెట్టలేవు. అలాగని వారిని నెత్తిమీద పెట్టుకొని ఊరేగలేవు. వారికి అపరిమితమైన ప్రాదాన్యత ఇవ్వవు. అలాంటి నాయకులు కాంగ్రెస్‌లో చాలా మంది వున్నారు. ఏదైనా పార్టీకి మంచి పేరొస్తే మాత్రం మా వల్లనే అని ప్రచారం చేసుకుంటారు. ఏదైనా తేడా జరిగితే అంతా సిఎం. మీదనే తోసేందుకు కూడా వెనుకాడరు. అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అనే పదాన్ని ముందు పెట్టి రాజకీయం చేస్తుంటారు. ఎందుకంటే రాష్ట్రంలో అనేక రకాల సమస్యలున్నాయి. వాటి మీద ఏ ఒక్కరూ మాట్లాడరు. ప్రతిపక్షాలకు ధీటైన సమాధానమివ్వరు. కాని సొంత పార్టీలే బాజరుకీడుస్తుంటారు. ఇటీవల జరిగిన కొన్నిమంచి విషయాలు యువ వికాసం పేరుతో యువతకు ఎంతో మేలు చేసే మంచిపనికి శ్రీకారం చుట్టారు. కాని ఆ పధకంపై విసృతమైన ప్రచారానికి ఏ ఒక్క నాయకుడికి మాటలు రావు. దేశంలో ఎక్కడా లేని సన్నబియ్యం పధకం అమలుపై ఏ ఒక్క నాయకుడు నోరెత్తదు. బిజేపి చేస్తున్న ఆరోపణలపై ఒక్కరూ స్పందించరు. ఎందుకంటే బిజేపి రాష్ట్రానికి ఇచ్చే రేషన్ కేవలం 37 లక్షల కుటుంబాలకు మాత్రమే. కాని రాష్ట్ర ప్రభుత్వం సుమారు కోటికిపైగా కుటుంబాలకు ఇస్తున్నారు. అదికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో 98లక్షలకు పైగా రేషన్‌కార్డులున్నాయి. వాటితోపాటు ఇటీవల రేషన్‌కార్డుల కోసం ధరఖాస్తులు చేసుకున్న వారికి కూడా ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నారు. కాని ఈ విషయాన్ని కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేసుకోలేకపోతున్నారు. రేషన్ బియ్యం మొత్తం బిజేపి కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందని బిజేపి ప్రచారం చేసుకుంటోంది. రేషన్ దుఖాణాలలో బిజేపి నాయకులు బియ్యం పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మీడియాకు వార్తలిస్తున్నారు. మరి కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తున్నారు? అన్న ప్రశ్నకు ఎవరు సమాదానం చెబతారు. ఇదే తీరులో రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణపై అనేక రకాల కధనాలు వస్తున్నాయి. రోజుకో రకమైన వార్త వస్తుంది. ప్రతి మీడియా తమకు తోచిన విధంగా వార్తలు రాస్తోంది. అందుకు కారణం ఎవరో కాదు..సాక్ష్యాత్తు కాంగ్రెస్ నాయకులే అని చెప్పకతప్పదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట చెల్లడం లేదని, ఆయన సూచించిన లిస్టులను అధిష్టానం ఫైనల్ చేయడం లేదని అని లీకులిస్తారు. వార్తలు రాయిస్తుంటారు. దాని వల్ల పార్టీ పరువు పోతుందన్న ఆలోచన ఒక్క క్షణంకూడా చేయరు. కాని అలాంటి వార్తలు వస్తే మాత్రం తమలో తాము సంతోషపడుతుంటారు. అలాంటి ఇటీవల ఎక్కువయ్యారు. నాయకులు మాత్రం ఎవరన్నది అందరికీ తెలుసు. ఏది ఏమైనా పార్టీ అదిష్టానం వద్ద సిఎం. రేవంత్‌రెడ్డి,రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిల మాటలే చెల్లుబాటౌతున్నాయి. వారు సూచించిన వారికే మంత్రి పదవులు రానున్నాయి. నిజానికి ఆరు మంత్రి పదవులు పెండిరగ్‌లో వున్నాయి. అవన్నీ భర్తీ చేసే కార్యక్రమమే జరుగుతోంది. పైగా ఇతర పదువులు పంపకాలపై పూర్తి స్దాయిలో కసరత్తులు జరుగుతున్నాయి. అంతే కాని లిస్టు ఆగిపోలేదు. నిర్ణయాలు ఎక్కడా ఆగలేదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయాలపై పెద్దలు అభ్యంతరం చెప్పింది లేదు. అంటే కొంత మంది నాయకులు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే అంతా బాగుందంటారు. లేకుంటే అంత ఇబ్బందికరమైన వాతావరణం వుందని లేనిపోని వార్తలు సృష్టిస్తుంటారు. అసలు మంత్రి వర్గ విస్తరణలో కొర్రీలుపెడుతున్నది కొ ంత మంది నాయకులే. ఎవరికి తోచిననట్లు వారు లీకులు ఇస్తున్నారు. కాని అధిష్టానం ఆలోచనలు మాత్రం ఎవరూ చెప్పరు. చెబితే వారికి వున్న ప్రాదాన్యత ఏమిటో అందరికీ తెలిసిపోతుంది. మంత్రి వర్గ విస్తరణలో ఎమ్మెల్సీ విజయశాంతికిచోటు కల్పించాలని అదిష్టానం అనుకుంటోంది. అందుకు సిఎం. కూడా సానుకూలంగానే స్పందించారు. కాని కొంత మంది నాయకులు లేనిపోని వార్తలు రాయిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన వారిలో మొదటివరసలో ఎమ్మెల్సీ విజయశాంతి వున్నారు. ఎందుకంటే ఆమె తన సినీ కెరీన్‌ను కూడా కాదనుకొని, తెలంగాణ ఉద్యమంలోకి వచ్చారు. 2005లో ఏకంగా తల్లి తెలంగాణ అనే రాజకీయపార్టీని స్దాపించారు. తెలంగాణ కోసం ఎంతో కష్టపడ్డారు. అప్పటి ఉద్యమ కారుల సూచనల మేరకు పార్టీని బిఆర్‌ఎస్‌లో విలీనం చేశారు. తొమ్మిదేళ్లపాటు అలుపెరగని పోరాటం చేశారు. ఇటు క్షేత్రస్దాయిలో జనంతో కలిసి ఉద్యమం చేశారు. మరో వైపు పార్లమెంటు సభ్యురాలిగా సభలో ఒంటరిపోరాటంచేశారు. తెలంగాణ ఇచ్చినందుకు కృతజ్ఞతగా 2014లో కాంగ్రెస్‌పార్టీలో చేరారు. తన చిత్తశుద్దిని నిరూపించుకున్నారు. కాకపోతే అంత పెద్ద నాయకురాలిని కొంత కాలం కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పట్టించుకోవడం మానుకున్నారు. నిజం చెప్పాలంటే పెత్తనం చేసిన ఏ నాయకుడు తెలంగాణ కోసం పోరాటంచేసిన వాళ్లు కాదు. విజయశాంతిలాగా తెలంగాణ ఉద్యమం చేసిన ఒక్క నాయకుడు లేడు. దాంతో ఆమె కొంత మనస్తాపానికి గురైంది. పార్టీని వీడిరది. కాని ఆమెకు కాంగ్రెస్ మీద వున్న మమకారం తగ్గలేదు. అందుకే పార్టీని వీడినా వెళ్లిపోయినా, మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరుకున్నది. గత ఎన్నికల్లోకాంగ్రెస్ పార్టీ కోసం విసృత ప్రచారం సాగించింది. తెలంగాణ ఉద్యమం కోసం అప్పట్లో అనేక త్యాగాలు చేసింది. ఇప్పుడు పార్టీ గెలుపుకోసం పనిచేసింది. కాని పదవులు ఆశించలేదు. అందుకే పార్టీ అదిష్టానం విజయశాంతి అంకితభావాన్ని గుర్తించి ఎమ్మెల్సీ ఇచ్చారు. మంత్రిని చేయాలన్న ఆలోచన చేస్తున్నారు. ఆమెకు మంత్రి పదవి ఇస్తే తమకు కుటుంబంలో మరో మంత్రి పదవి కావాలనుకుంటున్న కొంత మంది నాయకులకు ఇబ్బంది ఎదురౌతుంది. అందుకే గతంలో కూడా వారి కుటుంబాల కోసమే విజయశాంతిని దూరం పెట్టారు. ఆమెకు ప్రాదాన్యత లేకుండా చేశారు. కాని సిఎం.రేవంత్ రెడ్డి అధిష్టానం మాటలను జవదాటే నాయకుడుకాదు. అందుకే విజయ శాంతికి మంత్రి పదవి ఇచ్చేందుకు సై అంటున్నారు. ఇది కొంత మందికి గిట్టడం లేదు. అందుకే కొత్తగా రంగారెడ్డి,హైదరాబాద్ జిల్లాలకు ప్రాదాన్యత కల్పించాలనికొత్త రాగం అందుకున్నారు. మరి కొంత మంది నాయకులు తమ కుటుంబాలలో మరొకరికి మంత్రి పదవి కావాలంటూ మూడు కుటుంబాలు రాజకీయం చేస్తున్నాయి. ఇలా ఎవరికి రాజకీయం వారు చేసుకుంటూ పార్టీలో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అయినా సిఎం. రేవంత్‌రెడ్డి సూచనల మేరకే మంత్రి వర్గ విస్తరణ జరగుతుందన్న సత్యం వారికి తెలుసు. అందరికీ తెలుసు. అయినా ఆశ..ఎక్కడో చిరు ఆశ..అడగందే అమ్మైనా అన్నం పెట్టదు. బెట్టు చేయందే తండ్రి రూపాయి ఇవ్వడు. ఇదే ఇప్పుడు కొంతమంది సీనియర్లు చేస్తున్నారు. మంత్రి పదవుల కోసం రాజకీయాన్ని శృతిమించేలా చేస్తున్నారు.
హనుమకొండ జిల్లా పరకాల మండలంలోని మల్లక్కపేట గ్రామంలో గల 6వ తేదీన మధ్యాహ్నం 12గంటల 15నిమిషాలకు శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానం లో సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుపబడునని స్వామివారి కల్యాణ అనంతరం ఆలయం వద్ద మహానదన కార్యక్రమం నిర్వహించబడునని పరకాల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి
Sita Rama.
ఆశీర్వాదాన్ని పొందాలని ఆలయ చైర్మన్ అంబీర్ మహేందర్,కార్య నిర్వహణ అధికారి వెంకటయ్య,ధర్మకర్తల మండలి సభ్యులు దొమ్మటి శంకరయ్య,రాంప్రసాద్, రాజిరెడ్డి,చెలిమల్ల రాజిరెడ్డి,దావజ్యోతి,నిట్టి బాలరాజు,ఆలయ ప్రధాన అర్చకులు కాటూరి జగన్నాథచార్యులు కోరారు.
2013లో సవరణ చట్టం తేకపోతే ప్రస్తుత చట్టం అవసరం వుండేది కాదు: అమిత్ షా
విపక్షాల దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టిన బీజేపీ మంత్రులు, నాయకులు
సభకు రాని రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ
విదేశ పర్యటనలో ప్రధాని నరేంద్రమోదీ
అయినా బిల్లుకు ఆమోదం
ప్రభుత్వానికి మోదం, విపక్షాలకు ఖేదం
హైదరాబాద్,నేటిధాత్రి:
యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్‌మెంట్ ఎంపవర్‌మెంట్, ఎఫిసియన్సీ అండ్ డెవలప్‌మెంట్ బిల్ (ఉమీద్`యూఎంఈఈడీ) పేరుతో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బిల్లుపై వాడివేడి చర్చ ల అనంతరం ఉభయసభలు ఆమోదం తెలిపాయి. లోక్‌సభలో ఏప్రిల్ 2న ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టగా 14గంటల పాటు ఏకబిగిన చర్చ జరిగింది. ఇండీ కూటమిలోని విపక్షాలు ఏక గ్రీవంగా ఈ బిల్లును వ్యతిరేకించగా, ఎన్డీఏ కూటమి పక్షాలు బిల్లును సమర్థించాయి. ఫలితం గా బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకిస్తూ 232మంది సభ్యులు ఓటు చేయడంతో లోక్‌సభ ఆమోదం పొందింది. ఇక ఏప్రిల్ 3న మధ్యాహ్నం రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లుపై అర్థరాత్రి దాటేవరకు 13 గంటలపాటు సుదీర్ఘ చర్చ జరిగింది. విమర్శలు, ప్రతి విమర్శలతో రా జ్యసభ దద్దరిల్లింది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సమాధానం తర్వాత సవరణల వారీగా ఓటింగ్‌జరిగింది. బిల్లుకు అనుకూలంగా 128 మంది, వ్యతికిస్తూ 95మంది ఓటు చేశారు. ఈ బిల్లు ఆ మోదంతో పాటు ముసల్మాన్ వక్ఫ్ (ఉపసంహరణ) బిల్లును కూడా పార్లమెంట్ ఉభయసభలుఆమోదించాయి. బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు.
ముస్లింలకు వ్యతిరేకం కాదు
రాజ్యసభలో మంత్రి కిరణ్ రిజిజు చర్చను ప్రారంభిస్తూ, వక్ఫ్ సవరణ చట్టం ముస్లింలకు వ్యతిరేకం కాదని, ఏ ఒక్కరి మత విశ్వాసాలను దెబ్బతీయడం ప్రభుత్వ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు ఈ బిల్లుకు మతంతో ఎటువంటి సంబంధం లేదన్నారు. ముస్లింలలోని షియా, సున్నీలతోపాటు ఇతర వెనుకబడిన తరగతులవారు వక్ఫ్ బోర్డు సభ్యులుగా కొనసాగేలా నిబంధనలు చేర్చామన్నారు. 22మంది సభ్యులతో ఏర్పడే సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ కూర్పుపై వ్యక్తమవుతున్న సందేహాలకు సమాధానమిచ్చారు. ముస్లిమేతరులు అధికంగా వుంటారన్న సమస్యే ఉత్పన్నం కాదన్నారు. ఈ కౌన్సిల్‌లో ముస్లిమేతరుల సంఖ్య నాలుగుకు మాత్రమే పరిమితమన్నారు. వక్ఫ్ బోర్డులు చట్టపరమైన సంస్థలు. అంతేతప్ప ఇవి ముస్లింలకు ప్రాతినిధ్యం వహించే సంస్థలు కావని స్పష్టం చేశా రు. వక్ఫ్ ట్రిబ్యునళ్ల వద్ద ఇప్పటికే 31999 కేసులు పెండిరగ్‌లో ఉన్నాయి. ఇప్పటికే కోర్టులు తీర్పు ఇచ్చిన వాటిజోలికి ప్రభుత్వం వెళ్లబోదని స్పష్టం చేశారు. తుర్కియే, మలేసియా, సౌదీ అరేబియా వంటి ముస్లిం దేశాలు ప్రత్యేక చట్టాల ద్వారా వక్ఫ్ ఆస్తులను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకొచ్చి ప్రజలకు ఉపయోపడేలా చేశాయన్న సంగతిని కేంద్ర మంత్రి, జె.పి.నడ్డా గుర్తుచేశారు.1913`2013 మధ్యకాలంలో వక్ఫ్ భూములు 18లక్షల ఎకరాలుండగా 2013`25 మధ్య కాలంలో ఇవి మరో 21లక్షల ఎకరాలకు పెరిగాయని ఆయన పేర్కొన్నారు. ఈ ఆస్తులు దుర్విని యోగం కాకుండా కాపాడటమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు.
లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా మంత్రి కిరణ్ రిజుజు మాట్లాడుతూ తాము ప్రతిపాదిస్తున్న సవరణలే లేకపోతే పార్లమెంట్ భూమిని కూడా వక్ఫ్ ఆస్తులే అంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఆలిండియా ముస్లిం డెమోక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్) చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ పార్లమెంట్ భవనం, దాని పరిసర ప్రాంతాలు వక్ఫ్ ఆస్తుల్లో భాగమేనన్న నేపథ్యంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేసినట్టు భావించాలి. ముస్లిం మత వ్యవహారాల్లో జోక్యంగా విపక్షాలు చేసిన ఆరోపణలను హోమంత్రి అమిత్‌షా ఖండిరచారు. ‘‘ఈ సవరణను మైనారిటీలు ఒప్పుకోరని కొంద రంటున్నారు. ఇది పార్లమెంట్ చేసిన చట్టం. ప్రతి ఒక్కరూ అంగీకరించి తీరాల్సిందే’’ అని స్ప ష్టం చేశారు. ‘‘2014లో నాటి కాంగ్రెస్ నేతృత్వంలోని యు.పి.ఎ. సర్కార్ వక్ఫ్ చట్టానికి రాత్రి కి రాత్రే చట్టానికి అతీతంగా సవరణలు చేసిందని, ఇది ముస్లింల సంతుష్టీకరణ రాజకీయాలకు పరాకాష్ట. లేదంటే ఈ సవరణ బిల్లు అవసరమే వుండేది కాదు’’ అని ఆయన అన్నారు. ‘‘యుపీ ఏ నిర్ణయం వల్ల న్యూఢల్లీిలోని ల్యూటెన్స్ జోన్‌లో 123 ఆస్తులు కేవలం 25 రోజుల్లో వక్ఫ్ ఆస్తులుగా మారిపోయాయి. ఇటువంటి అవకతవకలు సరిదిద్దడం, వక్ఫ్ పాలన ప్రజాస్వామ్య బద్ధం గా పారదర్శకంగా జరిగేలా చూడటమే ఈ బిల్లు ఉద్దేశమన్నారు. కేవలం వక్ఫ్ ఆస్తి అని ప్రక టించినంత మాత్రాన ఎవరి భూమి వక్ఫ్ భూమిగా మారకుండా ఈ చట్టం రక్షణ కల్పిస్తుంది’’ అని అమిత్ షా వివరించారు.
రాహుల్ గాంధీ గైర్హాజరు
కీలకమైన వక్ఫ్ (సవరణ) బిల్లుపై పార్లమెంట్‌లో చర్చ జరుగుతున్నప్పుడు ఓటింగ్‌కు విపక్షనేత రాహుల్‌గాంధీ గైర్హాజరయ్యారు. వాయనాడ్ ఎంపీ, ఆయన సోదరి ప్రియాంకా వాద్రా కూడా సభలో లేకపోవడం గమనార్హం. ఈ బిల్లుపై అనుసరించాల్సిన వ్యూహంపై ముందుగా కాంగ్రెస్ ఎంపీలతో చర్చించిన ఆయన, చర్చలో పాల్గనరాదని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి గంటా నలభై నముషాలు సమయం కేటాయించగా గౌరవ్ గొగోయ్ తదితర ఎంపీలు మాత్రమే చ ర్చలో పాల్గనడం గమనార్హం. నిజం చెప్పాలంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలనకు వెళ్లిన తొలి బిల్లు ఇది. గత ఏడాది ఆగస్టులో ఈ బి ల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ఎంతగా ప్రయత్నించినా విపక్షాలనుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురుకావడంతో చివరకు జేపీసీకి పంపక తప్పలేదు.
వక్ఫ్ బిల్లు ఏం చెబుతోంది?
తాజా వక్ఫ్ చట్టం ప్రకారం వక్ఫ్ బోర్డులను మరింత బలోపేతం చేస్తారు. నిర్మాణాత్మక ఎంపిక ప్రక్రియ చేపడతారు. వివాదాల పరిష్కారానికి నిర్ణీత కాలావధిని నిర్ణయిస్తారు. వక్ఫ్‌బోర్డులకు, వక్ఫ్ సంస్థలు తప్పనిసరిగా చెల్లించాల్సిన మొత్తాన్ని వాటి వార్షిక ఆదాయంలో 7శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. రూ.లక్షకు మించిన ఆదాయం కలిగిన వక్ఫ్ సంస్థల అకౌంట్లను ప్రభుత్వ అధీకృత ఆడిటర్ల చేత ఆడిట్ చేయించడం తప్పనిసరి. వక్ఫ్ ఆస్తుల నిర్వహణకోసం కేంద్రీ కృత పోర్టల్‌ను ఏర్పాటుచేస్తారు. దీనివల్ల వక్ఫ్ ఆస్తులపై పారదర్శకత ఏర్పడుతుంది. వితంతువులు, విడాకులు పొందిన మహిళలు మరియు అనాధలకు సంబంధించి ఈ చట్టంలో ప్రత్యేక ని బంధనలను పొందుపరచారు. ముస్లిం మహిళలు తమ వారసత్వ అంశాన్ని వక్ఫ్ డిక్లరేషన్ ముందుకు తీసుకు రావచ్చు. ప్రభుత్వ భూములను వక్ఫ్ ఆస్తులుగా పేర్కొంటున్న వాటి విషయంలో నిర్ణయించేందుకు కలెక్టర్‌కంటే ఉన్నతస్థాయి అధికారి విచారించి తగిన నిర్ణయం తీసుకుంటారు.వక్ఫ్ బోర్డులోకి ముస్లిమేతరులకు ప్రవేశం కల్పించారు.
దేశంలో వక్ఫ్ ఆస్తులు
డబ్ల్యుఏఎంఎస్‌ఐ పోర్టల్‌లో పేర్కొన్న సమాచారం మేరకు దేశంలోని 30 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు మరియు 32 బోర్డులకు సంబంధించి 8,72,328 ఆస్తులుండగా వీటి మొత్తం విస్తీ ర్ణం 3816291.788 ఎకరాలు. ఈ మొత్తం ఆస్తుల్లో 4.02లక్షల ఆస్తులను వక్ఫ్ బోర్డు విని యోగంలో వున్నాయి. మిగిలిన వక్ఫ్ ఆస్తుల విషయానికి వస్తే 9279 కేసులకు సంబంధించి కే వలం 1083 వక్ఫ్ డీడ్స్‌ను మాత్రమే అప్‌లోడ్ చేశారు. ఇక వక్ఫ్ ఎస్టేట్స్ 356,350, స్థిరాస్తు లు 872,802, చరాస్తులు 16716 కాగా డిజిటలైజ్ అయిన రికార్డులు 330,008.
వక్ఫ్ అంటే…
ముస్లిం చట్టాలు గుర్తించిన విధంగా ఎవరైనా వ్యక్తి తన యొక్క స్థిర/చరాస్తులను మతపరమైన దాతృత్వ కార్యకలాపాలకోసం దానంగా ఇవ్వడం అనేది వక్ఫ్ నిర్వచనం.
మతపరమైన, సామాజిక మరియు ఆర్థిక ప్రాధాన్యత కలిగిన వక్ఫ్ ఆస్తుల నియంత్రణ మరియు రక్షణ కోసం భారత ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అవసరానికి అనుగుణంగా చట్టాలను అమల్లోకితెచ్చాయి. ఇందులో మొట్టమొదటగా 1954లో తెచ్చిన వక్ఫ్ చట్టం ఈ ఆస్తుల నిర్వహణకు అవసరమైన పునాది వేసింది. తర్వాతి కాలంలో అవినీతి అక్రమాల నిరోధం, సరైన నిర్వహణ కోసంఎప్పటికప్పుడు కొత్త నిబంధనలు చట్టాలను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగానేనిర్వహణలో పారదర్శకత, పాలనను మరింత బలోపేతం చేయడంకోసం కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టం`2025ను బిల్లురూపంలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదం పొందింది.
1995లో కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన వక్ఫ్ చట్టం ప్రకారం వక్ఫ్ ఆస్తుల నిర్వహణ, ని యంత్రణ కొనసాగుతోంది. ఈ చట్టం కింద మూడు సంస్థలు ప్రధానంగా పాలనా బాధ్యతలు నిర్వహిస్తున్నాయి.
1. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ (సీడబ్యుసీ): కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విధానపరమైన సలహాలు, సూచనలు ఇస్తుంది. వక్ఫ్ ఆస్తులను నేరుగా నిర్వహించదు.
2. స్టేట్ వక్ఫ్ బోర్డులు (ఎస్‌డబ్ల్యుబీ): ఈ బోర్డులు ఆయా రాష్ట్రాల్లో వక్ఫ్ ఆస్తుల నిర్వహణ మరియు రక్షణ బాధ్యతలను నిర్వర్తిస్తాయి.
3. వక్ఫ్ ట్రిబ్యునల్స్: వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన వివాదాలను విచారించే ప్రత్యేక న్యాయ సంస్థలు.
ఈ సంస్థల ద్వారా సమస్యల సత్వర పరిష్కారంతో పాటు వక్ఫ్ ఆస్తుల సమర్థ మరియు పారద ర్శక నిర్వహణకు దోహదం చేశాయి.
భారత్‌లో వక్ఫ్ చరిత్ర
వక్ఫ్ ఆస్తుల నిర్వహణ రక్షణకోసం దేశంలో అనేక చట్టాలు అమల్లో వున్నాయి.
1. ది ముసల్మాన్ వక్ఫ్ వాలిడేటింగ్ యాక్ట్‌ా1913: కుటుంబ ప్రయోజనం ముఖ్యంగా దాతృత్వ కార్యకలాపాలకోసం ముస్లింలు వక్ఫ్‌ను ఏర్పాటు చేయవచ్చు. వక్ఫ్ నిర్వహణకోసం ఈ చట్టాన్ని తీసుకువచ్చినా ఇది పూర్తి సమర్థవంతంగా పనిచేయలేదు.
2. ది ముసల్మాన్ వక్ఫ్ యాక్ట్ 1923: వక్ఫ్ నిర్వహణలో పారదర్శకత కోసం ఈ చట్టాన్ని అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది.
3. ది ముసల్మాన్ వక్ఫ్ వాలిడేటింగ్ యాక్ట్ 1930: కుటుంబ వక్ఫ్‌ల సాధికారతను మరింత బ లోపేతం చేసింది. 1913 వక్ఫ్ చట్టాన్నికి దన్నుగా దీన్ని అమల్లోకి తెచ్చారు.
4. ది వక్ఫ్ యాక్ట్‌ా1954: వక్ఫ్ ఆస్తుల పర్యవేక్షణకోసం మొట్టమొదటి సారి రాష్ట్రాల వక్ఫ్‌బోర్డు లను ఏర్పాటు చేశారు. భారత స్వాతంత్య్రం తర్వాత వక్ఫ్ నిర్వహణను మరింత బలోపేతం చేశారు. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 1964లో ఏర్పాటైంది. రాష్ట్రాల వక్ఫ్‌బోర్డుల పని తీరు పర్యవేక్షణ దీని ప్రధాన బాధ్యత. ఆవిధంగా వక్ఫ్‌బోర్డుల పాలన కేంద్రీకృతమైంది. 1954 వక్ఫ్ యాక్ట్ లోని 9(1) సెక్షన్ కింద ఈ సెంట్రల్ కౌన్సిల్ ఏర్పాటు జరిగింది.
5. ది వక్ఫ్ యాక్ట్‌ా1954కు సవరణలు (1959, 1964, 1969 మరియు 1984): ఇవి వక్ఫ్ పాలనను మరింత మెరుగు పరచడానికి ఉపయోగపడ్డాయి.
6. ది వక్ఫ్ యాక్ట్ 1995: దీన్ని సమగ్ర చట్టంగా రూపొందించారు. దీంతో 1954 వక్ఫ్ చట్టం దాని సవరణ చట్టాలు మొత్తం రద్దయ్యాయి. భారత్‌లో వక్ఫ్ ఆస్తుల నిర్వహణను ఆధీనంలో వుంచుకోవడానికి వీలుగా దీన్ని ప్రభుత్వం రూపొందించింది. వక్ఫ్ కౌన్సిల్, రాష్ట్రాల వక్ఫ్‌బోర్డులు, ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ముతావలి విధులు, బాధ్యతలు, అధికారాలను మరింత స్పష్టంగాఈ చట్టంలో పొందుపరచారు. మొట్టమొదటిసారి వక్ఫ్ ఆస్తుల వివాదాలపై విచారించేందుకు వక్ఫ్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు జరిగింది. సివిల్ కోర్టుల అధికారాలే వీటికి వుంటాయి. వక్ఫ్ ట్రిబ్యునల్ ఇచ్చే తీర్పులను ఏ సివిల్ కోర్టులో సవాలు చేయడానికి వీల్లేదు.
7. వక్ఫ్ సవరణ చట్టరా2013: దీని ద్వారా వక్ఫ్ చట్టంలో ప్రభుత్వం కొన్ని కీలక మార్పులు చేసింది. ముగ్గురు సభ్యులతో కూడిన వక్ఫ్ ట్రిబ్యునల్స్‌ను ఏర్పాటు చేసింది. వీరిలో ముస్లిం చట్టాలపై పూర్తి అవగాహన వున్న నిపుణుడు ఒకరు సభ్యుడిగా వుంటారు. ప్రతి రాష్ట్ర వక్ఫ్ బోర్డులో ఇద్దరు మహిళలకు స్థానం కల్పించింది. వక్ఫ్ ఆస్తులను అమ్మడం లేదా బహుమతిగా ఇవ్వడాన్ని నిషేధించింది. వక్ఫ్ ఆస్తుల లీజ్ కాలాన్ని మూడేళ్లనుంచి 30ఏళ్లకు పెంచింది.
8. వక్ఫ్ సవరణ చట్టరా2025: వక్ఫ్ పరిపాలనను మరింత ఆధునికీకరించడంపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా లీగల్ వివాదాల తగ్గింపు, సామర్థ్యాన్ని మరింత పెంచడం ప్రధాన లక్ష్యం. 1995 వక్ఫ్ చట్టం, 2013 వక్ఫ్ సవరణ చట్టాల్లోని లోపాలను సరిదిద్దడం ప్రధాన ఉద్దేశం.
కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖ పథకాలు
కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ముస్లింలకోసం రెండు పథకాలను అమలు చేస్తోంది. 1. ది క్వామీ వక్ఫ్ బోర్డ్ తరాఖియతి స్కీమ్ (క్యుడబ్ల్యుబీటీఎస్), 2. సహరాయ్ వక్ఫ్ సంపత్తివికాస్ యోజన (ఎస్‌డబ్ల్యుఎస్‌వీవై). రాష్ట్రాల వక్ఫ్‌బోర్డులను ఆధునికీకరించడం, స్వయంచాలి తం చేసేందుకు ఈ పథకాలను కేంద్రం అమలు చేస్తోంది.
క్యుడబ్ల్యుబీటీఎస్ కింద కేంద్ర ప్రభుత్వం సీడబ్ల్యుసీల ద్వారా రాష్ట్రాల వక్ఫ్‌బోర్డులకు గ్రాంట్`ఇన్`ఎయిడ్ అందజేస్తుంది. ముఖ్యంగా కంప్యూటరీకరణ, వక్ఫ్ బోర్డు ఆస్తుల రికార్డుల డిజిటలైజేషన్‌తో పాటు ఆయా వక్ఫ్‌బోర్డుల పాలనా సామర్థ్యాన్ని పెంచేందుకు సహక రిస్తుంది.
ఎస్‌డబ్ల్యుఎస్‌వీవై ద్వారా రాష్ట్రాల వక్ఫ్‌బోర్డులకు వడ్డీలేని రుణాలను మంజూరు చేస్తుంది. వీటిద్వారా వక్ఫ్ ఆస్తుల్లో వాణిజ్య ప్రాజెక్టులను చేపట్టి వాటిద్వారా ఆదాయాన్ని పొందే లా చేయడం దీని ప్రధాన లక్ష్యం.
2019ా20 నుంచి 2023ా24 మధ్యకాలంలో కేంద్రం క్యుడబ్ల్యుబీటీఎస్ మరియు ఎస్‌డబ్ల్యుఎస్‌వీవై కింద రూ.23.87 కోట్లు మరియు రూ.7.16 కోట్లు మంజూరు చేసింది.
సమస్యలెప్పుడూ వుంటాయి
వక్ఫ్ ఆస్తులకు సంబంధించి సమస్యలు లేవని ఎవరూ అనరు. 1954లో మొట్టమొదటిసారి వక్ఫ్ చట్టాన్ని కేంద్రం అమల్లోకి తెచ్చింది. అవసరాలకు తగిన రీతిలో లేదన్న కారణంగా 1995 లో దాని స్థానంలో మరో చట్టాన్ని తెచ్చినా ఇంకా సమస్యలు తీరకపోవడంతో మరిన్నిచర్యలు అవసరమన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైన మాట వాస్తవం. వక్ఫ్ ఆస్తుల్లో దాదాపుసగం వరకు వాటి యాజమాన్యం లేదా నిర్వహణకు సంబంధించిన సమస్యలున్నాయి. అవినీతి అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలతో పాటు పారదర్శకత లేదన్నది కూడా మరోఅభియోగం. మౌలికంగా వక్ఫ్ ఆస్తి అంటే ముస్లిం సంపన్నులు భక్తిభావంతో మతపరమైన అవసరాలకోసం, ఆ వర్గాల్లోని నిరుపేదల అభ్యున్నతికోసం దానంగా ఇచ్చే ఆస్తి. ఇప్పటివర కు కారుణ్య భావంతో ఇతర మతస్తులు కూడా వక్ఫ్‌కు తమ ఆస్తులను దానం చేయవచ్చునన్న నిబంధన వుండేది. తాజాగా పార్లమెంట్ ఆమోదించిన చట్టం ప్రకారం ఐదేళ్లు ఇస్లాంను పాటించిన వారు మాత్రమే దానం చేయడానికి అర్హులు. అయితే ఈ నిబంధన 2013కు ముందు వుండేది. కానీ కాంగ్రెస్ నేతృత్వంలోని యుపీఏ ప్రభుత్వం దీన్ని తొలగించింది. వక్ఫ్ ఆస్తుల్ని ఆర్నెల్లలోగా డేటాబేస్‌లో నమోదు చేయకపోతే వాటికి సంబంధించిన వివాదాలపై న్యాయస్థానాలను ఆశ్రయించడం అసాధ్యమని బిల్లు స్పష్టం చేస్తున్నది.ముఖ్యమైన విషయ మేంటంటే వివాదంలో పడిన వక్ఫ్ ఆస్తులపై ప్రభుత్వం నియమించిన ఉన్న తాధికారిదే తుదినిర్ణయమనేది ఈ బిల్లులో ప్రభుత్వం స్పష్టంగా పేర్కొనడం కీలకం.
సీనియర్ నాయకులు చర్లపల్లి శ్రీధర్ గౌడ్ మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
పేదల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయంగా పని చేస్తుందని, ఇచ్చిన మాట నెరవేర్చేందుకు నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని ప్రజా ప్రభుత్వం పేద ప్రజలను అభివృద్ధి పథంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తుందని గ్రామ శాఖ అధ్యక్షులు నల్ల లింగారెడ్డి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ఎల్లారెడ్డిపల్లి గ్రామ రేషన్ షాప్ డీలర్ మండల అధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల భద్రయ్య అధ్యక్షతన ఏర్పాటుచేసిన సన్నబియ్యం కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా తాహసిల్దార్ జాలి సునీత హాజరై సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామ సీనియర్ నాయకులు నల్ల లింగారెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నిరుపేద కుటుంబానికి ఉగాది రోజు నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తుందని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ..సంవత్సరంన్నర కాలంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తుందన్నారు. గతంలో దొడ్డు బియ్యం ఎవరు తినకపోయేదని అట్టి బియ్యాన్ని దళారులకు అమ్ముకునే వారిని తెలిపారు ఇప్పుడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సన్నబియ్యం ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకుంటారని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో మండల గిరిదారు శివరామకృష్ణ గ్రామ కార్యదర్శి శ్రీకాంత్ చర్లపల్లి శ్రీధర్ మాజీ ఉపసర్పంచ్ నాగరాజు సిపిఐ మండల కార్యదర్శి నిమ్మల రాజయ్య ఏ ఐ టి యు సి మండల కార్యదర్శి చంద్రమౌళి డాక్టర్ చారి కలపెల్లి స్వామి వనపర్తి ముండయ్య కల్లపల్లి కొమురయ్య రేషన్ కార్డు హోల్డర్లు తదితరులు పాల్గొన్నారు
ప్రభుత్వ కళాశాలలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి
ముఖ్యఅతిథిగా హాజరైన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. సంతోష్ కుమార్
పరకాల నేటిధాత్రి
పట్టణంలోని ప్రభుత్వ కళాశాలలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు జాతీయ సేవా పథకం(ఎన్ఎస్ఎస్) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి సంతోష్ కుమార్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ సమత యోధుడని సామాజిక న్యాయమైన లక్ష్యాన్ని ధరించి జీవితాంతం వ్యవస్థపై పోరాడారని బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు.
అనంతరం ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి మోర్ అశోక్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్ణయ సభలో కీలకపాత్ర వహించి కేంద్రంలో సుదీర్ఘంగా కీలక పదవులు పొంది పదవులకే వర్ణతిచ్చే విధంగా ప్రజానాయకుడని కొనియాడారు.
Ram Jayanti
ఈ కార్యక్రమంలో అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్.మల్లయ్య,ఐక్యూఏసి కోఆర్డినేటర్ డాక్టర్ జి. రామకృష్ణ,డాక్టర్ ఎ.శ్రీనివాస్ రెడ్డి,బి.మహేందర్ రావు,డాక్టర్ జి.పావని,డాక్టర్ భీంరావు, డాక్టర్ టి.కల్పన,ఏం. సమ్మయ్య,డాక్టర్ ఏ.రమేష్,డాక్టర్ ఎలిశాల అశోక్,డాక్టర్ కె.జగదీష్ బాబు, ఈశ్వరయ్య,డాక్టర్ పి.శ్రీనివాస్ రెడ్డి,రాజశ్రీ,డాక్టర్.సంజయ్ కుమార్,డాక్టర్.స్వప్న,సతీష్ మరియు అధ్యాపక బృందం, సిబ్బంది,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
మండలంలోని బంగ్లాపల్లె గ్రామంలో. శివుని విగ్రహం తోపాటు పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం శుక్రవారం రోజున వేద పండితులతో. పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో విగ్రహాలను ప్రతిష్టించారు.
విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు.
మొగుళ్లపల్లి మండల మాజీ జెడ్పిటిసి జోరుక సాదయ్య పాల్గొని మాట్లాడుతూ.
Joruka Sadayya
ముదిరాజులపై ఈశ్వరుని కృప పెద్దమ్మ తల్లి దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని వారి దీవెనలతో. ప్రజలందరూ సుఖ సంతోషాలతో , పాడిపంటలతోపాటు, దేవుని అనుగ్రహంతో గ్రామం ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ జిల్లా యూత్ అధ్యక్షులు ధనుంజయ్, రేగొండ యూత్ అధ్యక్షులు భద్రయ్య, మాది జెడ్పిటిసి మనోహర్రావు, గ్రామ అధ్యక్షులు మహమ్మద్ యాకుబ్, సంఘం నాయకులు గోనెల సదయ్య, కుమార్ స్వామి తదితరులు పాల్గొన్నారు
సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి శ్రీరాంపూర్ బ్రాంచ్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున ఐకే 1ఎ గనిలో జరిగిన గేట్ మీటింగ్ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు,వేజ్ బోర్డ్ శాశ్వత సభ్యులు వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా,44 కార్మిక చట్టాలను రద్దుచేసి 4 కోడ్ లుగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ అన్ని కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు మే 20న దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సింగరేణిలో కూడా ఒక్కరోజు టోకెన్ సమ్మె జరుగుతుందని కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు.దేశంలో కార్మిక వర్గం ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులు 44 కార్మిక చట్టాలను నేడు కేంద్రంలో ఉన్న బిజెపి ఎన్డీఏ ప్రభుత్వం వాటిని రద్దు చేసి నాలుగు కోడ్ లు గా మార్చి ఏప్రిల్ నుండి అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటుందని,నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని కార్మిక చట్టాలను రద్దు చేయొద్దని డిమాండ్ చేస్తూ దేశంలో అన్ని కార్మిక సంఘాలు కలిసి మే 20 నా దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయని,అందులో భాగంగా సింగరేణిలో కూడా దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేసి తీరాలన్నారు.దేశానికి ఆదాయం అనుకున్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని దీనివలన దేశ ప్రజలకు కార్మిక వర్గానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. సింగరేణి సంస్థలో ఉన్న సమస్యల పరిష్కారం కొరకు ఓపెన్ కాస్ట్ లలో బొగ్గు తీసే పనిని కాంట్రాక్టర్లకు ఇవ్వద్దని గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఇల్లందు,కోయగూడెం ఓసిపి ని సత్తుపల్లి ఓసీలను ప్రైవేటు వారికి ఇచ్చిన వాటిని వెంటనే రద్దు చేయాలని సింగరేణికే ఇవ్వాలని తాడిచర్ల 2, భూపాలపల్లి,వెంకటాపూర్ 2 గనులను వేలం వేయకుండా సింగరేణి ఇవ్వాలని మణుగూరు ఓసి టు ను ఎక్స్టెన్షన్ చేయాలని గోలేటి 1, మాదారం వన్ గనులు ప్రారంభించాలని సింగరేణి యాజమాన్యం స్ట్రక్చర్ సమావేశంలో అంగీకరించిన డిమాండ్లను వెంటనే అమలు చేయాలని తదితర హక్కుల కోసం గుర్తింపు సంఘం తో పాటు అన్ని కార్మిక సంఘాలను కలిసి కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ మే 20 న జరిగే దేశవ్యాప్త సమ్మెను సింగరేణిలో జయప్రదం చేయాలని ఈ సందర్భంగా వారు కార్మికులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బ్రాంచ్ కార్యదర్శి ఎస్ కే బాజీ సైదా,బ్రాంచ్ ఉపాధ్యక్షులు కొట్టే కిషన్ రావు,మైనింగ్ స్టాఫ్ బెల్లంపల్లి రీజియన్ కార్యదర్శి రాజేశ్వర్ రావు,ఫిట్ కార్యదర్శులు నవీన్ రెడ్డి,అగు శ్రీకాంత్,మైనింగ్ స్టాఫ్ బ్రాంచ్ కార్యదర్శి బాలకృష్ణ ,అడ్డు శ్రీనివాస్,కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రీజియన్ కార్యదర్శి అప్రోజ్ ఖాన్,ఫిట్ ఉపాధ్యక్షులు పెద్దన్న సత్తయ్య వెంకటేష్ రమేష్ శెట్టి శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.
నేడు వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కూడలిలో మహనీయుల జయంతి ఉత్సవాల కమిటీ కన్వీనర్ జాతీయ యువజన అవార్డు గ్రహీత జక్కి శ్రీకాంత్ ఆధ్వర్యంలో “మహానీయుల స్ఫూర్తి యాత్ర” కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాదిగల ఐక్య సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జన్ను రాములు, తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నరసయ్య హాజరై మాట్లాడుతూ వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో మహనీయుల జయంతి సందర్భంగా మండల కేంద్రంలో మహనీయుల స్ఫూర్తి యాత్రను నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు ఈ సందర్భంగా జక్కి శ్రీకాంత్ మాట్లాడుతూ ఏప్రిల్ 5వ తేదీన బాపు జగ్జీవన్ రామ్ ఏప్రిల్ 11వ తేదీన మహాత్మ జ్యోతిరావు పూలే ఏప్రిల్ 14వ తేదీన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 5వ తేదీ నుండి ఏప్రిల్ 14వ తేదీ వరకు వర్ధన్నపేట మండలంలోని గ్రామాలలో మహానీయుల స్ఫూర్తి యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఈ యాత్రలో భాగంగా మహనీయుల జీవిత చరిత్రలను ప్రతి గడపగడపకు చేరవేసి వారి ఆశయాలను కొనసాగింపుగా యువతలో చైతన్యాన్ని కల్పిస్తూ విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను చైతన్య పరుస్తూ అవగాహన కల్పించడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది అదేవిధంగా మహానీయుల జయంతి ఉత్సవాలను గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించాలని పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు మరిపట్ల అంజయ్య, ఆర్ఎస్పి జిల్లా కార్యదర్శి వల్లందాస్ కుమార్, టిఎంఆర్పిఎస్ పొలిట్ బ్యూరో సభ్యులు ఈరెల్లి శ్రీనివాస్, తెలంగాణ అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు కంజర్ల మహేష్, జాతీయ బీసీ సంక్షేమం సంఘం వర్ధన్నపేట నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మామిండ్ల చెన్నయ్య, తెలంగాణ అంబేద్కర్ సంఘం జిల్లా కో కన్వీనర్ జంగిరి భాస్కర్,ప్రజా పార్టీ రాష్ట్ర నాయకులు మల్లెపాక చంద్రమౌళి, వర్ధన్నపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి జనగాం చంద్రమౌళి, తెలంగాణ అంబేద్కర్ సంఘం వర్ధన్నపేట పట్టణ అధ్యక్షులు నందిపాక భాస్కర్, స్వామి, ఎస్టి నాయకులు భీమా నాయక్, అంబేద్కర్ సంఘం నాయకులు కుమారస్వామి, గణేష్, ప్రభాకర్, రమేష్, లాలు నాయక్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
కార్యకర్తల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుంది
భూక్య రమేష్ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే మురళి నాయక్, అధ్యక్షులు భరత్ చందర్ రెడ్డి
కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి
కేసముద్రం మండలం ఇంటికన్నె గ్రామపంచాయతీ పరిధిలో ముత్యాలమ్మ తండాకి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త భూక్యా రమేష్ నాయక్ ఇటీవలే అనారోగ్యంతో మృతిచెందగా శుక్రవారం వారి చిత్రపటానికి పుష్పగుచ్చం సమర్పించి,వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం అందజేసిన మహబూబాబాద్ శాసనసభ్యులు భూక్యా మురళి నాయక్, డిసిసి అధ్యక్షులు జెన్నరెడ్డి భరత్ చందర్ రెడ్డి
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవ రెడ్డి,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు,మాజీ పిఎసిఎస్ చైర్మన్ బండారు వెంకన్న, పిసిసి సభ్యులు దశ్రు నాయక్,డిసిసి ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి, బండారు దయాకర్, గ్రామ కమిటీ అధ్యక్షులు రాజులపాటి మల్లయ్య,మాజీ సర్పంచ్ సారయ్య, ఎలేందర్,గ్రామ కాంగ్రెస్ నేతలు, తదితరులు పాల్గొన్నారు.
ముఖ్య అతిథులుగా పాల్గొన్న మహబూబాబాద్ ఎమ్మెల్యే డా” భూక్య మురళి నాయక్, డి సి సి అధ్యక్షులు జన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి
పిల్లలని దయచేసి బెట్టింగ్ యాప్ లకు దూరంగా ఉంచండి…
సెల్ ఫోన్ లకు పిల్లలని దూరంగా ఉంచండి
విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు
కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి
విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచి క్రమశిక్షణ పాటిస్తూ భవిష్యత్తులో అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్ ఆకాంక్షించారు. స్థానిక శ్రీ చైతన్య పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన ఐ ఎన్ టి ఎస్ ఓ బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. నేషనల్ టాలెంట్ టెస్ట్ ఒలంపియాడ్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులను ఆయన అభినందించారు విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ఆయన బహుమతి ప్రధానం చేశారు. ఈ పరీక్షలో ప్రథమ స్థానంలో నిలిచిన మూడవ తరగతి విద్యార్థిని ఏ లాస్య ఫిరోజ్ ఖాన్ అద్వైత రోషిత విక్రం ములకు గోల్డ్ మెడల్ సర్టిఫికెట్లు అందజేశారు లాస్యకు లాప్టాప్ అందజేసి ప్రత్యేకంగా అభినందించారు. తొమ్మిదవ తరగతిలో అత్యున్నత ప్రదర్శన కనపరిచిన అల్లం పైవ్యశ్రీ వచన పల్లి చేత్రాలకు గోల్డ్ మెడల్ ప్రశంస పత్రాలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రమశిక్షణ లోపిస్తే అది తల్లిదండ్రుల బాధ్యత అన్నారు. విద్యార్థులు సెల్ఫోన్లకు దూరంగా ఉండాలని ఆయన కోరారు సెల్ఫోన్లకు అలవాటు పడిన విద్యార్థులు భవిష్యత్తులో బెట్టింగులకు పాల్పడే ప్రమాదం ఉందన్నారు. తను కూడా విద్యార్థి దశలో ఇలాంటి పరీక్షల్లో 12,000 స్కాలర్షిప్ ను పొందిన విషయాన్ని గుర్తు చేశారు. తన విద్యార్థి జీవితాన్ని నెమరు వేసుకున్నారు పోటీ పరీక్షలకు వంద మంది విద్యార్థులు హాజరైతే 85 మంది విద్యార్థులు విజయం సాధించడం అభినందనీయం అన్నారు ప్రిన్సిపాల్ కోలా రామదాసు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ డిసిసి అధ్యక్షులు జన్నారెడ్డి భరత్ చంద్రారెడ్డి, మార్కెట్ చైర్మన్ గంటా సంజీవరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వరరావు, డిసిసి ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి బండారి వెంకన్న , మాజీ టి పి సి సి సభ్యులు దాసురు నాయక్, ఆయుఃఖాన్, వేముల శ్రీనివాస్ రెడ్డి,సుధాకర్ కోమల వెంకట్ రెడ్డి రాజేష్ కుమార్ సుమన్ అర్చన మౌనిక నూర్జహాన్ శ్రావణి ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.
కార్యకర్తల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుంది
భూక్య రమేష్ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే మురళి నాయక్, అధ్యక్షులు భరత్ చందర్ రెడ్డి
కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి
కేసముద్రం మండలం ఇంటికన్నె గ్రామపంచాయతీ పరిధిలో ముత్యాలమ్మ తండాకి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త భూక్యా రమేష్ నాయక్ ఇటీవలే అనారోగ్యంతో మృతిచెందగా శుక్రవారం వారి చిత్రపటానికి పుష్పగుచ్చం సమర్పించి,వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం అందజేసిన మహబూబాబాద్ శాసనసభ్యులు భూక్యా మురళి నాయక్, డిసిసి అధ్యక్షులు జెన్నరెడ్డి భరత్ చందర్ రెడ్డి
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవ రెడ్డి,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు,మాజీ పిఎసిఎస్ చైర్మన్ బండారు వెంకన్న, పిసిసి సభ్యులు దశ్రు నాయక్,డిసిసి ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి, బండారు దయాకర్, గ్రామ కమిటీ అధ్యక్షులు రాజులపాటి మల్లయ్య,మాజీ సర్పంచ్ సారయ్య, ఎలేందర్,గ్రామ కాంగ్రెస్ నేతలు, తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో గల ఎస్టిపిపి లో అనేక ప్రభుత్వ శాఖలలో ముఖ్యంగా సింగరేణి శాఖలో గత పది సంవత్సరాల కు పైబడి ఒకే దగ్గర ఒకే హోదాలో విధులు నిర్వహిస్తున్న అనేకమంది ఉద్యోగులను వెంటనే బదిలీ చేయాలని కోరుతూ సింగరేణి సంస్థ చైర్మన్ బలరాం నాయక్ కి బిఏంఎస్ యూనియన్ తరపున యాదగిరి సత్తయ్య ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా బిఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు సత్తయ్య మాట్లాడుతూ ఎస్టిపిపి లో దీర్ఘకాలంగా విధులు నిర్వహిస్తున్న అటెండర్ నుండి ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులు ఎంతమంది ఉన్నా వారందరూ ఒకే సంస్థలో ఒకే దగ్గర ఒకే విధంగా విధులు నిర్వహిస్తున్న వారిని వెంటనే గుర్తించి బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.గతంలో ఒకే దగ్గర పది సంవత్సరాల కు పైబడి విధులు నిర్వహిస్తున్న వారిని బదిలీ చేసే జీవో ఉందని ఆ జీవోను మళ్లీ సమీకరించి ఐదు సంవత్సరాలకు పైబడిన వారిని కూడా బదిలీ చేసే విధంగా ఒక కొత్త జీవోను తీసుకురావాలని బలరాం నాయక్ ని కోరారు.సంస్థలలో ఒకే దగ్గర విధులు నిర్వహించడం వల్ల సింగరేణి పవర్ ప్లాంట్ లో భూ నిర్వాసితులకు న్యాయం జరగడం లేదని తమ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బిఎంఎస్ యూనియన్ నాయకులు బొగ్గు పరిశ్రమల ఇంచార్జ్ లక్ష్మారెడ్డి,ప్రధాన కార్యదర్శి దుస్సా భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి .
వనపర్తి నేటిదాత్రి :
శుక్రవారం, హైదరాబాద్ సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో కలిసి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సన్న బియ్యం సరఫరాపై తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు దొడ్డు బియ్యం తినడం ఆపేశారని, దీన్ని గమనించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న సోనామసూరీ బియ్యాన్ని ఉచితంగా సరఫరా చేసే కార్యక్రమం చేపట్టామన్నారు. సన్న బియ్యం సరఫరా పంపిణీ విజయవంతం అవుతుందని, 84 శాతం జనాభా ఆహార భద్రతకు సుస్థిరత ఏర్పడిందన్నారు. రేషన్ దుకాణాలకు సన్న బియ్యం సరఫరా రవాణాను వేగవంతం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. రవాణా కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించి, సన్న బియ్యం రవాణాపై కలెక్టర్ లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లా స్థాయిలో ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు,కలెక్టర్లు ఇతర ఉన్నతాధికారులు నిరు పేదలతో కలిసి ప్రభుత్వం సరఫరా చేస్తోన్న సన్న బియ్యంతో భోజనం చేయాలని మంత్రి సూచించారు అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా ప్రారంభించామని, దీనికి కృషి చేసిన అధికారులకు,సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. సన్న బియ్యం పంపిణీ కారణంగా రేషన్ దుకాణాల వద్ద ఒకేసారి డిమాండ్ పెరిగిపోతున్నందున బియ్యం రవాణాను వేగవంతం చేయాలని, రేషన్ దుకాణాల వద్ద అవసరమైన మేర బియ్యం అందుబాటులో ఉండాలని సూచించారు. సంచుల కొరత ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకు రావాలని, సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సన్న బియ్యం పంపిణీపై ప్రభుత్వ చిత్తశుద్ధి చాటేలా విస్తృత ప్రచారం కల్పించాలన్నారు.నూతన ఆహార భద్రత కార్డుల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలన్నారు .కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని రేషన్ దుకాణాలకు వేగంగా సన్న బియ్యం పంపిణీ చేయాలని సూచించారు. సన్న బియ్యం రవాణాను, నూతన ఆహార భద్రత కార్డుల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలన్నా. రు సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, పౌరసరఫరాల డిఎం జగన్ మోహన్, తదితరులు పాల్గొన్నారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
కరీంనగర్, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల అనుబంధ గ్రామం గుడ్డేలుగులపల్లికి చెందిన గిత్త సాయిచరణ్ తండ్రి ప్రసాద్ అనే యువకుడు పూర్తి వికలాంగుడు తండ్రి కూడా చిన్నతనంలో చనిపోయారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన సాయిచరణ్ ప్రస్తుతం ఇంటర్ మొదటి సంవత్సరం కరీంనగర్ ప్రభుత్వ కళాశాలలో చదువుతున్నారు. కళాశాలకు ఆర్టీసీ బస్సులో వెళ్లడానికి తనకు చాలా ఇబ్బంది అవుతుందని ఎలక్ట్రికల్ చార్జింగ్ వెహికల్ కోసమని రెండు రోజుల క్రితం చొప్పదండి నియోజకవర్గం శాసనసభ్యులు మేడిపల్లి సత్యంని కలువగా వెంటనే స్పందించి వికలాంగుల జిల్లా సంక్షేమ సంఘం అధికారితో ఫోన్ లో మాట్లాడి సాయిచరణ్ కు వెహికిల్ తొందరగా అందచేయాలని అధికారులతో మాట్లాడి శుక్రవారం ఎలక్ట్రీకల్ ఛార్జింగ్ వెహికిల్ ను అందజేసిన చొప్పదండి శాసనసభ్యులు డాక్టర్.మేడిపల్లి సత్యం. ఈసందర్భంగా సాయి చరణ్ మేడిపల్లి సత్యంకు కృతజ్ఞతలు తెలియజేశారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.