ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలలో స్పష్టమైన.!

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలలో స్పష్టమైన ప్రగతి కనిపించాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

ఈనెల 13 నాటికి వేరిఫికేషన్ వంద శాతం పూర్తి కావాలి

సీజనల్ వ్యాధుల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలి

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలలో స్పష్టమైన ప్రగతి కనిపించేలా అధికారులు క్షేత్రస్థాయిలో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సంబంధిత అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశం మందిరంలో అన్ని మండలాల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు,

 

 

 

 

ఎంపీడీఓలు, ఎంపీఓలతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల,రేషన్ కార్డుల వేరిఫికేషన్,భూభారతి దరఖాస్తుల పరిష్కరణ,వన మహోత్సవంలో నాటే మొక్కల ప్రగతి,సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలపై కలెక్టర్ సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 8750 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా, 4806 గ్రౌండింగ్ అయి వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని , మిగిలిన ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు వారంలోగా నిర్మాణ పనుల గ్రౌండింగ్ చేసేలా సంబంధిత అధికారులు సమన్వయంతో  ప్రోత్సహించాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల మంజరులో ప్రధానమంత్రి అవాస యోజన గ్రామీన్ (పీఎంఏవైజి)

 

 

 

 

పథకం క్రింద గ్రామీణ ప్రాంతాల్లో మంజూరైన ఇండ్ల వివరాలు పంచాయతీ సెక్రెటరీ లు సర్వే చేసి వెంటనే పీఎంఏవైజి ఆప్ లో నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

 

 

ఇందిరమ్మ ఇండ్ల పథకంలో నిర్మాణపు పనులు పూర్తి చేయడంలో జిల్లాను ముందు వరుసలో ఉంచాలని కోరారు.ఇందిరమ్మ ఇంటిని ఎంత త్వరగా పూర్తి చేస్తే అంతే త్వరగా బిల్లులు కూడా అందిస్తామని లబ్ధిదారులకు తెలియజేయాలన్నారు. లక్ష్యానికి అనుగుణంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా నిరంతర పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ అధికారులను కోరారు. ఒక్కో మునిసిపల్, మండలాల వారీగా కేటాయించిన లక్ష్యం, లబ్ధిదారుల నిర్ధారణ, మంజూరీలు తెలిపిన వాటిలో ఎన్ని ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం అయ్యాయి, అవి ఏ దశలో ఉన్నాయి, క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని కలెక్టర్ అధికారులను ఆరా తీశారు. లబ్ధిదారుల ఎంపిక, గ్రౌండింగ్ విషయంలో వెనుకంజలో ఉన్న మండలాలను గుర్తించి, లక్ష్య సాధన కోసం అంకిత భావంతో పని చేయాలని కలెక్టర్ సూచించారు.

 

 

 

ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో లబ్దిదారులను నేరుగా కలిసి, వారు వెంటనే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేలా ప్రోత్సహించాలని, ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ ప్రక్రియను నిశిత పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాలకు నిధుల సమస్య ఎంతమాత్రం లేదని, నిర్మాణాలు చేపడుతున్న లబ్దిదారులకు ఆయా దశలను బట్టి వెంటవెంటనే వారి ఖాతాలలో నిధులు జమ చేయడం జరుగుతోందని కలెక్టర్ స్పష్టం చేశారు.  నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేసుకునేలా అధికారులు చొరవ చూపాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ముగ్గు పోసి,ఇల్లు పునాది తీసుకునేలా అధికారులు చొరవ చూపాలన్నారు.ప్రజాపాలన దరఖాస్తుల రేషన్ కార్డుల జారీ వేరిఫికేషన్ పై మునిసిపల్, మండలాల వారిగా. కలెక్టర్ సమీక్షిస్తూ జిల్లావ్యాప్తంగా 58,841 దరకాస్తులలో 41,836 దరకాస్తులు వేరిఫికేషన్ పూర్తయిందని, ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ నెల 13 నాటికి వేరిఫికేషన్ వంద శాతం పూర్తి కావాలని ఆదేశించారు. మీ సేవలో రేషన్ కార్డుల కొరకు జిల్లాలో 17866 దరకాస్తులు రాగా 7331 మంజూరు చేయడం జరిగిందని, మిగిలినవి వెంటనే వేరిఫికేషన్ చేయాలని సూచించారు.

 

 

వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 31 లక్షల
మొక్కలు నాటే లక్ష్యాన్ని సాధించుటకు ప్రణాళిక ప్రకారం అనువైన ప్రదేశాన్ని  గుర్తించాలన్నారు. మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ప్రణాళిక లను సిద్ధం  చేసుకొని మన మహోత్సవ కార్యక్రమాన్ని  విజయవంతం చేయాలన్నారు. నాటిన మొక్కల వివరాలను ఎప్పటికప్పుడు జియో కో-ఆర్డినేట్స్ తో ఆన్ లైన్ లో నమోదు చేయాలని అన్నారు. పట్టణ ప్రాంతాల్లో సెంట్రల్ మీడియన్ లలో పెద్దఎత్తున ప్లాంటేషన్ కు చర్యలు తీసుకోవాలని సూచించారు.భూ భారతి లో జిల్లావ్యాప్తంగా 50 850 వేల దరకాస్తులు రాగా అందులో 10 వేల 7 దరకాస్తులు మాత్రమే ఆర్ ఓ ఎఫ్ ఆర్ ప్రకారం చేయడం జరుగుతున్నదని,

 

 

 

 

మిగిలిన దరకాస్తులలో 47843 సాడబైనమా, ఇతర సమస్యలకు సంబంధించినవి ఉన్నాయని అన్నారు.ఆర్ ఓ ఆర్ పరిధిలో ఉన్న పదివేల దరఖాస్తులను ఆగస్టులో 15లోగా వేరిఫికేషన్ పూర్తి చేయాలన్నారు.సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా తదితర వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు  చేపట్టాలన్నారు. దోమల వ్యాప్తిని నిరోధించేందుకు ఫాగింగ్ , పెద్ద ఎత్తున ఆయిల్ బాల్స్ అందుబాటులో ఉంచుకొని ఎక్కడైతే నీరు నిల్వ ఉండి దోమలు వ్యాపిస్తాయో అక్కడ ఆయిల్ బాల్స్ ఉపయోగించాలన్నారు. గ్రామాలలో ప్రతి  ఫ్రై డే ను–డ్రై డే గా తూచా తప్పకుండా పాటించాలన్నారు.ఈ సమీక్ష సమావేశంలో జిడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహాత్ బాజ్ పాయి, ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి, జడ్పీ సీఈఓ రామిరెడ్డి,డిఆర్డీఓ కౌసల్యాదేవి, గృహ నిర్మాణ శాఖ పిడి గణపతి, డిపిఓ కల్పన,రెవిన్యూ డివిజనల్ అధికారులు సత్యపాల్ రెడ్డి, రమాదేవి,మండల ప్రత్యేక అధికారులు,జిల్లా అధికారులు,మున్సిపల్ కమిషనర్లు,బల్దియా ఉప కమిషనర్, తహశీల్దార్లు, ఎంపిడిఓలు,ఎంపిఓలు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కేంద్రమంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలు.

తంగళ్ళపల్లి మండల బిజెపి ఆధ్వర్యంలో కేంద్రమంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలు….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో. స్థానిక బిజెపి మండలపార్టీ కార్యాలయంలో. తంగళ్ళపల్లి బిజెపి మండల అధ్యక్షులు వెన్నమనేని శ్రీధర్ రావు ఆధ్వర్యంలో ఘనంగా కరీంనగర్ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఎంపీ కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ బర్త్డే వేడుకలు పురస్కరించుకొని తంగళ్ళపల్లి మండల పార్టీ ఆఫీసులో రక్తదాన శిబిరం నిర్వహించి తద్వారా మండల కేంద్రంలోని శ్రీ రామాలయ టెంపుల్ లో పార్టీ నాయకులు కార్యకర్తలు అందరితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి స్థానిక మండపల్లి చౌరస్తాలో గల బండి సంజయ్ చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ కార్యాలయ ఆవరణలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఇట్టి కార్యక్రమానికి ప్రత్యేకంగా బిజెపి రాష్ట్ర నాయకులు విచ్చేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ గురించి మాట్లాడుతూ ఆయన చదువుకునే వయసునుండే హిందుత్వంపై వ్యక్తిగతంగా ప్రత్యేక ఆకర్షితుడై విద్యార్థి దశలో ఉండే ఎన్నో పదవులు అనుభవించి నగరపాలక సంస్థ కార్పొరేటర్ గా రాష్ట్ర అధ్యక్షుడిగా కరీంనగర్ ఎంపీగా కేంద్ర మంత్రిగా ఇంకా ఎన్నో పదవులు అనుభవిస్తూ ఆయన పిల్లాపాపలతో సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని ఆయన చేసిన దానికి యువత ఆకర్షితులై ముందు ఉండాలని ఈ సందర్భంగా తెలియజేశారుఈ కార్యక్రమంలో బిజెపి మండల జనరల్ సెక్రెటరీ రాజు ఇటుకల. కోసిని వినయ్ రెడ్డి మల్ల ఆశీర్వాదం. చిలువేరి ప్రశాంత్. పోకల శ్రీనివాస్ బూత్ అధ్యక్షులు మేకల సురేష్. జంగం కిషన్ కిషన్ మూర్చ మండల అధ్యక్షుడు.నాగుల బొజ్జ బలగం భాస్కర్ రెడ్డి మల్ల అమరగుండ సురేష్. జలపతి మధుసూదన్.మహిళ పార్టీ నాయకురాలు కోడం భవిత. కటకం పల్లవి. పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

సీఎం రిలీఫ్ ఫండ్ బాధితులకు వరం. ‌

సీఎం రిలీఫ్ ఫండ్ బాధితులకు వరం. ‌

జిల్లా ప్రధాన కార్యదర్శి మండ రవీందర్ గౌడ్. ‌ ‌

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి. ‌

సీఎం సహాయ నిధి పేదలకు వరమని జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మండ రవీందర్ గౌడ్ అన్నారు భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు గారి ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన కార్యదర్శి మండ రవీందర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మొగుళ్లపల్లి మండలం పర్లపల్లి గ్రామంలోసీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించారు వారు మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందిన పలువురుపేదలకు ముఖ్యమంత్రి సహా నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని చెక్కులను అందజేశారు సీఎం సహాయ నిధి ఆర్థిక సహాయం ఎంతో సహాయపడుతుందని అన్నారు పేదవారు అనివార్య పరిస్థితుల్లో ప్రవేట్ ఆసుపత్రిలో చేరి ఆర్థిక ఇబ్బందులకు గురైతే వారికోసం ప్రభుత్వ ఆసుపత్రిలోనే కార్పొరేట్కు దీటుగా వైద్య సేవలు అందిస్తున్నారని పేదవారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో చిట్యాల మార్కెట్ డైరెక్టర్ కాంతాల సతీష్ రెడ్డి గౌరవ అధ్యక్షుడు మోత్కూరి మల్లయ్య ఉపాధ్యక్షులు పసునూటి సంపత్ మండ శ్రీకాంత్ దొమ్మటి అశోక్ వీళ్ళ తిరుపతి ఈళ్ల రమేష్ ఈర్ల అశోక్ పాల్గొనడం జరిగింది

కార్మికులను బానిసలుగా చేస్తున్న బిజెపి

కార్మికులను బానిసలుగా చేస్తున్న బిజెపి మోడీ ప్రభుత్వాలు

కార్మికులను బానిసలు చేయడంలో బిజెపి మోడీ ప్రభుత్వం అడుగులకు మడుగులొత్తుతున్న కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం.

కార్మికుల పని గంటలు పెంచడమంటే కార్మికుల స్వేచ్ఛ జీవితాలను హరించడమే

పని గంటలు పెంచుతు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం 282 ను వెంటనే రద్దు చేయాలి.

సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులతో జీవో ప్రతుల దగ్దం.

దూలం శ్రీనివాస్
సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు.

మందమర్రి నేటి ధాత్రి

మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపాలిటీలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులతో సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 10 నుంచి 12 గంటల పని విధానాన్ని అమలు చేయాలని విడుదల చేసిన జీవో నెం 282 ను వెంటనే రద్దు చేయాలని 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని జీవో ప్రతులను దగ్దం చేయడం జరిగింది.అనంతరం దూలం శ్రీనివాస్ సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ…

 

 

కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చిన బిజెపి మోడీ సంకీర్ణ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తు కార్మిక వర్గానికి ఉన్న 49 చట్టాల నుంచి 29 చట్టాలను రద్దు చేసి 4 లెబర్ కోడ్ ల రూపంలో దాడి చేస్తుంటే, రాష్ట్రంలోని కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం బిజెపి విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతాం అంటునే బిజెపి ప్రభుత్వం కంటే ముందే ఒక అడుగు ముందుకు వేసి 10 నుంచి 12 గంటల పని విధానాన్ని అమలు చేయాలని జీవోను విడుదల చేయడమంటే,బడాపెట్టుబడిదారులకు కార్మిక వర్గాన్ని బానిసలను చేసే కుతుహలం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికే ఎక్కువ ఉన్నట్లు ఉంది. కార్మికుల వేతనాలు పెంచండి మహాప్రభో అంటు కార్మిక వర్గం ముక్త కఠంతో వేడుకుంటున్న పట్టించుకోకుండా ఇలా పని గంటలు పెంచడం దుర్మార్గం. పని గంటల పెంపుతో కార్మికుని వ్యక్తిగత స్వేచ్ఛ, జీవితాన్ని హరించడమే. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 282 ను రద్దు చేయాలని కార్మికుల వేతనాలు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని లేని యేడల బిజెపి మోడీ ప్రభుత్వంపై కార్మికవర్గం ఏలాంటి పోరాటం చేస్తుందో ఐక్యంగా, ఆ పోరాటాలను రాష్ట్ర ప్రభుత్వంపై కూడా చేయడానికి కార్మిక వర్గం వెనకడదని హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ సిఐటియు మందమర్రి అధ్యక్ష కార్యదర్శులు జి. ఐలయ్య, యం. నర్సయ్య, నాయకులు రాజశేఖర్, సంగి పోషం , దుర్గయ్య, లక్ష్మణ్, పోసు, శంకరమ్మ, మల్లమ్మ, రజిత,కళావతి, స్వప్న తదితరులు పాల్గొన్నారు.

పేదోడి సొంత ఇంటి కల నెరవేరుస్తున్న కాంగ్రెస్ .

పేదోడి సొంత ఇంటి కల నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం

1వ వార్డు మాజీ కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్

పరకాల నేటిధాత్రి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు పథకం పేదోడి సొంత ఇంటికల నెరవేరుస్తుందని మాజీ కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్ అన్నారు.కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి సహకారంతో పరకాల మున్సిపల్ పరిధిలోని ఒకటో వార్డులో మద్దెల కళ్యాణి భద్రయ్య కి మంజూరైన ఇందిరమ్మ ఇల్లు ముగ్గు కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు.ఈ సందర్బంగా పేదకుటుంబాలలో సంతోషాలను చూస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్,స్థానిక మాజీ కౌన్సిలర్,సమన్వయ కమిటీ నాయకులు మడికొండ సంపత్ కుమార్,డాక్టర్. మడికొండ శ్రీను,మెరుగు శ్రీశైలం గౌడ్,చందుపట్ల రాఘవరెడ్డి,పట్టణ ఉపాధ్యక్షులు ఒంటెరు శ్రావణ్, నాయకులు మేకల వినయ్, బండారి రాజు,బొచ్చు జయాకర్ జాన్సన్,ఇందిరమ్మ కమిటీ సభ్యులు,వార్డ్ ఆఫీసర్, వార్డులోని పెద్దలు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.

పేదవారి కళను నెరవేర్చడమే ఇందిరమ్మ ప్రభుత్వ .!

పేదవారి కళను నెరవేర్చడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం

రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క.

ములుగు జిల్లా, నేటిధాత్రి:

పేద వాడి కలలను నిజం చేయడానికి ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క. అన్నారు.
శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎస్సీ కాలనీలో
ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజా, నిర్మాణం పనులను రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థ సంపత్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్ లతో కలసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రతి నిరుపేద ఆడబిడ్డకు ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇవ్వాలని లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నిరుపేద కుటుంబానికి 5 లక్షల రూపాయలతో ఇండ్లను నిర్మించుకోవడానికి అవకాశం కల్పించిందని తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. పేదవారి సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుందని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలను అర్హులైన నిరుపేదల అందరికీ అందే
విధంగా చర్యలు తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంపత్, ఎంపిడిఓ రామకృష్ణ, ప్రజాప్రతినిధులు, ఇందిరమ్మ ఇండ్ల కమిటి సబ్యులు, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.

కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) స్థానం లో పత్తి కొనుగోలు కు పీడీపీఎస్ విధానం అమలు విరమించుకోవాలి.

కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) స్థానం లో పత్తి కొనుగోలు కు పీడీపీఎస్ విధానం అమలు విరమించుకోవాలి.

తెలంగాణ రైతు సంఘం డిమాండ్.

కారేపల్లి: నేటి ధాత్రి

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పత్తి మద్దతు ధర కు తెలంగాణ రాష్ట్రం లో పత్తిని కొనుగోలు చేస్తున్న కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ని ఆ బాధ్యతల నుంచి తప్పించే ప్రయత్నానికి కేంద్ర ప్రభుత్వం స్వస్తి పలకాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు డిమాండ్ చేశారు. గురువారం కారేపల్లి మండలం లో పాట్టిమీద గుంపు బాజ్జుమల్లాయిగూడెం లలో పత్తి పంట పరిశీలన చేశారు. రైతుల నుంచి కౌలు రేట్లు వివిధ రకాల పంటల సాగు పరిస్థితి మిర్చి సాగు విస్తీర్ణం పై రైతుల నుంచి వివరాలు స్వీకరించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ
కేంద్ర ప్రభుత్వం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా మద్దతు ధర కు పత్తి కొనుగోలు చేయకుండా ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీం ( పీడీపీఎస్) ను రాష్ట్రం లో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది అని తెలంగాణ రాష్ట్రం లో అత్యధికంగా పత్తి పండించే ఆదిలాబాద్ జిల్లాలో ఈ వ్యవసాయ సీజన్ లో అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది అని పత్తి రైతులకు తీవ్రంగా నష్టం వాటిలే అవకాశం ఉందని రాంబాబు అన్నారు.
ఎంఎస్ పి విధానం లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతుల నుంచి పంటలు కొనుగోలు చేస్తుంది పీడీపీఎస్ విధానం వల్ల రైతు తన పత్తి పంటను బహిరంగ మార్కెట్లో విక్రయించిన తర్వాత మార్కెట్ ధర కన్నా ఎం.ఎస్.పి ఎంత తక్కువ ఉంటే ఆ మొత్తాన్ని నేరుగా డిబిటి (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) పద్ధతుల్లో రైతు ఖాతాల్లో జమ చేస్తారు అంటే ప్రభుత్వం రైతు దగ్గర పంటను కొనదు కానీ మార్కెట్లో రైతు నష్టపోయిన మొత్తాన్ని సర్దుబాటు చేస్తుందని నూతన పథకాన్ని ప్రవేశపెట్టారు గత వానాకాలం సీజన్లో 44 లక్షల ఎకరాల్లో 20 లక్షల మంది పైగా రైతులు పత్తి పంట సాగు చశారు ఇంత మంది రైతులకు బహిరంగ మార్కెట్లో విక్రయించిన తర్వాత వ్యత్యాసం ధర నగదు బదిలీ చేయడం సాధ్యం కాదు మధ్యప్రదేశ్ లో 2016-17 లోనే 8 ప్రధాన పంటలకు పీడీపీఎస్ విధానాన్ని అమలు చేసి రైతులకు వ్యత్యాసాలు నిర్ధారించడంలో లోపాలు వ్యత్యాసపు ధర చెల్లింపులు ఆలస్యం మార్కెట్ ధరలు తేడాలు నిజమైన రైతులకు కాకుండా దళారులకు చెల్లింపులు వంటివి చోటు చేసుకోవటం తో మరుసటి సంవత్సరమై ఆ పథకాన్ని నిలిపివేశారని ఇప్పుడు తెలంగాణలో పీడీపీఎస్ ప్రయోగించడం పత్తి రైతులను నాశనం చేస్తుందని వెంటనే ఈప ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు మేరుగు సత్యనారాయణ తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దుగ్గి కృష్ణ సిఐటియు జిల్లా నాయకులు కుందనపల్లి నరేంద్ర రైతు సంఘం మండల కార్యదర్శి వజ్జా రామారావు బాదావత్ శ్రీనివాసరావు మన్నెం బ్రహ్మయ్య వడ్లమూడి మధు యనమద్ది రామకృష్ణ మహిళా రైతులు పాల్గొన్నారు.

ఈనెల 11న డయల్ యువర్ డిపో మేనేజర్ కార్యక్రమం

ఈనెల 11న డయల్ యువర్ డిపో మేనేజర్ కార్యక్రమం

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి డిపో పరిధిలోని వివిధ మండలాల ప్రజలకు వ్యాపారస్థులకు, ఉద్యోగులకు విద్యార్థులకు విజ్ఞప్తి చేయునది ఏమనగా ఈనెల 11న ఉ.11.00 గం. ల నుండి 12.00 గం. ల వరకు “డయల్ యువర్ డిపో మేనేజర్” కార్యక్రమము నిర్వహించబడును జరుగుతుంది
కావున ప్రజలు, వ్యాపారస్తులు, ఉద్యోగులు విద్యార్థులు సెల్: 9959226707 కు డయల్ చేసి ఆర్టీసీ అభివృద్ధికి అమూల్యమైన సలహాలు, సూచనలు చేయగలరు అని డిపో మేనేజర్ ఇందు తెలిపారు

డాక్టరేట్ పొందిన కెటిపిపి ఉద్యోగి నిరంజన్ రెడ్డి

డాక్టరేట్ పొందిన కెటిపిపి ఉద్యోగి నిరంజన్ రెడ్డి

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ గా పనిచేస్తున్న పల్లెర్ల నిరంజన్ రెడ్డి డాక్టరేట్ ఆఫ్ లిటరేచర్ 2025 సంవత్సరమునకు గాను గ్లోబల్ హుమెన్ పీస్ యూనివర్సిటీ యూనివర్సిటీ యు ఎస్ ఏ ప్రకటించింది. అనివార్య కారణాల వల్ల 28/06/2025 రోజున చెన్నయ్ స్నాతకోత్సవంలో పాల్గొన లేకపోయారు ఈ డాక్టరేట్ ని గ్లోబల్ హుమెన్ పీస్ యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కందుకూరి విజయ్ మోహన్, సేవా రత్న జాతీయ అవార్డు గ్రహీత యునివర్సిటీ సభ్యులు బొమ్మకంటి రాజేందర్ ల ఆధ్వర్యంలో ఈ రోజు హానరరి డాక్టరేట్ పట్టా ప్రదానోత్సవం కెటిపిపి చీఫ్ ఇంజనీర్ చిట్టాప్రగడ ప్రకాష్ చేతుల మీదుగా జెన్ కో కాలనీలో నిరంజన్ రెడ్డి కి అందజేశారు
ఈ సంధర్భంగా గ్లోబల్ హుమెన్ పీస్ యూనివర్సిటీ సంఘ సేవకులకు, రచయితలకు, కవులకు మరియు అత్యంత ప్రతిభావంతులైన వారిని గుర్తించి ఈ గౌరవ డాక్టరేట్ అవార్డును అందజేయడం అందులో క్యాతపల్లి గ్రామ వాస్తవులైన పల్లెర్ల పుల్లారెడ్డి పూలమ్మ దంపతుల కనిష్ట కుమారుడైన పల్లెర్ల నిరంజన్ రెడ్డి మా కెటిపిపి ఇంజనీర్ కి అంతర్జాతీయ స్థాయి స్నాతకోత్సవంలో గౌరవ డాక్టరేట్ పట్టా పొందడం గర్వించదగ్గ విషయం అని మీ అత్యుత్తమ కృషి మరియు విజయాలకు గుర్తింపుగా, ప్రతిష్టాత్మక గౌరవ డాక్టరేట్ ఆఫ్ లిటరేచర్ అవార్డును ప్రదానం చేయడానికి మేము సంతోషిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో సూపరింటెండింగ్ ఇంజనీర్ రామ ముత్యాల రావు, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ లు కాటం రవి, మాకుల సంతోష్, జెరిపోతుల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

‘ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి’

జహీరాబాద్ నేటి ధాత్రి:

కోహిర్ మండలంలో వన మహోత్సవం కార్యక్రమంలో నాయబ్ తహశీల్దార్ వరప్రసాద్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి, పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడాలని, మొక్కల పెంపకంతో మానవజాతి మనుగడ సాధ్యమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

బీఎస్ఎన్ఎల్ ప్యానెల్ అడ్వకేట్ గా మరో సంవత్సరం పాటు పోరెండ్ల నరసింహా రాములు  కొనసాగింపు:-

బీఎస్ఎన్ఎల్ ప్యానెల్ అడ్వకేట్ గా మరో సంవత్సరం పాటు పోరెండ్ల నరసింహా రాములు  కొనసాగింపు:-

హన్మకొండ/వరంగల్, నేటిధాత్రి (లీగల్):-

ఉమ్మడి వరంగల్ జిల్లా కోర్టులో పొరెండ్ల నరసింహ రాములు ను భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (బి. ఎస్. ఎన్.ఎల్) తమ ప్యానెల్ అడ్వకేట్ గా మరో సంవత్సర కాలం పొడిగించింది. ఆ సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్ లీగల్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ వారు  తేదీ: 25- 06- 2025 ఉత్తర్వులు జారీ చేసారు. ఇక నుండి నరసింహ రాములు గారు బి.ఎస్.ఎన్.ఎల్ సంస్థ కు సంబంధించిన కేసుల ను వరంగల్ జిల్లా కోర్టు మరియు సబ్ కోర్ట్స్ మరియు జిల్లా వినియోదారుల ఫోరంలలో బి.ఎస్.ఎన్.ఎల్ తరుపున వాదించనున్నారు. సీనియర్ న్యాయవాది అయిన పొరేండ్ల నరసింహ రాములును బి.ఎస్.ఎన్.ఎల్ సంస్థ తమ ప్యానెల్ న్యాయవాది గా మరో సంవత్సరం పాటు కొనసాగింపుగా ఉత్తర్వులు జారీ చెయ్యడం పట్ల తోటి న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు మరియు పలువురు న్యాయవాదులు నరసింహ రాములు గారికి అభినందనలు తెలిపారు.

శంకర్‌పల్లిలో “విజేత సూపర్ మార్కెట్” ప్రారంభం

శంకర్‌పల్లిలో “విజేత సూపర్ మార్కెట్” ప్రారంభం

చేవెళ్ళ ఎమ్మెల్యే కాలే యాదయ్య చేతుల మీదుగా ఘనంగా ప్రారంభోత్సవ కార్యక్రమం

 

“Vijetha Supermarket” launched in Shankarpally

శంకర్‌పల్లి, నేటిధాత్రి :
“విజేత సూపర్ మార్కెట్ ” తెలుగు రాష్ట్రాలలో ఈ పేరు తెలియని వాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండరు అంత ప్రఖ్యాతి పొందింది. అలాంటిది మన శంకర్‌పల్లి పట్టణంలోని వాణిజ్య రంగానికి కొత్త ఒరవడి తీసుకువచ్చే లక్ష్యంతో ఏర్పాటు చేసిన “విజేత సూపర్ మార్కెట్” గురువారం చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.

ప్రారంభోత్సవ సందర్భంగా ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ “ప్రజలకు నిత్యవసర వస్తువులు, ఆహార పదార్థాలు, ఇతర వినియోగ సామగ్రి నాణ్యతతోపాటు సరసమైన ధరలకూ అందుబాటులో ఉండేలా ఈ సూపర్ మార్కెట్ ఏర్పాటు చేయడం అభినందనీయం,” అని పేర్కొన్నారు.
స్థానిక యువత ఉద్యోగ అవకాశాలు పొందడంలో ఈ మార్కెట్ దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.
అలాగే
విజేత సూపర్ మార్కెట్ యజమానులు మాట్లాడుతూ,
“ప్రజలకు అత్యుత్తమ సేవలందించాలన్నదే మా ముఖ్య లక్ష్యం. నిత్యం తక్కువ ధరలకు అధిక నాణ్యత కలిగిన వస్తువులను అందుబాటులో ఉంచుతాము. కస్టమర్ల విశ్వాసమే మా శక్తి” అని తెలిపారు.

సూపర్ మార్కెట్‌లో నిత్యవసర వస్తువులు, కూరగాయలు, పండ్లు, ప్యాకెజ్డ్ ఫుడ్, గృహోపయోగ వస్తువులు, మరియు ఇతర డైలీ నీడ్ ఉత్పత్తులు సమృద్ధిగా లభించనున్నాయి అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రముఖులు, వ్యాపారవేత్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

పట్టణ అభివృద్ధిలో భాగంగా శంకర్‌పల్లిలో ఇటువంటి సదుపాయాలు ఏర్పడటం సంతోషకరమని స్థానికులు పేర్కొన్నారు.

ఇందిర మహిళ శక్తి సంబరాలలో కళాజాత బృందాల ప్రచారాలు

ఇందిర మహిళ శక్తి సంబరాలలో కళాజాత బృందాల ప్రచారాలు

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

ఓదెల మండల కేంద్రం లో గురువారం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇందిరా మహిళా శక్తి సంబరాలల్లో భాగంగా ప్రభుత్వ కళాజాత బృందాలు ప్రచారాన్ని చేపట్టారు. ప్రభుత్వం మహిళా సంఘాలకు ఇస్తున్న వడ్డీలేని రుణాలతోపాటు మహిళలకు ప్రమాద బీమా, కుట్టు మిషన్ కేంద్రాలు, సోలార్ ప్లాంట్స్, పెట్రోల్ పంపులు ,ఆర్టీసీ బస్సులు ,మార్కెట్ సెంటర్లు ,15 సంవత్సరాలు పైబడిన వారితోపాటు వృద్ధులను, వికలాంగులను మహిళా సంఘాలలో చేరచుటకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తున్న తరుణంలో వారిని సంఘ సభ్యులుగా చేర్పించడం పై మహిళా శక్తి ప్రత్యేక కృషి చేస్తుందని కళాజాత ప్రచార బృందాలు ప్రజలకు అవగాహన కల్పించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రం నుండి ప్రభుత్వ కళాజాత ప్రచార బృందాలు మండల కేంద్రం ఓదెలలో ఇందిరా మహిళ. శక్తి సంబరాలు పై ప్రజలకు పూర్తిస్థాయిలో ఆహ్వాన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఏపిఏం లతా మంగేశ్వరి తో పాటు సీసీలు దొడ్డ విజయ, మారెళ్ళ శ్రీనివాస్, మండల సమైక్య కార్యదర్శి అనూష విఓఏలు అనిత, రమ,ప్రణీత, పద్మ, లావణ్య లతోపాటు మహిళా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించే ఏకైక సంఘం పీఆర్టీయు

*ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించే ఏకైక సంఘం పీఆర్టీయు*

 

నడికూడ,నేటిధాత్రి:


ఉపాధ్యాయుల యొక్క సమస్యలు పరిష్కరించి వారికి ఎల్లప్పుడూ అండగా ఉండే ఏకైక సంఘం పీఆర్టీయూ టీఎస్ మాత్రమే అని హనుమకొండ జిల్లా పీఆర్టీయు ప్రధాన కార్యదర్శి పలిత శ్రీహరి అన్నారు. గురువారం రోజు నడికూడ మండల శాఖ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన కార్యదర్శి పలిత శ్రీహరి చేతుల మీదుగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉపాధ్యాయ లోకానికి ఎన్నో సౌకర్యాలు కల్పించిన సంఘం పీఆర్టీయూ మాత్రమే అని, అతి త్వరలోనే జిపిఎఫ్ పెండింగ్ బిల్లులు అన్నీ చెల్లించే దిశగా సంఘం కృషి చేస్తుందని,మిగతా పెండింగ్ బిల్లులు అన్నీ కూడా సాధ్యమైన తొందరగా క్లియర్ చేయించే ప్రయత్నం చేస్తామని,ఉపాధ్యాయ బదిలీలు,పదోన్నతులు ఇప్పించిన సంవత్సరంలోనే మళ్ళీ త్వరలోనే పదోన్నతులు కల్పించే దిశగా పిఆర్టియు టి ఎస్ సంఘం కృషి చేస్తుందని,ఇంకా ఎన్నో సమస్యలు త్వరలోనే పరిష్కరించే దిశగా సంఘం కృషి చేస్తుందని అన్నారు. మండలంలోని కంఠాత్మకూర్, కౌకొండ,నడికూడ,వరికోల్, రాయపర్తి, నార్లాపూర్, చర్లపల్లి,పులిగిల్ల ఉన్నత పాఠశాలలు తిరిగి సభ్యత్వం నమోదు చేయించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షులు అచ్చ సుదర్శన్ ప్రధాన కార్యదర్శి కట్టుకోజ్వాల సతీష్,రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మోడం రాజేందర్ బాబు,నన్నేసాహెబ్,శ్రీధర్ రెడ్డి, బురుగు శంకర్ జిల్లా బాధ్యులు శరత్ గౌడ్,నగేష్ పాల్గొన్నారు.

మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది

 

The state government will stand by the fishermen.

*చేపల పెంపకంలో మత్స్యకారులు అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలి*

*రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్*

*సిరిసిల్ల టౌన్: (నేటి ధాత్రి )*

The state government will stand by the fishermen.

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు మత్స్యకారుల రైతు వేదికలో నేషనల్ అగ్రో ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ మత్స్య రైతుల దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు..
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఉత్తమ ప్రతిభ కనబరిచిన సొసైటీ సభ్యులకు ప్రశంసా పత్రాలు అందజేసి సన్మానించారు..అనంతరం చేపల స్టాల్స్ ను సందర్శించారు. వారు మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మత్స్య సంపద పెంపొందించడానికి తన వంతు ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు..మొన్నటి రోజూ మంత్రీ శ్రీహరి కరీంనగర్ వచిన్నపడు వారితో చేపల పెంపకం,మత్స్యకారుల గురించి మాట్లాడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని చెరువుల్లోకి సకాలంలో చేప పిల్లలు పంపిణీ చేస్తుందనీ తెలిపారు.. బలహీన వర్గాల ఆర్థికంగా ఎదగడానికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు అందజేస్తుందని అన్నారు.గతంలో మిడ్ మానేరులో చేపలను వదలడం జరిగిందని, మన ప్రాంతంలో మల్కపేట్ రిజర్వాయర్ కుడా అందుబాటులోకి వచ్చిందని వాటిలో కూడ చేపల పెంపకం ఏర్పాట్లు విధానం పరిశీలించాలన్నారు. గతంలో తెగిపోయిన చెరువులు మరమ్మత్తులు పూర్తి చేశామని అన్నారు.. ఇంకా ఎక్కడ చెరువులు మరమ్మత్తులు ఉంటే చేపడతానని తెలిపారు… ఎమ్మెల్యేగా గెలిచిన 3 నెలల్లోనే కథాలపూర్ మండలం లోని తెగిపోయిన చెరువులను మరమ్మత్తులు చేసినట్లు తెలిపారు. మల్కపేట రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చెసి ఎల్లారెడ్డిపేట వరకు రైతులకు సాగు నీరు అందించమని తెలిపారు.గతంలో మిడ్ మానేరు డ్యాంలో కేజీ కల్చర్ విధానంలో చేపల పెంపకం కోసం ముంపు గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించమని కేజీ కల్చర్ చేపల పెంపకం చేపట్టడం కోసం ముందుకు రావాలన్నారు.చేపల పెంపకంలో అధునాతన సాంకేతిను అందిపుచ్చు కోవాలన్నారు… కేజీ కల్చర్ విధానంలో చేపల పెంపకానికి ముందుకు వస్తె రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీలు అందజేస్తామని తెలిపారు..
దేశంలో మత్స్య సంపద పెరగాలని చేపలు ఆరోగ్యానికి మంచిదనీ ,ప్రభుత్వం మత్స్యకారులకు అనేక రకాలుగా ప్రోత్సాహకాలు అందజేస్తుందని తెలిపారు.గత ప్రభుత్వం పెట్టిన ఒక్క పథకాన్ని కూడా రద్దు చేయకుండా వాటిని కొనసాగిస్తూ నూతన పథకాలను అమలు చేస్తున్నామన్నారు..రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాట మేరకు మహిళ తల్లులకు ఉచిత బస్సు ప్రయాణం,500 కు సిలిండర్,10 లక్షల అరోగ్య శ్రీ,పది సంవత్సరాలుగా పేద ప్రజలు ఎదురు చూస్తున్నా ఇందిరమ్మ ఇల్లు, నూతన రేషన్ కార్డులను మంజూరు చేసినట్లు తెలిపారు.. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ స్వరూప, జిల్లా ఫిషరీస్ చైర్మన్ చొప్పరి రామచంద్రం, డి ఏ వో అఫ్జల్ బేగం, మల్లికార్జున్, పి కిషోర్, నేషనల్ ఆగ్రో ఫౌండేషన్ రాష్ట్ర కోఆర్డినేటర్ సునీల్ కుమార్,, అడ్వైజర్ విద్యాసాగర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికారులు

పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికారులు

సారు.. మాకు న్యాయం చేయండి

భూపాలపల్లి నేటిధాత్రి

గత కొద్ది రోజులుగా ఇంటి పక్కన వారు తీవ్ర ఇబ్బంది పెడుతున్నారని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేదని, అధికారులు మాకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు జరుపుల గంగ- కిషన్ లు కోరారు. జిల్లా కేంద్రంలోని కాకతీయ ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తాము గత 20 సంవత్సరాల క్రితం కారల్ మర్క్స్ కాలనీలో ఇల్లు కొనుగోలు చేసుకుని ఇక్కడే నివాసం వుంటున్నామని, మా ఇంటి పక్కన వున్న వ్యక్తి మా ఇంటి కి, పక్క ఇంటికి మధ్యలో వున్న మాకు చెందిన ఖాళీ స్థలంలో ఉన్న మిషన్ భగీరథ పైపులను కాల్చరన్నారు. మా స్థలంలో వున్న మా మామిడి చెట్టును వారే నరకడంతో వాళ్ళ ఇంటి పైనే పడి రేకుల పై పడటంతో మమ్మల్ని కారకులుగా చేస్తూ నానా ఇబ్బందులకు గురి చేశారన్నారు. ఇప్పటికే వారి పై పలుమార్లు స్టేషన్ లో పిర్యాదు చేశామన్నారు. కానీ ఇంకా తరచూ మమ్మల్ని భూమి గెట్టు విషయమై వేధింపులకు గురి చేస్తున్నారని, ఈ విషయమై 100కు ఫిర్యాదు చేశామని, స్థానిక పోలిస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేసినా, కానీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. వారి నుండి మా కుటుంబానికి ప్రాణహాని ఉందని అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని కోరారు. కాగా ఈ విషయమై స్థానిక ఎస్సైని ఆంధ్రప్రభ ఫోన్లో వివరణ కోరగా నేడు విజిట్ చేసి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

చంద్రగిరిలో శరవేగంగా క్రీడా వికాస్ కేంద్రం (ఇండోర్ స్టేడియం) పనులు

*చంద్రగిరిలో శరవేగంగా క్రీడా వికాస్ కేంద్రం (ఇండోర్ స్టేడియం) పనులు…

*హర్షం వ్యక్తం చేస్తున్న చంద్రగిరి పట్టణ ప్రజలు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు..

*అంకితభావంతో కృషి చేస్తున్న చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కి కృతజ్ఞతలు తెలుపుకున్న ప్రజలు…

చంద్రగిరి(నేటి ధాత్రి) జూలై 10:

పట్టణ అభివృద్ధిలో భాగంగా రూ.
1.53 కోట్లతో మంజూరైన క్రీడా వికాస్ కేంద్రం (ఇండోర్ స్టేడియం) పునఃనిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పనుల పురోగతి పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఈ క్రీడా వికాస్ కేంద్రం నిర్మాణం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి ఊపందుకుందిభూమిపూజతో పనులు ప్రారంభం కాగా ప్రస్తుతం నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. అధునాతన ఇండోర్ స్టేడియం అందుబాటులోకి వస్తే యువ క్రీడాకారులకు ఎంతో మేలు జరుగుతుందని, చంద్రగిరి క్రీడా రంగంలో మరింత ముందుకు దూసుకెళ్తుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తున్న చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కి ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణీ

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణీ

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

రామకృష్ణాపూర్ పట్టణంలోని భగత్ సింగ్ నగర్ లో గల ప్రాథమిక పాఠశాలలో యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ దాతల సహకారం తో 56మంది విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు తవక్కల్ విధ్యాసంస్థల అధినేత, సీనియర్ నాయకులు అబ్దుల్ అజీజ్ ,గాండ్ల సమ్మన్న మాజీ వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి ల చేతుల మీదుగా స్కూల్ బ్యాగ్ లు పంపిణీ చేశారు.ఈ సంధర్భంగా సీనియర్ నాయకులు మాట్లాడుతూ గురుపౌర్ణమి సంధర్భంగా యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ మంచి కార్యక్రమాన్ని చేయడం హార్షనీయమైన గత 8సంవత్సరాల నుంచి రామకృష్ణాపూర్ పట్టణంలో యువత జనం సభ్యులు సేవలు చేస్తున్నారనీ భవిష్యత్ లో కూడా ఇంకా ఎక్కువ మంది సేవలు చేయాలని సంస్థ సభ్యులనీ అభినందించారు … యువత అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేష్ మాట్లాడుతూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ కు సహాయం చేస్తున్న దాతలందరికీ ముఖ్య అతిథులకు కృతజ్ఞతలు చెప్పారు.. ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్లు రమాదేవి శోభ నాయకులు గూడ సత్తన్న,కోక్కుల సతీష్ సంగ రవి యాదవ్ భాస్కర్ యువత ఉపాధ్యక్షుడు వెరైటీ తిరుపతి , కార్యదర్శి కరుణాకర్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..

విద్యుత్ ప్రమాదంలో గాయపడిన జన్నే అంజి కుటుంబానికి ఆర్థిక చేయూత,

విద్యుత్ ప్రమాదంలో గాయపడిన జన్నే అంజి కుటుంబానికి ఆర్థిక చేయూత,
– 5000 రూపాయలను అందించిన జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ ఐలు మారుతి.
నేటి ధాత్రి- మొగుళ్లపల్లి మండలం మొట్లపల్లి గ్రామానికి చెందిన జన్నె అంజి అనే విద్యుత్తు తాత్కాలిక ఉద్యోగి ఈనెల మూడవ తేదీన ప్రమాదవశాత్తు విద్యుత్తు పోలు నుండి విద్యుత్ షాక్ తగలడం వలన కిందపడి తీవ్ర గాయాలపాలు అయ్యాడు ప్రస్తుతం హైదరాబాదు యశోద హాస్పిటల్ లో మెరుగైన వైద్యం పొందుతున్నాడు,

గాయపడిన జన్నె అంజి నిరుపేద దళిత కుటుంబానికి చెందిన వాడు కావడంతో ఆ కుటుంబం దాతల సహాయం కోసం ఎదురుచూస్తోంది జన్నె అంజి తండ్రి సైతం మంచాన అనారోగ్యంతో లేవలేని స్థితిలో ఉండటంతో ఆ కుటుంబం దీనస్థితిలో ఉంది మొట్లపల్లి సబ్స్టేషన్లో తాత్కాలిక ఉద్యోగిగా పని చేస్తున్న జన్నె అంజి కి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహకారం లేకపోవడంతో.. అంజికి మెరుగైన వైద్యం అందని ద్రాక్షలా తయారయింది. అంజి దయనీయ పరిస్థితి గురించి వివిధ పత్రికలలో కథనాలు రావడంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ అధినేత ఐలు మారుతి స్పందించి బాధిత కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సహాయం అందించాడు అంతేకాకుండా భవిష్యత్తులో తన వంతు సహాయంగా చేతనందిస్తానని భరోసా ముట్లపల్లి తాజా మాజీ సర్పంచ్ నరహరి పద్మా వెంకటరెడ్డి 5000 రూపాయలను అందించగా బజ్జూరి వేణుగోపాల్ వెయ్యి రూపాయలు బజ్జూరి వీరన్న పెడిసిల్ల 1000 రూపాయలు గూడూరి రఘుపతి రెడ్డి 1000 రూపాయలు శ్రీ పల్లి రాజేష్ 2000 రూపాయలు దర్శనాల సురేష్ 2000 రూపాయలు టేకుమట్ల లైన్మెన్ రఘు వెయ్యి ఇలా చాలామంది దాతలు స్పందించి బాధిత కుటుంబానికి అందించి తమ ఔదార్యాన్ని చాటారు ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ ఆయిలు మారుతి. ఆలయ కమిటీ చైర్మన్ గూడూరు రఘుపతి రెడ్డి బజ్జూరి వేణుగోపాల్ బజ్జూరి వీరన్న సీనియర్ జర్నలిస్టు రాళ్ల బండి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు,

కోడిపందాల స్థావరంపై పోలీసుల మెరుపు దాడి

కోడిపందాల స్థావరంపై పోలీసుల మెరుపు దాడి

జైపూర్ ఎస్సై జాడి శ్రీధర్

జైపూర్,నేటి ధాత్రి:

కోడి పందాల స్థావరం పై జైపూర్ పోలీసులు బుధవారం మెరుపు దాడి నిర్వహించినట్లు తెలిపారు.జైపూర్ మండలం దుబ్బ పల్లి గ్రామ శివారులో కొందరు వ్యక్తులు కోడిపందాలు నిర్వహిస్తున్నారని నమ్మదగిన సమాచారం రావడంతో జైపూర్ ఎస్సై శ్రీధర్ తన సిబ్బందితో కలిసి కోడిపందాల స్థావరంపై దాడి చేసి అక్కడ ఉన్నవారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది.వివరాల్లోకి వెళితే సిసిసి నస్పూర్ కు చెందిన గడ్డం సతీష్,లక్షేటి పేట కోమ్మగూడెంకు చెందిన లశెట్టి సురేష్,శ్రీరాంపూర్ తీగల పహాడ్ కు చెందిన చెట్టుకురి రాజేష్ అదుపులోకి తీసుకొని విచారించగా అక్కడినుండి పోలీసులను చూసి కొంతమంది పారిపోయినట్లు వారు తెలిపారు.అక్కడి నుండి పారిపోయిన వ్యక్తులు వివరాలు ఇందారం గ్రామానికి చెందిన కూరగాయల శ్రీకాంత్,యతి రాజు,వంశీ,మహేష్,వైద్య గణేష్ టేకుమట్ల గ్రామానికి చెందిన గోనె శరత్,గోదావరిఖనికి చెందిన పాకి సందీప్,నస్పూర్ కు చెందిన రంగు సాయి, అరుణక్కనగర్ శ్రీరాంపూర్ చెందిన ఉదయ్ పారిపోయినట్లు పేర్కొన్నారు. పట్టుబడిన నేరస్తుల వద్ద నుండి ఒక కోడి,31 కోడి కత్తులు,3840 రూపాయల నగదు,మూడు సెల్ ఫోన్లు,ఏడు వాహనాలు స్వాధీనపరచుకొని జైపూర్ పోలీస్ స్టేషన్ కి తరలించి వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీధర్ తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version