సింగరేణి కంపెనీలో సీమాంధ్ర అధికారుల ఆధిపత్యం
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి కార్మికులకు తీరని అన్యాయం
భూపాలపల్లి నేటిధాత్రి
తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ
సింగరేణి మెడికల్ బోర్డులో కార్మికులకు నిరాశే కొత్తగూడెంలో నిర్వహించిన హయ్యర్ సెంటర్ మెడికల్ బోర్డు కు 55 మంది కార్మికులను పిలిచి కేవలం ఐదుగురిని మాత్రమే మెడికల్ బోర్డు మెడికల్ చేసింది
దాదాపు 9 నెలలుగా ఎలాంటి వేతనాలు లేకుండా మెడికల్ లో ఉంచి కార్మికులను తొమ్మిది నెలలు ఎదురుచూసిన కార్మికుల నోట్లో మట్టి కొట్టిన సీమాంధ్ర అధికారులు
ఈసారి మెడికల్ బోర్డు విషయంలో దళారి వ్యవస్థకు చెక్కు పెట్టిన అంటున్నా అధికారులు
అంటే గతంలో ఈ రూల్స్ పాటించలేదా గత ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని కార్మికులకు అన్యాయం తల పెట్టిందని సింగరేణి వ్యాప్తంగా 12 మంది ఎమ్మెల్యేలను కార్మిక వర్గం గెలిపిస్తే ప్రజా పాలన పేరిట కాంగ్రెస్ పార్టీ కార్మికులకు అన్యాయం తలపెడుతున్నది
కాంగ్రెస్ ప్రభుత్వంలో టాప్ రెండు పదవులలో ఉన్న నాయకుల మధ్య కోల్డ్ వార్ లో సమిదాలైన మెడికల్ బోర్డు దరఖాస్తు దారులు ఇన్నాళ్లుగా అన్యాయంగా మెడికల్ ఇన్వాల్విడేషన్ చేసిందిఎవరు సింగరేణి ఉన్నంత యాజమాన్యానికి ఇది తెలియదా
ప్రభుత్వ ఆది నాయకత్వానికి తెలియదా
జరుగుతున్న ఉల్లంఘన తెలిసే నూతనంగా ఐఏఎస్ అధికారిని ప్రభుత్వం తన తర్వాత ఉన్న వారికి చెక్కుపెట్టి మెడికల్ బోర్డులో జరిగే లావాదేవీలను నియంత్రించడానికి ఇతనిని నియమించారు అనుకుందాం ఈ మెడికల్ బోర్డు ఫలితాలు తార్ మార్ కావడంతో ఎన్నో కుటుంబాలు వీధిపాలయ్యాయి ఈ కొత్తగా వచ్చిన అధికారి ఇంతటితో ఆగలేదు 35 సంవత్సరాల నుండి 45 ఏళ్ల లోపు వారికి కారుణ్య నియామకాలకు అర్హత ఇచ్చింది కంపెనీ ఆ మాజీ ఉద్యోగులు వారి పిల్లలకు ఉద్యోగం దొరకాలనే గంపెడు ఆశతో ఓపెన్ స్కూల్ టెన్త్ సర్టిఫికెట్లువయసు 35 లోపు ఉండేలా పెట్టుకున్నారు 40 కి అర్హత వచ్చాక సింగరేణి యాజమాన్యం అడగడంతో వారి ఒరిజినల్ రెగ్యులర్ టెన్త్ సర్టిఫికెట్లు సంక్షేమ అధికారులకు అమాయకంగా ఇచ్చారు
కొత్తగా వచ్చిన బాస్ వాళ్లను మోసగాళ్లుగా ప్రకటించారు ఉద్యోగాలు కాదు కదా యంఎంసి డబ్బులు కూడా వారికి రద్దు చేశారు ఆ కుటుంబాలన్నీ ఆర్థికంగా నష్టపోయాయి
సింగరేణిలో కార్మిక వర్గానికి ఇంత అన్యాయం జరుగుతున్న సింగరేణి కార్మిక వర్గం ఓట్లతో గెలిచిన గుర్తింపు ప్రాతినిత్య సంఘాలు నోరు మేతపడకపోవడంలో అంతరాయం ఏంటి
మూడు నెలలుగా కారుణ్య నియామకాలు ఆగిపోయినాయి ఒక్కరికి సైత్యం ఆర్డర్ ఇవ్వలేదు
కార్మిక వర్గం పడుతున్న బాధలు తెలియని ఇతర ప్రాంతాల అధికారులు ఇరువురు ఈ కారుణ్యనియామక నష్టానికి కార్మికులు రక్త మాంసాలను ద్వారా పోసి ఇన్ని సంవత్సరాలు కంపెనీకి సేవ చేస్తే కార్మికుల యం ఎం సి డబ్బులు రాకుండా ఉండడానికి కారణం ఎవరు అని కార్మికులు భావిస్తున్నారు
ప్రజా పాలనతో రాష్ట్రాలో కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన అమీలను అమలు పరచాలని మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న ప్రతి కార్మికునిమెడికల్ ఇన్వాలిడేషన్ చేసి వారి కుటుంబంలో ఎలాంటి షరతులు లేకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం సింగరేణి కంపెనీని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
కార్యక్రమంలో
టి ఎస్ యు ఎస్ కార్మిక సంఘం నాయకులు
దాసరి జనార్ధన్
నామల శ్రీనివాస్
కాసర్ల ప్రసాద్ రెడ్డి
రాళ్ల బండి బాబు
జయశంకర్
కే నరసింహారెడ్డి
ఎండి సలీం
తదితరులు పాల్గొన్నారు