కాంగ్రెస్ కార్యకర్త అంతిమయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
గంగాధర నేటిధాత్రి :
గంగాధర మండల కేంద్రానికి చెందిన రాజుల ఆదిరెడ్డి శుక్రవారం రోజున కొత్తపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శనివారం గంగాధర మండల కేంద్రంలో ఆదిరెడ్డి అంతిమయాత్రను నిర్వహించగా శాసనసభ్యులు డాక్టర్ మేడిపల్లి సత్యం అంత్యక్రియలో పాల్గొని ఆదిరెడ్డి మృతదేహానికి నివాళులర్పించారు. ఆదిరెడ్డి కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అంతిమయాత్రలో ఆదిరెడ్డి పాడె ను మోశారు. ఆదిరెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చి, కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. కాంగ్రెస్ పార్టీ ఒక మంచి కార్యకర్తను కోల్పోయిందని, ఆదిరెడ్డి ఆత్మకు భగవంతుడు శాంతిని చేకూర్చాలని ఆకాంక్షించారు.