గాజర్ల రవి అలియాస్ గణేష్ మృతదేహం గ్రామానికి తరలింపు.
నేడే అంత్యక్రియలు ముగిసిన 33 ఏళ్ల గాజర్ల కుటుంబ ప్రస్థానం.
సెంట్రల్ కమిటీ సభ్యుడు హోదాలో మరణం. జీర్ణించుకోలేని కుటుంబ సభ్యులు.
చిట్యాల నేటి ధాత్రి:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉమ్మడి చిట్యాల మండలంలోని వెలిశాల గ్రామానికి ఓ చరిత్ర ఉంది ఆ చరిత్ర నేటితో ముగియనుందా అనే సందేహం కలుగుతుంది వెలిశాల తల్లడిల్లుతుంది ఈ ప్రాంతంలో నక్సల్స్ ఉద్యమానికి పురుడు పోసిన గాజర్ల కుటుంబంలో మరొకరు పోలీసుల ఎన్కౌంటర్లో మృతి చెందారు, వివరాల్లోకి వెళితే గాజర్ల సారయ్య అలియాస్ ఆజాద్ 2008 ఎన్కౌంటర్లో చనిపోగా తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుపల్లి అడవుల్లో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో గాజర్ల రవి అలియాస్ గణేష్ మృతి.
చెందిన విషయం తెలిసిందే దీంతో గాజర్ల కుటుంబ ప్రస్థానం ఉద్యమంలో ముగిసినట్లయింది, రవి మృతదేహం కోసం బయలుదేరిన గాజర్ల అశోక్ అలియాస్( ఐతు) ఆంధ్రప్రదేశ్లోని రంపచోడవరం కు బయలుదేరి మృతదేహాన్ని తీసుకొస్తున్న క్రమంలో చిట్యాల చౌరస్తాలో రవి మృతదేహానికి గౌడ సంఘం నేతలు మరియు తన చిన్ననాటి స్నేహితులు బంధువులు ప్రజలు నివాళులర్పించి రవన్న అమరహే అంటూ నినాదాలు చేశారు ,ఈ సందర్భంగా గాజర్ల రవి అలియాస్ గణేష్ తమ్ముడు అశోక్ మీడియాతో మాట్లాడుతూ డెడ్ బాడీ కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరం అని కావాలని కాలయాపన చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ చనిపోయిన శవాలను చూసి భయపడాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వానికి రావడం నిజంగా చాలా దురదృష్టకరం అని కనీసం డెడ్ బాడీనికూడా చూపించడానికి ఉదయం 8 గంటల నుండి వేడుకుంటే రాత్రి 12 గంటలకు డెడ్ బాడీని అప్పజెప్పారు అని ఫోరోనిక్స్ వాళ్ళు లేరని నిర్లక్ష్యం సమాధానం చెబుతూ చాలా కాలయాపన చేశారు అని.ఈ ప్రాంత పోరాటం కోసం ఎన్నో పోరాటాలు చేసిన రవి మృతదేహాన్ని చూడడానికి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు కడసారి చూపు కోసం నోచుకునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు, డెడ్ బాడీ కోసం ఆంక్షలు పెట్టి ఇచ్చారని ఈ విషయం తెలంగాణ గవర్నమెంట్ కు మరియు పోలీస్ శాఖ వారికి ముందస్తుగా సమాచారం ఇవ్వడం జరిగిందని అట్లాంటి సంఘటనలు ఏమీ జరగవు అని ఈ సందర్భంగా తెలిపారు, కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అభిమానులు అందరూ శుక్రవారం రోజు జరిగే జరిగే అంత్యక్రియలో పాల్గొనాలని అన్నారు, మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించినవారు తెలంగాణ గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీపతి గౌడ్ ఉపాధ్యక్షులు తడక సుధాకర్ ప్రధాన కార్యదర్శి బుర్ర రమేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బుర్ర లక్ష్మణ్ గౌడ్ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య అభిమానులు బంధువులు తదితరులు ఉన్నారు.
బిలియన్ పాస్‌వర్డ్స్ లీక్.. గూగుల్ సహా అనేక సంస్థల యూజర్ డాటా బట్టబయలు
యాపిల్, గూగుల్ సహా పలు డిజిటల్ సర్వీసులకు చెందిన 16 బిలియన్ పాస్‌వర్డ్స్, ఇతర లాగిన్ డీటెయిల్స్ బహిర్గతం కావడం సంచలనంగా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: ఒకటి కాదు రెండు కాదు..
ఏకంగా 16 బిలియన్‌ల పాస్‌వర్డ్స్, ఇతర లాగిన్ క్రెడెన్షియల్స్ బహిర్గతమవడం ప్రస్తుతం సైబర్ ప్రపంచంలో సంచలనం రేకెత్తిస్తోంది.
గూగుల్, యాపిల్, గిట్ హబ్, ఫేస్‌బుక్, టెలిగ్రామ్ మొదలు ప్రభుత్వ సర్వీసుల వరకూ అనేక సంస్థల్లోని యూజర్ల లాగిన్ క్రెడెన్షియల్స్ బయటకుపొక్కడం కలకలం రేపుతోంది.
ఈ మేరకు ఫోర్బ్స్ ఓ సంచలన నివేదిక వెలువరించింది.
ఇప్పటికే 184 మిలియన్ యూజర్ రికార్డులు బట్టబయలు అయినట్టు సైబర్ నిపుణులు ఇటీవల ప్రకటించారు.
ఇప్పుడు ఏకంగా 16 బిలియన్ లాగిన్ వివరాలు బహిర్గతమవడంపై సైబర్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఫోర్బ్స్ పత్రిక కథనం ప్రకారం, లాగిన్ వివరాలకు సంబంధించి 30 డాటా సెట్స్ బయటపడ్డాయి.
ఒక్కో సెట్‌లో 3.5 బిలియన్ వివరాలు ఉన్నాయి. సోషల్ మీడియా లాగిన్ వివరాలు, వీపీఎన్ లాగిన్ డీటెయిల్స్‌తో పాటు కార్పొరేట్, డెవలపర్ వేదికల లాగిన్ వివరాలు కూడా
ఈ డాటా సెట్స్‌లో ఉన్నాయి.
ఇదేమీ సాధారణమైన లీక్ కాదని సైబర్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ డాటాను భారీ స్థాయిలో దుర్వినియోగపరిచే ఆస్కారం ఉందని అంటున్నారు.
వీటిని ఆయుధంగా మలిచే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఫిషింగ్ ఎటాక్స్, అకౌంట్ టేకోవర్స్, బిజినెస్ ఈమెయిల్ కాంప్రమైజ్ ఎటాక్స్‌కు వినియోగించే అవకాశం ఉందని అంటున్నారు.
అత్యంత విలువైన లాగిన్ క్రెడెన్షియల్స్ కూడా ఇలా బహిర్గతమవడంతో దీర్ఘకాలిక పరిణామాలు ఉంటాయని కీపర్ సెక్యూరిటీ కోఫౌండర్, సీఈఓ డేరెన్ గుసియోన్ హెచ్చరించారు.
ఇలాంటి దాడుల జరిగే అవకాశం ఉందని గూగుల్ లాంటి సంస్థలు ముందే ఊహించాయి.
యూజర్లు తమ డిజిటల్ అకౌంట్స్‌కు తాళం వేసుకునేందుకు పాస్‌వర్డ్స్, టూ ఫాక్టర్ ఆథెంటికేషన్‌లకు బదులు పాస్‌కీలు వాడాలని చెబుతున్నాయి.
ఇది బయోమెట్రిక్ ఆధారంగా పనిచేసే గుర్తింపు ధ్రువీకరణ వ్యవస్థ.
పాస్‌వర్డ్స్ వినియోగం ఇక ఎంత మాత్రం సురక్షితం కాదని భావిస్తున్న అనేక డిజిటల్ సంస్థలు పాస్‌కీల వైపు మళ్లుతున్నాయి.
పాస్‌కీతో యూజర్లు స్మార్ట్‌ఫోన్ల ద్వారా తమ బయోమెట్రిక్ ధ్రువీకరించుకున్నాకే లాగిన్ అయ్యే అవకాశం కలుగుతుంది.
పాస్‌కీలతో ఫిషింగ్ దాడులనుంచి పూర్తి రక్షణ లభిస్తుందని గూగుల్ చెబుతోంది.
పాస్‌కీలు వాడేటప్పుడు వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లో ఫింగర్ ప్రింట్, ఫేషియల్ స్కాన్ లేదా ప్యాటర్న్ లాక్ ఉపయోగించి తమ అకౌంట్‌లోకి లాగిన్ కావొచ్చు.
ఝరాసంగం మండల ఆయా గ్రామాల ప్రజలకు కొత్తగా వచ్చిన పట్టాదారు పాస్ పుస్తకం గల రైతులు ధరఖాస్తు పెట్టుకోవడానికి .చివరి తేదీ 20 జూన్ 2025 శుక్రవారం.(వ్యవసాయ పెట్టుబడి సహాయం పథకం వానాకాలం 2025-26) 05.06.2025 వరకు కొత్తగా వచ్చిన పట్టాదారు పాస్ పుస్తకం గల రైతులు దరఖాస్తు పెట్టుకోవడానికి అవసరమైన పత్రాలు: 1. పట్టాదారు పాస్ పుస్తకం లేదా డిజిటల్ సంతకం అయినా జిరాక్స్ 2. ఆధార్ కార్డు జిరాక్స్. 3. బ్యాంకు సేవింగ్ ఖాతా జిరాక్స్. 4. పూర్తిగా నింపబడిన దరఖాస్తు ఫారం. ఈ పత్రాలను మీ క్లస్టర్ అధికారి అయిన వ్యవసాయ విస్తీర్ణ అధికారి గారికి సమర్పించాలి. గమనిక 1 : 05.06.2025 నాటికి భూ భారతి (ధరణి) పోర్టల్ లో ఉన్న పట్టాదారుల డేటా రైతు భరోసా పథకం కింద అర్హులైన రైతులకు సాయం అందించేందుకు భూమి పరిపాలన ప్రధాన కమిషనర్ (CCLA) నుండి పొందబడింది. డిజిటల్ సంతకం అయినా రైతులు అర్హులు. గమనిక 2: గతంలో రైతు బంధు పొందిన రైతులు మళ్లీ దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు హారి వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించగలరు
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల కేంద్రం నుంచి ఝరాసంగం మండలం కప్పాడు గ్రామం వరకు నిర్మించిన తారు రోడ్డు ఏడాది గడవకుండానే పాడవటం పై బిఎస్పి జిల్లా ఇంచార్జి మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సిహ్మ ఇలాకాలో సంబంధిత అధికారులు నాణ్యత ప్రమాణం పాటించకపోవడంపై బీఎస్పీ ఇంచార్జి మోహన్ ఎద్దేవా చేశారు.. పాడైన రోడ్డు ను, ప్యాచ్ వేసేందుకు చేపట్టిన పనులను గురువారం అయన పరిశీలించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ అధికారులు రోడ్డు నిర్మాణ సమయం లో నిర్లక్షంగా వ్యవహరించడం వల్లనే మూన్నాలకే రోడ్డు పై తారు లేచిపోయి గుంతల మాయంగా మారిపోయిందని, దీంతో ప్రయాణికుల, వాహన దారుల కష్టాలు పునరావృతం అయ్యయన్నారు. రోడ్ లు, భావనలు నిర్మాణ క్రమంలోనే సంబంధిత ఇంజనీర్ లు తగిన విధులు నిబద్దతతో నిర్వహిస్తే ప్రజలకు ఇబ్బందులు ఉండవన్నారు. ఇప్పటికైనా అధికారులు, తారు, సీసీ రోడ్డు లు, భవనాలను ఎస్టిమేషన్ లకు తగ్గట్లు నిర్మించి తమ విధులను సక్రమంగా నిర్వహించాలని కోరారు. రోడ్ లు, భవనాల నిర్మాణం లో మరోసారి నిర్లక్ష్యం వహిస్తే జిల్లా, రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులకు పిర్యాదు చేసి నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరానున్నట్లు తెలిపారు. కొన్ని రోజుల క్రితం వర్షంలో చెర్ల రాయిపల్లి లోని వంతెన నిర్మాణాన్ని కొనసాగించిన అంశం, పలు గ్రామాల్లో నాసిరకం ఇసుకతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. నిబంధనల మేరకు అధికారులు నడుచుకోకపోతే ప్రజలతో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
మజ్లిస్ ఇత్తెహాద్-ఉల్-ముస్లిమీన్ మరియు జహీరాబాద్ జిల్లాలోని వివిధ సామాజిక నాయకులు ఈద్గా ముందు ఉన్న కొత్త ఫ్లైఓవర్ వంతెన పైన ఉన్న సైన్ బోర్డుపై ఉర్దూ భాషను విస్మరించారు. మజ్లిస్ ఇత్తెహాద్-ఉల్-ముస్లిమీన్ జహీరాబాద్ అధ్యక్షుడు ముహమ్మద్ అథర్ అహ్మద్ పార్టీ నాయకులు మరియు సామాజిక నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు మరియు సైన్ బోర్డు ఏర్పాటును నిలిపివేశారు మరియు ఉర్దూ సైన్ బోర్డు ఏర్పాటు చేసే వరకు పనిని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. దీనిపై, ఆర్ అండ్ బి అసిస్టెంట్ ఇంజనీర్ సింధియా మరియు సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జహీరాబాద్-2-IN వినయ్ కుమార్ అధ్యక్షుడు మజ్లిస్ జహీరాబాద్ ముహమ్మద్ అథర్ అహ్మద్ కు 24 గంటల్లోగా సైన్ బోర్డును ఉర్దూలో రాయించుకుంటామని హామీ ఇచ్చారు. బుధవారం, సైన్ బోర్డు ఉర్దూలో వ్రాయబడింది.దీనిపై, మజ్లిస్ జహీరాబాద్ అధ్యక్షుడు ముహమ్మద్ అథర్ అహ్మద్,మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ తరపున మరియు జహీరాబాద్ ముస్లింల తరపున, R&B విభాగం మరియు పోలీసు శాఖకు ధన్యవాదాలు మరియు ఈ నిరసనలో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు.ఈ సందర్భంగా, మజ్లిస్ పార్టీ సభ్యులు ముతామర్ బిన్ అమీర్ బిన్ అబ్దుల్లా, షేక్ ఇలియాజ్,మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ మహమ్మద్ అలీమ్,మహమ్మద్ సమీర్ మహమ్మద్ అఫ్సర్ మహమ్మద్ ఖవాజా తదితరులు పాల్గొన్నారు.
`సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకునేదెప్పుడు.
హైదరాబాద్,నేటిధాత్రి:
చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్లు చిత్ర సీమలో సినీ గద్దలు దూరారు. 14 ఎకరాలు సొంతం చేసుకున్నారు. అందులో రోహౌస్‌లు నిర్మాణం చేసుకున్నారు. వాటిపై ఇప్పుడు అంతస్ధులు పెంచుకుంటున్నారు. అడిగే దిక్కులేదు. అడిరదేందుకు ముందుకు వచ్చేవారు లేరు. అటు ప్రభుత్వానికి పట్టింపు లేదు. ఇటు మున్సిపల్ శాఖ నిర్లక్ష్యం వెరసి, కార్మికులకు తీరని అన్యాయం జరిగింది. ఇంకా జరుగుతూనేవుంది. కార్మిక పక్షపాతిగా ఒకప్పటి తెలంగాణకు చెందిన సీనియర్ నటుడు సినీ కార్మికుల సంక్షేమాన్ని కోరి, తన స్ధలం కొంత ఇచ్చారు. ఆయనే దగ్గరుండి ప్రభుత్వం చేత 64ఎకరాలు ఇప్పించాడు. కార్మికులు రూపాయి, రూపాయి వేసుకున్నారు. ఒక సంఘంగా ఏర్పడ్డారు. ఇంతలో ఆ నటుడు కాలం చేశాడు. ఆ స్ధలం మీద పెత్తనం కోసం గద్దలు వాలాయి. కార్మికులను తరిమేశాయి. కార్మికులకు చోటులేకుండాచేశాయి. కార్మికుల చెమటను గద్దలు అత్తరు చేసుకొని కులుకుతున్నాయి. ఇంత దుర్మార్గం ఎక్కడా వుండదు. సమాజంలో ఇంత నీతి మాలిన పని ఎక్కడా కనిపించదు. పైకి కార్మిక పక్షపాతుల్లా ఫోజులు కొట్టి, ఆఖరుకు ఆ కార్మికులకే చోటు లేకుండా చేసిన దుర్మార్గపు సమాజం సినీ లోకం. సినిమా పేరుతో ఎంతో మందిని మోసం చేస్తారు. వెట్టి చారికీ చేయించుకుంటారు. నిర్మాతలుగా మారిన వారు కోట్లు కూడబెట్టుకున్నారు. కార్మికుల కష్టం దోచుకొని వారి రక్తం తాగారు. సినీ సంక్షేమం అనగానే ఇలాంటి చిన్న చిన్న కార్మికుల చేత రక్తదానాలు చేయిస్తారు. ప్రచారం చేయించుకుంటారు. సినిమాల నిర్మాణంలో వెట్టి చాకిరీ చేయించుకుంటారు. ఇలా అన్ని రకాలుగా అన్యాయమైపోతున్నా సినీ కళామ తల్లిని నమ్ముకొని మంచిరోజులు రాకపోతాయా? అని జీవితం కాలం ఎదరుచూసి తనువు చాలించి సినీ కార్మికులు ఎంతో మంది వున్నారు. తాము లేకపోయినా తమ కుటుంబాలకు ఓ నీడ కావాలని కలలుగని, సంపాదించిన సొమ్మును చిత్రపురిలో ఇండ్లకోసం పెట్టుబడి పెట్టినవాళ్లున్నారు. ఇప్పటికీ నీడ లేక, అటు అవకాశాలు లేక, ఇటు సంపాదన చాలక, చస్తూ బతుకుతున్న కార్మికులు వేలల్లో వున్నారు. ఇది నాచిత్రపురి. ఇక్కడ నాకు ఇంత చోటొస్తుందని కలలుగన్న కార్మికులు ఎంతో మంది వున్నారు. శ్రమకోర్చి సంపాదించిన సొమ్మును చెమట చేతులతో సభ్యతాలు తీసుకున్న వాళ్లు ఇప్పుడు కన్నీళ్లు కారుస్తున్నారు. దుఖం అనుభవిస్తున్నారు. శాపాలు పెడుతున్నారు. అయినా గద్దలకు సిగ్గు శరం ఏమీ రావడం లేదు. సిగ్గూ ఎగ్గులేని సమాజంగా తయారైన సినిమా ప్రపంచంలో కార్మికుల కన్నీళ్లకు విలువ లేకుండా చేశారు. తెరమీద నటనలో కన్నీటికి కోట్లు కుమ్మరిస్తున్నారు. కొంత మంది కబంధహస్తాలలో పరిశ్రమను పెట్టుకొని కార్మికుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. సినీ సభ్యత్వముంటే చాలు అదే ఐఎఎస్ పాసైనంత అల్ప సంతోషులు మోసం చేయడానికి చిత్ర పరిశ్రమ పెద్దలకు ఎలా మనసొస్తుందో తెలియదు. సినిమాల్లో కన్నీళ్లు, కష్టాలు, మనసులు, మమతలు, అనుబందాలు, ప్రేమలు, తిరుగుబాటు, చైతన్యం అన్ని చూపిస్తుంటారు. ప్రేక్షకులను రంజింపజేసి కోట్లు మూట గట్టుకుంటారు. ఆ సినిమాలకు పనిచేసిన కార్మికులకు మాత్రం ఇవేవీ లేకుండా చేస్తున్నారు. వారి జీవితాలు వీది పాలు చేస్తున్నారు. కూడులేని, గూడు లేని రోడ్డుమీద బతుకులు చేస్తున్నారు. కార్మికుల కోసం ప్రభుత్వం ఇచ్చిన చిత్రపురిలో అసలైన సినీ పెద్దలు గద్దలుమా మారి 14 ఎకరాల్లో వాలిపోయారు. నిజానికి చిత్రపురికి సంబంధించిన 67 ఎకరాల్లో జీవో.నెంబర్. 658ప్రకారం అన్ని అప్పార్టుమెంట్లు మాత్రమే నిర్మాణం చేయాలి. అప్పార్టుమెంటు ప్లాట్లే కార్మికులు ఎవరైనా సరే అందించాలి. అందులో చిన్న చితాక నటుల, ఇతర కార్మికుల అందించాలని అప్పటి ప్రభుత్వం జీవో జారి చేసింది. దాన్ని కొంత మంది పెద్దలు అప్పట్లో తిమ్మిని బమ్మిని చేసి, అప్పటి మున్సిపల్ అధికారులకు తప్పు తోవ పట్టించి,నమ్మించి 14 ఎకరాలు వారి పరం చేసుకున్నారు. అలా 14 ఎకరాలు సొంతం చేసుకున్న సినీ పెద్దలు రోహౌజ్‌లు నిర్మాణం కోసం ప్రతిపాదనలు పెట్టుకున్నారు. అప్పటి సొసైటీ కూడా సినీ పెద్దలకు వంతపాడి వారికి కట్టబెట్టింది. తొలుత 1450 ఎస్‌ఎఫ్‌టిల స్ధలం కేటాయించి, మళ్లీ దాన్ని 2250 ఎస్‌ఎఫ్‌టికు మార్చుకున్నారు. కాని అది మున్సిపల్‌లో అప్రూవ్ కాలేదు. అయినా సినీ పెద్దలమనే అహంకారంతో అందర్ని బెదిరంచి రోహౌజ్‌లు నిర్మానం చేసుకున్నారు. అయితే అక్కడ కూడా రోహౌజ్‌ల నిర్మాణం జరిగినా, అవి కూడా అప్పార్టుమెంట్లలాగా, మిగిలిన మరింత మందికి పైన నిర్మాణాలు చేసి, ఇతరులు అందిస్తామని చెప్పారు. ఆ మాట తప్పారు. అవి వారి సొంతం చేసుకున్నారు. వాటిపై పూర్తి ఆదిపత్యం కొనసాగిస్తున్నారు. చిత్ర పురి సొసైటినీ కూడా దిక్కరించి, వారి ఇష్టాను సారం నిర్మాణాలు చేసుకుంటున్నారు. మొత్తం 225 రో హౌజ్‌లు నిర్మాణం జరిగాయి. అందులో ఇప్పుడు 72 రోహౌజ్‌ల పెద్దలు వాటిపై అంతస్ధుల మీద అంతస్ధులు నిర్మాణాలు చేసుకుంటున్నారు. అందుకు మున్సిపల్ అనుమతులు ఎక్కడా లేవు. రో హౌజ్‌ల నిర్మాణం జరుగుతున్నప్పటి నుంచి కార్మిక లోకం అడ్డుకుంటూనే వుంది. ఉద్యమాలు చేసింది. పోరాటాలు చేసింది. అయినా వారి వేదన అరణ్య రోధనే అయింది. ఆ స్ధలం విలువ కోట్లలో వుంటుంది. సినీ పెద్దలకు అసలు చిత్రపురిలో చోటు లేదు. వుండొద్దు కూడా..అలాంటి రోహౌజ్‌లు ఏకపక్షంగా నిర్మాణం చేసుకోవడం చట్టరిత్యా నేరం. వాటిని కూల్చేయాలిన కార్మికులు ఎప్పటినుంచో పోరాటాలు చేస్తున్నారు. రోహౌజ్‌లు నిర్మాణాలున్న చోట అప్పార్టుమెంట్లు నిర్మాణం చేస్తే కనీసం మరో 3వేల మంది కార్మికులకు ఇండ్లు ఇవ్వొచ్చు. కాని కేవలం 225మంది పెద్దలు వాటిలో దూరిపోయారు. ఆ స్ధలాన్ని ఆక్రమించుకున్నారు. ఇప్పటికైనా మించిపోయంది లేదు. ప్రభుత్వం చొరవ తీసుకొని రోహౌజ్‌లను కూల్చివేస్తే కొన్ని వేల మంది కార్మికులకు న్యాయం జరుగుతుంది. అసలు రోహౌజ్‌ల నిర్మాణాలే చట్ట విరుద్దమంటుంటే, లెక్క చేయకుండా 72 మంది సినీ పెద్దలు వాటిపై మరిన్ని నిర్మాణాలు సాగిస్తున్నారు. అక్కడ ఎలాంటి అదనపు నిర్మాణాలకు అనుమతులు లేవు. అయినా నిర్మాణాలు చేపడుతున్నారు. అధికారులు చోద్యం చూస్తున్నారు. అలాంటి నిర్మాణాలు చేపడుతుంటే చిత్రపురి సొసైటీ ఏం చేస్తుందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. చిత్రపురి విషయంలో సొసైటీకి పూర్తి స్ధాయి అధికారాలున్నాయి. ఆ 67 ఎకరాల్లో ఎలాంటి నిర్మాణాలు సాగించాలన్నదానిపై పూర్తి హక్కులు సొసైటీకి మాత్రమే వున్నాయ. ఆ సొసైటీలో ఎవరి జోక్యం వుండకూడదు. సినీ పెద్దలు ఎంతటి వారైనా సరే వారి మాటలను సొసైటీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాని సొసైటీ పెద్దలను కూడా లెక్క చేయకుండా, సినీ పెద్దలు ఇలాంటి అక్రమ నిర్మాణాలు సాగించడం నేరం. కార్మికులలో కొంతమంది సినీ పెద్దలకు వంతపాడుతూ, సొసైటీలోని ఇతర అప్పార్టుమెంట్ల విషయంలోనూ, ట్విన్ టవర్స్ లలో వివాదాలు సృష్టిస్తున్నారు. కాని 14 ఎకరాలు అక్రమంగా సినీ పెద్దలు ఆక్రమించుకున్నారన్నదానిపై కొన్ని కార్మిక సంఘాలు ప్రశ్నించకపోవడం విడ్డూరం. కార్మికుల్లో వున్న అనైక్యతను ఆసరా చేసుకొని సినీ పెద్దలు ఆటలాడుతున్నారు. కార్మికులను విభజించి పాలించు అనే రాజకీయం చేసి, కార్మికులకే తీరని అన్యాయం చేస్తున్నారు. ఈ సంగతి కొంత మంది కార్మికులు గుర్తించలేకపోవడం గమనార్హం. అందుకే కార్మికులను వర్గాలుగా విభజించి, సినీ పెద్దలు నాటకాలు ఆడుతున్నారు. అందరు కార్మికులు ఏకమైతే తమ పప్పులుడకవని, కార్మికుల్లో వారికి వారికే లేనిపోని పంచాయతీలు పెడుతున్నారు. కొంత మంది కార్మికులకు అండగా వున్నట్లు నటించి, వారిని ఉసిగొల్పి చిత్రపురిని అబాసు పాలు చేయిస్తున్నారు. దాంతో సొసైటీ కూడా ఏం చేయలేకపోతోంది. ఇప్పటికైనా మించిపోలేదు. కార్మికులంతా ఏకమైన రోహౌజ్‌లు కూల్చివేత వరకు పోరాటం చేయాలి. అసలైన పోరాటం ఇక్కడి నుంచే మొదలు పెట్టాలి. ముందు రోహౌజ్‌ల కూల్చివేత జరిగితే, ఆ స్ధలంలో ఎంత లేదన్నా కనీసం మరో 3వేల మంది కార్మికులకు నీడ కల్పించొచ్చు. ప్రస్తుతం చేపడుతున్న ట్విన్ టవర్స్‌లాగా మరిన్ని అప్పార్టుమెంట్లు నిర్మాణం చేయొచ్చు. కార్మికలందిరకీ న్యాయంచేయొచ్చు. కార్మిక సోదరులు వాళ్ల మధ్య విభేదాలు పక్కన పెడితే, కార్మికుల సొంతింటి కల నెరవేరడం ఖాయం. లేకుంటే జీవితాంతం గూడు కోసం పోరాటమే శరణ్యం. ఏది కావాలో తేల్చుకుంటే సమీప భవిష్యత్తులోనే సొంతిళ్లు సొంతం చేసుకోవచ్చు. కార్మికులపక్షాన నేటిధాత్రి చేస్తున్న అక్షరపోరాటం నిజం చేసుకోండి. మీ సొంతింటికల నెరవేర్చుకోండి.
`మిల్లర్ అసోసియేషన్ అంతర్లీనంగా జగన్ ను ఎందుకు కాపాడుతున్నట్లు!
`జగన్ వెనుక ఉండి మిల్లర్ల అసోసియేషన్ రాష్ట్ర నాయకుడు నడిపిస్తున్నాడా?
`కమీషనర్ కు హన్మకొండ జేసి రాసిన లేఖతో బట్టబయలు.
`రైతులను ఒప్పించిన తర్వాతే బస్తాలలో కోత అని జగన్ వాదనలు.
`హన్మకొండ జిల్లాకు వడ్లను పంపించింది ఖమ్మం జేసి.
`వడ్లను అప్పగిస్తూ హన్మకొండ లోని ఇతర మిల్లులకు ఆర్వోలు.
`హన్మకొండ అధికారుల అత్యుత్సాహంతో జగన్ మిల్లులకు చేరిన వడ్లు.
`రైతుల వద్ద జగన్ వడ్లు కొనుగోలు చేయలేదు.
`అలా అయితే నేరుగా జగన్ మిల్లుల పేరు మీదే వడ్లు వచ్చేవి.
`ఇంతటి గందరగోళం నెలకొని వుండకపోయేది.
`అసలు ఖమ్మం నుంచి వచ్చింది వడ్లకు జగన్‌కు సంబంధమే లేదు.
`కనీసం మధ్య వర్తిత్వం కూడా జరగలేదు.
`జగన్ అసలు ఖమ్మం వెళ్లనే లేదు. రైతులను కలిసిందే లేదు.
`అలాంటప్పుడు జగన్ రైతులను ఎలా ఒప్పించినట్లు!
`జగన్ చెప్పిన విషయాలకు హన్మకొండ జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు ఎలా తలూపినట్లు?
`కమీషనర్ కు హన్మకొండ జేసి లేఖలో ఈ ప్రస్తావన ఎందుకు చేసినట్లు?
`జేసిని హన్మకొండ సివిల్ సప్లయ్ అధికారులు తప్పు దోవ పట్టించారా?
`జగన్‌ను కాపాడతామని గతంలో అధికారులు అన్నంత పని చేశారా?
`కులమే ముఖ్యమని గతంలో చెప్పిన అధికారులు జగన్‌ను కాపాడుతున్నారా!
`రైతులను అడ్డంగా మోసం చేసిన జగన్‌ను ఎందుకు వెనకేసుకొస్తున్నట్లు?
హైదరాబాద్,నేటిధాత్రి: ఒక తప్పు వంద తప్పులు చేయిస్తుంది. ఒక మోసం వంద మోసాలు చేసేలా చేస్తుంది. ఒక అబద్దం వెయ్యి అసత్యాలను చెప్పిస్తుంది. కాని తప్పు చేయొద్దన్న భావన వుంటేనే మనిషంటారు. లేకుంటే మోసగాడంటారు. రైతులను మోసం చేసిన వారిని దుర్మార్గులంటారు. ఆరు గాలం కష్టపడి ఎండననక, వాననక, రాత్రి పగలు తేడా లేకుండా ఒక్కొ గింజను అపురూపంగా చూసుకుంటాడు. చేలు నుంచి ఒక్క వడ్ల గింజ రాలినా కన్నీరు కారుస్తాడు. వరి చేలును కంటికి రెప్పలా చూసుకుంటాడు. కన్న బిడ్డలను పెంచుకున్నట్లు పెంచుకుంటాడు. అలాంటి రైతులను మోసం చేయడం పాపం. చట్టపరంగా నేరం. అన్నీ తెలిసినా కొంత మంది జగన్ లాంటి మిల్లర్లు మోసాలు చేస్తూనే వుంటారు. రైతుల గోస పుచ్చుకుంటూనే వుంటారు. అలాంటి వారిని ప్రభుత్వాలు ఉపేక్షించకూడదు. రైతులు చెమట కష్టంతో పండిరచే ఒక్కవడ్ల గింజను మోసం చేసినా, అది క్షమించరానిదే. ఇప్పుడున్న టెక్నాకలజీ ప్రకారం వడ్లలో వున్న తేమను క్షణాల్లో గుర్తించే అవకాశంవుంది. గతంలో వ్యాపారులు చెప్పిందే రైతు వినేవారు. రైతులను బెదిరించేవారు. ఇప్పుడున్న సదుపాయలు రైతులకు అప్పుడు లేవు. రైతులే తమ ఎడ్ల బండ్ల ద్వారా రైస్ మిల్లులకు, వ్యాపారులు వడ్లను తీసుకెళ్లేవారు. అప్పుడు వ్యాపారి చెప్పిందే చేసేవారు. అయినా అప్పుడు ఇంతగా మోసాలు లేవు. అరచేతిలో వడ్లుపట్టుకొని రైతుల రెండు చేతులతో నలిపి బియ్యం తీసి చూపించి, వ్యాపారుల నోరు మూయించేవారు. ఇప్పుడు ఆపరిస్దితి అవసరం కూడా లేదు. వడ్లలో వున్న తేమను ఖచ్చితంగా కొలిచే యంత్రాలు వచ్చాయి. అయినా రైతులను మోసంచేసేందుకు జగన్ లాంటి వ్యాపారులు చూస్తూనే వున్నారు. అయితే అవి అలాంటి ఇలాంటి మోసాలు ఏకంగా ప్రభుత్వం కల్లుగప్పే మోసం. రైతులకు తీరని అన్యాయంచేసే మోసానికి పాల్పడుతున్నారు. ఇక్కడ మిల్లర్ చేసిన మోసం గురించి వివరంగా చెప్పుకుందాం..తప్పుల మీద తప్పులు చేసి ఎలా తప్పించుకోవాలనుకుంటున్నాడో చూద్దాం..ఖమ్మం జిల్లాకు చెందిన జాయింట్ కలెక్టర్ హన్మకొండ సివిల్ సప్లయ్‌కు మిల్లర్ల పేరు మీద పంపింపిన ఆర్వోలను రికవరీ చేశారు. ఇది ముమ్మాటికీ నేటిధాత్రి దినపత్రిక విజయం. రైతులకు మేలు చేసే విషయంలో అలుపెరగని అక్షర పోరాటం చేసిన నేటిధాత్రి వల్ల రైతులకు మరింత మేలు జరిగింది. అందుకు రైతులు కూడా నేటిధాత్రి దినపత్రికకు ధన్యవాదాలు తెలిపారు. ఖమ్మం జిల్లా జాయింట్ కలెక్టర్‌తోపాటు, సవిల్ సప్లై సిబ్బంది కూడా అభినందలు తెలిపారు. ఇది రైతుల కోసం నేటిధాత్రికి దక్కిన గౌరవం. ఇక అసలు విషయానికి వద్దాం. ఇటీవల హన్మకొండ జాయింట్ కలెక్టర్ కూడా మిల్లర్ జగన్ వడ్లను మాయం చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ సివిల్ సప్లైశాఖ కమీషనర్ కు లేఖ రాశారు. దాంతో జగన్ బండారం పూర్తిగా బైటపడిపోయింది. జగన్ చేసిన మోసం రుజువైంది. అయినా జగన్ తన వితండవాదాన్ని వదిలిపెట్టడం లేదు. తాను రైతులను ఒప్పించిన తర్వాతే వారి అనుమతితోనే వడ్లలో కోత పెట్టడం జరిగిందంటున్నాడని సమాచారం. అందువల్లనే బస్తాలను మాయం చేసినట్లు కూడ చెప్పినట్లు తెలుస్తోంది. ఇక్కడే జగన్ మరోసారి తప్పులో కాలేశాడు. ఖమ్మంజిల్లా జాయింట్ కలెక్టర్ హన్మకొండకు చెందిన మిల్లర్ జగన్‌కు వడ్లు పంపలేదు. ఇది మొదటి అంశం. ఖమ్మం జేసి జగన్‌కు ఎలాంటి ఆర్వోలు కూడా జారీ చేయలేదు. ఆర్వోలు హన్మకొండ జిల్లాలోని ఇతర మిల్లుల పేరు మీద ఆర్వోలు జారీ చేయడం జరిగింది. మిల్లర్ జగన్‌కు వ్యాపార పరంగా అత్యంత అనుకూలమైన కొంత మంది సివిల్ సప్లై అధికారులు ఆర్వోలు అందిన మిల్లర్ అన్ లోడ్ చేయాల్సిన బస్తాలను జగన్ మిల్లుకు మళ్లించారు. ఆర్వోలు జారీ అయిన మిల్లుల వద్దకు చేరిన వడ్ల బస్తాలను సంబంధిత మిల్లర్లు అన్ లోడ్ చేసుకోవడం లేదంటూ హన్మకొండ జిల్లా కలెక్టర్‌కు తప్పుడు సమాచారం అందించి, వాటిని జగన్ మిల్లులకు మల్లించారు. ఆర్వోలు జారీ అయిన మిల్లర్లు అడ్డుకున్నా, నిర్ధాక్షిణ్యంగా వాటిని జగన్ మిల్లులకు మళ్లించడం అదికారులు చేసిన పెద్ద పెరపాటు. అయినా ఇతర మిల్లర్లు ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. ఆర్వోలు జారీ అయిన మిల్లర్లు కూడా ఎదిరించలేదు. అధికారుల వద్ద జగన్‌కు వున్న పలుకుబడితో వారు కూడా సైలెంట్ అయ్యారు. ఒకప్పుడు వడ్లు వద్దే వద్దు అని మొండికేసిన జగన్ ఇప్పుడు కొట్లాడి మరీ వడ్లు తీసుకున్నాడు. జగన్‌కు వున్నవి రా రైస్ మిల్లులుకాదు. బాయిల్డ్ రైస్ మిల్లులు. అయినా ఇప్పుడు రా రైస్ మిల్లర్ల పొట్టగొట్టి వారి వ్యాపారానికి అడ్డు తగిలి మరీ వడ్లు తీసుకున్నాడు. పైగా రైతులను మోసం చేశాడు. వడ్ల బస్తాల మాయంపై హన్మకొండ జాయింట్ కలెక్టర్ విచారణకు ఆదేశించారు. దాంతో జగన్ తాను రైతులను ఒప్పించి, మెప్పించి వడ్లలో తేమ శాతం ఎక్కువ వుండడంతో కోత కోశానని వివరణ ఇచ్చుకున్నాడని సమాచారం. అసలు హన్మకొండ జిల్లా మిల్లులకు ఖమ్మం నుంచి వడ్లు వస్తున్న సంగతే జగన్‌కు తెలియదు. హన్మకొండ జిల్లాకు చెందిన ఇతర రైస్ మిల్లుల వరకు లారీలు చేరే దాకా జగన్‌కు సమాచారమే లేదు. ఖమ్మం జేసి నుంచి ఆర్వోలు జగన్‌కు మిల్లులకు వచ్చింది కాదు. అలాంటప్పుడు జగన్ రైతులను ఎప్పుడు కలిసినట్లు? ఎలా కలిసినట్లు? అదే నిజమైతే ఖమ్మం జేసి మొదట నేరుగా జగన్‌కే ఆర్వోలు జారీ చేసేవారు. జగన్‌కు కాదని ఇతర మిల్లులకు జారీ చేసేవారు కాదు. ఇతర మిల్లులకు జారీ చేసిన వడ్లను తన మిల్లులకు తోలుకుపోవాల్సిన అవసరమే వచ్చేది కాదు. జగన్ ఒప్పించిన రైతులు ఎవరు? ఏఏ ఐకేపి సెంటర్ల నుంచి వచ్చిన వడ్లో జగన్‌కు ఎలా తెలుసు? ఖమ్మం నుంచి హన్మకొండకు వడ్లు వచ్చిన తర్వాతే జగన్ వాటిని తన మిల్లులకు మరల్చుకున్నాడు. అలాంటప్పుడు ఏ రైతులను జగన్ ఒప్పించుకున్నాడో చెప్పాలి. ఆ రైతులు ఎవరో జగన్ వెల్లడిరచాలి. వారి చేత చెప్పించాలి? తప్పు చేసి కూడా ఇంకా ప్రబుత్వాన్ని మోసం చేస్తూ, రైతుల పేరు చెప్పి మాయమాటలు చెబుతున్న జగన్ మిల్లులను సీజ్ చేయాలి. విజిలెన్స్ ఎంక్వౌరీ చేయించి, జగన్‌పై కేసులు నమోదు చేయాల్సి వుంటుంది. జగన్ వివరణతో రిపోర్టు తయారు చేసిన అదికారులు ఈ చిన్న విషయాన్ని కూడా పసిగట్టలేకపోయారా? జగన్ చెబుతున్నది అవాస్తవమని తేలిపోతుందని గమనించలేకపోయారా? జగన్ ఏది చెబితే దానిని సమర్దిస్తూ హన్మకొండ జిల్లా అదికారులు రిపోర్టు తయారుచేస్తారా? ఇలాంటి తప్పుడు వివరణల ద్వారా మళ్లీ జగన్ తనగోతిని తానే తవ్వుకుంటున్నాడని అదికారులు కూడా గుర్తించలేకపోయారా? అసలు ఈ ఆలోచన జగన్‌కే వచ్చిందా? లేక అదికారులే జగన్‌కు ఇలాంటి సలహా ఇచ్చారా? రైతులను ఒప్పించుకున్నానని చెప్పు. సమస్య తీరిపోతుందని భరోసా ఇచ్చారా? ఎందుకంటే గతంలో జగన్‌కు కాపాడేందుకు కొంత మంది అదికారులు సన్నిహితులతో చెప్పిన మాటలు కూడా నేటిధాత్రి ప్రస్తావించింది. తమకు కులమే ముఖ్యమని, తమ కులానికి చెందిన జగన్‌న కాపాడతామని చెప్పిన అదికారులే కాపాడుతున్నట్లు స్పష్టమౌతోంది. గతంలో వారు చెప్పినట్లే జగన్‌ను వెనకేసుకొస్తున్నారనిపిస్తోంది. అందుకే ఆర్వోలు జారీ అయిన మిల్లులకు కాకుండా, జగన్ మిల్లులకు వడ్లు తరలించారు. ఆర్వోలు జారీ అయిన మిల్లర్లను అన్యాయం చేశారు. జగన్‌కు ఖమ్మం నుంచి వచ్చిన వడ్లన్నీ అంటగట్టారు. జగన్‌కు ఎల్ల వేళలా అండదండలు అందిస్తున్నారు. ఇక జగన్‌కు వెనక మిల్లర్ల అసోసియేషన్‌కు చెందిన ఓ నాయకుడు వున్నట్లు కూడా సమాచారం. అంతా ఆయన వెనకుండి నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ నాయకుడి స్వలాభం కోసం జగన్‌కు మద్దతు పలుకుతున్నట్లు చెప్పుకుంటున్నారు. జగన్‌కు అదికారుల పూర్తి లభించడంలో కూడా యూనియన్ రాష్ట్ర నాయకుడి హస్తం వుందని అంటున్నారు. ఏది ఏమైనా జగన్ రైతులను మోసం చేయడం నేరం. తప్పు చేసిన దొరికిన జగన్ తప్పును అంగీకరించకుండా ఇంకా కుప్పిగంతులు వేయడం విడ్డూరం. అదికారుల సహాకారం వుందన్న దీమాతో వారి చేత కూడా తప్పులు చేయిస్తున్నాడు. ఉద్యోగులు తమ ఉద్యోగాలకు ఎసరు వచ్చే పరిస్దితులు తెచ్చుకుంటున్నారు. జగన్‌పై చర్యలు తీసుకునేందుకు కమీషనర్ స్ధాయిలో కసరత్తు జరుగుతోంది. అప్పుడు జగన్ బండారం, ఉద్యోగుల వ్యవహారం అంతా బట్టబయలౌతుంది.
మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో కాంగ్రెస్ పార్టీ జాతీయ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిధిగా చిట్యాల ఎ ఎం సి వైస్ చైర్మన్ మహ్మద్ రఫీ పాల్గొని కేక్ కట్ చేసి స్వీట్లు, పండ్లు పంపిణి చేశారు.అనంతరం రఫీ మాట్లాడుతూ. దేశ వ్యాప్తంగా ప్రతి గుండెను హత్తుకునేలా చేపట్టిన జూడో యాత్రతో ప్రజల కష్టాలను దగ్గరుండి చూసిన రాహుల్ గాంధీ ప్రతి పక్షనేతగా పేద ప్రజలకు న్యాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వంపై అలుపెరుగని పోరాటం చేస్తూ. దేశ ప్రజల అభ్యున్నతికై అనుక్షణం పరితపించే మృధుస్వభావి రాహుల్ గాంధీ అని. అలాంటి మహా నాయకునికి మొగుళ్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు. ఈవేడుకల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తక్కళ్లపెల్లి రాజు, నడిగోటి రాము,ఏలేటి శివారెడ్డి, ఆకుతోట కుమార్, నీల రాజు, మంగళపల్లి శ్రీనివాస్, చంద్రబోస్, నాయకులు పాల్గొన్నారు.
ప్రభుత్వ క్రీడా పాఠశాలల ఎంపికలను..ప్రారంభించిన. ఎంఈఓ కాలేరు యాదగిరి
కేసముద్రం/ నేటి ధాత్రి
తెలంగాణ ప్రభుత్వం క్రీడా పాఠశాలల ఎంపికలను(హకీంపేట, కరీంనగర్, అదిలాబాద్) గురువారం నాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కేసముద్రం స్టేషన్ నందు మండల ఎంఈఓ కాలేరు యాదగిరి గారు క్రీడ ఎంపికలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ ఇప్పుడు నిర్వహించే ఫిజికల్ పరీక్షలు తొమ్మిది విభాగంలో నిర్వహిస్తారని. ప్రతి విద్యార్థిని, విద్యార్థులు, ఇందులో పాల్గొని ఈ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి రాష్ట్రస్థాయి క్రీడా పాఠశాలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. ఇక్కడ ఎంపికైన వారు ఈనెల 24వ తేదీన జిల్లాలో జరిగే ఎంపిక పోటీలకు హాజరు కావాల్సిందిగా సూచించారు. కాగా మండలం నుండి సుమారుగా 26 మంది విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజు, ఫిజికల్ డైరెక్టర్స్ డాక్టర్.కొమ్మురాజేందర్, కొప్పుల శంకర్, దామల్ల విజయ చందర్, పద్మ, మధు, తదితరులు పాల్గొన్నారు.
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వరరావు
కేసముద్రం/ నేటి ధాత్రి
కేసముద్రం మండల కేంద్రంలో అంబేద్కర్ సెంటర్ నందు మండలానికి చెందిన 13620 మంది రైతులకు 11 కోట్ల 83 లక్షల రూపాయలు రైతుల ఖాతాలో రైతు భరోసా జమ చేసిన సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు, డిసిసి ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి,
ఈ సందర్భంగా నాగేశ్వర్ రావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ తో పాటు రైతులు పండించిన వరి ధాన్యానికి గిట్టుబాటు ధర అలాగే సన్న రకం ధాన్యానికి 500 బోనస్, రైతు భరోసా అందించి రైతులకు ఎంతో మేలు చేసిందన్నారు.
ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డికి, ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్ కు, ఎంపీ పొరిక బలరాం నాయక్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి,ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ రావుల మురళి,మాజీ ఎంపీపీ కదిరే సురేందర్,మాజీ ఎంపీపీ భూక్యా మల్సూర్,మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ ఓలం రమేష్,వసంత రావు, ఎండీ ఆయుబ్ ఖాన్, చింతకుంట్ల యాదగిరి,బ్లాక్ కాంగ్రెస్ కార్యదర్శి పోలేపాక నాగరాజు,మాజీ సర్పంచ్ వెంకన్న,మాజీ ఉపసర్పంచ్ బానోత్ వెంకన్న,యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు అల్లం గణేష్ యాదవ్,మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కళ్ళెం శ్రీనివాస్ రెడ్డి,గ్రామ పార్టీ అధ్యక్షులు కొండ సురేష్,నూకల వెంకటేశ్వర్లు, నేరేటి కొమరయ్య,గండి శ్రీనివాస్, సమ సుధాకర్, పోలేపల్లి వెంకట్ రెడ్డి,బలు,ఎండీ తాజోద్దీన్,రషీద్ ఖాన్, ఎండీ నవాజ్,తరాల సుధాకర్,బోడ విక్కి,శేఖర్ రెడ్డి, ఎలందర్,బాల,హనుమ,బాధ్య,శ్రీనివాస్,యాకాంతచారి,పరకాల కుమార్,ముజ్జు షేక్,యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధానకార్యదర్శి తోట అఖిల్,సామల నరసయ్య,అజిత్ రెడ్డి, నియోజవర్గ ఉపాధ్యక్షుడు హరి కృష్ణ,మండల ఉపాధ్యక్షుడు ఎండీ సమీర్,సుందర్ వెంకన్న,మామిడిచెట్టు మల్లయ్య,తోట సుధాకర్,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.
నకిలీ పత్తి విత్తనాలను స్వాధీన పరుచుకున్న కోటపల్లి పోలీసులు
జైపూర్,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం లో నకిలీ పత్తి విత్తనాలు స్వాధీన పరుచుకున్నట్లు జైపూర్ ఏసిపి వెంకటేశ్వర్లు తెలిపారు.నకిలీ పత్తి విత్తనాలు చేరవేస్తున్నట్లు నమ్మదగిన సమాచారం రావడంతో కోటపల్లి పోలీసులు,వ్యవసాయ శాఖ అధికారితో కలిసి అంతరాష్ట్ర బ్రిడ్జి రాపనపల్లి వద్దకు వెళ్లి తనిఖీలు చేపట్టగా టాటా టియాగో కారులో తరలిస్తున్న1,45,800 రూపాయల విలువ గల 46.6 కిలోల నకిలీ పత్తి విత్తనాలను రవాణా చేస్తున్న నిందితులను పట్టుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.నకిలీ పత్తి విత్తనాలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన కోటపల్లి ఎస్సై రాజేందర్,పోలీస్ సిబ్బంది పిల్లి శ్రీనివాస్,శ్యాంసుందర్, హోంగార్డ్స్ శ్యామ్,తిరుపతి రెడ్డిలను జైపూర్ ఎసిపి ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో ఏసిపి వెంకటేశ్వర్లు,చెన్నూరు సిఐ దేవేందర్రావు,శ్రీరాంపూర్ సిఐ వేణు చందర్,కోటపల్లి ఎస్సై రాజేందర్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
నిజాంపేట మండల పరిధిలోని బచ్చిరాజుపల్లి గ్రామానికి చెందిన దళిత రైతు గాజులపల్లి స్వామి పై దాడి జరిగిన కేసు నమోదు చేసి డిఎస్పి ఇన్విస్టిగేషన్ చేసిన నిందితుని ఇంతవరకు అరెస్టు చేయలేదని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గారిని కలిసి వినతిపత్రం సమర్పించడం జరిగింది. నిధులను వెంటనే అరెస్టు చేయాలని కమిషన్ చైర్మన్ డి.ఎస్.పి కి కీరవాణి ద్వారా తెలపడం జరిగింది చట్టాన్ని పరిరక్షించుకోవడం మన హక్కుగా ఆయన తెలపడం జరిగింది. నిందితులను అరెస్టు చేసి బాధితులకు రక్షణ కల్పించాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిబిఎఫ్ జిల్లా అధ్యక్షులు దుబాసి సంజీవ్, ఎమ్మార్పీఎస్ టీఎస్ అధ్యక్షులు గరుగుల శ్రీనివాస్, మాల పరిరక్షణ వేదిక జాతీయ అధ్యక్షులు బొమ్మల మైసయ్య, బాధితులు స్వామి రాజు తదితరులు పాల్గొన్నారు.
ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం జూన్ 6 నుండి 19వ తేదీ వరకు కొనసాగిందని చివరి రోజు ముగింపు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ప్రధానోపాధ్యాయులు పద్మా రెడ్డి అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలంలోని రాంపూర్ గ్రామంలో గురువారం ముగింపు సన్మాన కార్యక్రమం లో భాగంగా పాఠశాలకు కంప్యూటర్ బహుకరించిన శ్రీకాంత్, మినరల్ వాటర్ అందిస్తున్న అంజా గౌడ్ లను ప్రధానోపాధ్యాయులు పద్మా రెడ్డి సన్మానించారు. ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు ఈశ్వరయ్య, అర్జున్, సుకన్య, నరేష్, చంద్రకాంత్, కుమారస్వామి లు ఉన్నారు.
గురువారం రోజున పరకాల ఎక్సయిస్ స్టేషన్ పరిధిలోని ఆత్మకూరు మండలం కటాక్షపూర్ వద్ద రూట్ వాచ్ నిర్వహించి నందిగామ రేలకుంట నుండి ఆత్మకూరు మండలంలోనికి ఆటోలో గుడుంబా రవాణా చేస్తున్న భూక్యా సుజాత, భూక్యా జగన్ అనే ఇద్దరిని ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు.వారిని అరెస్ట్ చేసి వారివద్దనుండి ఆటో (15)లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకున్నారు.ఈ రూట్ వాచ్ లో పాల్గొన్న వారు ఎస్ఐ సులోచన కానిస్టేబుల్ లు శ్రీనివాస్, విజయ్ కుమార్,దిలీప్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ భవన్/హనుమకొండ పార్లమెంట్ ప్రధాన ప్రతిపక్ష నేత,ఎంపీ శ్రీ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను గురువారం రోజు హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.యువజన కాంగ్రెస్ శ్వేత ఆధ్వర్యంలో నిర్వహించిన రక్త దానం శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి,తెలంగాణ రాష్ట్ర మీడియా,కమ్యూనికేషన్ చైర్మన్ శ్రీ సామ రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు,పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిస్ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారికి రాహుల్ గాంధీ జన్మదినం ఓ మంచి కార్యక్రమం కావాలని ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.దాతలకు సర్టిఫికేట్స్ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వతంత్ర దేశం నుంచి నేటి వరకు ఈ దేశం కోసం ప్రాణత్యాగాలు చేస్తున్న ఏకైక కుటుంబమని,రాహుల్ గాంధీ అట్టడుగు వర్గాలకు అండగా నిలిచేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు చేపట్టిన రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు.గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన రేషన్ కార్డులు,ఆరోగ్యశ్రీ,ఫీజు రీయింబర్స్ మెంట్ లాంటి ఎన్నో పథకాలతో నేడు పేద, మధ్యతరగతి ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ఈ వేడుకల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు,పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
శాయంపేట మండలం మైలా రం గ్రామంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతదేశం యొక్క అభివృద్ధి ప్రస్థానాన్ని ప్రతిబింబిస్తూ భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ సంకల్ప సభను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ వైస్ చైర్మన్ నాగపూరి రాజమౌళి గౌడ్ పాల్గొన్నారు ఈ సందర్భం గామాట్లాడుతూ గత 11 సంవత్సరాలలో సేవా సుపరి పాలన మరియు పేదలసంక్షేమ మార్గంలో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్ ప్రతి సవాలను ధైర్యంగా ఎదుర్కొంది మన సైనికుల సాహసంతో సరిహద్దులు సురక్షితంగా ఉన్నాయి ప్రపంచంఅనిచ్చిత్త పరిస్థితుల్లో ఉన్నప్పటికీ భారత్ అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ ఆర్థిక శక్తిగా ఎదుగు ఎదుగుతుందని సబ్కాసాత్, సబ్కావికాస్, సబ్కా ప్రయత్న్ సబ్కావిశ్వాస్ అనే మంత్రంతో ప్రతి పౌరుడిని అభివృద్ధి బాటలోకితీసుకొచ్చా రని దేశం మొత్తం వికసిక్ భారత్ లక్ష్యం వైపు చేరుకునే దిశగా ఏకతాటిపై ముందుకు వెళుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత రక్షణ ఎగుమతులు 34 రెట్లు పెరిగి రూపాయలు 23.622 కోట్లకు చేరాయి ప్రచండ హెలికాప్టర్, ఆకాష్ క్షిపణి వ్యవస్థ, బ్రహ్మోస్ వంటి స్వదేశీ తయారుచేసిన ఆయు ధాలను సైనికులు విజయవం తంగా వినియోగించారు ఇటీవల ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత సైనిక దళాలు ఆక్రమిక కాశ్మీర్ (పిఓకే) మరియు పాకిస్తాన్ ప్రాంతంలో 9 ఉగ్రవాద శిబిరాలు 11 ఎయిర్ బేస్ లను ధ్వంసం చేయడం జరిగిందని గత 11 సంవత్స రాలలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమా లను,పేదల కోసం అమలవు తున్న సంక్షేమ పథకాలను, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, ఉపాధి, ఆరోగ్యం, విద్య, రోడ్డులు తదితర రంగాలలో సాధించిన పురోగతిని,దేశాన్ని 2047 నాటికి వికసిత భారత్గా మార్చే దిశగా మోదీ గారి దృఢ సంకల్పాన్ని వివరించారు.
Rajamouli Goud,
ప్రజల మద్దతుతో నూతన భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాముల వ్వాలని, గ్రామీణ ప్రాంతాలలో అవగాహన పెంచేందుకు ఈ సభలు ముఖ్యపాత్ర వహిస్తా యని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ రాయరాకుల మొగిలి, రాష్ట్ర యువ మోర్చా కార్యవర్గ సభ్యులు తాటికొండ రవికిరణ్, జిల్లా కౌన్సిల్ మెంబర్ కాను గుల నాగరాజు యువ మోర్చా జిల్లా కార్యదర్శి లడే శివ, మండల ప్రధాన కార్యదర్శి భూతం తిరుపతి, ఉపాధ్య క్షులు కోమటి రాజశేఖర్, పోల్ మహేందర్, మంద సురేష్ మండల కోశాధికారి కుక్కల మహేష్, బూత్ అధ్యక్షులు, కన్నెబోయిన రమేష్, నూనె వెంకటేష్ కడారి చంద్రమౌళి, బాసాని నవీన్, బత్తుల రాజేష్, ఎర్ర తిరుపతిరెడ్డి, కుక్కల సతీష్, మూడేడ్ల పైడి, మందమదు, చెక్క దినేష్, రాజు,కుక్కల రమేష్, ఆకుతోట భాను, మూడేళ్ల రాంప్రసాద్ మోతె విక్రం, జక్కుల ఓదెలు, సిరిపురం కొమురయ్య, కౌటాం శివ, శ్రీరాముల తిరుపతి, సిరిపురం మహేందర్ మరియు గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు
#కుటుంబానికి భారం కాకుండా తల్లిదండ్రులకు భరోసాగా ఉండాలి.
#కంపెనీలు రాకతో ములుగు జిల్లా అభివృద్ధి.
రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క.
ములుగు జిల్లా, నేటిధాత్రి:
యువతి, యువకులు ఉన్నత చదువులు చదివి ఉద్యోగ అవకాశాలు పొందాలని, యువత కుటుంబాలకు భారం కాకుండా తల్లిదండ్రులకు భరోసాగా ఉండాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని టాస్క్ సెంటర్లో టెక్నికల్, నాన్ టెక్నికల్ కోర్సులలో శిక్షణ పొందిన 100 మంది నిరుద్యోగులలో పలు కంపెనీలలో ఉద్యోగాలకు ఎంపికైన 51 మంది యువతకు నియామక పత్రాలను రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివసేన రెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రవిచందర్ సమక్షంలో అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ పలు కంపెనీల ద్వారా శిక్షణ పొంది ప్రతిభ పెంపొందించుకుంటే సాధించనది ఏమీ లేదని అన్నారు. ఎక్కువ వేతనం రావడం లేదని నిరాశ చెందకుండా వచ్చిన ఉద్యోగ అవకాశాలను చేస్తూనే ఎక్కువ వేతనం వచ్చే ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేయాలని సూచించారు. జిల్లాలో ఏర్పాటు చేస్తున్న పలు కంపెనీలను కాపాడుకుంటూనే ఇతర కంపెనీలు రావడానికి ప్రయత్నించాలని, కంపెనీలు రాకతో ములుగు నియోజకవర్గం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. నిరుద్యోగ యువతీ యువకులకు ప్రతిభ పెంపొందించుకోవడానికి టాస్క్ సెంటర్ ఆధ్వర్యంలో ఆరు నెలల క్రితం శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని, ఇప్పటికీ శిక్షణ పొందిన వంద మందిలో 51 మంది యువతక ఉద్యోగ అవకాశాలు పొందారని అన్నారు. టాస్క్ సెంటర్ ఆవరణంలో శ్రీయ ఇన్ఫోసియస్ కంపెనీ ఏర్పాట్లు చేసి అందులో ముగ్గురికి ఉద్యోగ అవకాశం కల్పించడం జరిగింది. నేడు యువత నిరక్షరాస్యత నుండి అక్షరాస్యతకు ఎదిగి ఉద్యోగ అవకాశాలు పొందడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 40 కంపెనీలకు చెందిన యజమానులు ములుగు జిల్లాలో పర్యటించారని, 10 గ్రామాలను దత్తత తీసుకొని గ్రామాల అభివృద్ధికి తోడ్పడుతున్నారని తెలిపారు. ఈ రోజున 16 కంపెనీ లు పాల్గొన్నారని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మంత్రి సీతక్క ఒక శక్తి లాగా పనిచేస్తూ ఇప్పటికే పలు కంపెనీలు రావడానికి కృషి చేయడంతో పాటు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభించబోతున్నారని, కంపెనీలు ఎదగడానికి ఉద్యోగులు కృషి చేస్తే వేతనాలు పెరుగుతాయని అన్నారు. ఎదుగుదలకు హద్దులేదని, చిన్న ఉద్యోగమని చులకన చేయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ సిన్హా – టాస్క్ సిఇఒ ప్రదీప్ రెడ్డి – టాస్క్ ప్లేస్‌మెంట్ డైరెక్టర్ సేవ్న్ రెడ్డి – టాస్క్ రీజినల్ సెంటర్స్ హెడ్ సుధీర్ – టాస్క్ క్లస్టర్ మేనేజర్ రవి – సిఇఒ, శ్రీయా ఇన్ఫోటెక్ వినోడ్ – సిఎస్ఆర్ ఇన్‌ఛార్జి బాలా – కాగ్నిజెంట్ సిఎస్ఆర్ బృందం, డొమైన్: ఐటి, ఐటిఇఎస్, ఫార్మా, బ్యాంకింగ్, మార్కెటింగ్, అమ్మకాలు, వ్యవసాయం, ఫైనాన్స్ మరియు నాన్ బ్యాంకింగ్, కంపెనీలకు చెందిన యాజమాన్యాలు టాస్క్ రీజినల్ సెంటర్ లో శిక్షణ పొందిన 100 మంది యువత, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
సామాన్యులు,పేద ప్రజల సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తున్న రాహుల్ గాంధీ దేశానికి దిక్సూచి అని కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్ అన్నారు.
గురువారం డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఎఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబానికి చెందిన నాయకుడు రాహుల్ అని పేర్కొన్నారు.రాహుల్ గాంధీ.. భారత్ జోడో యాత్ర,న్యాయ్ యాత్ర దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిందని తెలిపారు.గాంధీ కుటుంబ వారసుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రాహుల్.. తనదైన మార్క్‌తో దేశ రాజకీయాల్లో కీలక శక్తిగా అవతరించారన్నారు.లోక్ సభ ఎన్నికల్లో విపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి అత్యంత బలీయ శక్తిగా ఉన్న బీజేపీని సమర్థంగా నిలువరించడంలో రాహుల్ చాలా వరకు సక్సెస్ అయ్యారని అభిప్రాయపడ్డారు. ఆయన నాయకత్వం భవిష్యత్తులో దేశానికి అత్యంత అవసరమని తెలిపారు. దేశ భవిష్యత్తు ఆశాకిరణం రాహుల్ గాంధీ అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ కంచర్ల వెంకటాచారి,మహిళా కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షరాలు పింగిలి ఉష,కాంగ్రెస్ నాయకులు చిత్తలూరి శ్రీనివాస్ గౌడ్,కందాడి అశోక్ రెడ్డి,దీకొండ మధు,వెన్నెం సోమిరెడ్డి,అజ్మీరా రమేష్ నాయక్, వెలుగు మహేశ్వరి, జె.రమేష్ నాయక్, జాటోత్ అమల, మెరుగు కర్ణాకర్,జనగామ జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి అభిరాం నాయక్,యూత్ పట్టణ అధ్యక్షుడు బసనబోయిన మహేష్ యాదవ్,యూత్ నాయకులు పరశురాములు, నడిగడ్డ మధు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
⏩పేద ప్రజలకు అనునిత్యం అందుబాటులో కాంగ్రెస్ పార్టీ.
⏩మచ్చ లేని నాయకుడు రేవూరి.
దుపాకీ సంతోష్ కుమార్ 16వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు
కాశిబుగ్గ నేటిధాత్రి
వరంగల్ నగరంలోని 16వ డివిజన్ పరిధిలోని గరీబ్ నగర్ బుధవారం రోజున బిఆర్ఎస్ నేతలకు స్థానిక కార్పొరేటర్ బిఆర్ఎస్ నాయకులు చేసిన అసత్య ప్రచారాలను తిప్పికొడుతూ స్థానిక మహిళా వికలాంగురాలు లింగంపల్లి నిర్మల ఇంటిని సందర్శించి వారికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాన్ని అందించడం జరిగింది.
16వ డివిజన్ గరీబ్ నగర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ దాసారాపు సారన్న ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో 16 డివిజన్ అధ్యక్షులు దుపాకి సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు ఆలస్యం అవుతున్నాయని తెలుసుకున్న బిఆర్ఎస్ నాయకులు అదే అదునుగా చూసుకొని అమాయకురాలైన మహిళలను అడ్డుపెట్టుకొని వారి రాజకీయ స్వలాభం కోసం ప్రయత్నం చేస్తు బిఆర్ఎస్ నేతలు విఫలమయ్యారని అన్నారు.
గత బి ఆర్ యస్ పాలనలో చేసిన కమీషన్లకు, అక్రమాలకు పాల్పడిన వారు ప్రజా ప్రభుత్వం పై దుష్ప్రచారం చేయడానికి పూనుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్రమాలకు, అరాచకాలకు తావు లేకుండా, అభివృధే ధ్యేయంగా పని చేస్తున్న ప్రజా ప్రభుత్వాన్ని చూసి ఓర్వలేక,గరీబ్ నగర్లో జరుగుతున్న అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేని బీఆర్ఎస్ నేతలు అమాయకపు దళిత మహిళ వికలాంగురాలను చూపిస్తూ బి ఆర్ యస్ పార్టీ రాజకీయ స్వలాభం కోసం అసత్య ప్రచారాలకు పాల్పడుతున్న టిఆర్ఎస్ నేతల మాటలను ఖండించారు.
ఇలాంటి ఉదంతాలను,అసత్య ప్రచారాలను గరీబ్ నగర్ ప్రజలు నమ్మద్దు అని,టోపీ పెట్టుకున్న నాయకులు వస్తున్నారు,మనకు టోపీ పెడుతారు జాగ్రత్త అని తెలిపారు.
గత బి ఆర్ యస్ ప్రభుత్వంలో ఇల్లు ఇవ్వకపోగా కనీసం ఒక తెల్ల రేషన్ కార్డు కూడా ఇచ్చిన పాపానపోలేదు అని ఎద్దేవ చేశారు.
ఆనాడు టిఆర్ఎస్ ప్రభుత్వం.
గరీబ్ నగర్ ప్రజలకు మాయమాటలు చెప్పి సుమారు 18 మంది ఇండ్లను కూలగొట్టి ఇల్లు ఇస్తాము అని, ఓట్ల కోసం రాజకీయం చేసిన పార్టీ బి ఆర్ యస్ పార్టీ అని,ఈ రోజు ప్రజా ప్రభుత్వం ఇస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పై మాట్లాడే నైతిక హక్కు లేదు అని అన్నారు.
ఇందిరమ్మ ఇల్లు నియమ నిబంధనల ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చే దిశగా మన పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి కృషి చేస్తున్నారని వారు తెలిపారు.
అంతేకాకుండా గరీబ్ నగర్ ప్రజలను మాయ మాటలతో మభ్యపెడుతూ, పది సంవత్సరాలు కాలయాపన చేసిన బీఆర్ఎస్ పార్టీ పేద ప్రజల బాధలు, వారి గోడు వినకుండా ఇష్ట రాజ్యాంగ వ్యవహరించి భూ కబ్జాలకు,అక్రమాలకు పాల్పడి, ఇప్పుడు గరీబ్ నగర్ లో జరుగుతున్న అభివృద్ధిని చూసి మతిభ్రమించిన టిఆర్ఎస్ నాయకులు ప్రజాక్షేత్రంలోకి రావడానికి ఏ ఆధారంలేక అమాయక ప్రజలను మోసపరుస్తూ, తప్పుడు ప్రచారాలు చేస్తూ తిరగడం వారికి అలవాటైపోయిందని ఈ సందర్భంగా తెలియజేశారు.
వరంగల్ జిల్లాలోనే మచ్చలేని నాయకుడిగా సుధీర్గ రాజకీయ అనుభవం ఉన్న నేత పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి పై తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదు అని, ఇకనైనా అసత్య ప్రచారాలు మానుకోవాలని తెలిపారు.
బి ఆర్ యస్ నాయకులు ఆకాశం పై ఉమ్మితే అది వారి మొఖం పై పడుతుందని వారు గ్రహించాలి అని అన్నారు.
ప్రజల శ్రేయస్సు కోసం నిరంతర శ్రామికుడు రేవూరి ప్రకాశ్ రెడ్డి అని అన్నారు.
ఇందిరమ్మ ఇండ్లు లబ్దిదారుల ఎంపికలో పారదర్శకంగా, చిత్తశుద్ధితో ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నారు.
ఏ ఒక్క లబ్ధిదారుల దగ్గర కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా స్థానిక శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి సలహాలు,సూచనలు తీసుకోని పనిచేస్తుందని తెలిపారు.
కావాలనే కాంగ్రెస్ పార్టీ పైన,కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన బిఆర్ఎస్ నాయకులు బురద చల్లుతున్నారు.ఏ ఒక్క లబ్ధిదారుడు దగ్గరైన డబ్బులు వసూలు చేసినట్టు రుజువు చేయిస్తే ఎంతటి శిక్షకైనా సిద్ధమేనని వారు అన్నారు. బిఆర్ఎస్ నాయకులు బహిరంగ చర్చకు సిద్దామా అని హెచ్చరించారు.
పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇల్లు పంపిణీ జరుగుతుందని అర్హులైన ప్రతి ఒక్కరికి విడతలవారీగా ఇండ్లు వచ్చే విధంగా శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి చొరవ తీసుకుంటారని తెలిపారు.
గతంలో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి 93,95 సర్వే నెంబర్ల లో భూ అక్రమాలకు పాల్పడి గరీబ్ నగర్ లోని పేద ప్రజలకు వచ్చే స్థలాని వారి సహచరులకు,బినామీలకు కట్టబెట్టి గరీబ్ నగర్ ప్రజలకు సొంత ఇంటి స్థలము లేకుండా చేశారని గుర్తుచేశారు.
గరీబ్ నగర్ లోని సొంత ఇంటి లేని వారికి సర్వేనెంబర్ 93,95లో ఇల్లు ఇప్పిండం కోసం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తాము అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు కొండేటి కొమరారెడ్డి,వర్కింగ్ ప్రెసిడెంట్ వల్లెం సుధాకర్,గరీబ్ నగర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దాసారపు సారన్న,ఇందిరమ్మ కమిటీ సభ్యులు చెక్క లక్ష్మి, రమేష్, అఫ్రీన్,అంకేశ్వరపు రాజు,పిట్టల అనిల్, గ్రామ పార్టీ అధ్యక్షులు జానీ,హుజూర్,కీర్తి నగర్ ఇందిరమ్మ ఇండ్ల కమిటీ మెంబర్ పోతునూరీ మౌనిక, జన్ను రాజు,మార్త రాజశేఖర్, గుర్రం వెంకటేశ్వర్లు, పరకాల యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వల్లెం సాయి కుమార్, గొట్టిముక్కుల పరిపూర్ణ చారి గుర్రపు వెంకటేశ్వర్లు శివరాత్రి పెద్ద వెంకన్న. కృష్ణ, పోలేబోయిన శివ, బిర్రు ప్రసాద్, కె.మోహన్, జన్ను రాజు తక్కల్లపల్లి రాజశేఖర్,నూరుజహాన్,గొర్రె కరుణాకర్,ఐత అశోక్, జన్ను కళ్యాణ్, భరద్వాజ్. శివరాత్రి చిన్న వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్.
చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం రోజున భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని రైతుల ప్రభుత్వమని పేదల కోసం రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశం పెట్టిన ప్రభుత్వం అని అన్నారు అలాగే ఏకకాలంలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసిన ప్రభుత్వ ప్రపంచంలో ఎక్కడా లేదని ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు అనంతరం భూపాలపల్లి నియోజకవర్గం లోని చిట్యాల టేకుమట్ల మండలాలకు చెందిన 52 మంది లబ్ధిదారులకు దాదాపు 25 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుట్ల తిరుపతి టేకుమట్ల మండల అధ్యక్షులు కోటగిరి సతీష్ గౌడ్ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మధువంశీకృష్ణ కాంగ్రెస్ జిల్లా నాయకులు చిలుకల రాయకు ఉండు లక్ష్మణ్ గౌడ్, చిట్యాల టేకుమట్ల మొగుళ్ళపల్లి మండలాల కాంగ్రెస్ నాయకులు సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.