ఇది కంకరా..సుద్దముక్కా!?.. ఎపిసోడ్‌ -1

‘‘వేల కోట్లు’’ దోచుకున్నారు?

`దుబ్బను కూడా కంకర అని నమ్మిస్తున్న ఘనులు!

`‘‘క్రషర్‌ కంపెనీలన్ని’’ సిండికేట్‌ అయ్యి ప్రజాధనం దోచుకుతిన్నాయి.

`‘‘మహా నిర్మాణాన్ని’’ నవ్వుల పాలు చేశాయి

`పలుగు రాయితో సమానం కూడా కాదు!

`ఇదా కంకర..కండ్లు మూసుకున్నారా!

`కాసులకు కక్కుర్తి పడి కంకర అని తేల్చారా!

`ఈ కంకర ప్రాజెక్టులకు వాడతారా!

`ఎర్ర గుట్టల రాయిని కంకర అంటారా?

`కాసులకు కక్కుర్తి పడి ప్రజా ధనం దోచుకున్నారు?

`క్వాలిటీ కంట్రోల్‌ బోర్డు వద్దన్నా వినిపించుకోలేదు!

`క్వాలిటీ కంట్రోల్‌ బోర్డు కాదన్నా వాడేశారు!

`కాంట్రాక్టర్ల ధన దాహానికి అధికారులు తోడయ్యారు!

`చూసేవారెవరని విచ్చలవిడిగా ఎర్రకంకర వాడేశారు!

`మహా ప్రాజెక్టును సర్వనాశనం చేశారు!

`అది కంకరే కాదు! ప్రాజెక్టులకు సరఫరా చేశారు!!

`మన్ను మశానం తప్ప కంకర అసలే కాదు!

`అవునవును అని తల ఊపే అధికారులు!

`వరంగల్‌ గుట్టల్లో బలమైన బండలే లేవు!

`కంకర తయారు చేయడం సాధ్యమే కాదు!

`గులకరాళ్లను కంకర అని సరఫరా చేస్తున్నారు!

`ఎర్రగుట్టలు తొలిచి కంకర అని నమ్మిస్తున్నారు.

`కాంట్రాక్టర్లు..అధికారులు పంచుకుతింటున్నారు!

`ఇదే కంకర ఓ పెద్ద ప్రాజెక్టులో కూడా వాడారు?

`ఇప్పుడు నేషనల్‌ హైవేల నిర్మాణానికి వాడుతున్నారు!

`ఇంటికి ఏ మాత్రం పనికి రాదు!

`ప్రాజెక్టుల నిండా నింపేశారు!

`ప్రాజెక్టుల నిర్మాణం అబాసుపాలు చేశారు!

`ప్రజాధనం నీళ్ల పాలు చేశారు!

`సగం వాటలు అధికారుల చేతుల్లో పెట్టి చేతులు దులుపుకున్నాయి!

హైదరాబాద్‌, నేటిధాత్రి:                        తెలంగాణలో కాంట్రాక్టర్ల బరితెగింపు, అధికారుల కాసుల కక్కుర్తి మూలంగా ప్రజా దనం పెద్దఎత్తున దుబారా అవుతోంది. దుర్వినియోగమౌతోంది. ప్రభుత్వానికి నాణ్యమైన కంకర సరఫరా చేస్తామనిచెప్పి, టెండర్లు దక్కించుకొని పనికి రాని కంకర సరఫరా చేస్తున్నారు. సుద్దకూడా అంతో నయమనేంత నాసిరకమైన కంకర సరఫరా చేశారు. అసలు దానిని కంకర అని ఎలా నిర్ధారించారో..ఎలా కంకర అని కాంట్రాక్టర్లు నిర్ణయించుకున్నారో అర్ధం కాదు. కంకర పేరుతో సరఫరా చేస్తున్న దానిని అది కంకరే అని అదికారులు ఎలా నిర్దారిస్తున్నారో..ఎలా అందుకు అనుమతులు జారీ చేస్తున్నారో తెలియకుండాపోతోంది. గత పదేళ్ల కాలంగా ఈ దుబారా వ్యవహరం విపరీతంగా సాగుతోంది. సహజంగా ఏ నిర్మాణానికైనా సరే నాణ్యమైన కంకర కావాలని కోరుకుంటాం. మంచి కంకరలో చిన్న డస్టు కూడా వుండకుండా జాగ్రత్తపడతాం. ఆ కంకర తెచ్చుకున్న తర్వాత ఏ మాత్రం అనుమానం వచ్చినా తిరిగి వాపస్‌ చేయిస్తాం. మరి అలాంటిది తెలంగాణ ప్రభుత్వం చేపట్టే అనేక కార్యక్రమాలకు అధికారులు దగ్గరుండి పనికి రాని, ఎందుకూ పని చేయని కంకరను ప్రోత్సహిస్తున్నారు. కంకర అంటే ఏళ్ల తరబడి మన్నేలా వుండాలి. చెక్కు చెదరకుండా వుండాలి. గాలి, నీటి కోతను తట్టుకోగలగాలి. దశాబ్ధాల తరబడి బలంగా,దృఘంగా వుండాలి. నిజమైన రాయితో తయారైన కంకర వందల సంవత్సరాలైనా సరే గట్టిగా వుంటుంది. నిర్మాణాలను పటిష్టంగా వుంచుతుంది. ఇంటి నిర్మాణాలకే ఇన్ని రకాలుగా ఆలోచిస్తాం. అలాంటిది ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టే నిర్మాణాలకు మరింత బలమైన కంకర అవసరం. ఎండకు, వానకు, వరదలకు తట్టుకొని నిలబడేలా వుండాలి. అది రోడ్డైనా, ప్రాజెక్టులైనా, చెరువులైనా, చెక్‌ డ్యామ్‌లైనా, రిజర్వాయర్లైనా సరే కంకర ఎంత బలంగా వుంటే ఆ నిర్మాణాలు అంత ఎక్కువ కాలం నిర్మాణాలు చెక్కు చెదరకుండా వుంటాయి. కాని తెలంగాణలోని కొంత మంది అవినీతి అదికారుల దుర్భుద్ది మూలంగా, దుర్మార్గులైన కొంత మంది కాంట్రాక్టర్లు కలిసి ప్రజా ధనం దోచుకుతినేందుకు ఎందుకూ పనికి రాని కంకర విచ్చలవిడిగా వాడుతున్నారు. అందుకే మన కళ్లముందే అనేక నిర్మాణాలు చెదిరిపోతున్నాయి. కూలిపోతున్నాయి. కొట్టుకుపోతున్నాయి. అవి నాసిరకం కంకర నిర్మాణాలని తేలిపోతున్నాయి. వాటి గురించి పట్టించునే నాధుడే కరువయ్యారు. ఎంత సేపు రాజకీయాలు తప్ప, వ్యవస్ధలో నిటారుగా నిలడాల్సిన అధికారులు ఎందుకు వంగిపోతున్నారు. ఎందుకు ఇంత లాలూచీగా వ్యవహరిస్తున్నారు. భయం లేకుండా పోతున్నారు. అనేది కూడా ఇక్కడ ప్రభుత్వం దృష్టిపెట్టాల్సిన అవసరం వుంది. ముఖ్యంగా తెలంగాణలోని కొన్ని ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు, రోడ్ల నిర్మాణాలకు ఎందుకూ పనికి రాని ఎక్రకంకరణను సరఫరా చేసినట్లు ఆరోపణలున్నాయి. వరంగల్‌ జిల్లాలో కట్టడాలకు అవసరమైనటు వంటి కంకరను అందించే గట్టలే లేవు. ఆ గుట్టలన్నీ కేవలం ఎర్రమట్టితో నిండి వున్న తూర్పు కనుమలకు చెందినవి. ఆ గుట్టలు పూర్తిగా మట్టితో మాత్రం ఎక్కువ శాతం వుంటాయి. ఆ మట్టిలో ఎర్ర రాయి గుండ్లు మాత్రమే వుంటాయి. అవి చాలా నాసిరకంగా వుంటాయి. అవి నిర్మాణాలకు ఎట్టి పరిస్దితుల్లో ఉపయోగార్హం కాదు. కంకర తయారు చేసే గుట్టల్లో పెద్ద పెద్ద బరువైన బండలుండాలి. కొన్ని ఎకరాల్లో విస్తరించి వుండే బండ నుంచి మాత్రమే కంరర తయారు చేయాలి. కాని గుండ్లతో కూడిన గుట్టలను కాంట్రాక్టర్లు ఎంచుకోవడం? వాటికి అధికారులు పర్మిషన్లు ఇవ్వడం జరుగుతోంది. అలా కొండలు తవ్వేస్తున్నారు. అటు మట్టి, ఇటు ఎర్ర గుండ్లతో తయారు చేసిన కంకరను సరఫరా చేస్తున్నారు. కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. నేటిధాత్రి పై చిత్రంలో చూపిస్తున్న ఎర్ర రంగు రాయిని కూడా కంకర అని ఎవరైనా అంటారో మీరే చెప్పండి? అది నిర్మాణాలకు వాడుకునే వాళ్లు ఎవరైనా వుంటారా? ఇక్కడ విచిత్రమేమిటంటే మాకు పెద్ద కొండ వుంది. అందులో లక్షల టన్నుల కంకర తయారయ్యే గుట్టలున్నాయని ఎవరూ అధికారులకు అర్జీలు పెట్టుకోలేదు. మేము కంకర వ్యాపారం చేయాలనుకుంటున్నాం. మీరు ఏవైనా గుట్టలను మాకు అప్పగిస్తే కంకర తయారు చేసి, ప్రభుత్వానికి సరఫరా చేస్తామని దరఖాస్తులు పెట్టుకున్నారు. అలా దరఖాస్తులు పెట్టుకున్నవారికి అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లు కనిపించిన ప్రతి గుట్టను అధికారులు కాంట్రాక్టర్లకు రాసిచ్చారు. కంకర తెమ్మని రాతపూర్వక ఆదేశాలిచ్చారు. ఇది కంకరేనా..ఈ కంకర నిర్మాణాలకు ఎవరైనా వాడుతారా? అంటూ నేటిధాత్రి ప్రశ్నిస్తే మాదేముంది? మేం కాంట్రాక్టు చేద్దామనుకున్నాం! కంకర సరఫరా చేసే క్రషర్లు ఏర్పాటు చేసుకుంటామని చెప్పాం! మాకు అందుబాటులో వున్న కొండలు లీజుకిస్తే, వాటి కంకర తయారు చేసి, ప్రభుత్వానికి సరఫరా చేస్తామని చెప్పాం!! ఇదీ స్దూలంగా అడ్డదారిలో, అడ్డగోలుగా, ప్రజా దనం దుర్వినియోగం చేసిన కొందరు కాంట్రాక్టర్లు చెబుతున్న మాట!!! ఇదిలా వుంటే సదరు కాంట్రాక్టర్లు ఓ మహా నిర్మాణానికి పెద్దఎత్తున కంకర సరఫరా చేసే ముందు రాజేంద్ర నగర్‌లో వున్న క్యాలిటీ కంట్రోల్‌ బోర్టుకు కంకర రాయిని పంపించారు. అక్కడున్న నిపుణులు ఇది కంరరే కాదని నిర్ధారించారు. అది కంకరగా పనికి రాదని తేల్చేశారు. ఇది సుద్దకన్నా అద్వాహ్నమైందని చెప్పారు. ఈ ఎర్రరాయికి కరిగిపోయే గుణం వుంటుందని చెప్పారు. ఎట్టి పరిస్దితుల్లోనూ నిర్మాణాలకు ఈ కంకర అసలే వాడొద్దని హెచ్చరించారు. తెలంగాణలో చేపట్టిన ఓ మహా నిర్మాణానికి ఈ రాతి కంకర వాడడం ఎంతో ప్రమాదకరమని కూడా తేల్చిచెప్పారు. ఎట్టిపరిస్ధితుల్లోనూ తాము అంగీకరించే పరిస్దితి లేదని చెప్పారు. అయినా అదికారులు అదే కంకరను ఈ మహా నిర్మాణానికి సుమారు 20వేల కోట్ల రూపాయల విలువైన కంకరను సరఫరా చేయించుకున్నారు. సహజంగా కంకరకు మంచి బలమైన నల్లరాతి గ్రానైట్‌ కావాలి. అంతే కాని గులకరాయిలా కూడా పనిచేయని ఎర్రరాయిని విచ్చలవిడిగా వాడేశారు. ఆ మహా నిర్మాణానికే కాదు, కేంద్ర ప్రభుత్వం నిర్మాణం సాగిస్తున్న జాతీయ రోడ్లకు కూడా వరంగల్‌ జల్లాలో ఇదే కంకరను విస్తారంగా వినియోగిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన మహా నిర్మాణం ఇప్పుడు ఆరోపణల పాలు కావడంలో ఎర్ర కంకర పాత్రే ఎక్కువ అని నిపుణులు అంటున్నారు. ఎంత చెప్పినా అదికారులు పట్టించుకోలేదు. కాంట్రాక్టర్లు వినలేదని కూడా అంటున్నారు. ఏదైనా జరిగితే మొత్తం నిర్మాణానికే ప్రమాదం ఎదురౌతుందని తెలసి కూడా అటు అదికారులు, ఇటు కాంట్రాక్టర్లు బరితెగించారంటే సామాన్యమైన విషయం కాదు. ప్రభుత్వం ఇప్పటికైనా మేలు కోవాలి. ఈ దిశగా దర్యాప్తు సాగించాలి. ఎంత మంది కాంట్రాక్టర్లకు ఎన్ని గుట్టలు అదికారులు అప్పగించారు? ఎన్నికొండలు తొలిచేశారు? ఆ కొండల మూలంగా ఎంత కంకర వచ్చింది? రాజేంద్ర నగర్‌ క్వాలిటీ కంట్రోల్‌బోర్డు వద్దని ఆదేశాలు జారీ చేసినా, ఎవరు పక్కకు పెట్టారు. ఎందుకు తొక్కిపెట్టారు? దీని వెనుక ఎవరున్నారు? వేలకోట్ల రూపాయలు ఖర్చు చేసి మరీ నాసిరకం కంకర సరఫరా చేయడం అంటే నేరం కాదా? కాంట్రాక్టర్‌కు చెల్లించాల్సిన మొత్తానికి సమానమైన లాభంతో ఎంబిలు తయారు చేసినట్లు సమాచారం. సగం, సగం వాటాలు అన్నట్లు ఇద్దరూ కలిసి వేల కోట్లు దోచేశారు. ప్రజా ధనం నీళ్లలోపోశారు. ఆ కాంట్రాక్టర్లు ఎవరు? అనుమతులిచ్చిన అదికారులెవరు? ఎంత కంకర సరఫరా చేశారు? ఎంత సొమ్ము దుబారా చేశారు? అనే పూర్తి వివరాలతో కూడిన ప్రత్యేక కధనాలు త్వరలోనే మీ నేటిధాత్రిలో…

ముగ్గురు పిల్లల జీవో రద్దు పై హర్షం..

ముగ్గురు పిల్లల జీవో రద్దు పై హర్షం.

సీఎం ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం.

చిట్యాల, నేటిదాత్రి :

 

చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూట్ల తిరుపతి ఆధ్వర్యంలో శుక్రవారం రోజున అంబేద్కర్ చౌరస్తాలో *సీఎం రేవంత్ రెడ్డి మరియు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల పార్టీ అధ్యక్షులు గూట్ల తిరుపతి మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు 1995లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ముగ్గురు పిల్లలు సంతానం ఉంటే స్థానిక సంస్థలలో పోటీ చేయుట అనర్హులని జీవో తీసుకువచ్చినప్పటి నుండి ముగ్గురు సంతానం కలిగిన వారు రాజకీయానికి దూరంగా ఉన్నారు,సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ కమిటీ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముగ్గురు పిల్లలుంటే పోటీకి అర్హులని మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ముగ్గురు పిల్లల జీవోను రద్దుచేసి ఇద్దరి కంటే ఎక్కువగా పిల్లలున్న ఉన్న వారు స్థానిక సంస్థల్లో పోటీ చేయొచ్చని ప్రభుత్వం మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడంతో…..
ఈ రాష్ట్రంలో ఇద్దరు కంటే ఎక్కువగా పిల్లలు సంతానం ఉన్న వారు స్థానిక సంస్థల్లో పోటీకి అర్హులని జీవోను తీసుకొచ్చిన ముఖ్యమంత్రి కి మరియు మన నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవనీయులు పెద్దలు గండ్ర సత్యనారాయణ రావు చిత్రపటాలకుశుక్రవారం రోజున పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ జీవోను తీసుకొచ్చినటువంటి స్థానిక ఎమ్మెల్యే మరియు ముఖ్యమంత్రివర్యులకి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగినది.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ స్టేట్ కన్వీనర్ రమేష్, జిల్లా నాయకులు రాజేష్ ఖన్నా, చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మట్టికే రవీందర్, నల్లబెల్లి విజేందర్ ,సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సిరిపురం కుమారస్వామి కొర్రి సాంబశివుడు ,మండల పార్టీ ప్రధాన కార్యదర్శి గడ్డం కొమురయ్య, గుండె పు రెడ్డి రవీందర్ రెడ్డి, బీసీ సెల్ మండల అధ్యక్షులు, బుర్ర శ్రీనివాస్ గౌడ్, దేవేందర్ రావు ,బొమ్మ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

అటు లుకలుకలు..ఇటు చిటపటలు!

`మహాఘట్‌ బంధన్‌లో కుంపట్లు.

`బిహార్‌లో నిగ్గు లేతకపోతున్న సర్ధుబాట్లు!

`ఎన్డీయే కూటమి సీట్ల ప్రకటన దాదాపు ఖరారైంది.

`ఇండియా కూటమిలోనే లుకలుకలు కొనసాగుతున్నాయి. 

`కాంగ్రెస్‌ గతంలో 71 సీట్లు పోటీ చేసింది.

`17 సీట్లు మాత్రమే గెల్చుకున్నది.

`ఈసారి 75 సీట్లు కావాలని కాంగ్రెస్‌ మెలిక పెట్టింది.

`అవసరమైతే ఒంటరిగా పోటీ చేస్తామని తేజస్వీ ప్రకటించారు.

`ఇండియా కూటమిలో కలకలం రేగింది.

`లాలూ కుటుంబం మీద కేసులు తెరమీదకు వచ్చాయి.

`ఆర్జేడీ దారికొచ్చింది..కూటమి బంధం గుర్తుకొచ్చింది.

`కాంగ్రెస్‌కు 60 సీట్లిస్తామంటోంది.

`ఆర్జేడీ 135 సీట్లలో పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

`మిగతా సీట్లు కమ్యూనిస్టులకు కేటాయించే అవకాశం వుంది.

`తాజాగా ప్రశాంత్‌ కిషోర్‌ పార్టీ పోటీ చేయడం లేదని ప్రకటించారు.

`రాజకీయం ఎటు మారుతుందనేది సస్పెన్స్‌గా మారింది.

`ఓడిపోయి పరువు పోగొట్టుకోవడం పికేకు ఇష్టం లేదు.

`రసవత్తరంగా మారనున్న బిహార్‌ పోరు.

 

హైదరాబాద్‌, నేటిధాత్రి: 

 బిహార్‌ రాష్ట్రంలో ఎన్నికల పొత్తులు ఎంత వరకు వచ్చాయని ప్రశ్నిస్తే సరైన సమాదానం ఎవరి వద్దా లేదు. ముఖ్యంగా ఇండియా కూటమిలో పొత్తులు పొడిచినా, సీట్ల సర్ధుబాటులో లుకలుకలు, చిటపటలు కనిపిస్తున్నాయి. ఓ వైపు బిజేపి, జేడీయూల పొత్తులు, సీట్ల పంపకాలు జరిగిపోయాయి. నామినేషన్లు కూడా వేస్తున్నారు. కాని ఇండియా కూటమిలో మాత్రం కుంపట్లు రేగుతున్నాయి. సీట్ల సర్ధుబాట్లు ఓ కొలిక్కి రాలేకపోతున్నాయి. యూపిఏ హాయాంలో ప్రతిపక్షం ఎప్పటిప్పుడు ఎంతో బలంగా వుంటూ వుండేది. కాని ఎన్‌డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార బిజేపి వేసే ఎత్తులకు ప్రతిపక్షాలు చిక్కుల్లో పడుతున్నాయి. సహజంగా ప్రతిపక్షాలు వేసే ఉచ్చులోఅదికార పార్టీ పడుతుంటాయి. ఓడిపోతుంటాయి. కాని ఇక్కడ గత పన్నెండు సంవత్సరాల కాలంగా ప్రతిసారి ప్రతిపక్షాలు పదే పదే బోల్తాపడుతున్నాయి. అయినా వాటి నుంచి తేరుకోవాలని ప్రతిపక్షాలు అనుకోవడం లేదు. ఐక్యత ప్రదర్శించడం లేదు. కలిసి సాగుదామన్న భరోసా వాటిలో కనిపించడం లేదు. ఎప్పటికప్పుడు లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, ఇండియా కూటమి ఐక్యతకు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. ఇండియూ కూటమి పార్టీలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. ఆ పార్టీల కోసం కూడా పొత్తు ధర్మంలో అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఆ పార్టీలకు అండగా నిలుస్తున్నారు. రాష్ట్రాలలో ఆ పార్టీలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు. అయినా ఆ పార్టీలు రాహుల్‌ గాంధీని నమ్మడం లేదు. అందుకే ఎప్పటికప్పుడు ఇండియా కూటమిలో లుకలుకలు వెగులోకి వస్తునే వున్నాయి. సమస్యలు పొడసూపుతూనే వున్నాయి. ఐక్యతకు బీటలు వారుతూనే వున్నాయి. అయినా ఎంత దిగినా ఫరావాలేదు. బిజేపిని ఓడిరచాలన్న ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్‌ పార్టీ అగ్రనాయకుడు, రాహుల్‌ గాంధీ చేస్తున్న కష్టం, కూటమి పార్టీలు బూడిదలో పోసిన పన్నీరు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు లుకలుకలు తెరమీదకు తెస్తూనేవున్నారు. రాహుల్‌ గాంధీ మూలంగానే ఇండియా కూటమికి మరింత బలం ఏర్పడిరది. ప్రాంతీయ పార్టీల బలం పెరుగుతూ వస్తోంది. అయినా ఎన్నికల సమయంలో రాహుల్‌ గాంధీకి హాండ్‌ ఇవ్వడం అలవాటు చేసుకుంటున్నారు. ఇది బిహార్‌లోనూ జరుగుతుందా? అన్న అనుమానం ఏర్పడుతోంది. ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటన చేసింది. నామినేషన్ల పర్వం కూడా మొదలైంది. కాని బిహార్‌లోని ఇండియా కూటమిలో సీట్ల సర్ధుబాటు పూర్తి కాలేదు. ఏ నియోజకవర్గంలో కాంగ్రెస్‌, ఆర్జేడీ పోటీ చేస్తాయన్నది తేలలేదు. ఇంకా సీట్ల నెంబర్లే తేల్చుకోలేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ 75 సీట్లకు పోటీ చేసింది. కాని కేవలం 17 సీట్లు మాత్రమే గెలిచింది. ఇప్పుడు కూడా అదే నెంబర్‌ కావాలని కోరుతోంది. కాని ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్‌ ససేమిరా అంటున్నారు. ఈ విషయంలో ఆ మధ్య తేడాలొస్తే పూర్తి స్దానాలలో పోటీ చేసేందుకు తాము సిద్దమంటూ కూడా తేజస్వీ యాదవ్‌ అన్నారు. అయితే ఇక్కడ రాహుల్‌ గాందీ ఒక విషయాన్ని మర్చిపోతున్నారు. దేశంలోని రాష్ట్రాలలో వున్న ప్రాంతీయ ప్రతిపక్షాలన బలోపేతం చేయడం తన భుజాల మీద వేసుకుంటున్నాడు. నిజానికి ఆ పని రాహుల్‌ గాందీ చేయకూడదు. కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి. కాంగ్రెస్‌ను మరింత ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేయాలి. తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో రాహుల్‌ గాందీ ఎన్ని సార్లు ఎన్నికల ప్రచారానికి వచ్చారు? అదే బిహార్‌లో ఎన్నికల ప్రచారానికి ఎన్నిసార్లు వెళ్లారనేది లెక్కతీస్తే అసలు విషయం అర్దమౌతుంది. అదే కర్నాకటలో కూడా అంతే. సొంత పార్టీ బలంగా వున్న రాష్ట్రాలలో పార్టీని అదికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. బలంగా లేని రాష్ట్రాలలో సొంత పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలి. కాని ఆయన ప్రతిపక్షాల ఐక్యత కోసం పాటు పడుతున్నారు. ప్రతిపక్షాలను బలోపేతం చేసే పనిని ఎంచుకున్నారు. ఇది కూడా కాంగ్రెస్‌ పార్టీ తన బలహీనతను తెలియజేస్తున్నట్లే కనిపిస్తోంది. ఇన్ని సార్లు కాంగ్రెస్‌కు అవమానాలు ఎదురౌతున్నా కాంగ్రెస్‌లో మార్పు కనిపిండచం లేదు. దేశమంతా రాహుల్‌ గాందీ వెంట నడుస్తోంది. ఆయన మాత్రం ప్రతిఫక్షాల వెంట నడుస్తున్నారన్న అభిప్రాయం వక్తమౌతోంది. ఇండియా కూటమిలోనే ఇన్ని లుకలుకలు అని అనుకుంటే కాంగ్రెస్‌ గతంలో ఎప్పుడూ లేనంతగా ఓటమి పాలు కావడం. 2014లో కనీసం 40 సీట్లు గెలవలేకపోవడం. దేశాన్ని అత్యధిక సార్లు పాలించిన, కాంగ్రెస్‌ పార్టీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోకపోవడం అనేది ఆ పార్టీకి మైనస్‌గా మారింది. మూడోసారి 2024లో 100 సీట్లు సాదించి ప్రతిపక్ష హోదా సాదించుకున్నది. అయినా ఆ పార్టీని ఇతర ప్రాంతీయ పార్టీలు లెక్క చేయడం లేదు. కనీసం వారి పార్టీల కోసం కాంగ్రెస్‌ను ఆసరా చేసుకొని గెలుద్దామన్న భావన వారిలోనూ లేదు. సమయం వస్తే కాంగ్రెస్‌ను దూరం పెట్టెందుకు సైతం ప్రాంతీయ పార్టీలు ఆలోచించడం లేదు. ఆ మధ్య జరిగిన డిల్లీ, పంజాబ్‌, హార్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ప్రాంతీయ పార్టీలు ఇదే అనుసరించాయి. కాంగ్రెస్‌ను దెబ్బకొట్టాయి. ముఖ్యంగా హర్యానాలో కాంగ్రెస్‌పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే పరిస్దితి మరో రకంగా వుండేదన్న అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమైంది. ముందు కలిసి సాగాలని అనుకున్నారు. ఎన్నికల సమయం దాకా కలిసి ప్రచారం చేసుకున్నారు. కాని తీరా ఎన్నికల వేల పొత్తులు కుదరక విడిపోయారు. దాంతో కాంగ్రెస్‌ను చిక్కుల్లోకి నెట్టేశారు? ఫలితంగా హార్యానాలో కూడా ముచ్చటగా మూడోసారి బిజేపి కూటమి విజయం సాదించింది. మహరాష్ట్రలోనూ అదే జరిగింది. కాంగ్రెస్‌పార్టీ ఏ పార్టీలతో పొత్తులు పెట్టుకుంటుందనేది కూడా ఎంతో ముఖ్యం. తాత్కాలిక పొత్తులు ఎప్పుడూ పుట్టి ముంచేస్తాయని కాంగ్రెస్‌ తెలుసుకోవాలి. నిజం చెప్పాలంటే మహారాష్ట్రలో కాంగ్రెస్‌ పార్టీ ఒంటరి పోరు చేస్తే అనేక సీట్లు గెలిచే అవకాశం వుండేది. కాని స్దానిక రాజకీయాలకు తనను తానే బలి చేసుకుంటోంది. పొత్తు ధర్మంతో తనను తాను తగ్గించుకుంటోంది. ఇది కాంగ్రెస్‌కుతీరని అన్యాయమైపోతోంది. ఇప్పుడు బిహార్‌లోనూ అదే జరుగుతోంది. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్‌ ఇచ్చే సీట్ల మీద ఆదారపడడం అనేది కాంగ్రెస్‌కు ఆశని పాతంగా మారనున్నది. ఓట్‌ చోరీ అనే అంశాన్ని పెద్దఎత్తున ప్రజల్లోకి తీసుకొచ్చి, ఎన్నికల సంఘం మీద రాహుల్‌ గాందీ యుద్దం చేస్తున్నారు. ప్రజలను చైతన్యం చేయడం కోసం పాదయాత్రలు చేస్తున్నారు. ఫలితంగా రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలకు జవసత్వాలు కల్పిస్తున్నారు. ఫలితంగా ఆ పార్టీలకు ఊపిరిపోస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు ఓటమి పాలైన ఆర్జేడీ ఈసారి గెలిచేందుకు రాహుల్‌ గాంధీ రూపంలో ఆపార్టీకి ఎంతో బలం వచ్చింది. అయినా సరే కాంగ్రెస్‌ అడిగినన్ని సీట్లు ఇచ్చేందుకు ఆర్జేడీ ససేమిరా అంటోంది. ఇదిలా వుంటే బిహార్‌లో రాజకీయపార్టీని పెట్టి, ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ ప్రకటించారు. కారణం ఆయన పార్టీకి ప్రజల నుంచి స్పందన రావడం లేదని స్పష్టమైంది. ఒక వేళ ఎన్నికల్లో ఒక్క సీటు గెలవకపోయినా, తాను ఓడిపోయినా తనకు తీరని నష్టమని తెలుసుకున్నారు. పార్టీ పోటీ చేయడం లేదని ప్రకటించారు. కాని తాను ఇండియా కూటమికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించలేదు. ఇప్పుడు ప్రశాంత్‌ కిషోర్‌ మాద్దతు ఎవరికి అనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇలా ఇండియా కూమిటికి సరిగ్గా ఎన్నికల సమయంలో పడుతున్న దెబ్బలు కోలుకోకుండా చేస్తున్నాయి. అయితే బిహార్‌ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలిస్తే మాత్రం కాంగ్రెస్‌కు ఒక రకంగా సంజీవని అవుతుందని చెప్పడంలో మాత్రం సందేహం లేదు. కాంగ్రెస్‌కు మంచి రోజులు రానున్నాయనే వాటికి సంకేతాలు అని చెప్పక తప్పదు.

తిష్ట వేశారు…కోట్లు తింటున్నారు!?

 

*”మంత్రి,కమిషనర్ గారు” అవినీతి ఉద్యోగులపై “ఓ కన్నెయ్యండి”.

మంత్రి పొంగులేటి రిజిస్ట్రేషన్‌ శాఖలో ప్రక్షళన చేసి అధికారులను ట్రాన్స్‌పార్లు చేశారు

`ఏళ్ల తరబడి అదే కుర్చీలో కూర్చుంటున్నారు.

`ఒకప్పుడు సివిల్‌ సప్లయ్‌ శాఖ అంటే మాకొద్దనే వారు!

`ఇప్పుడు ఎమ్మార్వోలు, రెవిన్యూ అధికారులు ఎగబడుతున్నారు!

డిప్యూటేషన్ల మీద సివిల్‌ సప్లయ్‌ కోరుకుంటున్నారు.

`తెలంగాణ వచ్చిన తర్వాత పెరిగిన పంటల దిగుబడితో అధికారులు పంట పండిరచుకుంటున్నారు.

`జీతానికి అదనంగా వందల రెట్లు సంపాదించుకుంటున్నారు!

`వందల కోట్లకు అధికారులు చేరుకుంటున్నారు.

సివిల్‌ సప్లై శాఖలో ‘‘డిసిఎస్‌ఓ’’,’’డిఎం’’ల సంపాదనకు లెక్కేలేదు.

`ఐదారేళ్లగ సంపాదనకు అంతే లేదు.

`మిల్లర్లను పీల్చి పిప్పి చేస్తున్నారు.

`బాయిల్డ్‌ మిల్లర్లకు కల్పతరువులౌతున్నారు!

అక్రమంగా వడ్లు కేటాయించి లక్షలు లంచాలుగా తీసుకుంటున్నారు.

‘‘డిసిఎస్‌ఓ’’, ‘‘డిఎం’’లకు ఏ అవసరం వచ్చినా మిల్లర్లు సమకూర్చాల్సిందే!

ప్రతి సంవత్సరం టూర్‌ ప్యాకేజీలు చెల్లించాల్సిందే!

`ఎప్పుడు అడిగితే అప్పుడు అడిగినంత ముట్ట జెప్పాల్సిందే?

`లేకుంటే మిల్లర్‌ చుక్కలు చూడాల్సిందే?

రాజకీయ నాయకులకు కోట్లలో చందాలిచ్చేంత ‘‘డిసిఎస్‌ఓ’’, ‘‘డిఎం’’, ‘‘డిటి’’లు ఎదిగారు!

`నాయకుల ఆశీస్సులతో కుర్చీలలో పాతుకుపోయారు.

రిజిస్ట్రేషన్‌ శాఖలాగా ట్రాన్స్‌ఫర్లు చేస్తే తప్ప వ్యవస్థ మారదు.

గతంలో రిజిస్ట్రేషన్‌ శాఖలోనూ దశాబ్దాల తరబడి ట్రాన్స్‌ఫర్లు లేవు.

`సబ్‌ రిజిస్ట్రార్‌లు విచ్చలవిడి సంపాదనకు ఎగబడ్డారు.

`సరిగ్గా సివిల్‌ సప్లయ్‌ శాఖలో ఇదే జరుగుతోంది.

`ట్రాన్స్‌ఫర్లు లేక అధికారులు ఆడిరది ఆట, పాడిరది పాట చేసుకుంటున్నారు.

కమీషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర, ముందు ట్రాన్స్‌ఫర్లు మొదలు పెడితే సివిల్‌ సప్లయ్‌ శాఖ సగం గాడిలో పడినట్లే!

 

హైదరాబాద్‌, నేటిధాత్రి:  

 ప్రభుత్వ కొలువు పాడి గేదే లాంటిది. ముప్పైపాటు ఒట్టిపోదు అనుకునేవారు. అంటే ఒక్కసారి ఉద్యోగంలో చేరితే జీవితం హాయిగా సాగుతుందనుకునే వారు. కాని ఇప్పుడు ప్రభుత్వ కొలువు అంటే విలాసం. జీతం లకారంలో వుంటుంది. లంచాలు లకారాలు దాటుతున్నాయి. ముఖ్యంగా కొన్ని శాఖల్లో కోట్ల రూపాయలు కూడా వచ్చిపడుతున్నాయి. ప్రభుత్వ కొలువు అంటే సేవ అనే భావం వుండేది. ఉద్యోగంలో చేరకముందు ప్రజలకు సేవ చేయడానికి అని చెప్పుకునేవారు. అది ఐఏఎస్‌ నుంచి కింది స్దాయి ఉద్యోగుల దాకా ప్రజా సేవ అనే పదమే వినిపించేది. మరి ఇప్పుడు ఉద్యోగం అంటే కల్ప వృక్షం. సేవ సంగతి దేవుడెరుగు? ఎప్పుడు ఎంత సంపాదించాలి? ఎలా సంపాదించాలి? ప్రజలను ఎలా ఇబ్బంది పెట్టి లంచాలు తీసుకోవాలి. అక్రమ మార్గాలు అన్వేషించి లంచాలు ఎలా తినాలి. ప్రజల్ని ప్రభుత్వాన్ని మోసం చేయాలి. అనేదే చాలా మంది ఉద్యోగులు అనుసరిస్తున్న విధానం. ఒకప్పుడు ఎక్కడో అక్కడ ఎవరో ఒకరు లంచం తీసుకుంటూ వుండేవారు. బియ్యంలో రాళ్లలాలా వుండేవారు. కాని ఇప్పుడు రాళ్లలో బియ్యంలా ఒకరో ఇద్దరో లంచాలు తీసుకోని వారున్నారు. ఇదీ ఇప్పటి ఉద్యోగుల పరిస్దితి. గతంలో ఒకటో రెండో శాఖల్లో అవినీతి జరుగుతుందని అనుకునే వారు. కాని ఇప్పుడు అన్ని శాఖల్లోనూ అవినీతి దూరింది. ముఖ్యంగా కొన్ని శాఖల్లో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. అలాంటి శాఖలో సివిల్‌ సప్లై శాఖ ఒకటి. ఈ శాఖలో ఉద్యోగం చేయాలంటే ఉద్యోగులు తలనొప్పి అనుకునేవారు. విపరీతమైన పని వుంటుంది. కాణి కూడా లంచం దొరకదనుకునే వారు. కాని ఇప్పుడు సివిల్‌ సప్లై శాఖలో కొలువు అంటే ఎగిరి గంతేస్తున్నారు. సివిల్‌ సప్లైలో ఉద్యోగం కావాలనుకుంటున్నారు. ఒకప్పుడు రెవిన్యూ వ్యవస్ధ నుంచి సివిల్‌ సప్లై శాఖకు డిప్యూటేషన్‌ మీద వెళ్లేందుకు ఎగబడుతున్నారు. రెవిన్యూ శాఖలో కింది స్ధాయి నుంచి తహసిల్ధార్‌ వరకు సివిల్‌ సప్లై శాఖకు వెళ్లేందుకు సిద్దపడుతున్నారు. కావాలని కోరుతున్నారు. ఖర్చుకు కూడా వెనుకాడకుండా ఫైరవీలు చేయించుకుంటున్నారు. ఇదిలా వుంటే ఏడెనమిదేళ్ల క్రితం నుంచి డిప్యూటేషన్‌మీద వెళ్లిన అధికారులు కొందరు అక్కడే తిష్ట వేసుకుపోయారు. గతంలో మన తెలంగాణలో పంటల దిగుబడి తక్కువ. తెలంగాణ వచ్చిన తర్వాత గత ప్రభుత్వం మూలంగా తెలంగాణ విస్తారమైన వ్యవసాయం సాగుతోంది. రికార్డు స్దాయిలో పంటలు పండుతున్నాయి. అందులో ముఖ్యంగా వరి దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ మారిపోయింది. దాంతో రెవిన్యూ వ్యవస్ధకంటే ఎక్కువ ఆదాయం సమకూర్చే శాఖగా సివిల్‌ సప్లై మారిపోయింది. ఇక అక్కడి నుంచి అదికారుల పంట పండిరది. తెలంగాణలో గతంలో వందల సంఖ్యలో వున్న రైస్‌ మిల్లులు వేల సంఖ్యకు చేరుకున్నాయి. రైస్‌ మిల్లులకు వడ్లను సమకూర్చే అదికారం వారి చేతుల్లోకి వచ్చేసింది. ముఖ్యంగా డిసిఎస్‌వో( డిస్టిక్ట్‌ సివిల్‌ సప్లై ఆఫీసర్‌) డిటి. (డిస్టిక్‌ తహసిల్ధార్‌) , డిఎం. (డిస్టిక్ట్‌ మేనేజర్‌) స్దాయి ఉద్యోగులకు పండగే పండుగగా మారింది. వారికి వద్దన్నా లంచాలు వచ్చిపడే కామదేనువుగా సివిల్‌ సప్లై శాఖ మారింది. మిల్లులకు వడ్లు ఇవ్వడానికి, ఇచ్చిన వడ్లను బియ్యంగా మార్చిన మిల్లర్ల నుంచి బియ్యం సేకరించడానికి రెండు రకాల ఆదాయాలుగా అధికారులకు మారిపోయింది. సహజంగా ఒక ఉద్యోగికి ఒకే రకమైన లంచం వస్తుంది. కాని ఇక్కడ రెండు రకాల లంచాలు వచ్చే ఏకైక శాఖ సివిల్‌ సప్లైశాఖ అని ఉద్యోగులు చెప్పుకుంటారు. డిసిఎస్‌లో, డిటిలు మిల్లులకు వడ్లు కేటాయిస్తుంటారు. డిఎం. మిల్లర్ల నుంచి బియ్యం సేకరించే బాద్యతలు నిర్వర్తిస్తుంటారు. దాంతో కింది నుంచి పై స్దాయి దాకా ఆదాయమే ఆదాయం అన్నట్లు మారిపోయింది. దాంతో అదే శాఖలో అదే కుర్చీలో ఏళ్ల తరబడి పై స్దాయి ఉద్యోగులు తిష్ట వేశారు. ఒక రకంగా పాతుకుపోయారు. వారికి అందే లంచాల కింద జీతం బియ్యంలో మెరిగలా మారిపోయింది. జీతానికి వంద రెట్లు లంచాలు అందుతున్నాయి. మిల్లర్ల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారన్న వార్తలు అనేకం వున్నాయి. సివిల్‌ సప్లైశాఖలో డిఎస్‌ఓలు, డిఎం సంపాదనలకు లెక్కే లేదని అంటున్నారు. ఎక్కడా లంచం తీసుకున్నట్లు కూడా కనిపించదు. ఐదారేళ్లుగా ఇలా పాతుకుపోయిన అనేక మంది అదికారులు మిల్లర్లను పీల్చి పిప్పి చేస్తున్నారని సమాచారం. అక్రమంగా మిల్లర్లకు వడ్లు కేటాయించి, లక్షలకు లక్షలు లంచాలు తీసుకుంటున్నారు. దాంతో డిఎస్‌ఓలు, డిఎంలకు ఏ అవసరం వచ్చినా మిల్లర్లు ఎంత అడిగితే అంత సమకూర్చాల్సిందే. అధికారులు టూర్‌ వెళ్లే ప్యాకేజీలు చెల్లించాల్సిందే. ఎప్పుడు అడితే అప్పుడు, ఎంతఅడిగితే అంత ముట్ట చెప్పాలిందే? లేకుంటే మిల్లర్లకు చుక్కలు చూపిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. సివిల్‌ సప్లైశాఖలో అధికారుల సంపాదన ఎంత దూరం వెళ్లిందంటే రాజకీయ నాయకులకు, పార్టీలకు ఫండిరగ్‌ చేసేంత సంపాదిస్తున్నారు. కుర్చీలను కాపాడుకుంటున్నారు. అదే కుర్చీలో కూర్చోవాలంటే అధికారపార్టీ పెద్దలకు కోట్ల రూపాయలు పార్టీ ఖర్చులకు సమకూర్చుతున్నారంటే ఏ స్ధాయిలో అదికారులు సంపాదిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. అధికారులకు అవసరం వచ్చినా, నాయకుల అవసరాలను తీర్చాల్సిన పరిస్దితి ఎదురైనా సరే మిల్లర్ల నుంచి దండిగా వసూలుచేయడం అలవాటు చేసుకున్నారు. రెండు రకాలుగా మిల్లర్ల నుంచి సంపాదిస్తున్నారు. దీనంతటికీ ఆ అధికారులు మాతృ శాఖలకు వెళ్లకపోవడం, అదే కుర్చీలలో ఏళ్ల తరబడి పాతుకుపోవడం వల్ల సంపాదిస్తున్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చే వరకు రిజిస్ట్రేషన్‌శాఖలో కూడా ఇలాంటి వ్యవహరమే సాగేది. ఉమ్మడిరాష్ట్రం నుంచి రేవంత్‌ సర్కారు వచ్చే వరకు సుమారు పదమూళ్లు పాటు రిజిస్ట్రేషన్‌ శాఖలో ట్రాన్స్‌ఫర్లు జరగలేదు. ప్రమోషన్లు వచ్చినా సబ్‌ రిజిస్ట్రార్లు వద్దనుకున్నారు. పదమూడేళ్లుగా ఒకే చోట పనిచేస్తూవచ్చారు. ఆ ప్రాంతంమీద పూర్తిపట్టు సాధించారు. లంచాలకు బరితెగించారు. రేవంత్‌సర్కారు వచ్చిన తర్వాత రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఏళ్ల తరబడి పాతుకుపోయిన వాళ్లందిరికీ ట్రాన్స్‌ఫర్లు చేయించారు. జోన్‌లు దాటించారు. సరిగ్గా ఇప్పుడు సివిల్‌ సప్లైలోనూ అదే పనిచేయాలి. అలా చేస్తే తప్ప అదికారుల విచ్చలవిడి అవినీతి తగ్గదు. ప్రభుత్వాదాయానికి గండిపడదు. సివిల్‌ సప్లై నూతన కమీషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర అన్నింటికన్నా ముందు ఉద్యోగులను జోన్‌లు దాటిస్తే శాఖను సగం గాడిలో పెట్టినట్లే అంటున్నారు. గత కమీషనర్‌ ఈ నిర్ణయం తీసుకునేలోపు ట్రాన్స్‌ఫర్‌ అయ్యారు. ఏ ఏ జిల్లాలలో ఏ అదికారి పాతుకుపోయారు. వారి సంపాదనలు ఎలా వున్నాయి? వారి వివరాలతో కూడిన సమగ్ర సమచారాలు మీ నేటిదాత్రిలో త్వరలో వరుస కథనాలు…

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కలిసిన మంత్రి సెట్విన్ చైర్మన్

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కలిసిన మంత్రి సెట్విన్ చైర్మన్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీకి వెళ్లిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే పరామర్శించిన ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తనతో పాటు జహీరాబాద్ నియోజకవర్గ సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి రాష్ట్ర నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి
మల్లిఖార్జున ఖర్గేకు ఇటీవల పేస్ మేకర్ అమర్చిన వైద్యులు.ఖర్గేతో సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు, జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు,

‘‘గుట్కా’’ కింగ్‌ ‘‘హీరోలాల్‌’’ ఎవరు!?

`గుట్కా కంపులో గప్పుమంటున్న తెలంగాణ!

`సందు సందులో గుప్పుమంటున్న గుట్కా కంపు!

 

గుట్కా తిను..క్యాన్సర్‌ కొను!

`సందుసందున అమ్మకాలే!

`పట్టించుకుంటున్న నాధుడే లేడాయే!

`అరకొర దాడులు…అరెస్టులు!

`ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న గుట్కా వ్యాపారులు!

`నిషేదిత గుట్కా, పొగాకు తయారీలు ఎలా వస్తున్నాయి?

`ఇంత విచ్చలవిడిగా అమ్మకాలు సాగుతున్నా కళ్లెందుకు మూసుకుంటున్నారు.

`పల్లెల్లో పదుల సంఖ్యలో క్యాన్సర్‌ బారిన పడుతున్నారు!

`రోజు రోజుకూ పెరుగుతున్న క్యాన్సర్‌ రోగులు?

`నిషేదిత గుట్కాలు యదేచ్చగా రాష్ట్రానికి ఎలా చేరుతున్నాయి!?

`జిల్లాలు, మండలాల వారిగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని వ్యాపారం?

నిత్యం కోట్ల రూపాయలలో గుట్కా, అంబర్‌ ఖైనీల అమ్మకాలు.

`అక్కడక్కడా పట్టుకుంటున్న వార్తలు.

`తెలంగాణ అంతటా విచ్చలవిడిగా అమ్మకాలు!

`గుట్కా తినొద్దని ప్రభుత్వ ప్రకటనలు.

`వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ప్రచారాలు.

`మరో వైపు గుట్కా కంపనీలకు అనుమతులు!

దేశమంతటా నిషేధం.. తెలంగాణ విచ్చలవిడిగా అమ్మకం

కాన్సర్‌ మహమ్మారి ప్రపంచాన్ని కబలిస్తోంది. ఒకప్పుడు ఎవరికైనా కాన్సర్‌ వచ్చిందంటే అదే పెద్ద వార్తగా చెప్పుకునేవారు. కాని ఇప్పుడు క్యాన్సర్‌ ఒక సాదాసీతా రోగమైపోయింది. కాని చికిత్సలేక ప్రాణాలను బలిగొంటోంది. అయినా ప్రభుత్వాలు మేలుకున్నట్లు ఎక్కడా కనిపించడం లేదు. ప్రజలు కాన్సర్‌ బారిన పడకుండా వుండాలంటూ వేల కోట్లు ఖర్చు చేసి ప్రకటనలు తయారు చేస్తున్నారు. విసృతంగా ప్రచారం చేస్తున్నారు. మీడియాలో, టెలివిజన్‌లలో, సినిమా ధియేటర్లలో నిత్యం కాన్సర్‌పై అవగాహన ప్రకటనలు విసృతంగా ప్రచారం చేస్తున్నారు. కాని కాన్సర్‌ కారకాలను అరికట్టడంలో ఎందుకు విఫలమౌతున్నారు? కాన్సర్‌ కారకాలను తయరు చేస్తున్న కంపనీలకు ఎలా పర్మిషన్లు ఇస్తున్నారు. మన దేశంలో క్యాన్సర్‌కు ప్రదాన కారకాలలో పొగాకు ఉత్పత్తుల పాత్ర పెద్దది. పొగాకు పంటలను పండుతూనే వుంటాయి. అటు గుట్కాల తయారీ జరుగుతూనే వుంటుంది. కాని మన దేశంలో గుట్కా నిషేదం. ఎలా జనం వద్దకు వస్తోంది. మన దేశంలో గుట్కా వ్యాపారం కొన్ని వేల కోట్లలో సాగుతోంది. నిత్యం దేశ వ్యాప్తంగా వందల కోట్లలో వ్యాపారం సాగుతోంది. ముఖ్యంగా మన తెలంగాణలో గుట్కా పూర్తిగా నిషేదం. కాని గుట్కా దొరకని ప్రాంతం లేదు. ప్రదేశం లేదు. పల్లె నుంచి పట్నం దాక ప్రతి చోట గుట్కా దొరుకుతూనే వుంది. జనం ప్రాణాలను హరిస్తూనేవుంది. అయినా ప్రభుత్వాలు పెద్దగా చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. ఒక్క తెలంగాణలోనే రోజుకు సుమారు రూ.5 కోట్ల రూపాయల గుట్కా వ్యాపారం సాగుతున్నట్లు తెలుస్తోంది. అది కూడా విచ్చలవిడిగా సాగుతోంది. పటిష్టమైన చెక్‌ పోస్టు వ్యవస్ధలున్నప్పటికీ గుట్కా వ్యాపారులు యదేఛ్చగా ఎలా సరుకును రవాణా చేస్తున్నారన్నది తేలాల్సి వుంది. బియ్యం అక్రమరవాణ, కలప అక్రమ రవాణ, ఆఖరుకు లిక్కర్‌ అక్రమ రవాణాలు కూడా అరికడుతున్నారు. కాని గుట్కా రవాణా మాత్రం ఎక్కడా ఆగినట్లు వార్తలు లేవు. పట్టుకున్నట్లు కూడా దాఖలాలు లేవు. కాని జిల్లాలకు చేరిన తర్వాత అక్కడక్కడ టాస్స్‌ ఫోర్స్‌ దాడులు నిర్వహించడం పట్టుకోవడం జరుగుతోంది. అయినా అది కూడా అంతంతమాత్రంగానే జరుగుతుండడంతో గుట్కాల అమ్మకాలు ఆగింది లేదు. ప్రభుత్వం నిశేదించిన గుట్కా, పాన్‌ మసాల, అంబర్‌ లాంటివి అధిక ధరలకు విక్రయిస్తూ అలా కూడా సొమ్ము చేసుకుంటున్నారు. జనం జేబులకు చిల్లు పెట్టడమే కాదు, ప్రాణాలకు కూడా చిల్లులు పెడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌తోపాటు, ఇతర నగరాల్లో పాతుకుపోయిన కొంత మంది మార్వాడీ వ్యాపారులే ఈ వ్యాపారాలను సాగిస్తున్నట్లు తెలుస్తోంది. కొంత మంది పేర్లుకూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కొద్ది సంవత్సరాలుగా కర్నాకట, రాజస్ధాన్‌, గుజరాత్‌లలో కంపనీలు ఏర్పాటు చేసి, అక్కడి నుంచి రహస్యంగా గుట్కాలను హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు కూడా సమాచారం. వారిలో ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లు కూడా వున్నాయి. దీని వెనక హీరాలాల్‌ అనే వ్యక్తి వున్నట్లు కూడా తెలుస్తోంది. అతని నుంచి నగరంలోని అనేక మందికి సరఫరా సాగిస్తున్నట్లు సమచారం. ఇటీవల వరంగల్‌ నగర కేంద్రంలో సుమారు రూ.10లక్షల విలువైన గుట్కా పాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉమ్మడి కరీంనగర్‌లో కూడా పెద్దఎత్తున కోట్లాది రూపాయల విక్రయాలు జరుగుతున్నట్లు కూడా తెలుస్తోంది. సుమారు రూ.76లక్షల రూపాయల విలువైన గుట్కా, ఇతర పొగాకు ఉత్పత్తులను పోలీసులు ఆ మధ్య స్వాదీనం చేసుకున్నారు. కేసులు నమోదు చేశారు. గుట్కాల మూలంగా ఎంత అనర్ధం జరుగుతుంతో అందరికీ తెలుసు. అయినా దాని వ్యాపారం మాత్రం ఎక్కడా ఆగడం లేదు. చిన్నాపెద్ద అనే తేడా లేకుండా గుట్కాలను నమిలేస్తున్నారు. తెలంగాణ పల్లెల్లో యువత ఎక్కువగా గుట్కాలకు బానిసలౌతున్నారు. క్షణం పాటు గుట్కా నమలకుండా వుండలేని స్ధితిలోకి వెళ్తున్నారు. నిద్రిస్తున్న సమయంలో కూడా నోట్లో గుట్కా వేసుకొనే పడుకుంటున్నవాళ్లున్నారు. ఆ గుట్కాల మూలంగా గొంతు క్యాన్సర్ల బారిన కొన్ని లక్షల మంది పడుతున్నారు. పల్లె, పట్టణాలు అనే తేడా లేకుండా గుట్కా గప్పు కొడుతూనే వుంది. గుట్కా తినడం వల్ల వచ్చే అనర్ధాల గురించి ప్రచారం చేస్తున్నారు. కాని వాటిని అమ్మకాలను ఎందుకు ఆపలేకపోతున్నారు. ప్రతి కిరాణాషాపులోనూ యదేచ్చగా అమ్మకాలు సాగిస్తున్నారు. ప్లాస్టిక్‌ కవర్లపై ఎలాంటి వైఖరిని అనుసరిస్తున్నారో గుట్కాల విషయంలోనూ అదికారులు అదే వైఖరి అనుసరిస్తున్నారు. ప్లాస్టిక్‌ను కాస్త ఎక్కువ కంట్రోల్‌ చేస్తున్నారే గాని, గుట్కాల అమ్మకాలను అరికట్టలేపోతున్నారు. మీడియాలో వార్తలు వచ్చినప్పుడు హడావుడి చేయడం తప్ప, పెద్దగా దాడులు చేస్తున్నది లేదు. అక్రమ గుట్కాల తరలింపు ఆగడం లేదు. వాటి అమ్మకాలను ఆపుతోంది లేదు. రోడ్ల మీద ఎక్కడ చూసినా గుట్కా రాయుళ్లు చించి పడేసిన ప్యాకెట్లు అడుగడునా దర్శనమిస్తూనేవుంటాయి. పాన్‌ షాపుల నుంచి చెత్త సేకరించే మున్సిపల్‌ వాహనాలలో కూడా ఆ ప్యాకెట్లు కనిపిస్తూనే వుంటాయి. అయినా అదికారులకు చీమ కుట్టినట్లు కూడా కావడం లేదు. ఓ వైపు ప్రభుత్వాలు ఎంతో శ్రద్దతో ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని ప్రయత్నం చేస్తుంటే అదికార యంత్రాంగాలు మాత్రం మొద్దు నిద్ర వీడడం లేదు. నిజంగా తెలంగాణలోని అధికారులు తల్చుకుంటే ఒక్క గుట్కా పాకెట్‌ అయినా తెలంగాణలోకి రాగలుగుతుందా? అమ్మగలుగురా? బస్సులలో, రైళ్లలో, రద్దీ ప్రదేశాలలో గుట్కా నమిలే వాళ్ల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్లు కూడా వున్నారు. అయినా చర్యలు తీసుకునేవారు లేరు. ఇటు మత్తు పదార్ధాలు, అటు గుట్కా లాంటి విష పదార్దాల వల్ల యువత ఎంతో నష్టపోతోంది. తెలంగాణలో ఈ గుట్కా వ్యాపారం ప్రముఖంగా సాగిస్తున్నవారిలో ముందు వరుసలో వున్న వాళ్లంత మార్కాడీలు కావడం వల్లనే అదికార యంత్రాంగం చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించి అనేక వార్తలు కూడా వస్తున్నాయి. అయినా పోలీసులు మాత్రం కదులుతున్నట్లు లేదు. రోడ్డు మీదకు వచ్చిన వాళ్లు ట్రాఫిక్‌ రూల్స్‌ తప్పితేనే ప్రాణాలకు ప్రమాదమని వారిని శిక్షిస్తున్నారు. కాని కొన్ని కోట్ల మంది ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న గుట్కా దొంగ వ్యాపారులను ఎందుకు వదిలేస్తున్నారన్న ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. ఎందుకంటే వాటి వల్ల ప్రభుత్వానికి వచ్చేది ఏమీ లేదు. ప్రజలకు మేలు జరగదు. కేవలం వ్యాపారుల జేబులు నిండుతున్నాయి. వారి ఆస్ధులు కోట్లకు పెరుగుతున్నాయి. జిఎస్టీ లేని వ్యాపారం. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వ్యాపారం ఇంత యదేచ్చగా సాగుతుంటే ఆపేదెవరు? అరికట్టేదెవరు? ప్రజల ప్రాణాలతో వ్యాపారం చేస్తున్నవారిని ఎందుకు ఉపేక్షిస్తున్నారు. జిల్లాల నుంచి, పల్లెల దాకా నెట్‌ వర్క్‌ ఏర్పాటు చేసుకొని, జనాన్ని క్యాన్సర్‌ బారిన పడేలా చేస్తున్నవారిని ఎవరు పట్టుకోవాలి? ఓ వైపు మత్తు పదార్ధాలు జాడ దొరుకుతూనే వుంది. అది కూడా పెద్దఎత్తున వ్యాపారంసాగుతూనే వుంది. అయితే అది అందరికీ అందుబాటులో వుండకపోవచ్చు. కాని గుట్కా అనేది ప్రతి సామాన్యుడికి అందుతోంది. మత్తుకు అలవాటు పడిన యువత దాన్ని నమిలి మింగేస్తుంది. ప్రాణాల మీదకు తెచ్చుకుంటోంది. ప్రభుత్వం సీరియస్‌గానే వుంది. కాని అధికార గణమే అలసత్వమే కనిపిస్తోందని అంటున్నారు. గుట్కా వ్యాపారుల చైన్‌ నెట్‌ వర్క్‌పై త్వరలోనే మరిన్ని సమగ్రమైన కథనాలు మీ నేటిధాత్రిలో…వరుసగా…గుట్కాను తెలంగాణ నుంచి తరిమేసేదాకా నేటిధాత్రి అక్షర పోరాటం చేస్తుంది. గుట్కా రహిత తెలంగాణ లక్ష్యంగా ముందుకు సాగుతుంది.

‘వేలకోట్ల’’ చిట్‌ ‘‘కుంభకోణం’’?

`చిట్‌ కంపెనీలు ..చీకటి దందాలు!?

`ఒక్కసారి చిట్‌ వేస్తే.. ఇక మిగిలేది చీకటే!

1000 cr chit fund scam in warangal

`నమ్మి చిట్టి కడితే చీటి చిరిగినట్లే!?

`లాక్కోలేక, పీక్కో లేక కష్టాలు కొని తెచ్చుకోవడమే!

`గాలికి పోయే కంపను గోచిలో పెట్టుకోవడమే!

1000 cr chit fund scam in warangal

`జీవితాలు ఆగమే…బతకంతా నరకమే!

`నమ్మించినంత సులువుగా మోసం చేస్తారు?

`జనాన్ని నట్టెట ముంచేస్తారు!

`తేరగా చేతులెత్తేస్తారు!

`బోర్డు తిప్పేసి కంపనీ లాస్‌ అని మూసేస్తారు!

`అట్లుంటది చిట్‌ కంపనీల మోసం!

ఒక్క ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోనే వేలాది కోట్ల కుంభకోణం!

12 నెలలుగా వరంగల్‌ నగరంలో ‘‘చిట్స్‌ రిజిస్ట్రార్‌’’ లేడు.

`దివాళా కంపెనీల ఆగడాలు అన్నీ ఇన్నీ కావు!

`దివాళా తీసిందని చట్టాన్ని నమ్మిస్తారు!

`కోర్టులను కూడా నమ్మించి జనాన్ని మోసం చేస్తారు!

`కంపనీ బకాయి పడ్డ వారికి రూపాయి ఇవ్వరు!

`కంపనీకి రావాల్సి వుంటే వేధించుకు తింటారు!

`ప్రజలకు ఎవరూ మద్దతుగా రారు!

`పోలీసులు కూడా ప్రజల పిర్యాదులు పట్టించుకోరు!

`నాయకులు, పోలీసులు కంపనీలకు అండగా నిలుస్తారు!

`బోర్డులు తిప్పేసిన కంపెనీలకే వంతలు పాడుతుంటారు!

జనాలకు ‘‘చిట్‌ చట్టాల’’ మీద అవగాహన వుండదు!
బోర్డు తిప్పేసిన కంపెనీకి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని తెలియదు!
ఆ సొమ్మును ‘‘చిట్‌ రిజిస్ట్రార్‌’’కు మాత్రమే చెల్లించాలన్న అవగాహన ఎవరికి ఉండదు!

`పదే పదే కంపెనీల మోసాలకు బలౌతుంటారు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

చట్ట బద్దమైన సంస్థలు అంటారు. చట్టాలను చచ్చుబండలు చేస్తారు. ప్రజలు ఎవరో ఒకరిని నమ్మి, చిట్టీలు వేసి మోసపోవద్దు? అని నీతులు చెబుతారు. అన్ని రకాల అనుమతులతో కూడిన చిట్‌ కంపనీ ఊదరగొడతారు. ప్రచారం చేసుకుంటారు. సెలబ్రిటీలతో ప్రకటనలు చేయిస్తారు. హంగూ ఆర్భాటాలతో కూడిన కార్యాలయాలు ఏర్పాటు చేస్తారు. జనం సొమ్ముతో కార్యాలయాలను నిర్వహిస్తుంటారు. మా చిట్స్‌ కంపనీలో చిట్టీల కట్టమంటారు? ప్రజలను మోసం చేస్తుంటారు. జనాన్ని నిండా ముంచేస్తుంటారు. వారి బతుకులతో ఆడుకుంటుంటారు. నమ్మినందుకు జనానికి నరకం చూపిస్తారు. వేసిన చిట్టీల గడుపు పూర్తయినా చిట్టీ మొత్తం డబ్బులు ఇవ్వరు. నట్టేట ముంచుతుంటారు. అయినా పాలకులు పట్టించుకోరు. వ్యవస్ధలు పట్టించుకోవు. జనం గోడు వినిపించుకోరు. బాధితులకు అండగా ఎవరూ ముందుకు రారు. ప్రభుత్వాధికారులు పట్టించుకోరు. అందరూ పట్టీపట్టనట్లే వ్యవహరిస్తుంటారు. చిట్స్‌ పేరుతో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న కంపనీలు బోర్డులు తిప్పేసినా దిక్కు దివానం వుండదు. జనం సొమ్ముతో ఉడాయిస్తుంటారు. కంపనీ దివాళా తీసిందని కాకమ్మ కధలు చెబుతారు. జనం నోట్లో మట్టికొడతారు. నాలుగు రోజులు జైలు జీవితం అనుభవిస్తారు. బైటకు వచ్చి మళ్లీ కొత్త బాగోతం మొదలు పెడతారు. పాత బోర్డు స్ధానంలో కొత్త బోర్టు పెట్టేస్తారు. కంపెనీకి కొత్త పేరు పెట్టేస్తారు. మళ్లీ అద్దాల కార్యాలయం ఓపెన్‌ చేస్తారు. అమాయక జనాన్ని మళ్లీ ఆకర్షిస్తారు. బోనం బొట్లు పెట్టేస్తుంటారు. కంపనీలకు దేవుళ్ల పేరు పెడుతుంటారు. నమ్మకానికి ప్రతి రూపం అంటారు. నమ్మకమే మా పెట్టుబడి అని నమ్మిస్తారు. జనం సొమ్ముకు భరోసా అంటారు. మమ్మల్ని నమ్మడం అంటేనే గొప్ప వరం అన్నంతగా ప్రచారం సాగిస్తారు. సెలబ్రిటీలను తెచ్చి ప్రచారానికి వినియోగిస్తుంటారు. మీ భవిష్యత్తు మాది అంటారు. జనం సొమ్ము ఊడ్చుకొని ఉత్తచిప్ప కూడా చేతికి రాకుండా చేస్తారు. జనం రూపాయికి రక్షణ అంటారు. జనం బలహీనతను హాయిగా సొమ్ము చేసుకుంటారు. ఆస్ధులు పెంచుకుంటారు. చిట్‌ వేసేదాక బెల్లం మీద ఈగలు వాలినట్టు, జనం చుట్టూ తిరుగుతారు. వడ్డీ వల విసురుతారు. వెంట పడీ పడీ చిట్టీ కట్టేదాకా వదిలిపెట్టరు. అప్పులోల్లు ఇంటికి తిరిగినట్లే తిరుగుతారు. ఒక్క సారి చిట్టీ కట్టిన తర్వాత ఆ తిరగడం మనకు నేర్పిస్తారు. కాళ్లు అరిగేలా తిరిగినా కనికరం చూపరు. జనం సొమ్ముతో జనాన్నే బెదిరిస్తుంటారు. చుక్కలు చూపిస్తుంటారు. నెల కిస్తీ కట్టడం ఒక్క రోజు ఆలస్యమైనా సరే, పెనాల్టీలు వేస్తారు. చిట్టీ గడువు పూర్తయి, నెలలు గడిచినా సరే సొమ్ము తిరిగి ఇవ్వరు. ఆఖరుకు కంపనీ దివాళా పేరుతో బోర్డు తిప్పేస్తారు. ఇలా ఒక్క వరంగల్‌ జిల్లాలోనే వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్లు తెలుస్తోంది. వెలిసిన కంపనీలకు, మూత పడిన కంపనీలకు లెక్కేలేదు. కొత్తవి పుట్టుకొస్తూనే వుంటాయి. పాతవి మూత పడుతూనే వుంటాయి. కాని వ్యక్తులు వాళ్లే వుంటారు. జనం సొమ్మును దశాబ్ధాల తరబడి దోచుకుంటూనే వున్నారు. త్వరలో వరంగల్‌ జిల్లాలో ఇప్పటి వరకు జనానికి కుచ్చుటోపీ పెట్టిన చిట్‌ కంపనీల దుర్మార్గాలన్నీ ఒక్కొక్కటిగా వరుసగా మీ నేటిదాత్రిలో…త్వరలో..

 

వరంగల్‌లో చిట్స్‌ రిజిస్ట్రార్‌ ఎక్కడ?

ఏడాది గడుస్తున్నా ఎందుకు ఖాళీగా వుంది?

`సబ్‌ రిజిస్ట్రార్లు ఎందుకు ముందుకు రావడం లేదు?

`వరంగల్‌ అంటే ఎందుకు సుముఖంగా లేరు?

`వరంగల్‌ చిట్స్‌ రిజిస్ట్రార్‌గా పని చేయాలంటే ఎందుకు భయపడుతున్నారు?

`వచ్చేందుకు సిద్దంగా వున్న వారిని ఎందుకు ఉపేక్షిస్తున్నారు?

`రెవిన్యూ వ్యవస్ధలో ఏం జరుగుతోంది?

వరంగల్‌లో చిట్స్‌ రిజిస్ట్రార్‌ లేక ఏడాది గడుస్తోంది. అయినా ఆ కుర్చీ ఖాళీగానే వుంది. కనీసం ఇన్‌ చార్జి కూడా ఎవరూ లేరు. చిట్స్‌ రిజిస్ట్రార్‌గా పనిచేయడానికి సబ్‌ రిజిస్ట్రార్లు ఎందుకు ముందుకు రావడం లేదు? వరంగల్‌ చిట్స్‌ రిజిస్ట్రార్‌గా పని చేయడానికి సబ్‌ రిజిస్ట్రార్లు ఎందుకు భయపడుతున్నారు. అనుకున్నంత సంపాదన రాదని వద్దనుకుంటున్నారా? చిట్స్‌ రిజిస్ట్రార్‌గా పనిచేస్తే ఎలాంటి ఫలితం వుండదనుకుంటున్నారా? లేక ప్రజా ప్రతినిధులకు భయపడి రానంటున్నారా? వరంగల్‌ చిట్స్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏం జరుగుతోంది. ఆ మధ్య ఓ వరంగల్‌ చిట్స్‌ రిజిస్ట్రార్‌గా ఓ అధికారిని వచ్చారు. నేను ఇక్కడ పని చేయాలని వెళ్లిపోయారు. కారణాలు ఏమైనా కావొచ్చు? అధికారులు తమకు నచ్చిన చోటనే పనిచేస్తారా? వారికి అనుకూలమైన పోస్టింగ్‌ వుంటే తప్ప పనిచేయరా? కేవలం రిజిస్ట్రేషన్‌ శాఖలో మాత్రమే పనిచేస్తారా? లంచాలకు అలవాటు పడిన వారు చిట్స్‌ రిజిస్ట్రార్లుగా పనిచేయడానికి ఇష్టపడడం లేదా? వచ్చిన వారిని ప్రజా ప్రతినిధులు పని చేయనీయడం లేదా? వరంగల్‌ అంటేనే అధికారులు ఎందుకు భయపడుతున్నారు? జీతం తప్ప అదనంగా దమ్మిడి రాకున్నా, సమస్యలు ఎదురౌతానకుంటున్నారా? ప్రజా ప్రతినిధుల ఒత్తిళ్లతో పనిచేసి, ఉద్యోగానికే ఎసరు తెచ్చుకోవాల్సి వస్తుందని భయపడుతున్నారా? అయితే ఇలాంటి చోట కూడా పనిచేసేందుకు కొందరు అదికారులు సిద్దంగా వున్నారు. కాని వారికి మాత్రం పోస్టింగ్‌ ఇవ్వడం లేదు. ఎందుకంటే వచ్చే అధికారులు తమ చెప్పు చేతుల్లో వుండాలని ప్రజా ప్రతినిధులు కోరుకుంటున్నారు. అవినీతికి అలవాటు పడిని అధికారులు చిట్స్‌ రిజిస్ట్రార్‌గా పనిచేయడానికి ఇష్టపడడం లేదు. ఒక వేళ పనిచేద్దామని వచ్చే వారిని ప్రజా ప్రతినిధులు రానివ్వడం లేదు? కారణమేమిటంటే తమ మాట వినని అదికారులు వస్తే ఆ ప్రజా ప్రతినిధుల మాట చెల్లుబాటు కాదు. వారి ఆదేశాలు ఆచరణలోకి రావు. దాంతో ఏడాది కాలంగా చిట్స్‌ రిజిస్ట్రార్‌ లేకుండానే కార్యాలయం పనిచేస్తోంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. వరంగల్‌ అంటేనే చిట్‌ ఫండ్‌ కార్యాలయాల గోల్‌ మాల్‌కు అడ్డా? ఏ చిట్‌ ఫండ్‌ చూసినా అదే తీరు. అదే వ్యవహారం. అలా ప్రజలను నిండా ముంచిన కంపనీలే ఎక్కువ. ప్రజలను వీదిన పడేసిన కార్యాలయాలే వున్నాయి. వేల కోట్లు రూపాయల కుంభాకోణాలకు నిలయంగా మారాయి. అలాంటి వరంగల్‌లో బాధితుల గోడు వినేందుకు, చిట్స్‌ కంపనీ ఆగడాల నుంచి రక్షించేందుకు చిట్స్‌ రిజిస్ట్రార్‌ వుండాలి. ప్రజల గోడు ఎవరు వినాలి? ప్రజల సమస్యలు ఎవరు పట్టించుకోవాలి? బాధితులకు న్యాయం ఎవరు చేయాలి? నిజాయితీగా పనిచేసే అధికారులు వున్నారు. కాని వారికి అవకాశం ఇవ్వడం లేదు. ప్రజా ప్రతినిధులంటే జిల్లా రిజిస్ట్రార్లే భయపడుతున్నారు. ప్రజా ప్రతినిధులు ఎలాగూ ప్రజలకు సహకరించరు. పైకి ఎన్ని మాటలు చెప్పినా సరే, వాళ్లంతా చిట్స్‌ కంపనీలకే వత్తాసు పలుకుతారన్నది భహిరంగ రహస్యమే. అందుకే వరంగల్‌కు ఎవరినీ రానివ్వడం లేదు. బాధితుల సమస్యలు తీరడం లేదు. రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి వెంటనే స్పందించి, వరంగల్‌ చిట్స్‌ రిజిస్ట్రార్‌ పోస్టు భర్తీ చేయాలని కోరుతున్నారు. చిట్‌ రిజిస్ట్రార్‌గా పని చేయమని చెప్పేవారిని వదిలేయండి. కాని వస్తామని అంటున్నవారిని ఎందుకు రానివ్వడం లేదో చెప్పండి? ఏది ఏమైనా వెంటనే ఆ పోస్టును భర్తీ చేయండి.

రిజర్వేషన్‌ బిచ్చం కాదు..హక్కు..!

`బీసీలంతా ఏకమైతేనే బలపడతారు!

`బీసీలు బలపడితేనే బరిగీసి నిలవగలరు!

bc reservation

`బీసీలు బరి గీసినప్పుడే ముందుకు రాగలరు

`బీసీలు ముందు కొచ్చినప్పుడే ఓసిలను వెనక్కు నెట్టగలరు

`ఓసిలను వెనక్కి నెట్టితేనే రాజ్యాధికారం సాధించగలరు.

`బీసీలు డెబ్బై ఏళ్లు వెనకే వున్నారు.

`బీసీలు ఇప్పటికైనా మేలుకోండి.

`జనరల్‌ అంటే ఓసిలు కాదు!

`అన్ని వర్గాల ప్రజలు..

`పోటీ చేసేందుకు అర్షులు.

`ఈ సత్యం దాచి మోసం చేస్తూ వస్తున్నారు.

`బలమైన బీసీ సమాజం సీట్లు అడుక్కోవడమా!

`బలం లేని ఓసిలు సీట్లు పంచుకోవడమా!

`బీసీల నెత్తిమీద కూర్చొని ఓసిలు పెత్తనం చేయడమా!

`బీసీలకు ఏం కావాలన్నా ఓసిలను అడుక్కోవాలా!

`ఓసిలంతా కలిసి సీట్లు పంచుకుంటారా?

`ఆ ఓసిలకు ఓట్లు వేసి, బీసీలు గెలిపించుకోవడమా?

`రాజ్యమేలమని ఓసిలకు పగ్గాలిచ్చి, బీసీలు పాలేర్లు కావడమా!

హైదరాబాద్‌, నేటిధాత్రి:

బిసిలంతా ఏకమైతేనే బలపడాతారన్న సత్యాన్ని ఇప్పటికైనా గ్రహించాలి. బిసిల్లారా..ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటికైనా బిసిలంతా మేలుకోవాల్సిన తరుణం వచ్చేసింది. బేషజాలు పక్కన పెట్టి బిసిలంతా ఏకమైతే తప్ప రాజ్యాదికారం సాధ్యమయ్యేది కాదు. తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని విధంగా బిసిల అంశం తెరమీదకు వచ్చిది. గత రెండు సంవత్సరాలుగా నానుతోంది. బిసి సంఘాలు అనేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాయి. రాజకీయ పార్టీలన్నీ బిసి జపం చేస్తున్నాయి. అయినా బిసిలు కదలకపోతే చేసేదేమీ వుండదు. ఇంకా వెయ్యేల్లయినా బిసిలకు రాజ్యాధికారం దక్కడు. స్వాతంత్య్రానికి పూర్వం రాజరిక వ్యవస్ధ వున్నప్పుడే సర్వాయి పాపన్న లాంటి రాజు ఉద్భవించాడు. తన సొంతంగా రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని పాలించాడు. ఇతర రాజులను ముప్పు తిప్పలు పెట్టాడు. ఆ మాత్రం పౌరుషం ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎందుకు కరువౌతోంది. రాజ్యాంగం జనరల్‌ కేటరిగి పేరుతో బిసిలకు కూడా అవకాశం కల్పించింది. అయినా బిసిలు ముందుకు రావడం లేదు. ప్రజా ప్రతినిధులయ్యేందుకు ధైర్యం చేయడం లేదు. డెబ్బై స్వతంత్య్రంలో ఒక్క బిసి నాయకుడు కూడా ముఖ్యమంత్రి కాలేదు. బిసిలే ఎక్కువగా వున్న క్యాబినేట్‌ఏర్పాటు కాలేదు. నిజాం నుంచి విముక్తి జరిగిన తెలంగాణలో బిసి సిఎం. కాలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఏనాడు అవకాశం దక్కలేదు. ఇప్పుడూ దక్కలేదు. కొట్లాడితే తప్ప బిసిలకు రాజ్యాధికారం రాదు. అధికారం వశం చేసుకుంటే తప్ప పాలకులు కాలేరు. అందుకే రాజకీయ హక్కుల సాదన దిశగా ప్రతి బిసి అడుగులేయాలి. నేనేందుకు నాయకుడిని కావొద్దని ప్రశ్న వేసుకోవాలి. మాకు అదికారం ఎందుకు రాదని ముందుకు రావాలి. అంతే తప్ప బిసిల రిజర్వేషన్‌ ఎవరో వేసే బిక్షలాగా ఎదురుచూడొద్దు. రిజర్వేషన్‌ అనేది బిసిల హక్కు. జనాభాలోనే 85శాతం వున్న బిసిలకు కనీసం 42శాతం రిజర్వేషన్‌ ఇవ్వకపోతే పోరాటం చేసైనా సాధించుకోవాలి. అందుకు రాజ్యాధికార సాదన దిశగా కదలాల్సిన అవసరం వుంది. బిసిలలో వున్న ప్రధానమైన లోపాన్ని అధిగమించాలి. బిసిలలో వున్న కులాల మధ్య ఆధిపత్యం తగ్గాలి. బిసిలంటే బిసిలే..అంతే కాని మేం ఎక్కువ. మీరు తక్కువ అనే భావన పోవాలి. అన్నా, తమ్ముడు, మామ, అక్క అని పిలుచుకుంటే సరిపోదు. ఇటీవల బిసిలంటే నాలుగు కులాలేనా? అనే ప్రశ్న మొదలైంది. ఇలాంటి చీలికను తీసుకొచ్చి బిసిలను విచ్చిన్నంచేయాలిన చూస్తుంటారు. వారి ఉచ్చులో పడొద్దు. పైకి కపట నాటకమాడే రాజకీయ పార్టీలు ఉచ్చును ఎప్పుడూ సిద్దం చేసి వుంచుకుంటారు. బిసిల వేలుతోనే, బిసిల కన్ను పొడుస్తారు. ఇది గమనించుకొని ముందుకు సాగాలి. బలమైన అడుగులు వేయాలి. అందువల్ల బిసిల రాజ్యాధికారం కోసం ఏకమైతే తప్ప రాజకీయ పార్టీలు ఏం చేయలేవు. ఓసిలకు ఇప్పటిదాకా చేసిన ఊడిగం చాలు. బిసిలంటే పిల్లులు కాదు. పులి పిల్లలని నిరూపించాలి. కట్టె పుల్లలం కాదు, కట్టెల మోపులమని రుచి చూపించాలి. ఎందుకంటే బిసిలంతా చీపురు పుల్లల్లా వున్నంత కాలం ఏమీ చేయలేరు. అందరూ కలిసి కట్టెల మోపులా మారి, బిసిల ఐక్యత చాటాల్సిన అవసరం వుంది. బిసిలలో వున్న సామాజిక చైతన్యం రాజకీయం కావాలి. ప్రజా ప్రతినిధులై సామాజిక న్యాయం సాదించాలి. క్షేత్రస్దాయి నుంచి రాష్ట్ర స్దాయి వరకు బిసిలే నాయకులు కావాలి. రాజకీయ పార్టీల వైఖరిలో మార్పులు రావాలి. బిసిలు లేకుంటే పార్టీ మనగడ అసాద్యమని తేలుసుకోవాలి. బిసిలకు దామాషా ప్రకారం సీట్ల కేటాయింపులు జరగాలి. పార్టీల కన్నా, బిసిల ఐక్యత ముఖ్యం. రాజ్యాధికారం సాదించే వరకు కలిసి సాగుదామని శపథం చేయండి మేధావుల ఆలోచనలు అమలు చేయండి. చెప్పుడు మాటలు వింటూ మళ్లీ మోసం పోకుండా జాగ్రత్తపడండి. బలమైన బిసి నాయకులను తయారు చేయండి. అన్ని కులల నుంచి ప్రాతినిధ్యం కలిగేలా కలిసి కట్టు ప్రయాణం సాగించండి బిసిల రాజ్యాధికారం సాదిద్దాం.బిసిల్లారా..ఏకం కండి! ఇప్పుడు కాకపోతే ఎప్పుడూ కాదు. రాజకీయ పార్టీలో ఒక భయం వచ్చేసింది. బిసిలను కాదనుకుంటే పార్టీలే వుండవన్న భయం పట్టుకున్నది. బిసిల పట్టు బిగుస్తోంది. బిసిల గొంతు బలపడుతోంది. బిసిలలో వున్న సామాజిక చైతన్యం రాజకీయం కావాలి. అప్పుడే రాజకీయ పార్టీల గుండెల్లో గుబులు పుడుతుంది. బిసిలు ప్రజా ప్రతినిధులై సామాజిక న్యాయం సాదించాలి. అందుకు క్షేత్రస్దాయి నుంచి రాష్ట్ర స్దాయి వరకు బిసిలే నాయకులు కావాలి. రానున్న స్ధానిక సంస్దల ఎన్నికల్లో అన్ని జనరల్‌ స్ధానాలలో బిసిలు పోటీ చేయాలి. ఇప్పటి వరకు జనరల్‌ స్ధానమంటే ఓసిలకు రిజర్వేషన్‌ అనే అపోహ వుంది. అగ్రకులాలు అలా ప్రచారం చేసుకున్నాయి. బిసిలను రాజకీయానికి దూరం చేశాయి. జనరల్‌ స్దానాల్లో ఓసిలు పాగా వేసి, బిసిలకు స్ధానం లేకుండా చేశారు. ఓసిలు నాయకులౌతూ బిసిలను కార్యకర్తలుగా మార్చుకొని అందలమెక్కారు. ఇంత కాలానికి తెలంగాణ ఉద్యమం లాంటి చైతన్యం వచ్చింది. అది ఉప్పెనలా మారాలి. చట్టపరంగా రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అసరం లేదు. రాజకీయంగా కూడా సీట్లు కేటాయించొచ్చు. అందుకు ఏ చట్టం అడ్డుపడదు. జనరల్‌ స్దానాలన్నీ బిసిలకు ఇవ్వొచ్చు. కనీసం దామాషా ప్రకారం పంపకాలు చేయొచ్చు. రాజ్యాంగ పరంగా ఎన్నికల సంఘం రిజర్వేషన్లు ప్రకటించినా, జనరల్‌ స్దానాలలో బిసిలకు టిక్కెట్లు ఇవ్వొచ్చు. ఆ వెసులుబాటు వుంది. అయినా రాజకీయ పార్టీలు నాటకాలాడొచ్చు. ఈ ఐదేళ్లలో తెలంగాణ వ్యాప్తంగా స్దానిక సంస్దల ఎన్నికల్లో బిసిలు ప్రజా ప్రతినిదులైదే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బిసిలను ఎవరూ ఆపలేరు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బిసి ముఖ్యమంత్రి కావాలి. అంటే ఇప్పటి నుంచే అడుగులు పడాలి. బిసిల ఐక్యతలో మరింత చైతన్యం రావాలి. రాగద్వేషాలు వీడాలి. అంతే కాకుండా రాజకీయ పార్టీల వైఖరిలో మార్పులు రావాలి. బిసిలు లేకుంటే పార్టీ మనగడ అసాద్యమని తేలుసుకోవాలి. అంతగా బలమైన ఒత్తిడి బిసి సంఘాల నుంచి, బిసి నాయకుల నుంచి రావాలి. అవసరమైతే బిసిల నాయకులు ఆయా పార్టీల నుంచి బైటకు రావాలి. రాజకీయ పార్టీలలో వున్న బిసి నాయకులంతా బైటకువస్తే రాజకీయ పార్టీలలో వనుకు పుట్టాలి. ఇప్పుడు స్దానిక సంస్దల ఎన్నికల్లోనే కాదు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బిసిలకు దామాషా ప్రకారం సీట్ల కేటాయింపులు జరగాలి. బిసిలుముందుగా చేయాల్సిన పని పార్టీల కన్నా, బిసిల ఐక్యత ముఖ్యమనే ఆలోచన చేయాలి. అందుకు కట్టుబడి వుండాలి. తన సీటు తనకు వస్తే చాలు అనుకునే స్వార్ధపరులను బిసి సంఘాలు కూడా వెలివేయాలి. బిసిలు వారిని తిరస్కరించాలి. అప్పుడు గాని బిసిలలో మరింత ఐక్యత సాద్యం కాదు. బిసిల వేలుతోనే బిసిల కన్ను పొడుస్తారు. అందుకు జాగ్రత్తగా వుండాలి. అవకాశవాద బిసి నాయకులను దూరం పెట్టాలి. ఆయా పార్టీలపై ఒత్తిడి తెచ్చే నాయకులను మాత్రమే తెలంగాణ సమాజం నమ్మాలి. వారిని స్వాగతించాలి. వారిచేత తెలంగాణలో బిసిల రాజ్యాధికారం సాదించే వరకు కలిసి సాగుదామని శపథం చేయించాలి. ప్రజలు, ప్రజా సంఘాలు, బిసిలంతా ప్రమాణం చేయాలి. అంతే కాకుండా మేధావుల ఆలోచనలు అమలు చేసుకుంటూ ముందుకు సాగాలి. రాజకీయాలలో వెన్నుపోట్లు ఎక్కువ. తప్పుడు మాటలు, చెప్పుడు మాటలు వినేవారు చాల మంది వుంటారు. అలాంటి వారి మాటలు వింటూ మళ్లీ మోసం పోకుండా జాగ్రత్తపడాలి..బలమైన బిసి నాయకులను తయారు చేసుకోవాలి. అన్ని కులల నుంచి ప్రాతినిధ్యం కలిగేలా కలిసి కట్టు ప్రయాణం సాగించాలి. బిసిల రాజ్యాధికారం సాదించాలి. బిసిలంతా కలిసి బరిగీసి నిలబడాలి.అప్పుడే ముందుకు రాగలరు. బిసిలంగా ముందుకు వస్తేతప్ప ఓసిలు వెనుకడుగు వేయరు. వారిని వెనక్కి నెట్టే పరిస్ధితి రాదు. డెబ్బై ఏళ్లు బిసిలు వెనకే వున్నారు. ఓసిలకు రాజకీయ ఊడిగం చేశారు. ఇప్పటికైనాసరే బిసిలు ముందుకు రావాలి. ముందడుగు వేయాలి. జనరల్‌ అంటే ఓసిలు కాదు. జనరల్‌ అంటే అందరూ..ఈ విషయం తెలిసినా, బిసిలు ముందుకు రాలేదు. అణగారిన వర్గాలు అని చెప్పడం తప్ప వారిని పైకి తీసుకొచ్చే ఆలోచనలు ఇప్పటి వరకు ఏ రాజకీయపార్టీ పూర్తి స్ధాయిలో చేయలేదు. ఎంత సేపు మోచేతికి బెల్లం పెట్టి నాకించడం తప్ప ఏమీ చేయలేదు. పేరు వేల కోట్లు, వందల కోట్లు అంటూ సబ్‌ ప్లాన్‌లు పెట్టినా ఎవరికి మేలు జరిగిందో చెప్పింది లేదు. ఇటు నిధులు కేటాయించడం..అటు మళ్లించడం..సబ్‌ ప్లాన్‌లపేరుతో రాజకీయాలకు బిసిలను దూరం చేయడం బాగా అలవాటు చేసుకున్నారు. ఇప్పటికైనా బిసిలు అసలు రహస్యం తెలుసుకోవాలి. కావాల్సింది సబ్‌ ప్లాన్‌లు కాదు. రాజకీయాలు. పదవులు. అదికారం. అప్పుడు తప్ప బిసిలకున్యాయం జరగదు. సామాజిక న్యాయానికి అర్దం వుండదు

తెలంగాణ పాటకు ప్రపంచం దాసోహం!

`తెలంగాణ యాసకు పాటలమ్మ పరవశం.

`తెలంగాణ కావ్యాలకు సంగీతమే సాగరం!

`తెలంగాణ మట్టి పరిమళాలతో రాగమాడుతున్న తాండవం.

`తెలంగాణ ఉద్యమంతో పల్లె పాటకు పెరిగిన ఆదరణ.

`ఆది నుంచి తెలంగాణ పాటలో వున్న మట్టి వాసన.

`తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ పాటకు పట్టాభిషేకం.

`ప్రపంచం నలుమూలలా పాకుతున్న పాటల విన్యాసం.

`మిస్‌ వరల్డ్‌ నోటి నుంచి జాలు వారిన ముత్యాల వాన.

`రాను బొంబయ్‌కి రాను అంటూ ఊగిపోతున్న ప్రపంచం.

`అర్థం తెలియకపోయినా అల్లుకుపోతున్న పాట.

`వందల మిలియన్లతో అగ్రగామిగా నిలుస్తున్న మన తెలంగాణ పాట.

`ఒకప్పుడు తెలంగాణ పాటకు అవమానం.

`ఇప్పుడు తెలంగాణ పాటకు వైభోగం.

`తెలంగాణ పాట రాష్ట్రానికే సౌభాగ్యం.

`మనసు పరవశానికి పట్టాభిషేకం.

`ఆనందాన్ని పంచుతున్న ఆరోగ్యం.

`వెలుగులోకి వస్తున్న సంగీత సరస్వతులకు జేజేలు కొడుతున్న ప్రపంచం.

`ఎన్ని సార్లు విన్నా తరగనంత సంతోషాన్ని నింపుతున్న మధురగానం.

`అది తెలంగాణ యాసలో వున్న మధురామృతం.

`ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ విన్నా సినిమా పాటలు.

`ఇప్పుడు ప్రపంచమంతా మారు మ్రోగిపోతున్న తెలంగాణ పాటలు.

`తెలంగాణ యాస కమ్మదనం తొక్కుతున్న పాటల పరవళ్లు.

`తెలంగాణ కవిగాయకులు అంటే పాటల ప్రపంచాన్ని ఏలుతున్న రారాజులు.

హైదరాబాద్‌, నేటిధాత్రి:                        తెలంగాణపాట అనగానే మది పులకిస్తుంది. మనసు పరవశిస్తుంది. తెలంగాణ పాట అంటేనే రక్తం ఉరకలేస్తుంది. ఊపును నింపుతుంది. ప్రశ్నను రేకెత్తిస్తుంది. వ్యవస్ధను నిలదీస్తుంది. సమాజాన్ని దారిలో పెడుతుంది. ఆలోచనను సృష్టిస్తుంది. నిజాన్ని వెలికి తీస్తుంది. నిప్పులా కాలుతుంది. సూటిగా బాణంగా గుచ్చుకుంటుంది. తూటాలా పేలుతుంది. మస్కిష్కంలోకి దూసుకుపోతోంది. ఆలోచింపచేస్తుంది. చైతన్యం నింపుతుంది. ఉద్యమానికి ఊపిరిలూదుతుంది. పోరాటానికి దారి చూపిస్తుంది. ప్రకృతిని ఆరాదిస్తుంది. ప్రకృతి గొప్పదనం చెప్పుతుంది. గాలి, నీరు, నిప్పు, నింగి,నేలను కలుపుకొని సాగుతుంది. ఉప్పెనలా దూసుకొస్తుంది. సునామీ సృష్టిస్తుంది. గడ్డిపరకలు గడ్డపారలౌతాయి. ఎండిన ఆకులు కూడా అలజడులు సృష్టిస్తాయి. వాగులు పరుగులందుకుంటాయి. వంకలు దుంకుతుంటాయి. కొండ, కోనలు కూడా ప్రతిధ్వనిస్తుంటాయి. ఇదీ తెలంగాణ పాటంటే…ఇదే తెలంగాణ గానమంటే..ఆ గానంలో ఆత్రం వుంటుంది. ఆకలి వుంటుంది. తిరుగుబాటు వుంటుంది. కమ్మదనం వుంటుంది. అందుకే తెలంగాణ పాటకు దాసోహం అనని వారుండదు. రాతిబొమ్మల్లోన కొలువైన శివుడా అంటే శివుడు కూడా కన్నీరు కార్చాల్సిందే. ఆ కన్నీటితో శివలింగం కూడా తడిసి ముద్ద కావాల్సిందే. ఆ కన్నీటితోనే అభిషేకం జరిపిన పాట తెలంగాణ పాట. అవును ఇది అతిశయోక్తి కాదు. ఆర్తి. తెలంగాణస్పూర్తి. తెలంగాణ పదానికి దేవుళ్లే కదిలిన దార్తి…తెలంగాణ ఉద్యమ కాలంలో మిట్టపల్లి సురేందర్‌ రాసిన రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా అంటూ పాట రాస్తే, ఆ రాగానికి తెలంగాణ మొత్తం కన్నీటిపర్యంతమైంది. తెలంగాణ కోసం ప్రాణాలు తీసుకుంటున్న పిల్లల తల్లిదండ్రుల కడుపుకోత కండ్ల ముందు కదలాడిరది. ఏకంగా శివుణ్ణే ప్రశ్నిస్తుంటే తెలంగాణ సమాజమంతా నివ్వెరపోయింది. తెలంగాణ ఇస్తారా? లేదా? అని డిల్లీని నిలదీసింది. కొట్లాడి సాదించుకుందామనే ధైర్యాన్ని ఆ పాట తెలంగాణ యువతలో నింపింది. అదీ తెలంగాణ పాట గొప్పదనం. తెలంగాణ పాట ఇప్పుడు పుట్టింది కాదు. ఇక్కడితో ఆగేది కాదు. తెలంగాణలో బతుకమ్మ పుట్టినప్పుడే పాట పుట్టింది. తర్వాత నిజాంకు వ్యతిరేకంగా తెలంగాణ పాట గళమెత్తింది. తెలంగాణ ఉద్యమం కోసం రెండు దఫాలుగా యాభై ఏళ్లపాటు ప్రతిసారి పాటల రెక్కలు కత్తిరించినా, కొత్త రెక్కలు తొడుక్కొని ఊరకలెత్తింది. ఈ భూమి మనదిరా.. వాడ మనది రా..అంటే చైతన్యం నింపింది. ఎంతో మంది కవి గాయకులు తెలంగాణను పాటల సీమగా మలిచారు. ఇప్పుడు స్వర్గసీమను ఏలుతున్నారు. ప్రజల నాలుకలమీద జీవిస్తూనే వున్నారు. అలా ఎంతో మంది కవులు,గాయకులు తెలంగాణ గడ్డ మీద పుట్టారు. అయితే తెలంగాణ పాటను తమ స్వార్ధం కోసం వాడుకున్న ఆంద్రులున్నారు. వారి రాజకీయం కోసం అణిచి వేసిన వాళ్లున్నారు. సినిమా వాళ్లు తెలంగాణ పాటతో కోటీశ్వరులయ్యారు. కాని తెలంగాణ కవులకు చిల్లిగవ్వలు ఇవ్వకుండా మోసం చేశారు. తెలంగాణ పాటను రాజకీయ నాయకులు అణిచివేశారు. అయినా ఆకలిని కూడా ఎదరించి నిలబడిరది తెలంగాణ పాట. ఆకలికి అమ్ముడుపోనిది తెలంగాణ పాట. ఎవరో వేసే మెతుకుల కోసం ఆరాటపడనిదే తెలంగాణ పాట. తనను తాను సృష్టించుకొని పల్లకిలో ఊరేగిందే తెలంగాణ పాట. ఆ పాటల పరంపరంలో ఉద్యమానికి ఊపిరులూదిన పాటలు అనేకం వున్నాయి. పొడుస్తున్న పొద్దు మీద అంటూ గద్దర్‌ పాడిన పాటలు, జయయజహే తెలంగాణ అంటూ అందెశ్రీ రాసి పాడిన పాటలున్నాయి. నేలమ్మ నేలమ్మా అంటూ జయరాజ్‌ రాసిన పాటలున్నాయి. అయ్యోనివా నువ్వు అవ్వోనివా అంటూ తెలంగాణను మేలుకొలిపిన పాటలున్నాయి. నాగేటి సాళ్లల్ల నా తెలంగాణ అని వినిపించిన గానాలున్నాయి. ఇదవన్నీ తెలంగాణకు ముందు…కాని ఇప్పుడు తెలంగాణ తర్వాత కూడా తెలంగాణ పాట తన ప్రస్ధానం ఆపుకోలేదు. ఆగిపోలేదు. మరింత దూకుడు పెంచింది. అందుకే తెలంగాణ పాట గురించి చెప్పాలంటే తెలంగాణ రాకకు ముందు, తెలంగాణ తర్వాత అని చెప్పాలి. అప్పటి పాటలు ఆణిముత్యాలు. ఇప్పటి పాటలు ప్రపంచాన్ని ఏలుతున్న వజ్రాలు. ఎందుకంటే తెలంగాణ అంటేనే పాటల పూదోట. అది ఎరుపెక్కినా పాట ద్వనిస్తుంది. పచ్చగా మారినా పరవశించి పాడుతుంది. ఉద్యమాల బాటకు దారులు వేసిన పాట. పోరాటాలను కడుపులో నింపుకొని దూకిన పాట. తెలంగాణ పాట అంటేనే పోరాటాల చరిత్ర. అణివేతను నిలదీసిన తిరుగుబాటు. అస్ధిత్వ ఆరాటాన్ని, ఆత్మ గౌరవ నినాదాన్ని నింపుకొని సాగుతుంది. పాట హృద్యంగా వుండాలన్నా, రక్తం మరగాలన్నా తెలంగాణ పాటేకావాలి. ఇది తెలంగాణ పాట గొప్పదనం. నిండు గుణం. ఒకప్పుడు తెలంగాన పాటంటే పౌరుషం..పోరాటం మాత్రమే అనుకునే వారు. కాని దాని వెనుకున్న ఆకలి ఆరాటాలు పట్టించుకునేవారు కాదు. తెలంగాణ పాటలో తిరుగుబాటు బావుటానే చూసేవారు. కాని అది గుండెల్లో మండుతున్న అగ్నికి ప్రతిరూపం అని పాలకులు భావించకపోయేవారు. సముద్రంలో ఎగసిపడుతున్న అలలు అని తెలుసుకోలేకపోయారు. వాటిని అణిచి వేశారు. పాటను కాలరాయాలనుకున్నారు. ఆనాడే తెలంగాణ పాటకు స్వేచ్చనిస్తే ప్రపంచాన్నే శాసించేది. ప్రపంచానికే చైతన్యాన్ని నింపేది. తెలంగాణలో అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ ఆ పాటలు సజీవమే..కాని తెలంగాణలో ఇప్పుడు కొత్త తరంపాటలొస్తున్నాయి. రసరంజనిలో ఓలలాడిస్తున్నాయి. ప్రతి తెలంగాణ గుండెలో ఆనందాన్ని నింపుతున్నాయి. మనసును పరవశింపజేస్తున్నాయి. ముసలీ ముతక కూడా కాలు కదిపేలా చేస్తున్నాయి. పసి పిల్లలు తొట్టెలో కూడా కూడా ఊగిపోయేలా చేస్తున్నాయి. తెలంగాణలో కన్నీటి పాటల నుంచి పన్నీటి పాటలు ఉధ్భవిస్తున్నాయి. పాటల జడివానలో ప్రపంచాన్ని తడిపి ముద్ద చేస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ పాటకు ప్రపంచం దాసోహమంటోంది. తెలంగాణ యాస ప్రపంచపు అంచులను తాకుతుంటే పాటలమ్మ పరవశించిపోతోంది. తెలంగాణ కావ్వాలకు సంగీత సాగరమే నాట్యం చేస్తోంది. తెలంగాణ మట్టి పరమిళలాతో రాగమే తాండవమాడుతోంది. ఇది ముమ్మాటికీ నిజం. ఎందుకంటే తెలంగాణకు చెందిన ఓ కుర్ర కళాకారుడు రాము రాథోడ్‌ గాయకుడై, కవిjైు, నర్తించి నిర్మించిన రాను..నే..రాను బొంబైకి రాను అనే పాట సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. ప్రపంచంలో మైకెల్‌ జాక్సన్‌ పాట కూడా 500 మిలియన్లు దాటిన సందర్భం లేదు. దేశంలోని ఏ గాయకుడు పాడిన పాట కూడా అంత దూరం వెళ్లలేదు. ఎంత పెద్ద పాటైనా సరే పది కోట్లు దాటడడమే ఒకప్పుడు రికార్డు. కాని ప్రపంచంలోని తెలుగు వాళ్లే కాదు, బాష తెలియని వాళ్లు కూడా ఆ బాణీలకు, మాటలకు ఫిదా అయిపోయారు. 50 కోట్ల మంది వీక్షించారు. తన్మయత్వానికి లోనయ్యారు. అంటే మాటలు కాదు. మామూలు విషయం అసలే కాదు. తెలంగాణ యాసలో ఈ మధ్య వస్తున్న అనేక పాటలు కూడా అదే దారిలో పరుగులు తీస్తున్నాయి. ఓ పిలగ వెంకటేష అంటూ సాగుతున్న పాట, దారి పొంట వత్తుండు..దవ్వ దవ్వ వత్తుండు..దారిదుద్దునా, పోనిద్దునా? అంటూ సాగే పాట కూడా ప్రపంచాన్ని జయించాలని పరుగులు పెడుతోంది. ఇలా రోజు రోజుకూ కొత్త కొత్త పాటలు వస్తున్నాయి. వేటికవే ప్రత్యేకతను సంతరించుకుంటున్నాయి. తెలంగాణ యాసను దిగంతాలకు చేర్చుతున్నాయి. ఒకప్పుడు తెలంగాణ యాసను చీదరించుకున్న వాళ్లు, ఈసడిరచుకున్న వాళ్లు సైతం ఆ మాధుర్యానికి గులాములౌతున్నారు. తామెందుకు చేయలేమని ఆంద్రాకు చెందిన వాళ్లు కూడా తెలంగాణ యాసలో పాటలు రాస్తున్నారు. ఒకప్పుడు తెలంగాణ బాషను అదేం బాష.. అనేవారు. తెలంగాణ నుడి కారాలను వెక్కిరించేవారు. తెలంగాణ నుంచి వచ్చే సాహిత్యాన్ని చిన్న చూపు చూసేవారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పాటకు ఆదరణ పెరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ పాటకు పట్టాభిషేకం జరుగుతోంది. మిస్‌ వరల్డ్‌ నోటి నుంచి జాలువారిని ముత్యాల వాన రాను..నే రాను బొంబైకి రాను..! అర్ధం తెలియకపోయినా తెలంగాణ పాట అల్లుకుపోతోంది. అందరి నాలుకల మీద నాట్యం చేస్తోంది. తెలంగాణ పాట ఇప్పుడు వైబోగం చవి చూస్తోంది. తెలంగాణ రాష్ట్ర సౌభాగ్యాన్ని గుర్తు చేస్తోంది. ప్రతి మనిషిలో వున్న పరవశానికే పదనిసలు నేర్పుతోంది. ప్రపంచమంతా పట్టాభిషేకం చేస్తుంటే తెలంగాణ యాస మధురగానంలో ఓలలాడుతోంది. పాటల పరవళ్లు తొక్కుతులంటే తెలంగాణ కళాకారులు సంగీత ప్రపంచంలో రారాజులౌతున్నారు. తమ రాజ్యాలనేలుతున్నారు. ఆల్‌ ది బెస్ట్‌. మైడియర్‌ న్యూ జనరేషన్‌.

ఆంద్రా మేతావులు..తెలంగాణ వ్యతిరేకులు!?

`ఇప్పటికీ తెలంగాణ మీద విషం కక్కుతూనే వుంటారు!

`తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ కొట్టాలనే ప్రయత్నం చేస్తారు!

`కేసీఆర్‌ అసెంబ్లీకి హజరు కాకపోవడం కూడా వాళ్లకు ఇబ్బందే!

`అవకాశం దొరికింది కదా అని విమర్శలే!

`ఎన్టీ రామారావు అసెంబ్లీకి ప్రతిపక్ష నేతగా హజరుకాలేదు.

`నన్నపనేని రాజకుమారి ఏదో ఒక మాట అన్నదని రానని వెళ్లిపోయారు.

`మళ్ళీ ముఖ్యమంత్రిగానే అడుగుపెడతా! అని రాలేదు.

`ఆంధ్రా మేధావులకు అది గుర్తు చేయరు!

`ఆనాడు ఎన్టీఆర్‌ చేసింది కూడా తప్పే అనే ధైర్యం వారికి వుండదు.

`వైఎస్‌. రాజశేఖరరెడ్డి పాదయాత్ర పేరుతో అసెంబ్లీకి హజరుకాలేదు.

`తర్వాత చంద్రబాబు బస్సు యాత్ర, పాదయాత్రల పేరుతో హజరుకాలేదు.

`ఈ విషయాన్ని ఎప్పుడూ ప్రస్తావించరు!

`వైఎస్‌. జగన్మోహన్‌ రెడ్డి పాదయాత్ర సమయంలో కూడా హజరుకాలేదు.

`ఎమ్మెల్సీగా వుండి పాదయాత్ర చేసిన లోకేష్‌ మండలికి హజరుకాలేదు.

`అప్పుడు ఏ ఒక్క ఆంద్రా మేధావి నోరుతెరవలేదు!

`తెలంగాణ మీద మాత్రం నోరుతెరుస్తారు.

`సుద్దపూసల సుద్దులన్నీ చెబుతుంటారు!

`కాళేశ్వరం కడితే ప్రజాధనం వృధా అంటారు.

`పోలవరం పూర్తి కావాలని కోరుకుంటారు.

`తెలంగాణ అభివృద్ధిని చూసి ఏడిచి చస్తుంటారు?

హైదరాబాద్‌, నేటిధాత్రి:
మేధావి మౌనం దేశానికి ప్రమాదకరమని మాజీ ప్రదాని పివి. నర్సింహారావు అన్నారు. కాని మేధావులు అంటే ఎవరు? అనేది మాత్రం ఆయన చెప్పలేదు. ఎందుకంటే ఆయన దృష్టిలో మేధావులు వేరు. అప్పటి మేదావులు వేరు. ఇప్పటి మేధావులు వేరు. అప్పటి మేధావులు సమాజం గురించి మాత్రమే ఆలోచించేవారు. రాజకీయాల జోలికి వెళ్లేవారు కాదు. కాని నేడు మేధావులు రాజకీయాల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. తమకు అనుకూలమైన రాజకీయాలను మాత్రమే ప్రస్తావిస్తున్నారు. పైగా మేధావి అంటే అన్ని రంగాల, రకాల విషయాల మీద అవగాహన వుండాలని ఏమీ లేదు. సమాజంలో అనేక రంగాలున్నాయి. ఆయా రంగాలలో వుండే మేదావులు వేరు. ఒక రంగంలో మేదావి మరో రంగం గురించి మాట్లాడే వారు కాదు. కాని ఇప్పుడు మేధావి అంటే చాలు అన్ని రంగాల గురించి మాట్లాడుతున్నారు. అంతా నాకే తెలుసు అన్నట్లు మాట్లాడేస్తున్నారు. గతంలో మేదావులు అనేక రకాల పుస్తకాలు అధ్యయనం చేసేవారు. ఆయా రంగాలపై ఇతరుల మీద ఆదారపడాల్సినంత అవసరం లేని మేధస్సును వారి కలిగి వుండేవారు. ఇప్పుడు అంతా గూగుల్‌ మేధావులు. వారికి అవసరమైన విషయాలను అప్పటిప్పుడు గూగుల్‌లో చూసి తెలుసుకొని గొప్పలకు పోతున్నారు. మేదావులుగా చెలామణి అవుతున్నారు. వారికి తెలిసింది గోరంత. కాని చెప్పేది కొండంత. అందులో అంతా డొల్ల. పైగా తమకు మించిన విశ్లేషకులు లేరన్నట్లు మాట్లాడుతూ వున్నారు. ఇటీవల కాలంలో ప్రముఖంగా టెలివిజన్‌ తెరలమీద, యూట్యూబ్‌లలో మాట్లాడే మేదావులు ఎక్కువయ్యారు. అలాంటి వారిలో మాజీ ఐపిఎస్‌ అధికారి జేడి లక్ష్మినారాయణ ఒకరు. నిజానికి ఆయన ఒక మేదావిగానే చెలామణి అయితే ఆయనను ఎవరూ వ్యతిరేకించేవారు కాదు. కాని ఆయన రాజకీయ అవతారమెత్తిన మేదావి వర్గం. ఆయన తెలంగాణ, ఆంధ్రా రాజకీయాల మీద బాగానే మాట్లాడుతున్నారు. ఇంత వరకు సంతోషమే. కాని తెలంగాణ రాజకీయాలపై మాత్రం అప్పుడప్పుడూ విషం కక్కుతూనే వుంటారు. కేసిఆర్‌ అసెంబ్లీ సమావేశాలకు హజరు కాకపోవడం ఆయన వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదు. కాని వాటిలో కూడా ఆయన దూరి మాట్లాడిప్పుడు అన్ని విషయాలను ప్రస్తావించాలి. అంతకు ముందు రోజుల్లో అసెంబ్లీకి హజరు కాని వాళ్లు ఎంత మంది వున్నారు. వాళ్ల ప్రస్తావన తీసుకురాలేదు. ఇది తప్పు. ఉమ్మడి రాష్ట్రంలో 1989లో తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోయింది. ఎన్టీఆర్‌ ప్రభుత్వం పోయింది. ఆయన ప్రతిపక్ష నాయకుడుగా వున్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఎన్టీఆర్‌ను రాజకీయంగా అప్పటి ప్రభుత్వ చీఫ్‌ విఫ్‌ నన్నపననేని రాజకుమారి ఏదో అన్నారు. దానికి ఆయన ఆత్మాభిమానం దెబ్బతిన్నది. వెంటనే మళ్లీ తాను ముఖ్యమంత్రిగానే సభలో అడుగుపెడతాను అంటూ వెళ్లిపోయారు. మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే వరకు అసెంబ్లీ ముఖం చూడలేదు. మరి ఆనాడు ఆయన చేసింది మాత్రం ఏపి మేదావులకు ఒప్పుగానే కనిపించిందా? ఆ విషయాన్ని ఏపి మేధావులు ఎందుకు ప్రశ్నించరు. తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ సాధకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్‌ అంటే అంత చులకనగా కనిపిస్తున్నారా? ప్రస్తుతం ఏపి ముఖ్యమంత్రిగా వున్న చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేశారు. ఉమ్మడిరాష్ట్రంలో ఆయన ఒకసారి బస్సుయాత్రచేశారు. రెండోసారి పాదయాత్ర చేశారు. ఆ సమయంలో ఆయన అసెంబ్లీకి హజరు కాలేదు. ఆ సమయంలో చంద్రబాబు జీతం తీసుకున్నారు. ఆ విషయం మాత్రం ఏపి మేధావులు గర్తు చేయరు. 2004కు ముందు దివంగత వైఎస్‌. రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేశారు. ఆయన కూడా అసెంబ్లీ సమావేశాలకు హజరు కాలేదు. నేరుగా ఎన్నికలకు వెళ్లారు. పాదయాత్ర తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతే అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ మేదావులకు ఆయన కనిపించలేదు. 2014 తర్వాత ఏపిలో ప్రతిపక్ష నాయకుడైన మాజీ ముఖ్యమంత్రి జగన్‌ కూడా అసెంబ్లీని బాయ్‌కాట్‌ చేశారు. పాదయాత్ర చేశారు. ముఖ్యమంత్రిగానే మళ్లీ ఏపి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఇప్పుడు కూడా ఆయన అసెంబ్లీకి హజరు కావడం లేదు. గత ఎన్నికల ముందు ఎమ్మెల్సీగా వున్న ప్రస్తుత మంత్రి లోకేష్‌ కూడా యువగళం పేరుతో పాదయాత్ర చేశారు. మండలి సమావేశాలకు హజరు కాలేదు. ఆ విషయం కూడా ప్రస్తావించేందుకు ఏపి మేధావులకు నోరు రాదు. కాని తెలంగాణ ప్రతిపక్ష నాయకుడు కేసిఆర్‌ మాత్రం అసెంబ్లీకి హజరు కాకపోవడాన్ని మాత్రం తప్పు పడుతుంటారు. ఇక మరో మేధావి జయ ప్రకాశ్‌ నారాయణ్‌. ఆయన ఓ మాజీ ఐఎఎస్‌ అదికారి. కూకట్‌ పల్లి మాజీ ఎమ్మెల్యే. లోక్‌సత్తా అనే పార్టీకి అదినేత. ఆయన మేధావి తనం మరీ విచిత్రం. నీతి వంతమైన రాజకీయాల గురించి మాత్రం గొప్పలు అనేకం చెబుతాడు. కాని ఆయన లేని లోక్‌సత్తాను ఇతరుల చేతుల్లో పెట్టలేదు. ఏకంగా పార్టీనే రద్దు చేశారు. అంటే అప్పటి వరకు పార్టీకి సేవలందించి వారి రాజకీయ జీవితాలు ఆగం చేశారు. లోక్‌సత్తాకు వచ్చిన విరాళాలు ఏమయ్యాయి? ఆ విరాళాలు ఏదైనా స్వచ్చంధ సంస్ధకు అందించారా? ఏం చేశారు? ఆ సొమ్ములన్నీ ఏమయ్యాయి? అని మాత్రం ఆయనను అడగకూడదు. దేశ ఆర్దిక పరిస్దితులు ఆయనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదన్నట్లు మాట్లాడుతుంటారు. ఏపికి మేలు చేసే వ్యాఖ్యలను చేస్తుంటారు. ఏపి మీద మమకారం. తెలంగాణ మీద పైకి కనిపించని కోపం ప్రదర్శిస్తుంటారు. ఎంతో తెలివిగా ఆయన ఎమ్మెల్యేగా వున్నప్పుడు ఓ వైపు లోపల తెలంగాణ వ్యతిరేక రాజకీయం చేసేవారు. పైకి మాత్రం తెలంగాణ వస్తే మిన్ను విరిగి మీద పడుతుందా? అనేవారు. కలిసి వుంటేనే కలదు సుఖం అని నీతులు చెప్పేవారు. తెలంగాణ రావడం అలాంటి మేధావులకు సుతారం ఇష్టం లేని పని. అందుకే తెలంగాణ వచ్చిన పదేళ్ల కాలంలో జరిగిన ప్రగతిని చూసి ఆయన మెచ్చుకున్న దాఖలాలు తక్కువ. తెలంగాణ విషయంలో కాళేశ్వరం మాత్రం తెల్ల ఏనుగు అంటారు. లక్ష కోట్లు వృధా చేశారని అనేక సార్లు చెబతూ వచ్చారు. కాని ఇప్పుడు ఏపి బనకచర్ల ఎత్తిపోతల పథకం వల్ల ఏపికి ఆర్ధిక బారమని మాత్రం నోరు తెరవరు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని పదే పదే ప్రస్తావిస్తూ వుంటారు. కాని పోలవరం మీద మమకారం కురిపిస్తున్నారు. అది ఎప్పుడు పూర్తవుతుందా? అని ఎదురుచూస్తుంటారు. అందులో జరిగిన అవినీతిని ప్రశ్నించరు. అందరూ ఐఎఎస్‌లు కావాలనుకోవడం మూర్ఖత్వం అంటారు. ఆయన మాత్రం ఐఏఎస్‌ అయ్యారు. తెలంగాణలో వుంటారు. తెలంగాణ మీద పడి ఏడుస్తుంటారు. తెలంగాణ సమాజం మీద విషం చిమ్ముతూనే వుంటారు. తెలంగాణ తెర్లు అయితే బాగుండు అనుకుంటే అభివృద్ది చెందడాన్ని వాళ్లు జీర్ణించుకోలేరు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పరిస్దితి ఏమిటి? ఇప్పుడు తెలంగాణ ఆర్దిక సి ్దతి ఏమిటి అనేది జేపికి తెలుసు. అయినా దాని గురించి చెప్పరు. తెలంగాణ ఎలా సస్యశ్యామలమైంది? ఎందుకు అయ్యింది? ఎవరి వల్ల అయ్యింది? అందుకు కేసిఆర్‌ చేసిన కృషి గురించి చెప్పడానికి నోరు రాదు. ఎందుకంటే తెలంగాణ విఫల రాష్ట్రమౌతుందని ఆశపడ్డారు. కాని తెలంగాణ దేశంలనే శీఘ్రంగా ప్రగతి దారిలో పరుగెత్తుతోంది. కాళేశ్వరమంటే కేవలం మూడు బ్యారేజీలు మాత్రమే అనే అపోహలో వున్న కొందరు ఏపి మేధావులు తెలంగాణ మీద విషం చిమ్ముతూనే వుంటారు.

సెలవుల్లో వుంటాం!..జీతాలు తీసుకుంటాం!?

-లక్షలాది ఎకరాల మాయం లో రిజిస్టార్ల మాయాజాలం

’’నేటిధాత్రి’’ చేతిలో రాష్ట్రంలోని ‘‘అవినీతి రిజిస్టార్ల’’ బండారం

-దోచుకున్నాం…దాచుకున్నాం?

-తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 42 మందికి పైగా రిజిస్ట్రార్లు సెలవుల్లో..?

-మొదటిసారి మంత్రి ‘‘పొంగులేటి’’ ఆదేశాలతో జోన్‌ ట్రాన్స్ఫర్లు!

-ట్రాన్స్‌ఫర్లు ఒప్పుకోం..కొత్త చోట కొలువులు చేయం?

-వాటిని కాపాడుకోవాలంటే స్థానికంగానే వుంటాం?

-అవినీతికి అలవాటు పడి, స్థానికంగా బలపడి.

-ఆస్థులు కూడబెట్టి, పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి!

-వ్యాపారాలు, ఫంక్షన్‌ హల్స్‌ నిర్వహిస్తూ..

-అక్రమ రిజిస్ట్రేషన్లలో భూములు కొల్లగొట్టి..

-కొత్త చోట ఏసిబి దాడులు అంచనా వేసుకోలేం?

-15 ఏళ్లకు పైబడి ట్రాన్స్‌ఫర్లు లేకపోవడం రిజిస్ట్రార్లకు బలం.

-భరించలేకపోతున్న రిజిస్ట్రార్లు!

-ఇప్పుడు ట్రాన్స్‌ఫర్లు మేం ఒప్పుకోం!

-పాత చోట పెద్ద ఎత్తున అనుచరులు.

-ముళ్లెలకు ముళ్లెలు అందిన మూటలు.

-రియలర్టర్లతో భూ బంధాలు.

-వాటిని వదులుకునేందుకు సిద్ధంగా లేరు.

-ఒకప్పుడు వేలల్లో పుచ్చుకునే లంచాలు!

-గత పదేళ్లుగా లక్షల్లో, కోట్లల్లో పెరిగిన ఆదాయాలు!

-అక్రమ రిజిస్ట్రేషన్లలో లంచాలుగా సొమ్ముకు బదులు భూ సంతర్పణలు.

-బినామీల పేరుతో పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు.

-‘‘ఆదిలాబాద్‌’’ లో పెద్ద ఎత్తున అటవీ భూముల అన్యాక్రాంతంలో భాగస్వాములు.

-కరీంనగర్‌లో వక్ఫ్‌ భూముల మాయంలో రిజిస్ట్రార్ల సహకారాలు.

-వరంగల్‌ లో ఏడాదిగా చిట్స్‌ రిజిస్ట్రార్‌ లేకుండా పోవడం.

-‘‘ఖమ్మం’’లో వాగులు, వంకలు అటవీ భూముల రిజిస్ట్రేషన్లు!

-రంగారెడ్డి జిల్లాలో ‘‘కోట్లల్లో’’ లంచాలు?

-గత పదేళ్లుగా ‘‘నేటిధాత్రి’’ సాగిస్తున్న అక్షర పోరాటం.

-ఫలితంగా ఎంతో మంది రిజిస్ట్రార్ల సస్పెన్షన్లు!

-అయినా మార్పు రాని యంత్రాంగం.

హైదరాబాద్‌, నేటిధాత్రి:                        కొంత మంది రిజిస్ట్రార్లు జీవితానికి అరగనంత తిన్నారు. తరతరాలు తరగనంత సంపాదించుకున్నారు. లంచాలు మింగి రంది లేకుంటానే వున్నారు. అయినా ఇంకా వారికి లంచాల ఆకలి తీరలేదు. సంపాదన ఇంకా సరిపోవడం లేదు. కోట్లు కూడబెట్టుకున్నా, ఇంకా ఆశ చావలేదు. ఇది జనాల్లో రిజిస్ట్రేషన్‌ శాఖపై వున్న అభిప్రాయం. తెలంగాణ వ్యాప్తంగా వున్న 140 రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో పని చేసే రిజిస్ట్రార్ల దగ్గర నుంచి అందులో పనిచేసే ఏ ఉద్యోగులు సుద్దపూసలు కాదన్న సత్యం అందరూ చెబుతుంటున్నారు. వారిలో కూడా కొందరు మంచి వాళ్లుండొచ్చు. కాని వారిని ఎవరూ గుర్తించరు. శరీరంలో చాలా భాగం చెడిపోయినప్పుడు, బాగున్న అవయవం చేసేదేమీవుండదు. అలా తింటున్నా, కూర్చున్నా, నిద్రలో కూడా లంచం, లంచం అనే మాటతోనే కొందరు కాలం గడిపే ఉద్యోగులు అనేకం వున్నారు. వారిని మారమంటే మారు. మార్చాలని చూసినా మారరు. ఎందుకంటే లంచానికి అలవాటు పడిన ప్రాణం రూపాయి తీసుకోకుండా వుండే పరిస్ధితి వుండదు. వ్యవస్ధ కళ్లిపోయిందంటే ఇలాంటి ఉద్యోగులే కారణం. ఎంతో మంది ప్రజల వద్ద దోచుకున్నారు. దాచుకున్నారు. ఇంకా చాలడం లేదు. అంతే కాదు వారి గొంతెమ్మ కోరికలు అంతా ఇంతా కాదు. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా సరే ట్రాన్స్‌ఫర్‌కు ఎప్పుడూ సిద్దంగా వుండాలి. అది కలెక్టర్‌ దగ్గర నుంచి జూనియర్‌ అసిస్టెంట్‌ వరకు ఎవరైనా ఒక్కటే. కాని తెలంగాణలో రిజిస్రేషన్‌ శాఖలో సుమారు 15 సంవత్సరాలుగా ట్రాన్స్‌ఫర్లు లేని వాళ్లు ఎంతో మంది వున్నారు. అంతకాన్న ఎక్కువ కాలం కూడా ఒకే చోట, ఒకే సీట్లో కూర్చున్న వారు కూడా వున్నారు. వారికి ప్రమోషన్లు వచ్చినా అవసరం లేదని అక్కడే తిష్ట వేసుకొని వున్నవాళ్లున్నారు. కారణం కేవలం లంచం. సహజంగా ఉద్యోగులు ప్రమోషన్లు వస్తే ఎంతో సంతోషిస్తారు. జీతం పెరగుతుందని ఆనందపడతారు. హోదా పెరుగుతుందని సంబరపడతుంటారు. ప్రమోషన్ల కోసం చకోర పక్షుల్లా ఎదురుచూస్తుంటారు. తమ పరపతి పెరుగుతుందని కలలుకంటారు. కాని రిజిస్ట్రేషన్‌ శాఖలో సబ్‌ రిజిస్ట్రార్‌ కుర్చీ మాత్రమే చాలనుకుంటారు. ఆ కుర్చీ విడిచిపెట్టేందుకు అసలే ఒప్పుకోరు. ఒక వేళ ప్రభుత్వం వారిని ట్రాన్స్‌ఫర్‌ చేసినా మళ్లీ ఏదో రకంగా పైరవీ చేసుకొని అదే కుర్చీలో కూర్చున్న వారు కూడా వున్నారు. అంతే కాదు ఏసిబికి పట్టుబడి, కొంత కాలానికి మళ్లీ కొలువు తెచ్చుకొని, అదే కుర్చీలో అతుక్కుపోయిన వారు కూడా వున్నారు. ఇదీ స్ధూలంగా కొంత మంది రిజిస్ట్రార్ల బాగోతం. ఇదంతా ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు చాలా మంది రిజిస్ట్రార్లు చోటు కదలకుండా విధులు నిర్వర్తిస్తున్నారు. ట్రాన్స్‌ఫర్లు అనేవి లేకుండా తిష్టవేసుకొని కూర్చున్నారు. అయితే ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత రివెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి రిజిస్ట్రేషన్‌ శాఖలో మార్పులు తీసుకురావాలని చూశారు. రిజిస్ట్రేషన్‌ శాఖలో అవినీతి లేకుండా చేయాలని అనుకున్నారు. దాంతో ఆయన జోన్‌ ట్రాన్స్‌ఫర్లు చేశారు. ఇది రిజిస్ట్రేషన్‌ శాఖలో చాలా మంది ఉద్యోగులకు నచ్చలేదు. దాంతో కొంత మంది సీనియర్లు ఏక కాలంలో సెలవులు పెట్టినట్లు సమాచారం. మా ట్రాన్స్‌ఫర్లు రద్దు చేయకుంటే మేం సెలువుల్లోనే వుంటాం…కొలువులు మాత్రం చేయం. ట్రాన్ష్‌ఫర్లు అసలే ఒప్పుకోం. జీతాలు తీసుకుంటాం.. ట్రాన్స్‌ఫర్‌ చేసిన చోటకు వెళ్లమని భీష్మించుకొని కూర్చున్నారు. ఎందుకంటే ఇంత కాలం అవినీతికి అలవాటు పడి బాగా సంపాదించుకున్నారు. చాలా వరకు అక్కడే స్ధిరపడిపోయారు. స్దిర చరాస్ధులు సంపాదించుకున్నారు. సమీపంలో వుండే బంధువులను బినామీలుగా చేసుకున్నారు. ప్రతి రిజిస్ట్రార్‌ కొంత మంది అనుచరులను ఏర్పాటు చేసుకున్నారు. అందులో బంధువులుంటారు. తనకు అత్యంత నమ్మకస్తులుంటారు. వారి పేర్ల మీద ఆస్ధులు కూడబెట్టారు. వారి పేర్ల మీద ఆస్ధులు పెట్టుకున్నారు. పైగా ఎక్కడైతే అంత కాలం కొలువు చేస్తున్నారో అక్కడ వ్యాపారాలు కూడా మొదలు పెట్టిన వారున్నారు. పెద్దపెద్ద ఫంక్షన్‌హాల్స్‌ కూడా నిర్మాణాలు చేసుకున్నారు. పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు జోన్‌ మార్పులంటే జిల్లాలు దాటాల్సి వస్తుంది. పాత జిల్లాలకు వెళ్లాల్సి వస్తుంది. రోజూ వెళ్లలేరు. అక్కడే వుండలేరు. కుటుంబాలను అక్కడికి తీసుకెళ్లలేరు. కుటుంబాలను వదిలేసి కొలువులు చేయాల్సిన చోట వుండలేరు. తెలంగాణ రాకముందు సహజంగా రిజిస్ట్రార్లు లంచాలు తీసుకునే వారు. అది కూడా వేలల్లో వుండేవి. కాని తెలంగాణ వచ్చిన తర్వాత వేల రూపాయలు దాటిపోయాయి. లక్షలకు చేరుకున్నాయి. ఎప్పుడైతే తెలంగాణలో భూముల ధరలు విపరీతంగా పెరిగాయో? అప్పుడు రిజిస్ట్రార్ల ఆశలకు రెక్కలొచ్చాయి. లంచాలు తీసుకోకుండా ఏకంగా భూములను రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం మొదలు పెట్టారు. ఇచ్చే లంచాల స్ధానంలో భూములను రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. అలా అక్రమ రిజిస్ట్రేషన్లను చేస్తూ, అందులోనూ తమకు కొంత భూమిని రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. అయితే అవి ఆ రిజిస్ట్రార్లకు చెందిన అనుచరులు, బంధువుల పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేసి వున్నాయి. ఒక్కసారి అక్కడి నుంచి కదిలిలే ఇక ఆ భూములు, ఆస్ధులు దక్కకపోవచ్చన్న భయం వారిలో పట్టుకున్నది. దాంతో కొంత మంది రిజిస్ట్రార్లు సెలవులు పెట్టారు. ఇంట్లోనే వుంటున్నారు. సుమారు 15 సంవత్సరాలుగా ట్రాన్స్‌ఫర్లు లేకపోవడం వారికి వరంగా మారింది. గతంలో తిష్టవేసుకున్న ప్రాంతాల్లో వారికి పెద్దఎత్తున అనుచర గణం వుంటుంది. పైగా స్దానికంగా వున్న రియల్టర్లతో భూ బందాలున్నాయి. పాత స్థలాలపై రిజిస్ట్రార్లకు పూర్తి అవగాహన వుంటుంది. రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చేవారు ఎలాంటి భూముల రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటన్నారన్నదానిపై పూర్తి పట్టు వుంటుంది. దాంతో ఆ భూముల విషయంలో ఎంత వరకు లంచం తీసుకోవచ్చు. ఎంత వరకు భూములను లంచంగా అడగొచ్చన్నదానిని గురించి నిర్ణయం తీసుకోగలరు. అదేకొత్త ప్రాంతానికి వెళ్తే పుణ్యకాలం ముగిసిపోతుంది. పైగా కొత్త ప్రాంతంలో ఎప్పుడు ఏసిబి దాడులు ఎక్కడి నుంచి జరుగుతాయో తెలియదు. అక్కడ అనుచర గణం తయారు చేసుకోవాలంటే చాలా కాలం పడుతుంది. వారిని ఎంత వరకు నమ్మలో కూడ నమ్మకం కుదిరేందుకు చాలా సమయం పడుతుంది. ఎప్పుడూ భయం గుప్పిట్లో కొలువులు చేయాల్సి వుంటుంది. దానికన్నా సెలవు పెట్టి హాయిగా వుండడమే మేలనుకుంటున్నారు. ఇలా ఉద్యోగులు తీసుకున్న నిర్ణయం వల్ల శాఖలో పనులు పెండిరగ్‌ల పడుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ధరణి వచ్చిన తర్వాత లక్షలాది ఎకరాలు మాయం కావడానికి ప్రదాన కారణం రిజిస్ట్రార్లే కావడం గమనార్హం. ఆదిలాబాద్‌ జిల్లాలో పెద్దఎత్తున వేలాది ఎకరాల అటవీ భూములను సీటు ముక్కల్లా అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారు. కరీంనగర్‌ జిల్లాలో వున్న వక్ఫ్‌ భూములు అన్యాక్రాంతం కావడం లో రిజిస్ట్రార్ల పాత్ర పెద్దది. వరంగల్‌ జిల్లాలో చిట్స్‌ రిజిస్ట్రార్‌ లేక ఎంతో మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో అనేక చిట్‌ పండ్‌ కంపనీలు బిచాన ఎత్తేయడం వల్ల ఎంతో మంది ప్రజలు నష్టపోయారు. వారు తమ గోడును వినిపించుకునేందుకు ఏడాది కాలంగా రిజిస్ట్రార్‌ లేడు. ఇలా ట్రాన్ష్‌ఫర్‌ను తిరస్కరించి కొలువుల్లో చేరకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయినా ఉద్యోగులు సంతోషంగానే వున్నారు. ఖమ్మం జిల్లాలో వాగులు, వంకలు కూడా కొందరు రియల్టర్లు వదల్లేదు. ఆ భూములను కూడా అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారు. కోట్లు కూడబెట్టుకున్నారు. ఆస్దులు పోగేసుకున్నారు. నేటిధాత్రి గత పదేళ్ల కాలంగా అక్రమ రిజిస్ట్రేషన్లు, లంచాల రిజిస్ట్రార్లపై అక్షరపోరాటం సాగిస్తూనే వుంది. ఎంతోమంది అవినీతిత సబ్‌ రిజిస్ట్రార్లను ఇంటికి పంపడంలో నేటి దాత్రి పోరాటం ఫలించింది. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఏసిబికి ఎంతో మంది పట్టుబడుతున్నా, కొందరు రిజిస్ట్రార్లు తమ అవినీతిని ఆపడంలేదు. వారి అక్రమ సంపాదన ఆగడం లేదు. అలాంటి రిజిస్ట్రార్ల అవినీతి బాగోతమంతా నేటి దాత్రి చేతిలో వుంది. వారిపై వరస కథనాలు త్వరలోనే నేటిదాత్రి బైటపెడుతుంది. వారి బంగారం బట్టబయలు చేస్తుంది. త్వరలో వరుస కధనాలు అందిస్తుంది. ప్రభుత్వానికే సవాలు విసురుతున్న వారి వివరాలు త్వరలోనే…మీ నేటిధాత్రిలో…

`పేరుకు ఆ నలుగురు పెద్దలు…సివిల్‌ సప్లయ్‌ మీద వాలిన గద్దలు!?

`సివిల్‌ సప్లయ్‌ని గుళ్ల గుళ్ల చేసి బొర్రలు నింపుకుంటున్నారు!?

`దశాబ్దాలుగా సివిల్‌ సప్లయ్‌ శాఖను పీల్చి పిప్పి చేస్తున్నారు.

`ఓ రకం మిల్లర్లను అణచివేసి రాజ్యమేలుతున్నారు.

`ప్రభుత్వానికి సున్నం పెడుతున్నారు!

`దశాబ్దాలుగా సివిల్‌ సప్లయ్‌ని ఊడ్చుకు తింటున్నారు.

`అధికారులతో కలిసి పంచుకుతింటున్నారు.

`నాయకులను గుప్పిట్లో పెట్టుకొని దోచుకుతింటున్నారు.

`నలుగురు నాలుగు పార్టీలు.. పాలకులెవరైనా దోస్తులు!

`మొత్తంగా నలుగురు నాలుగు దిక్కులు?

`ఎంత పెద్ద అధికారినైనా మార్చగలరు!

`సంబంధిత మంత్రులను ఏమార్చగలరు!

`మంత్రులకు కావలసింది సమకూర్చగలరు?

`సివిల్‌ సప్లయ్‌కి అందరూ పవర్‌ పుల్‌ కమీషనర్లే!

`శాఖ ప్రక్షాళన జరిగే సమయానికి అందరికీ ట్రాన్స్ఫర్లే!

`అధికారులకు ఆ నలుగురంటే ఎంతో ప్రీతి!

`అందుకే సివిల్‌ సప్లయ్‌లో అంతులేని అవినీతి.

`ఆ రిపోర్టు లన్నీ బుట్ట దాకలే!

హైదరాబాద్‌, నేటిధాత్రి:                        ఆ నలుగురు. తెలంగాణలో సివిల్‌ సప్లయ్‌ శాఖకు సంబందించినంత వరకు ఆ నలుగురే గొప్ప. అలా అనుకుంటే వాళ్లేమీ అదికారులుకాదు. మిల్లర్ల వ్యవస్ధకు పెద్దలు. దశాబ్ధ కాలంగా మిల్లర్ల వ్యవస్ధను ఏలుతున్నారు. సివిల్‌ సప్లయ్‌శాఖను గుప్పిట్లో పెట్టుకున్నారు. వాళ్లు చెప్పిందే వేదం. వాళ్లు ఆడిరది ఆట..పాడిరది పాట. సివిల్‌ సప్లయ్‌ శాఖలో వుండే అధికారులకు వాళ్లేంతో ప్రీతిపాత్రులు. దోచుకోవడానికి, దాచుకోవడానికి చూపే దారులు. అదికారులకు ఎప్పటికప్పుడు ప్రసన్నం చేసుకుంటారు. పాలకులెవరైనా సరే వారికి సంతర్పణలు సమర్పించుకుంటారు. ఈ విషయాలు చెప్పేది, చెప్పుకునేది ఎవరో కాదు..తెలంగాణలో వున్న మిలర్లు..సివిల్‌ సప్లయ్‌ శాఖలోని అదికారులు. ఈ చలవ వల్లనే అధికారులు ఉద్యోగాలు చేసుకుంటారు. వీరి చల్లని చూపులతోనే మిల్లర్లు బతుకుతుంటారు. వీళ్లను కాదని అదికారులు గీత దాటలేరు. మిల్లర్లు నోరు మెదపలేరు. సివిల్‌ సప్లయ్‌లో రైతుల నుంచి ఎవరికి వడ్లు చేరాలన్నా వీళ్ల కనికరం కావాలి. వడ్లు మాయమైనా, బియ్యం మార్కెట్‌లోకి తరలిపోయినా వీళ్లుకు తెలిసే జరగాలి. అందులో ఎప్పటికప్పుడు వాటా వీరికి వెళ్లాలి. అధికారులకు పంపకాలు చేయాలంటే వీళ్లే కావాలి. ఆ నలుగురు ఎంత అడిగితే అంత, ఎంత తెమ్మంటే అంత మిల్లర్లు ముట్టజెప్పాలి. దీంతో ఉయభకుశపోరి మాత్రం కాదు. మిల్లర్లకు కూడా మింగడానికి మెతుకు లేకుండా చేయగలరు. అంతటి సమర్ధులు. అలాగని ఈ నలుగురు ఒకే పార్టీకి చెందిన వాళ్లు కాదు. నలుగురు నాలుగు పార్టీలు. కాని చేతికున్న వేళ్లలా అందరూ కలిసి వుంటారు. పాలకులు ఎవరైనా సరే వారికి చేరువౌతారు. ఒకరితో ఒకరు కలిసి, సివిల్‌సప్లయ్‌ శాఖను గుల్ల గుల్ల చేస్తూ వుంటారు. దశాబ్ధాల తరబడి యూనియన్‌ కుర్చీలకు అతుక్కుపోయారు. మొత్తంగా సివిల్‌ సప్లయ్‌ శాఖను ఏలుతున్నారు. ఆ శాఖలో ఏళ్ల తరబడి పాతుకుపోయిన ఉద్యోగులంతా ఒక రకంగా సందప బంధవులు. పంచుకునేందుకు దగ్గరైన దోస్తులు. కాని వారి అజమాయిషీ చేసేందుకు వచ్చే కమీషనర్లకు మాత్రం చిక్కరు దొరకరు. ఎంత పవర్‌ పుల్‌ కమీషనర్‌ వచ్చినా సరే వారి బండారం బైట పడే సమయానికి ఆటోమెటిక్‌గా ట్రాన్స్‌ఫర్‌ అయిపోతారు. ఇది గత పన్నెండు సంవత్సరాలుగా జరగుతోంది. కాని వీళ్ల హావా మాత్రం రోజు రోజుకూ పెరిగిపోతోంది. అదికారుల అండదండలతో వారి పెత్తనం వెలిగిపోతోంది. మిల్లర్లంందరినీ గుప్పిట్లో పెట్టుకున్నారు. వారికి ఆపదలు ఈ నలుగురే సృష్టిస్తారు. వారిని ఆపదల నుంచి వీళ్లే గట్టెక్కిస్తారు. వీరి తీరంతా విచిత్రం. ఏ పార్టీ అధికారంలోవున్నా పాలకులకు చేరువౌతారు. మిల్లింగ్‌ వ్యవస్ధ పేరుచెప్పి పబ్బం గడుపుకుంటారు. టెండర్‌ ప్యాడీ వ్యవస్ధ వెనుక వీళ్లే వుంటారు. మిల్లర్ల అసోసియేషన్‌ పెద్దలుగా అన్నీ చక్కదిద్దుతుంటారు. తమకు తాము చక్కదిద్దుకుంటారు. కోట్లకు పడగలెత్తారు..ఎంతపెద్ద వాళ్లనైనా కోట్లు పెట్టికొనేస్తుంటారు. ఎవరి నోరైనా మూయించగలరు. మొత్తానికి సివిల్‌ సప్లయ్‌ని పీల్చి పిప్పి చేస్తున్నారు. ఈ నలుగురు వల్ల అటు రైతులు మోసపోతున్నారు. ఇటు మిల్లర్లు మునుగుతున్నారు. ఈ నలుగురు మాత్రం అవినీతి చక్రవర్తులుగా మిల్లింగ్‌ రాజ్యమేలుతున్నారు. మిల్లర్ల వ్యవస్ధను భ్రష్టుపట్టిస్తున్నారు? సివిల్‌ సప్లయ్‌ని ఆగం చేస్తున్నారు. వేల కోట్ల కుంబకోణాల వెనుక వీళ్లే కనిపిస్తారు. కాని వారికి మట్టి అంటకుండా జాగ్రత్తలు చాలా బాగా తీసుకుంటారు. నాయకుల ఆశీస్సులతో వెలగిపోతుంటారు. ఆ శాఖ మంత్రి పర్యటనల కోసం ఏకంగా చార్టెడ్‌ ఫ్లైట్‌ కూడా అరెంజ్‌ చేయగలగుతున్నారు. అంటే సివిల్‌ సప్లయ్‌ పేరు మీద ఎంత సంపాదించుకుంటున్నారో? ఎంత దోచుకుంటున్నారో అర్దం చేసుకోవచ్చు. తిమ్మిని బమ్మిని చేయలగరు. పాలకులను ఎప్పటికిప్పుడు ఎలాగైనా మభ్యపెట్టగలరు. మాయా మశ్చీంద్ర వేషాలు అవలీలగా వేయగలరు. మిల్లర్ల వ్యవస్ధకు నాయకులుగా ఏనాడు ఆ వ్యవస్ధకు మేలు చేసింది లేదు. కాని ఆ మిల్లర్ల వ్యవస్ధలోనే చీలికలు తెస్తుంటారు. ఓ వర్గానికి పెద్దలుగా మొత్తం వ్యవస్ధపై పెత్తనం చేయగలరు. ఎంతటి తొండాటైనా ఆడగలరు. మిల్లర్లు సివిల్‌ సప్లైశాఖకు వేలకోట్ల బకాయిలకు కారణం వాళ్లే..మిల్లర్ల నుంచి మొండి బకాయిల పేరుతో వేధించగల సమర్ధలు వీళ్లే..అదికారులను ముందుకు తోసేది వీళ్లే..మిల్లర్లను ఇబ్బందులకు గురి చేసేది వీళ్లే..మిల్లింగ్‌ వ్యవస్ధలో ఏది జరిగినా, కనిపించేది ఈ నలుగురే! ఏ మిల్లుకు వడ్లు కేటాయించాలో..ఏ మిల్లుకు ఆపాలో..ఏ మిల్లుపై ఎంక్వైరీ జరగాలో..ఏ మిల్లు మీద పగ తీర్చుకోవాలో అంతా సిద్దం చేసేది వీళ్లే.. మిల్లర్లను వేధింపులకు గురి చేసేది వీళ్లే. అంటే వారి అనుచరులైన వారికి మిల్లులు లేకపోయినా సరే వడ్లు కేటాయించబడతాయి. బియ్యం మాయ చేయబడతాయి. అదికారుల నోళ్లు మూతపడతాయి? అంతా ఈ నలుగురు కనుసన్నల్లోనే జరగాలి. ఏం జరిగినా ఈ నలుగురికి మాత్రమే తెలిసి జరగాలి. ఇంతలా ఆ నలుగురు పాతుకుపోయారు. సివిల్‌ సప్లయ్‌ను మొత్తం భ్రష్టు పట్టించారు. తెలంగాణ వచ్చిన తర్వాత అప్పటి ప్రభుత్వం కమీషనర్‌గా అకున్‌ సబర్వాల్‌ను నియమించింది. సివిల్‌ సప్లయ్‌లో జరిగే అవినీతిని కూకటి వేళ్లతో పెకిలించమని చెప్పింది. రైతులకు ఎట్టిపరిస్దితుల్లో అన్యాయం జరగొద్దని సూచించింది. ఏళ్ల తరబడి పేరుకుపోయిన మొండి బకాయిల వసూలుకు రంగంలో దిగమని చెప్పింది. దాంతో అకున్‌ సబర్వాల్‌ లెక్కలను ముందేసుకునే ప్రయత్నం చేశారు. మొండి బకాయిల లెక్కలు తేల్చాలనుకున్నాడు. పెండిరగ్‌ బకాయిలను వసూలుకు అంతా రంగం సిద్దంచేశారు. విజిలెన్స్‌ ఎంక్వౌరీ మొదలు పెట్టారు. ఎంతో దూకుడుగా పనులు మొదలుపెట్టారు. చూస్తుండగానే రెండేళ్లు గడిచింది. అకున్‌ సబర్వాల్‌ రిపోర్టు తయారుచేశారు. రాత్రికి రాత్రే ఆయన కమీషనర్‌ పదవి పోయింది. ఆ కుర్చీలోకి కొత్త వారు వచ్చారు. తర్వాత సివిల్‌ సప్లై కమీషనర్‌గా సివి. ఆనంద్‌ వచ్చారు. ఆయన కన్నెర్ర చేశారు. బకాయిల వసూలుకు తెర తీశారు. మిల్లింగ్‌ వ్యవస్ధను గాడిలో పెట్టాలనుకున్నారు. సవిల్‌ సప్లైశాఖలో అవినీతిని అంతం చేయాలనుకున్నారు. క్షేత్ర స్దాయి నుంచి జరిగిన లోపాలను, తప్పులను, అవకతవకలను వెలికి తీసే ప్రయత్నం బాగానే చేశారు. రిపోర్టు రెడీ చేశారు. ప్రభుత్వానికి సమర్పించారు. తర్వాత కొంత కాలానికి ఆయన కూడా ట్రాన్స్‌ఫర్‌ అయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చింది. సివిల్‌ సప్లై కమీషనర్‌గా గత 22 నెలలుగా చౌహాన్‌ విధులు నిర్వరిస్తున్నారు. అవినీతి మీద ఉక్కుపాదం మోపారు. మొండిబకాయిలు అనేకం వసూలుచేశారు. రికార్డు స్ధాయిలో వసూలుకు శ్రీకారం చుట్టారు. ఎక్కడా అవకతవకలు జరక్కుండా చేశారు. మొత్తం వ్యవస్ధను గాడిలో పెట్టే సమయానికి ఆయన కూడా తాజాగా ట్రాన్స్‌ఫర్‌ అయ్యారు. కమీషనర్‌ చౌహాన్‌ ట్రాన్స్‌ఫర్‌ కాగానే ఈ నలుగురిలో ముగ్గురు పార్టీ చేసుకున్నారని సమాచారం. మళ్లీ వాళ్లకుపాత రోజులుమరింత వస్తాయని సంబరాలు చేసుకున్నారని తెలుస్తోంది. అంటే చౌహాన్‌నే కాదు, గతంలో ఇద్దరు కమీషనర్‌లను ట్రాన్స్‌ఫర్లు చేయించారని కూడా శాఖలో చెప్పుకుంటారు. ఇలా వారు ఆడిరది ఆట పాడిరదిపాటగా శాఖను దోచుకుతింటున్నారు. పాలకులనే గుప్పిట్లో పెట్టుకుంటున్నారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నారు. ఓ వైపు ప్రభుత్వం పేద ప్రజలకు సన్న బియ్యం ఇస్తూ పేదల కడుపు నింపుతుంటే, ఈ నలుగురు తమ పొట్టలు నింపుకునే పనిలోవున్నారు. మంత్రి ఉత్తమ్‌కు అత్యంత సన్నిహితులుగా మారి, శాఖను గుప్పిట్లో పెట్టుకున్నట్లు చెప్పుకుంటున్నారు. ఏకంగా మంత్రికి అవసరమైన సౌకర్యాల కల్పనలో ముందుంటున్నారని అంటున్నారు. ఆ మధ్య మంత్రి పర్యటన కోసం స్పెషల్‌ జెట్‌ను సమకూర్చి మంత్రి ఆశీస్సులు కూడా పొందారని అంటున్నారు. పాలకులు ఎవరైనా సరే ఈ నలురుగు మాత్రం కామన్‌గా వుంటున్నారు. వ్యవస్ధను గుప్పిట్లో పెట్టుకొని అవినీతి సాగిస్తున్నారు. కొత్తగా వచ్చిన కమీషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర కూడా ఎంతో సమర్ధవంతమైన ఐపిఎస్‌ అదికారి. ఆయననైనా పని చేయనిస్తారా? లేక ఆయనపై కూడా పాలకుల చేత ఒత్తిళ్లు తెస్తారా? అన్నది చూడాలి. ఇంతకీ ఎవరా? నలుగురు? అనేది తర్వాత కథనంలో…మీ నేటిధాత్రిలో…

వల్లబ్ నగర్ లో దుర్గ మాత పూజలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డ్….

వల్లబ్ నగర్ లో దుర్గ మాత పూజలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డ్
వనపర్తి నేటిదాత్రి .

 

వల్లబ్ నగర్ 33 వార్డులో రామ్ సేన యూత్ మహిళా సంఘం సభ్యులు దసరా ఉత్సవాలలో సందర్భంగా దుర్గామాత ప్రత్యేక పూజలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రత్యేక పూజలో పాల్గొన్నారని 33 వ వార్డు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ తిరుమాల్ తెలిపారు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారని చెప్పారు పూజలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ మాజీ కౌన్సిలర్ తిరుమల్ అలేఖ్య గులాం సూర్యవంశం గిరి సునీల్ వాల్మీకి చిట్యాల రాము బీచుపల్లిసాగర్ రాఘవేంద్ర క్రాంతి తదితరులు పాల్గొన్నారని తిరిమాల్ ఒక ప్రకటన లో తెలిపారు

ఏపిలో రాజకీయం.. తెలంగాణలో మకాం!

`హైదరాబాద్‌ వదిలి వెళ్లలేరు.

`ఏపిలో రాజకీయం మానుకోలేరు.

`ఏపిలో రాజకీయాలు చేయాలి.

`తెలంగాణ నుంచి వచ్చిపోతుండాలి.

`వారంలో రెండు రోజులు ఏపిలో..

`ఐదు రోజులు తెలంగాణలో..

`అధికారులు కూడా అంతే…

`అదే దారిలో మీడియా కూడా..

`మీడియా సంస్థలన్నీ హైదరాబాద్‌లోనే..

`వార్తలన్నీ ప్రసారం హైదరాబాద్‌ నుంచే.

`ప్రపంచ రాజధాని నిర్మాణం అంటారు.

`హైదరాబాద్‌లోనే అందరూ వుంటారు.

`పాలక, ప్రతిపక్షం తేడా లేదు.

`అన్ని పార్టీల నాయకులంతా హైదరాబాద్‌లోనే…

హైదరాబాద్‌, నేటిధాత్రి: 

 ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలంటేనే విచిత్రం. నాయకులు అంతకన్నా విచిత్రం. గత పదేళ్లకాలంగా రాజకీయాలు ఏపిలో చేస్తున్నారు. నివాసం మాత్రం తెలంగాణలో వుంటున్నారు. సరే నిజానికి హైదరాబాదర్‌ పదేళ్లపాటు ఉమ్మడి రాజధాని. అలా రాజదాని కొనసాగిందా? అంటే అదీ లేదు. ఏడాదిన్న కాలానికే చంద్రబాబు హైదరాబాద్‌ను వదిలేసి వెళ్లిపోయాడు. అప్పటికే కేంద్ర ప్రభుత్వం రాజధాని కోసం ఓ ప్రాంతాన్ని సూచించింది. కాని చంద్రబాబు ప్రభుత్వం అమరావతిని ఎంచుకున్నది. రాజదాని నిర్మాణం మొదలుపెట్టింది. అక్కడ అసెంబ్లీ, సచివాలయం, హెచ్‌ఓడిల భవనాలు నిర్మాణాలు జరిగాయి. తర్వాత ఐదేళ్లపాటు జగన్‌ పరిపాలనచేశాడు. కాని ఆయన మూడు రాజధానులు అన్నాడు. విశాఖలో ఒక్క భవనం తప్ప మరేం ఆయన ముట్టుకోలేదు. ఇక వచ్చే దసరా నుంచి రుషికొండ ప్యాలెస్‌ నుంచే పాలన అని చెప్పుకున్నాడు. తర్వాత ఉగాది అన్నారు. ఇలా నిర్మాణం పూర్తయిన తర్వాత అదిగో ఇదిగో అన్నారు. కాని రాజదానికి విశాఖకు మార్చలేదు. పైగా కర్నూలు, విశాఖ, అమరావతి మూడు రాజధానులుంటాయన్నాడు. కాని కుదరలేదు. ఒక రకంగా చెప్పాలంటే సాద్యం కాలేదు. మళ్లీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. అమరావతి పనులు మళ్లీ మొదలు పెట్టింది. పనిలో పనిగా మరో 40వేల ఎకరాలు రైతుల నుంచి సేకరించాలనుకుంటోంది. గతంలోనే 30వేల ఎకరాలను రైతుల నుంచి లాండ్‌ ఫూలింగ్‌ పేరుతో తీసుకున్నారు. ఇది తన ఘనత అంటూ గొప్పలు చెప్పుకున్నారు. రాజధాని నిర్మాణంకోసం పెద్దఎత్తున ప్రజల నుంచి కోట్లాది రూపాయల విరాళాలు సేకరించారు. పరిశ్రమలను ఆహ్వానించారు. పెట్టబడులు పెట్టమన్నారు. కంపనీలకు ఎన్ని రకాల సదుపాయాలంటే అన్ని రకాలు కల్పిస్తామన్నారు. ఇప్పుడైతే ఏకంగా రూపాయికి ఎకరం కూడా ఇచ్చేస్తున్నారు. విశాఖను ఐటి రాజధాని చేస్తామన్నారు. ఏపి అంతా ఐటి వెలుగులు తెప్పిస్తామన్నారు. బాగానే వుంది. కొన్ని కంపనీలు వచ్చాయి. రియల్‌ వ్యాపారం మొదట్లో బాగానే జరిగింది. వైసిసి రావడం తో ఇదంతా ఆగిపోయింది. కాని రాష్ట్రానికి పెట్టుబడులేమీ ఆగిపోలేదు. రియల్‌ వ్యాపారం తగ్గిపోయింది. కంపనీలు కొన్ని బాగానే వచ్చాయి. అయితే చంద్రబాబు నాయుడు ఏపికి తొలి ముఖ్యమంత్రిగా అసెంబ్లీ, సచివాలయం నిర్మాణం చేయడం మొదలు పెట్టిన నాడే ఇవన్నీ తాత్కాలికం అన్నాడు. అప్పుడే జనం పెదవి విరిచారు. ఇండ్లు, భవనాలు పదే పదే ఎవరైనా కట్టుకుంటారా? నిర్మాణం చేసినప్పుడే కొన్ని దశాబ్ధాల పాటు ఉపయోపడేలా నిర్మాణాలు చేసుకోవాలి. ఆగమేఘాల మీద నిర్మాణాలు చేయాల్సిన పనిలేదు. చేసిన తర్వాత అవన్నీ తాత్కాలికమే అంటూ చెప్పడాన్ని జనం జీర్ణించుకోలేకపోయారు. ఇప్పుడు అమరావతి నిర్మాణం అంటూ మళ్లీ మొదలు పెట్టారు. ఇదంతా బాగానే వుంది. ఆ నిర్మాణం చేపట్టాలనుకునేవారు ఎక్కడుండాలి? ఏదైనా నిర్మాణం చేసేవాళ్లు నిర్మాణానికి దగ్గర్లో వుండాలా? లేక ఎక్కడో దూరంగా వుండాలా? ఇక్కడ ఒక్క చంద్రబాబు నాయకుడే కాదు, రాజకీయ నాయకుల అందరూ బాధ్యులే. ఎక్కడో వుండి ఆపరేట్‌ చేయడానికి రాజదాని నిర్మాణమేమైనా ఐటి కంపనీయా? ఎక్కడ నిర్మాణం జరుగుతందో అక్కడే నాయకులు, పాలకులు వుండాలి. ప్రతిక్షణం పర్యవేక్షించుకోవాలి. ఒక రాజదాని నిర్మాణం తెల్లారేసరికి పూర్తయ్యేది కాదు. తాను ఊ అంటే సైబరాబాద్‌ నిర్మాణం చేశానంటాడు. మరి అమరావతి నిర్మాణం దగ్గరుండి ఎందుకు ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారన్నదే ఇక్కడ ప్రశ్న. పాలన అంతా ఒక దగ్గర కేంద్రీకృతమై, పాలకులంతా అక్కడే వుంటే ప్రజలు కూడా ఆసక్తి చూపిస్తారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ఉన్నతాధికారులంతా అమరావతిలోనే వుంటే వచ్చే వాళ్లు కూడా ఆసక్తి కనబర్చుతారు. పెట్టుబడులు పెట్టేవారు కూడా ధైర్యం చేస్తారు. కాని ఇప్పటి వరకు చంద్రబాబు స్ధిర నివాసం అమరావతిలో లేదు. జగన్‌ తొలిసారి ప్రతిపక్షంలో వున్నప్పుడు నాన్‌ లోకల్‌ అన్నట్టుగా విపరీత ప్రచారం చేశారు. బెంగుళూరు, హైదరాబాద్‌లో వుండే జగన్‌ ప్రజా సమస్యలు ఏం పట్టించుకుంటాడన్నారు. దాంతో జగన్‌ తాడేపల్లి గూడేంలో ప్యాలెస్‌ నిర్మాణం చేసుకున్నాడు. అక్కడి నుంచే ఐదేళ్లు పాలన సాగించాడు. ఇప్పుడూ అక్కడే వుంటున్నాడు. కాకపోతే అప్పుడప్పుడూ బెంగుళూర్‌ వెళ్లి వస్తున్నాడు. కాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌, మంత్రి లోకేష్‌లు ఎక్కడుంటున్నారు. వారంలో ఎన్ని రోజులు అమరావతిలో వుంటున్నారు. ఇతర జిల్లాల పర్యటనలకు వెళ్లినా, నేరుగా మళ్లీ ఎక్కడికి చేరుకుంటున్నారు. అమరావతిలో సొంత ఇల్లు వుందా? అంటే వున్నట్లు మాత్రమే..కాని నివాసం మొత్తం హైదరాబాద్‌లోనే వుంది. వారంలో ఎక్కువ కాలం హైదారాబాద్‌లోనే వుంటున్నారు. అత్యవసర పనులుంటే తప్ప అమరావతిలో నిద్ర చేయడం లేదు. ఇక పవన్‌ కల్యాణ్‌ మాత్రం ప్రొద్దున అమరావతి, రాత్రికి హైదరాబాద్‌ అన్నట్లు తిరుగుతున్నారని అంటున్నారు. రోజూ హైదరాబాద్‌ వచ్చిపోతున్నారని వైసిపి ఆరోపణలు చేస్తోంది. ప్రత్యేకంగా జెట్‌ విమానాన్ని వాడుతున్నారు. కోట్లాది రూపాయల ప్రజాదనం వృదా చేస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. వీళ్లే కాదు, ఏపి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు అంతా దాదాపు హైదరాబాద్‌లోనే వుంటున్నారు. వారికి ఎప్పటి నుంచో నివాసాలున్నాయి. అంతే కాదు వారి వ్యాపారాలు కూడా హైదరాబాద్‌లోనే వున్నాయి. రాజకీయాల వారికి ఫ్యాషన్‌ అన్నట్లు మాత్రమే సాగుతున్నాయి. ఇక ఉన్నతాదికారుల పరిస్దితి కూడా దాదాపు అదే పరిస్దితి. ఇంకా హైదరాబాద్‌నుంచి వచ్చి వెళ్లేవారు చాలా మంది వున్నారు. మీడియా కూడా అదే దారిలో సాగుతోంది. పదేళ్లయినా సరే మీడియా సంస్దలు ఏవీ ఏపికి వెళ్లలేదు. ఈటివి ఆంధ్రప్రదేశ్‌, ఈటివి తెలంగాణ అంటూ హైదరాబాద్‌ నుంచే ప్రసారాలు చేస్తున్నారు. మిగతా మీడియా సంస్ధలన్నీ హైదరాబాద్‌ నుంచే సాగుతున్నాయి. ఏపి రాజకీయాలు, పరిస్దితులు, అభివృద్ది, ప్రజా సమస్యలు అన్నీ మరింతగా జనానికి చేరాలంటే మీడియా అనేది స్దానికంగా వుండాలి. మీడియా సంస్దలు ప్రజలకు చేరువలో వుండాలి. హైదరాబాద్‌లో కూర్చొని లెక్కలు చెప్పడం మీడియా వంతైంది. హైదారాబాద్‌లో వుండే నాయకులు నిత్యం మీడియా హౌజులలో కూర్చొని, చర్చల్లో పాల్గొనడం జరుగుతోంది. ప్రజా సమస్యల మీద జరిగే మీడియా చర్చల కోసం నాయకులు విజయవాడ నుంచి వస్తుంటారు. అమరావతిలో ఎంత మీడియా యంత్రాంగం వున్నా, స్ధానికంగా మీడియా హౌజ్‌లున్నట్లు వార్తలు ప్రసారం చేయలేరు. పైగా రెండు రాష్ట్రాల వార్తల పేరుతో ఇటు తెలంగాణ వార్తలు సరిగ్గా వుండవు. అటు ఏపి వార్తలు పూర్తిగా వుండవు. ఇలా అటు రాజకీయ నాయకులు, ఇటు మీడియా అంతా హైదరాబాద్‌లో వుండి ఏపిని ఉద్దరిస్తామని చెబుతున్నారు. పదేళ్లుగా ఏపి జనం నమ్ముతున్నారు. ఇంకా ఏపిని ఎంత దూరం తీసుకెళ్తారో చూడాలి. ఏళ్లకేళ్లు రాజకీయం తప్ప, అభివృద్దిని పక్కడ పడేస్తారో చూడాలి. ఎందుకంటే తెలంగాణలో మూడేళ్లలో కాళేశ్వరం నిర్మాణం పూర్తయ్యింది. కాని పదేళ్లు దాటుతున్నా పోలవరం ఇంకా అక్కడే వుంది. అది ఎప్పుడేపూర్తవుతుందో ఎవరికీ తెలియదు. ఎక్కడ పాలన సాగాలో అక్కడే పాలకులు వుంటే అభివృద్ది, ప్రగతి వేగంగా జరుగుతుంది. ఎక్కడో వుండిపాలిస్తాం. పనులు సమీక్షిస్తాం..ప్రజలకు మేలు చేస్తామంటే ఇలాగే వుంటుంది. తెలుగులో వెరీ పాపులర్‌ సామెత ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అని చెప్పుకోవాల్సి వస్తుంది.

కూటమిలో కుతకుత!

ముదురుతున్న వివాదం!

`చిరు బాలయ్య ల సినీ రాజకీయ సంవాదం.

`నిన్న మౌనం.. నేడు నిజం!?

`తమ్ముడి రాజకీయం కోసం అన్న మౌనం దాల్చారు

`బాలయ్య కెలికితే ఇప్పుడు చిరు నోరు విప్పారు!

`తమ్ముడి రాజకీయాన్ని మొదటికే మోసం తెచ్చారు!

`ఎటు దారి తీస్తుందో అని పవన్‌ ఆందోళన.

`బాలయ్య మీద కేసులకు చిరు అభిమానులు సై.

`క్షమాపణకు బాలయ్య నై.

`ఐ డోంట్‌ కేర్‌ అంటున్న బాలయ్య.

`నాటి నుంచి ఇద్దరి మధ్య ఆధిపత్య సంవాదం!

`సినిమా పరిశ్రమలో అడుగడుగునా పోటీ తత్వం!

`అప్పుడూ బాలయ్యది పై చేయి కాలేకపోయింది!

`ఇప్పుడూ తన గొప్ప దనం గుర్తించడం కష్టంగా మారింది.

`చిరుతో ఎంత పోరాడినా గెలవలేకపోయిన బాలయ్య.

`ఇప్పుడు పవన్‌ లేకుండా రాణించలేకపోతిమన్న బాధ.

`మూడు సార్లు గెలిచినా మంత్రి కాలేకపోయిన బాలయ్య.

`మొదటి సారే చిరంజీవి కేంద్ర మంత్రి అయ్యారు.

`పవన్‌ కళ్యాణ్‌ ఏకంగా డిప్యూటీ సిఎం అయ్యారు.

`ఈ అంతరం ఇప్పటిది కాదు!

`రాజకీయ దోస్తీ కుదిరినా సమసిపోదు!

`ముదురుతున్న వివాదం! 

`పనిగట్టుకు వ్యవహారం!

`మేం వేరు..మా బ్రీడ్‌ వేరు అనుకునే రకం బాలయ్య.

`మంచి వాణ్ణి తిడతాను..చెడ్డ వాణ్ణి పొగుడుతాననే బాలయ్య.

`అంతా రివర్స్‌ కేసు బాలయ్య.

`నేనొక్కడినే మూడు సార్లు గెలిచానని చిరు మీద చురకలు.

`అహంభావం నిండిన మాటల తూటాలు.

హైదరాబాద్‌, నేటిధాత్రి: 

కూటమిలో కుంపటి రగిలింది. లోలోన కుతకుతలాడుతోంది. అటు తిరిగి, ఇటు తిరిగి సమస్య జనసేన మెడకు చుట్టుకునే పరిస్దితి కనిపిస్తోంది. ఇంతకీ తప్పు ఎవరిది? బాలయ్యదా? చిరంజీవిదా? అంటే నిన్నటి దాకా బాలయ్యది తప్పన్న వాళ్లు కూడా ఇప్పుడు చిరంజీవిది తప్పనే మాట కూడా వినిపిస్తోంది. అసెంబ్లీలో బాలయ్య వ్యాఖ్యలు చేసిన రోజున చిరంజీవి స్పందన బాగుందని చర్చలు జరిగాయి. అది వైసిపికి చాల ప్లస్‌ అయ్యింది. బాలయ్య నోరు జారాడన్న మాటలు ఎక్కువగా వినిపించింది. వైసిపి అదికారిక పత్రిక సాక్షి కూడా చిరంజీవిని హైలెట్‌ చేసింది. అంటే ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అనే తరహాలు వార్తలు వడ్డించింది. వంటకం బాగా కుదిరింది. అంతే చిరంజీవి వదలిన బాణం బాలయ్య కన్నా, ఎక్కువగా తమ్ముడు ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌కు తగిలినట్లుంది. దాంతో పవన్‌ అటు బాలయ్యను నిందించలేక, అన్నయ్యను వెనకేసుకు రాలేక ఊపిరాడని పరిస్దితిలోకి నెట్టేసినట్లైంది. పుండు మీద కారం చల్లినట్లు మరునాడు ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, స్వయంగా పవన్‌ కల్యాణ్‌ ఇంటికి వెళ్లి చర్చలు జరపడంతో రాజకీయం మరో మలుపు తిరిగింది. రాజకీయ చాణక్యంతో పవన్‌ నోరు మూయించేందుకు చంద్రబాబు వేసిన ఎత్తుగడ ఫలించింది. ఫలితంగా జనసేన శ్రేణులను సముదాయించలేక, ఇటు బాలయ్యపై నిప్పులు కక్కలేక పవన్‌ మౌనం దాల్చాల్సి వచ్చింది. కొన్ని సార్లు మౌనంకూడా సమాదానం కావొచ్చు? కాకపోవచ్చు? కాకరేగడానికి కారణం కావొచ్చు? ఇప్పుడు అదే జరిగింది. ఇంత రచ్చ జరుగుతుంటే పవన్‌ కల్యాణ్‌ సైలెంట్‌గా వుండడాన్ని చిరంజీవి అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. మీడియా కూడా సైలెన్స్‌ గంభీర అంటూ వార్తలు రాయడంతో పవన్‌ మనసు అల్లకల్లోలమౌతుందంటున్నారు. ఎందుకంటే బాలయ్య ఒక రకంగా చెప్పాలంటే అదును చూసి గిల్లాడు. కాకపోతే ఆయనకు ఎప్పటినుంచో మంట వుంది. ఆ మంట తీర్చుకోకుండా వుండే రకం కాదు బాలయ్య. ఎందుకంటే దేనికైకా డోంట్‌ కేర్‌ అనే వ్యక్తిత్వం బాలయ్యది. పైగా మేం వేరు. మా బ్రీడ్‌వేరు అని పదే పదే చెప్పడం ఆయనకే చెల్లింది. నన్నెవరు ప్రశ్నించేది అని కూడా అనేకసార్లు అన్నాడు. ఆయన వాడే ప్రాసల్లో కూడా అనేక సార్లు తప్పులు దొర్లాయి. అయినా ఆయన ఎప్పుడూ వివరణ ఇచ్చుకున్నది లేదు. కొందరు బాలయ్యను బోలా మనిషి అంటారు. నచ్చని వాళ్లు ఇగో ఎక్కువ అంటారు. అయినా దేన్ని పట్టించుకోకపోవడమే ఈ వివాదాన్ని మరింత రెచ్చగొడుతోంది. అసెంబ్లీలో లేని సమస్యను ప్రస్తావించిన ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌ తప్పు జరిగింది. క్షమించమన్నాడు. తన వ్యాఖ్యలను అసెంబ్లీ రికార్డుల్లోనుంచి తొలగించాలని కోరారు. కాని బాలయ్య ఇంత వరకు నోరు మెదపలేదు. దానిపై ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానని కూడా చెప్పలేదు. నిజం చెప్పాలంటే బాలయ్య బంతిని తన్నేశారు. చిరంజీవి ఆ బంతిని తన కోర్టులోకి తీసుకున్నాడు. అంటే చిరంజీవి సెల్ప్‌ గోల్‌ చేసుకున్నాడు. కరోనా సమయంలో జరిగిన కథ ఇప్పుడు ముందుకు తెచ్చుకున్నాడు. వాల్తేరు వీరయ్య కోసం ఆనాడు జరిగింది ఇప్పుడు ముందేసుకున్నాడు. తనకు తానుగా రాజకీయ చక్రంలో చిరు ఇరుక్కున్నాడు. నిన్నటి దాక చిరంజీవి ఎంతో గొప్ప వాడు అన్నారు. అవును చిరంజీవి ఆనాడు ఏం చేశాడని ఇప్పుడంటున్నారు. నిజానికి ఏపి మాజీ ముఖ్యమంత్రి జగన్‌ చిరంజీవికి ఎక్కడా అవమానం చేయలేదు. చిరంజీవిని తన ఇంటికి భోజనానికి పిలిచాడు. అన్న అంటూ సంబోధించాడు. మర్యాదలు చేశాడు. సన్మానం కూడా చేశాడు. అదే సమయంలో చిరంజీవి సినీ ఇండస్త్రీ కోసం చెప్పిన విషయాలు సావదానంగా విన్నాడు. పది మంది సినీ పెద్దలను చిరంజీవి తీసుకొని వెళ్తే వారితో జగన్‌ చర్చలు జరిపారు. సనీ పరిశ్రమకు ఏది కావాలంటే అది చేస్తానన్నాడు. అందరికీ ఇంటి స్ధలాలిస్తానన్నాడు. ఎంత మంది స్టూడియోలు పెట్టుకుంటామన్నా అందరికీ భూములిస్తామన్నాడు. కనీసం 30శాతం షూటింగ్‌లైనా ఏపిలో చేయమని రిక్వెస్టు చేశాడు. అందర్నీ పేరు పేరున పలకరించాడు. ఇంతకన్నా ఏం చేస్తారు. ఈ ఎపిసోడ్‌ అంతా మర్చిపోయారు. కాని చిరంజీవితోపాటు వెళ్లిన బృందమంతా నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చిందన్న విషయాన్ని అటుమీడియా, ఇటు సినీ రంగం హైలైట్‌ చేసింది. మురళీ మోహన్‌ లాంటి వారు మాట్లాడిన మాటలకు అంతే లేదు. ఆ అంశాన్ని రెండేళ్లపాటు పవన్‌ కాళ్యాన్‌ తన రాజకీయానికి వినియోగించుకున్నాడు. తన అన్నను జగన్‌ అవమానించడని పదే పదే అనేక సభల్లో ఉటంకించాడు. జగన్‌ అందరికీ తెలియకపోవచ్చు. కాని చిరంజీవి అంటే ప్రపంచంలోఅందరికీ తెలుసున్నట్లు మాట్లాడుతూ వచ్చాడు. తన అభిమానులను రెచ్చగొట్డాడు. ఆ సమయంలో చిరంజీవి నోరు మెదపలేదు. నీ రాజకీయం కోసం నన్ను వాడుకోకు అని వారించలేదు. ఆనాడు తమ్ముడి కోసం అన్న మౌనం వహించాడు. పరిశ్రమకు పెద్ద అని అందరూ గౌరవిస్తుంటే, దృతరాష్టుడి పాత్ర చిరంజీవి పోషించారు. అప్పుడు తన తమ్ముడు గెలవడమే కోరుకున్నాడు. జగన్‌ను ఎన్ని సార్లుపవన్‌ తిడుతున్నా తప్పని చెప్పలేదు. జరిగింది ఇదీ అని చెప్పలేదు. పవన్‌ను వారించలేదు. కాని ఇప్పుడు బాలయ్య ఒక్కమాట అనగానే చిరంజీవికి పొడుకొచ్చిందా? అని అంటున్నారు. ఈ మాట అప్పుడెందుకు చెప్పలేదు. ఇప్పుడెందుకు చెప్పినట్లు? అనే ప్రశ్నల వర్షం చిరంజీవి మీద కురుస్తోంది. అమెరికా నుంచి చిరంజీవి హైదరాబాద్‌ చేరుకునే సమయంలో ఆయన అభిమానులు బ్లడ్‌ బ్యాంకులో సమావేశం నిర్వహించారు. బాలయ్య మీద తెలంగాణలోని 300 పోలీస్‌ స్టేషన్లలో పిర్యాదులు చేయాలనుకున్నారు. అలాంటి పనులు చేయొద్దని చిరంజీవి సూచించినట్లు మరో వార్త వచ్చింది. ఇక్కడ కూడా చిరంజీవి మళ్లీ ఆలస్యమే చేశారు. తన అభిమానులు బ్లడ్‌ బ్యాంకులో సమావేశం నిర్వహిస్తున్న సంగతి చిరంజీవికి తెలియదా? చిరంజీవికి సమాచారం లేకుండానే అభిమానులు సమావేశమయ్యారా? ఇది జనాన్ని నమ్మమంటారా? అయినా ఏపిలో జరిగిన సమస్యకు తెలంగాణలో కేసులు నమోదు చేసే యోచన ఏమిటో అర్ధం కాని విషయం. ఏపి సమస్యకు, తెలంగాణకు ఏం సంబంధం? సమస్యను పక్కదారి ఎలాపట్టించాలో చిరంజీవికి కూడా అర్ధం కావడం లేదు. అయినా అసెంబ్లీలో బాలయ్య నోరు జారింది జగన్‌ మీద. కాని చిరంజీవి తన మీద ఎందుకు వేసుకున్నట్లు? తన పెద్దరికం పోతుందన్న భయంతో తానే గొప్ప అనిపించుకోవాలనుకున్నాడు. తాను సౌమ్యుడినని మరోసారి నిరూపించుకోవాలనుకున్నాడు. కాని డామిట్‌ కథ అడ్డం తిరిగింది. చిరంజీవి అభిమానులు కేసుల విషయం తెరమీదకు తెచ్చి బాలయ్య అభిమానులు కెలికారు. ఇప్పుడు బాలయ్య అభిమానులు మరోసారి రంగంలోకి దిగే ప్రయత్నం చేస్తున్నారు. అంతే కాకుండా పవన్‌ కల్యాణ్‌కు, జనసేన శ్రేణులకు మధ్య కూడా గ్యాప్‌ వచ్చేలా వుంది. చిరంజీవి వాఖ్యలు పరోక్షంగా పవన్‌కే ఇబ్బందులు సృష్టించాయి. అయినా పవన్‌ స్పందించకోవడాన్ని జనసేన శ్రేణులు జీర్ణించుకోలేకేపోతున్నారు. అటు వాళ్లు కుతకుతలాడిపోతున్నారు. పవన్‌ నోరు తెరిస్తే బాగుండు అనుకుంటున్నారు. కాని పవన్‌ నోరు మెదపడంలేదు. ఓజి గంభీరలో ఊగిపోతూ డైలాగులు చెప్పినట్లు, బాలయ్య విషయంలోనూ స్పందించాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాని ఆయన నోరు తెరుస్తున్నది లేదు. నాయకులు బాగానే వున్నారు. అభిమానులు ఊగిపోతున్నారు. పవన్‌ స్పందన లేకపోవడంతో జనసేన అభిమానులు బాలయ్యనేకాదు, చిరంజీవిని సైతం తప్పు పడుతున్నారు. చిరంజీవి స్పందన సమయం సందర్భం లేకుండా వుందన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి.

ఓ మనిషీ మేలుకో..వెర్రి అభిమానం మానుకో!

నీ వాళ్లు కాని వారి పట్ల విపరీతాభిమానం ఆపుకో!

`ప్రాణమా! అభిమానమా ముందు తేల్చుకో?

`ప్రచారాలలో ప్రాణాలు బలి కాకుండా కాపాడుకో!

`ర్యాలీలు, సభలకు వెళ్లితే వచ్చే లాభమేముండదని తెలుసుకో!

`తొలి రోజే సినిమా చూడకపోతే కొంపలేమీ మునిగిపోవు.

`దొంగ బాబాల పాద దూళితో తలరాత మారదు.

`నాయకులు, హీరోలు దేవుళ్లు కాదు.

`వాళ్ల మాయలోపడి ప్రాణాల మీదకు తెచ్చుకోకు.

`అతి ప్రచారం ప్రజల ప్రాణాలకు హేతుకం.

`అభిమానం వెర్రితలలు వేస్తే ప్రాణాల మీదకు వస్తుంది.

`ఆధ్యాత్మిక ప్రచారాలలో అపశ్రుతులే!

`పుష్కారాలలో ప్రాణాలు పోవడమే!

 

`ర్యాజకీయ ర్యాలీలలో తొక్కిసలాటలు.

 

`సినీ హీరోల వల్ల పోతున్న ప్రాణాలు.

`ఏదో రకంగా ప్రజల ప్రాణాలు పోగొడుతున్నారు.

`తప్పు మాది కాదని తప్పించుకుంటున్నారు.

`తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చుతున్నారు?

`తాజాగా తమిళనాడు లో 40 మంది చనిపోయారు.

`అతిసర్వత్రే వజ్రయేత్‌ అని తెలిసినా జనం వినరు.

`జనాల ప్రాణాలు పోతున్నా ప్రచారాలు మానుకోరు.

`పని లేని యువత పెరిగిపోతున్నారు.

`బాధ్యతలు విస్మరించి జీవితాలు ఆగం చేసుకుంటున్నారు.

`తల్లిదండ్రులు కూడా అలాగే తయారౌతున్నారు.

`పిల్లల విషయంలో అతి స్వేచ్చనిచ్చి చెడగొడుతున్నారు.

హైదరాబాద్‌, నేటిధాత్రి:

ప్రజాభిమానం వెర్రితలలు వేస్తోంది. ప్రతి వ్యక్తికి తనకు తాను మించిన అభిమానం లేదు. ఇతరులను అభిమానించడం అంటే దానికి ఓ హద్దు వుంటుంది. హద్దూ బద్దు లేని ఏ అభిమానమైనా సరే అది వ్యర్ధం. ఇది ఇంకా ఇప్పటి యవత తెలుసుకోవడం లేదు. మరింతగా లేనిపోని అభిమానాన్ని నెత్తిన పెట్టుకొని ప్రాణాల మీదకు తెచ్చుకుంటోంది. పిల్లలు అలాగే వున్నారు. యవత అలాగే తయారౌతోంది. మధ్య వయసలు వ్యక్తులకు కూడా జీవితానుభవాలు రావడం లేదు. దురదృష్టమిటంటే ఇప్పటి ప్రజలకు మంచి కన్నా చెడు ఎక్కువగా నచ్చుతోంది. అబద్దం అందగా కనిపిస్తోంది. అసలు యువత ఎవరికోసం బతుకుతున్నారు? ఎందుకు బతుకుతున్నారు? ఎవరి కోసం బతకాలి? అన్నదానిలో కూడా క్లారిటీ లేకుండాపోతోంది. తల్లిదండ్రులు అలాగే తయారయ్యారు. పిల్లలు అదే బాటలో నడుస్తున్నారు. రాజకీయాలు వున్నది ప్రజల కోసం. కాని ప్రజలున్నది రాజకీయ పార్టీల కోసం, నాయకుల కోసం అన్నట్లుగా తయారౌతోంది. సినిమా అనేది ఒక వినోదం. దానిని అంత వరకు పరిమితం చేసుకుంటే బాగుంటుంది. కాని హీరోలు దేవుళ్లుగా కొలుబడుతున్నారు. అభిమాన హీరోల సిమాలు వినోదంగా కాకుండా ఆధిపత్యం కోసం తీస్తున్నట్లున్నారు. అభిమానులు కూడా హీరోలను నిలబెట్టేందుకు సినిమాలు చూస్తున్నట్లున్నారు. హరోల కోసం ప్రాణాలను కూడా లెక్క చేయడకుండా వెర్రి అభిమానం పెంచుకుంటున్నారు. ఇక దైవ భక్తి ముసుగులో దొంగబాబాలు విపరీతంగా తయారౌతున్నారు. అసలు ఎవరు ఎందుకు బాబాలుగా మారుతున్నారో? జనం వారిని ఎందుకు కొలుస్తున్నారో కూడా అర్దం కావడం లేదు. కొన్ని రోజులు పోతే గల్లీకో బాబా తయారైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. అసలు ఆ బాబల వల్ల జరుగుత్ను నష్టాలు తెలుసు. కష్టాలు తెలుసు. అయినా మోస పోతున్నారు. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తమ పిల్లలను ఆటలాడనివ్వరు. కాని ఆటలాడిన క్రీడాకారులను చూసేందుకు మాత్రం జనం ఎగబడుతున్నారు. ప్రేక్షకులుగా మారి పోతున్నారు. వారిపై అభిమానం పెంచుకుంటున్నారు. వేల రూపాయల టిక్కెట్లు కొని క్రీడలు చూస్తున్నారు. క్రీడల్లో గెలిచిన వారిని కీర్తిస్తున్నారు. ఇంత వరకు బాగానే వుంది. కాని వారిని ఆదర్శంగా తీసుకొని దేశానికి ఎంత మంది పేరు తెస్తున్నారు? ఎంత మంది క్రీడల్లో రాణిస్తున్నారు. 140 కోట్ల జనాలున్న మన దేశంలో కనీసం కోటి మందైనా దేశానికి పేరు తెచ్చే క్రీడాకారులుండాలి. కాని వున్నారా? లేరు. కాని వారిని అభిమానించే వాళ్లు మాత్రం కోట్లలోవుంటున్నారు. ఇదే ప్రమాదకరంగా మారుతోంది. మొత్తంగా రాజకీయ సభలు ప్రాణాల మీదకు వస్తున్నాయి. బాబాల ఆధ్యాత్మిక సభలు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. సినిమాలు ప్రాణాలు తీస్తున్నాయి. అయినా జనం తండోపతండాలుగా వెళ్లడం మానడం లేదు. ప్రాణాల మీదకు తెచ్చుకోవడం ఆపుకోవడం లేదు. నాకేమౌతుందలే అనే ధీమా? కావొచ్చు. కాని ఏ క్షణం ఏమౌతుందో అనే భయం కూడా వుండాలి. అయినా ఒక నాయకుడు సభలు పెడితే ఎందుకు వెళ్లాలి? ఎందుకు వారిని చూసేందుకు ఎగబడాలి? ఒకప్పటి రాజకీయాలు వేరు. ఇప్పుడు రాజకీయాలు వేరు. ఒకప్పుడు నాయకులు ప్రజల్లోకి వస్తున్నారంటే ప్రజలకు భరోసా కోసం వచ్చేవారు. రాష్ట్రం, దేశ భవిష్యత్తు కోసం రాజకీయాలు చేసేవారు. ప్రజలను చైతన్యం చేసేవారు. కాని ఇప్పుడు నాయకులు ప్రజా ప్రతినిధులు కావడానికి మాత్రమే ప్రజల్లోకి వస్తున్నారు. పాలకులుగా మారి, ప్రజలను ఏలేందుకు మాత్రమే ప్రచారాలు సాగిస్తున్నారు. అంతే తప్ప ఏ ఒక్కపార్టీకి అంకితభావంలేదు. ప్రజా సేవ చేయాలన్న తలంపు వున్నట్లు కనిపించడం లేదు. ఆధిపత్య రాజకీయాల్లో జనాన్ని చూపించి మభ్య పెట్టేందుకు, ప్రజల ఆలోచనలు మార్చేందుకు తప్ప సభలు, సమావేశాలలో ఒరుగుతున్నదేమీ లేదు. ఈ మధ్య కాలంలో ఇలాంటి సభలు, సమావేశాల మూలంగా జరిగిన అపశ్రుతులు అన్నీ ఇన్నీ కావు. బోలే బాబా అనే ఓ వ్యక్తి పాద దూళి కోసం జనం పాకులాడడమేమిటి? ఆ బోలే బాబా కాలుకింద మట్టితో తల రాత మారడమేమిటి? జనంలో చైత్యన్యం పెరుగుతోందా? తరుగుతోందా? అంటే ఈ ఒక్క సంఘటన చాలు. బోలేబాబా పాదం కింద మట్టేమో? కాని 120 మంది ప్రాణాలో కోల్పోయారు. మట్టిలో కలిసిపోయారు. బోలే బాబా పాదం తాకిన దూళితో జీవితాలు మారుతాయనుకున్నారు. కాని ప్రాణాలే కోల్పోయారు. అయినా జనం మారరు. వారి పిచ్చి భక్తి ఆపుకోరు. అడ్డదారిలో అదృష్టం ఎప్పుడూ రాదు. వచ్చినా అది ఎవరి వల్లనో వచ్చేది కాదు. ఏ బాబా దీవిస్తే వచ్చే పరిస్ధితి వుండదు. వచ్చే అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు. లేని అదృష్టాన్ని ఎవరూతెచ్చి పెట్టలేరు. ఇది జనం తెలుసుకోవాలి. ప్రజలకు దేవుడి మీద భక్తి వుండాలి. దేవుణ్ణి కొలుచుకోవాలి. దేవుణ్ణి కాదనుకొని, బాబాల వెంట పడితే వచ్చేది ఏమీ వుండదు. సినిమా హీరోలేమీ దేవుళ్లు కాదు. వాళ్లను చూకపోతే జీవితం వ్యర్ధమేమీ కాదు. వాళ్లు కూడా మనలాంటి మనుషులే. కాని వాళ్లపై పెంచుకున్న అభిమానం ప్రాణాల మీదకు వచ్చినా జనానికి కనువిప్పు కలగడం లేదు. 140 సంవత్సరాల తర్వాత వచ్చిన మహా కుంభమేళాకు వెళ్లిన వారిలో ఎంత మంది చనిపోయారో కూడా లేక్కలేదు. అక్కడ జరిగిన తొక్కిసలాటలో మహరాష్ట్రకు చెందిన ఓ మంత్రి కూడా చనిపోయారు. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ మధ్య పుష్ప సినిమా చూసేందుకు వచ్చిన రేవతి అనే మహిళ సంధ్య ధియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో చనిపోయారు. ఆమె కుమారుడు ఇప్పటికీ ఆరోగ్యం కుదటపడలేదు. అయినా సినిమా మొదటి రోజు చూడకపోతే నష్టమా? సినిమాలో వుండేదంతా నాటకమే? అని తెలుసు. సినిమా అంతా అబద్దమే అని తెలుసు. అందులో హీరో చేసే పనులు, సాహసాలు విజిఎఫ్‌ ఎఫెక్టులే అని తెలుసు. అయినా జనం ఎందుకు తయారౌతున్నారో అర్దం కావడం లేదు. 2016లో గోదావరి పుష్కరాలు వచ్చాయి. ఆ సమయంలో ఏపిలో జరిగిన తొక్కిసలాట గురించి జనం అప్పుడే మర్చిపోలేదు. ఆ సమయంలో రాజకీయ నాయకులు, పాలకులు చేరి తొలి స్నానాలు చేయడమేమిటో? వేలాదిగా వున్న జనం ముందుకు రావడమెందుకు? ప్రజల ప్రాణాలు పోయే పరిస్టితులు సృష్టించడమెందుకు? ఈ మధ్య కూడా అలాంటి సంఘటనలు అనేకం జరిగాయి. అయినా జనానికి ఏ మాత్రం పట్టడం లేదు. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి రోజున దర్శనం కోసం వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ మధ్య సింహాచలం అప్పన్నస్వామి ఆలయంలో గోడ కూలి భక్తులు చనిపోయారు. ఐపిఎల్‌ కప్‌ గెల్చుకున్న ఆర్‌బీసి విజయోత్సవాలను నిర్వహించి బెంగులూరులో 30 మంది అభిమానులు చనిపోయారు. ఆ మధ్య ఏపిలో లోకేష్‌ పాదయాత్ర సమయంలో జరిగిన తొక్కిసలాట, చంద్రబాబు సభలల్లో జరిగిన మరణాలు చూశాం. తాజాగా తమిళనాడులో హీరో దళపతి విజయ్‌, కరూర్‌ సభలో ఏకంగా 40 మంది అభిమానులు తొక్కిసలాట జరిగి చనిపోయారు. ఆ హీరో ఏమీ దేవుడు కాదు. రాజకీయ పార్టీ పెడుతున్నాడు. ఆయన పార్టీ నిర్ణయాలు నచ్చితే ఓటు వేయండి. లేకుంటే వదిలేయండి. కాని ఆ నాయకుడిని ప్రత్యక్షంగా చూస్తే వచ్చేదేముంటుంది? అలాంటి సభలకువెళ్లకుండా వుండలేరా? అభిమానానికి కూడా ఓ హద్దు వుండాలి. అది దాటితే ప్రమాదమే జరుగుతుంది. విజయ్‌సభలో జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన జనం గురించి నాలుగు రోజులైతే అందరూ మర్చిపోతారు. రాజకీయ పార్టీలు ఒకరినొకరు విమర్శలుచేసుకుంటారు. కేసులు నమోదు చేస్తారు. తర్వాత అంతా మర్చిపోతారు. యధావిధిగా విజయ్‌ పర్యటనలు సాగుతూనే వుంటాయి. ప్రచారాల హోరు సాగుతూనే వుంటుంది. జనం మళ్లీ, మళ్లీ తండోపతండాలుగా వెళ్తూనే వుంటారు. ఇక్కడ ఎవరిదితప్పు అనే ప్రశ్నలెన్ని వున్నా, సమాదానం మాత్రం దొరకదు. ఎందుకంటే బోలేబాబాపై కేసులుండవు. పుష్కరాలలో తొక్కిసలాటకు కారణమైన వారి మీద చర్యలుండవు. క్రికెట్‌ విజయోత్సవాన్ని నిర్వహించిన వారిపై కేసులు పెట్టింది లేదు. ఎవరినీ శిక్షించింది లేదు. జనంలో మార్పు వస్తుందన్న నమ్మకం అసలే లేదు. అయ్యో పాపం అని మీడియా వార్తలు రాయడం తప్ప మరేమీ జరగడం లేదు. ఆ వార్తలను కూడా చదివి అయ్యో! అనుకున్నవాళ్లే సభలకు, సమావేశాలకు, బాబాల వద్దకు వెళ్లేందుకు ముందుంటారు. ఇదీ మన దౌర్భాగ్యం. ఇంతకన్నా తిట్టుకోవడం అనవసరం! మనం మారం!! సభలకు వెళ్లకుండా వుండలేం!!అది మన బలహీనత. ప్రాణాలకన్నా అభిమానమే ఎక్కువ!!!

నర్సంపేట ప్రైవేట్ ఆస్పత్రులకు అగ్నిమాపక అనుమతుల్లేవ్..

*ప్రైవేట్ ఆస్పత్రులలో అగ్నిమాపక శాఖ అధికారుల తనిఖీలు*

*నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ హాస్పిటల్స్..*

*జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి శ్రీధర్ రెడ్డి*

*పావని నర్సింగ్ హోమ్, వీఎన్ఆర్ నర్సింగ్ హోమ్, మమతా హాస్పిటల్, మల్లికా హాస్పిటల్,దివ్యశ్రీ హాస్పిటల్ ల తనిఖీలు*

*నర్సంపేట,నేటిధాత్రి:*

నర్సంపేట పట్టణంలో గల ప్రైవేట్ ఆస్పత్రులకు అగ్నిమాపక శాఖ నుండి ఏలాంటి అనుమతుల్లేవని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీధర్ రెడ్డి తెలిపారు.వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో గల ప్రైవేట్ ఆస్పత్రులలో జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. పలు ప్రైవేటు ఆసుపత్రులకు పర్మిషన్స్ లేకపోవడం వల్ల ఆయా ఆస్పత్రులపై జిల్లా అధికారులు ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీధర్ రెడ్డి స్థానిక నర్సంపేట అగ్నిమాపక శాఖ అధికారితో కలిసి శనివారం నర్సంపేట పట్టణంలోని పావని నర్సింగ్ హోమ్, వీఎన్ఆర్ నర్సింగ్ హోమ్, మమతా హాస్పిటల్, మల్లికా హాస్పిటల్,దివ్యశ్రీ హాస్పిటల్ ల తనిఖీలలో తనిఖీలు చేసి సంబంధిత 

ఫైర్ సేఫ్టీ నిబంధనల ప్రకారంగా ఆసుపత్రుల నిర్మాణాలను కొలతలు వేశారు. సెట్ బ్యాక్, అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు తక్షణ చర్యలకు అనుకూలంగా ఉన్నాయా లేదా అని విషయంలో క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ 

రాష్ట్ర మొత్తం అగ్నిమాపక శాఖ ఒకే రకమైన నిబంధనలు ఉంటాయని తెలిపారు.జీవో 168 ‌.. 2016 సంవత్సరం ప్రకారం 

నేషనల్ బిల్డింగ్ కోడ్ ఆఫ్ ఇండియా, రాష్ట్ర ప్రభుత్వం అగ్నిమాపక శాఖ సంబంధిత సేఫ్టీ పట్ల పనిచేస్తామన్నారు.భవనాలు నిర్మాణాల పట్ల టౌన్ ప్లానింగ్ అధికారులతో శాఖకు ఎలాంటి సంబంధం ఉండదని వీల్చ చెప్పారు..మున్సిపాలిటీ,టౌన్ ప్లానింగ్ అనుమతులకు ముందు అగ్నిమాపక శాఖ నుండి ప్రొహిబిషన్ ఎన్ఓసి తీసుకోవాలి.నిర్మాణాలు చేపట్టే ముందు భవనం ప్లానింగ్ లో ఏమైనా తేడాలు ఉంటే ప్లాన్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది భవన నిర్మాణం పూర్తయిన తర్వాత నిబంధనల ప్రకారం సెట్ బ్యాక్ ‌ఉంటే అక్యుపేన్సి ఎన్ఓసి సర్టిఫికెట్ ఇస్తామని పేర్కొన్నారు. సెట్ బ్యాక్ ప్రకారంగా భవనం పక్కన గల రోడ్డు తోటి ఎలాంటి సంబంధం ఉండదు .. భవనం చుట్టూ ఉన్న ప్రహరీ గోడల ప్రకారంగానే కొలతలు నిర్ధారణ చేస్తామని ఆయన వివరించారు.అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ప్రైవేటు వ్యక్తులకు ఎలాంటి లైసెన్సు అనుమతులు ఇవ్వలేదు వారి నుండి లైసెన్స్ ను పొందేవారికి ఎన్ఓసిలు ఇచ్చే అనుమతులు ఉండవన్నారు.

ప్రస్తుతం నర్సంపేట పట్టణంలో గల పావని నర్సింగ్ హోమ్, వీఎన్ఆర్ నర్సింగ్ హోమ్, మమతా హాస్పిటల్, మల్లికా హాస్పిటల్,దివ్యశ్రీ హాస్పిటల్ గల ఐదు ఆసుపత్రులలో ఫైర్ సేఫ్టీ పట్ల తనిఖీలు చేసి అందుకు అనుగుణంగా ఉన్నాయా లేదా అని కోణంలో తనిఖీలు చేపట్టాము. ప్రభుత్వం నిబంధనల ప్రకారము ఏ ఒక్క ఆసుపత్రి కూడా లేవు. సెట్ బ్యాక్ లు లేవు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు లేవు. వీటికి అగ్నిమాపక శాఖ నుండి అనుమతులు రావని తేల్చిచెప్పారు.

కమర్షియల్ తో పాటుగా రెసిడెన్షియల్ గా కలిసి ఉండే భవనాలకు కూడా అనుమతులు ఉన్నా కూడా ఫైర్ సేఫ్టీ కోసం మాత్రమే పరిగణలోకి తీసుకొని నిబంధనల ఉంటేనే ఎన్ఓసి ఇస్తామని పేర్కొన్నారు. నర్సంపేట డివిజన్ పరిధిలో గల అన్ని ప్రైవేటు ఆసుపత్రుల ఫైర్ సేఫ్టీ పట్ల పూర్తిస్థాయిలో త్వరలో విచారణ చేస్తామని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీధర్ రెడ్డి తెలిపారు.

త్వరలో.. శీనన్న సినిమా.

 

`మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి బయోగ్రఫీ.

`యువతకు ఆదర్శంగా తెరకెక్కనున్న సినిమా.

`శీనన్న బాల్యం.. విద్యాబ్యాసం.

`శీనన్న పట్టుదల, కార్యదీక్ష..

`కష్టపడి జీవితంలో ఎదిగిన విధానం.

`ఉమ్మడి కుటుంబ వ్యవస్థ గొప్పదనం.

`వ్యాపారంలో ఆరంగేట్రం…

`సక్సెస్‌పుల్‌ పారిశ్రామిక వేత్తగా విజయం.
`ప్రజా జీవితం… రాజకీయం.

`ప్రజాసేవలో శీనన్న.

`ప్రజామోదంతో ఎన్నికల విజయాలు.

`వైసిపి తెలంగాణ అధ్యక్షుడి పాత్ర.

`ఆ ఎన్నికలలో విజయాలు.

`తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు.

`కాంగ్రెస్‌ పార్టీ కోసం శీనన్న కృషి.

`కాంగ్రెస్‌ విజయంలో శీనన్న పాత్ర.

`మంత్రిగా శీనన్న సంస్కరణలు.

`తన శాఖలలో విజయాలు.

`ఖమ్మం జిల్లా అభివృద్ధి.

హైదరాబాద్‌, నేటిధాత్రి:
రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి బయోగ్రఫీతో కూడుకు న్న సినిమా శీనన్న తెరకెక్కనుంది. త్వరలో సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది. ఈ సినిమా ఆధ్యంతం స్పూర్తిదాయకమైన ఒక వ్యక్తి జీవితం ఎలా వుంటుందో చూపించే ప్రయత్నం జరగ నున్నది. అంతే కాకుండా అటు సినీ నిర్మాణ విలుల తోపాటు, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి జీవితం మీద అధ్భుతమైన కధతో సినిమా తెరకెక్క నున్నది. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి జీవితంగా ఆదర్శ ప్రాయమైంది. ఆయన బాల్యం నుంచి మొదలు కొని, చదువు, కుటుంబ విలువలు, కుటుంబాన్ని నిలబెట్టిన తీరు, వ్యాపారం, ప్రజా సేవ, రాజకీయాలు, మంత్రిగా బాధ్యతలు, రాజకీయ పార్టీలలో ఆయన పోషించిన పాత్ర ఇలా అనేక రకాలైన డైమెన్షన్స్‌తో కూడుకున్న సినిమా నిర్మాణం జరగనున్నది. ఎందుకంటే ఆయన ఎలా కష్టపడి పైకొచ్చారు. జీవిత లక్ష్యం ఎలా నిర్ధేశించుకున్నారు. వ్యాపార రంగంలో ఎలా అడుగుపెట్టారు. అక్కడ ఎలా విజయాలు సాదించారు. చిన్న వయసులోనే ఆయన ఉన్నత స్దానానికి ఎలా చేరుకున్నారు. చేసే పనుల్లో ఆయనకు వుండే నిబద్దత వంటి అంశాలన్నీ మేళవించి వుంటాయి. ప్రజాసేవలో ప్రజలతో ఎలా మమేకయ్యారు. రాజకీయాల్లోకి ఎలా చేరుకున్నారు. ఆయన రాజకీయ ప్రస్తానంపై ప్రేక్షకులు, ప్రజలను ఆకట్టుకునే రీతిలో నిర్మాణం సాగనున్నది. సహజంగా ఒక వ్యక్తి ఎదిగిన తీరు కూడా ప్రజలకు ఆదర్శం కావాలి. అలా ఉన్నత విలువలు కలిగిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాజకీయం గురించే చాల మందికి తెలుసు. కాని ఆయన ఎదిగిన విధానం, నిబద్దత ఎంత గొప్పది కూడా తెలియాల్సి వుంది. ఆయన నమ్మకం ఎంత బలమైంది. ఆయన నమ్మిన వారు ఎలా మోసం చేశారు? అనేది కూడా సినిమాలో చూపించే అవకాశాలున్నాయి. నిజం చెప్పాలంటే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాజకీయల్లోకి వచ్చే వరకు ఆయన ఎవరో అనేది ప్రపంచానికి పెద్దగా తెలియదు. కాని ఖమ్మం ప్రజలకు ఆయన గురించి తెలుసు. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అంటే ఎవరు? అనేది ప్రపంచానికి తెలిసింది. అది ఆయన చేసిన ప్రజా సేవ, రాజకీయాలు అంతగా గుర్తింపు తెచ్చాయి. అయితే సినిమాలో మాత్రం ఆయన ఎదుర్కొన్న రాజకీయ ఒడిదొడుకులు, ఆయన గెలిచిన తీరు మీద ఎక్కువ దృష్టిపెట్టాలని ఆయన అబిమానులు కోరుకుంటున్నారు. ఒక నాయకుడు రాజకీయాల వల్ల ఎలా ఇబ్బందుల పాలౌతాడన్నది కూడా సినిమాలో చూపించాల్సిన అవసరం వుంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వైసిపి పార్టీ నుంచి ఎలా గెలిచారు. ఎందుకు గెలిచారు? ఆయనపై ఖమ్మం ప్రజలకు వున్న నమకం ఏమిటి? ఎందుకు ఒక్కసారిగా రాజకీయంగా ఎలా దూసుకొచ్చారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా ఎలా వచ్చారు. వచ్చి ప్రజలను ఎలా మెప్పించారు. అంతకు ముందు ఆయన ప్రజలకు ఎలా చేరువయ్యారు? అనేది కూడా చూపిస్తారని తెలుస్తోంది. వ్యాపార వేత్తగా వున్న ఆయన ప్రజలకు ఎలాంటి మేలు చేసేవారు. ఆపన్న హస్తం ఎలా అందించేవారు. పేదలను ఎలా ఆదుకున్నారు. అనే విషయాలు కూడా సినిమాలో వుండేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఎందుకంటే రాజకీయాల కన్నా, ప్రజలకు సేవ చేయడంలో శ్రీనన్న పొందే తృప్తి ఎలా వుంటుందన్నది అనేక సందర్భాలలో చూస్తూనే వున్నాయి. ఏ పల్లెటూరు లో ఏ కుటుంబంలో ఎలాంటి బాద వున్న ఎలా ఆదుకుంటారు. వారికి సమాచారం తెలిస్తే ఎలా సేవలంందిస్తారు అనేది కూడా సినిమా ద్వారా చూపించాలి. ఖమ్మం జిల్లాలో ఆయన ఎన్ని గుళ్లు, గోపురాలు నిర్మాణంలో పాలు పంచుకున్నారు. ఇలాంటి అనేక అంశాలు కూడా జోడిరచాల్సిన అసవరం వుందని అబిమానులు కోరుకుంటున్నారు. ఆయన ప్రజా సేవ ఒకెత్తైతే, రాజకీయం మరో ఎత్తు. తెలుగురాష్ట్రాల రాజకీయాల్లో తొడగొట్టి సవాలు చేసిన ఏకైక నాయకుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. బిఆర్‌ఎస్‌లో జరిగిన అన్యాయం మీద ఆయన ఎలాంటి సమాధానం చెప్పారు. బిఆర్‌ఎస్‌ను ఎదుర్కొని ఆయన ఎలా నిలబడ్డాడు. బిఆర్‌ఎస్‌ను ఖమ్మంలో నామరూపాలు లేకుండా ఎలా చేయగలిగారు. బిఆర్‌ఎస్‌ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనని శపధం చేసి మరీ ఓడిరచారు. ఇలా రాజకీయాలను శాసించే స్దాయికి ఎలా చేరుకున్నారన్నది కూడా సినిమాలో చూపిస్తే, గూస్‌ బంస్స్‌ రావాల్సిందే. ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాజకీయాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే 2014లో ఖమ్మం ఎంపిగా వైసిపి తరుపున గెలిచారు. అప్పటికే ఆయన వైసిపికి రాష్ట్ర అధ్యక్షుడుగా వున్నారు. తనతోపాటు ఖమ్మంలో ఎమ్మెల్యేలను కూడా వైసిపి తరుపున గెలిపించిన నాయకుడు. అలాంటి నాయకుడిని కేసిఆర్‌ ఆహ్వానించారు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సేవలు పార్టీకి అవసరమని చెప్పి , పార్టీలో చేర్చుకున్నారు. నిజానికి బిఆర్‌ఎస్‌లో చేరాలన్న ఆలోచన శ్రీనన్నకు లేదు. కాని తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన వైసిపీని వీడి బిఆర్‌ఎస్‌లో చేరారు. అయితే ఒక జిల్లాను శాసించే స్దాయి నాయకుడిని బిఆర్‌ఎస్‌లో చేర్చుకొని రాజకీయంగా బలహీనుడిని చేయాలని కేసిఆర్‌ అనుకున్నట్లు ముందు తెలియలేదు. కేవలం తెలంగాణ ప్రయోజనాల కోసం పొంగులేటి బిఆర్‌ఎస్‌లో చేరితే, పొంగులేటి రాజకీయాన్ని నాశనం చేయడానికి కేసిఆర్‌ చేర్చుకున్నారన్నది కొంత కాలానికి తేలిపోయింది. ఎంపిగా వున్న పొంగులేటిని పార్టీలో చేర్చుకొని ఆయనకు ప్రాదాన్యత తగ్గిస్తే చాలనుకున్నారు. కాని పొంగులేటిలో వుండే ఫైర్‌ ను తగ్గించలేరని తర్వాత బిఆర్‌ఎస్‌ తెలుసుకోవడమే కాదు, ఆ పార్టీయే నామ రూపాలు లేకుండాపోవడానికి కారణమైంది. 2018 ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వలేదు. తర్వాత పార్లమెంటు ఎన్నికల్లోనూ పొంగులేటికి టికెట్‌ ఇవ్వలేదు. అలా పొంగులేటి ప్రాదాన్యత తగ్గించుకుంటూ వచ్చారు. ఖమ్మం జిల్లా రాజకీయాలలో పొంగులేటి పాత్ర లేకుండా చేయాలనుకున్నారు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి లాంటి నాయకుడు ఎదిగితే బిఆర్‌ఎస్‌కు కష్టమే, నష్టమే అనుకున్నారు. అందుకే శ్రీనన్నను ఎదగుకుండా చేయాలని కుట్రలు చేశారు. ఎంతో ఓపికతో, సహసనంతో సీనన్న భరిస్తూ వచ్చారు. నోటి మీద చిరునవ్వు, నొసటి మీద ఎత్తిపొడుపు పెట్టుకొని, కేసిఆర్‌, కేటిఆర్‌లు రాజకీయం చేస్తున్నారని శ్రీనన్న తెలుసుకున్నారు. తనకు ప్రాధాన్యత లేకుండా చూడాలని అహర్నిషలు తాపత్రయ పడుతున్నారని తెలుసుకున్నాడు. అప్పుడు బిఆర్‌ఎస్‌ నుంచి బైటకు వచ్చారు. అదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీ శ్రీనన్నను పార్టీలోకి ఆహ్వానించింది. అంతే కాంగ్రెస్‌ పార్టీ గెలుపుకోసం శ్రీనన్న చేసిన ప్రయత్నం అంతా ఇంతా కాదు. రాజకీయాలకే శ్రీనన్నను దూరం చేయాలని చూస్తే , రాజకీయాలను ఏలే దాకా ఎదిగారు. అనేవే ప్రధానాంశాలుగా సినిమా వుంటుంది. ఆయన బిఆర్‌ఎస్‌ను ఓడిరచేందుకు వేసిన ఎత్తులు, పన్నిన రాజకీయ వ్యూహాలను కూడా చాలా సినిమాటిక్‌గా చూపించే ప్రయత్నం చేయనున్నట్లు తెలుస్తోంది. ఎందకంటే బయోగ్రఫీ అంటే నాలుగు రీల్లు చుట్టేసినట్లు కాకుండా, శ్రీనన్న జీవితాన్ని రంగరించి తీసినట్లుగా వుండేలా ప్లాన్‌ చేస్తున్నారు. అప్పుడే సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారు. మరింత మంది చూసేందుకు వీలౌతుంది. బయోగ్రఫీ అనేది నిజాలకు చాలా దగ్గరగా, రియలిస్టిక్‌గా వుండాలి. తీయాలి. అప్పుడే ప్రేక్షకులు కూడా సినిమా చూసేందుకు వస్తారు. పైగా శ్రీనన్న జీవితం మీద తీస్తున్న సినిమా కావడం వల్ల రెండు రాష్ట్రాలలో నాయకుడిగా సినిమాను ఆదరించేలా వుండాలి. ఇ తర బాషల్లో ఒక నాయకు డి జీవితం ఎంత హృద్యంగా వుందని తెలిస్తేనే చూస్తారు.మొత్తానికి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి సినిమా పాన్‌ ఇండియా సినిమాగా తీస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా, జాతీయ స్దాయిలో ప్రజ లు,నాయకులు కూడా చూసేలా వుంటుంది. జాతీయ స్దాయిలో పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి గురించి చర్చికు నేలా సినిమా వుంటుందని తెలుస్తోంది. అప్పుడే శ్రీనన్న గొప్పదనం, రాజకీయం, పాలనా విధానం, ఆయన ఎదిగిన తీరు, ఎదుర్కొన్న ఒడిదొడుకులు, కాంగ్రెస్‌పార్టీకి అండగా నిలిచిన విధానం, కాంగ్రెస్‌ను గెలిపించిన తీరు అంతా సినిమాలో వుంటుంది. అప్పుడు జాతీయ స్దాయిలో ఇన్ని రాష్ట్రాలలో వున్న కాంగ్రెస్‌ నాయకులకు కూడా ఈ సినిమా ఆదర్శంగా కూడా నిలుస్తుంది. ఆల్‌ది బెస్ట్‌..పొంగులేటి!!

బాలయ్య ఆవేశం..చిరు సందేశం!

`రసకందాయంలో కూటమి రాజకీయం!

`ఇప్పుడు తేలుతుంది అసలైన మిత్ర ధర్మం.

`తమ్ముడు అన్న వైపు నిలుస్తాడా!

`రాజకీయమే ముఖ్యమనుకుంటాడా!

`అన్నదమ్ముల మధ్య అంతరం మొదలైనట్లా!

`కూటమి బీటలకు తొలి అడుగా!

`బాలయ్య ఇంత కాలం దాచుకున్నది బైట పెట్టాడా!

`ఊహించని పరిణామమా!

`సినీ చాయ్‌లో చిన్న తుఫానా!

`జన సైనికులు స్పందించొద్దని లేఖ ఎందుకు విడుదల చేశారు.

`చిరంజీవి స్పందన నిప్పు రాజేసిందా!

`చిరంజీవి కూల్‌గా రాసిన ఉత్తరమే కుంపటి పెట్టిందా!

హైదరాబాద్‌, నేటిధాత్రి:
సినీ ఇండ్రస్ట్రీలో హీరోలు పైకి ప్లాస్టిక్‌ నవ్వులు పూయించుకుంటూ, కడుపులో కత్తులు పెట్టుకొని తిరుగుతారని చెప్పడానికి బాలయ్య చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని ఇండ్రస్త్రీ వర్గాలే అంటున్నాయి. మేమంతా బాగానే వుంటాం. మీరు మా కోసం కొట్టుకోకండి. వాదులాడుకోకండి. తిట్టుకోకండి. అంటూ నీతులు చెప్పే హీరోల మధ్య వుండే మనస్పర్తలు ఎలా వుంటాయనేది అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే బాలకృష్ణ మాటల్లో అర్ధమైంది. ఇప్పటికీ మూడుసార్లు హిందూ పురం ఎమ్మెల్యే వున్న బాలకృష్ణ బహుషా అసెంబ్లీలో మాట్లాడడం ఇది రెండోసారి అనుకుంటా…గతంలో ఒకసారి ఏదో సందర్భంలో రెండు నిమిషాలు మాట్లాడినట్లు గుర్తు. కాని ఇప్పుడు కూడా ఓ రెండు నిమిషాలు మాట్లాడారు. అది ప్రజల కోసం కాదు. ప్రజా సమస్యల మీద కాదు. తనకు జరిగిన అవమానం మీద మాట్లాడారు. తాను సినీ పెద్దను అనే విషయాన్ని పరిశ్రమ గుర్తించడం లేదన్న అక్కసును వెళ్లగక్కినట్టున్నారని ప్రత్యర్ధులు విమర్శిస్తున్నారు. విచిత్రమేమిటంటే ఆంద్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి జగన్‌ సినీపెద్దలను అవమానించాడన్నది గత కొంత కాలంగా సాగిన విపరీత ప్రచారం. నిజానికి ఆ ప్రచారాన్ని ఆదిలోనే తుంచేయాల్సింది. కాని దానిపై
ఆ మధ్య చిరంజీవి గాని, ఇటు ప్రభుత్వ వర్గాలు గాని స్పందించలేదు. దాంతో అది చిలికి, చిలికి గాలి వాన అయ్యింది. ఒక రకంగా కూటమి విజయానికి కూడా పనికొచ్చింది. సహజంగా సినీ పరిశ్రమను అవమానిస్తే, సగటు ప్రేక్షక లోకం కూడా ఎంతో బాధపడుతుంది. తమ అభిమాన హీరోలను ఎవరు అవమానించినా తట్టుకోలేరు. అదే గతంలో జరిగింది. అయితే ఆ అవమానం జరిగిందనేది నిన్నటిదాకా పాకిన వార్త. కాని గత ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్మోహన్‌రెడ్డి తనను ఎలాంటి అవమానం చేయలేదని, ఎంతో గౌరవంగా చూసుకున్నారంటూ చిరంజీవి మీడియాకు లేఖ విడుదల చేశారు. దాంతో వైసిపికి కొండంత బలం వచ్చినట్లైంది. కాని కూటమికే ఏకంగా చిచ్చుపెట్టినట్లైంది. మీడియాకు మంచి మసాల దొరికింది. ఓ వారం పది రోజుల వరకు ధమ్‌ బిర్యాని వండేందుకు ఢోకా లేదు. ఇరువైపుల అభిమానుల ఆవేశాలకు కూడా కొదువుండదు. పైగా మీడియా ఎప్పటికప్పుడు సినీ పెద్దల మధ్య వుండే గ్యాప్‌పై వార్తలు రాస్తే, చూశారా? అదంతా మీడియా సృష్టే అని అనేవారు. ఇదేంటి? అని మీడియా కూడా ప్రశ్నించే పరిస్దితి వచ్చింది. అసలు మ్యాటర్‌లోకి వెళ్లే, గురువారం నాడు అసెంబ్లీలో బిజేపి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌ గత ప్రభుత్వ అదికారంలో సినీ పెద్దలకు తీవ్ర అన్యాయం జరిగిందన్న విషయాన్ని ప్రస్తావించారు. ఆ సమయంలో చిరంజీవి లాంటి హీరో మాజీ సిఎం. జగన్‌ను కలిసేందుకు స్వయంగా ఆయన ఫోన్‌ చేసినా స్పందించలేదని గుర్తుచేశారు. పరిశ్రమ గురించి మాట్లాడాలంటూ పదే పదే అడగడంతో ఓ ఐదుగురు మాత్రమే రావాలని జగన్‌ సూచించినట్లు కామినేని గుర్తుచే శారు. పైగా చిరంజీవి బృందం తాడేపల్లి గూడెం జగన్‌ ప్యాలెస్‌కు వెళ్లే అవమానించారన్నారు. గేటు బైటే హీరోల కార్లు ఆపేసి, నడుచుకుంటూ వెళ్లేలా చేశారు. తీరా చిరంజీవి బృందం అక్కడికి వెళ్లినా అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో చర్చించి వెళ్లండని జగన్‌సందేశం పంపినట్లు గుర్తుచేశారు. దాంతో చిరంజీవి ఒకింత అసహనానికి గురై జగన్‌ రమ్మంటేనే వచ్చాం. అలాంటిది ఇలా అవమానిస్తారా? అని బెదిరించడంతో అప్పుడు జగన్‌ వచ్చారని కామినేని అన్నారు. దీంతో ఒక్కసారికి అసహనానికి గురైన ఎమ్మెల్యే బాలయ్య లేచి కామినేని చెప్పిందాంట్లో కొన్ని అబద్దాలున్నాయన్నారు. జగన్‌ను ఎవరూ బెదిరించలేదన్నారు. అందులోనూ ఎవడూ…అంటూ ఏక వచనం ప్రయోగించారు. ఆ సమయంలో తనను కూడా సంప్రదించారని బాలయ్య గుర్తు చేశారు. అయి తే జగన్‌ను ఉద్దేశించి బాలయ్య మాట్లాడుతూ సైకో అని సంబోధించారు. చిరంజీవిని సినీ పెద్దగా గుర్తించే అర్ధమొచ్చేలా కామినేని వ్యాఖ్యల ను బాలయ్య తప్పు పట్టారు. ఇది గడిచిన కొద్ది సేపటికే చిరంజీవి మీడియాకు మూడు పేజీల లేఖను విడుదల చేశారు. బాలయ్య చెప్పినదాంట్లో నిజం లేదన్నారు. తాను అమెరికాలో వున్నానని, అందుకే లేఖ విడుదల చేశారు. అందులో ఏపి మాజీ ముఖ్యమంత్రి తనను ఎలాంటి అవమానాలకు గురి చేయలే దని స్పష్టం చేశారు. ఒకసారి జగనే స్వయం గా తనను ఇంటికి ఆహ్వానించడంతో తాను, తన సతీమణితో కలిసి లంచ్‌కువెళ్లడం జరిగిందని చిరంజీవి చెప్పారు. ఆ సమ యంలో సినీ పరిశ్రమ సమస్యలపై ఒకసారి సమయం ఇస్తే మరోసారి వస్తామని చిరం జీవి చెప్పారు. దాంతో తప్పకుండా రండి. సమయం ఇస్తామని జగన్‌ చెప్పడం జరిగింది. కొంత కాలానికి ఓ ఐదుగురు సీనీ పెద్దలతో కలిస రావొచ్చని అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని సమాచారం చిరంజీవి చేరవేశారు. దాంతో ఐదుగురితో కాకుండా ఓ పది మంది వస్తామని చిరంజీవి చెప్పారు. కోవిడ్‌ కారణంగా ఐదుగురిని రమ్మని చెప్పడమే తప్ప మరో ఉద్దేశ్యం లేదని పేర్ని నాని చిరంజీవిని చెప్పి చూశారు. అయితే పది మందికి అవకాశమివ్వండని అడగడంతో సరే అన్నారు. పది మంది చిరంజీవి నేతృత్వంలో సినీ పెద్దలంతా జగన్‌ను కలిశారు. వచ్చారు. దీనిపై ఇప్పుడు అసెంబ్లీ లో రగడ జరగడం పట్ల చిరంజీవి వెంటనే స్పందించారు. జగన్‌ తప్పేమీ లేదని తేల్చారు. అయితే అసెంబ్లీలో బాలయ్య తన పేరు ఆ సమయంలో 9 నెంబర్‌గా రాయడం జరిగిం దని అందుకే తాను వెళ్లలేదన్న అర్ధమొచ్చేలా చెప్పారు. ప్రస్తుత సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌తో కూడా ఆ సమయంలో లిస్టు తయారు చేసింది ఎవరని కూడా ప్రశ్నించినట్లు బాలయ్య చెప్పారు. దీంతో ఒక్కసారిగా ఎమ్మెల్యే బాలయ్య మానసిక పరిస్దితి ఇలా వుందంటూ పెద్దఎత్తున వైసిపి బ్యాచ్‌ ఆరోపణల పర్వానికి దిగింది. జగన్‌ హయాంలో మంత్రి పేర్ని నాని అయితే, ఇప్పటి మంత్రి కందుల దుర్గేష్‌ను అడిగానని చెప్పడంతో బాలయ్య ఏ పరిస్ధితుల్లో వున్నాడో అర్దం చేసుకోవచ్చంటూ రకరకాల ఆరోపణలు వైసిపి చేసింది. పైగా జగన్‌నుద్దేశించి అసెంబ్లీలో బాలయ్య మాట్లాడిన తీరుపై వైసిసి తీవ్ర అభ్యంతరం తెలిపింది. గతంలో వైఎస్‌ రాజశేఖరెడిడ్డి కనికరించకపోతే పరిస్దితి ఎలా వుండేదో ఒక్కసారి ఆలోచించుకోవాలని వైసిసి నాయకులు గుర్తు చేశారు. బాలకృష్ణ ఇంట్లో కాల్పుల ఘటన తెరమీదకు తెచ్చారు. సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్‌, జ్యోతిష్యుడు సత్యనారాయణ మీద బాలయ్య కాల్పులు జరిపారు. ఆ సమయంలో ఓ సెక్యూరిటీ గార్డు కూడా మరణించినట్లు వార్తలు వచ్చాయి. అప్పుడు నందమూరి కుటుంబంతా మూకుమ్మడిగా వెళ్లి, వైఎస్‌. రాజశేఖరెడ్డిని ప్రాధేయపడితే కనీసం జైలుకు వెళ్లకుండా బాలకృష్ణ బైటకువచ్చిన సంగతి గుర్తు చేశారు. బాలకృష్ణ ఆ కేసు నుంచి బైటకు వచ్చేందుకు అప్పటి వైద్యుడు కాకర్ల సుబ్బారావు జారీ చేసిన సర్టిపికెట్‌ను వైసిపి బైట పెట్టింది. ఎవరి మానసిక పరిస్దితి బాగాలేదని కేసు నుంచి తప్పించుకున్నారో చూడండి అంటూ వైసిసి నాయకులు చెబుతున్నారు. ఇదిలా వుంటే కూటమి మధ్య కుంపటి రగలకుండా వుండేం దుకు జనసేనకూడ వెంటనే స్పందించింది. చిరంజీవి మీడియాకు విడుదల చేసిన లేఖపై ఎవరూ స్పందించొద్దని పార్టీ ఆదేశాలు జారీ చేసింది. ఒక రకంగా జనసేన చిరంజీవికి మాపార్టీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. చిరంజీవి జనసేన పార్టీకి ప్రచారం చేసింది లేదు. జనసేనకు చిరంజీవి అండగా వున్నది లేదనే అర్ధమె ుచ్చేలా జనసేన ప్రకటించింది. జనసేన నాయకులు ఎవరు స్పందించినా అది కూటమి కి నష్టం జరుగుందున్న అభిప్రాయాన్ని పార్టీ వ్యక్తం చేసింది. ఇక ఇది ఎంత దూరం పోతుందనేది ఇప్పటికిప్పుడు చెప్పేలా లేదు. బాలయ్య క్షమాపణ చెప్పాలని వైసిపి డిమాండ్‌ చేస్తోంది.జీవితం కాపాడిన రాజశేఖరరెడ్డిని జీవితాంతం బాలయ్య గుర్తుంచు కోవాలని హితవు పలుకుతున్నారు. అఖండ సినిమాకు సంబంధించి బాలయ్య నాలుగుసార్లు తనకే ఫోన్‌ చేసినట్లు మాజీ మంత్రి పేర్ని నాని ఒట్టేసి మరీ చెబుతున్నాడు. బాలయ్య మన వద్దకు రావడం ఎందుకు? టికెట్‌ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించమని జగన్‌ ఆదేశిస్తే తానే అనుమతిచ్చినట్లు పేర్ని నాని అన్నాడు. ఇలా అటు సినిమా పరిశ్రమ, ఇటు రాజకీయ వేదికలన్నీ బాలయ్య వైపే వేళ్లు చూపిస్తున్నాయి.

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు మాజీ ఎమ్మెల్యే గండ్ర…

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు మాజీ ఎమ్మెల్యే గండ్ర

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో చాకలి ఐలమ్మ జయంతినీ పురస్కరించుకొని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ
తెలంగాణ సాయుధ పోరాటంలో విరోచ్చితంగా పోరాటం చేసి, నాటి భూస్వాముల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసిన చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించుకోవడం చాలా ఆనందకరం, ఆమె యొక్క విరోచ్చిత పోరాటం నేటి యువతరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జనార్ధన్ మున్సిపల్ మాజీ చైర్మన్ వెంకట్ రాణి సిద్దు నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version