ఇది కంకరా..సుద్దముక్కా!?.. ఎపిసోడ్‌ -1

‘‘వేల కోట్లు’’ దోచుకున్నారు?

`దుబ్బను కూడా కంకర అని నమ్మిస్తున్న ఘనులు!

`‘‘క్రషర్‌ కంపెనీలన్ని’’ సిండికేట్‌ అయ్యి ప్రజాధనం దోచుకుతిన్నాయి.

`‘‘మహా నిర్మాణాన్ని’’ నవ్వుల పాలు చేశాయి

`పలుగు రాయితో సమానం కూడా కాదు!

`ఇదా కంకర..కండ్లు మూసుకున్నారా!

`కాసులకు కక్కుర్తి పడి కంకర అని తేల్చారా!

`ఈ కంకర ప్రాజెక్టులకు వాడతారా!

`ఎర్ర గుట్టల రాయిని కంకర అంటారా?

`కాసులకు కక్కుర్తి పడి ప్రజా ధనం దోచుకున్నారు?

`క్వాలిటీ కంట్రోల్‌ బోర్డు వద్దన్నా వినిపించుకోలేదు!

`క్వాలిటీ కంట్రోల్‌ బోర్డు కాదన్నా వాడేశారు!

`కాంట్రాక్టర్ల ధన దాహానికి అధికారులు తోడయ్యారు!

`చూసేవారెవరని విచ్చలవిడిగా ఎర్రకంకర వాడేశారు!

`మహా ప్రాజెక్టును సర్వనాశనం చేశారు!

`అది కంకరే కాదు! ప్రాజెక్టులకు సరఫరా చేశారు!!

`మన్ను మశానం తప్ప కంకర అసలే కాదు!

`అవునవును అని తల ఊపే అధికారులు!

`వరంగల్‌ గుట్టల్లో బలమైన బండలే లేవు!

`కంకర తయారు చేయడం సాధ్యమే కాదు!

`గులకరాళ్లను కంకర అని సరఫరా చేస్తున్నారు!

`ఎర్రగుట్టలు తొలిచి కంకర అని నమ్మిస్తున్నారు.

`కాంట్రాక్టర్లు..అధికారులు పంచుకుతింటున్నారు!

`ఇదే కంకర ఓ పెద్ద ప్రాజెక్టులో కూడా వాడారు?

`ఇప్పుడు నేషనల్‌ హైవేల నిర్మాణానికి వాడుతున్నారు!

`ఇంటికి ఏ మాత్రం పనికి రాదు!

`ప్రాజెక్టుల నిండా నింపేశారు!

`ప్రాజెక్టుల నిర్మాణం అబాసుపాలు చేశారు!

`ప్రజాధనం నీళ్ల పాలు చేశారు!

`సగం వాటలు అధికారుల చేతుల్లో పెట్టి చేతులు దులుపుకున్నాయి!

హైదరాబాద్‌, నేటిధాత్రి:                        తెలంగాణలో కాంట్రాక్టర్ల బరితెగింపు, అధికారుల కాసుల కక్కుర్తి మూలంగా ప్రజా దనం పెద్దఎత్తున దుబారా అవుతోంది. దుర్వినియోగమౌతోంది. ప్రభుత్వానికి నాణ్యమైన కంకర సరఫరా చేస్తామనిచెప్పి, టెండర్లు దక్కించుకొని పనికి రాని కంకర సరఫరా చేస్తున్నారు. సుద్దకూడా అంతో నయమనేంత నాసిరకమైన కంకర సరఫరా చేశారు. అసలు దానిని కంకర అని ఎలా నిర్ధారించారో..ఎలా కంకర అని కాంట్రాక్టర్లు నిర్ణయించుకున్నారో అర్ధం కాదు. కంకర పేరుతో సరఫరా చేస్తున్న దానిని అది కంకరే అని అదికారులు ఎలా నిర్దారిస్తున్నారో..ఎలా అందుకు అనుమతులు జారీ చేస్తున్నారో తెలియకుండాపోతోంది. గత పదేళ్ల కాలంగా ఈ దుబారా వ్యవహరం విపరీతంగా సాగుతోంది. సహజంగా ఏ నిర్మాణానికైనా సరే నాణ్యమైన కంకర కావాలని కోరుకుంటాం. మంచి కంకరలో చిన్న డస్టు కూడా వుండకుండా జాగ్రత్తపడతాం. ఆ కంకర తెచ్చుకున్న తర్వాత ఏ మాత్రం అనుమానం వచ్చినా తిరిగి వాపస్‌ చేయిస్తాం. మరి అలాంటిది తెలంగాణ ప్రభుత్వం చేపట్టే అనేక కార్యక్రమాలకు అధికారులు దగ్గరుండి పనికి రాని, ఎందుకూ పని చేయని కంకరను ప్రోత్సహిస్తున్నారు. కంకర అంటే ఏళ్ల తరబడి మన్నేలా వుండాలి. చెక్కు చెదరకుండా వుండాలి. గాలి, నీటి కోతను తట్టుకోగలగాలి. దశాబ్ధాల తరబడి బలంగా,దృఘంగా వుండాలి. నిజమైన రాయితో తయారైన కంకర వందల సంవత్సరాలైనా సరే గట్టిగా వుంటుంది. నిర్మాణాలను పటిష్టంగా వుంచుతుంది. ఇంటి నిర్మాణాలకే ఇన్ని రకాలుగా ఆలోచిస్తాం. అలాంటిది ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టే నిర్మాణాలకు మరింత బలమైన కంకర అవసరం. ఎండకు, వానకు, వరదలకు తట్టుకొని నిలబడేలా వుండాలి. అది రోడ్డైనా, ప్రాజెక్టులైనా, చెరువులైనా, చెక్‌ డ్యామ్‌లైనా, రిజర్వాయర్లైనా సరే కంకర ఎంత బలంగా వుంటే ఆ నిర్మాణాలు అంత ఎక్కువ కాలం నిర్మాణాలు చెక్కు చెదరకుండా వుంటాయి. కాని తెలంగాణలోని కొంత మంది అవినీతి అదికారుల దుర్భుద్ది మూలంగా, దుర్మార్గులైన కొంత మంది కాంట్రాక్టర్లు కలిసి ప్రజా ధనం దోచుకుతినేందుకు ఎందుకూ పనికి రాని కంకర విచ్చలవిడిగా వాడుతున్నారు. అందుకే మన కళ్లముందే అనేక నిర్మాణాలు చెదిరిపోతున్నాయి. కూలిపోతున్నాయి. కొట్టుకుపోతున్నాయి. అవి నాసిరకం కంకర నిర్మాణాలని తేలిపోతున్నాయి. వాటి గురించి పట్టించునే నాధుడే కరువయ్యారు. ఎంత సేపు రాజకీయాలు తప్ప, వ్యవస్ధలో నిటారుగా నిలడాల్సిన అధికారులు ఎందుకు వంగిపోతున్నారు. ఎందుకు ఇంత లాలూచీగా వ్యవహరిస్తున్నారు. భయం లేకుండా పోతున్నారు. అనేది కూడా ఇక్కడ ప్రభుత్వం దృష్టిపెట్టాల్సిన అవసరం వుంది. ముఖ్యంగా తెలంగాణలోని కొన్ని ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు, రోడ్ల నిర్మాణాలకు ఎందుకూ పనికి రాని ఎక్రకంకరణను సరఫరా చేసినట్లు ఆరోపణలున్నాయి. వరంగల్‌ జిల్లాలో కట్టడాలకు అవసరమైనటు వంటి కంకరను అందించే గట్టలే లేవు. ఆ గుట్టలన్నీ కేవలం ఎర్రమట్టితో నిండి వున్న తూర్పు కనుమలకు చెందినవి. ఆ గుట్టలు పూర్తిగా మట్టితో మాత్రం ఎక్కువ శాతం వుంటాయి. ఆ మట్టిలో ఎర్ర రాయి గుండ్లు మాత్రమే వుంటాయి. అవి చాలా నాసిరకంగా వుంటాయి. అవి నిర్మాణాలకు ఎట్టి పరిస్దితుల్లో ఉపయోగార్హం కాదు. కంకర తయారు చేసే గుట్టల్లో పెద్ద పెద్ద బరువైన బండలుండాలి. కొన్ని ఎకరాల్లో విస్తరించి వుండే బండ నుంచి మాత్రమే కంరర తయారు చేయాలి. కాని గుండ్లతో కూడిన గుట్టలను కాంట్రాక్టర్లు ఎంచుకోవడం? వాటికి అధికారులు పర్మిషన్లు ఇవ్వడం జరుగుతోంది. అలా కొండలు తవ్వేస్తున్నారు. అటు మట్టి, ఇటు ఎర్ర గుండ్లతో తయారు చేసిన కంకరను సరఫరా చేస్తున్నారు. కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. నేటిధాత్రి పై చిత్రంలో చూపిస్తున్న ఎర్ర రంగు రాయిని కూడా కంకర అని ఎవరైనా అంటారో మీరే చెప్పండి? అది నిర్మాణాలకు వాడుకునే వాళ్లు ఎవరైనా వుంటారా? ఇక్కడ విచిత్రమేమిటంటే మాకు పెద్ద కొండ వుంది. అందులో లక్షల టన్నుల కంకర తయారయ్యే గుట్టలున్నాయని ఎవరూ అధికారులకు అర్జీలు పెట్టుకోలేదు. మేము కంకర వ్యాపారం చేయాలనుకుంటున్నాం. మీరు ఏవైనా గుట్టలను మాకు అప్పగిస్తే కంకర తయారు చేసి, ప్రభుత్వానికి సరఫరా చేస్తామని దరఖాస్తులు పెట్టుకున్నారు. అలా దరఖాస్తులు పెట్టుకున్నవారికి అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లు కనిపించిన ప్రతి గుట్టను అధికారులు కాంట్రాక్టర్లకు రాసిచ్చారు. కంకర తెమ్మని రాతపూర్వక ఆదేశాలిచ్చారు. ఇది కంకరేనా..ఈ కంకర నిర్మాణాలకు ఎవరైనా వాడుతారా? అంటూ నేటిధాత్రి ప్రశ్నిస్తే మాదేముంది? మేం కాంట్రాక్టు చేద్దామనుకున్నాం! కంకర సరఫరా చేసే క్రషర్లు ఏర్పాటు చేసుకుంటామని చెప్పాం! మాకు అందుబాటులో వున్న కొండలు లీజుకిస్తే, వాటి కంకర తయారు చేసి, ప్రభుత్వానికి సరఫరా చేస్తామని చెప్పాం!! ఇదీ స్దూలంగా అడ్డదారిలో, అడ్డగోలుగా, ప్రజా దనం దుర్వినియోగం చేసిన కొందరు కాంట్రాక్టర్లు చెబుతున్న మాట!!! ఇదిలా వుంటే సదరు కాంట్రాక్టర్లు ఓ మహా నిర్మాణానికి పెద్దఎత్తున కంకర సరఫరా చేసే ముందు రాజేంద్ర నగర్‌లో వున్న క్యాలిటీ కంట్రోల్‌ బోర్టుకు కంకర రాయిని పంపించారు. అక్కడున్న నిపుణులు ఇది కంరరే కాదని నిర్ధారించారు. అది కంకరగా పనికి రాదని తేల్చేశారు. ఇది సుద్దకన్నా అద్వాహ్నమైందని చెప్పారు. ఈ ఎర్రరాయికి కరిగిపోయే గుణం వుంటుందని చెప్పారు. ఎట్టి పరిస్దితుల్లోనూ నిర్మాణాలకు ఈ కంకర అసలే వాడొద్దని హెచ్చరించారు. తెలంగాణలో చేపట్టిన ఓ మహా నిర్మాణానికి ఈ రాతి కంకర వాడడం ఎంతో ప్రమాదకరమని కూడా తేల్చిచెప్పారు. ఎట్టిపరిస్ధితుల్లోనూ తాము అంగీకరించే పరిస్దితి లేదని చెప్పారు. అయినా అదికారులు అదే కంకరను ఈ మహా నిర్మాణానికి సుమారు 20వేల కోట్ల రూపాయల విలువైన కంకరను సరఫరా చేయించుకున్నారు. సహజంగా కంకరకు మంచి బలమైన నల్లరాతి గ్రానైట్‌ కావాలి. అంతే కాని గులకరాయిలా కూడా పనిచేయని ఎర్రరాయిని విచ్చలవిడిగా వాడేశారు. ఆ మహా నిర్మాణానికే కాదు, కేంద్ర ప్రభుత్వం నిర్మాణం సాగిస్తున్న జాతీయ రోడ్లకు కూడా వరంగల్‌ జల్లాలో ఇదే కంకరను విస్తారంగా వినియోగిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన మహా నిర్మాణం ఇప్పుడు ఆరోపణల పాలు కావడంలో ఎర్ర కంకర పాత్రే ఎక్కువ అని నిపుణులు అంటున్నారు. ఎంత చెప్పినా అదికారులు పట్టించుకోలేదు. కాంట్రాక్టర్లు వినలేదని కూడా అంటున్నారు. ఏదైనా జరిగితే మొత్తం నిర్మాణానికే ప్రమాదం ఎదురౌతుందని తెలసి కూడా అటు అదికారులు, ఇటు కాంట్రాక్టర్లు బరితెగించారంటే సామాన్యమైన విషయం కాదు. ప్రభుత్వం ఇప్పటికైనా మేలు కోవాలి. ఈ దిశగా దర్యాప్తు సాగించాలి. ఎంత మంది కాంట్రాక్టర్లకు ఎన్ని గుట్టలు అదికారులు అప్పగించారు? ఎన్నికొండలు తొలిచేశారు? ఆ కొండల మూలంగా ఎంత కంకర వచ్చింది? రాజేంద్ర నగర్‌ క్వాలిటీ కంట్రోల్‌బోర్డు వద్దని ఆదేశాలు జారీ చేసినా, ఎవరు పక్కకు పెట్టారు. ఎందుకు తొక్కిపెట్టారు? దీని వెనుక ఎవరున్నారు? వేలకోట్ల రూపాయలు ఖర్చు చేసి మరీ నాసిరకం కంకర సరఫరా చేయడం అంటే నేరం కాదా? కాంట్రాక్టర్‌కు చెల్లించాల్సిన మొత్తానికి సమానమైన లాభంతో ఎంబిలు తయారు చేసినట్లు సమాచారం. సగం, సగం వాటాలు అన్నట్లు ఇద్దరూ కలిసి వేల కోట్లు దోచేశారు. ప్రజా ధనం నీళ్లలోపోశారు. ఆ కాంట్రాక్టర్లు ఎవరు? అనుమతులిచ్చిన అదికారులెవరు? ఎంత కంకర సరఫరా చేశారు? ఎంత సొమ్ము దుబారా చేశారు? అనే పూర్తి వివరాలతో కూడిన ప్రత్యేక కధనాలు త్వరలోనే మీ నేటిధాత్రిలో…

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version