ఏపిలో రాజకీయం.. తెలంగాణలో మకాం!

`హైదరాబాద్‌ వదిలి వెళ్లలేరు.

`ఏపిలో రాజకీయం మానుకోలేరు.

`ఏపిలో రాజకీయాలు చేయాలి.

`తెలంగాణ నుంచి వచ్చిపోతుండాలి.

`వారంలో రెండు రోజులు ఏపిలో..

`ఐదు రోజులు తెలంగాణలో..

`అధికారులు కూడా అంతే…

`అదే దారిలో మీడియా కూడా..

`మీడియా సంస్థలన్నీ హైదరాబాద్‌లోనే..

`వార్తలన్నీ ప్రసారం హైదరాబాద్‌ నుంచే.

`ప్రపంచ రాజధాని నిర్మాణం అంటారు.

`హైదరాబాద్‌లోనే అందరూ వుంటారు.

`పాలక, ప్రతిపక్షం తేడా లేదు.

`అన్ని పార్టీల నాయకులంతా హైదరాబాద్‌లోనే…

హైదరాబాద్‌, నేటిధాత్రి: 

 ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలంటేనే విచిత్రం. నాయకులు అంతకన్నా విచిత్రం. గత పదేళ్లకాలంగా రాజకీయాలు ఏపిలో చేస్తున్నారు. నివాసం మాత్రం తెలంగాణలో వుంటున్నారు. సరే నిజానికి హైదరాబాదర్‌ పదేళ్లపాటు ఉమ్మడి రాజధాని. అలా రాజదాని కొనసాగిందా? అంటే అదీ లేదు. ఏడాదిన్న కాలానికే చంద్రబాబు హైదరాబాద్‌ను వదిలేసి వెళ్లిపోయాడు. అప్పటికే కేంద్ర ప్రభుత్వం రాజధాని కోసం ఓ ప్రాంతాన్ని సూచించింది. కాని చంద్రబాబు ప్రభుత్వం అమరావతిని ఎంచుకున్నది. రాజదాని నిర్మాణం మొదలుపెట్టింది. అక్కడ అసెంబ్లీ, సచివాలయం, హెచ్‌ఓడిల భవనాలు నిర్మాణాలు జరిగాయి. తర్వాత ఐదేళ్లపాటు జగన్‌ పరిపాలనచేశాడు. కాని ఆయన మూడు రాజధానులు అన్నాడు. విశాఖలో ఒక్క భవనం తప్ప మరేం ఆయన ముట్టుకోలేదు. ఇక వచ్చే దసరా నుంచి రుషికొండ ప్యాలెస్‌ నుంచే పాలన అని చెప్పుకున్నాడు. తర్వాత ఉగాది అన్నారు. ఇలా నిర్మాణం పూర్తయిన తర్వాత అదిగో ఇదిగో అన్నారు. కాని రాజదానికి విశాఖకు మార్చలేదు. పైగా కర్నూలు, విశాఖ, అమరావతి మూడు రాజధానులుంటాయన్నాడు. కాని కుదరలేదు. ఒక రకంగా చెప్పాలంటే సాద్యం కాలేదు. మళ్లీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. అమరావతి పనులు మళ్లీ మొదలు పెట్టింది. పనిలో పనిగా మరో 40వేల ఎకరాలు రైతుల నుంచి సేకరించాలనుకుంటోంది. గతంలోనే 30వేల ఎకరాలను రైతుల నుంచి లాండ్‌ ఫూలింగ్‌ పేరుతో తీసుకున్నారు. ఇది తన ఘనత అంటూ గొప్పలు చెప్పుకున్నారు. రాజధాని నిర్మాణంకోసం పెద్దఎత్తున ప్రజల నుంచి కోట్లాది రూపాయల విరాళాలు సేకరించారు. పరిశ్రమలను ఆహ్వానించారు. పెట్టబడులు పెట్టమన్నారు. కంపనీలకు ఎన్ని రకాల సదుపాయాలంటే అన్ని రకాలు కల్పిస్తామన్నారు. ఇప్పుడైతే ఏకంగా రూపాయికి ఎకరం కూడా ఇచ్చేస్తున్నారు. విశాఖను ఐటి రాజధాని చేస్తామన్నారు. ఏపి అంతా ఐటి వెలుగులు తెప్పిస్తామన్నారు. బాగానే వుంది. కొన్ని కంపనీలు వచ్చాయి. రియల్‌ వ్యాపారం మొదట్లో బాగానే జరిగింది. వైసిసి రావడం తో ఇదంతా ఆగిపోయింది. కాని రాష్ట్రానికి పెట్టుబడులేమీ ఆగిపోలేదు. రియల్‌ వ్యాపారం తగ్గిపోయింది. కంపనీలు కొన్ని బాగానే వచ్చాయి. అయితే చంద్రబాబు నాయుడు ఏపికి తొలి ముఖ్యమంత్రిగా అసెంబ్లీ, సచివాలయం నిర్మాణం చేయడం మొదలు పెట్టిన నాడే ఇవన్నీ తాత్కాలికం అన్నాడు. అప్పుడే జనం పెదవి విరిచారు. ఇండ్లు, భవనాలు పదే పదే ఎవరైనా కట్టుకుంటారా? నిర్మాణం చేసినప్పుడే కొన్ని దశాబ్ధాల పాటు ఉపయోపడేలా నిర్మాణాలు చేసుకోవాలి. ఆగమేఘాల మీద నిర్మాణాలు చేయాల్సిన పనిలేదు. చేసిన తర్వాత అవన్నీ తాత్కాలికమే అంటూ చెప్పడాన్ని జనం జీర్ణించుకోలేకపోయారు. ఇప్పుడు అమరావతి నిర్మాణం అంటూ మళ్లీ మొదలు పెట్టారు. ఇదంతా బాగానే వుంది. ఆ నిర్మాణం చేపట్టాలనుకునేవారు ఎక్కడుండాలి? ఏదైనా నిర్మాణం చేసేవాళ్లు నిర్మాణానికి దగ్గర్లో వుండాలా? లేక ఎక్కడో దూరంగా వుండాలా? ఇక్కడ ఒక్క చంద్రబాబు నాయకుడే కాదు, రాజకీయ నాయకుల అందరూ బాధ్యులే. ఎక్కడో వుండి ఆపరేట్‌ చేయడానికి రాజదాని నిర్మాణమేమైనా ఐటి కంపనీయా? ఎక్కడ నిర్మాణం జరుగుతందో అక్కడే నాయకులు, పాలకులు వుండాలి. ప్రతిక్షణం పర్యవేక్షించుకోవాలి. ఒక రాజదాని నిర్మాణం తెల్లారేసరికి పూర్తయ్యేది కాదు. తాను ఊ అంటే సైబరాబాద్‌ నిర్మాణం చేశానంటాడు. మరి అమరావతి నిర్మాణం దగ్గరుండి ఎందుకు ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారన్నదే ఇక్కడ ప్రశ్న. పాలన అంతా ఒక దగ్గర కేంద్రీకృతమై, పాలకులంతా అక్కడే వుంటే ప్రజలు కూడా ఆసక్తి చూపిస్తారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ఉన్నతాధికారులంతా అమరావతిలోనే వుంటే వచ్చే వాళ్లు కూడా ఆసక్తి కనబర్చుతారు. పెట్టుబడులు పెట్టేవారు కూడా ధైర్యం చేస్తారు. కాని ఇప్పటి వరకు చంద్రబాబు స్ధిర నివాసం అమరావతిలో లేదు. జగన్‌ తొలిసారి ప్రతిపక్షంలో వున్నప్పుడు నాన్‌ లోకల్‌ అన్నట్టుగా విపరీత ప్రచారం చేశారు. బెంగుళూరు, హైదరాబాద్‌లో వుండే జగన్‌ ప్రజా సమస్యలు ఏం పట్టించుకుంటాడన్నారు. దాంతో జగన్‌ తాడేపల్లి గూడేంలో ప్యాలెస్‌ నిర్మాణం చేసుకున్నాడు. అక్కడి నుంచే ఐదేళ్లు పాలన సాగించాడు. ఇప్పుడూ అక్కడే వుంటున్నాడు. కాకపోతే అప్పుడప్పుడూ బెంగుళూర్‌ వెళ్లి వస్తున్నాడు. కాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌, మంత్రి లోకేష్‌లు ఎక్కడుంటున్నారు. వారంలో ఎన్ని రోజులు అమరావతిలో వుంటున్నారు. ఇతర జిల్లాల పర్యటనలకు వెళ్లినా, నేరుగా మళ్లీ ఎక్కడికి చేరుకుంటున్నారు. అమరావతిలో సొంత ఇల్లు వుందా? అంటే వున్నట్లు మాత్రమే..కాని నివాసం మొత్తం హైదరాబాద్‌లోనే వుంది. వారంలో ఎక్కువ కాలం హైదారాబాద్‌లోనే వుంటున్నారు. అత్యవసర పనులుంటే తప్ప అమరావతిలో నిద్ర చేయడం లేదు. ఇక పవన్‌ కల్యాణ్‌ మాత్రం ప్రొద్దున అమరావతి, రాత్రికి హైదరాబాద్‌ అన్నట్లు తిరుగుతున్నారని అంటున్నారు. రోజూ హైదరాబాద్‌ వచ్చిపోతున్నారని వైసిపి ఆరోపణలు చేస్తోంది. ప్రత్యేకంగా జెట్‌ విమానాన్ని వాడుతున్నారు. కోట్లాది రూపాయల ప్రజాదనం వృదా చేస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. వీళ్లే కాదు, ఏపి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు అంతా దాదాపు హైదరాబాద్‌లోనే వుంటున్నారు. వారికి ఎప్పటి నుంచో నివాసాలున్నాయి. అంతే కాదు వారి వ్యాపారాలు కూడా హైదరాబాద్‌లోనే వున్నాయి. రాజకీయాల వారికి ఫ్యాషన్‌ అన్నట్లు మాత్రమే సాగుతున్నాయి. ఇక ఉన్నతాదికారుల పరిస్దితి కూడా దాదాపు అదే పరిస్దితి. ఇంకా హైదరాబాద్‌నుంచి వచ్చి వెళ్లేవారు చాలా మంది వున్నారు. మీడియా కూడా అదే దారిలో సాగుతోంది. పదేళ్లయినా సరే మీడియా సంస్దలు ఏవీ ఏపికి వెళ్లలేదు. ఈటివి ఆంధ్రప్రదేశ్‌, ఈటివి తెలంగాణ అంటూ హైదరాబాద్‌ నుంచే ప్రసారాలు చేస్తున్నారు. మిగతా మీడియా సంస్ధలన్నీ హైదరాబాద్‌ నుంచే సాగుతున్నాయి. ఏపి రాజకీయాలు, పరిస్దితులు, అభివృద్ది, ప్రజా సమస్యలు అన్నీ మరింతగా జనానికి చేరాలంటే మీడియా అనేది స్దానికంగా వుండాలి. మీడియా సంస్దలు ప్రజలకు చేరువలో వుండాలి. హైదరాబాద్‌లో కూర్చొని లెక్కలు చెప్పడం మీడియా వంతైంది. హైదారాబాద్‌లో వుండే నాయకులు నిత్యం మీడియా హౌజులలో కూర్చొని, చర్చల్లో పాల్గొనడం జరుగుతోంది. ప్రజా సమస్యల మీద జరిగే మీడియా చర్చల కోసం నాయకులు విజయవాడ నుంచి వస్తుంటారు. అమరావతిలో ఎంత మీడియా యంత్రాంగం వున్నా, స్ధానికంగా మీడియా హౌజ్‌లున్నట్లు వార్తలు ప్రసారం చేయలేరు. పైగా రెండు రాష్ట్రాల వార్తల పేరుతో ఇటు తెలంగాణ వార్తలు సరిగ్గా వుండవు. అటు ఏపి వార్తలు పూర్తిగా వుండవు. ఇలా అటు రాజకీయ నాయకులు, ఇటు మీడియా అంతా హైదరాబాద్‌లో వుండి ఏపిని ఉద్దరిస్తామని చెబుతున్నారు. పదేళ్లుగా ఏపి జనం నమ్ముతున్నారు. ఇంకా ఏపిని ఎంత దూరం తీసుకెళ్తారో చూడాలి. ఏళ్లకేళ్లు రాజకీయం తప్ప, అభివృద్దిని పక్కడ పడేస్తారో చూడాలి. ఎందుకంటే తెలంగాణలో మూడేళ్లలో కాళేశ్వరం నిర్మాణం పూర్తయ్యింది. కాని పదేళ్లు దాటుతున్నా పోలవరం ఇంకా అక్కడే వుంది. అది ఎప్పుడేపూర్తవుతుందో ఎవరికీ తెలియదు. ఎక్కడ పాలన సాగాలో అక్కడే పాలకులు వుంటే అభివృద్ది, ప్రగతి వేగంగా జరుగుతుంది. ఎక్కడో వుండిపాలిస్తాం. పనులు సమీక్షిస్తాం..ప్రజలకు మేలు చేస్తామంటే ఇలాగే వుంటుంది. తెలుగులో వెరీ పాపులర్‌ సామెత ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అని చెప్పుకోవాల్సి వస్తుంది.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version