చాకలి ఐలమ్మ 130వ జయంతి వేడుకలు….

చాకలి ఐలమ్మ 130వ జయంతి వేడుకలు

భూపాలపల్లి నేటిధాత్రి

 

చాకలి ఐలమ్మ 130 జయంతి వేడుకలను భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది చాకలి ఐలమ్మ ఓ సామాన్య స్త్రీ దొరలకు ఎదురు తిరిగింది. తనపై దాడి చేస్తే ప్రతిఘటించి, ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. తనపై తప్పుడు కేసులు బనాయించిన దొరలకు సవాల్‌ విసిరి కోర్టులో కేసు గెలిచి చరిత్ర సృష్టించింది. ఆమె చాకలి ఐలమ్మ అసలు పేరు చిట్యాల ఐలమ్మ తిరుగుబాటుకు స్ఫూర్తి ఐలమ్మ, బానిసత్వ సంకెళ్ల నుంచి శ్రామిక ప్రజలకు విముక్తి కలిగించిన వీరవనిత. దొరగడీలో గడ్డి మొలుస్తదని సవాలు విసిరి అచరణలో నిరూపించిన వీరనారి ఐలమ్మ నేటి ఆధిపత్య కుల సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై నిత్యం ఉద్యమించాలి.
రైతాంగ సాయుధ పోరాట యోధురాలు తన ఉద్యమ నేపథ్యంలో 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచడం జరిగింది ఐలమ్మ ఆశయాలు కొనసాగించాలి అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో
చంద్రగిరిశంకర్ ఓరుగంటి ఐలయ్య,బొడ్డుపెల్లి మల్లేష్ , గడ్డం సమ్మయ్య
నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు మాజీ ఎమ్మెల్యే గండ్ర…

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు మాజీ ఎమ్మెల్యే గండ్ర

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో చాకలి ఐలమ్మ జయంతినీ పురస్కరించుకొని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ
తెలంగాణ సాయుధ పోరాటంలో విరోచ్చితంగా పోరాటం చేసి, నాటి భూస్వాముల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసిన చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించుకోవడం చాలా ఆనందకరం, ఆమె యొక్క విరోచ్చిత పోరాటం నేటి యువతరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జనార్ధన్ మున్సిపల్ మాజీ చైర్మన్ వెంకట్ రాణి సిద్దు నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version