గురు పౌర్ణమి సందర్భంగా సత్యసాయి మందిరంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు
వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి పట్టణంలో గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ సత్య సాయి మందిరంలో షిరిడి సాయి సత్య సాయి బాబాకు అభిషేకాలు ప్రత్యేక పూజలు భజనలు ఘనంగా నిర్వహించామని శ్రీ సత్య సాయి సేవ సంస్థ కన్వీనర్ రమేష్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు అనంతరం భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ చేశామని ఆయన తెలిపారు
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు మత్స్యకారుల రైతు వేదికలో నేషనల్ అగ్రో ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ మత్స్య రైతుల దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు..
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఉత్తమ ప్రతిభ కనబరిచిన సొసైటీ సభ్యులకు ప్రశంసా పత్రాలు అందజేసి సన్మానించారు..అనంతరం చేపల స్టాల్స్ ను సందర్శించారు. వారు మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మత్స్య సంపద పెంపొందించడానికి తన వంతు ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు..మొన్నటి రోజూ మంత్రీ శ్రీహరి కరీంనగర్ వచిన్నపడు వారితో చేపల పెంపకం,మత్స్యకారుల గురించి మాట్లాడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని చెరువుల్లోకి సకాలంలో చేప పిల్లలు పంపిణీ చేస్తుందనీ తెలిపారు.. బలహీన వర్గాల ఆర్థికంగా ఎదగడానికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు అందజేస్తుందని అన్నారు.గతంలో మిడ్ మానేరులో చేపలను వదలడం జరిగిందని, మన ప్రాంతంలో మల్కపేట్ రిజర్వాయర్ కుడా అందుబాటులోకి వచ్చిందని వాటిలో కూడ చేపల పెంపకం ఏర్పాట్లు విధానం పరిశీలించాలన్నారు. గతంలో తెగిపోయిన చెరువులు మరమ్మత్తులు పూర్తి చేశామని అన్నారు.. ఇంకా ఎక్కడ చెరువులు మరమ్మత్తులు ఉంటే చేపడతానని తెలిపారు… ఎమ్మెల్యేగా గెలిచిన 3 నెలల్లోనే కథాలపూర్ మండలం లోని తెగిపోయిన చెరువులను మరమ్మత్తులు చేసినట్లు తెలిపారు. మల్కపేట రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చెసి ఎల్లారెడ్డిపేట వరకు రైతులకు సాగు నీరు అందించమని తెలిపారు.గతంలో మిడ్ మానేరు డ్యాంలో కేజీ కల్చర్ విధానంలో చేపల పెంపకం కోసం ముంపు గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించమని కేజీ కల్చర్ చేపల పెంపకం చేపట్టడం కోసం ముందుకు రావాలన్నారు.చేపల పెంపకంలో అధునాతన సాంకేతిను అందిపుచ్చు కోవాలన్నారు… కేజీ కల్చర్ విధానంలో చేపల పెంపకానికి ముందుకు వస్తె రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీలు అందజేస్తామని తెలిపారు..
దేశంలో మత్స్య సంపద పెరగాలని చేపలు ఆరోగ్యానికి మంచిదనీ ,ప్రభుత్వం మత్స్యకారులకు అనేక రకాలుగా ప్రోత్సాహకాలు అందజేస్తుందని తెలిపారు.గత ప్రభుత్వం పెట్టిన ఒక్క పథకాన్ని కూడా రద్దు చేయకుండా వాటిని కొనసాగిస్తూ నూతన పథకాలను అమలు చేస్తున్నామన్నారు..రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాట మేరకు మహిళ తల్లులకు ఉచిత బస్సు ప్రయాణం,500 కు సిలిండర్,10 లక్షల అరోగ్య శ్రీ,పది సంవత్సరాలుగా పేద ప్రజలు ఎదురు చూస్తున్నా ఇందిరమ్మ ఇల్లు, నూతన రేషన్ కార్డులను మంజూరు చేసినట్లు తెలిపారు.. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ స్వరూప, జిల్లా ఫిషరీస్ చైర్మన్ చొప్పరి రామచంద్రం, డి ఏ వో అఫ్జల్ బేగం, మల్లికార్జున్, పి కిషోర్, నేషనల్ ఆగ్రో ఫౌండేషన్ రాష్ట్ర కోఆర్డినేటర్ సునీల్ కుమార్,, అడ్వైజర్ విద్యాసాగర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికారులు
సారు.. మాకు న్యాయం చేయండి
భూపాలపల్లి నేటిధాత్రి
గత కొద్ది రోజులుగా ఇంటి పక్కన వారు తీవ్ర ఇబ్బంది పెడుతున్నారని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేదని, అధికారులు మాకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు జరుపుల గంగ- కిషన్ లు కోరారు. జిల్లా కేంద్రంలోని కాకతీయ ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తాము గత 20 సంవత్సరాల క్రితం కారల్ మర్క్స్ కాలనీలో ఇల్లు కొనుగోలు చేసుకుని ఇక్కడే నివాసం వుంటున్నామని, మా ఇంటి పక్కన వున్న వ్యక్తి మా ఇంటి కి, పక్క ఇంటికి మధ్యలో వున్న మాకు చెందిన ఖాళీ స్థలంలో ఉన్న మిషన్ భగీరథ పైపులను కాల్చరన్నారు. మా స్థలంలో వున్న మా మామిడి చెట్టును వారే నరకడంతో వాళ్ళ ఇంటి పైనే పడి రేకుల పై పడటంతో మమ్మల్ని కారకులుగా చేస్తూ నానా ఇబ్బందులకు గురి చేశారన్నారు. ఇప్పటికే వారి పై పలుమార్లు స్టేషన్ లో పిర్యాదు చేశామన్నారు. కానీ ఇంకా తరచూ మమ్మల్ని భూమి గెట్టు విషయమై వేధింపులకు గురి చేస్తున్నారని, ఈ విషయమై 100కు ఫిర్యాదు చేశామని, స్థానిక పోలిస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేసినా, కానీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. వారి నుండి మా కుటుంబానికి ప్రాణహాని ఉందని అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని కోరారు. కాగా ఈ విషయమై స్థానిక ఎస్సైని ఆంధ్రప్రభ ఫోన్లో వివరణ కోరగా నేడు విజిట్ చేసి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Allotment of double bedroom houses to deserving people…
ఆర్డీవో శ్రీనివాసులు, ఎమ్మార్వో సతీష్ కుమార్,కమిషనర్ గద్దె రాజు
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు రామకృష్ణాపూర్ లోని ఆర్కేసీఓఏ క్లబ్ లో లాటరీ ద్వారా ఇండ్ల కేటాయింపు జరిగింది. మంచిర్యాల్ ఆర్డీవో శ్రీనివాసులు,మందమర్రి తహసిల్దార్ సతీష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు ఆధ్వర్యంలో లబ్ధిదారులకు లాటరీ ద్వారా చీటీలు తీసి అర్హులకు ఇండ్ల నెంబర్లను అందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 286 ఇండ్లకు గాను 230 ఇండ్లను లబ్ధిదారుల సమక్షంలోనే విద్యార్థులతో లాటరీ ద్వారా చీటీలు తీయించి అర్హులకు డబుల్ బెడ్రూం ఇండ్ల నెంబర్లను కేటాయించడం జరిగిందని తెలిపారు. దివ్యాంగులకు మొదటగా 13 ఇండ్లను లాటరీ ద్వారా అందించిన అనంతరం 217 ఇండ్లను అందరికీ కలిపి అందించడం జరిగిందని పేర్కొన్నారు. ఇండ్ల కేటాయింపులో ఎలాంటి అవకతవకలు లేకుండా పారదర్శకంగా నిర్వహించామని అన్నారు. ఎవరికైతే లాటరీ పద్ధతి ద్వారా ఇండ్ల కేటాయింపు జరిగిందో వారి బ్యాంకు అకౌంట్ బుక్, ఆధార్ కార్డ్ , ఎలక్షన్ కార్డు, అప్లికేషన్ ఫామ్ లు తీసుకొని సాఫ్ట్ వేర్ లో డాటా ఎంట్రీ చేసిన అనంతరం పట్టా సర్టిఫికేట్ రాగానే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇల్లును అందజేస్తామని తెలిపారు.ఇండ్ల కేటాయింపు స్థలమైన క్లబ్ కు బెల్లంపల్లి ఏసిపి రవికుమార్, మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి లు పరిశీలించారు. పట్టణ ఎస్సై రాజశేఖర్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
ప్రాంతీయ రాజకీయాలకు రానున్న కాలం అనుకూలం కాకపోవచ్చు
దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి కొనసాగుతున్న వలసలే ఇందుకు కారణం
వలసలవల్ల ఎక్కువ భాషలపై పట్టు స్థానికులకు ఎంతో ప్రయోజనకరం
దేశవ్యాప్తంగా ప్రజల అనుసంధానతకు దోహదం
అవసరాల రీత్యా పంథాను
మార్చుకుంటేనే పార్టీలకు మనుగడ
డెస్క్,నేటిధాత్రి:
మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఇటీవలి కాలంలో ప్రాంతీయ పార్టీలు రెచ్చగొడుతున్న ప్రాంతీయభాషాభిమానం రానురాను వికృతరూపం దాల్చి, తీవ్రస్థాయి భాషా ద్వేషాలకు దారితీసే ప్రమాదం ఏర్పడుతోంది. దేశ సమైక్యతను దెబ్బతీసేవిధంగా, ప్రాంతీయ దురభిమానాలను రెచ్చగొట్టి ఓట్ల రాజకీయం కోసం పాకులాడే ప్రాంతీయ పార్టీల వైఖరికి దేశ ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడటం దారుణం. పాఠశాల స్థాయి విద్యలో త్రిభాషా సూత్రాన్ని పాటించాలని మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మరాఠీ భాషాభిమానాన్ని నరనరానా నింపుకున్నప్పటికీ గత 18 సంవత్సరాలుగా ఉప్పు, నిప్పుగా వుంటున్న ఠాక్రే సోదరులు ఏకం కావడానికి దోహదం చేసింది. బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం మరాఠీభాషకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటోందంటూ వీరు విరుచుకుపడ్డారు. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ్ సమితి నాయకుడు రాజ్ ఠాక్రేలు ఇప్పుడు మరాఠీభాషపై ఒకే రాగం వినిపిస్తున్నారు. అయితే తాను తీసుకున్న నిర్ణయం సరికొత్త సమస్యకు దారితీయడంతో, మహారాష్ట్ర ప్రభుత్వం దీని అమలులో వెనక్కి తగ్గింది. దీంతో ఈ విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవడానికి ఠాక్రే సోదరులు జులై 5న ‘విజయోత్సవాలు’ నిర్వహించడం ఈ భాషా వివాద ఎపి సోడ్‌లో పరాకాష్ట. ఇతవరకు బాగానే వున్నప్పటికీ, ఠాక్రే సోదరులు కలిసి భాషా ‘నినాదం’ చే యడం కొత్త సమస్యలకు దారితీస్తుందేమోన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందినవారు ఉపాధి పొందుతున్నారు. 2000 సంవత్సరంలో రాష్ట్రంలో చెలరేగిన మరాఠీ భాషాభిమానంతో ఠాక్రే సోదరుల అనుచరులు గుజరాత్, ఉత్తరభారత్ నుంచి ముంబయిలో నివాసముంటున్న వ్యాపారులతో పా టు వివిధ రంగాలకు చెందినవారిపై విపరీతంగా దాడులు చేయడం చరిత్ర. మళ్లీ అది పునరా వృత్తమవుతుందా? అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. నిజానికి భాషా వివాదాం ఒక్క మహారాష్ట్రకే పరిమితం కాదు, ఇటీవల బెంగళూరులో ఒక బ్యాంక్ మేనేజర్ కన్నడంలో మాట్లాడటానికి అంగీకరించనందుకు, పెద్ద గొడవే జరిగింది. చివరకు సదరు బ్యాంకు యాజమాన్యం మేనేజర్‌ను బదిలీచేసి వివాదానికి తెరదించింది. ఇక తమిళనాడు లో డీఎంకే రాజకీయాలు చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రతి ఒక్క డీఎంకే నాయకుడికి హిందీ వస్తుంది. కానీ అంతా హిందీని తీవ్రంగా ద్వేషిస్తారు. ప్రాంతీయ పార్టీల మూర్ఖత్వం వల్ల దెబ్బతినిపోయేది ప్రజలు మాత్రమే. నాయకులు బాగానే వుంటారు. ఓట్ల రాజకీయం కోసం వీరి రెచ్చగొట్టే వ్యవహారశైలి దేశ సమగ్రతకు ఎంతమాత్రం ఉపయోగపడదు! స్థానిక భాష తల్లితో సమానం కనుక దాన్ని గౌరవించి తీరవలసిందే. మాతృభాషలో బోధన జరగాల్సిందే. అయితే దేశవ్యాప్తంగా అనుసంధానత ఏర్పడాలంటే జాతీయభాషను అనుసరించక తప్పదు. దీన్ని పక్కనబెట్టి తమ సంకుచిత రాజకీయ ప్రయోజనాలకోసం రాజకీయ పార్టీలు ప్రజలను రెచ్చగొట్టడంవల్ల అశాంతి తప్ప ఒరిగేదేమీ వుండదు. నిజానికి దేశం సాంత్రంత్య్రం పొందిన తర్వాత, క్రమంగా భాషావివాదాలు చోటుచేసుకోవడం మొదలైంది. దీనికి ఆద్యులుగా చెప్పుకోవలసింది ఆంధ్రరాష్ట్ర ఉద్యమం. తెలుగువారికి ఒక ప్రత్యేక రాష్ట్రం కోరుతూ పొట్టిశ్రీరాములు నిరాహారదీక్ష, ఆత్మార్పణం, 1952 ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతాన్ని అగ్నిగుండంగా మార్చింది. భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు అప్పటి ప్రధాని నెహ్రూకు ఎంతమాత్రం ఆమోదయోగం కాకపోయినా, ఆంధ్ర పరిణామాల నేపథ్యంలో ఆయనపై విపరీతమైన ఒత్తిడి పెరిగిన నేపథ్యం భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడటానికి దారితీసింది. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు ఈవిధంగా ఏర్పడినవే. తర్వాత బంబాయి రాష్ట్ర వివాదం మరో ప్రకంపనలకు కారణమైంది. సంయుక్త మహారాష్ట్ర సమితి ఆధ్వర్యంలో బంబాయి రాజధానిగా మరాఠీ బాష మాట్లాడేవారికి ప్రత్యేక రాష్ట్రం కావాలన్న ఆందోళన మొదలైంది. 1955`56లో ఈ ఉద్యమంలో 106మంది ప్రాణాలు కోల్పోవడం చరిత్ర. చివరకు 1960 మే 1న బంబాయి పునర్విభజన చట్టం అమల్లోకి వచ్చింది. ఫలితంగా బంబాయి రాజధానిగా మహారాష్ట్ర ఏర్ప డిరది. నాటి బంబాయి రాష్ట్రం నుంచి గుజరాతీ మాట్లాడేవారితో గుజరాత్ రాష్ట్రం ఏర్పడిరది. ఇప్పటికీ ఈ రెండు రాష్ట్రాల మధ్య బెలగావీ వంటి సరిహద్దు ప్రాంతాలపై వివాదం కొనసాగు తూనే వుండటం గమనార్హం. ముఖ్యంగా వివిధ రాష్ట్రాల్లో భాషావివాదాలు చెలరేగడానికి ప్రధాన కారణం, ఉత్తర భారత రా ష్ట్రాలైన ఉత్తప్రదేశ్, రaార్ఖండ్, బిహార్ మరియు మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలనుంచి పెద్దఎత్తున జీవనోపాధికోసం ప్రజలు ఇతర రాష్ట్రాల్లోని టైర్`2 నగరాలకు వలసపోవడంతో, సాంస్కృతిక, భాషా పరమైన కొత్త సంప్రదాయాల ప్రవేశంతో పాటు జనాభాపరంగా కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. హాస్పిటాలిటీ, నిర్మాణరంగం, భద్రత వంటి రంగాల్లో బ్లూకాలర్ ఉద్యోగాలకు, ఉత్తరాదినుంచి వచ్చిన హిందీభాష మాట్లాడేవారు వెన్నెముకగా మారారు. ఇదే సమయంలో ముంబయి, బెంగళూరు, పూణె, హైదరాబాద్, చెన్నై వంటి నగరాలకు ఇదే ఉత్తరభారత్ నుంచి వైట్ కాలర్ (ముఖ్యంగా ఐటీ) ఉద్యోగులు వలస రావడం బాగా పెరిగిపోయింది. వీరి జనాభా క్రమంగా పెరిగిపోవడంతో, స్థానికులు వీరితో సమాచారాన్ని పంచుకోవడానికి హిందీ లేదా ఇంగ్లీషు భాషలపై ఆధారపడాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రతి పదివేల మందిలో హిందీ భాషను మాట్లాడేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈవిధంగా వలసవచ్చిన వారి ప్రభావం క్రమంగా పెరగడంతో స్థానికుల్లో అభద్రతకు దారితీస్తోంది. ఈ ‘అభద్రత’ భావాన్ని ఎప్పటికప్పుడు రెచ్చగొట్టడం ద్వారా ప్రజల ఓట్లు దండుకోవచ్చన్న సత్యాన్ని గ్రహించిన ప్రాంతీయ పార్టీలు ఎప్పటికప్పుడు, ప్రాంతీయ భాషా వివాదాలను రెచ్చగొడుతూ తమ పబ్బం గడుపుకుంటున్నాయి. తమిళనాడులోని డీఎంకే, పశ్చిమబెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్, మహారాష్ట్రలోని శివసేన వంటి పార్టీల మనుగడ ఈ ప్రాంతీయ భాషా వివాదాలపై ఆధారపడివుంటం గమనార్హం. ఇటీవలి కాలంలో నరేంద్రమోదీ, అమిత్‌షాలు జాతీయస్థాయిలో రాణిస్తున్న నేపథ్యంలో బీజేపీని గుజరాతీ పార్టీగా, వీరిద్దరినీ గుజరాత్‌కు మాత్రమే ప్రయోజనం కల్పించే నాయకులుగా ఈ ప్రాంతీయ పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. ఆవిధంగా బీజేపీని గుజ రాత్‌కు చెందిన పార్టీగా ప్రజల్లో చూపించడానికి తీవ్రంగా యత్నిస్తున్నాయి. 1960 ప్రాంతంలో శివసేన అధినేత బాల్ థాకరే, ముంబయిలో తమిళ వ్యతిరేక ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా మరాఠీ యువత ఉద్యోగాలను తమిళులు ఆక్రమించేస్తున్నారంటూ రేపిన ఉద్యమంతో, అప్పట్లో ముంబయి మున్సిపల్ ఎన్నికల్లో శివసేన ఎక్కువ సీట్లు గెలుచుకోగలిగింది. అయితే తర్వాతి కాలంలో శివసేన ప్రగతి ఆగిపోయింది. ఒకదశలో పార్టీ భవిష్యత్తు అగమ్యగోచర స్థితికి చేరుకుంది. సరిగ్గా అదే సమయంలో నాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి వసంత్‌దాదా పాటిల్, బంబాయి ప్రాధాన్యతను తగ్గించే విధంగా కొన్ని ప్రకటనలు ఇవ్వడం, బాల్ థా కరేకు కలిసొచ్చింది. దీంతో మరాఠీ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి 1985లో జరిగిన బీఎంసీ ఎన్నిక ల్లో కొన్ని సీట్లు గెలుచుకోగలిగింది. అయితే భాషా రాజకీయాలవల్ల ప్రయోజనం చాలా పరిమితమేనన్న సత్యం థాకరేకు బాగా అర్థం కావడంతో ఒక్కసారిగా హిందూత్వకు అనుకూలంగా దూకుడుగా వ్యవహరించడం మొదలుపెట్టారు. ఆవిధంగా పార్టీ బేస్‌ను రాష్ట్రంలో మరింత విస్త రించు కోవడమే కాదు 1995నాటికి బీజేపీలో జట్టుకట్టే స్థాయికి పార్టీని తీసుకెళ్లారు. ఇక మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్‌ఎస్) అధినేత రాజ్ థాకరే కూడా హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని చేపట్టి మరాఠీ సెంట్‌మెంట్‌ను రెచ్చగొట్టడంతో 2009లో లోక్‌సభ ఎన్నికల్లో గుర్తించదగిన స్థాయిలో ఓట్ల షేర్‌ను పొందగలిగింది. అయితే కేవలం భాషా రాజకీయాలు ఎంఎన్‌ఎస్ ఎ దుగుదలకు ఎంతమాత్రం దోహదం చేయలేదు. పలితంగా పార్టీ ఎదుగుబదుగులేని స్థితిలో ప్రస్తుతం కొట్టుమిట్టాడుతోంది. మహారాష్ట్ర ఏకీకరణ్ సమితి (ఎంఈఎస్) పరిస్థితి కూడా ఇంతకు మించి గొప్పగా ఏమీ లేదు. బెలగావి ప్రాంతంలో మరాఠీ ప్రజల హక్కులకోసం పోరాటం మొదలుపెట్టినా, ఇప్పుడు ఈ నగరంలోని కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. పశ్చిమబెంగాల్ విషయానికి వస్తే 2021ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్, స్థానిక బెంగాలీ మరి యు ఇతర ప్రాంతాలవారు అన్న అంశాన్ని ముందుకు తెచ్చింది. ముఖ్యంగా బీజేపీ స్థానిక పార్టీ కాదని, వీరు ఉత్తరాదినుంచి వచ్చినవారుగా అంటే ‘బోహిర్గటో’గా ప్రచారం చేసింది. ఆవిధంగాబెంగాలీ హిందువుల్లోకి బీజేపీ చొచ్చుకెళ్లకుండా అడ్డుకోవడానికి యత్నించింది. ఇదే సమయం లో బీజేపీ హిందూత్వను ప్రజల్లోకి తీసుకెళ్లింది. అయితే తృణమూల్ అమలు చేసే సంక్షేమ పథకాలు, ముస్లిం ఓట్లు గంపగుత్తగా పడటంతో అధికారంలోకి రాగలిగింది. అంతేకాదు ‘బెంగాలీ అస్మిత’కు తానే ప్రతినిధిగా చూపుకోవడానికి మమతా బెనర్జీ తీవ్రంగా యత్నించారు. ఇక తమిళనాడు విషయానికి వస్తే డీఎంకే ఇప్పుడు హిందీ వ్యతిరేక భావజాలాన్ని బాగా ప్రచారం చేస్తోంది. రాష్ట్రంలో బీజేపీ ఉనికి నామమాత్రమే. ఈ నేపథ్యంలో గట్టి పోటీదారులైన డీఎంకే, ఏఐడీఎంకేల మధ్యనే అధికార మార్పిడి జరుగుతుంటున్న నేపథ్యంలో, ఏఐడీఎంకేతో పొత్తు పెట్టుకోవడం ద్వారా బీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతోంది. 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలు, బీజేపీని గుజరాతీల పార్టీగా ప్రచారం చేశాయి. ముఖ్యంగా గుజరాతీ వ్యాపారులు, మరాఠి అస్మితను దెబ్బతీస్తున్నా రంటూ ప్రజల్లో సెంటిమెంట్‌ను రెచ్చగొట్టడానికి యత్నించారు. ఇంతగా ప్రచారం చేసినా మహాయుతి (ఎన్‌డీఏ) మొత్తం 288 స్థానాల్లో 235సీట్లను గెలుచుకొంది. మొత్తంమీద ఈ విశ్లేషనలను పరిశీలిస్తే, ప్రాంతీయ భాషా వివాదాలు, ప్రాంతీయతలు భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి, ఎన్నికల సమయంలో ఓట్లను రాబట్టుకోవడానికి మాత్రమే పనికి వస్తాయన్నది స్పష్టమవుతోంది. ఇదే సమయంలో ఒక్క భాషా వివాదాన్ని పట్టుకొని వేలాడటం వల్ల ఏ పార్టీకి భవిష్యత్తు వుండదనేది కూడా సుస్పష్టం. ఎంతవద్దనుకున్నా టైర్`2, టైర్`3 పట్టణాల్లోకి ఉపాధి అవకాశాల నిమిత్తం వివిధ ప్రాంతాలనుంచి వలసలు పెరుగుతున్న నేపథ్యంలో రాబోయే కాలంలో భాష కంటే, సౌకర్యాలు, సదుపాయాలు, సుపరిపాలనకే ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఎక్కువ. భాషా వివా దాలవల్ల ప్రయోజనం లేదని, కేవలం సుపరిపాలన వల్లనే సౌకర్యవంతమైన జీవితాన్ని అనుభ వించగలుగుతామన్న భావన పెరగడంవల్ల పార్టీలు కూడా భవిష్యత్తులో తమ స్టాండ్‌ను మార్చుకోక తప్పదు.
`వెనుకబడినట్లు కనిపించినా విజయాన్ని అందరి ముందు అందుకుంటారు
`ప్రత్యర్థులను దారి మళ్లించే ఎత్తులు వ్యూహాత్మకంగా వేస్తారు
`ప్రతిపక్షాలను అల్లాడిస్తూ, ఊహకందిని దెబ్బ కొడుతున్నారు
`ఆరు గ్యారంటీలను చాలా జాగ్రత్తగా అమలు చేస్తున్నారు
`బీఆర్‌ఎస్ ఎక్కువ తప్పటడుగు వేసిందో అక్కడి నుంచి మొదలుపెట్టారు
`కుందేలు, తాబేలు కథను అక్షరాల అనుసరిస్తూ ముందుకెళ్తున్నారు
`ఒక్కక్కటీ పూర్తి చేసి తిరుగులేని శక్తిగా మారుతున్నాడు
హైదరాబాద్,నేటిధాత్రి:
కౌరవులను ఓడిరచాలంటే, రాజ్యం గెలవాలంటే ధర్మ రాజు కూడా అబద్దమాడక తప్పలేదు. రాజుల మధ్య యుద్దంలో రాజ్యాల కోసం యుక్తితోనే కాదు, కుయుక్తులు కూడా ఆచరించాల్సిందే. లేకుంటే విజయం వరించదు. రాజ్యం దక్కడు. రాజకీయం కూడా అంతే అధర్మ పాలన అంతం చేయాలంటే కొన్ని సార్లు నాయకులు మాటలు చెప్పకతప్పదు. ముళ్లును ముళ్లుతోనే తీయాలనేది రాజకీయాలకు కూడా పనికొస్తుందని చూపించిన నాయకుడు సిఎం. రేవంత్‌రెడ్డి. అబద్దాలను, అబద్దాలతోనే ఎదుర్కొవాలని తెలిసిన నాయకుడు రేవంత్ రెడ్డి. అందుకే 2015లో ఓసారి అమెరికా వెళ్లినప్పుడు కుండబద్దలు కొట్టినట్లు నాయకులు ఎలాంటి వారు. తనతోసహా అంటూ ఆయన రేవంత్ చెప్పిన మాటలు అప్పుడు ఆశ్చర్యానికి గురిచేశాయి. కాని అదే రేవంత్‌రెడ్డికి విజయం కూడా చేకూర్చాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి బోలా శంకురుడు. ఏది మనసులోదాచుకోడు. నిజమైనా, అబద్దమైన నిర్భయంగా చెప్పగలిగే ఏకైక నాయకుడు. అందుకే అలవి కాని హామీలను గుప్పించి, రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కేసిఆర్‌ను ఓడిరచాలంటే అదే మార్గం ఎంచుకోవాలనుకున్నాడు. కేసిఆర్ ఎత్తుకు పై ఎత్తు వేశారు. ఆఖరుకు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మ్యానిఫోస్టోను కేసిఆర్ కూడా అనుసరించేలా చేశారు. అక్కడే సిఎం. రేవంత్ రెడ్డి ఎన్నికల ముందే గెలిచాడు. ఎందుకంటే కాంగ్రెస్ హామీలను కేసిఆర్ కూడా కాపీ కొట్టి మరోసారి నమ్మించాలని చూశాడు. సిఎం.రేవంత్ రెడ్డి ముందు కేసిఆర్ పప్పులుడకలేదు. నిజాన్ని బతికించాలంటే అబద్దాన్ని కూడా ఓ ఆయుధంగా రేవంత్‌రెడ్డి వాడుకోవాలనుకున్నాడు. అక్షరాల అదే అనుసరించారు. కేసిఆర్ పాలనకు చరమగీతం ప్రజల చేత పాడిరచారు. కేసిఆర్‌కు దిమ్మతిరిగేలా రేవంత్ రెడ్డి రాజకీయం నెరిపి తెలంగాణలో టాల్ పర్సనాలిటీ అయ్యారు. నాయకుడుగా గెలిచి నిలిచారు. రేవంత్‌రెడ్డి తెలంగాణ పాలకుడయ్యారు. ఇలాంటి రాజకీయాలు అందరి వల్ల కాదు. ఎందుకంటే రేవంత్‌రెడ్డి ఒక స్పోట్స్ మాన్. నిజమైన స్పోర్టివ్ పొలిటీషియన్. ఒక్క మాటలో చెప్పాలంటే అటు పాలకపక్షంలోని వాళ్లుకు, ఇటు ప్రతిపక్షాలకు అంతు చిక్కని వ్యూహాంతో అంతుపట్టని రాజకీయం సిఎం. రేవంత్ చేస్తున్నారు. పైకి చూడడానికి ఏమీ లేదనే భావన కల్పిస్తున్నాడు. ప్రతిపక్షాలను చూపును మరల్చి తాను అనుకున్న వ్యూహం అమలు చేస్తున్నారు. అది తెలిసిన నాడు బిఆర్‌ఎస్, కేసిఆర్‌కు కూడా మరోసారి దిమ్మ తిరిగిపోవాలి. ఎవరికీ అంతు పట్టని రాజకీయాన్ని రేవంత్‌రెడ్డి చూపిస్తున్నారు. అది అర్దం కాక పాలన తేలిపోతుందని అనుకుంటున్నారు కాని, అసలు రాజకీయం తెలిసేందుకు మౌనం వహిస్తున్నాడు. ఇలాంటి రాజకీయం గతంలో ఎవరూ నెరపలేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఒక స్పోర్ట్ మ్యాన్. వారిలో వుండే స్పిరిట్ అందిరకీ అర్దం కాదు. చేసుకోలేరు. ఆయన పరిపానలతో కూడా అనుసరిస్తున్న వ్యూహంలో చాలా లోతైన ఆలోచన వుంది. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారు. అది తెలియక ఇచ్చినవి కాదు. తెలిసే ఇచ్చారు. ఎందుకంటే కేసిఆర్ రెండుసార్లు ఇచ్చిన హమీలను నిశితంగా రేవంత్ రెడ్డి గమనిస్తూ వచ్చారు. వాటిని తలదన్నేలా కొత్త వ్యూహాలు ఎంచుకున్నాడు. ఓ వైపు కేసిఆర్ ఇచ్చిన హమీలను అమలు చేస్తూనే, కేసిఆర్ ఎక్కడ వదిలేశాడో అక్కడి నుంచి రేవంత్ పాలనా రాజకీయం నెరుపుతున్నారు. రుణమాఫీతోనే మొదలు పెట్టారు. కాని అది అందరూ అర్దం చేసుకోవడం లేదు. గత పదేళ్ల కాలంలో కేసిఆర్ రెండుసార్లు రుణమాఫీ చేశారు. కాని అది ప్రజల్లోకి వెళ్లలేదు. దానిని మర్చిపోయేందుకు కేసిఆర్ రైతు బంధు తెచ్చారు. నిజం చెప్పాలంటే రుణమాఫీ చేస్తే రైతులు అప్పుడే మర్చిపోతారు. నేరుగా రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేస్తే మళ్లీ ఎన్నుకుంటారని భావించాడు. అది కూడా ఒకే దఫాకు రైతులు మర్చిపోయేలా రేవంత్ రెడ్డి చేశారు. అందుకే ముందు రేవంత్ రెడ్డి పదే పదే రుణమాఫీ చేశారు. అది కాకుండా ఇందిరమ్మ ఇండ్లు చేపట్టినా ప్రజల్లో రుణమాఫీ మీదనే రైతుల ఆలోచన వుండేది. రైతు భరోసా రెండు సార్లు ఆపేశాడు. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు మొదలు పెట్టారు. పల్లెల్లో కొత్త శోభను తెచ్చాడు. కేసిఆర్ నీళ్లు తెచ్చినా, కరంటు తెచ్చినా డబుల్ బెడ్ రూంలు ఇవ్వలేదన్న ఆగ్రహంతో ప్రజలున్నారు. అందులో రైతులు కూడా వున్నారు. ఈ రెండు వర్గాలను ఏక కాలంలో గెలవాలంటే ముందు ఇందిరమ్మ ఇండ్లు మెదలు పెడితే ప్రజలను ఆకర్షించొచ్చు అనుకున్నారు. ఇటీవల రైతు భరోసా ఇచ్చారు. ఆ వెంటనే ఇందిరమ్మ ఇండ్లు మొదలు పెట్టారు. దాంతో పల్లెల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రైతు రుణమాఫీపై చర్చ ఆగిపోయింది. రైతు భరోసా అందలేదన్న మాట ఆగిపోయింది. రైతుకు బ్యాంకుల రుణాలు ఎక్కడా ఆగలేదు. పదేళ్లుగా అదిగో, ఇదిగో డబుల్ బెడ్ రూంలు అంటూ ఊరించిన కేసిఆర్ ఇండ్లు ఇవ్వలేదు. దాన్ని ముందు పూరిస్తే కాంగ్రెస్ మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుందని రేవంత్‌రెడ్డి బలంగా నిరూపించాలనుకున్నారు. తొలి విడతగా లక్ష ఇండ్లు మాత్రమే మొదలు పెట్టారు. ప్రజల్లో ఎలాంటి స్పందన వస్తుందో తెలుసుకున్నారు. ప్రజల్లో ఇండ్లపై వున్న ఆశలు తీర్చే నాయకుడుగా రేవంత్‌ను ప్రజలు కీర్తిస్తున్నారు. ఇలా వచ్చే ఐదేళ్లులో ఏడాదికి 5లక్షల ఇండ్లు మంజూరు చేసుకుంటూ పోతే వచ్చే ఎన్నికల నాటికి ఎంత లేదన్నా 15లక్షల మందికి ఇండ్లు అందుతాయి. కేసిఆర్ రైతు బంధు సకాలంలో ఇచ్చేవారన్న మాట పల్లెల్లో ఎలా వుందో..రేవంత్ రెడ్డి మిగిలిపోయిన వాళ్లు తప్పకుండా ఇండ్లు ఇస్తారన్న నమ్మకం మరింత బలపడుతుంది. అది వచ్చే పంచాయితీ ఎన్నికల్లో జనం బ్రహ్మరథం పెట్టేందుకు దోహపడుతుంది. ఎందుకంటే కేసిఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హమీలకు, ఖనాలో సొమ్ముకు చాలా అగాదం వుందని తెలుసుకున్నాడు. అందుకే డబుల్ బెడ్ రూంలకోసం అప్పులు పుట్టవు. సాగునీటి ప్రాజెక్టుల కోసమంటూ అప్పులు పుడతాయనుకున్నారు. కరంటు సమస్య తీరిస్తే ప్రజలు హమీల ఆలోచన మారుతుందనుకున్నాడు. అందుకే ఏక కాలంలో కేసిఆర్ చెరువుల పునరుద్దరణ అంటూ అప్పులు తెచ్చాడు. కరంటు ఉత్పాదన కోసం అప్పులు తెచ్చాడు. ప్రతి ఇంటికి సురక్షితమైన మంచినీరు అందించేందుకు మిషన్ భగీరథ పేరు చెప్పి అప్పులు చేశాడు. సంక్షేమ పథకాలపై ప్రజల ఆలోచన మళ్లకుండా కళ్యాణ లక్ష్మిని తెచ్చాడు. దాంతో రైతులు రుణమాఫీపై నిలదీయలేదు. డబుల్ బెడ్ రూంల గురించి మాట్లాడలేదు. రైతులకు మూడెకరాల భూమి గురించి మర్చిపోయారు. కళ్లముందు నీళ్లు, కరంటు కనిపిస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేయలేదన్న మాట మర్చిపోతారనుకున్నాడు. కళ్యాణ లక్ష్మి తెచ్చి మేనమామ అనిపించుకుంటాననుకున్నాడు. ఇందిరమ్మ ఇండ్లను పట్టించుకోలేదు. ఇవ్వడం సాధ్యం కాదనుకున్నాడు. ఆసమయంలో ఏకంగా తెలంగాణ వ్యాప్తంగా వచ్చిన 30లక్షల అప్లికేషన్లు చూసి సాధ్యమయ్యేది కాదనుకున్నాడు. అలా అటకెక్కించిన పథకాలను రేవంత్ రెడ్డి ఎంచుకున్నారు. ఎంత పరుగెత్తినా కేసిఆర్ డబుల్ బెడ్ రూంలు ఇవ్వలేదు. దానికితోడు ప్రజలకు నాయకుడుగా కేసిఆర్ అందుబాటులో లేరు. ఇన్ని పథకాలు అందించిన తర్వాత తాను జనంలోవున్నా, లేకున్నా ఓట్లు ఎక్కడికి పోవనుకున్నాడు. కాని కేసిఆర్ ఎక్కడ పొరపాట్లు చేశాడో వాటినే ఎన్నికల ముందు రాజకీయంగా రేవంత్ పట్టుకున్నారు. సెక్రెటరియేట్‌కు రాని ముఖ్యమంత్రి ఎందుకన్నాడు. ప్రగతి భవన్‌లో దాటి కేసిఆర్ రాకపోవడాన్ని తప్పు పట్టాడు. ఫామ్ హౌజ్‌లో వుండడాన్ని దొరతనంగా చిత్రీకరించారు. ఇలా కేసిఆర్‌పై అడుగడుగునా వ్యతిరేకత పెరిగేలా చేశారు. కేసిఆర్ దృష్టి అంతా రేవంత్ రెడ్డి మీద ఫోకస్ అయ్యేలా రాజకీయం నెరిపాడు. రేవంత్ రెడ్డితో తన రాజకీయ పతనం కేసిఆర్‌కు కదిలేలా చేశాడు. అప్పటి నుంచి రేవంత్‌పై నిర్భందం పెరిగేలా చూసుకున్నాడు. రేవంత్ రెడ్డికి జనంలో సానుభూతి సంపాదించుకున్నారు. కేసిఆర్‌ను ఎదిరించే నాయకుడు కేవలం రేవంత్‌రెడ్డి మాత్రమే అనే భావన ప్రజల్లో కల్పించారు. మరో వైపు ఎన్నికల శంఖారావం తాను పిసిసి. అద్యక్షుడైనప్పటి నుంచి పూరించి, ఏడాది ముందు రేవంత్ రెడ్డి ఆడిన ఆటను కేసిఆర్ కూడా తట్టుకోలేకుండా చేశాడు. ఓటమిని ఎన్నికల రాకముందే కేసిఆర్‌కు రుచి చూపించి, జనం మద్దతు కూడగట్టుకున్నాడు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించి రేవంత్ సిఎం. అయ్యారు.
-అర్హులైన పేదలందరికీ తొలి విడతలో అందుతున్న ఇండ్లు.
-ఈ ఏడాది లక్షకు పైగా ఇందిరమ్మ ఇండ్లు.
-నాలుగేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు.
-ఏటా 22 వేల కోట్ల ఖర్చుతో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు.
-పల్లె పల్లెలో పండుగ వాతావరణం.
-ఇంటి ముగ్గులతో సుందరశోభితం.
-ఇళ్లంటేనే ఇందిరమ్మ రాజ్యం.
-పేదింటి కల నెరవేర్చేదే ప్రజా ప్రభుత్వం.
-ఎన్నికల ముందు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు.
-తొలి ఏడాది లక్ష ఇండ్లకు శ్రీకారం.
-పేదలందరికీ ఇండ్లు కాంగ్రెస్ పార్టీకే సాధ్యం.
-పదేళ్ల ముందు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ.
-తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ ఇండ్లు ఇస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే.
-సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి శీనన్నకు ప్రజల ధన్యవాదాలు.
-కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలుగా మారుతున్న పల్లెలు.
హైదరాబాద్,నేటిధాత్రి:
పెళ్లి చేసి చూడు..ఇల్లు కట్టి చూడు అని పెద్దలన్నారు. ఆ రెండు ఎంతో కష్టతరమైనవి. ఖర్చుతో కూడుకున్నవి. అందుకే ఈ మాట పెద్దలు చెప్పారు. ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే జీవితాంతం కష్టపడిన సొమ్మును పొదుపు చేసి చేయాలి. అలాగే ఇల్లు కట్టుకోవాన్నా సరే అప్పు చేసినా జీవితాంతం తీర్చాలి. ఈ మాట పాత రోజుల్లోనే అంత గంభీరమైంది అంటే..ఇప్పుడు ఎంత కష్టతరమైందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్దితుల్లో సామాన్యులు ఓ యాభై గజాల స్ధలం కొనుగోలు చేసుకునే పరిస్తితి లేదు. ఓ వంద గజాలు కొనుక్కొవాలంటే లక్షాదికారులకు సాధ్యం. అలాగే తాతల తరం నుంచి ఇంత స్ధలం వున్నా, ఇప్పుడున్న పరిస్టితుల్లో ఇల్లు కట్టుకోవడం సామాన్యులకు అసలే సాద్యం కాదు. ఓ స్ధాయిలో బతికే వారికి కూడా ఇల్లు కట్టుకోవాలంటే ముందూ వెనుక ఆలోచిస్తున్న రోజులు. ప్రభుత్వం ఆదుకోవాలని ఎదురు చూస్తున్నారు. ఆ పేదల ఎదరుచూపులు ప్రజా ప్రభుత్వం తెలుసుకున్నది. ఎన్నికల ముందు అర్హులైన ప్రతి పేద వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని హమీ ఇచ్చింది. పేదల్లో ఆశలు చిగురించాయి. పదేళ్లుగా ఎదురుచూస్తున్న ప్రజలకు బిఆర్‌ఎస్ పాలకులు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. కాని పదేళ్లు ఇస్తామని పదేపదే ప్రచారం చేసుకున్నారు. ప్రజలు కూడా వినీ వినీ విసిగిపోయారు. ఏ ఎన్నికలు వచ్చినా బిఆర్‌ఎస్ పార్టీ ఒకటే జపం చేసింది. అది సార్వత్రిక ఎన్నికలైనా, పంచాయితీ రాజ్ ఎన్నికలైనా, మున్సిపల్ ఎన్నికలనై ఒకటే మాట చెప్పింది. డబుల్ బెడ్ రూం ఇండ్లు సర్వ రోగ నివారణి అన్నట్లు ప్రచారం చేసుకున్నది. రెండుసార్లు గెలిచింది. మొదట తెలంగాణ వ్యాప్తంగా రెండు పడకల గదులు ఇండ్లుతో కొత్త తెలంగాణ ఆవిష్కారమౌతుందన్నారు. ప్రతి ఊరులో ప్రభుత్వ స్ధలంలో మరో కొత్త ప్రపంచం సృష్టిస్తామని చెప్పారు. ప్రతి ఊరులో ఇప్పుడున్న ఇందిరమ్మ కాలనీలకు దీటుగా డబుల్ బెడ్ రూంల కాలనీలు తెస్తామన్నారు. కాని ఏమైంది. అంతా ఉట్టిదే అయ్యింది. మొదట్లో బిఆర్‌ఎస్ చెప్పిన మాట తర్వాత లేకుండాపోయింది. ఏ ఒక్క మాట కూడా కార్యరూపం దాల్చలేదు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం తొలుత కాలనీలు అన్నారు. తర్వాత అప్పార్టుమెంట్లు అన్నారు. అదీ బిఆర్‌ఎస్ పాలకులకు చేత కాలేదు. చేతులెత్తేశారు. ఆఖరుగా మరోసారి స్థలం వుంటే చాలు రూ.5 లక్షలు ఇస్తామని మరోసారి మోసం చేయాలని చూశారు. కాని తెలంగాణ ప్రజలు బిఆర్‌ఎస్ వైఖరిని గమనించారు. ఇప్పటికే రెండు సార్లు మోసపోయాం. ఇంకా మోసపోవద్దని, మోసం చేసిన బిఆర్‌ఎస్‌కు బుద్ది చెప్పాలని చూశారు. అదును చూసి గత ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు తగిన గుణపాఠం చెప్పారు. 2014 ఎన్నికల్లో కేసిఆర్ చెప్పిన మాటలను ప్రజలు నమ్మారు. ఇందిరమ్మ ఇండ్లను ఎగతాళి చేశాడు. అగ్గిపెట్టె ఇండ్లన్నాడు. గొర్రెలన్నాడు, బర్రెలన్నాడు. మేకపిల్లను ఏడ కట్టేస్తారన్నాడు. అల్లుడొస్తే ఎక్కడుంటాడన్నారు. మాయ మాటలెన్నొ చెప్పాడు. ఆఖరుకు ఇండ్లు కట్టిచ్చుడు తన వల్ల కాదని చేతులెత్తేశాడు. కాని కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇండ్లు ఎందుకు సాధ్యం కావో చూపిస్తామన్నారు. ఎలా సాధ్యం చేస్తామో చేసి చూపిస్తామన్నారు. అన్నట్లుగానే ఇందిరమ్మ ఇండ్ల వేడుక మొదలు పెట్టారు. తెలంగాణ అంతటా పండుగ వాతావరణం తెచ్చారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ విషయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పట్టుదల సామాన్యమైనది కాదు. ఎట్టిపరిస్తితుల్లోనైనా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేసి తీరాలని సంకల్పించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హమీని ఎలాగైనా నెరవేర్చాలని గట్టి నిర్ణయం తీసుకున్నారు. తొలి ఏడాది ప్రభుత్వం కుదురుకోవడానికి కొద్ది సమయం పట్టింది. అందులోనూ పార్లమెంటు ఎన్నికలు రావడంతో మరో ఆరు నెలలు వెనక్కి వెళ్లింది. అంతే తప్ప ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూనే వుంది. ఎన్ని రకాల అడ్డంకులు ఎదురైనా సరే ఈసారి ఎలాగైనా సరే ఇందిరమ్మ ఇండ్లు మొదలు పెట్టాలనుకున్నారు. ఈ బడ్జెట్‌లో రూ.22వేల కోట్లు కేటాయించారు. ఊరూర ప్రజా సభలు ఏర్పాటు చేశారు. ధరుఖాస్తులుస్వీకరించారు. మళ్లీ గ్రామ సభల్లోనే లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపికచేశారు. పేదలందరినీ గుర్తించారు. తొలి విడద జాబితా విడుదల చేశారు. పల్లెకే పండుగను తెచ్చారు. ఆషాడంలో ఎప్పుడైనా బోనాల పండుగలు జరుపుకోవడం చూశాం. కాని ఈసారి ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇండ్ల ముగ్గుల జాతర చూస్తున్నాం. ఊరంత పండుగ వాతావరణం గమనిస్తున్నాం. ప్రజల్లో విరబూనిన ఆనందాలు చూస్తున్నాం. పదేళ్ల తర్వాత నెరవేరుతున్న సొంతింటి కల నెరవేరుతున్న లబ్ధిదారులు మోముల్లో సంతోషం, బందువుల సందోహం చూస్తున్నాం. ఇక పల్లెల్లో మొదలైన ఈ సంబురం ఇక ఆగేది కాదు. ప్రతి ఏటా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పెద్దఎత్తున జరగనున్నది. తొలిఏడాది తెలంగాణ వ్యాప్తంగా లక్షకు పైగా ఇండ్ల నిర్మాణం చేపడుతున్నారు. పైలెట్ ప్రాజెక్టు కింది ఇప్పటికే అనేక మండలాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు కొన్ని చోట్ల జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ఇప్పటికే పూర్తయ్యాయి. గృహ ప్రవేశాలకు సిద్దమయ్యాయి. అక్కడి నుంచి ఇప్పుడు ఏక కాలంలో తెలంగాణలోని 13వేల గ్రామాల్లో ఏకబిగిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు శ్రీకారం జరుగుతోంది. ఈ ఏడాది లక్షతో మొదలై వచ్చే మూడేళ్లలో మరో 3లక్షల ఇండ్లు నిర్మాణం చేయనున్నారు. మొత్తం వచ్చే నాలుగేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేయనున్నారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం లక్షకోట్లకు పైగా వెచ్చించాల్సి వుంటుంది. అయినా పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం వెనుకాడకుండా ఇచ్చిన హమీమేరకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేపడుతోంది. తొలి విడతలో ఎంపికైన లబ్ధిదారులకు ముందుగా రూ.లక్ష అందజేశారు. ముగ్గులు పోసుకునేందుకు ముందే సొమ్ము అప్పగించారు. అంటే ప్రభుత్వానికి ఎంతో చిత్తశుద్ది వుంటే తప్ప ఇలాంటి గొప్పకార్యక్రమం మొదలు కాదు. ఇళ్లంటేనే ఇందిరమ్మ రాజ్యమని మరోసారి కాంగ్రెస్ పార్టీ, ప్రజా ప్రభుత్వం నిరూపిస్తోంది. గతంలోనూ కాంగ్రెస్‌పార్టీయే ఇందిరమ్మ ఇండ్లు నిర్మానం చేసి ఇచ్చింది. ఆ ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కింది. దేశంలో తొలిసారి పేదలకు ఇండ్ల నిర్మాణం ప్రధాని ఇందిరాగాంధీ హాయంలో మొదలైంది. ఆ తర్వాత దేశ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం జరిగింది. అయితే ఇందిరాగాంధీ కాలంలో ఎస్సీ, ఎస్టీలకు దేశ వ్యాప్తంగా పెద్దఎత్తున ఇండ్ల నిర్మాణం జరిగింది. అంతే కాకుండా ఆ సమయంలోనే దేశంలో దళితులకు వ్యవసాయ భూములు అందించడం జరిగింది. ఆ భూముల సాగు కోసం కూడా పెద్ద పెద్ద బావులను కూడా ఉచితంగా ప్రభుత్వాలే తవ్వి ఇచ్చారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపారు. దళితులు కూడా వ్యవసాయం చేసేందుకు మార్గం వేశారు. దేశంలోని అన్ని గ్రామాల్లో వ్యవసాయ భూములు, ఇందిరమ్మ ఇండ్లు అప్పటినుంచే ఇవ్వడం మొదలు పెట్టారు. తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇందిరమ్మ ఇండ్లను నిరంతర కార్యక్రమంగా ఒక యజ్ఞంలా పూర్తి చేస్తూ వస్తున్నారు. పూర్తయిన వాటికి వచ్చే నెలలో గృహ ప్రవేశాలు చేస్తారు. ఇప్పుడు మొదలౌతున్నవి దసరా వరకు పూర్తి చేసి తెలంగాణ దసర పండుగను ఇందిరమ్మ ఇండ్ల పండుగగా నిర్వహించాని రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ చూస్తున్నట్లు తెలుస్తోంది. అదే నిజంగా జరిగితే తెలంగాణలో ఏక కాలం లక్ష ఇండ్లకు ఒకేసారి గృహ ప్రవేశాలు జరిపి రికార్డు సృష్టించినట్లై అవుతుంది. ఆ క్రెడిట్ అంతా అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి ఎక్కువ దక్కుతుంది. ఆయా కాలనీలు కళకళలాడినంత కాలం చరిత్రలో రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేరు చరిత్రలో చిరస్దాయిగా నిలిచిపోతుందని చెప్పడంలో సందేహంలేదు. ఇలా ఇందిరమ్మ ఇండ్ల కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పడుతున్న కష్టం అంతా ఇంత కాదు. గత ఏడాది కాలంలో ఆయన మంత్రిగా ఇతర శాఖల పనుల బిజి ఎంత వున్నప్పటికీ నిరంతరం ఇందిరమ్మ ఇండ్ల పనుల పురోగతిని తెలుసుకుంటూ వుండడం, పర్యవేక్షిస్తూ, సమీక్షిస్తూ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని చేపట్టేందుకు అదికారులను పరుగులు పెట్టించారు. తన ఆశయసాధనకోసం అహర్నిషలుకృషి చేస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల సారధిగా కీర్తిని పొందనున్నారు.
`కేసీఆర్‌ను ఎదరించి నిలవడమే రాజకీయ గమ్యమనుకున్నాడు.
`కేసీఆర్‌ను గెలిచి రాజకీయ శూన్యత తెస్తేనే సీఎం అవుతా అనుకున్నాడు.
`తన లక్ష్యం కోసం గురిని కేసీఆర్‌పైకి ఎక్కిపెట్టాడు.
`కేసీఆర్ ను ప్రజల్లో దోషిగా నిలబెట్టాడు.
`అందుకోసం జైలును కూడా లెక్క చేయలేదు.
`కీలక సమయాలలో కూడా కుటుంబానికి దూరమయ్యాడు.
`ఎప్పటికైనా తన రోజు వస్తుందని బలంగా నమ్మాడు.
`తెలంగాణ ఉద్యమ, సాధన నాయకుడిని ఓడిరచాడు.
`తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌ను దూరం చేసి ఎదురులేని నాయకుడయ్యాడు.
`నిజం చెప్పాలంటే రేవంత్ రెడ్డి అసలైన రాజకీయ ఏకలవ్యుడు.
`సీఎం కావడం కోసం కేసిఆర్ తెలంగాణ ఉద్యమం ఎంచుకున్నాడు.
`రేవంత్ రెడ్డి సీఎం కావడం కోసం కేసీఆర్ తో తలపడి విజయం సాధించాడు.
`తెలంగాణ చరిత్ర లో కేసీఆర్‌తో సమాన రాజకీయ చరిత్ర లిఖించుకున్నాడు.
హైదరాబాద్,నేటిధాత్రి:
తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి పక్కా ప్రాక్టికల్ పొలిటీషియన్ అని చెప్పడంలో సందేహమే లేదు. అలాంటి రాజకీయ నాయకుడు దేశంలోనే ఎవరూ లేరు. అంతగా రాజకీయాలను ఆయన చాలెంజ్‌గా తీసుకున్నారు. అలా తీసుకొని విజయం సాధించారు. ఎంతో మంది యువ నాయకులు ఆదర్శంగా నిలుస్తున్నారు. సహజంగా రాజకీయాలలో పదవుల కోసం నాయకులు ఎదురుచూస్తుంటారు. అవకాశాల కోసం పడిగాపులు పడుతుంటారు. పార్టీ పెద్దల ఆశీస్సులకోసం ఆరాపడుతుంటారు. రేవంత్ రెడ్డి రాజకీయం మొత్తం చూస్తే ఎక్కడా ఆయన పదవులకోసం ఎవరి ముందు నిలబడ్డది లేదు. ఎవరినీ మెప్పించాలని చూడలేదు. ప్రజలను నమ్ముకున్నాడు. ప్రజలతో కలిసి రాజకీయం చేశాడు. ప్రజలకు సేవ చేస్తూ గుర్తింపు పొందారు. పోరాటం చేస్తూ నిలబడ్డాడు. పోరాటమే జీవితం చేసుకున్నాడు. ఆయన పడిన రాజకీయ కష్టం అంతా ఇంతా కాదు. అందుకే అతి చిన్న వయసులో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఇక్కడ ఒక కీలకమైన విషయంకూడా చెప్పొచ్చు. రేవంత్‌రెడ్డి బిఆర్‌ఎస్ దృష్టిలో తెలంగాణ వాది కాదు. అయినా ప్రజలు రేవంత్ రెడ్డిని నమ్మారు. అదే రాజకీయాల్లో అసలైన మ్యాజిక్ అని చెప్పకతప్పదు. తెలంగాణలో ఓ ఇరవై ఏళ్లపాటు రాజకీయ శూన్యత వుండదని బిఆర్‌ఎస్ అనుకున్నది. కేవలం పదేళ్ల కాలంలోనే కేసిఆర్ లాంటి నాయకుడి పాలన అంతమౌతుందని ఎవరూ ఊహించలేదు. కాని ఉమ్మడి రాష్ట్రంలోనే సిఎం. కావాలన్న ఆశతో, ఆలోచనలో అడుగులు వేసిన రేవంత్ రెడ్డి తెలంగాణకు రెండో సిఎం కావడం అనేది సామాన్యమైన విషయం కాదు. అందుకోసం ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఒక్క మాటలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి న్యూటన్ ధర్డ్‌లాను పక్కగా ఫాలో అయ్యారు. రాజకీయాన్ని ఏకంగా తన ప్రయోగ శాలను చేసుకున్నాడు. ఎట్టిపరిస్ధితుల్లో కేసిఆర్‌ను కొడితే తప్ప తాను సిఎం. కాలేనని బలమైన సంకల్పం తీసుకున్నాడు. తన ఆశయానికి అనుగుణంగా తెలంగాణ వచ్చింది. తన ఆశల సాధనకు సిఎం. కావాలన్న మార్గ ఏర్పడిరది. ఇప్పుడు కాకపోతే ఇక మరెప్పుడూ కాలేమన్న నిర్ణయంతో రేవంత్‌రెడ్డి ముందుకెళ్లారు. తాను గెలవడం కోసం బంతిలా అనేక సార్లు ఒత్తిళ్లకు గురయ్యారు. అవి సామాన్యమైనవి కాదు. తెలంగాణ వచ్చిన తొలినాళ్లలో ఆయన తెలుగుదేశం పార్టీలో వున్నారు. ఆ పార్టీ ఆలోచనలు అమలు చేయాలనుకున్నారు. అందులో రాజకీయంగా ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే రాజకీయపార్టీ నడుపుతున్నప్పుడు రాజకీయాలే చేస్తామని అనేకసార్లు కేసిఆర్ చెప్పిన సంగతి తెలిసిందే. కేసిఆర్ చేస్తే రాజకీయం, ఇతరులు చేస్తే అరాజకీయమెలా అవుతుంది. అందుకే కేసిఆర్ ప్రభుత్వం రేవంత్‌రెడ్డిని ఎదగకుండా చేయాలన్న ఆలోచనతో ఎంత ఒత్తిడికి ప్రయత్నం చేసినా, అంతే వేగంగా రేవంత్‌రెడ్డి నిలబడ్డాడు. అది కేసిఆర్‌కు కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఒక దశలో రేవంత్ రెడ్డి ఇంటి నుంచి బైటకు రాకుండా కట్టడి చేశారు. రోడ్లమీద ఎక్కడ పడితే అక్కడ అదుపులోకి తీసుకున్నారు. రేవంత్‌రెడ్డి ప్రజలకు దగ్గర కాకుండా చూసుకున్నారు. నిజం చెప్పాలంటే ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా రేవంత్ రెడ్డి ఎంత ఒత్తిడికి గురయ్యారో..పాలకపక్ష నేతగా కేసిఆర్ కూడా అంతకన్నా ఎక్కువ ఒత్తిడిని అనుభవించారు. అందుకే అడుగడుగునా రేవంత్‌రెడ్డిని అణిచివేయాలని చూశారు. కాని కుదరలేదు. జననేతగా రేవంత్‌ను ప్రజలు గుర్తించారు. గుండెల్లో పెట్టుకున్నారు. కేసిఆర్‌నుపక్కన పెట్టేశారు. పడిన ప్రతిసారి కేసిఆర్‌కు ఎదురొడ్డి నిలబడ్డాడు. పదే పదే జైలుకు పంపితే మానసికంగా రేవంత్ రెడ్డిని దెబ్బకొట్టాలని చూశాడు. చిన్న విషయాల మీద పదే పదే అరెస్టులు చేశారు. అయినా రేవంత్‌రెడ్డి బెనకలేదు. తొనకలేదు. దాంతో ఎలాగైనా రేవంత్ రెడ్డి కూతరు నిశ్చితార్ధ సమయంలో కూడా ఇబ్బందులకు గురి చేశారు. ఒకప్పుడు కేసిఆర్‌ను బలంగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎదుర్కొంటున్నట్లు కనిపించారు. దాంతో ఆయనను ఒకసారి జైలుకు పంపించారు. జగ్గారెడ్డి ఆత్మస్ధైర్యం మీద దెబ్బకొట్టారు. అప్పటి నుంచి జగ్గారెడ్డి సైలెంట్ అయ్యారు. కేసిఆర్‌కు ఎంతో కొంత అనుకూలంగా మారాడు. సరిగ్గా ఇదే ఫార్ములా రేవంత్‌రెడ్డి మీద కూడా ప్రయోగించాలని చూశారు. కాని కుదరలేదు. ఇతర నాయకుల లాగా ఒత్తిడికి తలొగ్గి రేవంత్ రెడ్డి దారికి వస్తాడనుకున్నారు. కాని కేసిఆర్ ఆశలు ఫలించలేదు. నిజం చెప్పాలంటే ఇలాంటి రాజకీయ ప్రయోగం మరే నాయకుడి వల్ల కాదు. అది కేవలం ఒక్క రేవంత్‌రెడ్డి వల్లనే సాద్యమైంది. పదే పదే జైలుకు పంపడాన్ని కూడా ఒకదశలో రేవంత్ రెడ్డి చాలా చిన్న విషయంగా మార్చుకున్నారు. దాంతో కేసిఆర్‌కు ఏం చేయాలో అర్దంకాని పరిస్ధితిని రేవంత్‌రెడ్డి సృష్టించారు. ఇదీ అసలైన రాజకీయమని చెప్పక తప్పదు. రాజకీయాల్లో ఒకప్పటి ప్రయోగాలు వేరు. ఇప్పుడున్న రాజకీయాల్లో ప్రయోగాలకు చాల వ్యత్యాసముంది. ఒకప్పుడు రాజకీయ ప్రయోగాలలో వ్యక్తిగత కక్షలు వుండేవికాదు. మొత్తం పార్టీ ప్రయోగాలు వుండేవి. కాని ఇప్పుడు నాయకుల టార్గెట్‌గా ప్రయోగాలు సాగుతున్నాయి. ఏ పార్టీలో నైనా ఒకరో ఇద్దరు నాయకులను టార్గెట్ చేస్తున్నారు. దాంతో మిగత నాయకులంతా సైలెంట్ అవుతున్నారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో వున్నప్పుడు రేవంత్ రెడ్డి ఒక్కడు మాత్రమే పోరాట యోధుడిగా కనిపించారు. మిగతా నాయకులెవ్వరూ రేవంత్‌కు మద్దతుగా వెళ్లిన సందర్భాలు కూడా లేవు. అయినా ఒకే ఒక్కడుగా కేసిఆర్‌ను, బిఆర్‌ఎస్ మొత్తం పార్టీని ఎదుర్కొన్నాడు. అందుకే రేవంత్ రెడ్డి సిఎం.అయ్యారు. తాను సిఎం. కావడానికి ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ ఆడిన రాజకీయం చాలా విచిత్రమైనది. పదే పదే కేసిఆర్‌ను ఆనాడు రేవంత్ రెచ్చగొట్టేవారు. తనను అణివేయాలన్న ఆలోచన కేసిఆర్‌కు వచ్చేలా చేసేవారు. కేసిఆర్ చేత రేవంత్ రెడ్డి ఇబ్బందులు పడుతున్నాడు. అణివేయబడుతున్నాడని ప్రజల్లో సానుభూతి పెరిగేలా చేసుకున్నాడు. ఈ విషయంలో రేవంత్‌రెడ్డి మాస్టర్ ప్లాన్ సక్సెస్ అయ్యింది. ఎందుకంటే కేసిఆర్‌ను ఎదిరించి నిలవడమే రాజకీయ గమ్యమనుకున్నాడు. ఇలా ఏ నాయకుడు నిర్ణయం తీసుకోలేదు. కాంగ్రెస్ గాలి వస్తే గెలుస్తాం. లేకుంటే ప్రతిపక్షంలో కూర్చుందామన్న ఆలోచనలు చేసిన వారే అందరూ. కాని పార్టీని అధికారంలోకి తీసుకొస్తే తాను ముఖ్యమంత్రిని అవుతానన్న సంకల్పంత రేవంత్ రెడ్డి రాజకీయంచేశారు. అక్కడ కూడా కొన్ని సార్లు విఫలమయ్యారు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో విషయమేమిటంటే రేవంత్ రెడ్డి కేవలం కేసిఆర్ నుంచే కాదు సొంత పార్టీనుంచి కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాళ్లల్లో కట్టెలు పెట్టే నాయకులు కాంగ్రెస్‌లో ఎక్కువ. అటు పార్టీలో అసమ్మతి వాదులను , ఇటు కేసిఆర్‌ను ఏక కాలంలో ఎదుర్కొంటూ నిలబడ్డాడు. కేసిఆర్‌ను గెలిచి రాజకీయ శూన్య తేవాలని చూస్తున్న సమయంలో సొంత పార్టీ కుట్రలను పెద్దగా పట్టించుకోలేదు. పార్టీలో పెద్ద నాయకులు చేసిన ఆరోపణలను ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదు. ఎప్పుడైతే ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు వస్తుందన్న సంకేతాలు అందిన తర్వాత రేవంత్ రెడ్డి తన అసలైన రాజకీయం మొదలు పెట్టారు. తన లక్ష్యాన్ని పూర్తిగా కేసిఆర్ మీద ఎక్కుపెట్టారు. చెవిలో జోరిగాలాగా మారుతున్నకొంత మందినాయకులను పక్కన పెట్టేశారు. అటు కేసిఆర్‌ను ప్రజల్లో దోషిగా నిలబెట్టేందుకు శతవిధాల కృషి చేశారు. రేవంత్‌రెడ్డి అదృష్టమో..కేసిఆర్ దురదృష్టమో గాని సరిగ్గా ఎన్నికలకు దగ్గర సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టులో పగుళ్లు వచ్చాయి. ఇక రేవంత్‌రెడ్డి చెలరేగిపోయారు. కేసిఆర్‌ను ఓ ఆట ఆడుకున్నారు. కేసిఆర్‌ను ఆ క్షణం తెలంగాణుకు విలన్ అని చెప్పి నమ్మించడంలో సక్సెస్ అయ్యారు. తెలంగాణ ఉద్యమ సాధకుడు అని చెప్పుకునే కేసిఆర్‌ను ప్రజలకు దూరం చేసి తెలంగాణ రాజకీయాల్లో ఎదురు లేని నాయకుడయ్యారు. రేవంత్‌రెడ్డి అసలైన ఏకలవ్య రాజకీయ నాయకుడు. తాను సిఎం కావడం కోసం కేసిఆర్ తెలంగాణను ఎంచుకున్నారు. రేవంత్ రెడ్డి సిఎం కావడం కోసం కేసిఆర్‌తో తలపడి గెలిచారు. తెలంగాణ చరిత్ర పాలనలో కేసిఆర్‌తో సమానమైన చరిత్ర రేవంత్ రెడ్డి లిఖించుకున్నారు.
`టూరింగ్ టాకీస్‌లో సినిమా చూసే వాళ్లకు మల్టీ ప్లెక్స్‌లో కూర్చున్నట్లుందని ఎగతాళి చేసిందెవరు! ……………. `పనిలో పనిగా సిఎం రేవంత్ రెడ్డి మీద కూడా వాక్భాణాలు సంధిస్తున్నాడు.
`తెలుగు దేశం వల్లనే గత ఎన్నికలలో కాంగ్రెస్ గెలిచిందంటున్నాడు.
` రేవంత్ రెడ్డి కష్టం బూడిదలో పోసిన పన్నీర్‌అయినట్లు పిచ్చి రాతలు రాస్తున్నాడు.
హైదరాబాద్,నేటిధాత్రి: రోత గాడు పెండ రాతలు రాస్తే పెంట పెంట అవుతుందంటే ఇదే..మరి! పడుకున్న గుర్రాన్ని లేపి తన్నించుకోవడం అంటే కూడా ఇలాంటిదే!! నీ జోలికి రాకున్నా, నన్ను తన్నరా..తన్నారా! అని పిలుచుకోవడమంటే కూడా ఇలాగే వుంటుంది. ఎంత తన్నుమన్నా ఎవరూ తన్నడం లేదనుకొని వెలికి వార్తలు రాసి తెలంగాణ సమాజం మొత్తంతో ఉమ్మించుకోవడమంటే ఇలాగాదే జరగుతుంది. ఇప్పటి వరకు బురద జల్లి కుడుక్కోండని రోత రాతులు రాసుకునే బూతుగాడు తొలిసారి తన మీదే రోత చల్లించుకున్నాడు. డ్రైనేజీ నిండా మునిగిపోయాడు. సెప్టిక్ ట్యాంక్‌లో దూకినంత పని చేసుకున్నాడు. ఇదీ తెలంగాణ సమాజం అని మరోసారి రుచి చూశాడు. తెలంగాణ వచ్చి పదేళ్లయింది. ఇంకా ఆ సెంటి మెంటు లేదు. కేసిఆర్ మీద ప్రజల్లో అభిమానం లేదు. బిఆర్‌ఎస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ లేదు. ముఖ్యంగా నిత్యం మీడియాను ఫాలో అయ్యేవారు కేసిఆర్‌ను తిడితే సంతోషపడతారనుకున్నాడు. కాని అటు తిరిగి ఇటు తిగిగి బూతుగానికే గుచ్చుకుంటుందని ఊహించలేదు. ఒక్కసారిగా తెలంగాణ సమాజమంతా కదలడంతో ఉలిక్కిపడ్డాడు. చెరపకురా? చెడేవు అనే సామెత తెలిసినా, తెలిసి తెలిసి బిఆర్‌ఎస్‌ను కెలికినా పరిస్దితి ఇలాగే వుంటుందని మరోసారి అనుభవానికి వచ్చాడు. ఇప్పుడే కాదు..ఇంకా వందేళ్లయినా, వెయ్యేళ్లయినా తెలంగాణ సమాజంలోనే కాదు, జనం గుండెల్లో నిలిచిపోయే వ్యక్తి కేసిఆర్. కేసిఆర్‌కు బూతుగాడు స్నేహితుడే కావొచ్చు.సన్నిహితుడేకావొచ్చు. అయినంత మాత్రాన కారు కూతలు కూస్తే జనం సహించరని ఇప్పటికైనా తెలుసుకోవాలి. తెలంగాణ పాలిట ఎప్పటికైనా రోతగాడు పిశాచే అని చెప్పకతప్పదు. తెలంగాణలో వుంటూ తెలంగాణపై విషం కక్కె విషపురుగు. పాలుకు పాలు పోసి పెంచినా సరే కాటేయక మానదు. రోత గాడు కూడా అంతే..నిజం చెప్పాలంటే మీడియా ముసుగులో తెలంగాణలో నిశాచర సంచారి. తెలంగాణ ఉద్యమ కారుడైన పోరాటయోధుడు సూర్యపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని మరుగుజ్జు అనడానికి రోతగానికి ఇంత పైత్యమా? అసలు మరురుజ్జు అంటే ఆ వెదవకు అర్దం తెలుసా? తెలంగాణ నాయకులందరూ మరగుజ్జు నాయకుల్లా కనిపిస్తున్నారా? తెలంగాణ వచ్చిన కొత్తలో కూడా ఇలాంటి పత్రికలో చిల్లర రాతలు రాశాడు. చానల్‌లో రోత పలుకులు పలికించాడు. ముఖ్యమంత్రిగా కేసిఆర్ బాధ్యతలు చేపట్టిన సరిగ్గా మూడు రోజులకు ట్యాంక్ బండ్‌పై ఓ వ్యక్తి ఉరివేసుకొని చనిపోయాడు. దానికి తెలంగాణలో తొలి రైతు ఆత్మహత్య అని బ్యానర్ వార్త ప్రచురించాడు. అంటే మూడు రోజుల్లోనే తెలంగాణ విఫల రాష్ట్రం.. కేసిఆర్ విఫల సిఎం, అని చెప్పాలనుకున్నాడు. తెలంగాణలో ఇక ఏదో జరిగిపోతుందని భయపెట్టే ప్రయత్నంచేశాడు. నిజం చెప్పాలంటే కేసిఆర్ కాబట్టి అలాంటి తట్టుకున్నారు. ఆ స్ధానంలో మరే నాయకుడు వున్నా, ఆగం చేసేవారు. ఇక ఇటు ఆ చెత్త ఛానల్‌లో బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారలపై అతి జుగుస్సాకంగా ప్రసారం చేశారు. కొత్తగా ఎన్నికైనా తెలంగాణ ఉద్యమకారులైన ఎమ్మెల్యేలకు ప్రమాణస్వీకారలు చేయరాలేదని మెరిగారు. కళ్లు తాగిన కోతులు అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. పైగా టూరింగ్ టాకీస్‌లో సినిమా చూసే వారిని తీసుకొచ్చి, మల్టీపెక్స్‌లో సినిమా చూపిస్తే ఎలా వుంటుందో అలా వుందని తెలంగాణ అసెంబ్లీని కించపర్చారు. ఇదీ రోతగాని మీడియా దుర్భుద్ది. అక్షర జ్ఞానం లేని నరక్షరకుక్షి వాడు. వాడి నుంచి ఇలాంటి వార్తలు తప్ప మంచి వార్తలు వస్తాయని కూడా ఎదరుచూడడం తప్పే అవుతుంది. తెలంగాణకు అడుగడుగునా అడ్డుపడిన మీడియా శిఖండి వాడు. అనుక్షణం తెలంగాణకు అన్యాయం చేయాలని చూసి విష జీవి. కుల పచ్చితో తెలంగాణకు పట్టిన అమావాస్య గ్రహణ నిశీది వాడు. తెలంగాణా నాయకులకు బలుపులున్నాయా? మరుగుజ్జులంటావా? చెప్పుకోవడానికి సిగ్గులేని వార్తలు రాసుకోవడంలో వాడిని మించిన వారు మరొకరలు లేరు. తెలంగాణ ఉద్యమానికి సహాకారం అందించానని సిగ్గులేని నిస్సిగ్గు గుణం తనదని మరోసారి నిరూపించుకున్నాడు. ఓ వైపు తెలంగాణ ఉద్యమానికి సహకరించానని ఓ వైపు చెబుతూనే, మరోపక్క ఉద్యమ కారులు పత్రిక కార్యాలయంపై దాడి చేశారని రోతగాడే చెప్పాడు. ఇందులో ఏది నిజం. తెలంగాణ ఉద్యమానికి సహకరిస్తే తెలంగాణ వాదులు నెత్తిన పెట్టుకొని ఊరేగేవారు. ఇప్పుడు ఎన్ని రాతలు రాసినా మెచ్చుకునేవారు. అంతే కాకుండా శ్రీ కృష్ణ కమిటీ రోతగాని పత్రిక మూసేస్తే తెలంగాణ ఉద్యమాన్ని కట్టడి చేయొచ్చని చెప్పిందని లేని పచ్చి అబద్దం చెప్పేశాడు. పైగా తన చెత్తపలుకులో గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు కారణం తెలుగుదేశం అంటూ కొత్త లెక్కలు చెప్పి సిఎం. రేవంత్ రెడ్డిని కూడ బెదిరించే ప్రయత్నం చేశాడు. ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం రోతగాడు ఏదైనా చేస్తాడు! ఏదైనా రాస్తాడు. ఎంతో కష్టపడి కాంగ్రెస్ పార్టీకి బలం చేకూర్చింది సిఎం.రేవంత్‌రెడ్డి. మూడేళ్లుగా పిసిసి అధ్యక్షుడిగా నిత్యం ఎంతో శ్రమకోర్చి పార్టీని బలోపేతం చేసింది రేవంత్‌రెడ్డి. తెలంగాణ మొత్తం తిరిగి ప్రజలను ఒప్పించి, మెప్పింది కాంగ్రెస్‌ను అదికారంలోకి తెచ్చింది రేవంత్‌రెడ్డి. కాంగ్రెస్ గెలవడానికి, రేవంత్ రెడ్డి సిఎం. కావడానికి తెలుగుదేశం పార్టీ కారణమని రేవంత్ పరువు తీశాడు. రేవంత్ రెడ్డి గొప్పదనం కాదన్న అర్దమొచ్చేలా చెత్త పలుకు రాశాడు. సరిగ్గా వారం రోజుల క్రితం సిఎం. రేవంత్ రెడ్డి ఇతర మంత్రులను పట్టించుకోవడం లేదనే అర్దమొచ్చేలా పలుకులు పలికాడు. సిఎం. రేవంత్‌రెడ్డికి మంత్రులకు దూరం పెరుగుతోందని అర్ధం వచ్చేలా కూతలు కూశాడు. కాని వాటిని కాంగ్రెస్ నాయకులు పెద్దగా పట్టించుకోలేదు. ఈ వారం ఏకంగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు అసలైన గెలుపు కాదన్న రీతిలో పలుకులను ఆరబెట్టాడు. ఖమ్మం జిల్లాలో బిఆర్‌ఎస్ ఓడిపోవడానికి, కాంగ్రెస్ గెలవడానికి ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ శ్రేణులు అని చెప్పుకొచ్చాడు. అంటే సిఎం. రేవంత్ రెడ్డి కష్టం, మంత్రి పొంగులేటి శ్రమకు పెద్దగా ప్రాదాన్యత లేదని తేల్చేశాడు. పైగా హైదరాబాద్ చుట్టూ వున్న అన్ని నియోజకవర్గాలలో సీమాంద్రులతోపాటు, తెలుగుదేశం కార్యకర్తల సాయంతోనే కాంగ్రెస్ గెలవడానికి కారమైందన్నాడు. ఇక్కడే రోతగాడు డ్రైనేజీలో మరోసారి కాలు వేశాడు. అదే నిజమైతే కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ చుట్టూ వున్నా 37 నియోజకవర్గాలు గెల్చుకోవాలి. కేవలం రంగారెడ్డిలో తప్ప హైదరాబాద్‌లో కాంగ్రెస్ సీటు గెల్చుకోలేదని మర్చిపోయాడు. పైగా ఖమ్మంలో ఆది నుంచి కాంగ్రెస్‌కు మంచి పట్టుంది. తెలంగాణ వచ్చిన తర్వాత మూడు ఎన్నికల్లోనూ బిఆర్‌ఎస్ ఒక్క సీటు మాత్రమే గెల్చుకున్నది. ఈ సంగతి మరుగున పడేసేలా కాంగ్రెస్ గెలుపుకు తెలుగుదేశం కారణమన్నారు. అంతే కాకుండా భవిష్యత్తులో కూటమి తెలంగాణకు వస్తే కాంగ్రెస్‌పార్టీకి ఇబ్బందే అన్నారు. అంటే సిఎం.రేవంత్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు లేదని చెప్పకనే చెప్పేశాడు. ఈ విషయాన్ని కాంగ్రెస్ శ్రేణులు చూడనట్లున్నారు. చెత్తపలుకులు విననట్టున్నారు. వింటే వాళ్లుకూడా ఈ రోజు రోతగానికి బుద్దిచెప్పేవారు. ఏపి సిఎం చంద్రబాబు కోసం ఏదైనా రాస్తాడు. ఎంతటి వారిపైనైనా నిందలు వేస్తాడు. గతంలో బిజేపి నాయకులను, ముఖ్యంగా ప్రధాని మోడీనిపై కూడ రోతగాడు పిచ్చికూతులు కూశాడు. వాళ్లుకూడా ఏమీ అనలేదు. ఈ బలుపే ఇప్పుడు చూపిస్తామంటూ పలుకులు పలిగి జీడి కారే పరిస్దితి వచ్చేలా చేసుకుంటున్నాడు. గత ఐదేళ్లు ఏపిలో మాజీ సిఎం. జగన్ మీద ఏది రాసినా ఆయన పట్టించుకోలేదు. ఇక్కడ బిఆర్‌ఎస్ ప్రతిపక్షంలో వుంది. ఇప్పుడు వాళ్లు చేసేదేముందని అనుకుంటున్నట్లున్నాడు. ఓ స్లాటర్ మీడియాకు బద్దలు బాషింగాలైన తర్వాత కూడా తన రోతలు రాసే ప్రయత్నం రోతగాడు మానుకోలేదు. తెలంగాణ మీద విషం కక్కడం మానుకోలేకపోతున్నాడు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎదరుతిరగలేదు. ఇకపై కూడా అంత దమ్ము ఎవరికి వుందన్న భ్రమలో రోతగాడున్నాడు. ఇంకోసారి ఇలాంటి పుచ్చు రాతలు, పచ్చ గీతలు గీస్తే పలుకులకు పెంకులు పగిలిపోయేలా చేస్తే తప్ప మానుకోడు.
`ప్రతిపక్షాలకు సవాళ్లు విసురుతుంటే నాయకులు కరతాల ద్వానాలు.
`తనదైన శైలిలో మళ్లీ ప్రతిపక్షాలను ఓ ఆట ఆడుకున్న సిఎం.
`పంచాయతి ఎన్నికలలో అందరినీ గెలిపించే బాధ్యత నాది అని చెప్పారు.
`నాయకులు, కార్యకర్తలలో ఉత్సాహం నింపారు.
`ఇందిరమ్మ ఇండ్ల సంబరాలు చేయాలన్నారు.
`పదకొండేళ్ల తర్వాత పల్లెల్లో కాంగ్రెస్ బలం రెండిరతలైందన్నారు.
`ఈ బలం ఎల్లకాలం నిలుపుకుందాం అన్నారు.
`తెలంగాణలో కాంగ్రెస్ పాలన రెండు దశాబ్దాలు కాపాడుకుందాం.
`ఇందిరమ్మ రాజ్యం పేదల సంక్షేమానికి నెలవని చాటుదాం అని అన్నారు
హైదరాబాద్,నేటిధాత్రి:
నాయకుడు నింపే నమ్మకం ఏ పార్టీకైనా వెయ్యేనుగుల బలం ఇస్తుందని చెప్పడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిదర్శనం. ఆయన కాంగ్రెస్ పార్టీలోకి చేరినప్పుడున్న పరిస్దితి, ఇప్పుడున్న పరిస్దితిని బేరీజు వేసుకుంటే పార్టీని నిజమైన నాయకుడు రేవంత్‌రెడ్డే అని చెప్పకతప్పదు. ఎందుకంటే ఏ నాయకుడైనా పార్టీని నమ్ముకొని రాజకీయాలు చేయాలనుకుంటాడు. పార్టీ పేరు చెప్పి రాజకీయాలు చేయాలనుకుంటాడు. పార్టీ పేరు చెప్పి ఎదగాలనుకుంటాడు. పార్టీ నీడలో పెరిగి పెద్ద నాయకుడౌతారు. కాని కొంత మంది నాయకులే పార్టీకే నీడకల్పిస్తారు. పార్టీకి జవసత్వాలు తెస్తారు. పార్టీని నిలబెడతారు. గెలిపిస్తారు. అధికారంలోకి తీసుకొస్తారు. ఇలా కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించిన వారిలో ఒకే ఒక్కడు సిఎం. రేవంత్ రెడ్డి. ఉమ్మడి రాష్ట్రంలో ఎంత పెద్ద నాయకుడైనా సరే కాంగ్రెస్‌ను నమ్ముకొని రాజకీయాలు చేసిన వాళ్లే కనిపిస్తారు. కాంగ్రెస్ మూలంగానే నాయకులయ్యారు. కాంగ్రెస్ బలంతోనే నాయకులుగా చెలామణి అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఆశీస్సులతోనే పదవులు అనుభవించారు. మొత్తం కాంగ్రెస్ చరిత్రలో రేవంత్‌రెడ్డి లాంటి నాయకుడు ఒక్కరు కూడా లేరు. వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా కాంగ్రెస్ నీడనే ఎదిగారు. కాంగ్రెస్‌లోనే బలమైన నాయకుడయ్యారు. పార్టీని నమ్ముకొని రాజకీయాలు చేశాడు. పార్టీ విశ్వాసం చూరొగని ముఖ్యమంత్రి అయ్యారు. కాని రేవంత్ రెడ్డి మాత్రమే పార్టీ కోసం వచ్చారు. పార్టీని నిలబెట్టారు. తన సంకల్పాన్ని నెరవేర్చుకున్నారు. పార్టీకి పూర్వ వైభవం తెచ్చారు. ఇలాంటి నాయకులు కాంగ్రెస్‌లో ఏ రాష్ట్రంలో లేరు. రేవంత్ రెడ్డిలాగా పార్టీని బతికించిన వారు లేరు. పార్టీ అదిష్టానంతో నాయకులైన వారే ఎక్కువ. రాజకీయాల్లో ఉన్నత పదవులు అందుకున్నవారే అందరూ. కాని కాంగ్రెస్ పార్టీలోనే స్పెషల్..కాంగ్రెస్ పార్టీకే స్పెషల్ నాయకుడు రేవంత్‌రెడ్డి. అందుకే పార్టీ అదిష్టానం కూడా రేవంత్ రెడ్డికి అంత ప్రాధాన్యత కల్పిస్తోంది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ గొప్పలు చెప్పుకునే వారే వుంటారు. పదవుల్లో పోటీ పడుతుంటారు. కాని గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి పార్టీ పగ్గాలు చేతిలో పట్టుకోకపోతే, ఆయన పిపిసి పదవిలో లేకపోతే కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ప్రతిపక్షం తప్పకపోయేది. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను ఆదరించకపోయేవారు. ఇది నూరుపైసల నిజం. రేవంత్‌రెడ్డి ఒంటరి పోరాటానికి కాంగ్రెస్ పార్టీ వేదికగా నిలిచింది. రేవంత్‌రెడ్డిని ముఖ్యమంత్రి అయ్యేందుకు పార్టీ ఒక దారిని చూపింది. పదేళ్లుగా కుదేలైపోయిన పార్టీకి జీవం పోసిన ఏకైక నాయకుడు రేవంత్‌రెడ్డి. ఆయన పార్టీలోకి చేరినప్పుడే పార్టీకి కొంత జోష్ వచ్చింది. ఆయన పిసిసి అద్యక్షుడు అయ్యాక పార్టీకి ఎప్పుడూ లేని ఊపు తెచ్చింది. ఈ రెండు రేవంత్ రెడ్డి వల్లనే వచ్చాయి. ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా రేవంత్‌రెడ్డి పట్టించుకోలేదు. దాంతో ఆదిపత్య ధోరణి కోసం పాకులాడిన నాయకులకు కూడా రేవంత్ రెడ్డి ఆదర్శంగా నిలిచారు. పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కారణమయ్యారు. ఇదిలా వుంటే ఇప్పుడు మళ్లీ పార్టీకి మరింత బలం పెంచేందుకు సిఎం. రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారు. ఈ మధ్య ఎల్‌బి స్టేడియంలో జరిగిన కాంగ్రెస్ నాయకుల సమావేశ పార్టీలో రేవంత్ రెడ్డి ప్రసంగం ఎంతో కాన్ఫిడెన్స్‌ను నింపింది. అంతే కాదు రేవంత్ రెడ్డి ధైర్యాన్ని కూడా అందరూ మెచ్చుకుంటున్నారు. ఇప్పటికే రేవంత్‌రెడ్డి పలుమార్లు చెప్పిన మాటే అయినా, మళ్లీ నాయకులు కొత్తగా విన్న భావనతో విన్నారు. వచ్చే ఎన్నికల్లో వంద సీట్లు సాధిస్తామని రేవంత్ రెడ్డి చెప్పడంతో నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా ఈలలు, చప్పట్లతో ప్రాంగణం మారుమ్రోగిపోయింది. రేవంత్‌రెడ్డి జయజయ ధ్వానాలతో స్టేడియం దద్దరిల్లిపోయింది. వచ్చే పదేళ్లు మనదే అధికారం అని తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో సీట్ల సంఖ్య పెరుగుతుందన్నారు. ఎంతో మంది ఎమ్మెల్యేలు అయ్యేందుకు చాన్స్ వుందన్నారు. పార్టీ కోసం కష్టపడితే మంత్రులు కూడ ఆయ్యే అవకాశాలున్నాయన్నారు. ఎక్కడిక్కడ నాయకులు తమ నాయకత్వ పటమితో పనులు చేయాలన్నారు. పార్టీని పట్టిష్టం చేయాలని కోరారు. నాయకులుగా ఎదగాలని సూచించారు. పార్టీ కోసం పనిచేసేవారికి పదవులు వాటంతట అవే వస్తాయని చెప్పారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఎందుకంటే ఈ పద్దెనమి నెలల్లో సాధించిన ప్రగతి ప్రజలకు వివరించాలన్నారు. వరి పంటలో దేశంలో ఏ రాష్ట్రం సాధించని రికార్డును తెలంగాణ సాధించిందని గుర్తు చేశారు. తెలంగాణ రైతులకు ప్రజా ప్రభుత్వం ప్రోత్సాహమే కారణమన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా రెండు కోట్లమెట్రిక్ టన్నులకు పైగా వరి ధాన్యం పండిరదని గుర్తు చేశారు. అందులోనూ సన్నాలు పండిరచడం వల్ల తెలంగాణ మొత్తానికి అన్నం పెట్టే అవకాశం కూడా దొరికిందని గుర్తు చేశారు. గతంలో దొడ్డు బియ్యం ఇచ్చేందుకే ప్రభుత్వాలు ముందూ వెనుక ఆలోచించేవన్నారు. కాని దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక్కతెలంగాణలోనే సన్న బియ్యం పేదలకు అందిస్తున్నామన్నారు. పేదల ఆకలిని సన్నబియ్యంతో తీర్చుతున్నామన్నారు. ఈ క్రెటిట్ తెలంగాణ వున్నంత వరకు రేవంత్ రెడ్డికే దక్కుతుందని చెప్పడంలో సందేహం లేదు. గతంలో పనిచేసిన ముఖ్యమంత్రుల్లో ఓ ఇద్దరి మాత్రమే చరిత్రలో చోటు కలిగింది. కాని ఇప్పుడు సన్న బియ్యంతో రేవంత్ రెడ్డి పేరు కూడా చిరిత్ర నిక్షిప్తం చేసుకున్నదని చెప్పాలి. రైతులకు భరోసా అందిస్తూ పెట్టుబడి సాయం చేస్తున్నారు. సన్నాలు పండిస్తే బోనస్‌లు ఇస్తున్నారు. పండిన ప్రతి గింజను కొనుగోలు చేస్తున్నారు. గతంలో దళారులు బతికేవారు. కాని ప్రజా ప్రభుత్వంలో రైతులు బతుకుతున్నారు. రాజులౌతున్నారు. ఏక కాలంలో చేసిన రుణమాఫీ వల్ల రైతుకు భారం తీరింది. రుణవిముక్తి జరిగింది. మళ్లీ సకాలంలో రుణాలు అందేందుకు మార్గం పడిరది. ఇదంతా సిఎం. రేవంత్ నాయకత్వం వల్లనే సాధ్యమైంది. ఒక్క మాటలో చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రాలన్నింటికీ ఆదర్శమైంది. గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అదికారంలో వున్నప్పుడే దేశ వ్యాప్తంగా అప్పటి వరకు వున్న 90వేల కోట్ల రుణమాఫీ జరిగింది. దేశమంతా పండుగ చేసుకున్నది. దేశంలోని అప్పటి రైతులందరికీ రుణ విముక్తి జరిగింది. ఆ తర్వాత మళ్లీ బిజేపి కేంద్రంలో మూడుసార్లు అధికారంలోకి వచ్చినా ఏనాడు రుణమాఫీ జరగలేదు. బిజేపి పాలిత రాష్ట్రాలలో రుణమాఫీ ముచ్చటే లేదు. కాని తెలంగాణలో ప్రజా ప్రభుత్వంలో, సిఎం. రేవంత్‌రెడ్డి పాలనలో రెండు లక్షల రూపాయల వరకు రైతులకు రుణమాఫీ జరిగింది. ఇంతకన్నా ప్రజా ప్రబుత్వం మరెక్కడ వుంటుంది. ఆ క్రెడిట్ అంతా సిఎం. రేవంత్ రెడ్డికే దక్కింది. ఇక తెలంగాణలో మళ్లీ ఇందిరమ్మ ఇండ్ల పండుగ మొదలైంది. పదకొండేళ్లుగా తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నా సొంతింటి కల కూడా మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే తీరుతోంది. పదేళ్లులో పది ఇండ్లు కూడా కట్టకుండా ప్రజలను కేసిఆర్ మోసం చేశాడు. కాని పద్దెనమి నెలల కాలంలో సుమారు నాలుగు లక్షల ఇండ్లకు పట్టాలు పంచారు. ఇందిరమ్మ ఇండ్లకు మొదటి విడత లక్ష రూపాయలు అందిస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో ఇండ్లు పూర్తి దశకు చేరుకుంటున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మొదలౌతున్నాయి. శ్రావణ మాసంలో ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు జరగనున్నాయి. వచ్చే మూడేళ్లలో తెలంగాణలో 20 లక్షల ఇండ్లు నిర్మాణం చేయనున్నారు. ఇదీ ప్రజా పాలన అంటే. ప్రజా ప్రభుత్వం ఇప్పటి వరకు సుమారు 60వేల వరకు ప్రభుత్వ కొలువులిచ్చారు. గతంలోగాని, ఇప్పుడు గాని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని కొలువులు ఇచ్చిన సందర్భం ఎక్కడా లేదు. ఏకకాలంలో 60వేల ఉద్యోగాలు కూడా ఒక రికార్డును సృష్టించింది. వీటన్నింటిపై ప్రతి పక్షాలకు సిఎం.రేవంత్ రెడ్డి సవాలు విసిరారు. తనదైన శైలిలో బిఆర్‌ఎస్‌ను ఓ ఆట ఆడుకున్నారు. పంచాయితీ ఎన్నికల్లో త్వరలోనే నాయకులకు పదవులు వస్తాయన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చే రెండుదశాబ్దాలు పాలన సాగిస్తుందన్నారు. ఇందిరమ్మ రాజ్యంలోనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. సంక్షేమం అందుతుందన్నారు. పేద ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే అని సిఎం. మరోసారి పునరుగ్ఘాటించారు.
పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లా కాళిగంజ్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో తృణ మూల్ కాంగ్రెస్ విజయాన్ని అందరూ ముందుగా ఊహించిందే. విశేషమేమంటే ఇక్కడ గతంతో పోలిస్తే తృణమూల్ కాంగ్రెస్ ఓట్ల శాతం పెరగడమే కాకుండా, బీజేపీ ఓట్లశాతం కొంతమేర తగ్గడం గమనార్హం. ఇక లెఫ్ట్ పార్టీల మద్దతుతో పోటీచేసిన కాంగ్రెస్ అభ్యర్థి ఓట్ల శాతం కూడా గతంతో పోలిస్తే కొంత మెరుగైన మాట వాస్తవం. ఇక్కడ ఓటమి ముందుగా అంచనా వేసినప్పటికీ, రాష్ట్ర బీజేపీ నాయకుల విశ్లేషణ మరోలా వుండటం గమనార్హం. ముఖ్యంగా ఈ ఉప ఎన్నికల్లో హిందువల ఓట్లు సుసంఘటితమైన అంశాన్ని వారు గుర్తించడమే కాదు, ఈ పరిణామం 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఏవిధంగా వుండబోతున్నదీ అంచనా వేస్తున్నారు. కాళిగంజ్ స్థానం నుంచి ఎన్నికలైన తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి నసిరుద్దీన్ అహ్మద్ గత ఫిబ్రవరి నెలలో మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నికలు అవసరమయ్యాయి. ఈ ఎన్నికల్లో ఆయన కుమార్తె అలీఫా అహ్మద్‌కు తృణమూల్ కాంగ్రెస్ టిక్కెట్ ఇచ్చింది. ఆమె తన సమీప బీజేపీ ప్రత్యర్థి అశీష్ ఘోష్‌పై 50వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపు సాధించారు.
ఈ ఎన్నికల్లో విశేషమేంటంటే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 30.91% ఓట్లు పోలయిన బీజేపీకి ఈసారి 28.29% ఓట్లు మాత్రమే వచ్చాయి. కచ్చితంగా మమతా బెజర్జీకి రాష్ట్రంలో ఇంకా తిరుగులేని ఆధిపత్యం కొనసాగుతున్నదనడానికి ఇది నిదర్శనం కూడా. అయితే ఇక్కడి బీజేపీ నాయకులు చెప్పేదేమంటే, ఇది ముస్లిం మెజారిటీ కలిగిన నియోజకవర్గం కాబట్టి తృణమూల్ కాంగ్రెస్ నిలిపిన ముస్లిం అభ్యర్థి గెలుపు సహజం. కానీ ఇదే సమయంలో నియోజకవర్గంలో హిందూ వోట్లు మరింత సంఘటితం కావడం గమనార్హమని వారు చెబుతున్నారు.
2021 ఎన్నికల్లో పోటీచేసిన అలీఫా అహ్మద్‌కు 1,02,759 ఓట్లు రాగా, సాధించిన ఓట్లు 55.15%. అదే బీజేపీ తరపున పోటీచేసిన అశీష్ ఘోష్‌కు 52,710 ఓట్లు పోలయ్యాయి. అంటే 28.29% ఓట్లు సాధించినట్టు లెక్క. ఇక లెఫ్ట్ పార్టీల మద్దతుతో బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థికి 28,348 (15.21%) ఓట్లు పోలయ్యాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో నసిరుద్దీన్ అహ్మద్‌కు 1,10,696 (53.35%) ఓట్లు రాగా, బీజేపీ తరపున పోటీచేసిన అభిజిత్ ఘోష్‌కు 64,709 (30.91%) ఓట్లు పోలయ్యాయి. ఇదే ఎన్నికలో కాంగ్రెస్ తరపున పోటీచేసిన అబ్దుల్ ఖాసిమ్ కు 25,076 (1.98%) ఓట్లు వచ్చాయి. పరిశీలిస్తే బీజేపీ గత ఎన్నికలతో పోలిస్తే 2.62% ఓట్లు కోల్పోగా, తృణమూల్ కాంగ్రెస్ 1.8% ఓట్లు అదనంగా పొందింది. ఈ గణాంకాల ను పరిశీలిస్తే బీజేపీ మతతత్వ రాజకీయాలను ప్రజలు మరోసారి తిరస్కరించారని ఎవరైనా ఇట్టేచెబుతారు. ఇదే సమయంలో ‘సెక్యులర్’గా తనను తాను చెప్పుకునే మమతా బెనర్జీ ప్రజాస్వా మ్యానికి పెట్టని కోటగా వున్నారని ప్రచారం జరగడం కూడా సహజమే. ఇదే సమయంలో 2021 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ తన ఓటు షేరును 3.23% పెంచుకోవడం (11.98% నుంచి 15.21%కు) విశేషంగానే కనిపిస్తుంది. కానీ 2016 వరకు ఇది లెఫ్ట్`కాంగ్రెస్‌లునిలిపిన ఉమ్మడి అభ్యర్థులే తిరుగులేని విజయం సాధిస్తూ వచ్చారు. ఈ పార్టీల నాటి విజయ చరిత్రను పరిశీలిస్తే ప్రస్తుతం వాటి దుర్గతి ఏవిధంగా ఉన్నదీ అర్థమవుతుంది.
బంగ్లాదేశ్‌కు సరిహద్దున వున్న నదియా జిల్లాలోని కృష్ణనగర్ లోక్‌సభ స్థానానికి చెందిన అసెంబ్లీ నియోజకవర్గమే కాళిగంజ్ . 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ లోక్‌సభ స్థానంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించింది. 2019 నుంచి ఈ కృష్ణనగర్ లోక్‌సభ స్థానానికి తృణమూల్ కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ మహువా మొయిత్రా ప్రాతినిధ్యం వహిస్తు న్నారు. 1947లో నదియా జిల్లాలో హిందువులే మెజారిటీలుగా వుండేవారు. 1950 నుంచి బంగ్లాదేశ్‌కు సరిహద్దున వున్న జిల్లాల్లోకి పెద్దఎత్తున బంగ్లా ముస్లింలు వలసలు వచ్చి స్థిరపడటంతోఆయా ప్రాంతాల్లో జానాభా సంఖ్యల్లో విపరీతమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఫలితంగా నదియా జిల్లాలో ముస్లిం జనాభా ఇప్పుడు 27%కు చేరుకోగా, కృష్ణనగర్ లోక్‌సభ నియోజవవ ర్గంలో వీరి జనాభా 37%గా వుంది. ఇదే లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన కాళిగంజ్ అసెంబ్లీ స్థానంలో మెజారిటీ జనాభా ముస్లింలే. 2011 జనగణన ప్రకారం ఈ నియోజకర్గంలో ము స్లింలు 58.51% కాగా హిందువులు 41.36%గా వున్నారు. అప్పటినుంచి ఇప్పటివరకు 14 సంవత్సరాల కాలంలో ఇక్కడ ముస్లిం జనాభా బాగా పెరిగి 61%కు మించిపోయిందని అంచ నా.
2001 జనగణన ప్రకారం ఇక్కడ ముస్లింల జనాభా 55.59% కాగా హిందువులు 44.25%. ఇక 1991 జనాభాలెక్కల ప్రకారం ముస్లింలు 52.03% కాగా హిందువుల జనాభా 47.96%.1981 జనగణనలో ఈ నియోజకవర్గంలో ముస్లింల జనాభా 48.8% కాగా హిందువులు 51.1%గా వున్నారు. అంతకు పదేళ్ల ముందు అంటే 1971 జనగణ ప్రకారం ఇక్కడ హిందువులు 54.6% కాగా ముస్లింలు 45.3% శాతంగా వున్నారు. కాళిగంజ్‌లో హిందువుల జనాభా 1961లో 56.7%, 1951లో 58%గా వుండేది.
పై విశ్లేషణను పరిశీలిస్తే కాళిగంజ్‌లో ముస్లిం జనాభా నాటకీయంగా పెరుగుతూ రాగా, హిందువుల జనాభా క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఇందుకు ప్రధాన కారణం జిల్లాకు సరిహద్దున వున్న బంగ్లాదేశ్‌నుంచి పెద్దఎత్తున ముస్లింలు వలస రావడంతో వీరి జనాభా పెరుగుతూ వచ్చింది. ఇదే సమయంలో స్థానికంగా వున్న హిందువులు ఈ ప్రాంతాలను విడిచిపెట్టి సురిక్షత ప్రదేశాలకు తరలివెళ్లడం మొదలైంది. ఈవిధంగా జనాభాలో వచ్చిన మార్పు ఇప్పడు కాళిగంజ్ అసెంబ్లీ స్థానం ఫలితాన్ని నిర్దేశిస్తున్నది. నిజానికి 2011కు ముందు ఈ నియోజకవర్గం నుంచి హిందు వులే ఎన్నికవుతూ వచ్చారు. కానీ 2011 తర్వాత ఇప్పటివరకు కాళిగంజ్ స్థానం నుంచి ముస్లి మేతరులు విజయం సాధించలేదు. నిజానికి నియోజకవర్గంలో హిందువులు మెజారిటీగా వున్న కాలంలో 1951,1962, 1967 మరియు 1969ల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నిలిపిన ముస్లిం అభ్యర్థి ఎస్.ఎం. ఫజులార్ రహమాన్ విజయం సాధిస్తూ వచ్చారు. 1957లో కాంగ్రెస్ పార్టీకే చెందిన హిందూ అభ్యర్థి మహానంద హల్దార్ ఈ నియోజకవర్గంలో గెలుపు సాధించారు. 1971లో ఇండిపెండెంట్‌గా పోటీచేసిన మీర్ ఫకీర్ మహమ్మద్ విజయం సాధించగా, 1972 లో కాంగ్రెస్ అభ్యర్థి శిబ్‌శంకర్ బందోపాధ్యాయ్ గెలిచారు. 1977, 1982 ఎన్నికల్లో వామపక్ష కూటమిలో భాగస్వామిగా వున్న రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (ఆర్‌ఎస్‌పీ) తరపున పోటీచేసిన దేబ్‌శరణ్ ఘోష్ గెలిచారు. 1987, 1991, 1996 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అబ్దుస్ సలాం మున్సీ కాళీగంజ్ నుంచి ఎన్నికయ్యారు. 2001 మరియు 2006 ఎన్నికల్లో ఆర్‌ఎస్‌పీకి చెందిన ధ నుంజయ్ మోదక్ గెలిచారు.
1951 నుంచి ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికల విశ్లేషణను పరిశీలిస్తే కాంగ్రెస్ లేదా ఆర్‌ఎస్‌పీలు బలమైన ముస్లిం అభ్యర్థిని నిలబెట్టినప్పుడు పార్టీతో సంబంధం లేకుండా గంపగుత్తగా ముస్లింలు అతనికే ఓటు వేయడం కనిపిస్తుంది. అయితే హిందువులుకూడా సంఘటితం గా ఓటు వేయడం 1972, 1977 మరియు 1982 సంవత్సరాల ఎన్నికల్లో కనిపిస్తుంది. ఇందుకు ప్రధాన కారణం 1971 మార్చినెలలో పాక్‌సైన్యం ‘ఆపరేషన్ సెర్చ్‌లైట్’ పేరుతో జరిపిన అమానుష, దారుణ కృత్యాలను తట్టుకోలేక నాటి తూర్పు పాకిస్తాన్ నుంచి పెద్ద సంఖ్యలో పారిపోయి వచ్చి ఈ ప్రాంతంలో స్థిరపడిన హిందువులు సుసంఘటితంగా ఓటుచేయడం. 1971లో హిందూ పురుషులు, పిల్లలను దారుణంగా హతమార్చడం, హిందూ మహిళలపై జరిపిన సా మూహిక అత్యాచారాలతో పాటు వారిని బానిసలుగా ఉపయోగించుకోవడం వంటి దారుణాలు వీరి మనోఫలకాలపై పడిన బలీయమైన ముద్ర ఈ సంఘటితత్వానికి కారణమని ఎన్నికల విశ్లేషకుడు అశిష్ బిశ్వాస్ వివరించారు. 1987 నుంచి ఈ నియోజకవర్గంలో ముస్లిం జనాభా మెజారిటీస్థాయికి చేరుకోవడంతో, అప్పటినుంచి వీరి ఓట్లు సంఘటితం కావడం మొదలైంది. అయితే 2001 మరియు 2006 ఎన్నికల్లో ధనుంజయ్ మోదక్ ఇక్కడ విజయం సాధించడానికి ప్రధాన కారణం వామపక్ష భావజాలం బలీయంగా వుండటమే. అప్పటికే తృణమూల్ కాంగ్రెస్ బలీయమైన రాజకీయ శక్తిగా అవతరిస్తున్న నేపథ్యంలో ప్రమాదఘంటికలను గుర్తించిన లెఫ్ట్ పార్టీలు ఈ రెండు ఎన్నికల్లో సర్వశక్తులు ఒడ్డి ఎన్నికల్లో పోరాడాయి. అయినప్పటికీ తృణమూల్ కాంగ్రెస్ రెండో స్థానంలో నిలవడం గమనార్హం.
ప్రస్తుత ఉప ఎన్నిక విషయానికి వస్తే కాళిగంజ్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 309 పోలింగ్ బూత్‌లున్నాయి. వీటిల్లో 109 పోలింగ్ బూత్‌ల్లో హిందువులు మెజారిటీగా వున్నారు. మిగిలిన 200 బూత్‌ల పరిధిలో హిందువుల జనాభా శాతం చాలా తక్కువ. హిందువులు మెజారిటీగావున్న బూత్‌ల్లో కేవలం ఒక్కదాంట్లో తప్ప 108 బూత్‌ల పరిధిలో బీజేపీ అభ్యర్థికి పెద్దఎత్తున మెజారిటీ ఓట్లు పడ్డాయి. కేవలం ఒక్క బూత్ (బూత్ నెం.12)లో మాత్రం హిందువుల మెజారిటీ ఓట్లు తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థికి పడ్డాయి. ఈ బూత్ పరిధిలో 592 ఓట్లుండగా, 351 మంది తమ ఓటుహక్కును వినియోగించకున్నారు. వీటిల్లో కేవలం 132 ఓట్లు మాత్రమే బీజేపీకి అనుకూలంగా పోలయ్యాయి. 108 పోలింగ్ బూత్‌ల్లో 73%కు పైగా ఓట్లు సాధించడం హిందువుల ఓట్లు సుసంఘటితమయ్యాయనడానికి ఉదాహరణగా రాష్ట్ర బీజేపీ నాయకులు చెబుతున్నా రు. సాధారణంగా ఉప ఎన్నికలు అధికారపార్టీకే అనుకూలంగా వుంటాయి. దీనికితోడు ముస్లిం మెజారిటీ నియోజకవర్గం. అయినప్పటికీ అద్బుతమైన పనితీరును పార్టీ కనబరచిందని వారు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే పార్టీ ఓట్లశాతం తగ్గడానికి వీరు చెబుతున్న ప్రధాన కారణం ఉప ఎన్నిక కావడంవల్ల దీనికి ఎటువంటి ప్రాధాన్యత వుండదు. దీనిలో గెలుపు ఓటములు అధికార మార్పిడికి ఎటువంటి దోహదం చేయవు కనుక చాలామంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో నిర్లిప్త వైఖరి అవలంబించడం. అదీకాకుండా ఎన్నికల సమయంలో విద్యాసంస్థలు మూసివేయడంతో, సెలవులు కారణంగా పెద్దసంఖ్యలో హిందువులు ఇతర ప్రాంతాలకు వెళ్లడం మరో కారణంగా రాష్ట్ర బీజేపీ నాయకులు విశ్లేషిస్తున్నారు.
కాళిగంజ్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య 2.34లక్షలు. వీరిలో 1.1లక్షల మంది హిందువులు. వీరిలో 66శాతం మంది హిందువులు (72600) తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఇందు లో బీజేపీకి పోలయినవి 52,710 ఓట్లు. అంటే మొత్తం హిందువుల ఓట్లలో 72.6% ఓట్లు బీజేపీకి పడినట్టు లెక్క. మరి కాంగ్రెస్ అభ్యర్థికి ఓట్లశాతం పెరగడం వెనుక కారణమేంటనేది స హజంగా ఉదయించే ప్రశ్న. తృణమూల్ కాంగ్రెస్ తాను బలహీనంగా వున్న బూత్ పరిధుల్లో బీజేపీ ఆధిపత్యాన్ని దెబ్బకొట్టడానికి, కాంగ్రెస్ అభ్యర్థికి ఓటువేయమని తనకున్న కొద్దిపాటి మద్దతు దార్లకు ఆ పార్టీ నాయకులు చెప్పారంటూ బీజేపీ నాయకులు చెబుతున్నప్పటికీ అది అంత విశ్వసనీయంగా లేదు. కాకపోతే లెఫ్ట్`కాంగ్రెస్ మద్దతుదార్లు మరింత ఎక్కువమంది ఓటుహక్కును వినియోగించుకొని వుండటం కారణంగా భావించడం సముచితంగా వుంటుంది.
ఇప్పుడు ప్రధానంగా బీజేపీ నేతలు ఆరోపించేది, బెంగాల్ ప్రభుత్వం అనుసరిస్తున్న విపరీత బుజ్జగింపు రాజకీయాలు, ప్రతిదానికి వారికే ప్రభుత్వం అండగా వుండటంతో మైనారిటీ వర్గాలు ఆధిపత్య ధోరణితో వ్యవహరించడం జరుగుతోందని. ఫలితంగా కాళిగంజ్ ప్రాంతం నుంచి కూడా హిందువులు క్రమంగా మరింత సురక్షిత ప్రదేశాలకు తరలిపోవడం కొనసాగుతోంది. ఇటీవలం పక్కనేవున్న ముర్షిరాబాద్ జిల్లాలో హిందువులపై జరిగిన దాడులు కూడా క్రమంగా రాష్ట్రంలో వీరు సుసంఘటితం కావడానికి దోహదం చేస్తున్నాయని బుర్ద్వాన్ యూనివర్సిటీలో బోధకురాలిగా వున్న సేన్‌గుప్తా అభిప్రాయపడ్డారు. ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త కల్లోల్ కంటి భట్టాచార్య కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తమపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో హిందువుల్లో భయాందోళనలు వ్యక్తమవుతుండటం కూడా రాబోయే ఎన్నికల్లో హిందువులు సు సంఘటితంగా ఓట్లు వేయడానికి దోహదపడుతుందని ఆయన అన్నారు. మరో సామాజికవేత్త అమియ బసు ప్రకారం, బెంగాల్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో ముస్లింల రాడికలైజేషన్ వేగంగా జరుగుతోంది. ఫలితంగా ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లో హిందువులపై దాడులు, హింస నిత్యకృత్య మయ్యాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో 2026 అసెంబ్లీ ఎన్నికల్లో హిందువుల ఓట్లు మరింత సంఘటితమవుతాయని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. కాళిగంజ్ ఉప ఎన్నిక ఇందుకు ఒక బలమైన సంకేతాన్నిచ్చిందని భావిస్తున్నారు. బెంగాల్ అసెంబ్లీలో 294 స్థానాలున్నాయి. 220 స్థానాల్లో హిందువులు సుసంఘటితమైతే మమతా బెనర్జీ ఓటమి ఖాయమన్నది వారి అభిప్రాయం. 102 అసెంబ్లీ స్థానాల్లో ముస్లి ఓటర్లు 30% వున్నారు. 2021లో బీజేపీ వీటిల్లో కొన్ని సీట్లను గెలుచుకుంది. మరో 74 స్థానాల్లో ముస్లిం మెజారిటీ కనుక అక్కడ బీజేపీ అభ్యర్థులు గెలిచే అవకాశా లు లేవు. హిందువుల్లో 80శాతం మంది ఓటింగ్‌లో పాల్గని, వీరిలో 74% మంది బీజేపీకి ఓ టు వేస్తే, పార్టీ అధికారంలోకి రాగలదని రాష్ట్ర బీజేపీ నాయకత్వం అంచనా వేస్తోంది. మరిది సాధ్యమా? వేచిచూడాలి!!
-అసలైన గేమ్ స్టార్ట్ చేసిన సీఎం. ‘‘రేవంత్ రెడ్డి’’.
-కాంగ్రెస్ మ్యానిఫెస్టో అమలుకు పడుతున్న అడుగులు.
-పదకొండేళ్ల తర్వాత ఇండ్లకు మోక్షం.
-పదేళ్లు బిఆర్‌ఎస్ లో ఎదురుచూసిన జనం.
-అదిగో ఇదిగో అని ఆఖరుకు మాట తప్పిన గత ప్రభుత్వం.
-పల్లెల్లో పట్టు బిగించేందుకు వడివడిగా పరుగులు.
-సన్న బియ్యంతో అన్నం.
-ఇందిరమ్మ ఇంటిలో నివాసం.
-పేదలకు కాంగ్రెస్ పాలనే వరం
-పేదల సమస్యలు తీర్చేదే కాంగ్రెస్ ప్రభుత్వం.
-మొదటి విడతగా నియోజకవర్గానికి 3500 ఇండ్లు.
-మూడేళ్ళలలో తెలంగాణ పేదలకు అందనున్న ఇరువైలక్షల ఇందిరమ్మ ఇండ్లు.
-ఇళ్లు లేని పేదలకు గూడు నిర్మాణమే సంకల్పం.
-అందరికీ ఆవాసమే సిఎం. రేవంత్ రెడ్డి లక్ష్యం.
హైదరాబాద్,నేటిధాత్రి: తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపకంతో ఒక్కసారిగా పల్లెల్లో పండగ వాతావరణం నెలకొన్నది. నియోజకవర్గానికి సుమారు 3500 ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. ప్రజల సొంతిళ్లుకోసం గత 11 సంవత్సరాలుగా తెలంగాణలోఎదరుచూస్తున్నారు. ఇంత కాలం తర్వాత సొంతింటి కల నెరవేరుతుందన్న ఆనందం ఆ కుటుంబాలలో వెల్లివిరిస్తోంది. ఈ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మఇండ్లు ఇస్తామని వాగ్ధానం చేసింది. ప్రజలు కూడా బలంగా నమ్మారు. అయితే అదికారంలోకి వచ్చిన తొలి ఏడాదినుంచే రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై దృష్టిపెట్టింది. కాని అనివార్య కారణాల వల్ల కొంత ఆలస్యమైంది. రెండు సార్లు అదికారంలోకి వచ్చిన కేసిఆర్ చెప్పిన మాటల నమ్మి, ప్రజలు కాంగ్రెస్‌ను ఆదరించలేదు. కాని మూడోసారి వచ్చినా కేసిఆర్ డబుల్ బెడ్‌రూంలు ఇవ్వరని ప్రజలు తేల్చుకున్నారు. తమకు ఇండ్లు కావాలన్నా, రావాలన్న కాంగ్రెస్‌ను గెలిపిస్తేనే తమ కల నెరవేరుతుందని బలంగా నమ్మారు. ఇప్పుడు ఆ నమ్మకం నిజమౌతోంది. తెలంగాణలో తొలివిడత దాదాపు రాష్ట్ర వాప్తంగా ఐదు లక్షల ఇండ్ల నిర్మానం చేపడుతున్నట్లు తెలుస్తోంది. పల్లెలు,పట్టణ ప్రాంతాలన్నీ కలుపుకొని తొలి విడత పట్టాల పంపణీ కార్యక్రమం మొదలైంది. అయితే తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టు కింది కూడా అనేక గ్రామాల్లో ఇప్పటీకే చాలా చోట్ల ఇండ్లపట్టాల మంజూరు జరగింది. లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి డబ్బులు కూడా విడుదలయ్యాయి. ఇండ్ల పనులు కూడా ఎప్పుడో మొదలయ్యాయి. దాదాపు పూర్తి దశకు చాలా వరకు చేరుకున్నాయి. కొన్ని పూర్తయి గృహప్రవేశాల కోసం ఎదురుచూస్తున్నాయి. ఈ మాసం ఆషాడం కావడం వల్ల శ్రావణ మాసం తొలి వారంలోనే నిర్మాణం పూర్తయిన ఇందిరమ్మ ఇండ్లకు పెద్దఎత్తున గృహప్రవేశాలు ఏకకాలంలో చేయాలని కూడా అదికారులు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే పూర్తయిన ఇండ్లను రాష్ట్ర వ్యాప్తంగా గృహ ప్రవేశాలు చేసి, రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంగా కూడా చేయాలని సిఎం. రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్నారు. అదే సమయంలో ఈనెల రోజుల కాలంలో కూడా పూర్తి స్ధాయిలో ఇండ్ల నిర్మాణాలు కూడా మొదలుకానున్నాయి. అది ఎంత ఆలస్యమైనా దసరా పండుగ వరకు పూర్తయ్యే అవకాశాలున్నాయి. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు జరిగేందుకు శరవేగంగా నిర్మాణాలు జరనున్నాయి. ఒక్క సంవత్సరంలో సుమారు తెలంగాణ వ్యాప్తంగా 5లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం అంటే ఒక రికార్డుగా చెప్పొచ్చు. గతంలో ఉమ్మడిరాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమం జరిగింది. తర్వాత పదేళ్లు ఇండ్ల నిర్మాణం జరగలేదు. ఇలా వరుసగా నాలుగు సంవత్సరాలు ఏటా ఐదు లక్షల ఇండ్లు నిర్మాణం చేసి, వచ్చే ఎన్నికల నాటికి 20 లక్షల ఇండ్లు నిర్మించి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మానం ఎంతో ప్రతిష్టాత్మాకంగా తీసుకొని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పనిచేస్తున్నారు. ఆయన మంత్రి అయినప్పటి నుంచి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై ప్రత్యేకశ్రద్ద పెట్టారు. అందుకు ఎప్పటికప్పుడు అధికారులతో రివ్యూలు నిర్వహించారు. క్షేత్ర స్దాయి పరిశీలనలు కూడా చెపట్టారు. ఏది ఆలసమ్యమైనా సరే ఇందిరమ్మ ఇండ్లు ఆలస్యం కాకుండా చూసేందుకు మంత్రి పొంగులేటి ఎంతో శ్రమించారు. దాని ఫలితమే ఇందిరమ్మ ఇండ్లకు ఇంత త్వరగా మోక్షం లభించిందని అంటున్నారు. పదకొండేళ్ల తర్వాత తమకు ఇండ్లు వస్తున్నాయని ప్రజలు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట తప్పే నాయకుడు కాదని ప్రజలు కొనియాడుతున్నారు. అందుకే కేసిఆర్‌ను కాదని కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నామని పల్లెల్లో ప్రజలు చెబుతున్నారు. కాంగ్రెస్ అంటేనే ఇండ్లు..ఇండ్లు అంటేనే కాంగ్రెస్ అని గతంలోనే అనేక సార్లు నిరూపించడం జరిగింది. నిజానికి ఇలా పేదలకు ఇండ్ల నిర్మాణం అనేది ఇందిరాగాందీ కాలంలో మొదలైంది. ఆమె దేశ వ్యాప్తంగా దళితులకు పెద్ద ఎత్తున ఇండ్లు నిర్మాణం చేయించింది. అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చొరవ తీసుకొని ఇండ్లు నిర్మాణం చేస్తున్నారు. ముఖ్యంగా 2004 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టింది. అయితే అప్పుడు రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో వుంది. దాంతో ఉమ్మడి రాష్ట్రంలో అడిగిన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారు. ఆ సమయంలో తొలివిడతలోనే కొన్ని లక్షల ఇండ్లు మంజూరు చేశారు. మొత్తంగా 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో సుమారు 45 నుంచి 50లక్షల వరకు ఇండ్లు నిర్మాణం చేశారు. అందులో తెలంగాణకు సుమారు 25లక్షల ఇండ్లు మంజూరయ్యాయి. ఆ సమయంలో చాల మందికి ఇండ్లు వచ్చాయి. అయితే 2014లో తెలంగాణ వచ్చింది. అప్పటికి ఇంకా కొంత మంది ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురుచూస్తున్నారు. నిజానికి ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియ అనేది నిరంతర ప్రక్రియగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ వచ్చిన తర్వాత కేసిఆర్ ఎన్నికల సమయంలో అగ్గిపెట్టె లాంటి ఇందిరమ్మ ఇండ్లు కాకుండా పెద్దఎత్తున డబుల్ బెడ్ రూంలు నిర్మాణం చేసి ఇస్తామన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసిఆర్ మాటలు ప్రజలు సహజంగానే విశ్వసించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా రెండు మూడేండ్లయినా ప్రజలు డబుల్ బెడ్ రూంల గురించి అడగలేదు. అలా అడకుండా కేసిఆర్ ప్రజలకు మాయ మాటలుచెప్పి కాలయాపనచేశాడు. 2018 ఎన్నికలు వచ్చాయి. 60ఏళ్ల దరిద్రం నాలుగేళ్లలలో పోతుందా? అని చెప్పి, మరో సారి అవకాశమిస్తే ఈసారి పేదవాళ్లందరికీ ఇండ్లు ఇస్తామని మాట ఇచ్చాడు. మళ్లీ తెలంగాణ ప్రజలు కేసిఆర్‌ను నమ్మారు. రెండోసారి కూడాకేసిఆర్ మాట తప్పాడు. ఒక దశలో డబుల్ బెడ్ రూంలు ఇవ్వడం సాధ్యం కాదని చేతులెత్తేశాడు. 2023 ఎన్నికల్లో కేసిఆర్ గెలిస్తే ఇక డబుల్ బెడ్ రూంల ఇండ్లేమో గాని, ఇందిరమ్మ ఇండ్లు కూడా రాకుండాపోతాయని ప్రజలు ఆలోచించారు. ఇందిరమ్మ ఇండ్లురావాలంటే మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలనికోరుకున్నారు. గెలిపించుకున్నారు. ఆ నమ్మకాన్ని ప్రభుత్వం కూడా నిలుపుకునేందుకు రెండో ఏడాది నుంచే కృషి మొదలు పెట్టింది. ఈ బడ్జెట్‌లోనే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన నిధులను కేటాయించింది. తొలి త్రైమాసికం తర్వాత నిధుల విడుదల మొదలు పెట్టింది. ఇటు ఇందిరమ్మ ఇండ్ల పట్టాల కార్యక్రమం రూపకల్పన జరిగిపోయింది. ఏక కాలంలో జరిగిన రెండు కార్యక్రమాల వల్ల అనుకున్న సమయానికి అనుకున్నట్లుగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కార్యరూపం దాల్చుతోంది. అదిగో ఇదిగో అంటూ పదేళ్ల పాటు సాదగీసిన కేసిఆర్ లాగా ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లకుండా వెండాలని వెంటనే ఇందిరమ్మ ఇండ్లకు మోక్షం కల్పించారు. ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసలైన అభివృద్ది మొదలు పెట్టి గేమ్స్ స్టార్ట్స్ నౌ అంటున్నట్లే వుంది. ఎందుకంటే ఇందిరమ్మ ఇండ్లు అనేది ఒక రెండు తరాలకు ఉపయోగపడే కార్యక్రమం. పైగా గతంలో పల్లెలో వుండే ఇండ్లు ఒక్క తరానికి మాత్రమే ఉపయోగపడేవి. ఇప్పుడు ప్రతి నిర్మానం కాంట్రీట్‌తోనే కావడం వల్ల ఆ ఇండ్లు సుమారు రెండు తరాలకుకూడా ఉపయోగపతాయి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని రెండు తరాలు గుర్తు చేసుకుంటారు. ఎవరి హాయంలో ఇల్లు వచ్చిందన్న ప్రస్తావన వచ్చిన ప్రతీసారి రేవంత్‌రెడ్డి పేరు గుర్తు చేసుకుంటారు. ఇదే గతంలో వైఎస్ అనుసరించారు. అందుకే ఇప్పటీకీ ఆయనను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. భవిష్యత్తులో కూడా తెలంగాణలో ఇదే విధంగా సిఎం. రేవంత్ రెడ్డిని గుర్తుంచుకుంటారని చెప్పడంలో సందేహంలేదు. పైగా తెలంగాణలో సన్న బియ్యం అందించిన నాయకుడిగా కూడా రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారు. రేషన్ బియ్యం పంపిణీ జరిగినంత కాలం తెలంగాణలో ప్రజలు రేవంత్ రెడ్డిని పదే పదే గుర్తు చేసుకుంటారు. సన్న బియ్యం తింటూ, ఇందిరమ్మ ఇంట్లో వుంటూ రేవంత్ రెడ్డిని నిత్యం తల్చుకుంటారు. దేవుడిగా కొలుచుకుంటారు.
-వడ్లు తిరిగి ఖమ్మం సివిల్ సప్లయ్‌కి అప్పగిస్తే తప్పు ఒప్పవుతుందా?
-మోసం చేసిన మిల్లర్‌కు శిక్ష తప్పుతుందా?
-ఖమ్మం జేసినే తప్పుపడుతూ వున్న జగన్‌ను హన్మకొండ అధికారులు వదిలేస్తారా?
-రైతులను మోసం చేసిన జగనే ‘‘నేటిధాత్రి’’ మీద కేసులు నమోదు చేస్తుంటే చూస్తూ
ఊరుకుంటారా?
-రేపటి రోజు హన్మకొండ అధికారులు ‘‘కోర్టు’’కు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది.
-మోసం చేసిన జగన్‌పై చర్యలేవీ అని ప్రశ్నిస్తే ఏం సమాధానం చెబుతారు?
-‘‘నేటిధాత్రి’’ వల్లనే జగన్ మోసం వెలుగులోకి వచ్చింది.
-జగన్ ప్రభుత్వాన్ని మోసం చేశాడని తెలిసింది.
-మోసం చేసిన జగనే ‘‘నేటిధాత్రి’’ మీద కేసు నమోదు చేయడం బరితెగింపు కాదా?
-రైతులను మోసం చేయాలనుకునే మిల్లర్లు పెరిగిపోరా?
-అది ప్రభుత్వ చేతగాని తనం అనిపించుకోదా!
-దొంగే దొంగ అని అరిచి ఇంకా ఎవరి కళ్లుగప్పాలనుకుంటున్నాడు?
-జగన్ చేసిన మోసం అధికారుల మెడకు చుట్టుకోదా?
హైదరాబాద్,నేటిధాత్రి:
హన్మకొండ సివిల్ సప్లై శాఖ ఏం చేసింది? ఏం చేస్తోంది? అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్త చర్చగా మారింది. హన్మకొండకు చెందిన మిల్లర్ జగన్ చేసిన నిర్వాకం అందరికీ తెలుసు. ఖమ్మం జిల్లా నుంచి వడ్లు వచ్చాయన్నది నిజం. హన్మకొండ జిల్లాకు చెందిన కొంత మంది మిల్లర్ల పేరు మీద ఆర్వోలు జారీ అయ్యాయని తెలుసు. ఆ మిల్లులకే తొలత వడ్లు చేరాయన్నది నిజం. చేరిన వడ్లు ఆ మిల్లర్లు తీసుకోవడం లేదని హన్మకొండ సివిల్ సప్లై అధికారులు లేనిపోనివి సృష్టించారన్నది తెలుసు. ఖమ్మం నుంచి వచ్చిన వడ్లు ఆ మిల్లలకు కాకుండా, మరుసటి రోజులు అర్ధాంతరంగా మిలర్ల జగన్ మిల్లులకు తరలిపోయాయన్నది నిజం. ఆ మిల్లర్ అధికారుల ఆశీస్సులతో ఆ వడ్లు తన మిల్లలకు చేరవేసుకున్నారన్నది నిజం. ఈ విషయంలో తొలత ఖమ్మం జేసికి సమాచారం ఇవ్వలేదన్నది నిజం. తర్వాత వడ్ల లెక్కల్లో తేడాలొచ్చాయన్నది నిజం. ఆ విషయం ఖమ్మం జిల్లా జేసి గుర్తించారన్నది నిజం. వెంటనే జగన్‌కు ఖమ్మం జేసి తాఖీదులు పంపిచారన్నది నిజం. ఈ విషయాలన్నీ నేటిధాత్రి అక్షరం పొల్లు పోకుండా నిజాలు రాసిందన్నది కూడా వాస్తవం. ఇక్కడ వడ్లు చెందాల్సిన మిల్లులకు చెరలేదు. చెందలేదు. కాని ముందు లిస్టులో లేని జగన్ మిల్లులు వడ్లు తరలించిన అధకారులు బాగానేవున్నారు. వచ్చిన వడ్లు తమ మిల్లులకు చేరకపోయినా మిల్లర్లు సైలెంట్‌గానే వున్నారు. ఆ మిల్లులకు న్యాయం జరగాలన్న నేటిదాత్రికి మిల్లర్ జగన్ నోటీసులు పంపడం జరిగింది. అంటే అక్రమంగా వడ్లను మిల్లులకు తరలించిన వ్యక్తే, తనకు అన్యాయం జరిగిందని గగ్గోలు పెట్టడం అంటే దొంగే దొంగ అని అరిచినట్లే వుంది. అసలు హన్మకొండ అధికారులు ఎవరి మేలు కోసం పనిచేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రజలు చెల్లించిన జీతాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వానికి, రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారు. పైగా మిల్లర్ జగన్‌కు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. మిల్లర్ జగన్ ఆగడాలకు వంత పాడుతున్నారు. ఖమ్మం జిల్లా జేసి పంపిన వడ్ల లెక్కలు చూసుకునే తీరిక హన్మకొండ అధికారులకు లేదు. మరి అధికారులు ఏం చేస్తున్నట్లు? రైతులకు, ప్రభుత్వానికి కుచ్చుటోపీ పెట్టే వారిపై వార్తలు రాసినందుకు నేటిధాత్రికి నోటీసులు పంపడాన్ని అధికారులు ఎలా సమర్ధించుకుంటారో కోర్టులో తేలుతుంది. రైతులను మోసం చేసి తిరిగి న్యాయస్ధానాలను కూడా తప్పుతోవ పట్టించాలని చూస్తున్న జగన్ సంగతి తేలుతుంది. రైతులను మోసం చేసి, ప్రభుత్వం కళ్లుగప్పి నేరం చేసిన అక్రమార్కులకు కూడా పరువు అనేది ఒకటి వుంటుందా? అది పరువుకు భంగం కలుగుతుందా? తప్పు చేసినప్పుడు పరువు గుర్తుకు రాలేదా? మోసం చేసినప్పుడు పరువు పోతుందన్న ఆలోచన రాలేదా? నేటిధాత్రి నిజాలు వెలుగులోకి తేవడం వల్ల పరువు పోయిందా? పరువుగా బతకాలనుకున్నప్పుడు తప్పు చేయడమే విడ్డూరం. తప్పు చేసిన తన పరువును వెతుక్కోవాలనుకోవడం నిజంగానే విచిత్రం. అందుకే జగన్ వ్యవహారం చూసేందుకు ఏకంగా సివిల్ సప్లైశాఖ కమీషనర్ చౌహన్ రంగంలోకి దిగుతున్నట్లు నేటిధాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావుతో చెప్పారు. ఇంతటి దుర్మార్గం ఎందుకు జరుగుతోంది? అధికారులు ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారు? అందరి లెక్కలు తేల్చుతా? అని చెప్పారు. ఎందుకంటే హన్మకొండ జాయింట్ కలెక్టర్ మిల్లర్ జగన్‌కు నోటీసులు పంపించానంటున్నారు. తాను చేసింది పొరపాటు అని ఒప్పుకోని జగన్, మాయమైన వడ్లను తిరిగి ఇచ్చేస్తానని చెబుతున్నట్లు సమాచారం అందుతోంది. అంటే మాయం చేసిన వడ్లను తిరిగి సివిల్ సప్లై శాఖకు అప్పగిస్తే చేసిన నేరం మాసిపోతుందా? తప్పు ఒప్పవుతుందా? అందుకు ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం వుంది. అందుకే నేరుగా కమీషనర్ చౌహన్ రంగంలోకి త్వరలో దిగుతున్నట్లు చెబుతున్నారు. అక్రమ మిల్లర్ జగన్, వార్తలు రాసిన నేటిధాత్రిపై కేసులు నమోదు చేస్తే అధికారులు కూడా కోర్టుకు హజరుకాకతప్పుతుందా? మిల్లర్ జగన్‌ను అధికారులు ప్రోత్సహించినట్లు స్పష్టమైన ఆదారులున్నాయి. ఖమ్మం నుంచి వచ్చిన వడ్లు మిల్లర్ జగన్‌కు పంపలేదు. కాని ఆ వడ్లు హన్మకొండకు వచ్చి, ఆర్వోలున్న మిల్లుల వద్దకు లారీలు చేరుకున్న తర్వాత దారి మళ్లింపబడ్డాయి. అధికారుల పర్యవేక్షణలోనే అవి జగన్ మిల్లులకు చేరాయి. అందుకు కారణాలు అధికారులు ఎన్ని చెప్పినా సమర్ధనీయం కాదు. అంతే కాకుండా ఈ విషయాలన్నీ నేటిదాత్రి రాయడం వల్లనే వెలుగులోకి వచ్చాయి. ఖమ్మం జిల్లా జాయింట్ కలెక్టర్ స్పందించాల్సి వచ్చింది. మిల్లర్ జగన్‌కు నోటీసులు పంపడం జరిగింది. అసలు వడ్లు తన మిల్లులకు మళ్లించుకుపోవడమే జగన్ చేసిన తొలి నేరం. తర్వాత ఆ వడ్ల లెక్కలను తారు మారు చేసి వాటిని మాయం చేయడం అతి పెద్ద నేరం. ఇన్ని నేరాలు చేసిన వ్యక్తి నేటిధాత్రికి నోటీసులు పంపించడం అంటేనే ఆయన వెనుక అధికారులు సపోర్టు ఎంత వుందనేది తెలిసిపోతోంది. ఇలా నేరం చేసిన వారే న్యాయస్దానాలను ఆశ్రయిస్తున్నానని ఎవరిని బెదిరిస్తారు? న్యాయాన్ని ఎవరూ బెదించలేరు. అన్యాయం ఎప్పటికీ గెలవలేదు. కమీషనర్ చౌహాన్ రంగంలోకి దిగిన తర్వాత అంతా తేలుతుంది. జగన్ వ్యహారం బండారం అంతా బైటపడుతుంది. అదికారులు తీరు అంతా వెలుగులోకి వస్తుంది.
– Before elections Bandi Sanjay may pick up as President
– Etela, Aravind were not considered
After several months of hiatus, the BJP has finally picked a new face to lead the party in Telangana. Old timer and loyalist N Ramachandra Rao has been named as the new BJP state president. Rao repalced Union Coal and Mines Minister G. Kishan Reddy who was elected as the BJP’s state unit president in July 2023 replacing Bandi Sanjay Kumar. Pertinently, Union Minister of State and former BJP state president Bandi Sanjay pitched for Rao’s candidature. And Rao has the backing of Rashtriya Swayamsevak Sangh (RSS). It is said that for the next 3 years, Rao will lead the party in the state, and then Bandi Sanjay might take over before General elections. Though Sanjay was removed from the president’s post in the last elections, the BJP top brass still looks at him as someone who can take on the Opposition in Telangana. In an interesting development, former MLC N Ramachandra Rao has reportedly been directed to file nomination for the State BJP president post, even as the nomination filing process was underway at the BJP office here on Sunday. The move clearly indicates the national leadership’s preference in selecting the new State president. Interestingly, Malkajgiri MP Etala Rajender, Union Minister of State for Home Bandi Sanjay, former MP DK Aruna and Goshamahal MLA T Raja Singh were among the key contenders for the post. In a video message, Raja Singh appealed to the party to consult both grassroots workers and senior leaders before finalising the new State president. However, the party’s directive to Ramachandra Rao appeared to go against this appeal. As there were no other nominations filed, N. Ramachandra Rao get elected in unanimous. Union Minister of State MSME Shobha Karandleage acted as Central Returning officer. Elections were held at BJP state head quarters in Hyderabad. In Telangana, the party is understood to have decided in favour of Ramachander Rao after a section of Telangana RSS leaders and one faction in the party had recommended his name to the leadership. He has strong roots in the RSS and was tempered in the school of ABVP. He has also remained loyal to the saffron party since the time he joined. In fact, he is a dyed-in-the-wool BJP leader. The party veered to the conclusion that Ramachander Rao fits the bill since he is acceptable to all sections in the party. Though he belongs to the Brahmin community he has been chosen to keep the party afloat till the elections arrive three and a half years from now. The party is understood to have decided on the pros and cons of other leaders, but each one has his own disadvantage of opposition from one or the other groups in the party. For instance, if Eatala is taken as president, there might be objection to him from Bandi Sanjay Kumar’s group, and if the latter is asked to helm the party, there might be opposition from Eatala and even Union Minister Kishan Reddy. Nizamabad MP Aravind Dharmapuri, who was also in the race for the president’s post, seemingly was not considered. The camaraderie between Union Home Minister Amit Shah and Bandi Sanjay indicated that the top brass takes his words seriously. And therefore they agreed on Rao. Even Arvind has opposition in the party, but when it comes to Ramachandra Rao, he is an acceptable leader. The party seemed to have decided against Eatala Rajender because of his long association with the BRS and also is under a cloud now in the wake of his role in the construction of Kaleshwaram project by Justice PC Ghose Commission of Inquiry. Being given many opportunities within the BJP, is still seen as someone who supports the BRS in the state. It may be recalled that Eatala Rajendra was once a minister in the BRS Chief K Chandrashekar Rao’s government. He left the party after fallout with KCR. During the inauguration of the Turmeric board in Nizamabad, when Amit Shah asked the audience to raise their hands if they think BRS is corrupt and the large-scale corruption was done in the Kaleshwaram Project, Eatala did not lift his hand. This did not go unnoticed. Party members have time and again informed the national leadership of Eatala’s closeness to a few BRS leaders. The party did not appear to be in the mood to take any chances. Ever since Bandi Sanjay was eased out as the party’s Telangana president ahead of the 2023 Assembly elections, Union Minister G Kishan Reddy has been handling both responsibilities. Rao, 66, is an advocate from Telangana. From 2015 to 2021, he was a Member of the Telangana Legislative Council (MLC) for Hyderabad, Ranga Reddy, and Mahabubnagar Graduates’ Constituency. He has also been in charge of the Bharatiya Janata Party’s membership drive in Telangana. Rao started his legal practice in Hyderabad in 1985. In 2014, he was elected as a member of the Bar Council of India. He has also been BJP’s Chief Spokesperson and the General Secretary of undivided Andhra Pradesh. Rao’s father, Professor NVRLN Rao, was Dean of the Faculty of Engineering for Osmania University. His daughter, Amuktha Naraparaju, is based in Australia and works in the IT sector. His son, Avaneesh Naraparaju, is a practising lawyer at the Telangana High Court. Rao took to politics while at Picket Kendriya Vidyalaya school during the Emergency. He was elected President of the Students’ Union (affiliated to Akhil Bharatiya Vidyarthi Parishad, (ABVP) for three straight years while studying Bachelor of Arts at Railway Degree College. He has also been secretary (ABVP) of Osmania Law College Student Union. Rao was jailed 14 times during his student years. Rao attended high school in 1977 at Kendriya Vidyalaya in Picket Secunderabad. He did a BA from Railway Degree College, Secunderabad in 1980 and got a Master of Arts (Political Science) from Osmania University in 1982. Rao did a Bachelor’s in Law from Osmania University in 1985. After election N. Ramachandra Rao expressed his deepest gratitude to the people of Telangana for their unwavering faith in our shared vision for the state. He also thanked the Almighty for bestowing upon me this immense responsibility to serve our great land and its spirited citizens. This opportunity is a solemn mandate to work relentlessly for the aspirations of every heart of the people of Telangana. He conveyed his heartfelt thanks to Hon’ble Prime Minister Shri NarendramodiJi, Union Home Minister Shri AmitShah Ji, & BJP National President Shri @JPNaddaJi for reposing their trust in me. He also expressed his gratitude to all other senior leaders at Central and state level for extending their support to him to become the president of BJP State unit. It is very common that after election of any leader there appears some discontent among the party leaders who contended for the post. Likewise after election of Ramachandra Rao also some mixed response appeared among the party leaders of various levels. After becoming the new president of BJP, there will be great challenge for Ramachadra Rao in the form of Jubilee Hills by election. At the same time huge task before new president is to bring leaders belong to various sections under one umbrella. It is believed that being dedicated leader and with smooth behaviour Ramachandra Rao will become successful in bringing all such leaders and make them to move towards the party goals. When compare to other leaders who contended for this post, he has no groups will become an advantage for him to consolidate his position. At the same time his prolonged career in RSS and good relations in party higher level as well as his long time association with the state level leaders who worked for the party since the beginning will give edge for him. Before election of Ramachadra Rao party brought ‘M-3’ formulae forefront in order to pacify ‘Munnuru Kapu, Mudiraj and Madiga’ sections. As part of this Madakrishna Madiga received with good preference by awarding him with ‘Padmasri’. SC sub cast classification also brought to implementation. Now new state president Ramachandra Rao has Hercules task to coordinate all these three sections as per the wish of the party.
ఈటెల, అరవింద్‌ను పార్టీ అధినాయకత్వం పట్టించుకోలేదు
హైదరాబాద్,నేటిధాత్రి:
కొన్ని నెలలుగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎవరన్న దానిపై సస్పెన్స్ తొలగింది. మొదట్నుంచీ పార్టీలో నిబద్ధ కార్యకర్తగా పనిచేసిన ఎన్. రామచంద్రరావు నూతన పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యా రు. ఇప్పటివరకు కేంద్ర బగ్గుగనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర బీజేపీకి సారథ్యం వహిస్తున్నారు. బండి సంజయ్‌ను పార్టీ అధ్యక్ష పదవినుంచి తప్పించిన తర్వాత 2023 జూలై నుంచి ఆయన ఈ పదవిలో కొనసాగుతున్నారు. కాగా ఎన్. రామచంద్రరావుకు మొదట్నుంచీ ఆర్.ఎస్.ఎస్.తో మంచి అనుబంధం వుంది. ఆయన సంఫ్‌ు కార్యకర్తగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఈనేపథ్యంలో ఆయనకు రాష్ట్ర ఆర్.ఎస్.ఎస్. నుంచి సంపూర్ణ మద్దతు లభించడం కూడా ఒక కారణం. రాబోయే మూడేళ్ల కాలం ఆయన పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతారు. తర్వాత వచ్చే ఎన్నికల ముందు బండిసంజయ్‌కి పార్టీ పగ్గాలను తిరిగి అప్పగించే అవకాశాలున్నాయి. బండిసంజ య్‌ను పార్టీ అధ్యక్ష పదవినుంచి తప్పించినప్పటికీ, కేంద్ర నాయకత్వం, ఆయన మాటకు అత్యంత విలువనిస్తుంది. బీజేపీని నాటి అధికార బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయమన్న స్థాయికి తీసుకెళ్లిన ఆయన సేవలను పార్టీ అధిష్టానం ఇప్పటికీ గుర్తిస్తోంది. గతనెల 29వ తేదీన హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో, కేంద్ర నాయకత్వం రామచంద్రరావును నామినేషన్ దాఖలు చేయాలని కోరడం విశేషం. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి విషయంలో కేంద్ర నాయకత్వం ఒక స్పష్టమైన వైఖరి తో వున్నదని దీంతో స్పష్టమైంది. అయితే మల్కాజ్‌గిరి ఎం.పి. ఈటెల రాజేందర్, నిజామాబాద్ ఎం.పి. అరవింద్‌కుమార్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, మహబూబ్‌నగర్ ఎం.పి. డి.కె. అరుణ కూడా ఈ పదవికి పోటీదార్లుగా వున్నారు. అయితే రాజాసింగ్ ఒక వీడియోను విడుదల చేస్తూ, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల అభిప్రాయానికి అనుగుణంగానే రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక జరగాలని కోరారు. కానీ అధిష్టాం దీన్ని పట్టించుకోలేదు. కేంద్ర ఎంఎస్‌ఎంఈ సహాయ మంత్రి శోభ కరండల్‌జీ కేంద్ర ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. కాగా రామచంద్రరావు ఒక్కరే నామినేషన్ ఫైల్ చేసిన నేపథ్యంలో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. తెలంగాణ ఆర్.ఎస్.ఎస్. విభాగం, రాష్ట్ర బీజేపీలోని ఒక వర్గం రామచంద్రరావు పేరును సిఫారసు చేయడం ఈ ఎన్నికకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌తో ఆయనకున్న విడదీ యరాని అనుబంధం, ఎబీవీపీలో రాజకీయ పాఠాలు నేర్చుకోవడం, మొదట్నుంచీ బీజేపీకి విధేయంగా వుండటం, పార్టీలోని అన్ని వర్గాలకు ఆమోదయోగ్య నాయకుడు కావడం ఆయనకు కలిసొచ్చిన అంశాలు. పార్టీ మిగిలిన వారిని పరిశీలించినప్పటికీ, ఒక్కక్కరికీ ఒక్కో రకమైన ప్రతి కూలత వుండటాన్ని కూడా పార్టీ నాయకత్వం గుర్తించింది. వీరిలో ఎవరికి అవకాశమిచ్చినా ఇతర వర్గాలనుంచి అసమ్మతి చెలరేగే ప్రమాదమున్న సంగతిని అర్థం చేసుకునే చివరకు రామచం ద్రరావువైపు మొగ్గు చూపింది. ఉదాహరణకు ఈటెల రాజేందర్‌ను, ఇటు బండిసంజయ్ వర్గం, కిషన్ రెడ్డి వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తాయి. ఇక బండిసంజయ్ అభ్యర్థిత్వాన్ని ఈటెల, కిషన్‌రెడ్డి అడ్డుకుంటారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ కుమార్‌ను పార్టీ పరిగణలోకి తీసుకోలేదు. అమిత్ షాతో అత్యంత సాన్నిహిత్యం వున్న నేపథ్యంలో బండి సంజయ్ మాటకు విలువ ఎక్కువ. ఆయన రామచంద్రరావుకు మద్దతు ప్రకటించినట్టు తెలుస్తోంది. అరవింద్ కుమార్‌కు కూడా రా మచంద్రరావు అభ్యర్థిత్వంపై ఎటువంటి వ్యతిరేకత లేదు. ఇక ఈటెల రాజేందర్ విషయానికి వ స్తే ఇప్పటికీ ఆయనకు బీఆర్‌ఎస్ నాయకులతో సాన్నిహిత్యం వుంది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జస్టిస్ ఘోష్ కమిషన్ ఆయన్ను కూడా ప్రశ్నించడం మరో కారణం. ఆయనకు ఎన్ని అవ కాశాలిచ్చినా బీఆర్‌ఎస్ పట్ల సానుభూతి వున్న నేతగానే పేరుపడ్డారు. కె.సి.ఆర్. ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. తర్వాత కె.సి.ఆర్.తో వచ్చిన విభేదాల కారణంగా పార్టీనుంచి బయటకు వచ్చారు. అదీకాకుండా తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించడానికి నిజామాబాద్ వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్ అవినీతి పార్టీ అని, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని అంగీకరించేవారు చేతులెత్తమని కోరగా, పాల్గన్నవారిలో చాలామంది చేతులెత్తారు. కానీ ఈటెల రాజేందర్ మిన్నకుండిపోయారు. దీన్ని అధినాయకత్వం గుర్తింలేదనుకుంటే పొరపాటే. పార్టీ నాయకత్వం వివిధ నేతల వ్యవహారశైలిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటుంది. ఈ అంశం కూడా రాష్ట్ర నాయకులు అమిత్ షా చెవిన వేయకుండా వుండరు. ఇవన్నీ ఈటెల రాజేందర్ ఎ న్నికకు ప్రతికూలంగా మారాయి. ఇక ఎన్. రామచంద్రరావు (66) ప్రస్తుతం అడ్వకేట్‌గా పనిచేస్తున్నారు. 2015 నుంచి 2021 వరకు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుంచి ఎం.ఎల్.సి.గా తెలంగాణ శాసనమండలిలో కొనసాగారు. అంతేకాదు రాష్ట్రంలో బీజేపీ మెంబర్‌షిప్ డ్రైవ్‌కు ఆయన ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. 1985లో రామచంద్రరావు అడ్వకేట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. 2014లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ అధికార ప్రతినిధిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. రామచంద్రరావు తండ్రి ప్రొఫెసర్ ఎన్‌వీఆర్‌ఎల్‌ఎన్ రావు, ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజినీరింగ్ ఫ్యాకల్టీ డీన్‌గా పనిచేశారు. రామచంద్రరావు కుమార్తె ఆముక్త నారపరాజు ఆస్ట్రేలియాలో ఐ.టి. రంగంలో పనిచేస్తున్నారు. ఆయన కుమారుడు అవినాష్ నారపరాజు తెలంగాణ హైకోర్టులో లాయర్‌గా ప్రాక్టీసు చేస్తున్నారు. ఎమర్జెన్సీ సమయంలో పికెట్ కేంద్రీయ విద్యాయంలో చదువుతున్న కాలంలో రామచంద్రరావు రాజకీయాల్లోకి ప్రవేశించారు. రైల్వే డిగ్రీ కళాశాలలో చదువుతున్న కాలం లో ఆయన ఏబీవీపీ రాష్ట్ర యూనియన్‌కు మూడేళ్ల పాటు అధ్యక్షుడిగా వరుసగా ఎన్నికయ్యారు. ఉస్మానియా లా కాలేజీ యూనియన్‌కు ఎబివిపి తరపున అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తాను చదువుకుంటున్న కాలంలో 14సార్లు జైలుకెళ్లారు. 1982లో ఆర్డ్స్ విభాగంలో ఉస్మానియా యూనివర్సిటీనుంచి మాస్టర్స్ డిగ్రీని సంపాదించారు. 1985లో బ్యాచులర్ ఆఫ్ లా డిగ్రీని ఇదే యూనివర్సిటీనుంచి పొందారు.తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత, తనపట్ల అచంచల వి శ్వాసం వ్యక్తం చేసిన తె లంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. స్పూర్తిదాయక రాష్ట్ర ప్రజలకు సేవచేసే గురుతర బాధ్యతను అప్పగించిన నరేంద్ర మోదీ, అమిత్ షా, జె.పి. నడ్డాలకు కృతజ్ఞత లు తెలిపారు. ఇదే సమయంలో తనకు రాష్ట్ర పార్టీ నాయకులకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. రామచంద్రరావు ఎన్నికపై పార్టీలో మిశ్రమ స్పందన వ్యక్తం కావడం మామూలే. మరెవరు ఎన్ని కౖౖెనా ప్రతికూల గ్రూపుల నాయకులు తమ అసంతృప్తిని వ్యక్తం చేయడం సహజమే. అయితే ఏ గ్రూపునకు చెందనివాడు కావడంతో అందరి ఆమోదాన్ని రామచంద్రరావు పొందగలిగారు. పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత రామచంద్రరావుకు జూబిలీ హిల్స్ ఉప ఎన్నిక రూపంలో సవా లు ఎదురుకానుంది. అంతేకాదు పార్టీలోని వివిధ గ్రూపుల మధ్య కూడా సమన్వయం సాధించడం ఆయన ముందున్న మరో సవాలు. కాకపోతు మృదుస్వభావి, అందరినీ కలుపుకుపోయే స్వభావం వున్న నాయకుడిగా రామచంద్రరావుకు ఇది పెద్ద సమస్య కాకపోవచ్చు. అంతేకాదు అందరినీ పార్టీ ఉమ్మడి లక్ష్యాలవైపు నడిచేలా చేయడానికి కూడా ఆయన పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాకపోవచ్చు. పార్టీ కేంద్ర మరియు రాష్ట్ర నాయకత్వాలతో సన్నిహిత సంబంధాలు, మొద ట్నుంచీ పార్టీకి విశ్వసనీయ కార్యకర్తగా పనిచేసిన అనుభవం ఆయనకు సానుకూలంగా మారనున్నది. అయితే రామచంద్రరావు ఎన్నికకు ముందే పార్టీ ‘ఎం`3’ ఫార్ములాను ముందుకు తెచ్చింది. ‘ముదిరాజ్, మున్నూరు కాపు, మాదిగ’ వర్గాలను ఆకర్షించేందుకు పార్టీ రూపొందించిన ఫార్ములా ఇది. దీన్ని రామచంద్రరావు గట్టిగా అమలు చేసి ఆయా వర్గాలు పార్టీవైపు మళ్లేలా చేయాల్సి వుంటుంది. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ, మాదిగ ఉద్యమ నేత మందకృష్ణ మాదిగను తన పక్కనే కూర్చోబెట్టుకోవడమే కాదు, ఎస్సీ ఉపకుల వర్గీకరణకు కూడా సానుకూలంగా స్పందించారు. సుప్రీంకోర్టు కూడా అనుకూల తీర్పునిచ్చిన నేపథ్యంలో తెలంగాణలో దీన్ని అమలు చే శారు. ఇదే మాదిరి మిగిలిన రెండువర్గాలను పార్టీకి అనుకూలంగా మారేలా రామచంద్రరావు కృషి చేయాల్సి వుంటుంది.
-అభివృద్ధి ఓటు వేసి కాంగ్రెస్ కు మద్దతు పలుకుతారా?
-హైడ్రా ప్రభావం కాంగ్రెస్ కు అనుకూలమా? వ్యతిరేకమా?
-జూబ్లీ హిల్స్ గెలవడం కాంగ్రెస్ కు ప్రతిష్టాత్మకమే.
-ఈ ఎన్నిక గెలిస్తే కాంగ్రెస్ తిరుగుండదు.
-కాంగ్రెస్ కు వలసలు వరదలా వస్తాయి.
-సిఎం. రేవంత్ రెడ్డి నాయకత్వం మరింత బలపడుతుంది.
-మరో పదేళ్ల దాక కాంగ్రెస్ కు బలం చేకూరుతుంది.
-బిఆర్‌ఎస్ చేసే ప్రచారం అసత్యమని తేలుతుంది.
-అధికారమంతా కేంద్రీకృతం చేసుకునే అవకాశం కూడా వుంది. …………………………..
-బిఆర్‌ఎస్‌కు సానుభూతి కలిసొస్తుందా?
-ప్రభుత్వం మీద చేస్తున్న దుష్ప్రచారం పని చేస్తుందా?
-ప్రజల్లో బిఆర్‌ఎస్ కు ఆదరణ వుందా?
-పార్లమెంటు ఎన్నికల ఫలితమే పునరావృతమౌతుందా?
-బిఆర్‌ఎస్‌కు ఈ గెలుపు జీవన్మరణ సమస్య
-జూబ్లీ హిల్స్ గెలవకపోతే గులాబీ మనుగడ చాలా కష్టం.
-ఫోన్ ట్యాపింగ్, ఇతర కేసులన్నీ నిజమని బలపడుతుంది జనం నమ్మకం
-ఇప్పటికీ కంటోన్మెంట్ కోల్పోయారు.
-అక్కడ సానుభూతి ఏ మాత్రం పని చేయలేదు.
-జూబ్లీ హిల్స్ లో కూడా పని చేస్తుందన్న నమ్మకం బిఆర్‌ఎస్‌లోనే కనిపించడం లేదు.
……………………
-జూబ్లీ హిల్స్ కమలం వికసించాలని చూస్తోంది.
-బిజేపి కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం వుంది.
-జాతీయ రాజకీయ నాయకులను రంగంలోకి దింపే ఆస్కారం వుంది.
హైదరాబాద్,నేటిధాత్రి: రంగంలోకి దిగితే గాని గండామా, సుడిగుండమా తెలుస్తుందనేది ఓ సామెత. ఇప్పుడు జూబ్లిహిల్స్ ఎన్నిక విషయంలోనూ అన్ని పార్టీలదీ అదే పరిస్ధితి కనిపిస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఏ పార్టీ జెండా ఎగుతుందనేది ఉత్కంఠగామారింది. అన్ని పార్టీలు ఉప ఎన్నిక విషయంలో సై అంటే సై అన్నట్లే వున్నాయి. కాని లోలోప మాత్రం ఎంతో కొంత భయం కూడా పార్టీలకు వున్నట్లు కనిపిస్తోంది. సుమారు ఏడాది తర్వాత వస్తున్న ఎన్నిక కావడం కూడా గమనార్హం. ఈ మధ్య ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినా ఇంత ఉత్కంఠ నెలకొనలేదు. కాని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై మాత్రం అందరికీ అంచచనాలున్నాయి. అందరికీ భయాలున్నాయి. అయితే పాలకపక్షం కాంగ్రెస్ గెలిచేందుకు కొంత సులువుగా వాతావతరణం కనిపిస్తోంది. ఎందుకంటే హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రాంతం రాజకీయ, సామాజిక, ఆర్ధికపరమైన సమస్యలు పెద్దగా చూసే నియోజకవర్గం కాదు. అక్కడి ప్రజలకు, ఇతర ప్రాంతాల ప్రజల జీవన విధానానికి కూడా కొంత తేడా వుంటుంది. సుమారు సగం మంది ప్రజలకు అసలు ఈ ప్రపంచంతోనే సంబంధం లేన్నట్లు జీవితం వుంటుంది. రాజకీయాలతో సంబంధం లేని జీవితాలు గడిపే కుటుంబాలుకూడా చాల వుంటాయి. అందువల్ల ప్రజలు ఎటు వైపు మొగ్గు చూపుతారని చెప్పడం కొంత కష్టం. అందుకే అదికారంలో వున్న కాంగ్రెస్ పార్టీకి లాభం జరుగుతుందన్న అంచనాలు కూడ వున్నాయి. పైగా సార్వత్రిక ఎన్నికలు మూడేళ్లకుపైగా సమయం వుంది. అప్పటి వరకైనా నియోజకవర్గం అభివృద్ది కోరుకునే ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేస్తారని చెప్పడంలో సందేహం లేదు. ఇలాంటి సమయాల్లో సహజంగా ప్రజలు అభివృద్ది కావాలనే కోరుకుంటారు. ఒక వేళ ప్రతిపక్షానికి ఓటు వేసినా, ఏ చిన్న సమస్య పరిష్కారానికైనా మళ్లీ అధికారంలో వున్న కాంగ్రెస్‌పార్టీ నాయకుల వద్దకే వెళ్లాల్సివుంటుంది. అప్పుడు ఓటెందుకు వేయలేదన్న ప్రశ్నలు కూడా వారి నుంచి ఎదురౌతాయి. అందుకే సహజంగా ఉప ఎన్నికలు వచ్చినప్పుడు అధికార పార్టీలే ఎక్కువ మేలు జరిగిన సందర్భాలే అదికంగా వుంటాయి. జూబ్లీ హిల్స్‌లో హైడ్రా ప్రభావం ఏమైనా వుంటుందా? సందేహం మాత్రం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మాత్రం ప్రజలు పూర్తిగా నూటికి నూరుశాతం హైడ్రాకు మద్దతు తెలిపినట్లే అనుకోవాల్సి వుంటుంది. అది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనకు, ఆయన దూకుడుకు మరింత ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏ నాయకుడికైనా సరే ప్రజల మద్దతు మాత్రమే కొండంత బలమౌతుంది. ఇక్కడ కూడా అదే జరిగితే మాత్రం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వానికి మరో పదేళ్ల వరకు తిరుగుండని చెప్పడంలో సందేహం లేదు. అందువల్ల ఈ ఎన్నిక గెలుపు అనేది అటు పార్టీకే కాదు, ఇటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కూడా ఎంతో ప్రతిష్టాత్మకమే అనిచెప్పాలి. ఈ ఉప ఎన్నిక గెలిస్తే ఇక కాంగ్రెస్‌కు ఎదురుండదు. కాంగ్రెస్ నాయకుల జోష్‌కు తిరుగుండదు. వచ్చే జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయమౌతుంది. నాయకులకు మరింత నమ్మకం ఏర్పడుతుంది. ఊ అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే అంటూ బిఆర్‌ఎస్ చెప్పే లేనిపోని సర్వేలన్నింటికి చరమగీతం పాడినట్లౌవుంది. మూడేళ్ల దాకా ఇక బిఆర్‌ఎస్ నోరు తెరవకుండా అవుతుంది. 2005 జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో కనీసం పోటీ చేయని పరిస్తితి బిఆర్‌ఎస్‌కు మరోసారి వస్తుంది. ప్రతిపక్ష బిఆర్‌ఎస్ నుంచి వలసలు వరదల్లా వస్తాయి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది పార్టీ అభ్యర్ధికే కాకుండా ప్రభుత్వానికి పరీక్ష అనుకొని పనిచేయాల్సి వుంటుంది. జూబ్లీహిల్స్ సీటు గెల్చుకోకపోతే కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టమేమీ లేకపోయినా, ఎంతో కొంత ఇబ్బందికరమే అవుతుంది. ముఖ్యంగా సిఎం. రేవంత్ నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్న వారికి ఒక దారి దొరికినట్లౌవుతుంది. ఆ అవకాశం స్వపక్షానికి గాని, ప్రతిపక్షానికి గాని ఇవ్వకూడదంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ కైవసం చేసుకోవాలి. రేవంత్‌రెడ్డి నాయకత్వం మరింత బలపడాలంటే ఆయన బలం కొండంత పెరగాలంటే పార్టీ నాయకులందరూ శ్రమించాల్సిన అవసరం వుంటుంది. అధికార యంత్రాంగమంతా చేతుల్లో వుంటుంది. ఎమ్మెల్యేలు, మంత్రులంతా అక్కడే వుంటారు. జిల్లాల నాయకత్వాలను కూడా ఈ ఎన్నికల ప్రచారానికి వినియోగించుకొని గెలవాల్సిన అవసరమైతే వుంది. అంతే కాకుండా బిఆర్‌ఎస్ రాష్ట్ర ప్రభుత్వం మీద చేస్తున్న ఆరోపణలన్నీ అసత్య ప్రచారాలని కూడా తిప్పి కొట్టేందుకు వీలు కల్పించినట్లౌవుంది. కాలు దువ్వే గులాబీకి రేకులన్నీ రాలిపోయాతాయన్న భయం ఏర్పడుతుంది. ఇక బిఆర్‌ఎస్ విషయానికి వస్తే ఆ పార్టీకి ముందుగా కలిసి వచ్చే ప్రధానమైన అంశం కేవలం సానుభూతి. ఆ సానుభూతి ఎంత వరకు ఉపయోగపడుతుందన్నది ఇప్పటికిప్పుడు ఎవరూ చెప్పలేం. సానుభూతి రాజకీయాలు కూడా కొన్ని సార్లు పనిచేయవని గతంలో దుబ్బాక ఉప ఎన్నిక నిరూపించింది. ఎందుకంటే బిఆర్‌ఎస్ తిరుగులేని మెజార్టీతో గెలిచిన సమయంలో బిఆర్‌ఎస్ ఉప ఎన్నికలో సీటు కోల్పోతుందని ఎవరూ ఊహించలేదు. దుబ్బాక ఉప ఎన్నికలో బిఆర్‌ఎస్ సునాయాసంగా గెలుస్తుందని అంచనా వేసుకున్నారు. కాని ఓడిపోయారు. ఎందుకంటే సాదారణ మరణాలు పెద్దగా సానుభూతిని కల్పించలేవు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగి కంటోన్‌మెంటు ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచింది. అంటే సానుభూతి అన్ని సమయాల్లో ఉపయోగపడకపోవచ్చని రెండు ఉప ఎన్నికలు రుజువుచేశాయి. ఇప్పుడు కూడా అదే వర్కవుట్ అయితేమాత్రం బిఆర్‌ఎస్ సీటు కోల్పోవడం ఖాయం. అయితే ప్రభుత్వం మీద నిత్యం బిఆర్‌ఎస్ సాగిస్తున్న ప్రచారం జనం నిజమే అని నమ్మితే మాత్రం బిఆర్‌ఎస్ గెలుస్తుందేమో? కాని గతంలో మెజార్టీ రాకపోవచ్చు. అధికార కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతుంది. జూబ్లీహిల్స్‌లో బిఆర్‌ఎస్ గెలిస్తే ప్రజల్లో బిఆర్‌ఎస్‌కు ఆదరణ తగ్గలేదనేది రుజువౌతుంది. ఆదరణ చెక్కుచెదరలేదన్న నమ్మకం క్యాడర్‌లో కలుగుతుంది. ఇక ఏ ఎన్నికలైనా మళ్లీ గులాబీ తోటకే అన్న విశ్వాసం నాయకుల్లోనూ పెరుగుతుంది. అధికార కాంగ్రెస్ వైపు చూడాలనుకునే నాయకులు తమ నిర్ణయాలను వాయిదా వేసుకుంటారు. గోడ దూకాలనుకునేవారు తొందరపడందే మంచిదైందనుకుంటారు. ఒక వేళ పార్టీ మారిన వారు పునరాలోచనలో పడతారు. ఒక వేళ పార్లమెంటు ఎన్నికల ఫలితమే గులాబీకి దక్కితే మాత్రం బిఆర్‌ఎస్ రాజకీయ మనుగడ చాల కష్టమౌతుందని చెప్పడంలో సందేహంలేదు. అందుకే ఈ ఉప ఎన్నిక గెలవడం అనేది బిఆర్‌ఎస్‌కు జీవన్మరణ సమస్య అని చెప్పక తప్పదు. ఈ గెలుపు కూడా పోన్ ట్యాపింగ్, ఈ కార్‌రేస్, కాళేశ్వరం వంటి అనేక చిక్కుముడులకు సమాదానం దొరికనట్లౌవుంది. బిఆర్‌ఎస్ ఓడితే ఇవన్నీ ప్రజల మనసుల్లో వున్నాయన్నది తేలిపోతుంది. ఒక వేళ బిఆర్‌ఎస్ గెలిస్తే ప్రభుత్వం మోపుతున్న ఆరోపణలు ఏవీ ప్రజలు నమ్మడం లేదన్నది తేలిపోతుంది. ఎందుకంటే ప్రజా స్వామ్యంలో ప్రజా భిప్రాయమే అంతిమం. అందువల్ల ఈ ఉప ఎన్నిక రావడం కూడా మూలుగుతున్న నక్క మీద తాటి పండు పడ్డట్టు బిఆర్‌ఎస్‌కు తీరని కష్టమే తెచ్చిపెట్టిందని చెప్పాలి. ఈ ఉప ఎన్నికలో గెలిస్తే తప్ప నిలబడలేని సమస్య. ఎలాగైనా గెలవాలన్న కసితో బిఆర్‌ఎస్ నాయకులు వున్నారా? లేదా? అన్నది కూడా తేలిపోతుంది. కేసిఆర్ మీద ప్రజల అభిప్రాయం బలంగానే వుందా? మారిందా? అన్నది కూడా తెలిసిపోతుంది. ఈ ఎన్నిక బిఆర్‌ఎస్ మనుగడకు గీటు రాయి అని చెప్పకతప్పదు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బిజేపికి కూడా ప్రతిష్టాత్మకమే. తెలంగాణలో ఇక మేమే ప్రత్యామ్నాయం అంటూ చెబుతున్నారు. బిఆర్‌ఎస్‌కు రెండు సార్లు అధికారమిచ్చారు. కాంగ్రెస్‌కు ఇచ్చారు. నాలుగోసారి ముచ్చట బిజేపికి అవకాశమివ్వండి అని వచ్చే ఎన్నికల్లో ప్రాదేయపడేందుకు వీలు కలుగుతుంది. ఈ ఉప ఎన్నికలో బిజేపి గెలిస్తే తెలంగాణలో బిజేపి బలం చాలా పెరిగినట్లే లెక్క. ఈ నియోజకవర్గం లో ముస్లింమైనార్టీల ఓట్ల ప్రభావం తీవ్రంగా వుంటుంది. లక్షా ఇరవై వేల వరకు ముస్లిం ఓట్లు వుంటాయని అంటున్నారు. ఇలాంటి నియోజకవర్గంలో బిజేపి గెలిస్తే మాత్రం ఇక వచ్చే కాలం బిజేపితే అవతుందని చెప్పడం కూడా సబబుగానే వుంటుంది. చూద్దాం…మూడు ముక్కలాటైనా, రెండు ముక్కలాలైనా గెలిచే ఒక్కరే..ఆ ఒక్కరే వచ్చే ఎన్నికలకు బాద్‌షా అవుతారు.
`బాధితులకు కులం, మతం, వుండవు. అణచివేత మాత్రమే వుంటుంది
`పిడివాదంతోనే సమాజానికి ప్రమాదం
`ప్రజలకు వాస్తవాలు తెలియాలి
`సైద్ధాంతిక నిబద్ధతను ప్రజలు గుర్తించాలి
హైదరాబాద్,నేటిధాత్రి:
ఒక సిద్ధాంతాన్ని నమ్మడం దానికే కట్టుబడి ముందుకు సాగడం వ్యక్తుల నిబద్ధతకు నిదర్శనం. అటువంటి వ్యక్తులు తాము కట్టుబడిన దానికే బద్ధులుగా వుండటం సహజంగా జరుగుతుంది. ఆవిధంగా కట్టుబడలేనివారు వారు నమ్ముకున్న మార్గాల్లో ప్రయాణిస్తుంటారు. ఆవిధంగా మానవ సమాజం విభిన్న వ్యక్తుల వైవిధ్య అభిప్రాయాల సమారోహంగా కొనసాగుతుండటం అత్యంతసహజం. మానవ నాగరికత ఎప్పటికప్పుడు పరిణామం చెందుతుంటుంది. నూతన ఆవిష్కరణ లు, కొత్త ఆలోచనలు మానవ జీవన ప్రమాణాల్లో తీసుకొస్తున్న మార్పులు ఇందుకు కారణం. ఇది సిద్ధాంతాలకూ వర్తిస్తుంది. సామాజిక మార్పులకు అనుగుణంగా సిద్ధాతాలు కూడా తమ వైఖరిని మార్చుకోకపోతే అవి లుప్తమై పోవడం లేదా పిడివాదంగా మారి, సహజమార్పులను అడ్డు కునే ప్రక్రియలో అవి తీవ్రస్థాయి సాంఘిక సంఘర్షణలకు కారణమవుతాయి. అయితే ఒక్కొక్క సిద్ధాంతం ఒక్కో సమస్యను లేదా ఒక్కొక్క పరిణామాన్ని తన కోణంలో చూడటం సహజం. ఎవరు ఏ కోణంలో చూసినా ప్రతి సమాజానికి వున్న సాంస్కృతిక వారసత్వం, నేపథ్యం దెబ్బతినకుం డా, సామాజిక ఆలోచనా ధోరణుల్లో వస్తున్న సానుకూల మార్పులను మరింత వేగంగా ముం దుకు తీసుకెళ్లడానికి దోహదం చేసే సిద్ధాంతమే బహుళ ప్రజాదరణ పొందడమే కాదు, చిరకా లం మనగలుగుతుంది. మనదేశంలో కూడా ప్రస్తుతం లిబరల్ భావజాలం, జాతీయవాదం అనేవి ప్రస్తుతం విస్తృత ప్ర చారంలో వున్నాయి. ఈ రెండు భావజాలాలు పూర్తిగా భిన్నం కావడంతో ఒక జాతీయ లేదా అంతర్జాతీయ సమస్యను ఇవి చూసే కోణం వేర్వేరుగా వుండటం వల్ల, వీటిల్లో ఏది నిజం? ఏదివర్తమాన కాలానికి అనుగుణం కాదు అని ఒక సాధారణ వ్యక్తి నిర్ణయించుకోవడం కష్టమవు తుంది. ఎందుకంటే ఎవరి కోణంలో వారిది నిజంగా తోచడమే! అయితే ఇక్కడ కావలసింది నిష్పాక్షిక దృక్కోణంతో సర్వజనులకు హితకరంగా వున్న వాదనను లేదా సిద్ధాంతాన్ని ప్రజలు విశ్వసించాల్సి వుంటుంది. ఇక్కడ వారికి సైద్ధాంతిక నిబద్ధత కంటే, సర్వజన హితం ముఖ్యం! ప్రపంచం నలుమూలల విస్తరించి వున్న వివిధ నాగరికతల్లో, ఎవరు ఎక్కువ బాధలకు, పీడనకు గురవుతున్నారనేదానిపై నిష్పాక్షిక విశ్లేషణ అవసరం. అప్పుడు ప్రపంచంలో లేదా మన చుట్టు పక్కలఏం జరుగుతున్నదనేది అందరికీ చక్కగా అర్థమవుతుంది. ఇటువంటి వివరాలను చక్కగా వివ రించగలిగేది మీడియా మాత్రమే! అయితే మీడియా ఇటువంటి వాస్తవిక నిబద్ధతకు బదులు సైద్ధాంతిక కోణానికే పరిమితమైతే అప్పుడు ప్రజల్లోకి వెళ్లేది సమాచారం కాదు, ఒక సైద్ధాంతిక దృక్కోణం మాత్రమే! ప్రస్తుతం మనదేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నదిదే! దీనివల్లఅసలు సమస్య మరుగునపడిపోయి సైద్ధాంతిక సంఘర్షణలకు తావిచ్చినట్లవుతోంది. అందువల్ల సమస్యను వివరించి, దానికి సైద్ధాంతిక కోణాన్ని జతపరిస్తే సామాన్యులకు అప్పుడు విషయ పరిజ్ఞానంతో పాటు ఒక్కొక్క సిద్ధాంతం యొక్క సైద్ధాంతిక కోణాన్ని కూడా అర్థం చేసుకోగలుగుతా రు. దురదృష్టవశాత్తు ఇప్పుడు అది జరగడంలేదు. ఇందుకు కొన్ని ఉదాహరణలు పరిశీలించవ చ్చు.
టిబెట్‌ను అక్రమంగా చైనా ఆక్రమించుకున్న మాట వాస్తవం. ప్రస్తుతం చైనా అక్కడ చేపడుతు న్న అభివృద్ధి పనులను లిబరల్ మీడియా ఆకాశానికెత్తేస్తుంది. కానీ అక్కడ జరుగుతున్న సాంస్కృక విధ్వంసమని, తరతరాలుగా అక్కడి ప్రజలు సంస్కృతి సంప్రదాయాలు, వారసత్వం పూర్తిగా ధ్వంసమవుతున్నాయని జాతీయవాదం పేర్కొంటుంది. దలైలామా పేరు చెబితే జైలుకు వెళ్లక తప్పదు. ఇక్కడ రెండు వాదనలూ కరెక్టే. కానీ వాస్తవం ఏమిటంటే, టిబెట్ అనాదికాలంగా ఆధ్యాత్మిక ప్రదేశం. ఇక్కడి బౌద్ధ సన్యాసులు వారి గురువైన దలైలామా అహింసను మాత్రమే బోధిస్తారు. దలైలామా కేవలం కర్మ సిద్ధాంతాన్ని, ఆధ్యాత్మిక ఉన్నతి సాధనను ప్రభోధిస్తారు. అంతేకానివర్గపోరాటాన్ని గురించి చెప్పరు. మరి శాంతి కాముకులపై ఈరకమైన అణచివేత ఎంతవరకు సమంజసమనేది జాతీయవాదం ప్రశ్నిస్తుంది. మరోవిషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. 76ఏళ్ల క్రితం మననుంచి విడిపోయిన పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లను, ఒకప్పుడు బ్రిటిష్ పాలనలో కొనసాగిన బర్మా (నేటి మయన్మార్), భూ టాన్‌లను మన భూభాగాలే అనగలమా? మరి ఎప్పుడో క్వింగ్‌రాజుల కాలంలో కొంతకాలం తమ ఆధీనంలో వున్నదన్న కారణంగా టిబెట్‌ను చైనా ఆక్రమిం చుకోవడం ఎంతవరకు సమర్థనీయం? నిజానికి టిబెట్ ఒక స్వతంత్రదేశం! మరో ఉదాహరణ గా ఇజ్రాయిల్, పాలస్తీనాలను తీసుకోవచ్చు. ఇజ్రాయిల్ ఆక్రమించిన భూభాగాల్లో మౌలిక సదుపాయాల పరంగా చేపట్టే అభివృద్ధి పనులను లిబరల్ మీడియా పట్టించుకోదు. పాలస్తీనా విష యంలో లిబరల్ మీడియా దురాక్రమణ, జాతివివక్ష, ప్రజల తిరుగుబాటు, ఆత్మగౌరవం, అజ్ఞా తం వంటి సానుభూతి పదజాలాలను ప్రయోగిస్తుంది. చైనా ఆక్రమణలో ఇదే పరిస్థితిని ఎదు ర్కొంటున్న టిబెటన్ల విషయంలో లిబరల్ మీడియా ఇటువంటి పదప్రయోగం చేయదు. ఇక్కడ జరుగుతున్న అణచివేతను అన్యాయమని జాతీయవాదం వాదిస్తుంది. టిబెట్‌లో చైనా చేపడుతు న్న మౌలిక సదుపాయాల వృద్ధి లిబరల్స్‌కు కనిపించినప్పుడు, వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయిల్ చేపట్టే మౌలిక సదుపాయాలు వీరికి ఎందుకు పట్టవని జాతీయవాదం ప్రశ్నిస్తుంది. అయితే పాలస్తీనా ప్రజలు తమ స్వస్థలాలను వదిలి వెళ్లాల్సి రావడం అమానవీయమని లిబరల్స్ వాదిస్తారు. మరిఇదే పరిస్థితి టిబెట్‌లో, కశ్మీర్‌లో, బంగ్లాదేశ్‌లో జరుగుతున్నప్పుడు వీరు ప్రశ్నించకపోవడం ఉ దారవాదం కిందికి రాదు. ఏకపక్షవాదం కిందికే వస్తుంది. కశ్మీర్ విషయంలో ప్రజాభిప్రాయం, స్వీయనిర్ణయాధికారం, వాక్‌స్వాతంత్య్ర అని వాదించే ఉదారవాదులు, టిబెట్‌లో అహింసనుపా టించే బౌద్ధుల విషయంలో ఈ పదజాలాన్ని ఎందుకు ప్రయోగించరన్నది జాతీయవాదులు లేవనెత్తే ప్రశ్న. అదేమంటే అది చైనా అంతర్గత సమస్య అని వాదిస్తారు. మరి ఇదే సూత్రం ఇజ్రా యిల్‌కూ వ ర్తిస్తుంది కదా! ఒకవేళ మన జర్నలిస్టులను లాషాకు తీసుకెళితే చైనా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఆకాశానికెత్తేస్తారు. ఇదే ఇజ్రాయిల్ వెస్ట్‌బ్యాంక్‌కు తీసుకెళితే, అక్కడ జరిగే అభివృద్ధి వీరికి కనిపించదు. కేవలం పాలస్తీనా ప్రజల కన్నీళ్లు మాత్రమే కనిపిస్తా యి! అంటే ఇక్కడ అణచివేసేది పశ్చిమదేశం లేదా బూర్జువా అయినా తిరుగుబాటు ‘పవిత్రం’ అవుతుంది. అదే అణచివేసేది కమ్యూనిస్టు అయితే అది ‘స్థిరత్వానికి’ ఏర్పడిన ప్రమాదం అవుతుంది. ఇదా లిబరలిజం అంటే? అస్మదీయులకొక నీతి తస్మదీయులకు మరో నీతి పాటించడం వల్లనే ప్రపంచ వ్యాప్తంగా లిబరలిజం క్రమంగా తన స్థానాన్ని కోల్పోతున్నది. టిబెట్‌లో దలైలామా ను అమెరికా సమర్థించింది. ఇంకేం ఆయన్ను సి.ఐ.ఎ. ఏజెంట్‌గా ప్రచారం చేశారు. ఇదే సమయంలో టిబెట్‌లో తరతరాలుగా వస్తున్న సాంస్కృతిక, ఆధ్యాత్మిక ఉన్నతిని కావాలనే తమ ప్రచార హోరులో విస్మరించారనేది జాతీయవాదులు ఎత్తి చూపుతున్న అంశం. అంతేకాదు టిబెట్ అంటే అదొక ప శ్చిమదేశాలకు అనుకూలంగా ముద్రవేశారు. అందేకాని అక్కడి ఆధ్యాత్మిక ఔన్నత్యం వారికి పట్టదు! ఉదారవాదం అంటే జాతి,కుల, మత వివక్షలేకుండా బాధితులకు అండగా నిలబడి మాట్లాడటం. కేవలం మనదేశంలోనే కాదు యూరప్ దేశాల్లో కూడా ఉదారవాదులు ఇదే తరహా ఏకపక్ష వాదనలను వినిపించడం కనిపిస్తుంది. కేవలం ఇటువంటి వైఖరులే, మనదే శంతో సహా అన్ని యూరప్ దేశాల్లో జాతీయవాదం క్రమంగా వేళ్లూనుకోవడానికి కారణమవు తోంది. ఈ ఉదార వాదంలో కనిపించే మరో లోపమేంటంటే మెజారిటీ వర్గం అంటే అణచివేతకు పాల్పడతారనేది ఒక ముద్రవేయడం. మరి ఇదే వైఖరి ప్రకారం, బంగ్లాదేశ్‌లోని మైనారిటీలుగా వున్న హిందువులపై మెజారిటీలు జరుపుతున్న అత్యాచారాలు వీరికి పట్టవు. ఇదెక్కడి ఉదారవాదం. ఉదారవాదం అంటే మెజారిటీ మైనారిటీ అని కాదు. కేవలం బాధితుల పక్షానమాత్రమే నిలవడం. టిబెట్ విషయానికి వస్తే అక్కడి సంస్కృతి భారతీయ సంస్కృతితో కొన్ని వేల సంవత్సరాలుగా సంబంధాలను పెనవేసుకున్నది. మనకు వారికి మధ్య సరిహద్దు ఒక సమస్యే కాదు. నలంద నుంచితవాంగ్ వరకు బౌద్ధ సన్యాసులు స్వేచ్ఛగా పర్యటించారు. ఆధ్యాత్మిక శోభను మరింత పరిమ ళింపజేశారు. ఇప్పటికీ తవాంగ్‌లో మనదేశ సంస్కృతికి సంబంధించిన ఆనవాళ్లు కనిపిస్తాయి. మొత్తంమీద చెప్పాలంటే కేవలం ఒక వర్గానికి మాత్రమే అనుకూలంగా వ్యవహరించే వాదం ఎప్పుడైనా తన ఉనికిని కల్పోక తప్పదు. అన్నివర్గాలకు అనుకూలమైన వాదమే ఎప్పటికైనా మనగలుగుతుందన్నది మాత్రం సత్యం.
తగ్గాల్సిన సమస్యలు పోను పోను పెరుగుతుంటే ఎవరికైనా ఇబ్బందే..తెలంగాణ మిల్లర్ల పరిస్ధితి కూడా అలాగే వుంది. సమస్యలు పరిష్కామౌతున్నాయనుకుంటున్న ప్రతిసారి ఏదోఒక సమస్య మళ్లీ వారిని ఇబ్బందులకు గురి చేస్తోంది. ఆ మధ్య తెలంగాణలో వున్న మిల్లర్ల బకాయిలన్నీ దాదాపు వసూలుచేశారు. అందుకు ఆ శాఖ కమీషనర్ చౌహన్‌ను ఎందుకైనా అభినందించాల్సిందే. ఎందుకంటే పదేళ్లకు పైగా మిల్లర్ల వద్ద వేలాది కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయారు. ప్రభుత్వాలు ఎంత ఒత్తిడి చేసినా వాటి వసూలు సాధ్యం కాలేదు. అప్పటి పాలకులు కూడా వసూలుకు చిత్తశుద్ది ప్రదర్శించలేదు. దాంతో ప్రభుత్వానికి అందాల్సిన బకాయిలు పెద్దఎత్తున పేరుకుపోయాయి. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం కొలువైన తర్వాత సివిల్ సప్లైశాఖకు కమీషనర్‌గా చౌహన్‌ను నియమించారు. అప్పటి నుంచి ఆయన బకాయిల వసలూ మీద దృష్టి పెట్టారు. ఇక్కడ కూడా చౌహాన్ మిల్లర్లను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండానే వసూలు చేయించారు. విడతల వారిగా అవకాశం కల్పించారు. మొత్తానికి మిల్లర్ల నుంచి వేల కోట్లు వసూలు చేయించారు. ఇంకా కొన్ని వందల కోట్లు బకాయిలు మిగిలి వున్నాయి. వాటిని కూడ చెల్లించడానికి మిల్లర్లు అందరూ సిద్దం వున్నారు. కాని ఇక్కడే కొందరు అధికారులు, టెండర్ ప్యాడీ దారులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. మిల్లర్లను ఇబ్బందులకు గురి చేయాలిన చూస్తున్నారు. దాంతో మిల్లర్లకు ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. వేధింపులు ఎక్కువౌతున్నాయి. ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్ధితులు సృష్టించబడుతున్నారు. మిల్లర్లు బకాయిలు చెల్లించేందుకు సిద్దంగా వున్నప్పటికీ టెండర్ ప్యాడీకి చెందిన దళారులు మూలంగా మిల్లర్ల మీద మరింత అదనపు బారం పడేలా వుంది. మిల్లర్ల మీద పెనాల్టీలు విధించాలిన మధ్య దళారీ వ్యవస్ధ అయిన టెండర్ ప్యాడీ మిల్లర్లను ముప్పు తిప్పలు పెట్టాలనుకుంటోంది. దాంతో మిల్లర్లు మద్దెల దరువునుకు ఎదుర్కొనే పరిస్ధితులు సృష్టించబడుతున్నాయి. మేం బకాయిలు చెల్లిస్తాం మహా ప్రభో అని మిల్లర్లు అంటుంటే వారి చేతులు కట్టేసినంత పనిచేస్తున్నారు. వారు బకాయిలు చెల్లిస్తామంటుంటుంటే ఇప్పుడు వద్దన్నారు. వెసులుబాటు కల్పించినట్లు నమ్మించారు. ఇప్పుడు ఒత్తిడికి టెండర్ ప్యాడీ దళారులు సిద్దమౌతున్నారు. టెండర్ ప్యాడీ క్లోస్ అయ్యిందని పెనాల్టీ విధించేందుకు సిద్దమౌతున్నట్లు మిల్లర్లుకు సమాచారం అందింది. అంతే తెలంగాణ వ్యాప్తంగా మిల్లర్లు లబో దిబో మంటున్నారు. తాము సంతోషంగా వున్నాం. బకాయిలన్నీ పూర్తిగా చెల్లిస్తామని చెప్పినప్పుడు టెండర్ ప్యాడీ మూలంగా వసూలు ఆలస్యమైంది. ఇప్పుడు మెడమీద కత్తిపెట్టినట్లు పెనాల్టీలతో సహా వసూలు చేస్తామని చెబుతున్నట్లు సమాచారం. దాంతో మిల్లర్లు తమను ఇలా ఇబ్బందులకు గురి చేయడం సరైంది కాదంటున్నారు. తప్పు మిల్లర్ల వైపు నుంచి జరిగితే నిజంగానే పెనాల్టీలతో సహా వసూలు చేసుకోవచ్చు. కాని తాము బకాయిలు చెల్లిస్తామని చెప్పినా తీసుకోలేదు. ఇప్పుడు మళ్లీ మిల్లర్లనే దోషులు చేయాలనుకుంటున్నారు. ఇది ఎట్టిపరిస్ధితుల్లో ఒప్పుకునే పరిస్ధితి లేదని మిల్లర్లు తెగేసి చెబుతున్నారు. తమ హక్కులను పూర్తిగా టెండర్ ప్యాడీ విధానం వల్ల కోల్పోతున్నామని అంటున్నారు. అయినా ప్రభుత్వానికి,మిల్లర్లకు మధ్య ఈ టెండర్ ప్యాడీ దళారులెందుకు? వారి పెత్తనమెందుకు? ఆ వ్యవస్ధ ఎందుకు? వారి చేత మాకు లేనిపోని ఇబ్బందులెందుకు? అని మిల్లర్లు ప్రశ్నిస్తున్నారు. చెల్లింపులు చేస్తామంటూ తాము ఎంత చెప్పినా వినిపించుకోకుండా, వసూలు చేసుకోకుండా, బలవంతంగా పెనాల్టీలు వేసి మిల్లర్లను నష్టాలల్లోకి నెట్టాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇదెక్కడి న్యాయం…ఇదెక్కడి దుర్మార్గమని మిల్లర్లు నిలదీస్తున్నారు. ప్రభుత్వం అనవసరంగా మధ్య ధళారుల మూలంగా అబాసు పాలౌతుందని మిల్లర్లు వాదిస్తున్నారు. మధ్య దళారుల మూలంగా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందంటున్నారు. అంతే కాదు ప్రభుత్వానికి చెందాల్సిన సొమ్ము దళారుల జేబుల్లోకి వెళ్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టెండర్ ప్యాడీ విదానం అనేది దేశంలో ఎక్కడా లేదు. ఏ రాష్ట్రంలోనూ లేదు. పొరుగున వున్న ఏపిలో కూడా లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడూ లేదు. తెలంగాణ వచ్చిన తర్వాతే ఈ పెంట మిల్లర్ల మీద రుద్దడం జరిగిందంటున్నారు. అలా టెండర్ తీసుకున్న మధ్య ధళారుల మూలంగా మిల్లర్లు అనేక రకాలుగా నష్టపోతున్నారు. ఇబ్బందుల పాలౌతున్నారు. కష్టాలకు గురౌతున్నారు. మిల్లులు మూసుకునే పరిస్ధితిని టెండర్ ప్యాడీ దళారులు సృష్టిస్తున్నారని మిల్లర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు బకాయిలు చెల్లించే సమయంలో టెండర్ ప్యాడీ గడువు ముగియడమేమిటో ఎవ్వరికీ అర్ధం కావడం లేదు. బకాయిలు అందరూ చెల్లించేందుకు సిద్దమౌతుంటే ఆలస్యమైందని పెనాల్టీలు చెల్లించాల్సిందే అని మిల్లర్లను బెదిరించడమేమిటని మిల్లర్లు ప్రశ్నిస్తున్నారు. అసలు మిల్లర్ల మీద టెండర్ ప్యాడీ పెత్తనమేమిటని వాళ్లు నిలదీస్తున్నారు. అసలు ప్రభుత్వం టెండర్ ప్యాడీ దళారీ వ్యవస్ధను పోషించడమెందుకంటున్నారు. రైతులకు, మిల్లర్లకు మధ్య టెండర్ ప్యాడీ వ్యవస్ధ అవసరం లేనిది. అర్దం లేనిది. అనవసరంగా కోట్లాది రూపాయలు చెల్లిస్తూ, ప్రభుత్వం టెండర్ ప్యాడీ వ్యవస్ధను పోషించాల్సిన అవసరం లేదంటున్నారు. రైతులకు, మిల్లర్లకు మధ్య సివిల్ సప్లై వ్యవస్ధ వుంది. ఆ వ్యవస్దతోనే దేశంలోని అన్ని రాష్టాలలోనూ వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు జరుగుతోంది. కాని ఒక్క తెలంగాణలోనే ఈ వ్యవస్ధ ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకొచ్చింది? ఎవరి మేలు కోసం వచ్చింది? ఏ రకంగా చూసినా ప్రభుత్వానికి టెండర్ ప్యాడీ వ్యవస్ధ వల్ల నష్టమే తప్ప రూపాయి లాభం లేదు. టెండర్ ప్యాడీ మూలంగా అటు రైతు నష్టపోతున్నాడు. ఇటు మిల్లర్లు నలిగిపోతున్నారు. ప్రభుత్వాదాయానికి గండి కొడుతున్నారు. కేవలం పర్యవేక్షణ తప్ప పని లేని టెండర్ ప్యాడీని కోట్లాది రూపాయలు చెల్లించి ప్రభుత్వం మేపాల్సిన పనిలేదు. టెండర్ ప్యాడీ మూలంగా ప్రభుత్వ ఖజానాకు కోట్లలో గండి పడుతోంది. అలాంటి టెండర్ ప్యాడీని ప్రజా ప్రబుత్వం కూడా ఎందుకు నిర్వహిస్తోందని మిల్లర్లు ప్రశ్నిస్తున్నారు. నిజం చెప్పాలంటే తెలంగాణలో సివిల్ సప్లైకి విసృతమైన యంత్రాంగముంది. ఆ యంత్రాంగం చాలు. దానికి అనుబంధంగా విజిలెన్స్ విభాగం వుంది. ఈ రెండు వ్యవస్ధలు పటిష్టంగానే వున్నాయి. అయినా కొత్తగా టెండర్ ప్యాడీ తెచ్చిపెట్టారు. దాని వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. మిల్లర్లు ఏదైనాపొరపాటు చేస్తే నియంత్రించేందుకు విజిలెన్స్ వ్యవస్ధ వుంది. అలాంటి విజిలెన్స్ వ్యవస్ధను కూడా ఆడిరచేందంతగా ప్యాడీటెండర్ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. విజిలెన్స్ వ్యవస్ధ కూడా ప్యాడీ టెండర్ కనుసన్నల్లో పనిచేస్తోంది. ప్యాడీ టెండర్ చెప్పినట్లు విజిలెన్స్ విభాగం పనిచేయడం వల్ల ప్రభుత్వానికి నష్టమే జరుగుతోంది. రైతులనుంచి వడ్లు సేకరించడానికి ప్రత్యేకంగా టెండర్ ప్యాడీ దళారీ వ్యవస్ధ అవసరమే లేదు. ఆ వ్యవస్ధను కూర్చోబెట్టి మేపాల్సిన అవసరం లేదు. వారికి పారితోషికం కింద కోట్లాదిరూపాయలు చెల్లించాల్సినపనిలేదు. ఆ వ్యవస్ధకు చెల్లిస్తున్న దానిని తమకు చెల్లిస్తే చాలు. అటు రైతు నుంచి కోతలకు కూడా పెద్దగా ఆస్కారం వుండదు. ఇటు మిల్లింగ్‌లోనష్టాలకు తావుండదు. ఆ వ్యవస్ధకు అనవసరంగా చెల్లించే సొమ్మును రైతులకు, మిల్లర్లకు పంచినా బాగుంటుంది. లేకున్నా ఇబ్బంది కూడా లేదు. అనవసరంగా టెండర్ ప్యాడీని ఫోషిస్తూ ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదు. రైతుల నుంచి వడ్లు సేకరించడం కోసం టెండర్ ప్యాడీ వ్యవస్ధ ముందుస్తుగా ప్రభుత్వానికి ఎలాంటి చెల్లింపులు చేస్తున్నది లేదు. కాని వడ్లు వచ్చిన తర్వాత పర్యవేక్షన పేరుతో మిల్లర్ల మీద పెత్తనం సాగిస్తున్నది. మిల్లర్ల నుంచి వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లిస్తోంది. ఈ మాత్రం దానికి టెండర్‌ప్యాడీ విధానమెందుకు? నేరుగా మిల్లర్లే ప్రభుత్వానికి చెల్లింపులు సాగిస్తే సరిపోతుంది. గతంలో ఇదే విదానం అమలులో వుండేది. అన్ని రాష్ట్రాలలోనూ ఇదే అమలు జరుగుతోంది. ఇప్పటికెనా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయం మీద దృష్టిపెట్టాలని మిల్లర్లు కోరుతున్నారు.
`అక్రమంగా, అనుమతులు లేని రో హౌస్ లు గతంలోనే నాలుగు కూల్చివేత.
`మిగిలిన రెండు నేడు కూల్చేశారు.
`72 రో హౌస్ లపై అక్రమంగా పై అంతస్తులు నిర్మించిన వారికి నోటీసులు.
`15 రోజులలో కూల్చి వేసుకోవాలని ఆదేశాలు.
`గడువు దాటితే తామే కూల్చేస్తామని మునిసిపల్ శాఖ హెచ్చరికలు.
`మొత్తం రో హౌస్ లు కూల్చివేయాలనేది నేటిధాత్రి ప్రధాన డిమాండ్.
`కార్మికుల కోసం ప్రభుత్వం కేటాయించిన భూమి కార్మికులకే సొంతం కావాలి.
`అక్రమంగా జొరబడిన గద్దలు ఖాళీ చేయాలి.
`14 ఎకరాలు చిత్రపురి సొసైటీ స్వాధీనం చేసుకోవాలి.
`ఆ స్థలంలో కార్మికుల కోసం అప్పార్టుమెంట్లు నిర్మాణం చేయాలి.
`అర్హులైన ప్రతి సినీ కార్మికుడికి సొంతిల్లు కల నెరవేరాలి.
`అప్పటి వరకు నేటిధాత్రి అక్షర పోరాటం ఆగదు.
`కార్మికులు సొంత ఇండ్లు కళ్లారా చూసుకునే వరకు నేటిధాత్రి పోరు ఆపదు.
`కార్మికులు ఇప్పటికైనా కళ్లు తెరవాలి.
`నేటిధాత్రి అక్షర పోరాటంతో చైతన్యమై సొంతింటి పోరు జరపాలి.
`14 ఎకరాలలో కార్మికులకు అప్పార్టుమెంట్లు నిర్మాణం జరిగే దాక పోరాటం కొనసాగించాలి.
`అలుపెరగకుండా కార్మికులు తమ కల నెరవేర్చుకోవాలి.
`నేటిధాత్రికి కార్మికుల నుంచి పెద్ద ఎత్తున అభినందనలు.
`నేటిధాత్రి పోరాటానికి కార్మికుల ధన్యవాదాలు.
`నేటిధాత్రి దిన పత్రికకు కార్మికుల జేజేలు.
హైదరాబాద్,నేటిధాత్రి: పోరాటాలన్నింటిలోకి అక్షర పోరాటం గొప్పది. ఆ అక్షరం కదిలంచే శక్తి మరింత గొప్పది. సమాజంలో ఏ వర్గం కదాలన్నా, ఏ వర్గం సమస్యలు వెలుగులోకి రావాలన్నా ముందు అక్షరం వెలగాలి. ఆ సమస్య అక్షర రూపం దాల్చాలి. అక్షరం వేసి తొలి అడుగే సమస్యల పరిష్కారానికి మరో అడుగుకు దారి పడుతుంది. రాజుల కాలంలోనైనా, ప్రజా స్వామ్య దేశాలలోనైనా అక్షర కావాతే అన్నింటికన్నాగొప్పది. దేశానికి స్వాతంత్య్ర సమరమైనా, తెలంగాణ ఉద్యమమైనా అక్షరంతోనే మొదలైంది. తెలంగాణ ఉద్యమం పురుడు పోసుకున్నా అక్షరంతోనే..తెలంగాణ ఉద్యమం సమాజం ఎంత సాగించినా అది అక్షరూపంలో ప్రపంచానికి చేరినప్పుడే లోకానికి తెలిసింది. తెలంగాణ విజయం కూడా అక్షర రూపంలోనే వెలుగులోకి వచ్చింది. అదే మీడియా గొప్పదనం. అలాంటి అక్షరాలకు పునాదులు వేసేదే మీడియా. ఆ మీడియా లేవనెత్తిన సమస్యలు పరిష్కారమైనప్పుడు అందరికంటే ముందు సంతోషపడేది ఆ అక్షరాలను సందించిన మీడియానే..అలాంటి విజయాలను సొంతం చేసుకోవడం కోసం మీడియా పడే తపన, యాతన అంతా ఇంతా కాదు. ఎంతో శ్రమకోర్చి సమస్యలను వెలుగులోకి తెస్తుంది. ఆ సమస్య పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తుంది. అలా నేటిదాత్రి చేసిన కృషి కోకొల్లలలు. అందులో చిత్ర పురి కార్మికుల సమస్య ఒకటి. చిత్రపురిలోని బాగోతాలను ఒక్కొక్కటిగా వెలుగులోకి తెచ్చి, వాటి పరిష్కారానికి అలుపెరగని అక్షర పోరాటం నేటి ధాత్రి చేసింది. ముఖ్యంగా చిత్రపురిలో జరిగిన రోహౌజ్‌ల నిర్మాణం అక్రమమని, వాటిని తొలగించాలంటూ నేటి ధాత్రి చేసిన పోరాటంలో గతంలోనే ఒక విజయం సాధించింది. ఇప్పుడు మరో విజయం నేటిదాత్రి ఖాతాలో పడిరది. నిజానికి రోహౌజ్‌ల నిర్మాణం అక్రమమే కాదు, దుర్మార్గం కూడా..కార్మికుల శ్రేయస్సుకోసం, వారికి నీడ కోసం రాష్ట్ర ప్రభుత్వం 64 ఎకరాల స్థలం ఇచ్చింది సినీ రంగానికి చెందిన తెలంగాణ నటుడు ప్రభాకర్‌రెడ్డి మూడు ఎకరాల స్ధలం విరాళలంగా ఇచ్చారు. మొత్తంత 67 ఎకరాలకు పైగా ఆ స్ధలం కార్మికుల కోసం కేటాయించబడిరది. అందులో 14 ఎకరాల స్ధలం సినీ రంగంలోని పెద్దలు ఆక్రమించారు. నిజానికి దివంగత నటుడు ప్రభాకర్ రెడ్డి చూపిన దారిలో నడిచి, కార్మికుల కోసం స్థలాలు కొని ఇవ్వాల్సిన పెద్దలు ఆ కార్మికుల స్ధలానికే ఎసరు పెట్టారు. ప్రభుత్వం కేటాయించిన భూమిలో 14 ఎకరాలు ఆక్రమించుకున్నారు. చిత్ర పురి సొసైటీని బెదిరించి మరీ లాక్కున్నారు. అందులో 250 రోహౌజ్‌లు నిర్మాణం చేసుకున్నారు. అంతే కాకుండా మరో ఆరు రోహౌజ్‌లు అక్రమంగా అదనంగా నిర్మాణం చేసుకున్నారు. అసలు రోహౌజ్‌ల నిర్మాణమే తప్పని, నేరమని నేటిధాత్రి పోరాటం చేసింది. దాంతో మున్సిపల్ శాఖ గత ఏడాది రంగంలోకి దిగింది. అక్రమంగా నిర్మాణం చేసిన మరో ఆరు రోహౌజ్‌లలో నాలుగింటిని కూల్చివేశారు. మరో రెండు రోహౌజ్‌లు కొనుగోలు చేసిన వారు కొంత సమయం అడిగారు. అయినా ఇప్పటి వరకు ఖాళీ చేయలేదు. వాటిని కూల్చేయలేదు. దాంతో మున్సిపల్ శాఖ రంగంలోకి దిగింది. మిగిలిన రెండు రోహౌజ్‌లను మంగళవారం కూల్చివేసింది. మొదటి నాలుగు రోహౌజ్‌లు నేటిధాత్రి పోరాటం వల్లనే కూల్చివేశారు. తర్వాత మిగిలిన రెండు కూడా ఎప్పుడు కూల్చేస్తారంటూ నేటిధాత్రి రాసిన కధనాలకు స్పందించి, మున్సిపల్ అధికారులు మంగళవారం నేట మట్టం చేశారు. నేటిదాత్రి కోరుకున్న అదనపు రోహౌజ్‌ల కూల్చివేత పూర్తయింది. అయితే నేటిధాత్రి ఆది నుంచి చెబుతున్నది మొత్తం రోహౌజ్‌లను కూల్చివేయాలని కార్మికుల పక్షాన డిమాండ్ చేస్తూ వచ్చింది. అయితే నేటిధాత్రి ఓ వైపు అక్షర పోరాటం చేస్తున్నా, 72 రోహౌజ్‌ల యజమానులు వాటిపై అంతస్ధులు నిర్మాణం మొదలు పెట్టారు. రోహౌజ్‌లే అక్రమంగా నిర్మాణం చేసుకున్నారు. వాటిపై అంతస్ధులు వేసుకోవడానికి ఎలాంటి అనుమతిలేదు. మున్సిపల్ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. ఆ యజమానులు అనుమతులు తెచ్చుకోలేదు. కేవలం అనుమతుల కోసం ధరఖాస్తులు చేసుకున్నారు. వాటిని మున్సిపల్ శాఖ తిరస్కరించింది. అయిన అందర్నీ మభ్యపెట్టి, అనుమతులు వచ్చినట్లు చెప్పుకొని పై అంతస్ధులు నిర్మాణం చేపట్టారు. వాటిని వెంటనే ఆపాలంటూ నేటిధాత్రి ఈ మధ్య వరస కథనాలు రాసింది. రోహౌజ్‌ల నిర్మాణమే అక్రమంటే, పై అంతస్ధుల నిర్మాణం మరీ దుర్మార్గం. అందుకే నేటిధాత్రి మళ్లీ అక్షర పోరాటం మొదలుపెట్టింది. దాంతో మున్సిపల్ అధికారులు 72 రోహౌజ్‌లకు నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులను సవాలు చేస్తూ రోహౌజ్‌ల యజమానులు కోర్టును ఆశ్రయించారు. అయితే తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని రోహౌజ్‌ల యజమానులు ఆశించారు. మున్సిపల్ అధికారులు చిత్త శుద్ది కారణంగా కోర్టు రోహౌజ్‌ల యజమానులకు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. దాంతో పై అంతస్ధులను తొలగించాల్సిన పరిస్దితి ఎదురైంది. మున్సిపల్ అధికారులు మంగళవారం అదనపు నిర్మాణాలు చేపడుతున్నా 72 రోహౌజ్‌లకు నోటీసులు అంటించారు. 15 రోజుల్లో అదనపు నిర్మాణాలు తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఒక వేళ 15 రోజుల్లో ఆ నిర్మాణాలు కూల్చని పక్షంలో తామే వచ్చిన నిర్మాణాలు తొలగిస్తామని మున్సిపల్ అదికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికైనా సరే కార్మికులు కళ్లు తెరవాలి. కార్మికుల కోసం అక్షర పోరాటం చేస్తున్న నేటిధాత్రిని చూసైనా చైతన్యం పొందాల్సిన అవసరం వుంది. చిత్రపురి అనేది కార్మికులసొంతం. అందులోని ప్రతి అణువణువూ కార్మికులదే..ఈ సంగతి కార్మికులు గుర్తించినప్పుడే ఆ భూమి అంతా కార్మికుల సొంతమౌతుంది. దశాబ్ధాలుగా కార్మికుల చేస్తున్న పోరాటం ఫలిస్తుంది. వారి సొంతింటి కల నెరవేరుతుంది. ఇప్పటికే జరిగిన అప్పార్టుమెంటు వల్ల ఇంకా ఎంతో మంది కార్మికులకు సరిపోలేదు. ప్రస్తుతం నిర్మాణం చేస్తున్న ట్విన్ టవర్స్‌ల వల్ల కూడా కార్మికులందరి లక్ష్యం నెరవేరదు. రోహౌజ్‌ల పేరుతో సినీ గద్దలు ఆక్రమించుకున్న 14 ఎకరాల స్ధలంలో మరిన్ని అప్పార్టుమెంట్లు నిర్మాణం చేస్తే తప్ప కార్మికలందరికీ న్యాయం జరగదు. చిత్రపురిలో అన్ని క్రాఫ్టుల కార్మికులకు సొంతింటి కల నెరవేరాలన్నదే నేటిధాత్రి లక్ష్యం. ఆ లక్ష్యం కోసం సాగిన్న అక్షర పోరాట ప్రయాణంలో దక్కిన విజయం ఒక ఎత్తైతే రోహౌజ్‌ల స్థలం కార్మికుల వశమైనప్పుడే అసలైన విజయమని నేటిధాత్రి భావిస్తోంది. కార్మికుల ఎప్పటికైనా నెరవేరాలని నేటిధాత్రి కోరుకుంటోంది. కార్మికుల క్షేత్ర స్ధాయి ఉద్యమాలకు శ్రీకారం చుడితే కార్మికుల అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. కార్మికులందిరకీ సొంతంటి కల సొంతమౌతుంది. అక్రమంగా నిర్మాణమైన రోహౌజ్‌ల కూల్చివేతలతోపాటు, అదనపు అంతస్దుల నిర్మాణాలకు నోటీసుల జారీ దాకా నేటిధాత్రి సాగించిన అక్షరపోరాట విజయానికి కార్మిక లోకం అభినందనలు తెలియజేస్తోంది. నేటిధాత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ధన్యవాదాలుతెలియజేస్తూ ఇకపై పూర్తి స్ధాయిలో తాము ఉద్యమ కార్యాచరణ చేపడతామని, అందుకు నేటిధాత్రి సహకరించాలని కోరుతున్నారు. నేటిధాత్రికి కార్మికులు జేజేలు పలుకుతున్నారు.
`ఈ రెండు ఉప ఎన్నికలలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీదే జిహెచ్‌ఎంసి.
`ఏ పార్టీ గెలుస్తుందో చూడాలి మరి.
`జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ గెలిస్తే అధికారం సుస్థిరం.
`రెండు ఉప ఎన్నికలు కాంగ్రెస్ గెలిస్తే వచ్చే ఎన్నికలు కూడా కాంగ్రెస్ సొంతం.
`బీఆర్‌ఎస్ రెండు గెలిస్తే సానుభూతి అనే వాదన వుండదు.
`బీజేపీ గెలిస్తే తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ లకు చోటుండదు.
హైదరాబాద్,నేటిధాత్రి: రాష్ట్ర రాజకీయాలు చాలా వేగంగా మారుతున్నాయి. అనూహ్యంగా గోషామహల్ బిజేపి ఎమ్మెల్యే తన పదవికి, పార్టీకి రాజీనామ చేశారు. ఇంకా స్పీకర్ ఆమోదించలేదు. కాని రాజాసింగ్ వ్యవహారం చూస్తుంటే ఖచ్చితంగా దూరం జరిగినట్లే అనిపిస్తోంది. పైగా బిజేపి కూడా రాజాసింగ్ తలనొప్పిని తట్టుకోలేకపోతోందని అంటున్నారు. గత ఐదారేళ్లుగా రాజాసింగ్ ఎంతో అసంతృప్తిగా వున్నారు. పార్టీ తనకు సముచితమైన స్ధానం కల్పించడం లేదన్న ఆందోళన అనేక సార్లు వ్యక్తం చేశారు. 2018 ఎన్నికల్లో బిజేపి నుంచి ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు. కాని అనూహ్యంగా ఆ తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో రఘునందన్‌రావు, ఈటెల రాజేందర్ గెలుపుతో బిజేపి మూడు సీట్లకు చేరుకున్నది. అయినా రాజాసింగ్‌కు బిజేపి పక్షనాయకుడిగా గుర్తించలేదు. అంతే కాకుండా రాజాసింగ్ దూడుకు, సొంత పార్టీ నేతలపై ఏడుపులతో ఆయనను కొంత కాలం పార్టీ పక్కన పెట్టింది. ఒక దశలో సస్పెండ్ కూడ చేసింది. అయినా ఎన్నికల సమయంలో ఆయన సస్పెన్షన్ ఎత్తి వేసింది. మళ్లీ బిజేపి టికెట్ ఇచ్చింది. ఆ ఎన్నికల్లోనూ రాజాసింగ్ గెలిచారు. ఈసారి ఎన్నికల్లో బిజేపి నుంచి 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అయినా ఈసారి కూడా రాజాసింగ్‌కు బిజేపి పక్ష నాయకుడి పదవి ఇవ్వలేదు. దాంతో ఆయన అసంతృప్తి తారా స్ధాయికి చేరుకున్నది. పార్లమెంటు ఎన్నికల్లో హైదరాబాద్ టికెట్ మాధవిలతకు ఇస్తే, పోటీ చేసేందుకు మగాడే దొరకలేదా? అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. ఇక అప్పటి నుంచి రాజాసింగ్ పార్టీకి దూరం కావాలనే చూస్తున్నాడు. పార్టీ కూడా రాజాసింగ్‌ను దూరం పెట్టడమే మేలనుకుంటూ వచ్చింది. రాష్ట్ర అద్యక్ష పదవి తనకు ఇవ్వాలని రాజాసింగ్ బలంగా కోరుకున్నాడు. కాని ఆయనకు ఇచ్చేందుకు బిజేపి ససేమిరా అన్నది. దాంతో రాజాసింగ్ పార్టీకి, ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే రాజాసింగ్ ఇలాంటి బెదిరింపులు సహజమే అని కూడా అంటున్నారు. కాకపోతే రాజాసింగ్ తన దారి తాను ఇక ఎంచుకున్నట్లే..శివసేన నుంచి పోటీ చేస్తానని కూడా చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక హైదరాబాద్‌లో రెండు ఉప ఎన్నికలు ఖాయంగానే కనిపిస్తున్నాయి. ఇటీవలే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాద్ మరణించారు. త్వరలో జరగనున్న బిహార్ ఎన్నికలతోపాటు ఉప ఎన్నికలు నిర్వహించే అవకాశం లేకపోలేదు. ఇప్పుడు మూడు ప్రధాన పార్టీ పరిస్తితి ఏమిటన్నది జోరుగా చర్చ జరుగుతోంది. ఈ రెండు ఉప ఎన్నికలు ప్రతిపక్షాల కన్నా, పాలక పక్షం కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మాకం. ఈ రెండు సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంటే మాత్రం ఆపార్టీని ఆపడం ఇక ఎవరి తరం కాదు. అందుకే ఎలాగైనా రెండు సీట్లు సాదించాలన్న వ్యూహాలకు కాంగ్రెస్ పదును పెడుతుందనిచెప్పడంలో సందేహం లేదు. కాంగ్రెస్ పార్టీ అంటేనే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. ఆ పార్టీలో ఏ నాయకుడైనా,ఏదైనా మాట్లాడినా చెల్లుతుంది. తర్వాత చిన్న సారీ చెబితే సరిపోతుంది. ఇదే కాంగ్రెస్‌కు వరం. ఇదే కాంగ్రెస్‌కు శాపం. అందుకే కాంగ్రెస్ పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యాన్ని వదులకోవడం లేదు. జూబ్లీ హిల్స్ మరణించిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ బిఆర్‌ఎస్ నాయకుడు. ఆ సీటు బిఆర్‌ఎస్‌ది. గతంలో ఒక బిఆర్‌ఎస్ సీటు కాంగ్రెస్ వశం చేసుకున్నది. కంటోన్ మెంటుకు జరిగిన ఉప ఎన్నికలో బిఆర్‌ఎస్ సీటును కాంగ్రెస్ గెల్చుకొని తన మెజార్టీకి మరో సీటును జత చేసుకున్నది. ఇప్పుడు జరిగే రెండు ఉప ఎన్నికలను గెల్చుకుంటే స్వతహాగానే కాంగ్రెస్‌కు మరింత బలం పెరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఎదరులేకుండా పోతుంది. ఆయన నాయకత్వానికి తిరుగులేకుండా పోతుంది. అధిష్టానం వద్ద రేవంత్ రెడ్డి పలుకుబడి కొండంత పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే సిఎం. రేవంత్ రెడ్డి నాయకత్వంలోఓ ఉప ఎన్నిక గెలిపించి చూపించారు. ఇప్పుడు రెండు ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురుండదు. హైదరాబాద్ విషయంలో హైడ్రా, మూసీ సుందరీకరణ ప్రభావం వుంటుందని అంటున్నారు. ఆ రెండు సీట్లు గెలిస్తే మాత్రం ప్రజల నాడి వచ్చే సార్వత్రిక ఎన్నికల దాకా తెలిసిపోతుంది. పైగా వచ్చే జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తుంది. గత రెండు ధపాలుగా జిహెచ్‌ఎంసికి దూరమైన కాంగ్రెస్ మరోసారి తన పాలన అక్కడ కూడా మొదలు పెట్టే అవకాశం ఏర్పడుంది. హైదరాబాద్‌లో బిఆర్‌ఎస్ ఖాళీ అయ్యేందుకు కూడా మార్గం పడుతుంది. ఈ రెండు సీట్లు కాంగ్రెస్ గెల్చుకుంటే ఇప్పటికే మారిన పది మంది ఎమ్యెల్యేలతోపాటు, మరో పది మంది ఎమ్మెల్యేలైనా కాంగ్రెస్ గూటికి చేరే అవకాశం లేకపోలేదు. బిఆర్‌ఎస్ అస్దిత్వం ప్రశ్నార్థకంలో పడక తప్పదు. ఎందుకంటే గత ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు ఆయువు పోసిందే హైదరాబాద్. పల్లెల్లో ఎలాగూ కారుకు గత ఎన్నికల్లో స్ధానం లేకుండా పోయింది. పార్లమెంటు ఎన్నికల్లో పల్లెల్లో గులాబీ తుడిచిపెట్టుకుపోయింది అందువల్ల ఈ ఉప ఎన్నికలు పంచాయితీ ఎన్నికలకు ముందు జరిగితే రెండు రకాలుగా కాంగ్రెస్ లాభం పొందే అవకాశం కూడా వుంది. హైదరాబాద్ గెలుపు పల్లెల్లో కూడా ప్రభావం చూపుతుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వం మరింత బలపడేందుకు ఛాన్స్ వుంది. ఒక వేళ ఈ రెండు సీట్లు బిఆర్‌ఎస్ గెలిస్తే మాత్రం కాంగ్రెస్‌కు గడ్డు రోజులు వచ్చినట్లే అనుకోవచ్చు. నిన్నటి వరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గురించే అందరూ మాట్లాడుకున్నారు. ఆ స్ధానంలో కాంగ్రెస్ గెలిస్తే ఆ పార్టీకి కొంత బలం పెరిగేది. కాని బిఆర్‌ఎస్ గెలిస్తే సానుభూతి పనిచేసిందని అనేందుకు కూడ కాంగ్రెస్‌కు అవకాశం వుండేది. ఒక వేళ ఇప్పుడు రెండు ఉప ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ రెండు చోట్ల ఓడిపోతే మాత్రం తీరని నష్టాన్ని చవి చూసే పరిస్ధితి రావొచ్చు. కారు గెలిస్తే ఆ పార్టీని ఆపే వారు ఇక వుండరు. పైగా జూబ్లిహిల్స్ అనేది సానుభూతితో గెల్చుకున్నారన్న మాట మాట్లాడేందుకు కూడాకాంగ్రెస్‌కు అవకాశం వుండదు. కారు పార్టీ ఈ రెండు ఉప ఎన్నికలు గెల్చితే పల్లె పోరు కారు వైపు తిరుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. జిహెచ్‌ఎంసి కూడా మళ్లీగులాబీ కైవసం చేసుకుంటుందన ఊహించొచ్చు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కారుదే జోరు అంటూ నిత్యం బిఆర్‌ఎస్ నాయకులు అంటున్నారు. పంచాయితీ ఎన్నికలు పెట్టే ధైర్యం కాంగ్రెస్‌కు లేదంటున్నారు. ఈ రెండు ఉప ఎన్నికలు గులాబీ పార్టీ గెలిస్తే రాజీనామా చేసిన పది మంది ఎమ్మెల్యేలపై ప్రజల నుంచి కూడా ఒత్తిడి రాకతప్పదు. వారు కూడా రాజీనామా చేయక తప్పదు. ప్రజా క్షేత్రంలో గులాబీ శ్రేణులు వారిని తిరగనివ్వరు. దాంతో పది ఉప ఎన్నికలు రాకతప్పదు. ఇక ఈ రెండు పార్టీలను కాదని హైదరాబాద్ ప్రజలు బిజేపి వైపు చూస్తే భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌లకు నూకలు చెల్లినట్లే. ఎందుకంటే ఒక్కసారి బిజేపి పాగా వేసిందంటే చాలు ఆ రాష్ట్రాలల ఓటమిని చవి చూడడం లేదు. గుజరాత్‌లో ఇప్పటికీ వరసగా ఏడు సార్లు గెలిచి రికార్డు సృష్టించింది. ఇక హాట్రిక్ విజయాలు అనేక రాష్ట్రాలలో చవి చూస్తోంది. ఆయా రాష్ట్రాలలో బిజేపిని ఓడిరచడం ఏ పార్టీ వల్ల కావడం లేదు. ఆప్‌లాంటి పార్టీ కూడా డిల్లీలో ఓడిపోయింది. భవిష్యత్తులో బిజేపి తెలంగాణలో పాగా వేస్తే మరో రెండు మూడు దఫాలు ఇతర పార్టీలు లేవడం కష్టమ అవుతుంది. వచ్చే జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో బిజేపి జెండా ఎగురవేస్తుందని చెప్పడంలో సందేహం అవసరమే లేదు. అంతే కాకుండా ఈ రెండు గెలిస్తే, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కూడా వేటు వేయాలని బిజేపి డిమాండ్ చేస్తుంది. ఆ కార్యాచరణ ఊపందుకుంటుంది. ఇతర పార్టీల నుంచి బిజేపిలోకి వలసలు కూడా మొదలౌతాయి. పంచాయితీ ఎన్నికల్లో కూడా బిజేపి మెరుగైన స్ధానాలు గెల్చుకుంటుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై తీర్పు వస్తే, ఉప ఎన్నికలు మళ్లీ వస్తే ఆ స్ధానాలు బిజేపి వశం కాకతప్పదు. పైగా ఇంత కాలం గోషామహల్ నుంచి రాజాసింగ్ వ్యక్తిగత బలంతో గెలుస్తున్నాడా? లేక బిజేపి బలంతో గెలుస్తున్నాడా కూడా తేలిపోతుంది. ఒక వేళ ఈ ఉప ఎన్నికలో కూడా రాజాసింగే గెలిస్తే మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో రాజాసింగ్ హీరో కావడం కూడా స్పష్టం.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.