కూటమిలో కుతకుత!

ముదురుతున్న వివాదం!

`చిరు బాలయ్య ల సినీ రాజకీయ సంవాదం.

`నిన్న మౌనం.. నేడు నిజం!?

`తమ్ముడి రాజకీయం కోసం అన్న మౌనం దాల్చారు

`బాలయ్య కెలికితే ఇప్పుడు చిరు నోరు విప్పారు!

`తమ్ముడి రాజకీయాన్ని మొదటికే మోసం తెచ్చారు!

`ఎటు దారి తీస్తుందో అని పవన్‌ ఆందోళన.

`బాలయ్య మీద కేసులకు చిరు అభిమానులు సై.

`క్షమాపణకు బాలయ్య నై.

`ఐ డోంట్‌ కేర్‌ అంటున్న బాలయ్య.

`నాటి నుంచి ఇద్దరి మధ్య ఆధిపత్య సంవాదం!

`సినిమా పరిశ్రమలో అడుగడుగునా పోటీ తత్వం!

`అప్పుడూ బాలయ్యది పై చేయి కాలేకపోయింది!

`ఇప్పుడూ తన గొప్ప దనం గుర్తించడం కష్టంగా మారింది.

`చిరుతో ఎంత పోరాడినా గెలవలేకపోయిన బాలయ్య.

`ఇప్పుడు పవన్‌ లేకుండా రాణించలేకపోతిమన్న బాధ.

`మూడు సార్లు గెలిచినా మంత్రి కాలేకపోయిన బాలయ్య.

`మొదటి సారే చిరంజీవి కేంద్ర మంత్రి అయ్యారు.

`పవన్‌ కళ్యాణ్‌ ఏకంగా డిప్యూటీ సిఎం అయ్యారు.

`ఈ అంతరం ఇప్పటిది కాదు!

`రాజకీయ దోస్తీ కుదిరినా సమసిపోదు!

`ముదురుతున్న వివాదం! 

`పనిగట్టుకు వ్యవహారం!

`మేం వేరు..మా బ్రీడ్‌ వేరు అనుకునే రకం బాలయ్య.

`మంచి వాణ్ణి తిడతాను..చెడ్డ వాణ్ణి పొగుడుతాననే బాలయ్య.

`అంతా రివర్స్‌ కేసు బాలయ్య.

`నేనొక్కడినే మూడు సార్లు గెలిచానని చిరు మీద చురకలు.

`అహంభావం నిండిన మాటల తూటాలు.

హైదరాబాద్‌, నేటిధాత్రి: 

కూటమిలో కుంపటి రగిలింది. లోలోన కుతకుతలాడుతోంది. అటు తిరిగి, ఇటు తిరిగి సమస్య జనసేన మెడకు చుట్టుకునే పరిస్దితి కనిపిస్తోంది. ఇంతకీ తప్పు ఎవరిది? బాలయ్యదా? చిరంజీవిదా? అంటే నిన్నటి దాకా బాలయ్యది తప్పన్న వాళ్లు కూడా ఇప్పుడు చిరంజీవిది తప్పనే మాట కూడా వినిపిస్తోంది. అసెంబ్లీలో బాలయ్య వ్యాఖ్యలు చేసిన రోజున చిరంజీవి స్పందన బాగుందని చర్చలు జరిగాయి. అది వైసిపికి చాల ప్లస్‌ అయ్యింది. బాలయ్య నోరు జారాడన్న మాటలు ఎక్కువగా వినిపించింది. వైసిపి అదికారిక పత్రిక సాక్షి కూడా చిరంజీవిని హైలెట్‌ చేసింది. అంటే ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అనే తరహాలు వార్తలు వడ్డించింది. వంటకం బాగా కుదిరింది. అంతే చిరంజీవి వదలిన బాణం బాలయ్య కన్నా, ఎక్కువగా తమ్ముడు ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌కు తగిలినట్లుంది. దాంతో పవన్‌ అటు బాలయ్యను నిందించలేక, అన్నయ్యను వెనకేసుకు రాలేక ఊపిరాడని పరిస్దితిలోకి నెట్టేసినట్లైంది. పుండు మీద కారం చల్లినట్లు మరునాడు ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, స్వయంగా పవన్‌ కల్యాణ్‌ ఇంటికి వెళ్లి చర్చలు జరపడంతో రాజకీయం మరో మలుపు తిరిగింది. రాజకీయ చాణక్యంతో పవన్‌ నోరు మూయించేందుకు చంద్రబాబు వేసిన ఎత్తుగడ ఫలించింది. ఫలితంగా జనసేన శ్రేణులను సముదాయించలేక, ఇటు బాలయ్యపై నిప్పులు కక్కలేక పవన్‌ మౌనం దాల్చాల్సి వచ్చింది. కొన్ని సార్లు మౌనంకూడా సమాదానం కావొచ్చు? కాకపోవచ్చు? కాకరేగడానికి కారణం కావొచ్చు? ఇప్పుడు అదే జరిగింది. ఇంత రచ్చ జరుగుతుంటే పవన్‌ కల్యాణ్‌ సైలెంట్‌గా వుండడాన్ని చిరంజీవి అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. మీడియా కూడా సైలెన్స్‌ గంభీర అంటూ వార్తలు రాయడంతో పవన్‌ మనసు అల్లకల్లోలమౌతుందంటున్నారు. ఎందుకంటే బాలయ్య ఒక రకంగా చెప్పాలంటే అదును చూసి గిల్లాడు. కాకపోతే ఆయనకు ఎప్పటినుంచో మంట వుంది. ఆ మంట తీర్చుకోకుండా వుండే రకం కాదు బాలయ్య. ఎందుకంటే దేనికైకా డోంట్‌ కేర్‌ అనే వ్యక్తిత్వం బాలయ్యది. పైగా మేం వేరు. మా బ్రీడ్‌వేరు అని పదే పదే చెప్పడం ఆయనకే చెల్లింది. నన్నెవరు ప్రశ్నించేది అని కూడా అనేకసార్లు అన్నాడు. ఆయన వాడే ప్రాసల్లో కూడా అనేక సార్లు తప్పులు దొర్లాయి. అయినా ఆయన ఎప్పుడూ వివరణ ఇచ్చుకున్నది లేదు. కొందరు బాలయ్యను బోలా మనిషి అంటారు. నచ్చని వాళ్లు ఇగో ఎక్కువ అంటారు. అయినా దేన్ని పట్టించుకోకపోవడమే ఈ వివాదాన్ని మరింత రెచ్చగొడుతోంది. అసెంబ్లీలో లేని సమస్యను ప్రస్తావించిన ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌ తప్పు జరిగింది. క్షమించమన్నాడు. తన వ్యాఖ్యలను అసెంబ్లీ రికార్డుల్లోనుంచి తొలగించాలని కోరారు. కాని బాలయ్య ఇంత వరకు నోరు మెదపలేదు. దానిపై ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానని కూడా చెప్పలేదు. నిజం చెప్పాలంటే బాలయ్య బంతిని తన్నేశారు. చిరంజీవి ఆ బంతిని తన కోర్టులోకి తీసుకున్నాడు. అంటే చిరంజీవి సెల్ప్‌ గోల్‌ చేసుకున్నాడు. కరోనా సమయంలో జరిగిన కథ ఇప్పుడు ముందుకు తెచ్చుకున్నాడు. వాల్తేరు వీరయ్య కోసం ఆనాడు జరిగింది ఇప్పుడు ముందేసుకున్నాడు. తనకు తానుగా రాజకీయ చక్రంలో చిరు ఇరుక్కున్నాడు. నిన్నటి దాక చిరంజీవి ఎంతో గొప్ప వాడు అన్నారు. అవును చిరంజీవి ఆనాడు ఏం చేశాడని ఇప్పుడంటున్నారు. నిజానికి ఏపి మాజీ ముఖ్యమంత్రి జగన్‌ చిరంజీవికి ఎక్కడా అవమానం చేయలేదు. చిరంజీవిని తన ఇంటికి భోజనానికి పిలిచాడు. అన్న అంటూ సంబోధించాడు. మర్యాదలు చేశాడు. సన్మానం కూడా చేశాడు. అదే సమయంలో చిరంజీవి సినీ ఇండస్త్రీ కోసం చెప్పిన విషయాలు సావదానంగా విన్నాడు. పది మంది సినీ పెద్దలను చిరంజీవి తీసుకొని వెళ్తే వారితో జగన్‌ చర్చలు జరిపారు. సనీ పరిశ్రమకు ఏది కావాలంటే అది చేస్తానన్నాడు. అందరికీ ఇంటి స్ధలాలిస్తానన్నాడు. ఎంత మంది స్టూడియోలు పెట్టుకుంటామన్నా అందరికీ భూములిస్తామన్నాడు. కనీసం 30శాతం షూటింగ్‌లైనా ఏపిలో చేయమని రిక్వెస్టు చేశాడు. అందర్నీ పేరు పేరున పలకరించాడు. ఇంతకన్నా ఏం చేస్తారు. ఈ ఎపిసోడ్‌ అంతా మర్చిపోయారు. కాని చిరంజీవితోపాటు వెళ్లిన బృందమంతా నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చిందన్న విషయాన్ని అటుమీడియా, ఇటు సినీ రంగం హైలైట్‌ చేసింది. మురళీ మోహన్‌ లాంటి వారు మాట్లాడిన మాటలకు అంతే లేదు. ఆ అంశాన్ని రెండేళ్లపాటు పవన్‌ కాళ్యాన్‌ తన రాజకీయానికి వినియోగించుకున్నాడు. తన అన్నను జగన్‌ అవమానించడని పదే పదే అనేక సభల్లో ఉటంకించాడు. జగన్‌ అందరికీ తెలియకపోవచ్చు. కాని చిరంజీవి అంటే ప్రపంచంలోఅందరికీ తెలుసున్నట్లు మాట్లాడుతూ వచ్చాడు. తన అభిమానులను రెచ్చగొట్డాడు. ఆ సమయంలో చిరంజీవి నోరు మెదపలేదు. నీ రాజకీయం కోసం నన్ను వాడుకోకు అని వారించలేదు. ఆనాడు తమ్ముడి కోసం అన్న మౌనం వహించాడు. పరిశ్రమకు పెద్ద అని అందరూ గౌరవిస్తుంటే, దృతరాష్టుడి పాత్ర చిరంజీవి పోషించారు. అప్పుడు తన తమ్ముడు గెలవడమే కోరుకున్నాడు. జగన్‌ను ఎన్ని సార్లుపవన్‌ తిడుతున్నా తప్పని చెప్పలేదు. జరిగింది ఇదీ అని చెప్పలేదు. పవన్‌ను వారించలేదు. కాని ఇప్పుడు బాలయ్య ఒక్కమాట అనగానే చిరంజీవికి పొడుకొచ్చిందా? అని అంటున్నారు. ఈ మాట అప్పుడెందుకు చెప్పలేదు. ఇప్పుడెందుకు చెప్పినట్లు? అనే ప్రశ్నల వర్షం చిరంజీవి మీద కురుస్తోంది. అమెరికా నుంచి చిరంజీవి హైదరాబాద్‌ చేరుకునే సమయంలో ఆయన అభిమానులు బ్లడ్‌ బ్యాంకులో సమావేశం నిర్వహించారు. బాలయ్య మీద తెలంగాణలోని 300 పోలీస్‌ స్టేషన్లలో పిర్యాదులు చేయాలనుకున్నారు. అలాంటి పనులు చేయొద్దని చిరంజీవి సూచించినట్లు మరో వార్త వచ్చింది. ఇక్కడ కూడా చిరంజీవి మళ్లీ ఆలస్యమే చేశారు. తన అభిమానులు బ్లడ్‌ బ్యాంకులో సమావేశం నిర్వహిస్తున్న సంగతి చిరంజీవికి తెలియదా? చిరంజీవికి సమాచారం లేకుండానే అభిమానులు సమావేశమయ్యారా? ఇది జనాన్ని నమ్మమంటారా? అయినా ఏపిలో జరిగిన సమస్యకు తెలంగాణలో కేసులు నమోదు చేసే యోచన ఏమిటో అర్ధం కాని విషయం. ఏపి సమస్యకు, తెలంగాణకు ఏం సంబంధం? సమస్యను పక్కదారి ఎలాపట్టించాలో చిరంజీవికి కూడా అర్ధం కావడం లేదు. అయినా అసెంబ్లీలో బాలయ్య నోరు జారింది జగన్‌ మీద. కాని చిరంజీవి తన మీద ఎందుకు వేసుకున్నట్లు? తన పెద్దరికం పోతుందన్న భయంతో తానే గొప్ప అనిపించుకోవాలనుకున్నాడు. తాను సౌమ్యుడినని మరోసారి నిరూపించుకోవాలనుకున్నాడు. కాని డామిట్‌ కథ అడ్డం తిరిగింది. చిరంజీవి అభిమానులు కేసుల విషయం తెరమీదకు తెచ్చి బాలయ్య అభిమానులు కెలికారు. ఇప్పుడు బాలయ్య అభిమానులు మరోసారి రంగంలోకి దిగే ప్రయత్నం చేస్తున్నారు. అంతే కాకుండా పవన్‌ కల్యాణ్‌కు, జనసేన శ్రేణులకు మధ్య కూడా గ్యాప్‌ వచ్చేలా వుంది. చిరంజీవి వాఖ్యలు పరోక్షంగా పవన్‌కే ఇబ్బందులు సృష్టించాయి. అయినా పవన్‌ స్పందించకోవడాన్ని జనసేన శ్రేణులు జీర్ణించుకోలేకేపోతున్నారు. అటు వాళ్లు కుతకుతలాడిపోతున్నారు. పవన్‌ నోరు తెరిస్తే బాగుండు అనుకుంటున్నారు. కాని పవన్‌ నోరు మెదపడంలేదు. ఓజి గంభీరలో ఊగిపోతూ డైలాగులు చెప్పినట్లు, బాలయ్య విషయంలోనూ స్పందించాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాని ఆయన నోరు తెరుస్తున్నది లేదు. నాయకులు బాగానే వున్నారు. అభిమానులు ఊగిపోతున్నారు. పవన్‌ స్పందన లేకపోవడంతో జనసేన అభిమానులు బాలయ్యనేకాదు, చిరంజీవిని సైతం తప్పు పడుతున్నారు. చిరంజీవి స్పందన సమయం సందర్భం లేకుండా వుందన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version