`బీసీలంతా ఏకమైతేనే బలపడతారు!
`బీసీలు బలపడితేనే బరిగీసి నిలవగలరు!
`బీసీలు బరి గీసినప్పుడే ముందుకు రాగలరు
`బీసీలు ముందు కొచ్చినప్పుడే ఓసిలను వెనక్కు నెట్టగలరు
`ఓసిలను వెనక్కి నెట్టితేనే రాజ్యాధికారం సాధించగలరు.
`బీసీలు డెబ్బై ఏళ్లు వెనకే వున్నారు.
`బీసీలు ఇప్పటికైనా మేలుకోండి.
`జనరల్ అంటే ఓసిలు కాదు!
`అన్ని వర్గాల ప్రజలు..
`పోటీ చేసేందుకు అర్షులు.
`ఈ సత్యం దాచి మోసం చేస్తూ వస్తున్నారు.
`బలమైన బీసీ సమాజం సీట్లు అడుక్కోవడమా!
`బలం లేని ఓసిలు సీట్లు పంచుకోవడమా!
`బీసీల నెత్తిమీద కూర్చొని ఓసిలు పెత్తనం చేయడమా!
`బీసీలకు ఏం కావాలన్నా ఓసిలను అడుక్కోవాలా!
`ఓసిలంతా కలిసి సీట్లు పంచుకుంటారా?
`ఆ ఓసిలకు ఓట్లు వేసి, బీసీలు గెలిపించుకోవడమా?
`రాజ్యమేలమని ఓసిలకు పగ్గాలిచ్చి, బీసీలు పాలేర్లు కావడమా!
హైదరాబాద్, నేటిధాత్రి:
బిసిలంతా ఏకమైతేనే బలపడాతారన్న సత్యాన్ని ఇప్పటికైనా గ్రహించాలి. బిసిల్లారా..ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటికైనా బిసిలంతా మేలుకోవాల్సిన తరుణం వచ్చేసింది. బేషజాలు పక్కన పెట్టి బిసిలంతా ఏకమైతే తప్ప రాజ్యాదికారం సాధ్యమయ్యేది కాదు. తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని విధంగా బిసిల అంశం తెరమీదకు వచ్చిది. గత రెండు సంవత్సరాలుగా నానుతోంది. బిసి సంఘాలు అనేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాయి. రాజకీయ పార్టీలన్నీ బిసి జపం చేస్తున్నాయి. అయినా బిసిలు కదలకపోతే చేసేదేమీ వుండదు. ఇంకా వెయ్యేల్లయినా బిసిలకు రాజ్యాధికారం దక్కడు. స్వాతంత్య్రానికి పూర్వం రాజరిక వ్యవస్ధ వున్నప్పుడే సర్వాయి పాపన్న లాంటి రాజు ఉద్భవించాడు. తన సొంతంగా రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని పాలించాడు. ఇతర రాజులను ముప్పు తిప్పలు పెట్టాడు. ఆ మాత్రం పౌరుషం ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎందుకు కరువౌతోంది. రాజ్యాంగం జనరల్ కేటరిగి పేరుతో బిసిలకు కూడా అవకాశం కల్పించింది. అయినా బిసిలు ముందుకు రావడం లేదు. ప్రజా ప్రతినిధులయ్యేందుకు ధైర్యం చేయడం లేదు. డెబ్బై స్వతంత్య్రంలో ఒక్క బిసి నాయకుడు కూడా ముఖ్యమంత్రి కాలేదు. బిసిలే ఎక్కువగా వున్న క్యాబినేట్‌ఏర్పాటు కాలేదు. నిజాం నుంచి విముక్తి జరిగిన తెలంగాణలో బిసి సిఎం. కాలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఏనాడు అవకాశం దక్కలేదు. ఇప్పుడూ దక్కలేదు. కొట్లాడితే తప్ప బిసిలకు రాజ్యాధికారం రాదు. అధికారం వశం చేసుకుంటే తప్ప పాలకులు కాలేరు. అందుకే రాజకీయ హక్కుల సాదన దిశగా ప్రతి బిసి అడుగులేయాలి. నేనేందుకు నాయకుడిని కావొద్దని ప్రశ్న వేసుకోవాలి. మాకు అదికారం ఎందుకు రాదని ముందుకు రావాలి. అంతే తప్ప బిసిల రిజర్వేషన్ ఎవరో వేసే బిక్షలాగా ఎదురుచూడొద్దు. రిజర్వేషన్ అనేది బిసిల హక్కు. జనాభాలోనే 85శాతం వున్న బిసిలకు కనీసం 42శాతం రిజర్వేషన్ ఇవ్వకపోతే పోరాటం చేసైనా సాధించుకోవాలి. అందుకు రాజ్యాధికార సాదన దిశగా కదలాల్సిన అవసరం వుంది. బిసిలలో వున్న ప్రధానమైన లోపాన్ని అధిగమించాలి. బిసిలలో వున్న కులాల మధ్య ఆధిపత్యం తగ్గాలి. బిసిలంటే బిసిలే..అంతే కాని మేం ఎక్కువ. మీరు తక్కువ అనే భావన పోవాలి. అన్నా, తమ్ముడు, మామ, అక్క అని పిలుచుకుంటే సరిపోదు. ఇటీవల బిసిలంటే నాలుగు కులాలేనా? అనే ప్రశ్న మొదలైంది. ఇలాంటి చీలికను తీసుకొచ్చి బిసిలను విచ్చిన్నంచేయాలిన చూస్తుంటారు. వారి ఉచ్చులో పడొద్దు. పైకి కపట నాటకమాడే రాజకీయ పార్టీలు ఉచ్చును ఎప్పుడూ సిద్దం చేసి వుంచుకుంటారు. బిసిల వేలుతోనే, బిసిల కన్ను పొడుస్తారు. ఇది గమనించుకొని ముందుకు సాగాలి. బలమైన అడుగులు వేయాలి. అందువల్ల బిసిల రాజ్యాధికారం కోసం ఏకమైతే తప్ప రాజకీయ పార్టీలు ఏం చేయలేవు. ఓసిలకు ఇప్పటిదాకా చేసిన ఊడిగం చాలు. బిసిలంటే పిల్లులు కాదు. పులి పిల్లలని నిరూపించాలి. కట్టె పుల్లలం కాదు, కట్టెల మోపులమని రుచి చూపించాలి. ఎందుకంటే బిసిలంతా చీపురు పుల్లల్లా వున్నంత కాలం ఏమీ చేయలేరు. అందరూ కలిసి కట్టెల మోపులా మారి, బిసిల ఐక్యత చాటాల్సిన అవసరం వుంది. బిసిలలో వున్న సామాజిక చైతన్యం రాజకీయం కావాలి. ప్రజా ప్రతినిధులై సామాజిక న్యాయం సాదించాలి. క్షేత్రస్దాయి నుంచి రాష్ట్ర స్దాయి వరకు బిసిలే నాయకులు కావాలి. రాజకీయ పార్టీల వైఖరిలో మార్పులు రావాలి. బిసిలు లేకుంటే పార్టీ మనగడ అసాద్యమని తేలుసుకోవాలి. బిసిలకు దామాషా ప్రకారం సీట్ల కేటాయింపులు జరగాలి. పార్టీల కన్నా, బిసిల ఐక్యత ముఖ్యం. రాజ్యాధికారం సాదించే వరకు కలిసి సాగుదామని శపథం చేయండి మేధావుల ఆలోచనలు అమలు చేయండి. చెప్పుడు మాటలు వింటూ మళ్లీ మోసం పోకుండా జాగ్రత్తపడండి. బలమైన బిసి నాయకులను తయారు చేయండి. అన్ని కులల నుంచి ప్రాతినిధ్యం కలిగేలా కలిసి కట్టు ప్రయాణం సాగించండి బిసిల రాజ్యాధికారం సాదిద్దాం.బిసిల్లారా..ఏకం కండి! ఇప్పుడు కాకపోతే ఎప్పుడూ కాదు. రాజకీయ పార్టీలో ఒక భయం వచ్చేసింది. బిసిలను కాదనుకుంటే పార్టీలే వుండవన్న భయం పట్టుకున్నది. బిసిల పట్టు బిగుస్తోంది. బిసిల గొంతు బలపడుతోంది. బిసిలలో వున్న సామాజిక చైతన్యం రాజకీయం కావాలి. అప్పుడే రాజకీయ పార్టీల గుండెల్లో గుబులు పుడుతుంది. బిసిలు ప్రజా ప్రతినిధులై సామాజిక న్యాయం సాదించాలి. అందుకు క్షేత్రస్దాయి నుంచి రాష్ట్ర స్దాయి వరకు బిసిలే నాయకులు కావాలి. రానున్న స్ధానిక సంస్దల ఎన్నికల్లో అన్ని జనరల్ స్ధానాలలో బిసిలు పోటీ చేయాలి. ఇప్పటి వరకు జనరల్ స్ధానమంటే ఓసిలకు రిజర్వేషన్ అనే అపోహ వుంది. అగ్రకులాలు అలా ప్రచారం చేసుకున్నాయి. బిసిలను రాజకీయానికి దూరం చేశాయి. జనరల్ స్దానాల్లో ఓసిలు పాగా వేసి, బిసిలకు స్ధానం లేకుండా చేశారు. ఓసిలు నాయకులౌతూ బిసిలను కార్యకర్తలుగా మార్చుకొని అందలమెక్కారు. ఇంత కాలానికి తెలంగాణ ఉద్యమం లాంటి చైతన్యం వచ్చింది. అది ఉప్పెనలా మారాలి. చట్టపరంగా రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అసరం లేదు. రాజకీయంగా కూడా సీట్లు కేటాయించొచ్చు. అందుకు ఏ చట్టం అడ్డుపడదు. జనరల్ స్దానాలన్నీ బిసిలకు ఇవ్వొచ్చు. కనీసం దామాషా ప్రకారం పంపకాలు చేయొచ్చు. రాజ్యాంగ పరంగా ఎన్నికల సంఘం రిజర్వేషన్లు ప్రకటించినా, జనరల్ స్దానాలలో బిసిలకు టిక్కెట్లు ఇవ్వొచ్చు. ఆ వెసులుబాటు వుంది. అయినా రాజకీయ పార్టీలు నాటకాలాడొచ్చు. ఈ ఐదేళ్లలో తెలంగాణ వ్యాప్తంగా స్దానిక సంస్దల ఎన్నికల్లో బిసిలు ప్రజా ప్రతినిదులైదే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బిసిలను ఎవరూ ఆపలేరు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బిసి ముఖ్యమంత్రి కావాలి. అంటే ఇప్పటి నుంచే అడుగులు పడాలి. బిసిల ఐక్యతలో మరింత చైతన్యం రావాలి. రాగద్వేషాలు వీడాలి. అంతే కాకుండా రాజకీయ పార్టీల వైఖరిలో మార్పులు రావాలి. బిసిలు లేకుంటే పార్టీ మనగడ అసాద్యమని తేలుసుకోవాలి. అంతగా బలమైన ఒత్తిడి బిసి సంఘాల నుంచి, బిసి నాయకుల నుంచి రావాలి. అవసరమైతే బిసిల నాయకులు ఆయా పార్టీల నుంచి బైటకు రావాలి. రాజకీయ పార్టీలలో వున్న బిసి నాయకులంతా బైటకువస్తే రాజకీయ పార్టీలలో వనుకు పుట్టాలి. ఇప్పుడు స్దానిక సంస్దల ఎన్నికల్లోనే కాదు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బిసిలకు దామాషా ప్రకారం సీట్ల కేటాయింపులు జరగాలి. బిసిలుముందుగా చేయాల్సిన పని పార్టీల కన్నా, బిసిల ఐక్యత ముఖ్యమనే ఆలోచన చేయాలి. అందుకు కట్టుబడి వుండాలి. తన సీటు తనకు వస్తే చాలు అనుకునే స్వార్ధపరులను బిసి సంఘాలు కూడా వెలివేయాలి. బిసిలు వారిని తిరస్కరించాలి. అప్పుడు గాని బిసిలలో మరింత ఐక్యత సాద్యం కాదు. బిసిల వేలుతోనే బిసిల కన్ను పొడుస్తారు. అందుకు జాగ్రత్తగా వుండాలి. అవకాశవాద బిసి నాయకులను దూరం పెట్టాలి. ఆయా పార్టీలపై ఒత్తిడి తెచ్చే నాయకులను మాత్రమే తెలంగాణ సమాజం నమ్మాలి. వారిని స్వాగతించాలి. వారిచేత తెలంగాణలో బిసిల రాజ్యాధికారం సాదించే వరకు కలిసి సాగుదామని శపథం చేయించాలి. ప్రజలు, ప్రజా సంఘాలు, బిసిలంతా ప్రమాణం చేయాలి. అంతే కాకుండా మేధావుల ఆలోచనలు అమలు చేసుకుంటూ ముందుకు సాగాలి. రాజకీయాలలో వెన్నుపోట్లు ఎక్కువ. తప్పుడు మాటలు, చెప్పుడు మాటలు వినేవారు చాల మంది వుంటారు. అలాంటి వారి మాటలు వింటూ మళ్లీ మోసం పోకుండా జాగ్రత్తపడాలి..బలమైన బిసి నాయకులను తయారు చేసుకోవాలి. అన్ని కులల నుంచి ప్రాతినిధ్యం కలిగేలా కలిసి కట్టు ప్రయాణం సాగించాలి. బిసిల రాజ్యాధికారం సాదించాలి. బిసిలంతా కలిసి బరిగీసి నిలబడాలి.అప్పుడే ముందుకు రాగలరు. బిసిలంగా ముందుకు వస్తేతప్ప ఓసిలు వెనుకడుగు వేయరు. వారిని వెనక్కి నెట్టే పరిస్ధితి రాదు. డెబ్బై ఏళ్లు బిసిలు వెనకే వున్నారు. ఓసిలకు రాజకీయ ఊడిగం చేశారు. ఇప్పటికైనాసరే బిసిలు ముందుకు రావాలి. ముందడుగు వేయాలి. జనరల్ అంటే ఓసిలు కాదు. జనరల్ అంటే అందరూ..ఈ విషయం తెలిసినా, బిసిలు ముందుకు రాలేదు. అణగారిన వర్గాలు అని చెప్పడం తప్ప వారిని పైకి తీసుకొచ్చే ఆలోచనలు ఇప్పటి వరకు ఏ రాజకీయపార్టీ పూర్తి స్ధాయిలో చేయలేదు. ఎంత సేపు మోచేతికి బెల్లం పెట్టి నాకించడం తప్ప ఏమీ చేయలేదు. పేరు వేల కోట్లు, వందల కోట్లు అంటూ సబ్ ప్లాన్‌లు పెట్టినా ఎవరికి మేలు జరిగిందో చెప్పింది లేదు. ఇటు నిధులు కేటాయించడం..అటు మళ్లించడం..సబ్ ప్లాన్‌లపేరుతో రాజకీయాలకు బిసిలను దూరం చేయడం బాగా అలవాటు చేసుకున్నారు. ఇప్పటికైనా బిసిలు అసలు రహస్యం తెలుసుకోవాలి. కావాల్సింది సబ్ ప్లాన్‌లు కాదు. రాజకీయాలు. పదవులు. అదికారం. అప్పుడు తప్ప బిసిలకున్యాయం జరగదు. సామాజిక న్యాయానికి అర్దం వుండదు