జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో బుధవారం రోజున కవి రచయిత మ్యాదరి సునీల్ మాట్లాడుతూ గద్దర్ అవార్డులలో తెలంగాణ సినిమాకు ఆన్యాయం జరిగిందని పులి అమృత్ నిర్మించిన సలాం హైదరాబాద్ సినిమాకు ఆన్యాయం జరిగిందని తెలంగాణ సినిమా రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ప్రొడ్యూసర్, దర్శకులు రచయిత పులి అమృత్ సలాం హైదరాబాద్ సినిమా పాటల రచయిత మ్యాదరి సునీల్ ఆవేదన వ్యక్తం చేసారు, సలాం హైదరాబాద్ సినిమా పై వరకు వెళ్లి పైనల్ గా ఈ సినిమాను పక్కన పెట్టి ఆంధ్ర సినిమాలకు అవార్డులు ఇవ్వడం అనేది గద్దర్ భావజాలానికి విరుద్ధమని అమృత్ మాట్లాడుతూ ఈ సలాం హైదరాబాద్ సినిమాకు గద్దర్ అవార్డు ప్రకటిస్తే ఈ సినిమాలో ఒక మంచి పాట రాసిన కవి రచయిత మ్యాదరి సునీల్ కి గద్దర్ అవార్డు వచ్చే అవకాశం ఉండని ఇందులో నటి నటులకు కూడా అవకాశం ఉండని పులి అమృత్ అన్నారనితెలంగాణ చరిత్ర తెలువని వారికి జ్యూరీ చైర్మన్ల అని వెంటనే తెలంగాణ చరిత్ర తెలిసిన అటువంటి మేధావులను జ్యూరి మెంబర్ గా ఏర్పాటు చేసి తెలంగాణ సినిమాలను బ్రతకనివ్వండి అని సునీల్ తెలిపారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంలో జూన్ 5 గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగు మంత్రివర్గ సమావేశంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ కీలక ప్రకటన చేయాలని ఆర్టీసీ నర్సంపేట డిపో జేఏసీ చైర్మన్ కె.రంగయ్య, వైస్ చైర్మన్ గొలనకొండ వేణు సీఎం రేవంత్ రెడ్డికి బుధవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో తొలిసారి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రావాలని 40 వేల మంది యావత్ ఆర్టీసీ కార్మికులు, వారి కుటుంబ సభ్యులు సహా విశేష కృషి చేశామని, గెలుపులో భాగస్వామ్యం అయ్యామని వారు గుర్తు చేశారు.
ఆర్టీసీ ప్రభుత్వ విలీనం అయితే తమ జీవితంలో అద్భుతం జరుగుతుందని కార్మికులు ప్రతి రోజు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారని, ఆర్టీసీ కార్మికుల ఆత్మగౌరవం అయినటువంటి ప్రభుత్వ విలీనం అడుగు దూరంలో ఆగిందని, దాన్ని కేబినెట్ సమావేశంలో “విలీనం అమలు తేదీ” ని సగర్వంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించి కార్మికుల జీవితాలలో వెలుగు నింపాలని వారు కోరారు.
CM Revanth Reddy.
మహిళా ప్రయాణీకుల కోసం ఉచిత మహాలక్ష్మి పథకం విజయవంతం కావడానికి, ప్రభుత్వానికి ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లు మంచి పేరు తీసుకువచ్చారని తెలిపారు.
పూర్తి స్థాయిలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే ప్రభుత్వంపై ఒక్క రూపాయి కూడా అదనపు భారం పడదని, ప్రతి నెల మహాలక్ష్మి డబ్బులతోనే ట్రెజరరీ నుండి జీతాలు సులభంగా ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం చెల్లించవచ్చని వారు అన్నారు.
విలీనంతో పాటు రెండు పీఆర్సీలు 2021 మరియు 2025 ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రకటిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికులు, కుటుంబ సభ్యులందరం జీవితాంతం ఋణపడి ఉంటామని రంగయ్య, వేణు తెలిపారు.
◆- కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి*
◆ ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ రాష్ట్రంలోని ప్రతి పేదవారికి సొంత ఇంటికల నెరవేరాలని సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి అన్నారు.మొగడంపల్లీ మండలంలోని మాడ్గి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన భూమి పూజలో వారు పాల్గొని కొబ్బరికాయ కొట్టి, పునాదులు తీసి పనులు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు.
Congress party state leaders Dr. Siddham.
ఈకార్యక్రమంలో సిడిసి చైర్మన్ ముబీన్,మాజీ సోసైటి చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి,మొగడంపల్లీ మండల మాజీ కోఆప్షన్ మెంబర్ హర్షద్ పటేల్,ఎంపిడివో మరియు వివిధ శాఖల అధికారులు,మాజీ సర్పంచ్ లు,కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ఘనం గా బీసీ ఉద్యమ నేత పర్ష హన్మాండ్లు జన్మదిన వేడుకలు
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్
సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)
తెలంగాణ సిరిసిల్ల జిల్లా బీసీ ఉద్యమ నేత పర్ష హన్మాండ్లు జన్మ దిన వేడుకలను బీసీ సంక్షేమ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యం లో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం లో మరియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యం లో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు,బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పర్శ హన్మాండ్లు ను శాలువా తో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు,ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీలు బానిసలు కాదు పాలకులు కావాలని ఉద్యమించుచున్న మహోన్నతమైన వ్యక్తి హన్మాండ్లు అన్నారు,ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. పర్శ హన్మాండ్లు జన్మదినం బీసీ లందరికి పండుగ దినం అని జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు,బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న పర్ష హన్మాండ్లు జన్మదిన వేడుకలు హైదరాబాదులో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. బీసీల హక్కుల సాధన కోసం జైలు జీవితాన్ని అనుభవించిన గొప్ప వ్యక్తి పర్ష హన్మాండ్లు అని అన్నారు. పర్ష హన్మాండ్లు మునుముందు ఎన్నో పదవులు అధిరోహించాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పర్ష హన్మాండ్లు, మల్లేశం, తదితర బీసీ సంఘం నేతలు పాల్గొనడం జరిగినది.
నర్సంపేట పట్టణ 19వ చెందిన మండల యాదగిరి మరణించగా టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బత్తిని రాజేందర్, వరంగల్ జిల్లా ఓబీసీ చైర్మన్ ఓర్సు తిరుపతి, మాజీ వైస్ ఎంపీపీ చింతల సాంబరెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్ర యాకుబ్ రెడ్డి, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మాదాసి రవికుమార్, మాజీ కౌన్సిలర్ ఎలకంటి విజయ్ కుమార్, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు మెరుగు సాంబయ్య, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి నాడెం నాగేశ్వర్లు, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యదర్శి బిట్ల మనోహర్, 8వ వార్డు అధ్యక్షులు గిరగాని రమేష్, 16వ వార్డు ఇన్చార్జ్ బాణాల శ్రీనివాస్, 5వ వార్డు వర్కింగ్ ప్రెసిడెంట్ కొప్పు అశోక్, మాజీ వార్డు మెంబర్ గాజుల రమేష్, కొంకిస కిరణ్ గౌడ్, రచ్చ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
మహిళలు,విద్యార్థినిలు ఎలాంటి సమస్య ఉన్న నిర్భయంగా సంప్రదించండి.
మహిళలు పని చేసే ప్రదేశాల వద్దకి వెళ్లి అవగాహన కల్పిస్తున్న జిల్లా షీ టీమ్ బృందం.
జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపిఎస్ గారు
సిరిసిల్ల టౌన్ : (నేటిధాత్రి)
సిరిసిల్ల జిల్లా విద్యార్థినులు, మహిళలు వేధింపులకు గురైనప్పుడు భయపడొద్దని, ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ భరోసా ఇచ్చారు.జిల్లాలో షీ టీమ్ బృందం కళాశాలలో, పాఠశాలల్లో, విద్యార్థినిలకు గ్రామాల్లో పని చేసే ప్రదేశాల్లో మహిళలకు ర్యాగింగ్/ ఇవిటీజింగ్/ పోక్సో/ షీ టీమ్స్/ మహిళ చట్టలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పించడం జరుగుతుంది. మే నెలలో షీ టీమ్ కు వచ్చిన ఫిర్యాదులలో 03 FIRలు,06 పెట్టి కేసులు నమోదు చేసి మహిళలను, విద్యార్థినులను వేధిస్తున్న వారిని గుర్తించి వారియెక్క తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే మాట్లాడుతూ..విద్యార్థినులు,మహిళలు అభద్రత బావనికి గురైనప్పుడు భయపడొద్దని,ధైర్యంగా ముందుకు వచ్చి షీ టీం కి ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, జిల్లాలో మహిళల, విద్యార్థినిల రక్షణకై ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతోందని ప్రధానంగా మహిళలు, విద్యార్థినిలు అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని, మీ వ్యక్తిగత సమాచారాన్ని వారితో పంచుకోవద్దని,ముఖ్యంగా సామాజిక మాద్యమాల్లో పరిచమయమ్యే వ్యక్తులతో మరింత అప్రమత్తం వుండాలని సూచించారు.మహిళలు తాము పనిచేసే ప్రదేశాల్లోగాని,మరేక్కడైన లైంగిక వేధింపులకు గురౌవుతున్న,ర్యాగింగ్ లాంటి వేధింపులకు గురౌవుతున్న మహిళలు,విధ్యార్థునులు,బాలికలు మౌనంగా ఉండకుండా, ధైర్యంగా పిర్యాదు చేయాలని సూచించారు.ఎవరైనా ఆకతయులు మహిళలను,యువతులను వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యాసంస్థలల్లోఎవరైనా వేధించిన,రోడ్డుపై వెళ్లేటప్పుడు,పని చేసే ప్రదేశాల్లో అవహేలనగా మాట్లాడిన ఉద్దేశపూర్వకంగా వెంబడించిన వెంటనే 100, జిల్లా షీ టీమ్ నెంబర్ 8712656425 పిర్యాదు చేసినచో వారి మీద చట్టపరమైన చర్యాలు తీసుకోవడం జరుగుతుంది అని జిల్లా ఎస్పీ తెలిపారు.
కిరణ్ అబ్బవరం, శ్రీగౌరి ప్రియ జంటగా రూపుదిద్దుకుంటున్న చిత్రానికి ‘చెన్నై లవ్‌స్టోరీ’ అనే టైటిల్ ఖరారు చేశారు. రవి నంబూరి దర్శకత్వంలో…
కిరణ్ అబ్బవరం, శ్రీగౌరి ప్రియ జంటగా రూపుదిద్దుకుంటున్న చిత్రానికి ‘చెన్నై లవ్‌స్టోరీ’ అనే టైటిల్ ఖరారు చేశారు. రవి నంబూరి దర్శకత్వంలో సాయిరాజేశ్, ఎస్కేన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్, గ్లింప్స్‌ని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా విడుదల చేశారు. ‘తొలి ప్రేమేం తోపు కాదు.. ఫస్ట్ లవ్ ఫెయిలైతే బెస్ట్ లవ్ ఎక్కడో మొదలవుతుంది’ అని చెబుతూ సాగిన గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. అంతం వరకూ అనంతమై సాగే ఈ జీవితంలో తొలి ప్రేమ ఒక మజిలీ మాత్రమే అనీ, అదే తుది కాదనే కాన్సె్‌ప్టను ఈ గ్లింప్స్ ద్వారా మేకర్స్ అందంగా తెలియజేశారు. ఈ గ్లింప్స్‌కు ‘తొలి ప్రేమే తోపు కాదే తోపు కాదే..’ అంటూ సంగీత దర్శకుడు మణిశర్మ బీజీఎం కంపోజ్ చేశారు.
కోహిర్ మున్సిపాలిటీలో వార్డుల విభజనకు నోటిఫికేషన్ జారీ అయినట్లు మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం పదివేల 10, 859 మంది ఓటర్లకు 16 వార్డులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. చంటి నెంబర్ల ఆధారంగా కొత్త వార్డుల ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ప్రజలకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 11వ తేదీ వరకు కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చని వివరించారు.
పెండింగ్ బిల్లుల చెల్లింపుల్లో కేంద్రం తీవ్ర జాప్యం
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ కాంపొనెంట్ నిధులతో గ్రామాల్లో చేపట్టనున్న అభివృద్ధి పనుల మంజూరుపై ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. కలెక్టర్లకూ అదే సూచన చేసింది.
గత ఏడాది (2024-25) చేపట్టిన పనులకు కేంద్రం నుంచి నిధుల విడుదలలో జాప్యంతో రాష్ట్రంలో పెండింగ్ బిల్లులు రూ.2,200 కోట్లకు చేరాయి.
ఆరు నెలలుగా చెల్లింపులు నిలిచిపోయాయి.
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, డైరెక్టర్ గత మూడు నెలల్లో నాలుగుసార్లు దిల్లీ వెళ్లి పెండింగ్ నిధులు విడుదల చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖకు విజ్ఞప్తి చేశారు.
ఈ పరిణామాలతో కొత్త పనుల మంజూరుకు ఎమ్మెల్యేలు ఒత్తిడి తెస్తున్నా ప్రభుత్వం తొందరపడట్లేదు. బిల్లుల పెండింగ్ కారణంగా కొత్త పనులు చేయడానికి ముందుకొచ్చేవారు తక్కువగా ఉంటారన్నది ఒక కారణమైతే..
Pending Bills.
వర్షాలు మొదలైనందున ఆదరాబాదరాగా చేసే పనుల్లో నాణ్యత ప్రమాణాలు లోపించే అవకాశం ఉందన్నది మరో కారణం.
ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా 25వేలకు పైగా కొత్త పనుల ప్రతిపాదనలను కలెక్టర్లు తాత్కాలికంగా పక్క పెట్టారు.
వర్షాకాలం ముగిశాకే కొత్త రోడ్ల పనులు
పూర్తయిన పనులను పోర్టల్లో అప్లోడ్ చేసిన 45 రోజుల్లో కేంద్రం బిల్లులు చెల్లించేది.
గత ఏడాది చేసిన మెటీరియల్ పనులకు అన్ని రాష్ట్రాలకూ అక్టోబరు నుంచి నిధులు నిలిపివేసింది.
గతంలో ఇలాంటి పరిస్థితి లేదని అధికారులు చెబుతున్నారు.
రాష్ట్రంలో 2025-26 వార్షిక ప్రణాళిక ప్రకారం ఏప్రిల్ నుంచే కొత్త పనులు మొదలవ్వాలి.
ఈ ఏడాది కూడా 4,000 కిలోమీటర్ల రహదారుల పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
దీంతో గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల సమస్యకు పూర్తి పరిష్కారం లభిస్తుందని రాష్ట్రప్రభుత్వం భావించింది.
పనులను తాత్కాలికంగా పక్కన పెట్టి కేంద్రం ఇచ్చే నిధుల కోసం ప్రభుత్వం ఎదురుచూస్తోంది.
మరో రెండు వారాల్లో అవి విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
అయినా వర్షాకాలం ముగిశాకే పనులు మంజూరుచేయాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
తాత్కాలిక సర్దుబాటుకు సమస్యలు
ఉపాధిలో పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు రాష్ట్రప్రభుత్వం తరఫున తాత్కాలికంగా నిధుల సర్దుబాటుకు సాంకేతిక సమస్యలు అడొస్తున్నాయి.
ఉపాధి సిబ్బందికి రెండు నెలల జీతాల బకాయిల చెల్లింపులకు ఇటీవల రూ.60 కోట్లు సర్దుబాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం..
మెటీరియల్ పనులకు బిల్లుల విషయంలో వెనకడుగు వేస్తోంది.
ఉపాధి పనులకు మెటీరియల్ సరఫరా చేసే వెండర్లకు కేంద్రం నేరుగా బిల్లులు చెల్లిస్తోంది.
గతంలో పంచాయతీలకు చెల్లించేది. 2019-24 మధ్య వెండర్ విధానం తీసుకొచ్చింది.
Pending Bills.
మెటీరియల్ సరఫరాదారులను వెండర్ల కింద రిజిస్ట్రేషన్లు చేయించారు. వారికే కేంద్ర ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం నుంచి తాత్కాలికంగా నిధులు సర్దుబాటు చేసినా ఆ తర్వాత వెనక్కి తీసుకోవడం అసాధ్యమని అధికారులు అంటున్నారు.
ఉద్యోగుల జీతాలు, కార్యాలయాల నిర్వహణకు లేబర్ బడ్జెట్లో 4% నిధులు పరిపాలన ఖర్చులకు (అడ్మిన్ కాస్ట్) కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయిస్తోంది.
దీనివల్ల సిబ్బంది జీతాలకు ప్రస్తుతం సర్దుబాటు చేసిన రూ.60 కోట్లు కేంద్రం నిధులు విడుదల చేశాక తిరిగి వెనక్కి తీసుకునే వీలుంది.
మెటీరియల్ పనుల బిల్లులు నేరుగా వెండర్లకు చెల్లిస్తున్నందున, ప్రస్తుతం నిధులు సర్దుబాటు చేసినా తరువాత వెనక్కి రావడం కష్టమని ఆర్థికశాఖ స్పష్టం చేసింది.
◆ డా౹౹ఎ. చంద్రశేఖర్ గారు, మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణంలోని సూఫీ చారిటబుల్ క్లినిక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.సూఫీ చారిటబుల్ క్లినిక్ ఆధ్వర్యంలో మౌజన్ మరియు ఇమామ్ లకు ఉచిత వైద్యం అందించనున్నారు. మరియు నిరుపేదలకు అతితక్కువ ధరలో ₹50 రూపాయలకే వైద్యం అందించనున్నారు.ఇలాంటి గొప్ప కార్యాన్ని చేస్తున్నా సూఫీ చారిటబుల్ క్లినిక్ వారిని ఎంపీ.సురేష్ కుమార్ షెట్కార్ మరియు మాజీ మంత్రి డా౹౹ఎ.చంద్రశేఖర్ వారిని ఎంతో ప్రశంశించారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కండేం.నర్సింలు గారు,మొగుడంపల్లి మండల అధ్యక్షులు మాక్సూద్ అహ్మద్ గారు,కాంగ్రెస్ నాయకులు హుగ్గేలి రాములు గారు, మరియు సూఫీ చారిటబుల్ క్లినిక్ సభ్యులు పాల్గొనడం జరిగింది.
కార్మికుల ఉద్యోగ భద్రత సౌకర్యాల సాధన కోసం సిఐటియు ను గెలిపించండి
★చుక్క రాములు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్లోని మహీంద్రా అండ్ మహీంద్రా పరిశ్రమలో ఈనెల 5వ తేదీన జరిగే పరిశ్రమ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో సిఐటియు ఘనవిజయం అందించేందుకు కార్మికులు పెద్ద సంఖ్యలో ఓట్లు వేయాలని సిఐటియును గెలిపించాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు, మహీంద్రా&మహీంద్రా ఎంప్లాయిస్ యూనియన్(సిఐటియు) అధ్యక్షులు కామ్రేడ్ చుక్క రాములు పిలుపునిచ్చారు. మంగళవారం రోజు కంపనీ ముందు జరిగిన ఎన్నికల గేట్ మీటింగ్ లో చుక్క రాములు మాట్లాడుతూ మరో చారిత్రాత్మక వేతన ఒప్పందం 25000 రూపాయలతో చేస్తామని, ఉద్యోగ భద్రత, సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందని, కార్మికులతో పాటు తల్లిదండ్రులకు మెడికల్ కార్డ్ వర్తించేలా 7లక్షలతో చేస్తామని, 3సంవత్సరాలకు అగ్రిమెంట్, 4.50రూ/- డి ఎ పెంచుతామని ఇలా అనేక కార్మిక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని అన్నారు.
ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఐ ఎన్ టి యు సి నాయకులకు కనీసం కార్మికుల పట్ల అవగాహన లేదనీ, కార్మికుల పట్ల కేవలం అవగాహన ఉండి చారిత్రాత్మక వేతన ఒప్పందాలు సాధించి పెట్టి అనేక సౌకర్యాలు సాధించిన ఘనత సిఐటియు దేనని రాబోయే రోజుల్లోనూ వేతన ఒప్పందం ఉందని ఆ వేతనం ఒప్పందాన్ని కూడా మెరుగైందిగా చేయాలంటే సిఐటియుని గెలిపించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బి.మల్లేశం, సీపీఎం ఏరియా కార్యదర్శి రాంచందర్, వివిధ పరిశ్రమల యూనియన్స్ నాయకులు నాయకులు పాండు రంగ రెడ్డి, బాగారెడ్డి, మహిపాల్, రాజిరెడ్డి, కనకారెడ్డి, గణేష్, నర్సయ్య, మణి, నారాయణ, సందీప్ రెడ్డి, నరేష్, నర్సింలు, తదితరులున్నారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణలువేగంగా జరుగుతుండటం వర్తమాన పరిణామం. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది సినీతెరవేల్పు విజయ్ (దళపతి) కొత్తగా స్థాపించిన తమిజగ వెట్రి కజగం (టీవీకే). తమిళనాడులో ద్రవిడ రాజకీయాలే బలంగా వుంటాయన్న సంగతి అదరికీ తెలిసిందే. ఈ నేప థ్యంలో ద్రవిడ పార్టీలైన డీఎంకే, ఎఐడీఎంకెలను, విజయ్ నేతృత్వంలోని టీవీకే ఏవిధంగా ఎదుర్కొని నెట్టుకు రాగలుగుతుందన్నది ప్రధాన ప్రశ్న. అయితే దళపతి రాబోయే ఎన్నికలకోసం ఇ ప్పటినుంచే చాపకింద నీరులా తన వ్యూహాలను అమలుపరచడం మొదలుపెట్టారు. వచ్చే ఆగస్టునుంచి ఆయన రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన వృధాచలం నియోజకవర్గం నుంచి తన రాష్ట్ర పర్యటనను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పట్టలి మక్కల్ కచ్చి (పీఎంకే), దేశీయ ముర్పొక్కు ద్రవిడ కజగం (డీఎండీకే) పార్టీల స్టాండ్ ఏవిధంగా వుండబోతున్నది కూడా ఆగస్టు నాటికి స్పష్టమయ్యే అవకాశముంది. ముఖ్యంగా పీఎంకేకు ఓబీసీవర్గమైన వన్నియార్లలో మంచి బలముంది. దివంగత సినీ హీరో విజయకాంత్ నెలకొల్పిన డీఎండీకేకు కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో గట్టిపట్టును కొనసాగిస్తోంది. ప్రస్తుతం గ్రామీణ, సెమీ`అర్బన్ ప్రాంతాల్లోని దళిత, ఓబీసీ వర్గాల ఓట్లపై టీవీకే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తోంది. పీఎంకే, డీఎండీకేల అసంతృప్తి ప్రస్తుతం డీఎండీకేకు నాయకత్వం వహిస్తున్న ప్రేమలత ఏఐడీఎంకే పట్ల తీవ్ర అసంతృప్తితో వున్నారు. సీట్ల కేటాయింపులో తమకిచ్చిన హామీని తుంగలో తొక్కారంటూ ఏఐడీఎంకే నాయకుడుపళినిస్వామిపై ఆగ్రహంతో వున్నారు. ఇక పీఎంకే విషయానికి వస్తే దీని వ్యవస్థాపకుడు రామ్‌దాస్, ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడిగా వున్న అంబుమని రామ్‌దాస్‌కు మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటోంది. రామ్‌దాస్, ఏఐడీఎంకేతో నేరుగా చర్చలు జరపాలని భావిస్తుంటే, అంబుమని రామ్‌దాస్ ప్రస్తుతం కేంద్రమంత్రిగా వున్న నేపథ్యంలో బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఇది వీరిద్దమధ్య నెలకొన్న విభేదాలకు కారణం. ఈ విభేదాలు పార్టీలో అసంతృప్తికి కారణమవుతున్నాయి. ఉత్తర తమిళనాడుకు చెందిన పది జిల్లాల్లో ఈ పార్టీ ప్రభావం అధికం. ఈ అసంతృప్తి వీరిని పీఎంకేవైపుకు మొగ్గు చూపేలా చేస్తే అప్పుడు ఒక్క ఏఐడీఎంకేకు మాత్రమే కాదు డీఎంకేకు కూడానష్టం కలిగించక మానదు. ఎట్లా అంటే డీఎంకే కూటమిలో వున్న విడుత్తలై చిరుతైౖగలల్ కచ్చి (వీసీకే)కు ఈ ప్రాంతంలో దళితుల్లో మంచి బలం వుంది. పైరెండు పార్టీల ప్రభావంతో ఈ ఓ ట్లు కూడా చీలి టీవీకే ఖాతాలోకి వెళ్లకూడదనేం లేదు. క్రైస్తవుడైన విజయ్, వచ్చే ఆగస్టులో వృ ధాచలం నుంచి ప్రారంభించే యాత్రలో వన్నియార్లు (ఓబీసీలు), దళితులు, మత్స్యకార్లు, క్రైస్తవ వర్గాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనున్నారు. గతంలో వృధాచలం డీఎండీఏకేకు గట్టి పట్టున్న ప్రాంతం. డీఎండీకే, పీఎంకేలు ప్రస్తుతం ఏఐడీఎంకేతో జట్టుకట్టి వున్నాయి. ప్రస్తుతం విజయ్ ‘టీవీ’ని తన పార్టీ గుర్తుగా చేసుకునే అవకాశముంది. ఈనేపథ్యంలోనే ‘టీవీ`కే’కు ఓటువేయండి నినాదంతో ముందుకెళ్లవచ్చు. అదీకాకుండా ‘టీవీ’ ప్రజలకు ఏవిధమైన కష్ట లేకుండా తేలిగ్గా గుర్తుండిపోతుంది కూడా. ప్రస్తుతం విజయ్ సభలకు పెద్ద సంఖ్యలో ప్రజలుహాజరవుతుండటాన్ని ఏవిధంగా తీసుకోవాలనేదానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీవీకేకు ఇది సానుకూల పరిణామమని కొందరు వాదిస్తుంటే, మరికొందరు అభిమానం వేరు ఇది ఓటుగా మారడం వేరని చెబుతున్నారు. విజయ్‌కాంత్ వంటి స్టార్ హీరో పెట్టిన పార్టీకే దిక్కులేదు, ఇప్పుడు విజయ్ పార్టీ కూడా ఇదేబాటలో పయనిస్తుందని అంచనాలు కట్టే నిరాశా వాదులుకూడా లేకపోలేదు. ఏతావాతా చెప్పొచ్చేదేమంటే విజయ్ తన ఛరిష్మాతో పదిశాతం ఓట్లు సాధించుకోగలిగితే డీఎంకే కొంప నిండా మునిగినట్టేనన్నది మాత్రం సుస్పష్టం. యువకుల్లో మద్దతు వర్తమాన పరిస్థితి పరిశీలిస్తే దళపతికి యువకుల్లో, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల్లో, ప్రధానంగా మైనారిల్లో పట్టు పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ వర్గాలు సంప్రదాయికంగా డీఎంకే మద్దతు దార్లు. ఈ వర్గాలు దళపతిని కేవలం వెండితెరవేల్పుగా మాత్రమే కాదు, ఎంతోకొంత చేసిచూ పించే నాయకత్వ లక్షణాలు కలిగినవాడిగా పరిగణించడం మొదలైంది. మొదట్లో విజయ్ టీవీకేను స్థాపించిన తర్వాత, రాజకీయ పండితులు దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు టీవీ కే 5 నుంచి 6శాతం వరకు ఓట్లు సంపాదిస్తుందని అంచనాలు కడుతున్నారు. మరి గతంలో కమల్ పెట్టిన మక్కల్ నిధి మయమ్ (ఎంఎన్‌ఎం) 2021లో కేవలం 2.52శాతం ఓట్లు మాత్రమేసాధించింది. దీంతో పోలిస్తే టీవీకే చాలా ముందంజలో ఉన్నట్టే లెక్క! అంతేకాదు ఇతర పార్టీ లనుంచి 2`3శాతం ఓట్లు చీల్చగలడన్న అంచనాలు కూడా మొదలయ్యాయి. తాను సొంతంగా 5శాతం ఓట్లు సాధించే అవకాశమున్న నేపథ్యంలో ఇప్పటికి మొత్తంమీద చూసుకుంటే గరిష్టంగా 8శాతం ఓట్లు సాధించగలడన్నది తమిళనాడు రాజకీయాలను పరిశీలించే వారి అంచనా. అయితే విజయ్ ‘వర్క్ ఫ్రం హోం’ రాజకీయాలు నడుపుతారన్న విమర్శకులు కూడా లేకపోలేదు. ఇదిలావుండగా ఎన్నికలు దగ్గరపడ్డే కొద్దీ ఈ అంచనాల్లో మార్పు కచ్చితంగా వుండి తీరుతుంది. ఎందుకంటే విజయ్ ప్రధానంగా దళితులు, ఆర్థికంగా అణగారిన వర్గాలు, శ్రామికులపై దృష్టి పెట్టి తన రాజకీయాన్ని నడుపుతున్నారు. ఇది ఓట్ల చీలికవల్ల సాధ్యమవుతుందని అనుకునేదాని కంటే, వివిధ వర్గాల ప్రజల ఆలోచనా శైలిలో వస్తున్న మార్పుల వల్ల అని చెప్పవచ్చు. మరి ఈ వర్గాలే డీఎంకేకు వెన్నెముకగా నిలుస్తున్నారు మరి!! కులరాజకీయాలు అధికం తమిళనాడులో కులరాజకీయాల ప్రభావం ఎక్కువన సంగతి తెలిసిందే! కులాభిమానం, పేదరికం అనే రెండు అంశాలు విరోధాభాస వంటివి. ఎందుకంటే పేదలు అన్నివర్గాల్లో వున్నారు. కాకపోతే దళితుల్లో వీరి సంఖ్య అధికం. వన్నియార్లు, గౌండర్లు, థెవరాల వంటి ఓబీసీ కులాలవా రు, ఇప్పుడు విజయ్‌కు దళితులు పూర్తి అండగా నిలుస్తున్నారన్న అభిప్రాయంతో వున్నారు. ఈ ఓబీసీలకు, దళితులకు ఎంతమాత్రం పొసగదు. ఇప్పుడు పట్టల్ మక్కల్ కచ్చి (పీఎంకే)కు వన్నియార్లలో బలం వుంది. అదే విడుత్తలై ఛిరుతైౖౖగల్ కచ్చి (వీసీకే)కు దళితుల్లోని పరైయార్ వర్గం మద్దతుంది. మరి ఈ రెండు పార్టీలు డీఎంకే, ఏఐడీఎంకేలకు వ్యతిరేకం కానప్పటికీ, ఒకే కూటమిలో వుండటం సాధ్యంకాదు. ఇప్పుడు వెన్నియార్‌లు విజయ్‌కి అభిమానులుగా ఉన్నప్పటికీ, టీవీకేకు అత్యధికశాతం దళితుల మద్దతుండటంవల్ల, వారు పీఎంకేకు అనుకూలంగానే వుంటారుతప్ప దళపతివైపు మొగ్గు చూపరు. ఏఐడీఎంకే `బీజేపీ కూటమి భవితవ్యం? ఈవిధంగా ఓబీసీ లెక్కలు సంక్లిష్టమయంగా వున్న నేపథ్యంలో ఏఐడీఎంకాేబీజేపీ కూటమికి అను కూలంగా మారే అవకాశాలు ఎక్కువ. పశ్చిమ తమిళనాడులోని కొంగు వెల్లలార్ గౌండర్లు ఎప్పటికీ ఏఐడీఎంకేకు అనుకూలమే. ఎందుకంటే ఏఐడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి ఈ కులానికి చెందినవాడే! ఉత్తర తమిళనాడులో బలమైన వెన్నియార్ల మద్దతున్న పీఎంకే ఇప్పుడు ఏఐడీఎంకాేబీజేపీ అలయన్స్ వైపు చూస్తుండటం గమనార్హం. దక్షిణ మరియు డెల్టా ప్రాంతాల్లో థేవర్ల ప్రాబల్యం ఎక్కువ. గతంలో ఏఐడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన పన్నీర్‌సెల్వం, ప్రస్తుత టీటీవీ నాయకుడు దినకరన్‌లు ఈ వర్గానికి చెందినవారే. వీరిద్దరూ తిరిగి ఏఐడీఎంకాేబీజేపీ కూటమిలోకి వచ్చే అవకాశాలున్నాయి. అదీకాకుండా ప్రస్తుత రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నయనార్‌నాగేంద్రన్ థెవర వర్గానికి చెందినవాడు. పన్నీర్‌సెల్వం, దినకరన్‌లు ఎన్‌డీఏ కూటమిలోకి చేరి తే, అప్పుడు కూటమికి థెవర వర్గంలో తిరుగుండదు. ఇక బీజేపీ విషయానికి వస్తే సైద్ధాంతిక ప్రాతిపదిక తప్ప, కులానికి ప్రాధాన్యత లేకపోవడంతో, దానికి ఇప్పటివరకు వున్న ఓట్లశాతంలో ఏవిధమైన మార్పు వుండదు. ఎందుకంటే దీని మద్దతుదార్లు సైద్ధాంతిక ప్రాతిపదికన వుండటం గమనార్హం. అందువల్ల విజయ్ ప్రభావం ఇతర పార్టీ లపై పడినంతగా భాజపాపై పడదు. విజయ్‌వల్ల బాగా దెబ్బతినేది సీమన్స్ నాయకత్వంలోని నామ్ తమిళర్ కచ్చి (ఎన్టీకే) తమిళనాడుకు మరింత స్వేచ్ఛ కావాలని పోరాడే పార్టీ ఇది. యువకులు ప్రధానంగా రాజ్యాన్ని వ్యతిరేకించే వారు ఇందులో సభ్యులు. వీరంతా ఇప్పుడు తమ అ భిప్రాయాన్ని విజయ్‌కి అనుకూలంగా మార్చుకోవచ్చు. ఇక అధికార డీఎంకే పార్టీ విషయానికి వస్తే, ఒకటీ రెండు నియోజకవర్గాల్లో ఓటర్ల అభిప్రాయాల్లో వచ్చిన మార్పులు ప్రభావం చూపవు. రాష్ట్రం మొత్తంమీద పరిశీలిస్తే తక్కువ ఓట్ల తేడాతో ఓటమి పాలైన నియోజకవర్గాల్లోనే డీఎంకేకు అసలైన ప్రమాదం పొంచివుంది. ఉదాహరణకు 2021లో కువందంపాలయం నియోజకవర్గంలో ఏఐడీఎంకే అభ్యర్థికి 9,776 ఓట్ల మెజారిటీ వచ్చింది. విచిత్రమేమంటే ఇక్కడ కమల్ హసన్ పార్టీ ఎంఎన్‌ఎంకు 23527 ఓట్లు రాగా, ఎన్టీకే పార్టీకి 17897 ఓట్లు వచ్చాయి. మరి ఈ రెండు పార్టీల ఓట్లు కలిపితే ఏఐడీఎంకేకు వచ్చిన మెజారిటీ ఓట్లకంటే ఎక్కువ. ఇదే నియోజకవర్గంలో వ్యక్తిగతంగా పార్టీల ఓట్లశాతం గమనిస్తే, ఎంఎన్‌ఎం పార్టీకి వచ్చిన ఓట్లు 18శాతం. 2016 ఎన్నికల్లో ఓట్లశాతాన్ని పోల్చినప్పుడు డీఎంకే నుంచి చీల్చుకున్న 6శాతం ఓట్లున్నాయి. నాటి ఎన్నికల్లో డీఎంకే ఈ నియోజకవర్గం నుంచి 3శాతం ఓట్ల తేడాతో గెలవడం గమనార్హం! ఇదేవిధంగా వచ్చే ఎన్నికల్లో దళపతి నేతృత్వంలోని టీవీకే మొత్తంమీద పదిశాతం ఓట్లు సాధిస్తే డీఎంకే తిరిగి అధికారంలోకి రావడం చాలా కష్టమవుతుంది. ఓటుబ్యాంకు రాజకీయాలు, కూటములు కట్టడంలో డీఎంకేకు తిరుగులేదు. దీంతోపాటు కుల రాజకీయాలను తనకు అనుకూలంగా మలచుకోవడంలో దిట్ట! ఈ నేపథ్యంలో దళపతి పార్టీ రంగంలోకి వచ్చిన నేపథ్యంలో డీఎంకే అనుసరిస్తున్న ప్రస్తుత వ్యూహాలు ఎంతవరకు పనిచేస్తాయనేది వేచి చూడాల్సిందే. తమిళ రాజకీయాల్లో నేటి పరిణామం ఒక్క సత్యాన్ని వెల్లడిస్తోంది. సంప్రదాయికంగా తమిళ రాజకీయాల్లో వేసే ఎత్తుగడలు, పన్నే వ్యూహాలు ఏమీ తెలియని ఒక కొత్త నాయకుడు విజయ్ రాజకీయ అరంగేట్రం చేశారు. ఛరిష్మా ఓటుగా మారితే, అన్ని వ్యూహాలు, ఎత్తుగడలు సునామీలో కొట్టుకుపోయి, రాష్ట్రంలో కొత్త రాజకీయశకం ప్రారంభం కాగలదు.
`మల్టీ టాలెంటెడ్ మహా మాయగాడు గుమస్తా మిల్లర్ ‘‘జగన్’’ మరో కుంభకోణం!!
`కలెక్టర్ కళ్ళు కప్పి.. జగన్ కు అప్పజెప్పి.
`సన్నాలకు జగన్ కన్నం!
`వడ్లన్నీ జగనొక్కడే మింగుతున్నాడు!!
`అధికారులు ఆ ఒక్కడి మిల్లులోనే కుక్కుతున్నారు!!
`కిలాడీ జగన్ కనుసన్నల్లోనే అధికారులు కంపు కంపు చేస్తున్నారు
`జగన్ మోసాలను కళ్లు మూసుకొని చూస్తున్నారు
`రైతుల ‘‘ట్రక్ షీట్ల’’ లను సొమ్ము చేసుకుంటున్నాడు రైతులను ముంచి కోట్లు
మూటగట్టుకుంటున్నాడు
`మిల్లుల మురికి నీరు వరద కాలువల్లో కలుపుతున్నాడు
`పొల్యూషన్ అధికారుల నోరు నోట్లతో మూయిస్తున్నాడు
`ఇరిగేషన్ అధికారులను కనుసైగతో కమ్మేస్తున్నాడు
`‘‘జేసి’’ని కూడా చిటికెన వేలు మీద ఆడిస్తా అంటున్న జగన్
`అధికారులందినీ గుప్పిట్లో పెట్టుకున్నారు
`మిల్లింగ్‌లో మాయా ప్రపంచం సృష్టించుకున్నాడు
`గుమస్తా పని చేసి గూడుపుఠాణి నేర్చుకున్నాడు
`సన్నాలొద్దని గాయి గాయి చేశాడు
`ఇప్పుడు సన్నాలను రా మిల్లులకు కాకుండా చేస్తున్నాడు
`అటు రైతులను నిండా ముంచుతున్నాడు
`ఇటు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నాడు
`కులం పేరు అడ్డం పెట్డుకొని కుటిల నీతికి పాల్పడుతున్నాడు
`మహా మాయగాడుగా వడ్లన్నీ మాయం చేస్తున్నాడు
`‘‘నేటిధాత్రి’’ కథనానికి ఖమ్మం అధికారులు స్పందించారు
`హన్మకొండ అధికారులు మీన మేషాలు లెక్కిస్తున్నారు
`ఖమ్మం జిల్లా వడ్లను కూడా గుమస్తా జగన్‌కే కట్టబెట్టారు
`ఎంక్వౌరీకి ఆదేశించినా హన్మకొండ అధికారులు కళ్లు తెరవడం లేదు
`ఖమ్మం జెసి నుంచి రికవరీ ఆర్డర్లు వచ్చినా హన్మకొండ అధికారులు మేలుకోవడం లేదు
హైదరాబాద్,నేటిధాత్రి: కొందరికి కాలం కలిసి వస్తుంది. మరి కొందరికి అదృష్టం కలిసి వస్తుంది. మరి కొందరకి పేరు కలిసివస్తుంది. రాజపకీయం కలిసి వస్తుంది. కాని ఓ వ్యక్తికి మాత్రం అన్నీ కలిసి వస్తాయి. ఏక కాలంలో అన్నీ కలిసివస్తుంటాయి. అలా పుర్కర కాలం నుంచి సివిల్ సప్లయ్ శాఖను గుప్పిట్లో పెట్టుకున్నాడు. అంచెలంచెలుగా కాదు, ఏకంగా ఒక్కసారే ఎదిగాడు. మోసాలకు వెన్నతో పెట్టిన విద్య అనే పదానికి నిర్వచనమయ్యాడు. అందరూ గుమస్తా జగన్మోహన్ రావు అంటుంటారు. పేరు ముందు వుండే కులం కూడా ఆయనకు బాగా కలిసి వచ్చింది. రాజకీయం వెన్నంటే వున్నట్లు చేసుకున్న ప్రచారం కలిసి వచ్చింది. అందుకు సివిల్ సప్లై శాఖ కూడా అండదండలు అందించింది. సహజంగా ఎవరికైనా వారి అదృష్టమే కలిసి వస్తుంది. కాని ఈ వ్యక్తికి ఇతరుల అదృష్టం కూడా లాక్కునేంత శక్తి వుంది. అందుకే మల్టీ టాలెంటెడ్ మాయగాడు అని అందరూ అంటుంటారు. ఒక గుమస్తా నుంచి ఏకంగా మిల్లర్‌గా ఎదగడమే కాదు, బినామీలతో మిల్లర్ల వ్యవస్ధను సృష్టించుకున్నాడు. మిగతా మిల్లర్ల నోరు కొడుతున్నాడు. ఇతర మిల్లర్లకు రావాల్సిన వడ్లను కొల్లగొడుతుంటాడు. అధికారులను పూర్తిగా గుప్పిట్లో పెట్టుకున్నాడు. వారి బలహీనతలను తాను సొమ్ము చేసుకుంటున్నాడు. తోటి మిల్లర్లకు అన్యాయం చేస్తున్నాడు. ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నాడు. రైతులను నిండా ముంచేస్తున్నాడు. పర్యావరణాన్ని పూర్తిగా దెబ్బ తీస్తున్నాడు. సాగు నీటిని కలుషితం చేస్తున్నాడు. ఎన్ని రకాలా మోసాలు చేయాలో తెలుసుకున్నాడు. ఆచరించి చూపిస్తున్నాడు. తాజాగా ఆయన చేసిన మరో మోసం, ఒక రకంగా కుంభకోణం వెలుగులోకి వచ్చింది. హన్మకొండ జిల్లా జాయింట్ కలెక్టర్ నెల రోజుల పాటు సెలవుల్లో వెళ్లారు. ఇదే అదునుగా సివిల్ సప్లై శాఖ ఉద్యోగులతో సహకారంతో ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన సన్నాలను తను సొంతం చేసుకున్నాడు. నిజానికి అవి హన్మకొండ జిల్లాకు చెందిన ఇతర మిల్లులకు కేటాయించారు. ఆ మిల్లులకు కాదని, రాత్రికి రాత్రి తన చాణక్యం ప్రదర్శించి, వాటిని తన మిల్లులకు మళ్లించుకున్నాడు. కలెక్టర్‌కు తెలియకుండానే సివిల్ సప్లై శాఖ అధికారులు సహకరించారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయమేమింటే ఈ జగన్‌కు వున్నవి బాయిల్డ్ రైస్ మిల్లులు. గతంలో సన్నాలు తీసుకొమ్మని ప్రభుత్వం ఒత్తిడి చేసినా వద్దని వారించాడు. ప్రభుత్వాన్నే ఎదిరించాడు. మాకు దొడ్లు వడ్లు మాత్రమే కావాలిన మొండికేశాడు. సన్నాల వల్ల తాము ఎంతో నష్టపోతామని, తాము నష్టాల బారిన పడిపోతామని అనేవాడు. ఇదే విషయంలో ఒకటి, రెండు సార్లు జాయింట్ కలెక్టర్ సమావేశానికి హజరుకాలేదు. కొన్ని సార్లు హజరైనా తన నిరసన తెలియజేస్తూ వెళ్లిపోయేవాడు. తమకు సన్నాలు వద్దని సమావేశంలో మధ్యలోనే లేచి వెళ్లిపోయేవాడు. అలాంటి జగన్ ఇప్పుడు సన్నాలు మాత్రమే కావాలంటున్నాడు. ఆయనకు రా రైస్ మిల్లులు లేవు. కాని సన్నాలు కావాలంటున్నాడు. ఇతర రా రైస్ మిల్లులకు చెందాల్సిన సన్నాలను కూడా లాగేసుకుంటున్నాడు. ఖమ్మం నుంచి 50 లారీల వడ్లు హన్మకొండ జిల్లాకు వచ్చాయి. వాటిని ఇతర మిల్లుకు అదికారులు కేటాయించారు. అయినా వాటిని తన మిల్లులకు మళ్లించుకున్నాడు. ఇంత వరకు బాగానే వుంది. కాని ఖమ్మం జిల్లానుంచి వచ్చిన వడ్లలలో సుమారు 2వేల బస్తాలు మాయం చేశాడు. తప్పుడు లెక్కలు చూపించాడు. వడ్లు తీసుకొని, బియ్యం చేసే సరఫరాకు పెద్ద తేడాను తెలివిగా చూపించాడు. ఇది అధికారులు గమనించారు. దాంతో ఖమ్మం అధికారులు వెంటనే అలెర్టయ్యారు. ఇక్కడ ఖమ్మం జాయింట్ కలెక్టర్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించారు. ఖమ్మం జిల్లా నుంచి పంపిన సన్నాల బస్తాల మీద తూకం రాయించారు. అక్కడ జగన్ దొరికిపోయారు. ఇచ్చిన సన్నాలుకు, జగన్ మిల్లులనుంచి వెళ్లిన బియ్యానికి పొంతన లేదు. దాంతో కమీషనర్ కార్యాలయానికి సమాచారం అందించి, ఖమ్మం జిల్లా జాయింట్ కలెక్టర్ నోటీసులు జారీ చేశారు. ఏఏ మిల్లు ఎంత మోసం చేసిందనే విషయాన్ని జాయింట్ కలెక్టర్ స్పష్టంగా నోటీసులో పేర్కొన్నారు. అవి వసూలు చేస్తున్నారు. ఇలా సివిల్ సప్లైయ్‌ని పుష్కర కాలంగా మోసం చేస్తూ వస్తున్న జగన్ కిలాడీ వేషాలు అనేకం వున్నాయి. ఆయన చేస్తున్న ఘనకార్యాలు తక్కువేం కాదు. రైతులు తెచ్చే వడ్లకు ట్రక్ షీట్ల పేరుతో ప్రభుత్వం రవాణ చార్జీలు చెల్లిస్తుంది. అలా ప్రతి సీజన్‌లో కొన్ని మండలంలోని రైతులందరికీ ఆ సొమ్ము చేరాలి. కాని జగన్ ఆ వడ్లకు సంబందించిన ట్రక్ షీట్ల పేరుతో వచ్చే సొమ్మును మింగేస్తుంటాడు. ఆ సొమ్ము వెలల్లోనో, లక్షల్లోనో కాదు, ఏకంగా కోట్లలో వుంటుంది. అలా రైతులకు రావాల్సిన రవాణ ఖర్చులు మొత్తం తనఖాతాలోనే వేసుకుంటాడు. రైతుల చేత మాత్రం సంతాకాలు తీసుకుంటుంటుంటాడు. ఇలా ప్రతిసీజన్‌లో కోట్ల రూపాయల గోల్ మాల్ చేస్తున్నాడు. జిల్లాలో అందరికీ అందాల్సిన సన్నాలన్నింటినీ ఈసారి సివిల్ సప్లై అదికారులు జగన్ మిల్లులకే అప్పగిస్తున్నారు. మిగతా మిల్లర్లకు మొండి చేయి చూపిస్తున్నారు. అయినా ఆ మిల్లులను సక్రమంగా నడిపిస్తున్నాడా? అంటే అదీ లేదు. సహజంగా బాయిల్డ్ మిల్లులకు నీటి శుద్ద ప్లాంట్లు వుంటాయి. జగన్‌కు చెందిన మిల్లులకు కూడా వున్నాయా? అంటే వున్నాయన్నట్లు వున్నాయి. అవి పనిచేస్తున్నాయా? అంటే తూతూ మంత్రంగా పనిచేస్తాయి. కాని వాటి పనితీరుపై అధికారుల పర్యవేక్షణ ఎప్పుడూ వుండదు. కాని అంతా బాగుందనే అదికారులు రిపోర్టులిస్తుంటారు. మరి నిజమేనా? అని ఆరా తీసేవారే లేకుండాపోయారు. బాయిల్డ్ మిల్లులో వడ్లు ఉడకపెట్టడానికి పెద్దఎత్తున నీటిని వినియోగిస్తారు. ఆ నీటిలో కొన్ని కెమికల్స్ కూడా మిక్స్ చేస్తారు. వడ్లను ఉడకపెడుతుంటారు. ఆ తర్వాత ఆ నీళ్లను బైటకు వదిలేస్తారు. అలా బైటకు పంపే నీరు ఎంతో దుర్గంధంతో వుంటుంది. ముక్కు పుటాలు అదిరిపోయేంత ధుర్గంధం వెదజల్లుతుంది. అలాంటి నీటిని మిల్లు పరిసరాల్లో వుండే నీటి శుద్ది ప్లాంటులోకి పంపించాలి. ఆ నీటిని శుద్ధి చేసి, బైటకు వదిలేయాలి. కాని జగన్‌కు చెందిన మిల్లుల నుంచి వెలువడిన ఆ నల్లని రంగుతో, దుర్గంధంతో కూడిన నీటిని మిల్లుల వెనక నుంచి వెళ్లే సాగు నీటి కాలువలో కలిపేస్తున్నారు. ఇది కొన్ని సంవత్సరాలుగా సాగుతోంది. కాని అదికారులు అటు వైపు వెళ్లరు. చూడరు. మిల్లుపై చర్యలు తీసుకోరు. ఎందుకంటే మిల్లుల వెనక నుంచి సాగు నీటి కాలువ వెళ్తుందని వాళ్లకు తెలుసు. ఆ కాలువలోకి జగన్‌కు చెందిన మిల్లుల నీరు వెళ్లి ఆ కాలువలో చేరుతుందని తెలుసు. కాలువలో నీరంతా కలుషితమైపోతుందని తెలుసు. ఆ కాలువ ద్వారా వెళ్తున్న కెమికల్‌తో కూడిన మురుగునీరు పక్కనే వున్న చెరువులో చేరుతుందని తెలుసు. ఆ మిల్లుల వ్యర్దాల నీరు చెరువులోకి చేరడం వల్ల చేపలు చనిపోతున్నాయని తెలుసు. ఆ చెరువు నుంచి మరో చెరువుకు అదే నీరు వెళ్లి చేరుతుందని తెలుసు. అయినా అదికారులు కదిలింది లేదు. మిల్లుల మీద చర్యలు తీసుకున్నది లేదు. సరే ఇరిగేషన్ శాఖ అంటే పట్టించుకోలేదు. కాని పర్యావరణానికి హనీ కలిగే ఏ సంస్ధనైనా నిర్ధాక్షిణ్యంగా నిలిపివేసే శక్తి, హక్కు వున్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చేస్తుందనేది కూడా ప్రశ్నగా మిగిలిపోయింది. ఒక రోజో, రెండు రోజులో కాదు, నెలలు అసలే కాదు. ఏకంగా సంవత్సరాల తరబడి ఆ మిల్లులనుంచి వ్యర్ధాలన్నీ సాగు నీటి కాలువలోకి పంపిస్తున్నారు. పర్యావరణం పాడౌతోంది. నీరు కాలుష్యమైపోతోంది. మిల్లుల పరిసరాల్లో పెద్దఎత్తున దుర్గంధం వెదజల్లబడుతోంది. కాని అధికారులు ముక్కు మూసుకుంటున్నారు. అప్పుడప్పుడు మిల్లుల తనిఖీకి వచ్చినప్పుడు కళ్లు కూడా మూసుకుంటున్నారు. మిల్లుల్లో వుండాల్సిన నీటి శుద్ది ప్లాంటు కళ్లముందు పని చేయడం లేదని కనిపిస్తున్నా..బాగుందనే రిపోర్టు రాసేస్తుంటారు. పక్కనే సాగు నీటి కాలువను తొంగి కూడా చూడరు. అందులో కలుస్తున్న నీటిని పట్టించుకోరు. ఇలా వ్యవస్ధలను, అధికారులను గుప్పిట్లో పెట్టుకొని చేయాల్సినన్ని దర్మార్గాలు జగన్ చేస్తున్నాడు. జాయింట్ కలెక్టర్ ఏం చేయగలడని కూడా తోటి మిల్లర్ల ముందు సవాలు కూడా విసురుతుంటాడని విశ్వసనీయ సమాచారం. మరి ఇప్పుడు సెలవులు ముగించుకొని జాయింట్ కలెక్టర్ వస్తున్నారు. ఇప్పటికైనా జగన్ మీద చర్యలు తీసుకుంటారా? జగన్ చేసిన వ్యాఖ్యలు నిజం చేస్తారా? అన్నది వేచి చూడాలి.
మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో దోస్తు రెండవ విడతఅడ్మిషన్లు ప్రారంభమైనాయని ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక బృందం పరిసర గ్రామాలలో పర్యటించి విద్యార్థులను మరియు వారి తల్లిదండ్రులను కలిసి కళాశాలలో గల కోర్సుల వివరాల ను మరియు కళాశాల యొక్క వసతులను వివరించారు కళాశాలలో గల గ్రూపులు బిఎస్సి, ఎంపీసీ ,బీజేపీ , బి కం కంప్యూటర్ అప్లికేషన్ ,కోర్సులు గలవు అదే విధంగా టైలరింగ్ నేర్పబడును అని కళాశాల ప్రిన్సిపాల్ టి జీవన్ కుమార్ తెలిపారు.
దేవేందర్ పటేల్, కేటీఆర్ సేన సోషల్ మీడియా జిల్లా అధ్యక్షుడు
భూపాలపల్లి నేటిధాత్రి
టేకుమట్ల మండలం లోని అంకుషాపూర్ సోమనపల్లి గ్రామ పురాతనమైన ఎంతో విశిష్టత మహిమ కలిగిన శ్రీ అభయాంజనేయ ఆలయం శిథిల అవస్థలో ఉండడం వలన ఉమ్మడి గ్రామాల ప్రజలు అభివృద్ధి కమిటీ వేసుకొని, ఆ కమిటీ ద్వారా శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం దేవాలయాన్ని పునః ప్రతిష్ట చేయడం జరిగింది, మూడు రోజులు అంగరంగ వైభవంగా మే 31 వ రోజు నాడు గణపతి పూజతో ప్రారంభమై అయి జూన్ 1వ తారీకు నాడు విగ్రహాలను జల నివాసం చేయడం జరిగింది, జూన్ రెండో తారీకు శ్రీ అభి ఆంజనేయ స్వామి విగ్రహం, ధ్వజస్తంభం గణపతి సుబ్రహ్మణ్యస్వామి నవగ్రహాలు ప్రతిష్టించడం జరిగింది, మూడు రోజులు పాటు సోమనపల్లి అంకుషాపూర్ ఉమ్మడి గ్రామ ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి ఈ మహోన్నతమైన కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. మూడు రోజులు మహా అన్నదానం ఆలయ కమిటీ వారు నిర్వహించడం జరిగింది, శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి కమిటీ కి దేవేందర్ పటేల్ కేటీఆర్ సేన జిల్లా అధ్యక్షుడు భూపాలపల్లి 10,116 రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది, ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నందికొండ రామ్ రెడ్డి, పెంట రమేష్, పెద్దోజు రమణాచారి మీసేవ, పోతన వేన ఐలయ్య, అబ్బేంగుల శ్రీకాంత్, తిరుపతి రెడ్డి, పెద్దోజు భీష్మాచారి మంద రాజయ్య, నందికొండ రమాకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
మాజీ ఎమ్మెల్సీ ,తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షులు అలుగుబెల్లి నర్సిరెడ్డి
సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)
ఈరోజు సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో మాజీ ఎమ్మెల్సీ ,తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షులు అలుగుబెల్లి నర్సిరెడ్డి, మాట్లాడుతూ విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని,ప్రభుత్వ పాఠశాల లను బలోపేతం చేయాలని,ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించాలని మాజీ ఎమ్మెల్సీ ,తెలంగాణ పౌరస్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షులు అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు.ప్రభుత్వ బడులు నిలబడాలి- చదువుల్లో అంతరాలు పోవాలి అనే నినాదం తో తెలంగాణ పౌరస్పందన వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ సిరిసిల్ల చేరుకున్నారు.ఈ సందర్బంగా ఆయన తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించుకోవలసిన బాధ్యత ప్రభుత్వం తో పాటు ప్రజలపై కూడా ఉందన్నారు.ప్రాథమిక పాఠశాలలో ప్రి ప్రైమరీ తరగతులను ప్రారంభించాలని,తరగతి గదికి ఒక ఉపాధ్యాయున్ని నియమించాలని, పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో పొరస్పందన వేదిక ఉపాధ్యక్షురాలు మంగ,కార్యవర్గ సభ్యులు నాగమణి,టి.ఎస్ యూ.టీ.ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధర్మన మూర్తి, టి.ఎస్.యూ.టీ.ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గోల్కొండ శ్రీధర్,జిల్లా ప్రధాన కార్యదర్శి జంగిటి రాజు,జిల్లా ఉపాధ్యక్షుడు గుండమనేని మహేందర్ రావు,కోశాధికారి అంబటి రమేష్,కార్యదర్శులు పాముల స్వామి,కొత్వాల్ ప్రవీణ్,తిరుపతి జాదవ్, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర బాధ్యులు సి రామరాజు ,జిల్లా అధ్యక్షులు సిలువేరి సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తొర్రూరు మున్సిపల్ కార్యాలయంలో నూతన వాహనాల ప్రారంభోత్సవం..
నేటి ధాత్రి
తొర్రూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి గారు నూతన వాహనాలను పచ్చజెండా ఊపి ప్రారంభించారు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ.. తొర్రూరు పట్టణం శుభ్రంగా, అభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు మున్సిపల్ వాహనాల కొత్త సదుపాయం ఎంతో అవసరం. ప్రభుత్వ సహకారంతో మున్సిపల్ కార్యాలయానికి అందిన ఈ వాహనాలు — ప్రత్యేకించి కచ్రా వాహనాలు, వాటర్ ట్యాంకర్లు, ఇతర ఉపయుక్త వాహనాలు — పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలను అందించేందుకు తోడ్పడతాయి..
పట్టణంలోని పారిశుద్ధ్య పరిరక్షణ, డ్రైనేజ్ నిర్వహణ, తాగునీటి సరఫరా వంటి అంశాల్లో ఇవి కీలక పాత్ర పోషించనున్నాయి. ప్రజలకు మెరుగైన సేవలందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మున్సిపల్ వ్యవస్థను శక్తివంతం చేస్తోంది..
అలాగే, మున్సిపల్ సిబ్బంది సమర్థంగా పనిచేస్తే పట్టణ వాతావరణం శుభ్రంగా, ఆరోగ్యంగా మారుతుంది. ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా సహకరించాలని నేను కోరుతున్నాను..
ఈ కార్యక్రమంలో కమిషనర్, స్థానిక ప్రజాప్రతినిధులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ సీనియర్ నాయకులు, పట్టణ నాయకులు, అధికారులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు..
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.