భూసమస్యల సత్వర పరిష్కారం కొరకై భూభారతి సదస్సులు.

భూ సమస్యల సత్వర పరిష్కారం కొరకై భూభారతి సదస్సులు.

#తహసిల్దార్ ముప్పు కృష్ణ.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

 

భూ సమస్యల సత్వర పరిష్కారం కోసమే గ్రామాలలో భూభారతి రెవిన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తహసిల్దార్ ముప్పు కృష్ణ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని అర్షణ పల్లి, రాంపూర్ గ్రామాలలో భూ భారతి రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేయగా రైతుల నుండి పలు సమస్యలపై 162 దరఖాస్తులను తహసిల్దార్ ముప్పు కృష్ణ నేరుగా స్వీకరించడమైనది అనంతరం ఆయన మాట్లాడుతూ. రైతుల నుండి వచ్చిన ప్రతి దరఖాస్తును రిజిస్టర్ లో నమోదు చేసుకొని దరఖాస్తుల ఆధారంగా రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో విచారణ జరిపి భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారన్నారు. ఈనెల 3 నుండి 20 వరకు మండలంలోని అన్ని గ్రామాలలో రెవిన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని ప్రజలు సదస్సులో పాల్గొని తమ భూ సమస్యలపై దరఖాస్తులు ఇవ్వాలని కోరారు. అలాగే సాదా బైనామా, వారసత్వం, డిజిటల్ సంతకం పెండింగ్, దేవుని పట్టా, మిస్సింగ్ సర్వే నెంబర్, విస్తీర్ణ సవరణ మొదలైన సమస్యలపై పరిష్కారం దిశగా భూభారతి పనిచేస్తుందని దానికి అనుగుణంగా రైతులు రెవెన్యూ సిబ్బందికి సహకరించి తగు సమయంలో వారి భూ సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట మార్కెట్ కమిటీ మెంబర్ జ్యోతి, రెవిన్యూ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.

బీరప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం.

బీరప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

శ్రీ బీరప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ ఆహ్వనము.ఆత్మీయ భక్తజనులకు మరియు గ్రామ ప్రజలకు విజ్ఞప్తి ఏమనగా తేది: 04-06-2025, ఉ 9.00 గం॥లకు రోజున శ్రీ జీరప్ప స్వామి ఊరేగింపు,శ్రీ బీరప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపన మరియు హోమం కార్యక్రమము జరుగును, కావున భక్తులందరు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామి గారి కృపకు పాత్రుల కాగలరని మనవి కార్యక్రమం అనంతరం అన్నప్రసాదం ఏర్పాటు చేయనైనది.
అందరూ ఆహ్వానితులే…ఆహ్వానించువారు
గొల్లకురుమ సంఘం గ్రా॥ కక్కెడ వాడ, మం: ఝరాసంగం, జిల్లా, సంగారెడ్డి.

ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలి.

ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలి

విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందించిన పిడి ఎస్ యు నాయకులు

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

 

 

మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా విద్యాహక్కు చట్టంతో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజు నియంత్రణ చట్టం అమలుకై చర్యలు చేపట్టాలని మంచిర్యాల జిల్లా విద్యాశాఖ అధికారికి పిడి ఎస్ యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మంగళవారం వినతిపత్రం అందించారు.ఈ సందర్భంగా పిడి ఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.శ్రీకాంత్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 12వ తేదీ నుండి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుంది.ఇప్పటికీ ప్రభుత్వ విద్యాసంస్థల్లో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించలేకపోయారు. ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు ఎలాంటి కృషి కూడా చేయడం లేదు.విద్యార్థులు లేరనే సాకుతో రెండువేల ప్రభుత్వ పాఠశాలల మూసివేతకు ప్రభుత్వం పూనుకుంటుంది.అలాగే కార్పొరేట్,ప్రైవేట్ పాఠశాలల్లో యాజమాన్యాలు ముందస్తు అడ్మిషన్లు చేస్తూ విచ్చలవిడిగా పాఠశాలలను నెలకొల్పుతూ అధిక ఫీజులను వసూలు చేస్తున్నారు.విద్యాహక్కు చట్టం అమలుకు నోచుకోవడం లేదు.ఏ ఒక్క పాఠశాలల్లో కూడా చట్టం ప్రకారం పేద విద్యార్థులకు 25% ఉచిత అడ్మిషన్లు ఇవ్వడం లేదని మండిపడ్డారు.కనీసం విద్యాశాఖకు మంత్రిని కూడా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజు నియంత్రణ కొరకు ఈ ఏడాదే ఫీజు నియంత్రణ చట్టం అమలు చేస్తామని ప్రకటించి మరోపక్క యాజమాన్యాలు ముందుస్తు ఫీజులు వసూలు చేస్తున్నప్పటికిని ఇంకా కాలయాపన చేస్తున్న పరిస్థితి నెలకొంది.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ప్రగశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడి ఎస్ యు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది.లేని యెడల రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో పిడి ఎస్ యు జిల్లా ఉపాధ్యక్షులు పి.సికిందర్,కార్తీక్,పాల్గొన్నారు.

కల్వల ప్రాథమిక పాఠశాల లో బడిబాట.

కల్వల ప్రాథమిక పాఠశాల లో బడిబాట

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కల్వల బడి బాట కార్యక్రమం ను మంగళవారం కల్వల సమీపంలో గల బావోజీ తండ లో విజయవంతంగా నిర్వహించడం జరిగింది. బడి బాట కార్యక్రమం లో భాగంగా రోడ్ ప్రక్కన వ్యవసాయ పని చేస్తున్న గ్రామ ప్రజలను కలిసి, ప్రధానోపాధ్యాయులు కళ్లెం వీరారెడ్డి ప్రభుత్వ పాఠశాల పై ప్రభుత్వ తీసుకుంటున్న కార్యక్రమాల గురించి వివరిస్తూ, రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు మంచి భవిష్యత్తు తో పాటు, ఉద్యోగ,ఉపాధి అవకాశాల ల్లో ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుంది అని నొక్కి వక్కానించారు. అవసరమయితే సుదూర ప్రాంత తండా పిల్లలకు పాఠశాలకు రావడానికి ఇబ్బంది పడుతున్నందున వారికి రవాణా నిమిత్తము ప్రభుత్వం రవాణా సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు ,స్వరూప ,క్రిష్ణ, శ్రీదేవి, మోహనకృష్ణ ,తండ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

అనుమతి పత్రాలు లేని 8 ఇసుక ట్రాక్టర్ల పై కేసులు నమోదు.

అనుమతి పత్రాలు లేని 8 ఇసుక ట్రాక్టర్ల పై కేసులు నమోదు.

ఎస్ఐ జి శ్రవణ్ కుమార్.

చిట్యాల, నేటి ధాత్రి :

 

 

చిట్యాల మండల కేంద్రంలో ఎటువంటి అనుమతి పత్రాలు లేని కాల్వపల్లి, అందుకు తండా, నేరేడుపల్లి గ్రామాలకు చెందిన ఎనిమిది ఇసుక ట్రాక్టర్ల పై కేసు నమోదు చేసి ఎమ్మార్వో ముందు ఉంచగా, ఎమ్మార్వో వాటిపై జరిమానా విధించిన తర్వాత వాటిని వదిలివేయడం జరిగింది
ఇకముందు ఎవరైనా అనుమతి పత్రాలు లేకుండా ఇసుక అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని చిట్యాల ఎస్సై జి శ్రవణ్ కుమార్ తెలిపారు,
అలాగే మైనర్ డ్రైవింగ్ చేస్తే ఓనర్ పై కూడా కేసు నమోదు చేస్తామని, వాహనాలకు తప్పకుండా నంబర్ ప్లేట్లు ఉండాలని డ్రైవర్లకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని తెలిపారు.

భూ సమస్యల పరిష్కారానికి గొప్ప వేదిక భూభారతి చట్టం…

భూ సమస్యల పరిష్కారానికి గొప్ప వేదిక భూభారతి చట్టం…

రెవెన్యూ గ్రామ సభలను రైతులు వినియోగించుకోవాలి…

జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు, 18 మండలాలు, 288 రెవెన్యూ గ్రామాలు…

నేటి నుండి ప్రారంభమైన రెవెన్యూ సదస్సులు…

జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్…

నేటి ధాత్రి – మహబూబాబాద్ :-

 

 

భూ సమస్యల పరిష్కారానికి గొప్ప వేదిక భూభారతి నూతన రెవెన్యూ చట్టం అని, రెవెన్యూ గ్రామసభలను భూ సమస్యలు ఉన్న రైతులు వినియోగించుకోవాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు.మంగళవారం జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన భూభారతి రెవెన్యూ చట్టం – 2025,రెవెన్యూ గ్రామసభలను ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని రెవెన్యూ గ్రామాలలో నిర్వహించారు.అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ,రాష్ట్రవ్యాప్తంగా పైలెట్ ప్రాజెక్టులో భాగంగా దంతాలపల్లి మండలంలో ఇప్పటికే రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగిందని తెలిపారు.జిల్లాలో రెండు బృందాలుగా రెవెన్యూ సిబ్బందిని నియమించి
ఉదయం 9 నుండి 4 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు.ఇప్పటికే స్థానిక తహసీల్దారులు పూర్తిస్థాయిలో సంబంధిత రెవెన్యూ గ్రామాలలో ప్రచారం నిర్వహించి ప్రజలను చైతన్య పరిచినట్లు తెలిపారు.మహబూబాబాద్, సింగారం, నెల్లికుదురు మండలం, వావిలాల రెవెన్యూ గ్రామాలలో జరుగుతున్న సదస్సులను పరిశీలించారు.ప్రభుత్వం సూచించిన ప్రకారం రెవెన్యూ గ్రామసభలను పక్కాగా నిర్వహించాలని దరఖాస్తుదారులకు ముందస్తు ఫారాలను ఇవ్వాలని వారి యొక్క దరఖాస్తులను పరిశీలించి స్వీకరించాలన్నారు.సదస్సులలో ప్రత్యేక హెల్ప్ డిస్కులను ఏర్పాటు చేయాలన్నారు.

Farmers

 

 

వాటి ద్వారా దరఖాస్తుదారులకు తగు సూచనలు చేస్తూ దరఖాస్తులను పూరించుటకు సహకరించాలన్నారు.జిల్లా వ్యాప్తంగా ప్రతీ రోజు వచ్చిన దరఖాస్తుల స్థితిగతులను పరిశీలించి ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు.అదనపు కలెక్టర్ రెవెన్యూ కె. వీరబ్రహ్మచారి కురవి మండలం తిరుమలపురం, మొగిలిచర్ల, రెవెన్యూ గ్రామాలలో జరుగుతున్న సదస్సులను పరిశీలించారు.ప్రజలకు అనువైన ప్రదేశాలు గ్రామపంచాయతీ, రైతు వేదికలు,తదితర ప్రదేశాలలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలతో రెవెన్యూ సదస్సుల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు పక్కా ప్రణాళికతో సదస్సులు నిర్వహిస్తూ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

భూ సమస్యల సత్వర పరిష్కారం కొరకే రెవెన్యూ సదస్సులు.

భూ సమస్యల సత్వర పరిష్కారం కొరకే రెవెన్యూ సదస్సులు

– తహసిల్దార్ జాలీ సునీత
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

 

భూ సమస్యల సత్వర పరిష్కారం కోసమే గ్రామాలలో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు మొగుళ్లపల్లి తహసిల్దార్ జాలీ సునీత తెలిపారు. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ఆకినపల్లి మరియు పోతుగల్ గ్రామాలలో రెవెన్యూ సదస్సులను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన తహసిల్దార్ సునీత రైతుల నుండి నేరుగా దరఖాస్తులను స్వీకరించి..రిజిస్టర్ లో నమోదు చేశారన్నారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో విచారణ జరిపి భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారన్నారు. ఈనెల 3 నుండి 20 వరకు మండలంలోని అన్ని గ్రామాలలో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నామని, ప్రజలు రెవెన్యూ సదస్సులలో పాల్గొని తమ భూ సమస్యలపై దరఖాస్తు ఇవ్వాలని సూచించారు. అలాగే నేడు గురువారం మండలంలోని రంగాపురం మరియు అంకుషాపురం గ్రామాలలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్న రెవెన్యూ సదస్సులలో ఆయా గ్రామాల ప్రజలు పాల్గొని భూములకు సంబంధించి ఎటువంటి సమస్య ఉన్న వారు వారి దగ్గర ఉన్న ఆధారాలతో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రైతులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని తహసీల్దార్ జాలీ సునీత సూచించారు. ఈ కార్యక్రమంలో డిఏఓ రంగా, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆర్ రామకృష్ణ మరియు రెవెన్యూ సిబ్బంది, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

ప్రభుత్వం ఇచ్చిన వడ్లు తీసుకోకుండా ప్రైవేటుగా వడ్లు తీసుకొని బియ్యం.

ప్రభుత్వం ఇచ్చిన వడ్లు తీసుకోకుండా ప్రైవేటుగా వడ్లు తీసుకొని బియ్యం చేసే మిల్లులపై కఠిన చర్యలు

పౌర సరఫరాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డి.ఎస్. చౌహాన్

వనపర్తి నేటిధాత్రి:

వనపర్తి జిల్లా, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉన్న రైస్ మిల్లులు సగానికి పైగా డిఫాల్ట్ అయి ఉండటం ధాన్యం సేకరణకు ప్రధాన సమస్యగా మారిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డి.ఎస్. చౌహాన్ అన్నారుమంగళవారం ఉదయం వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఐ.డి. ఒ సి. సమావేశ మందిరంలో వరి కొనుగోలు పై వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లా అధికారులు, మిల్లర్లు ఐ.కే.పి, పి. ఎ.సి.ఎస్ కొనుగోలు కేంద్రాల సమీక్ష సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రటరీ డి.ఎస్. చౌహాన్, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి నాగర్ కర్నూల్ వనపర్తి అదనపు కలెక్టర్లు పాల్గొన్నారు.ఈ సమీక్షలో ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడుతూ వరి కొనుగోలు విషయంలో రాష్ట్రంలో ఎక్కడా లేని సమస్య నాగర్ కర్నూల్ వనపర్తి జిల్లాల్లో వస్తుందని అన్నారు. దీనికి ప్రధాన కారణం వనపర్తి జిల్లాలో 184 రైస్ మిల్లులు ఉండగా సగానికి పైగా డిఫాల్ట్ అయి ధాన్యం తీసుకోవడంలో దూరంగా ఉండటం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారున్నాగర్ కర్నూల్ జిల్లాలో సైతం సగానికి పైగా మిల్లులు డిఫాల్ట్ అయ్యాయన్నారువనపర్తి జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి అయితే మిల్లింగ్ చేయడానికి మిల్లులు లేకపోతే
బియ్యం ఎవరు చేస్తారని మిల్లర్ల ను ప్రశ్నించారు తాత్కాలికంగా గోదాముల్లో నిల్వ చేసినప్పటికీ అంతిమంగా తిరిగి మిల్లులకు చేయాల్సిందేనని
స్పష్టం చేశారు.ప్రభుత్వం నుండి వడ్లు తీసుకోకుండా గట్టిగా ప్రైవేట్ వడ్లు తీసుకొని మిల్లింగ్ చేస్తున్న డిఫాల్ట్ మిల్లుల పై చర్యలు కఠినంగా ఉంటాయని మిల్లర్లను హెచ్చరించారు.
మిల్లర్ల సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ నిబంధనల ప్రకారం నాణ్యమైన వడ్లు మిల్లుకు రాకపోవడం వల్ల క్వింటాలుకు 67 కిలోలు రావాల్సిన బియ్యం 62 కిలోలు మాత్రమే వస్తుందని, తద్వారా మిల్లరు నష్టపోతున్నారని ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి తెచ్చారు సమీక్షలు పాల్గొన్న వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ జిల్లాలో అత్యధికంగా రైతులు వరి పండిం చారని అన్నారు.జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ వనపర్తి అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, నాగర్ కర్నూల్ అదనపు కలెక్టర్ అమరేందర్, వనపర్తి సివిల్ సప్లై అధికారి విశ్వనాథ్, డి.యం లు, జిల్లా అధికారులు, మిల్లర్లు, ఐ.కే.పి, పి. ఎ.సి.ఎస్ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ లు తదితరులు పాల్గొన్నారు.

తాహసిల్దార్ కు గౌడ కులస్తుల సన్మానం.

తాహసిల్దార్ కు గౌడ కులస్తుల సన్మానం

ఇబ్రహీంపట్నం. నేటిధాత్రి

 

 

మండల కేంద్రంలోని మండల తాహసిల్దార్ కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన బిఎస్ఎస్ వరప్రసాద్ ను గౌడ కులస్తులు సాల్వతో ఘనంగా సత్కరించారు. గ్రామాల్లో నెలకొన్న గౌడ కులస్తుల సమస్యలను తాహసిల్దార్ కు వివరించారు. ఇబ్రహీంపట్నం మండల పరిధిలో ఏ గ్రామంలో నైతే గౌడ కులస్తులకు ఐదు ఎకరాల భూమి లేదు వాటిని గుర్తించి వారికి అందజేయాలని విజ్ఞప్తి చేశారు. భూ సమస్యలు నెలకొన్న వాటిని భూభారతిలో పరిష్కారం చేసి గౌడ కులస్తుకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం జిల్లా నాయకులు చెట్ల చంద్రశేఖర్ గౌడ్, చర్ల పళ్లి సత్యనారాయణ గౌడ్, సీనియర్ న్యాయవాది కట్ట నరస గౌడ్ మండల నాయకులు నేరెళ్ల సుభాష్ గౌడ్, భూసారపు సాయిరాం గౌడ్, కట్ట ఆంజనేయులు గౌడ్ పలు గ్రామాల గౌడ సంఘాల నాయకులు, ఎలుక అశోక్ గౌడ్, కుంట రాజగౌడ్, గంగా నరసయ్య గౌడ్, రాంప్రసాద్ గౌడ్, నారాయణ గౌడ్, రాజేశ్వర్గౌడ్, శంకర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, రామ్ కిషన్ గౌడ్, రఘు గౌడ్, అంజయ్య గౌడ్, రాములు, కిషన్ తదితరులు పాల్గొన్నారు.

బీసీ ఎస్సీ ఎస్టీ రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలి.

బీసీ ఎస్సీ ఎస్టీ రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలి

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

బిసి ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా కన్వీనర్ కొత్తూరు రవీందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన యుద్ధంలో రెడ్డి రావులకు అమృత అధికారం వస్తే బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకు విషాంధకారం లభించింది ఈ అశుభ సందర్భంలో తెలంగాణ అమరవీరుల స్థూపాలపై “తెలంగాణలో బలైపోయిన అమరవీరులంతా బీసీ ఎస్సీ ఎస్టీ” లు- “అధికారంలోకి వచ్చిందంట అగ్రకుల దొరలు” అనే రెండు లైన్లు అని భూపాలపళ్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అమరవీరుల స్తూపం వద్ద రాయడం జరిగిందన్నారు ఇప్పటికైనా బీసీ ఎస్సీ ఎస్టీ సమాజం మేల్కొని బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీలో అంతర్భాగమై 93 శాతం ఉండేటువంటి బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యాన్ని సాధించుకోవాలని అన్నారు
ఈ కార్యక్రమంలో కాసగాని దేవేందర్ గౌడ్ ,హాబీబ్ పాషా కండే రవి, పుల్ల అశోక్, పర్ల పెళ్లి కుమార్ ,నేరెళ్ల రమేష్ ,కోరళ్ళ శ్యామ్, రవీందర్ బోయిని ప్రసాద్, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు

గోవధ చేసే వారిని కఠినంగా శిక్షించాలి.

గోవధ చేసే వారిని కఠినంగా శిక్షించాలి.

భాజపా మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్.

నల్లబెల్లి నేటి ధాత్రి:

బక్రీద్ పండుగ పురస్కరించుకొని గోవధ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్ అన్నారు మంగళవారం మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ చంద్రయ్య కు మండల పరిధిలో గోమాత హత్యలు చేస్తే చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మండల పార్టీ తరఫున వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వినయ్ గౌడ్ మాట్లాడుతూ మండల పరిధిలో ఉన్నటువంటి వివిధ గ్రామాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి గో అక్రమ రవాణాలను నివారించాల్సిందిగా అదేవిధంగా గోమాత హత్యలను అరికట్టే విధంగా పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి ఈర్ల నాగరాజు, కోశాధికారి మురికి మనోహర్, నాయకులు వల్లే పర్వతాలు, కొండ్లె రమేష్, కౌడగాని రాజేందర్, తిమ్మాపురం శివ తదితరులు పాల్గొన్నారు.

ఓపెను జిమ్ కొరకు ప్లేస్ పరిశీలన కమిటీ సభ్యుల సమావేశం.

ఓపెను జిమ్ కొరకు ప్లేస్ పరిశీలన కమిటీ సభ్యుల సమావేశం.

కల్వకుర్తి/ నేటిదాత్రి :

 

 

 

 

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలోని యోగ గ్రూప్ సభ్యులు ప్రభుత్వ పాఠశాల ఆవరణలో రోజు వాకింగ్ మరియు ఎక్ససైజ్ చేస్తుంటారు. అందులో భాగంగా పాఠశాల ఆవరణలో చివరిలో’ ఓపెన్ జిమ్ ఉంటే బాగుంటుందని గత నెల రోజుల క్రితం ఆనంద్ కుమార్, కల్వకుర్తి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, ఆర్యవైశ్యుల పట్టణ అధ్యక్షులు వాస శేఖర్ దృష్టికి తీసుకెళ్లారు. దానిని పాఠశాల యొక్క ప్రధానోపాధ్యాయురాలు తో మాట్లాడి కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తో చర్చించి “ఓపెన్ జిమ్”మంజూరు చేయించినట్లు తెలిసినది. ఇందులో భాగంలోనే మంగళవారం పాఠశాల ఆవరణలో స్థలాన్ని పరిశీలించినారు.

సొంత ఇంటి కల నెరవేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం..

సొంత ఇంటి కల నెరవేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

 

తంగళ్ళపల్లి మండలం.

నరసింహులపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోసి ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుపేదలకు సొంతింటి కలను నెరవేరుస్తున్న ఏకైక ప్రభుత్వంతెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అని .

ఇందుకుగాను. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజల అభివృద్ధి కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి. గత ప్రభుత్వం.

ఎన్నో ప్రాజెక్టు ల. పేరిట. అప్పులు.చేసిన కూడా. వాటిని కట్టుకుంటూ. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు. ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తున్న. మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని

ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిన. జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డికి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి.

మంత్రి పొన్నం ప్రభాకర్ కి. ఆది శ్రీనివాస్ కి. సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ.నియోజవర్గ ఇన్చార్జి కాంగ్రెస్ పార్టీ నాయకులు కేకే మహేందర్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు.

అలాగే ఇంటి నిర్మాణంలో పూర్తి సహకారం ప్రభుత్వం అందిస్తుందని నిర్మాణాలకు ఇసుక ఉచితంగా సరఫరా ప్రభుత్వమే చేస్తుందని లబ్ధిదారుల ఇందిరమ్మ ఇండ్ల పనులు వేగవంతం చేసుకుంటూ.

ఇల్లు నిర్మాణం చేపట్టి పనులు వేగవంతంచేసి ఇందిరమ్మ ఇంటి సహకారం ఇందిరమ్మ కలను సహకారంచేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్ రూమ్ పేరిట ప్రజల సొమ్ము దోచుకున్నారని ప్రజా ప్రభుత్వంలో ఇప్పటి ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ప్రజా పరిపాలనలో.

అటువంటి వాటికి తావు లేకుండా ఉంటుందని

ఈ సందర్భంగా తెలియజేశారు ఈ సందర్భంగా లబ్ధిదారులు అధికారులకు నాయకులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపిన లబ్ధిదారులు అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇట్టి కార్యక్రమంలో తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్. ఏఎంసి వైస్ చైర్మన్.

నేరెళ్ల నరసింహం గౌడ్. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి.

సత్తు శ్రీనివాస్ రెడ్డి. ఏం సి డైరెక్టర్ పరశురాములు. కాంగ్రెస్ పార్టీ మండల బీసీ సెల్ అధ్యక్షులు మల్లేశం యాదవ్.

కాంగ్రెస్ పార్టీ నాయకులు కటకం రాజశేఖర్. జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ. తిరుపతి. కిషన్. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

సిరిసిల్ల పురపాలక సంఘం 100 రోజుల కార్యచరణ ప్రతిజ్ఞ.

సిరిసిల్ల పురపాలక సంఘం 100 రోజుల కార్యచరణ ప్రతిజ్ఞ

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

సిరిసిల్ల పట్టణ కేంద్రం లోని పురపాలక సంఘం సిరిసిల్ల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక ను ఈరోజు అమరవీరుల స్థూపం వద్ద ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో 100రోజుల కార్యాచరణ ప్రతిజ్ఞ ద్వారా ప్రారంభించుకోవడం జరిగింది.అదే విధంగా అమరవీరుల స్థూపం నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు అవగాహన ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.   

ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా జూన్ 2 నుంచి సెప్టెంబర్ 9 వరకు పట్టణం లోని పురపాలక సంఘం ద్వారా జరిగే అభివృద్ధి కార్యక్రమాలలో పురోగతి సాధించుటకు ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.ఈ యొక్క 100రోజుల కార్యాచరణ లో శానిటేషన్, ఇంజనీరింగ్, రెవెన్యూ, పట్టణ ప్రణాళిక మరియు మెప్మా విభాగాలు ప్రణాళిక బద్ధంగా కార్యక్రమాలు ఉండడం వల్ల ప్రతి విభాగం అభివృద్ధిలో పాలు పంచుకోవడం జరుగుతుంది అని ప్రజలు కూడా మాకు సహకరించి సిరిసిల్ల పట్టణాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పట్టణ ప్రజలకు తెలియజేయడం జరిగినది.

దత్తత తీసుకున్న కృషి విజ్ఞాన కేంద్రం వారు.

అడవి శ్రీరాంపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్న కృషి విజ్ఞాన కేంద్రం వారు

ముత్తారం :- నేటి ధాత్రి

 

 

 

 

 

ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామంలో జరిగిన రైతు అవగాహన సదస్సులో పాల్గొన్న రామగిరికృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు. డాక్టర్. ఏ శ్రీనివాస్ హెడ్ కెవికె. డాక్టర్ అర్చన ఎస్ఎంఎస్ అనిమల్ హస్బండ్రీ. డాక్టర్. నీరజన్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఐ సి ఏ ఆర్ హైదరాబాద్. ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ. ఐటి శాఖ మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆదేశానుసారం ఈ అడవి శ్రీరాంపూర్ గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా రైతులకు సాధారణంగా ఎప్పుడు వేసి వరి పంట కాకుండా ఇతర కూరగాయలు . మరియు చిరుధాన్యాలు పప్పు దినుసుల పంటలు సాగు చేస్తూ రైతులు మంచి లాభాలు ఆర్జించి ఆర్థికంగా ఎదగాలని మరియు పెరటి కోళ్ల పెంపకం. పౌల్ట్రీ ఫార్మ్స్ ద్వారా. మరియు గొర్రెలు, ఆవులు, బర్రెలు. పెంచి వాటి ద్వారా ఆర్థికంగా రైతు లాభం పొందవచ్చని ఈ సందర్భంగా రైతులకు శాస్త్రవేత్తలు పలు సూచనలు సలహాలు చేయడం జరిగింది. అలాగే ఈ గ్రామాన్ని మూడు సంవత్సరాలు దత్తత తీసుకోవడం జరుగుతుందని శాస్త్రవేత్తలు శ్రీనివాస్ తెలియచేశారు ఈ కార్యక్రమంలో ఏఈఓ శ్రీలేఖ , సెక్రటరీ మల్లేశ్వరి, విద్యా కమిటీ చైర్మన్ చిగురు స్రవంతి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొడ్డ బాలాజీ, సింగల్ విండో డైరెక్టర్ పోతు పెద్ది రమణారెడ్డి.రైతులు మహిళా రైతులు పాల్గొనడం జరిగింది.

ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ.

తొర్రూరు మండలంలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ ఇది నిజమైన ఇందిరమ్మ రాజ్యం అంటూ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు.

తొర్రూరు (డివిజన్) నేటి ధాత్రి:

 

ప్రభుత్వం పేదల సంక్షేమానికి అంకితమై పనిచేస్తున్నదని పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి గారు స్పష్టం చేశారు. తొర్రూరు మండల కేంద్రంలోని ఆర్&బి గెస్ట్ హౌస్ లో నిర్వహించిన ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే గారు స్వయంగా ఇండ్ల స్థలాల పట్టాలను అందజేశారు..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి యశస్విని రెడ్డి గారు మాట్లాడుతూ.. ఇది నిజమైన ఇందిరమ్మ రాజ్యం. ఇక్కడ ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతోంది. ఇంటి కోసం ఎదురు చూస్తున్న పేదలకు ఈ పట్టాలు వారి కలలను సాకారం చేస్తున్నాయి. తలదాచుకునే చోటు కలిగిన ప్రతి కుటుంబం సమాజంలో గౌరవంతో బతికే అవకాశం పొందుతుంది, అని పేర్కొన్నారు..

అలాగే, రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఆశ్రయమైన ఇంటిని కల్పించడంలో ఎంతగానో కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఇది కేవలం పట్టా కాదు, పేదల భవిష్యత్తుకి బలమైన బునియాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తలదాచుకునే ఇంటి కోసం భూమిని, నిర్మాణానికి ఆర్థికసహాయాన్ని అందిస్తోంది, అని వివరించారు..

కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, పట్టణ నాయకులు, పార్టీ సీనియర్ నాయకులు, లబ్ధిదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పట్టాలు అందుకున్న లబ్ధిదారులు తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు.

ఇన్నేళ్లుగా అద్దె ఇంట్లో జీవితం గడిపాం. ఇప్పుడు మా కుటుంబానికి ఓ గౌరవం వచ్చినట్టు ఉంది,” అంటూ ఒక లబ్ధిదారుడు ఆనందంతో చెప్పారు..

పట్టాల పంపిణీ అనంతరం, ఎమ్మెల్యే గారు అధికారులతో మాట్లాడి మండలంలో పథకాల అమలు, నిర్మాణ పనుల పురోగతిపై అడిగి తెలుసుకున్నారు..

సీజనల్ వ్యాధుల అవగాహన.

*సీజనల్ వ్యాధుల అవగాహన. * *

డాక్టర్ నాగరాణి .

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి .

 

 

 

*మొగుళ్ల పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ నాగరాణి ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది మరియు ఆశ కార్యకర్తలకు సీజనల్ వ్యాధులకు సంబంధించిన సమావేశం నిర్వహించడం జరిగినది .ఈ సందర్భంగా డాక్టర్ నాగరాణి మాట్లాడుతూ వేసవికాలం పూర్తి కాలేదు ఎండలు బాగా ఉండటంవల్ల వడదెబ్బ తలిగే అవకాశం ఉన్నందున ప్రజలను అప్రమత్తం చేయాలని అదేవిధంగా వర్షాలు కూడా అధికముగా పడడం వల్ల నీరు నిల్వ ఉండి దోమలు పెరిగి మలేరియాl, డెంగ్యూ ,చికెన్ గున్యా లాంటి వ్యాధులు ప్రభలే అవకాశం ఉన్నందున వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ప్రజలకి తగిన సూచనలు ఇవ్వాలని వైద్యాధికారి తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు సునీత, జమున, హెల్త్ అసిస్టెంట్ బిక్షపతి ఏఎన్ఎంలు ఆశాలు పాల్గొన్నారు

గ్రామ గ్రామానికి నాణ్యత మైన విత్తనాల పంపిణీ.

గ్రామ గ్రామానికి నాణ్యత మైన విత్తనాల పంపిణీ
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి 
https://youtu.be/lZAh9MZCMGM?si=gwWCHvLV1oSiHtzR
     
  భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన రైతు నేస్తం (ఎపిసోడ్-56) కార్యక్రమానికి శ్రీ. నునావత్ వీరు నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి గారు, శ్రీ.. నేరెళ్ళ రమేశ్, ADA, భూపాలపల్లి , శ్రీ. బైరి రాజు, PJTAU శాస్త్రవేత్త  మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక లో  రైతు నేస్తం కార్యక్రమంలో శ్రీ. బి. గోపి, డైరెక్టర్ ఒఫ్ అగ్రికల్చర్          శ్రీ.ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య, వైస్ ఛాన్సలర్, PJTAU గారు ప్రసంగం చేయడం జరిగింది,  వానాకాలనికి అనువైన సన్న వరి ధాన్యం రకాల గురుంచి చర్చించడం జరిగింది, వాతావరణ ఆధారిత వానాకాల  వ్యవసాయం పై రైతులకు సలహా ఇవ్వడం జరిగింది, అలాగే “నాణ్యమైన విత్తనం” నిర్వహణపై చర్చించడం జరిగింది,  రైతు నేస్తం కార్యక్రమంలో శ్రీ. ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య, వైస్ ఛాన్సలర్, PJTAU గారు మరియు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్యవిద్యాలయ శాస్త్రవేత్తలు ఆయా రైతు వేదికల ద్వారా “గ్రామ గ్రామానికి నాణ్యమైన విత్తనం”  అనే కార్యక్రమంలో భాగంగా రైతులకు నాణ్యమైన విత్తన కిట్లను పంపిణీ చేయడం జరిగింది.   మొగుళ్ళపల్లి మండలానికి సంబంధించి “గ్రామ గ్రామానికి నాణ్యమైన విత్తనం”  అనే కార్యక్రమంలో  వరి రకం WGL-962 మరియు పెసర రకం MGG-385 అనే విత్తనాలను పంపిణీ చేయడం జరిగింది. ఇట్టి “గ్రామ గ్రామానికి నాణ్యమైన విత్తన పంపిణీ” కార్యక్రమంలో శ్రీ. నునావత్ వీరు నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి , శ్రీ.. ఎన్. రమేశ్, ADA, భూపాలపల్లి గారు, శ్రీ. బైరి రాజు, PJTAU శాస్త్రవేత్త, స్థానిక మండల వ్యవసాయ అధికారి, పి. సురేందర్ రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు పాల్గొనడం జరిగింది.

అడ్డంగా నిలువు దోపిడి…

అడ్డంగా నిలువు దోపిడి…

బయట మార్కెట్లో కొన్న పుస్తకాలకు నో ఫర్మిషన్…

ప్రభుత్వ పాఠ్యాంశాలను మాత్రమే బోధించాలన్న నిబంధనలకు తూట్లు…

జిల్లా వ్యాప్తంగా ప్రయివేట్, కార్పొరేట్ యాజమాన్యం సిండికేట్…

పాఠశాలల్లోనే స్టేషనరీ బహిరంగంగానే అమ్మకాలు..

యూనిఫాం,బెల్ట్,బ్యాడ్జీలు, షూ అన్నీ వారి వద్దే…

ఒక్కో విద్యార్థి నుంచి రూ.15 వేలకు పైగా వసూలు…

పెద్ద తరగతి విద్యార్థి నుంచి రూ. 20 వేలకు పైగా వసూలు…

మెంటనేన్స్ షరా మామూలే…

అడ్డంగా నిలువు దోపిడీ నోరు మెదపని విద్యాశాఖ…

జిల్లాలో అధికారుల పర్యవేక్షణ కరువు..

నిర్దిష్టమైన ఫిర్యాదులు అందలేదని సాకులు చెబుతూ తప్పించుకుంటున్న అధికారులు…

జిల్లా వ్యాప్తంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి…

నేటి ధాత్రి –

 

 

 

 

గార్ల :-పాఠ్య పుస్తకాల నుంచి సాక్సుల వరకు విద్యార్థులకు ఏది అవసరమైనా మా దగ్గరే కొనాలి..! లేకుంటే అనుమతించేది లేదు..,అంటూ ప్రయివేటు, కార్పొరేట్ విద్యా సంస్థలు హుకుం జారీ చేస్తున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ముక్కుపిండి అడ్డంగా దోచుకుంటున్నాయి. ప్రతీది వారి వద్దే కొనాలని షరతులు విధిస్తున్నారు. విద్యాశాఖ అధికారులకు తెలిసినప్పటికీ కనీస చర్యలు తీసుకోవడం లేదు. తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కనీసం పాఠశాలలను పరిశీలించిన దాఖలాలు కూడా లేవు. పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలకు గంపగుత్తగా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి వేలకు వేలు వసూలు చేస్తున్నారు. వారు నిర్ణయించిందే ధర. వర్క్ పుస్తకాలు..,నోటు పుస్తకాలు.., డ్రాయింగ్ బుక్స్..,అంటూ బహిరంగ మార్కెట్ కంటే రెండింతలు వసూలు చేస్తున్నారు. అయినా విద్యాశాఖ నోరు మెదపడం లేదు. తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు.
జిల్లా వ్యాప్తంగా ప్రయివేట్, కార్పొరేట్ యాజమాన్యం సిండికేట్..,
జిల్లా వ్యాప్తంగా ప్రైయివేటు, కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యం సిండికేటై దోపిడికి తెగబడుతున్నాయి. పుస్తకాల నుంచి సాక్సుల వరకు విద్యార్థులకు ఏది అవసరమైన మా దగ్గరే కొనాలి…! అంటూ హుక్కుం జారీ చేస్తున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులను బహిరంగంగానే పీల్చి పిప్పి చేస్తున్నాయి. వారు చెప్పిందే ధర. బయట మార్కెట్ లో కొన్న పుస్తకాలకు నో పర్మిషన్.., లేకుంటే క్లాస్ లో నుమతించేది లేదని తెగేసి చెప్తున్నాయి. ఇంత జరుగుతున్నా జిల్లా విద్యాశాఖ అధికారులు కళ్లకు కనిపించడం లేదు. తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రైయివేటు, కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యం సిండికేటై పాఠశాలలో విక్రయిస్తున్న స్టేషనరీ ధరలు ఇలా ఉన్నాయి. యూని ఫాం (ఒకజత) రూ.1500 నుంచి రూ.3000, బెల్ట్ రూ.150 నుంచి 200, టై రూ.100, బ్యాగు రూ.600 నుంచి రూ. 800, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ రూ. 4000 నుంచి రూ.6000 వరకు విక్రయినున్నారు. ఇవి చాలదన్నట్లు వర్క్ బుక్ ల పేరుతో రూ.2000 నుంచి రూ.5000 వరకు వసూలు చేస్తున్నారు. ఇలా ప్రతీది ఇక్కడే కొనాలన్న నిబంధనలు విధిస్తున్నారు. విద్యాశాఖ అధికారులకు తెలిసినప్పటికి కనీస చర్యలు తీసుకోకుండా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గుర్తింపు పొందిన పాఠశాలల్లో ప్రభుత్వ పాఠ్యాంశాలను మాత్రమే బోధించాలి. దీనికి సంబంధించి వారి విద్యార్థుల సంఖ్యను బట్టి ప్రభుత్వ మండల విద్యాధికారి అనుమతి ద్వారా పాఠ్యపుస్తకాలు తెప్పించుకోవాలి. ఆ రేట్లకే అవసరాన్ని బట్టి తల్లిదండ్రులు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ పాఠ్యపుస్తకాలకు, నోటు పుస్తకాలకు గంపగుత్తగా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల విద్యార్ధుల తల్లిదండ్రుల నుంచి నగదు వసూలు చేస్తున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి పాఠశాలల యాజమాన్యాలు వేలాది రూపాయల ఫీజుల భారం మోపుతున్నాయి. అడ్మిషన్ ఫీజు, బిల్డింగ్ ఫీజు, కంప్యూటర్ ల్యాబ్, ట్యూషన్, స్పోర్ట్, స్పెషల్ డేస్, కమ్యూ నికేషన్ ప్రోగ్రాం ఫీజులంటూ ఇప్పటికే వేలాది రూపాయలు వసూలు చేస్తున్న యాజమన్యాలు మళ్లీ పుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫాం, షూ అంటూ అందిన కాడికి అందినంత దోచుకుంటున్నాయి.

కనిపించని మౌళిక వసతులు….!

Government Subjects.

 

 

జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు నడుస్తున్నాయి. పూర్తిస్థాయి మౌలిక వసతులున్న పాఠశాలలను వేళ్లమీదే లెక్కపెట్ట వచ్చు. పలు పాఠశాలల్లో మౌలిక వసతులు లేవు. విద్యార్థులకు సరిపడా ఆటస్థలాల కొరత, తరగతి గదుల కొరత ఉంది. అయినప్పటికీ, అధికారులు మాత్రం ఆ వైపు కన్నెత్తి చూసిన పాపాన పోవటం లేదన్న విమర్శలు వినపడుతున్నాయి. ఇలా అరకొర వసతులతో పాఠశాలలు నిర్వహిస్తున్నా ఫీజుల వసూళ్లలో మాత్రం పోటీపడి మరీ వసూలు చేస్తున్నాయి. ఇది చాలదన్నట్లు పుస్తకాల దోపిడీ అదనంగా ఉంటోంది. పెద్ద తరగతులకు నోటు పుస్తకాల ఖర్చు కాస్త ఎక్కువగా ఉంటుందనుకున్నా..,గరిష్టంగా రూ.1500 మించి ఉండదు. అన్ని కలిపి పదో తరగతికి కూడా రూ.2 వేలు పుస్తకాల ఖర్చు సరిపోతుంది. అయితే ప్రైవేటు పాఠశాలలు ఇష్టానుసారంగా పుస్తకాల ధరల వసూలు చేస్తుండగా, పెద్ద తరగతులకు రూ.8 వేలు నుంచి రూ.10 వేలవరకు వసూలు చేస్తున్నాయి. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడడం లేదు. తమ పిల్లల్ని ఎక్కడ వేధిస్తారోననే భయంతో తల్లిదండ్రులు ప్రశ్నించడం మానేశారు. ఇది ఆసరాగా చేసుకున్న ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల నిర్వహకులు దోపిడీని పెంచారు.

విద్యాశాఖ అధికారుల తనిఖీలు నిల్…!

వాస్తవానికి ప్రభుత్వ విద్యాశాఖ నిబంధనల ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాల అమ్మకాలు నిషేధం. విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేసి పుస్తకాల అమ్మకాలను అడ్డుకోవాల్సి ఉంది. ఆయా పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయి. అయితే విద్యాసంస్థల నిర్వా హకులు బహిరంగానే పుస్తకాల ధరలను ప్రకటిస్తున్నాయి. ఏ తరగతికి ఎంత చెల్లించాలి? నోట్ పుస్తకాలకు ఎంతా?, బెల్టుషూ వంటిది ఎంతా?.. ధరలు నిర్ణయించి వసూలు చేస్తు న్నాయి. ప్రతి వస్తువు కొనుగోలుకు రసీదు ఇవ్వాలన్న నిబంధన తూట్లు పొడిచి తెల్లకాగితంపై రేట్లు వేసి దోచుకుంటున్నారు. బహిరంగ మార్కెట్ తో పోల్చితే ఈ ధరలు రెట్టింపు స్థాయిలో ఉంటాయి. నిర్దిష్ట గడువు నిర్ణయించి పుస్తకాలు కొనుగోలు చేయాలని లేకుంటే క్లాస్ లోకి అనుమతించేది లేదని చెబుతున్నాయి. ఇవేమీ అధికారులకు కనిపించడం లేదు. నిర్దిష్టమైన ఫిర్యాదులు అందలేదని సాకులు చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ప్రైవేటు పాఠశాల దోపిడీ యధేచ్ఛగా సాగుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారో లేదో వేచిచూడాల్సిందే.

యమపాశాలుగా 11 కెవి విద్యుత్ వైర్లు.

యమపాశాలుగా 11 కెవి విద్యుత్ వైర్లు

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

11 కె.వి విద్యుత్ వైర్ పంట పొలాలలో యమ పాశాలుగా తయారయ్యాయి. ఈ మేరకు నిజాంపేట మండలంలోని నస్కల్ గ్రామంలో గ్రామానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో 11 కె.వి విద్యుత్ తీగలు కిందకి వేలాడుతున్నాయి. ఈ సందర్బంగా బాధితుడు మాట్లాడుతూ.. ప్రమాదం ఏ విధంగా సంభవిస్తుందో తెలియని పరిస్థితి ఉందన్నారు. కింది నుండి చేయి చాచితే చేయికి వైర్లు తగులుతున్నాయన్నారు. ఈ విషయమై విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడంలేదని వాపోయారు. దీని పై సంబంధిత అధికారులు చొరవ చూపి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version