సమంత బోల్డ్ ఫోటోలు వైరల్ మతి పోవాల్సిందే.!

సమంత బోల్డ్ ఫోటోలు వైరల్… మతి పోవాల్సిందే !

 

నేటిధాత్రి:

 

 

 

 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. భర్త విడాకులు ఇచ్చినప్పటికీ ఒంటరి జీవితాన్ని గడుపుతూ తన లైఫ్ ను లీడ్ చేస్తోంది సమంత. హీరోయిన్ గా, అలాగే నిర్మాతగా.. బిజినెస్ మ్యాన్ గా దూసుకు వెళ్లోంది సమంత. దాదాపు 14 సంవత్సరాలుగా టాలీవుడ్ ໐໕໖ (Tollywood Industry) .

అయితే అలాంటి సమంత.. తాజాగా దుబాయ్ లో (Dubai ) పర్యటించారు. ఈ సందర్భంగా దుబాయ్ అందాలను ఆస్వాదిస్తూ సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను పంచుకుంటున్నారు. దాదాపు మూడు రోజుల నుంచి సమంత దుబాయ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడికి ఓ ఖరీదైన హోటల్లో దిగిన సమంత.. ఎడారి దిబ్బలు, నైట్ లైఫ్, ఇలా అన్ని ఎంజాయ్ చేస్తోంది.

ఇక తాజాగా స్విమ్మింగ్ పూల్ లో స్విమ్ చేస్తూ ఓ బోల్డ్ ఫోటోను పంచుకుంది. బ్లాక్ డ్రెస్ లో స్నానం చేస్తూ కనిపించింది. ఈ ఫోటోలను స్వయంగా సమంత పంచుకోవడంతో వైరల్ గా మారింది. ఈ ఫోటోలు చూసిన ఆమె ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఏం అందం రా బాబు.. అంటూ సమంతను పొగుడుతున్నారు. ఇది ఇలా ఉండగా 2021 లో అక్కినేని నాగచైతన్య- సమంత విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.

నితిన్ ‘తమ్ముడు’ నుంచి హీరోయిన్ పోస్టర్ రిలీజ్.

నితిన్ ‘తమ్ముడు’ నుంచి హీరోయిన్ పోస్టర్ రిలీజ్.. ట్రైబల్ యువతిగా ఆకట్టుకుంటున్న లుక్

 

నేటిధాత్రి

 

 

 

 

యంగ్ హీరో నితిన్ (Nithin) రీసెంట్గా ‘రాబిన్ హుడ్’ (Robin Hood) సినిమాతో మనముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీగా బోల్తా కొట్టింది. ప్రస్తుతం నితిన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘తమ్ముడు’ (Thammudu). శ్రీరామ్ వేణు(Sriram Venu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు (Dil Raju) నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో లయ(Laya), స్వశిక (Swashika), వర్ష బొల్లమ్మ(Varsha Bollamma), సౌరభ్ సన్దేవా (Sourabh Sachdev) కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రానికి అజనీష్ లోక్నాథ్ (Ajaneesh Loknath) సంగీతం అందించారు.

 

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మూవీ టైటిల్తో వస్తున్న ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ చిత్రం జులై 25న గ్రాండ్గా థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా నుంచి ఓ హీరోయిన్ పోస్టర్ను రిలీజ్ చేశారు మూవీ టీమ్. ఈ సినిమాలో ‘కాంతార’ (Kanthara) నటి సప్తమి గౌడ (Sapthami Gouda) కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. నేడు సప్తమి బర్త్డే కావడంతో ఆమెకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త పోస్టర్ను పంచుకున్నారు. ఈ ఫొటో చూస్తుంటే.. ట్రైబల్ యువతిగా సప్తమి కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.

ఇండస్ట్రీలో పనిగంటలపై చర్చ రానా దగ్గుబాటి కీలకవ్యాఖ్యలు.

ఇండస్ట్రీలో పనిగంటలపై చర్చ.. రానా దగ్గుబాటి కీలకవ్యాఖ్యలు

 

నేటిధాత్రి:

 

 

 

 

ఇటీవల పని గంటలపై జరుగుతున్న చర్చలు చిత్ర పరిశ్రమకు కూడా వ్యాపించాయి. ‘స్పిరిట్’ (Spirit) సినిమా నుంచి దీపికా పదుకొణె (Deepika Padukone) వైదొలగడంతో ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో నటుడు రానా దగ్గుబాటి (Rana Daggubati) తనదైన శైలిలో స్పందించారు. పని సంస్కృతి, ఆర్థిక పరిస్థితులపై చర్చలు అనవసరమని, నిరంతర సాధన, కృషే పని జీవితానికి నిజమైన విలువని అన్నారు. భారత్ ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశమని, అధిక సామర్థ్యం, ఎక్కువ పని గంటలు దేశ అభివృద్ధికి అవసరమని పేర్కొన్నారు.

సినీ పరిశ్రమలో పని గంటలు ప్రాజెక్ట్ను బట్టి మారతాయని రానా వివరించారు. “భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం. తలసరి ఆదాయంలో మన ఆర్థిక వ్యవస్థ 186వ స్థానంలో ఉంది. తెలుగు సినీ పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్కు మారినప్పుడు వందలమంది కుటుంబాలతో వలస వచ్చారు. నా దృష్టిలో అది కేవలం పని కాదు, జీవనశైలి. ప్రతి ప్రాజెక్టు, దానిలో పనిచేసే వ్యక్తులను బట్టి పని గంటలు మారతాయి” అని అన్నారు.

 

మహారాష్ట్రలో 12 గంటల షిఫ్ట్ విధానం, తెలుగు పరిశ్రమలో 8 గంటల షిఫ్ట్ సాధారణమన్నారు. అయితే షూటింగ్ షెడ్యూల్లు లొకేషన్, సెట్, స్టూడియో వంటి అంశాలపై ఆధారపడతాయని రానా వివరించారు. “మహారాష్ట్రలో ఉదయం 9 గంటలకు షూటింగ్ మొదలవగా, తెలుగులో 7 గంటలకే ప్రారంభమవుతుంది. సెట్ సన్నద్ధత, లొకేషన్ ఎంపిక వంటివి సులభమైనవి కావు. దేశంలో 70-80% మంది రోజువారీ సంపాదన వంద రూపాయలే. ఈ విషయాలను సూక్ష్మంగా చూడాలి” అని ఆయన అన్నారు.

నటులు సెట్ లో ఎక్కువ సమయం గడపడానికి బలవంతంగా ఒత్తిడి ఉంటుందనే వాదనపై రానా స్పందిస్తూ.. “ఎవరూ బలవంతంగా ఉండమని చెప్పరు. సినిమా ఒక వృత్తి. ఒత్తిడి చేయడం జరగదు. ఇందులో పనిచేయాలనుకుంటే చేయొచ్చు. అది వ్యక్తిగత ఎంపిక. కొంతమంది నటులు 4 గంటలు మాత్రమే పనిచేస్తారు, అది వారి విధానం” అని పేర్కొన్నారు.

కొరియన్ స్టార్లా ఉన్నావంటూ నెటిజన్ల కామెంట్స్.

*40 ఇయర్స్ ఏజ్లో ఆ విషయంలో గట్టి పోటీ ఇస్తున్న పవన్ కళ్యాణ్ బ్యూటీ.. కొరియన్ స్టార్లా ఉన్నావంటూ నెటిజన్ల
కామెంట్స్*

నేటిధాత్రి

 

 

 

అలనాటి స్టార్ హీరోయిన్ శ్రియ శరణ్ (Shriya Saran) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. కెరీర్ స్టార్టింగ్లో ట్రెడిషనల్గా ఆకట్టుకున్న ఈ భామ.. ‘మల్లన్న'(Mallanna) సినిమాతో బోల్డ్ రెచ్చిపోయింది. దీంతో ఈ అమ్మడు పై నెగిటివిటీ రావడమే కాకుండా ట్రోలింగ్ కూడా పెద్ద ఎత్తున చేశారు. అంతేకాకుండా అప్పటి నుంచి అవకాశాలు రావడం చాలా వరకు మానేశాయి. దీంతో చేసేది ఏమి లేక ఇండస్ట్రీకి దూరం అయింది.

ఇక కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రజెంట్ ఈ ముద్దుగుమ్మకు ఒక పాప ఉంది. నిత్యం తన ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలు, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. కాగా ఈ బ్యూటీ ప్రస్తుతం రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉంది. ఇదిలా ఉంటే.. నిత్యం సామాజిక మాధ్యమాల్లో తన గ్లామర్తో పిచ్చేక్కిస్తుంది ఈ అమ్మడు. 42 సంవత్సరాల్లోనూ యంగ్ హీరోయిన్స్కి అందం విషయంలో మంచి ఫిజిక్ను మొయిన్ టైన్ చేస్తూ గట్టి పోటీ ఇస్తుంది.

 

ఈ క్రమంలో శ్రియ శరన్ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా శ్రియ తన ఇన్స్టా వేదికగా కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో సిల్వర్ కలర్ ట్రెండింగ్ డ్రెస్లో మెస్మరైజ్ చేసింది. హాట్ హాట్ స్టిల్స్తో నెట్టింట రచ్చ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారగా.. నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కొరియన్ స్టార్లాఉన్నావని, బ్యూటిఫుల్, సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

బ్లాక్ డ్రెస్లో మతిపోగొడుతున్న టాలీవుడ్ హీరోయిన్.

బ్లాక్ డ్రెస్లో మతిపోగొడుతున్న టాలీవుడ్ హీరోయిన్.. వావ్ సూపర్ అంటున్న నెటిజన్లు

 

నేటిధాత్రి:

 

 

 

ఊహలు గుసగుసలాడే (Oohalu Gusagusalade) సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా (Rashi Khanna) మనందరికీ సుపరిచితమే. తన ఫస్ట్ మూవీతోనే ఈ బ్యూటీ యూత్ క్రష్గా మారిపోయింది. తన అందం, అభినయంతో కుర్రాళ్లను ఫిదా చేసింది. దీంతో ఈ భామకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వరుస సినిమాల్లో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నది.

ప్రజెంట్ ఈ అమ్మడు తెలుగులో స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ (Sidhu Jonnalagadda) సరసన ‘తెలుసు కదా'(Telusu Kada) మూవీలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్ (Bollywood)లోనూ వెబ్ సిరీస్, ఐటెం సాంగ్స్ చిందులేస్తూ ఉంది. ఓ పక్క సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ మరో పక్క నిత్యం సోషల్ మీడియా (Social Media)లో యాక్టీవ్గా ఉంటూ తన గ్లామర్ తో హీట్ పుట్టించడంతో పాటు ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా పెంచుకుంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

తాజాగా రాశి ఖన్నా తన ఇన్స్టాగ్రామ్(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో బ్లాక్ కలర్ డ్రెస్సులో దర్శనమిచ్చింది. కళ్లకు కాటుక పెట్టుకోవడంతో ఈ ముద్దుగుమ్మ మరింత అందంగా కనిపించింది. అలాగే వైట్ తెర వెనుక నిలబడి ఫొటోస్కి స్టిల్స్ ఇచ్చింది. అంతేకాకుండా వాటికి.. ‘బయట అంతా మంచు, లెక్కించదగ్గ చోటంతా నిప్పు’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ ఫొటోలు కాస్తా నెట్టింట వైరల్గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు వావ్ సూపర్ ఉన్నావు అని కామెంట్స్ చేస్తున్నారు

చైతన్య గుర్తులను ఒక్కొక్కటిగా చెరిపేస్తున్న సమంత..

చైతన్య గుర్తులను ఒక్కొక్కటిగా చెరిపేస్తున్న సమంత.. గుడ్ డెసిషన్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్

 

నేటిధాత్రి:

 

 

 

స్టార్ హీరోయిన్ సమంత (Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ‘ఏమాయ చేసావే’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఈ మూవీలో హీరోగా నటించిన అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya)తో ప్రేమలో పడింది. అలా కొన్నేళ్లు ప్రేమించుకున్న వీరు పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ, మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకొని దూరంగా ఉంటున్నారు. విడాకుల తర్వాత నాగచైతన్య రీసెంట్గా స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ (Shobhitha Dhulipala)తో డిసెంబర్లో రెండో పెళ్లి చేసుకున్నాడు.

సమంత మాత్రం విడాకుల తర్వాత మయోసైటీస్ (Myositis) అనే వ్యాధి బారిన పడడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. హెల్త్ పై ఫోకస్ పెట్టింది. కాగా ప్రజెంట్ నిర్మాతగా మారి ‘శుభం’ (Shubham) సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. తన ఫస్ట్ మూవీతోనే ప్రొడ్యూసర్గా సక్సెస్ అయింది. ఇదిలా ఉంటే తాజాగా సమంతకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. సామ్ మెడపై వైఎమ్సి (YMC) అనే టాటూ ఉంటుంది.

తన మొదటి సినిమా ‘ఏ మాయ చేశావే’ గుర్తుగా ఆ టాటూ వేయించుకుంది సమంత. గౌతమ్ మీనన్ (Gowtham Menon) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నాగ చైతన్య హీరోగా నటించాడు. ఇక ఈ వైఎమ్సి టాటూ గురించి పలు ఇంటర్వ్యూల్లోనూ సమంత చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ వీడియోలో సమంత మెడ పై టాటూ ఎక్కడా కూడా కనిపించకపోవడంతో ఆమె ఫ్యాన్స్ గుడ్ డెసిషన్ తీసుకున్నావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై సామ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

పూజా హెగ్దే ఎమోషనల్ కామెంట్స్.

చాలా బాధగా ఉంది.. ఇదొక చేదు వార్త.. పూజా హెగ్దే ఎమోషనల్ కామెంట్స్

 

నేటిధాత్రి

 

 

ఒక లైలా కోసం’ (Oka Laila Kosam) మూవీలో నాగ చైతన్య (Naga Chaitanya) సరసన నటించిన పూజా హెగ్దే(Pooja Hegde)..

తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అంతేకాకుండా యూత్ మనసులో క్రష్ అయిపోయింది.

దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి.

అలా వచ్చిన చిత్రాలన్నిటిలో నటించి మెప్పించింది.

ఇక అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటించిన ‘అల వైకుంఠపురంలో’ (Ala Vaikuntapuramlo) సినిమాలోని ‘బుట్టబొమ్మ’ (Butta Bomma) సాంగ్తో మరింత ఫేమ్ తెచ్చుకుంది.

అయితే అప్పట్లో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి అలరించిన ఈ బ్యూటీకి సడెన్గా వరుస ప్లాప్స్ రావడం స్టార్ట్ అయ్యాయి.

దీంతో ఐరన్ లెగ్ బిరుదుతో పాటు సినిమా చాన్స్లు కరువయ్యాయి.

దీంతో కొన్ని నెలలు సినిమాలకు దూరం అయిన ఈ బ్యూటీ రీసెంట్గా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Surya) నటించిన ‘రెట్రో’ (Retro) మూవీతో మన ముందుకు వచ్చి ఓకే ఓకే అనిపించుకుంది.

ప్రస్తుతం దళపతి విజయ్ (Vijay) హీరోగా నటిస్తున్న ‘జన నాయగన్’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

ప్రజెంట్ ఈ మూవీ షూటింగ్ జెట్ స్పీడ్తో జరుగుతుంది.

ఇక పొలిటికల్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

ఈ క్రమంలో తాజాగా పూజా హెగ్దే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది.

ఆమె మాట్లాడుతూ..

‘ఈ మధ్య కాలంలో నేను నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నిరాశపరుస్తున్నాయి.

కొన్నాళ్లుగా నా లైఫ్ లో విజయం అనే పదానికి అర్థం మారిపోయింది.

కానీ నాకు ఈ టైం చాలా ఇంపార్టెంట్..

భవిష్యత్తులో నేను చేసే సినిమాలు నేను ఎలాంటి నటిని అనేది ప్రేక్షకులకు చూపిస్తాయని అనుకుంటున్నా..

సినీ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన నాలాంటి వాళ్లు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు..

వారు ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నా కానీ నేను సాధించాల్సింది చాలా ఉంది.

అందరి జీవితంలో హెచ్చుతగ్గులు కచ్చితంగా ఉంటాయి.

మేము నటులం ఫ్లాప్లను కూడా స్వీకరించాలి.

‘బీస్ట్'(Beast) సినిమా తర్వాత ఇప్పుడు ‘జన నాయగన్’ (Jana Nayagan) సినిమాలో నటించడం ఆనందంగా ఉంది.

కానీ ఇది విజయ్ చివరి చిత్రం అవ్వడం ఒకింత బాధగా అనిపిస్తుంది.

నా దృష్టిలో ఇదొక చేదు వార్త.

ఎందుకంటే నాతో పాటు చాలా మంది అభిమానులు విజయ్ సినిమాల్ని ఇష్టపడతారు.

ఒకప్పుడు ఆయన సినిమాల కోసం ఎదురు చూసేవాళ్ళం’ అంటూ చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం పూజా హెగ్దే చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

విజయ్ సేతుపతి సినిమాకు వెరైటీ టైటిల్ ఫిక్స్.!

పూరి జగన్నాథ్- విజయ్ సేతుపతి సినిమాకు వెరైటీ టైటిల్ ఫిక్స్..?

ఇది అస్సలు ఊహించలేదుగా అంటూ కామెంట్స్

 

నేటిధాత్రి:

 

 

 

 

 

స్టార్ డైరెక్టర్ పూరిజగన్నాథ్(Poori Jagannath) ప్రస్తుతం హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi)తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఎప్పటిలానే హీరోయిన్ ఛార్మి (Charmy)తో కలిసి ఈ సినిమాను ఆయన తెరకెక్కిస్తున్నారు. ఇక హీరోయిన్స్ బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే (Radhika Abde), టబు(Tabu)లాంటి బ్యూటీస్ నటిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాకు ‘బెగ్గర్’ (Beggar) అనే టైటిల్ అనుకుంటున్నారని ఇన్ సైడ్ టాక్ కూడా నడుస్తోంది. ఈ క్రమంలో పూరిజగన్నాథ్ ఈ చిత్రం కోసం ఇప్పుడు ఓ వెరైటీ టైటిల్ను ఖరారు చేశారని తెలుస్తుంది. వివరాలోకి వెళితే..

పూరి జగన్నాథ్ విజయ్ సేతుపతి సినిమాకు ‘భవతీ భిక్షాందేహి’ (Bhavathi Bhikshandehi) అనే టైటిల్ను పరిశీలిస్తున్నారట. అయితే సాధారణంగా పూరి సినిమాలకు ‘ఇడియట్’, ‘పోకిరి’, ‘లోఫర్’, ‘రోగ్’ ఇలా వెరైటీ టైటిల్స్ ఉంటాయన్న విషయం విదితమే. ఈ క్రమంలోనే ఇప్పుడు భవతి భిక్షాందేహి అనే టైటిల్ అనుకుంటున్నారట. ఈ న్యూస్ తెలిసి పూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతుండగా.. నెటిజన్లు ఇది అసలు ఊహించలేదుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

నేడే విస్తరణ.

నేడే విస్తరణ.

 

 

నేటిధాత్రి

 

 

 

 

 

ఆదివారం మధ్యాహ్నం 12.19 గంటలకు రాజ్‌భవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. మంత్రివర్గంలో ఆరు ఖాళీలు ఉండగా.. అన్నీ కాకుండా ప్రస్తుతానికి పాక్షికంగా మాత్రమే భర్తీ చేయనున్నారు.

మధ్యాహ్నం 12.19కు రాజ్‌భవన్‌లో ప్రమాణం

ఆరు ఖాళీల్లో.. మూడు మాత్రమే భర్తీచేసే అవకాశం

బీసీ, ఎస్సీ వర్గాలకే మంత్రివర్గ విస్తరణ పరిమితం!

బీసీల నుంచి వాకిటి శ్రీహరికి క్యాబినెట్‌ బెర్తు పక్కా

ఎస్సీల్లో మాల, మాదిగలకు ఒక్కొక్కరి చొప్పున..

మాల సామాజివర్గం నుంచి జి.వివేక్‌కు చాన్స్‌

మాదిగల్లో కవ్వంపల్లి, అడ్లూరి లక్ష్మణ్‌లలో ఒకరికి!

ఎస్టీల నుంచీ ఒకరికి ఇవ్వాలంటున్న సీఎం రేవంత్‌

ఓసీల నుంచి సుదర్శన్‌రెడ్డి పేరూ ప్రతిపాదన

విస్తరణకు కాంగ్రెస్‌ అధిష్ఠానం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినా.. తుది జాబితాలో ఎవరెవరు ఉంటారన్న ఉత్కంఠ

 

అందుబాటులో ఉండండి: సీఎం

మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, వేముల వీరేశం, కాలె యాదయ్య, మందుల సామేలు శనివారం రాత్రి సీఎం రేవంత్‌ను కలిశారు.

విస్తరణలో తమ సామాజికవర్గానికి స్థానం కల్పించాలని కోరారు.

‘ఆదివారం అందుబాటులో ఉండండి. మీలో ఒకరికి మంత్రి పదవి వస్తుంది.

ఎవరికి వచ్చినా.. ఇప్పుడు కలిసివచ్చినట్లే కలిసి ఉండాలి, కలిసి రావాలి’ అని వారితో సీఎం అన్నట్లు సమాచారం.

కాగా, ఈ ఐదుగురిలో కవ్వంపల్లి పేరు తొలి ప్రాధాన్యంగా ఉండగా..

అడ్లూరి లక్ష్మణ్‌ పేరూ పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది.

 

చివరికి ఇన్నాళ్లకు జరగబోతోంది.

ఆశావహులు, సామాజిక సమీకరణలు వంటి అంశాలతో ఎన్నోసార్లు వాయిదా పడుతూ వచ్చిన రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్‌ అధిష్ఠానం నుంచి ఎట్టకేలకు గ్రీన్‌సిగ్నల్‌ లభించింది.

ఆదివారం మధ్యాహ్నం 12.19 గంటలకు రాజ్‌భవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది.

మంత్రివర్గంలో ఆరు ఖాళీలు ఉండగా..

అన్నీ కాకుండా ప్రస్తుతానికి పాక్షికంగా మాత్రమే భర్తీ చేయనున్నారు.

ఈ దఫాలో కేవలం ముగ్గురినే తీసుకోవాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం.

అది కూడా బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకే చోటు దక్కనుంది.

బీసీల నుంచి నారాయణపేట జిల్లా మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి అవకాశం లభించనుంది.

ముదిరాజ్‌ సామాజికవర్గానికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి గతంలోనే ప్రకటించారు.

ఆ వర్గం నుంచి ఉన్న ఏకైక ఎమ్మెల్యే శ్రీహరే కావడంతో ఈయనకు బెర్త్‌ ఖాయమైంది.

ఇక ఎస్సీల నుంచి మాల సామాజికవర్గానికి చెందిన మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే జి.వివేక్‌కు అవకాశం దక్కనుంది.

మరో బెర్తును కూడా ఎస్సీల నుంచే భర్తీ చేయనున్నారు.

ఈ అవకాశం మాదిగ సామాజికవర్గానికి చెందిన కరీంనగర్‌ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు గానీ, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు గానీ లభించనుంది.

ఇలా ఎస్సీల నుంచి మాల, మాదిగలకు ఒక్కొక్కరికి చొప్పున ఇద్దరు ఎమ్మెల్యేలకు చోటు కల్పించనున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

3 బెర్తులూ కొత్త ఎమ్మెల్యేలకే..

క్యాబినెట్‌లో భర్తీ చేయబోయే మూడు స్థానాలకూ తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారినే తీసుకుంటుండడం గమనార్హం.

వీరిలో జి.వివేక్‌ 2009-2014 మధ్య ఓసారి ఎంపీగా పనిచేసినా..

ఎమ్మెల్యేగా ఎన్నికయింది మాత్రం తొలిసారే.

వాకిటి శ్రీహరి, కవ్వంపల్లి సత్యనారాయణ, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ కూడా తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచినవారే.

అయితే ఇదే తుది జాబితా కాదన్న అభిప్రాయాలూ ఉన్నాయి.

బీసీ, ఎస్సీలతోపాటు ఒక ఎస్టీకి, అదే సమయంలో ఓసీల నుంచి సీనియర్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డికీ అవకాశం ఇవ్వాలని స్వయంగా సీఎం రేవంత్‌ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.

ఎస్టీల నుంచి లంబాడ సామాజికవర్గానికి చెందిన నల్లగొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్‌తోపాటు మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ ఎమ్మెల్యే జాటోత్‌ రాంచందర్‌నాయక్‌ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

కాగా, నిజామాబాద్‌ జిల్లా బోదన్‌ ఎమ్మెల్యే పి.సుదర్శన్‌రెడ్డికి మంత్రివర్గంలో స్థానం ఖాయమని ముందు నుంచీ ప్రచారం జరుగుతోంది.

అయితే తుది జాబితాలో ఆయన పేరు ఉంటుందా? లేదా? అన్నది సస్పెన్స్‌గానే మారింది. మంత్రివర్గ విస్తరణకు గ్రీన్‌సిగ్నల్‌ లభించి, విస్తరణ ముహూర్తం కూడా ఖరారైౖనా..

జాబితాపై మాత్రం అర్ధరాత్రి వరకు తుది చర్చలు నడుస్తూనే ఉన్నాయి.

ఈ నేపథ్యంలో బెర్తుల ఖరారులో మార్పుచేర్పులు కూడా ఉండవచ్చని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా..

ప్రస్తుతం జరిగేది మంత్రివర్గ విస్తరణా? పునర్‌వ్యవస్థీకరణా? అన్న చర్చ కూడా నడిచింది.

అయితే ప్రస్తుతానికి విస్తరణ మాత్రమే ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

సమంత తొలి నిర్మాణం ఒక హాస్యాస్పదమైన శైలి.

సమంత తొలి నిర్మాణం ఒక హాస్యాస్పదమైన శైలి.

సుభం’ సినిమా సమీక్ష:నేటిధాత్రి

 

 

 

దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల మరియు రచయిత వసంత్ మారింగంటిల తెలుగు చిత్రం వినోదాత్మకమైన ఇండీ-స్టైల్ హర్రర్ కామెడీ మరియు సామాజిక వ్యంగ్యం.

‘సుభం’ చిత్ర తారాగణం | ఫోటో క్రెడిట్: స్పెషల్ అరేంజ్‌మెంట్

ఒక నిరాడంబరమైన సినిమా పెద్దగా ఊగిపోయి హాయిగా ల్యాండ్ అయినప్పుడు అది ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది, మరియు శుభం అనే తెలుగు హర్రర్ కామెడీ కూడా అదే చేస్తుంది. నటి సమంతా రూత్ ప్రభు నిర్మాతగా అరంగేట్రం చేస్తున్న ఈ చిత్రానికి సినిమా బండికి చెందిన ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహించారు మరియు వసంత్ మారింగంటి రచన చేశారు. ఉపరితలంపై, ఇది భయానక కామెడీ, కానీ హృదయంలో, ఇది లింగ సున్నితత్వంపై పదునైన వ్యాఖ్యానం – తెలివైన రచన మరియు మనోహరమైన ప్రదర్శనల ద్వారా మరింత ప్రభావవంతంగా మారింది.

2000ల ప్రారంభంలో, అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లోని తీరప్రాంత భీమిలిలో ఇంటర్నెట్‌కు ముందు రోజుల్లో, కథ కేబుల్ టీవీ ఆపరేటర్ అయిన శ్రీను (హర్షిత్ రెడ్డి) మరియు బ్యాంక్ ఉద్యోగి అయిన శ్రీ వల్లి (శ్రియా కొంఠం) మధ్య జరిగే మధురమైన వికారమైన పెళ్లి చూపులు (ఒక కుదిర్చిన వివాహం)తో ప్రారంభమవుతుంది. ఉపగ్రహ టీవీ అంగుళంలో ప్రవేశించడం ప్రారంభించినప్పుడు కేబుల్ ఇప్పటికీ రాజ్యమేలుతున్న నేపథ్యం – కథనాన్ని ముంచెత్తకుండా నోస్టాల్జియాను జోడిస్తుంది.

పాత తెలుగు సినిమాల ‘సుఖాంతం’ టైటిల్ కార్డులకు గుర్తుగా ‘ సుభం ‘ అనే టైటిల్ ప్రేక్షకులను నిజంగా సంతోషకరమైన కుటుంబం ఎలా ఉంటుందో ఆలోచించమని ఆహ్వానిస్తుంది. ఇక్కడ, సమాధానం చాలా ఆధునికమైనది: లింగ సమానత్వం. స్క్రిప్ట్ సమకాలీన సృజనాత్మక స్వేచ్ఛలను తీసుకున్నప్పటికీ, అది స్థానం నుండి తప్పినట్లు అనిపించదు – దాని స్పర్శ తేలిక, పుష్కలంగా నవ్వులు మరియు 125 నిమిషాల కఠినమైన రన్‌టైమ్‌లో తెలివైన భయానక సన్నివేశాలకు ధన్యవాదాలు.
దర్శకుడు : ప్రవీణ్ కాండ్రేగుల
నటీనటులు : హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియ కొంతం, శ్రావణి లక్ష్మి, షాలిని కొండేపూడి, వంశీధర్ గౌడ్
నిడివి : 125 నిమిషాలు
కథాంశం : ఒక చిన్న పట్టణంలో, స్త్రీలు టెలివిజన్ షో చూస్తున్నప్పుడు వ్యామోహంలో మునిగిపోతారు. పురుషులు పరిష్కారాలను కనుగొనాలి మరియు దానికి వారు తమలో తాము చూసుకోవాలి.

శుభం లో సూక్ష్మమైన లింగ వ్యాఖ్యానం ప్రారంభంలోనే బయటపడటం ప్రారంభమవుతుంది – శ్రీ వల్లి పని చేస్తుంది మరియు మర్యాదపూర్వక శైలికి సరిగ్గా సరిపోదు కాబట్టి పెద్దలు ఆమె వధువుగా సరిపోతుందని ప్రశ్నిస్తారు. ఇంతలో, శ్రీను స్నేహితులు అతనిని ‘ఆల్ఫా మేల్’ ప్రవర్తనలో శిక్షణ ఇస్తారు, అదే వారి భార్యలను ఆకట్టుకునేలా చేయడంలో రహస్యం అని నమ్ముతారు. ఈ క్షణాలు హాస్యంతో సాగుతాయి, ఏదైనా విషపూరిత ఉద్దేశ్యం కంటే పురుషుల అజ్ఞానాన్ని హైలైట్ చేస్తాయి.

తర్వాత, ట్విస్ట్: పట్టణంలోని మహిళలు ఒక మెలోడ్రామాటిక్ టీవీ షో చూస్తున్నప్పుడు వారిపై ఆకర్షితులవుతారు. గందరగోళం గురించి. వ్యంగ్యంగా ప్రారంభమయ్యేది హాస్యాస్పదంగా, భయానకంగా మారే అల్లకల్లోలంగా మారుతుంది, పురుషులు ఏమి జరుగుతుందో అర్థం చేసుకోవడానికి తహతహలాడుతుండగా, హాస్యాస్పదమైన మాటలు మరియు హాస్యం.

దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల మరియు రచయిత వసంత్ మారింగంటి ఈ చిత్రాన్ని చిన్న పట్టణ విచిత్రాలు – సుపరిచితమైన కబుర్లు, కేబుల్ టీవీ నోస్టాల్జియా మరియు విచిత్రమైన పాత్రలలో – ఎంకరేజ్ చేస్తారు. వివేక్ సాగర్ సంగీతం శృంగారం నుండి భయానక స్థాయికి సులభంగా కదులుతుంది మరియు మృదుల్ సేన్ సినిమాటోగ్రఫీ స్వర మార్పును నైపుణ్యంతో సంగ్రహిస్తుంది.
‘సుభం’ లో సమంత రూత్ ప్రభు | ఫోటో క్రెడిట్: స్పెషల్ అరేంజ్మెంట్

ఈ సినిమాలోని సోప్ ఒపెరా, జన్మ జన్మల బంధం , ఒక తెలివైన కథన పరికరంగా మారుతుంది. కల్పిత సోప్‌లను హాస్యాస్పదంగా ఉపయోగించే ఇటీవలి చిత్రాల మాదిరిగా కాకుండా (మత్తు వడలారా మరియు దాని సీక్వెల్ గుర్తుకు వస్తుంది), శుభం మూడు జంటల మధ్య లింగ గతిశీలతను ప్రతిబింబించేలా చేస్తుంది, ఈ పిచ్చికి బరువును జోడిస్తుంది.

మొదటి అర్ధభాగంలో కొన్ని ప్రశాంతతలు ఉన్నాయి, కానీ కథ త్వరలోనే వేగం పుంజుకుంటుంది. సమంత తన సాధారణ ఇమేజ్‌కు విరుద్ధంగా నటించిన డెడ్‌పాన్ కామియో క్లుప్తంగా ఉన్నప్పటికీ ప్రభావవంతంగా ఉంటుంది. ఆమె మౌనం ఏకపాత్రాభినయం కంటే ఎక్కువ చెబుతుంది.

ఊహించదగిన పరిష్కారం వైపు వెళ్ళవచ్చని మీరు అనుకుంటున్న సమయంలో, ప్రవీణ్ మరియు వసంత్ ఒక ఆశ్చర్యకరమైన మలుపును ఇస్తారు. మీరు సినిమా బండిని చూసినట్లయితే , మీరు క్రాస్ఓవర్‌ను మరింత ఆనందిస్తారు, కానీ మీరు చూడకపోయినా ఇది ఇప్పటికీ పనిచేస్తుంది. ఇది సినిమాటిక్ విశ్వాలకు దర్శకుడు యొక్క ఉల్లాసభరితమైన సమాధానం, ఇది స్వతంత్ర చిత్రాలకు కూడా ఉమ్మడి ప్రపంచాలను కలిగి ఉండవచ్చని మనకు గుర్తు చేస్తుంది.

మెయిల్ మరియు కల్కి 2898 AD లలో ప్రత్యేకంగా నిలిచాడు ) శ్రీనుకి ఆప్యాయతను తెస్తాడు, మరియు శ్రియ కొణతం నిశ్శబ్దంగా దృఢంగా ఉండే శ్రీ వల్లిగా తనదైన శైలిలో నటించాడు. మిగిలిన తారాగణం – గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరి, శ్రావణి లక్ష్మి, షాలిని కొండేపూడి, మరియు వంశీధర్ గౌడ్ – తమ పాత్రలను అతిగా ప్రదర్శించకుండా వినోదాన్ని పెంచారు.

“రింగ్స్ ఆఫ్ ది లార్డ్” చూస్తున్నానని గర్వంగా చెప్పుకునే పాత్ర వంటి ఒక ఆహ్లాదకరమైన వివరాలు కూడా ఇందులో ఉన్నాయి. అయితే, ఒక వదులుగా ఉన్న థ్రెడ్ ఏమిటంటే, స్త్రీలు మొదట ఎందుకు దయ్యాలను పట్టుకుంటారు. ఈ చిత్రం ఒక కారణం చెప్పకుండానే తప్పించుకుంటుంది, బహుశా అది మంచి కోసమే కావచ్చు – కొన్ని విషయాలు వివరించకుండా వదిలేస్తే సరదాగా ఉంటాయి.

శుభమ్ అనేది ‘ఆల్ఫా మేల్స్’ అందరికీ ఒక పదునైన సందేశాన్ని అందించే హారర్-కామెడీ. మరియు ఇది పుష్కలంగా నవ్వులతో ప్రేక్షకులను అలరిస్తుంది.

శుభమ్ ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శితమవుతోంది.

మాగంటి మృతి పట్ల కేసీఆర్ సంతాపం.

BRS: మాగంటి మృతి పట్ల కేసీఆర్ సంతాపం..

 

నేటిధాత్రి:

 

 

 

 

 

బీఆర్ఎస్ సీనియర్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల.. ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. సంతాపం ప్రకటించారు. మాగంటి మరణం పార్టీకి తీరనిలోటు అని అన్నారు.

బీఆర్ఎస్ సీనియర్ నేత (BRS Senior Leader), జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే (Jubilee Hills MLA) మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) మృతి పట్ల.. ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ (Ex CM KCR) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. సంతాపం (Tribute) ప్రకటించారు. మాగంటి మరణం పార్టీకి తీరనిలోటు అని అన్నారు. ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదిగిన మాగంటి గోపీనాథ్ ఎంతో సౌమ్యుడుగా ప్రజానేతగా పేరు సంపాదించారని అన్నారు. జూబ్లీహిల్స్ నియోజక వర్గ ఎమ్మెల్యేగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, హైదరాబాద్ నగర సీనియర్ రాజకీయనేతగా మాగంటి తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారని కేసీఆర్.. మాగంటి జ్ఞాపకాలను స్మరించుకున్నారు.

ప్రగాఢ సానుభూతి…

మాగంటి గోపీనాథ్‌ను కాపాడుకునేందుకు వైద్యులు చేసిన కృషి, పార్టీ తరఫున చేసిన ప్రయత్నాలు ఫలించక పోవడం దురదృష్టకరమని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మాగంటి గోపీనాథ్ మరణానికి చింతిస్తూ.. శోకతప్తులైన ఆయన కుటుంబ సభ్యులు, మిత్రులు, అభిమానులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మాగంటి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్ ప్రార్థించారు.

కాగా బీఆర్ఎస్ సీనియర్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఆదివారం ఉదయం 5.45 గంటలకు తుది శ్వాస విడిచారు. ఈ నెల 5న గుండెపోటుతో ఏఐజీ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారు జామున మృతి చెందారు. ఈ మేరకు వైద్యులు అధికారికంగా ప్రకటించారు.

పెద్దమ్మ . పెద్ద రాజుల.కళ్యాణ మహోత్సవానికి హాజరైన బిజెపి నాయకులు…

పెద్దమ్మ . పెద్ద రాజుల.కళ్యాణ మహోత్సవానికి హాజరైన బిజెపి నాయకులు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి… .

 

 

 

తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో పెద్దమ్మ . పెద్ద రాజుల కళ్యాణ మహోత్సవమునకు ప్రత్యేకంగా హాజరైన జిల్లా బిజెపి అధ్యక్షుడు గోపి. జిల్లా బీజేవైఎం. జిల్లా అధ్యక్షులు రావుల రాజిరెడ్డి. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో గోపి రాజు రెడ్డి బిజెపి పార్టీ నాయకులు కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు బిజెపి పార్టీ నాయకులను. ప్రత్యేకంగా శాలువాతో సన్మానించారు ఇట్టి కార్యక్రమంలో. బిజెపి పార్టీ నాయకులు. సుధాకర్. రాజేందర్. నెల్లుట్ల రమేష్. కాజు గంటి రాజు. చిందం నరేష్. సందీప్ జిల్లెల్ల గ్రామ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు పిట్ల మల్లేశం ముదిరాజ్ ఈసా నరసయ్య సంఘం నాయకుడు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

చింతలపల్లి గ్రామస్తులచే ఎమ్మార్వో కి వినతి పత్రం…

చింతలపల్లి గ్రామస్తులచే ఎమ్మార్వో కి వినతి పత్రం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

 

తంగళ్ళపల్లి మండలం చింతల గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేబిల్లు వలన. గ్రామస్తులకు ఇబ్బందికరంగా ఉందని అలాగే. రోడ్డు మార్గాన రోజు 100 నుండి 200 వాహనాలు వెళ్తాయని. చిన్నపిల్లలకు ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున. అలాగే గ్రామంలో. కోడి పిల్లలకు. ఎడ్లకు లేగా దూడలకు. మూగజీవాలకు అధికంగా ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున గ్రామంలో చిన్నచిన్న మార్గాలు ఉన్నందున ఇట్టి మార్గాన్ని. వేరే మార్గం గుండా ఆవు నూరి.బ్రిడ్జి నుండి. నక్క వాగులోకి ప్రవేశం కల్పించే విధంగా సహకరించి ప్రజల బాగోబాగులు చూడవలసిన బాధ్యత మీపై ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇట్టి కార్యక్రమంలో గ్రామ ప్రజలతో పాటు. చింతలపల్లి కట్కూరు. గ్రామాల ప్రజలు స్థానిక తంగళ్ళపల్లి ఎమ్మార్వో గారికి ఇకనైనావే బ్రిడ్జి సమస్యలేకుండా. చూడాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీనిపై స్పందించిన ఎమ్మార్వో. సాధ్యమైన మట్టుకు సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కార దిశగా చూసుకుంటానని ఈ సందర్భంగా తెలియజేశారు

గృహ ప్రవేశానికి హాజరై న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి.

గృహ ప్రవేశానికి హాజరై న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి నేటిధాత్రి:

 

పెద్దమందడి మండలంలో
మోజార్ల గ్రామానికి చెందిన బీ అర్ యస్ పార్టీ నేత వెంకటేష్ నూతన గృహ ప్రవేశ ని ప్రవేశంలో మాజీ మంత్రిసింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొని వారి కుటుంబ సభ్యులకుకృతజ్ఞతలు తెలిపారు
మాజీ మంత్రి వెంటసునీత తిరుపతయ్య జగదీశ్వర్ రెడ్డి కుమార్ యాదవ్ నాగేంద్ర యాదవ్, శ్రీనివాసులు,జగన్ గౌడ్ తదితరులుఉన్నారు

విద్యార్థులకు సరస్వతి ఉత్తమ విద్యార్థి అభినందన సభ.

విద్యార్థులకు సరస్వతి ఉత్తమ విద్యార్థి అభినందన సభ.

చిట్యాల, నేటిధాత్రి :

 

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో శనివారం రోజు ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్ ఇన్చార్జి వేల్పుల రాజ్ కుమార్ మాట్లాడుతూ జిల్లా లోని ప్రభుత్వ ,గురుకుల కేజీబీవీ మోడల్ స్కూల్ మరియు కళాశాల
10 వ మరియు ఇంటర్ లో
ఉత్తమ ఫలితాలు సాధించిన 2024/2025
వారికి ఎబివిపి ఆద్వర్యం లో
అభినందన సభ నిర్వహించడం జరుగుతుంది అని
కావున జిల్లా లోని
విద్యార్థులు పేరు నమోదు
చేసుకోవాలని,నమోదు కొరకు 7287920310…సంప్రదించాలి అని ఒక ప్రకటనలో తెలిపారు

తిరుపతిలో అత్తలూరి ఆర్యవైశ్య సత్రంలో లాకర్ కు 400 ?

తిరుపతిలో అత్తలూరి ఆర్యవైశ్య సత్రంలో లాకర్ కు 400 ?

ప్రేక్షక పాత్ర వహిస్తున్న ఏపీ అధికారులు
వనపర్తి నేటిధాత్రి:

 

 

 

తిరుపతి లో రైల్వే స్టేషన్ ఎదురుగా అత్తలూరి ఆర్యవైశ్య సత్రం లాకర్ ఇవ్వడానికి అత్తలూరు 400 రూపాయలు చెల్లిస్తేనే లాకర్ ఇస్తామని పీడిస్తున్నారు . ఈ మేరకు భక్తులు కొందరు సోమవారం రాత్రి లాకర్ ఇవ్వాలని సత్రం దగ్గరికి వెళ్లి నిర్వాహకులను అడిగారు సత్రం నిర్వాహకులు ఒక లాకర్ ఇవ్వడానికి 400 రూపాయలు చెల్లిస్తేనే లాకర్ ఇస్తామని ఆగ్రహంగా ఆవేశంగా ప్రవర్తించారని భక్తులు తెలిపారు . ఈ మేరకు భక్తులు నేటి దాత్రి దినపత్రిక విలేకరులతో ఆవేదన వ్యక్తం చేస్తూ భక్తులను పీడించి వసూలు చేస్తున్న లాకర్లు రూముల కేటాయింపు ప్రభుత్వ నియమ నిబంధనలు జీఎస్టీ చెల్లించ కుండ రూల్స్ ను ఉల్లంఘించి అధికంగా డబ్బులు వసూలు చేస్తూ భక్తులను పీడిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు తిరుపతి లో అధికారులు ప్రేక్షక పాత్ర వహించిదముపై ప్రజలు ఆవేదన వ్యక్తంచేశారు ఈ విషయం పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం చీఫ్ సెక్రటరీ తిరుపతి కలెక్టర్ తిరుపతి ఎంపీ ఎమ్మెల్యేకు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు చేస్తామని తెలిపారు సత్రం వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రజలు పేర్కొన్నారు

ప్రజాసమస్యల పరిష్కారానికి పోరాటాలే మార్గం.

ప్రజాసమస్యల పరిష్కారానికి పోరాటాలే మార్గం

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జీ నాగయ్య.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

 

సమస్యల పరిష్కారానికి పోరాటాలే మార్గమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జీ.నాగయ్య అన్నారు.
సిపిఎం జిల్లా స్థాయి శిక్షణ తరగతులు రెండో రోజు పట్టణంలోని గ్రీన్ రిసార్ట్ లో సిపిఎం జిల్లా కార్యదర్శి సీ హెచ్ రంగయ్య అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జీ నాగయ్య మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు పోరాటాలే మార్గం అని అన్నారు. కేంద్రం లోని మోడీ నాయకత్వం లోని బిజెపి ప్రభుత్వం ప్రజల మధ్య కులాలు మతాల మధ్య చీలిక తీసుకువచ్చి విద్వేషాలు రెచ్చగొట్టి పాలన సాగిస్తున్నదని, దేశంలో ప్రజల ప్రజాస్వామిక హక్కులు కాలరాసి నియంతృత్వ పాలన తీసుక రావడానికి బిజెపి నాయకత్వం లోని మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, ఈ విధానాలకు వ్యతిరేకంగా ప్రజా పోరాటాలను సాగించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం లో అధికారం లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీలను అమలు చేయడంలో కాలయాపన చేస్తుందని , ప్రధానంగా రైతు రుణమాఫీ, రాజీవ్ యువ వికాసం, పేదలకు ఇందిరమ్మ ఇండ్లు అమలు చేయడం లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.బిజెపి దేశంలో మూడవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత మతోన్మాదం విపరీతంగా పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. మనిషి ఏం తినాలో, ఏ బట్టలు వేసుకోవాలో బిజెపి నేతలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వారు అన్నారు. హిందువులు పేరుతో మత రాజకీయాలు చేస్తూ హిందువులపై అదనపు ఆర్థిక భారాలు మోపడం ఏమిటి అని ప్రశ్నించారు. ప్రతి ఎన్నికల సమయంలో భావోద్వేగాలను రెచ్చగొట్టే పనిలో బిజెపి నేతలు వున్నారని విమర్శించారు. నూతన ఆర్థిక విధానాలతో దేశంలో సంక్షోభం ఏర్పడింది అని, మరోవైపు ప్రజలు ఉద్యమాల్లోకీ రాకుండా మతాన్ని ముందుకు తెచ్చి దేశ ప్రజలతో బిజెపి నేతలు ఆటలు ఆడుతున్నారని వారు ధ్వజమెత్తారు. హామీల అమలుకు ప్రజా ఉద్యమాలు నిర్మించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో పార్టి జిల్లా కమిటీ సభ్యులు ఈసంపెళ్లి బాబు, నలిగంటి రత్నమాల సింగారపు బాబు,భూక్య సమ్మయ్య, కోరబోయిన కుమారస్వామి, నమిండ్ల స్వామి ముంజాల సాయిలు ఆరూరి కుమార్, హన్మకొండ శ్రీధర్, బోళ్ల సాంబయ్య, ఎండి బషీర్, వి దుర్గయ్య, యారా ప్రశాంత్, పట్టణ కమిటీ సభ్యులు మండల, ఏరియా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

కారేపల్లి లో నూతన వదువరులను ఆశీర్వదించిన.

కారేపల్లి లో నూతన వదువరులను ఆశీర్వదించిన ఎన్ ఎచ్చ్ ఆర్సీ ఆండ్ ఉమెన్ ఎంపవర్ మెంట్ ఆర్గనైజేషన్.

జాతీయ చైర్మన్ మహ్మద్ మొహినుద్దీన్.

కారేపల్లి నేటి ధాత్రి

 

 

 

నేషనల్ హ్యూమన్ రైట్స్ చిల్డ్రన్ అండ్ ఉమెన్స్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ జాతీయ ఫౌండర్ మరియు చైర్మన్ మహమ్మద్ మొయినుద్దీన్ ఎన్ ఎచ్చ్ ఆర్సీ ఆండ్ డబ్ల్యూ ఈఓ ఖమ్మం జిల్లా జాయింట్ కార్యదర్శి మదగాని నాగేశ్వరరావు కుమారుడు శరత్ యాదవ్ జాహ్నవి ల వివహ కార్యక్రమం కారేపల్లి లోని పంక్షన్ హల్ లో నిర్వహించగ ఈ రిసెప్షన్ కార్యక్రమంలో ముఖ్య అతిదులుగా పాల్గొని వదువరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో జాతీయ చైర్మన్ తోపాటు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఆదేర్ల రాధా గోవిందు ఉపాధ్యక్షులు బెల్లం కొండ శ్రీనివాస్.హన్మకొండ జీల్లా అద్యక్షులు విన్న కోట గోవర్ధన్ భద్రాద్రి కొత్తగూడెం జీల్లా అద్యక్షుడు సంపత్ కుమార్ అడ్వయిజర్ కె.భూపాల్ మహబూబాబాద్ మాజీ అధ్యక్షుడు బొల్లం శ్రీనివాస్ తదితరులు కార్యక్రమంలో పాల్గొని నూతన వదువరులను ఆశీర్వాధించారు.

తప్పిస్తే ఎంతిస్తావ్‌? తూకమెంత తూగుతావ్‌??

-అడిగినంత ఇస్తే అన్నీ మేం చూసుకుంటాం?

-అవసరమైతే ఖమ్మం జేసి రిపోర్ట్‌ తప్పని నోట్‌ పంపిస్తాం!

-జగన్‌ తప్పేం లేదని తేల్చేస్తాం?

-సమస్య నుంచి పూర్తిగా బైట పడేస్తాం?

-కేసులు నమోదు కాకుండా చూసుకుంటాం!

-మిల్లర్‌ జగన్‌తో అధికారుల బేరసారాలు?

-నేటిధాత్రి కథనంతో నీ పని ఔట్‌..? అంటూనే తూకమెంత అంటున్నారు?

-అన్ని శాఖ అధికారులు నేటిధాత్రి పేపర్‌ చూపించి జగన్‌ తో మంతనాలు?

-నేటిధాత్రి వార్త ఒక్కటి చాలు!

ఖమ్మం జేసి చేసిన పని అందరూ హర్షిస్తుంటే హన్మకొండ అధికారులు బేరాలు చేసుకుంటున్నారు?

-నా ఒక్కడి వల్ల కాదు..మిగతా మిల్లర్లతో కలిపి ఇస్తానని జగన్‌ హామీ.

-సివిల్‌ సప్లయ్‌ హన్మకొండ అధికారుల దిగజారుడు తనానికి పరాకాష్ట!

-రైతులను మోసం చేసిన జగన్‌కు వత్తాసు పలుకుతున్నారు.

-జగన్‌ బేరం ఒప్పుకుంటే ఖమ్మం జేసిదే తప్పని నిరూపిస్తాం?

-ఆదర్శంగా వుండాల్సిన అధికారులు ఇలా అడ్డదారులు తొక్కుతున్నారు.

-రైతులను మోసం చేసిన జగన్‌ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.

-మిల్లర్లు, అధికారులు కుమ్మక్కైతే ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు.

-మిల్లర్‌ జగన్‌ దోపిడీని ఎవరూ ఆపలేరు?

హైదరాబాద్‌,నేటిధాత్రి:
హన్మకొండలోని సివిల్‌ సప్లయ్‌ అధికారులు అవినీతిలో ఎంతో ఎత్తుకు ఎదిగిపోయారు. శాఖ సాక్షిగా తప్పులుచేస్తారు. మిల్లర్లచేత తప్పులు చేయిస్తారు. తమ తప్పు లేని నిరూపించే ప్రయత్నం చేస్తారు. తప్పు చేసిన మిల్లర్లను తప్పిస్తారు. ప్రతిసారి మాకేమిస్తారని మోసం చేసిన మిల్లర్లకు అండదండలందిస్తారు. అందిన కాడికి దోచుకుంటారు. ఇదీ ప్రస్తుతం హన్మకొండ జిల్లాకు చెందిన సివిల్‌ సప్లయ్‌ శాఖకు చెందిన అదికారుల ఘనకార్యమని అందరూ చెప్పుకుంటున్నారు. తాజాగా ఓ పెద్ద సంఘటన జరిగింది. తెలంగాణలో ఈ సీజన్‌లో సన్న వరి రకాలను రైతులు రికార్డు స్ధాయిలో పండిరచారు. అందులో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఏకంగా 92శాతం సన్న వడ్లు పండిరచారు. దాంతో ఐకేపి సెంటర్లకు పెద్దఎత్తున వడ్లు వస్తున్నాయి. వాటిని మిల్లులకు పంపించడానికి ఆ జిల్లా అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. దాంతో పొరుగున వున్న హన్మకొండ జిల్లా రైస్‌ మిల్లులకు ఆ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఓ యాభై లారీల వడ్లను పంపించారు. వాటిని జాయింట్‌ కలెక్టర్‌ సూచించిన మిల్లులకు ఆ లారీలు చేరాలి. కాని ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ పంపిన మిల్లులకు ఆ వడ్లు చేరలేదు. హన్మకొండ జిల్లా సివిల్‌ సప్లై అదికారులకు అనుంగుడైన, అత్యంత సన్నిహితుడైన జగన్‌ అనే మిల్లులకు చేరాయి. ఇంత వరకు బాగానే వుంది. కాని ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ పంపిన వడ్ల బస్తాలకు, రైతులకు అందిన సొమ్ముకు మధ్య ఏదో తేడా కనిపించింది. దాంతో ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఆరా తీశారు. ఖమ్మం నుంచి వచ్చిన 50 లారీల బస్తాలలో సుమారు 2000వేల బస్తాలను హన్మకొండ జిల్లాకు చెందిన మిల్లర్‌ జగన్‌ మాయం చేశాడు. ఈ విషయం పసిగట్టిన జాయింట్‌ కలెక్టర్‌ బస్తాల మాయంపై సంబందిత జగన్‌కు చెందిన మిల్లులకు తఖీదులు జారీ చేశారు. దాంతో జగన్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. జగన్‌ మాయం చేసిన వడ్ల బస్తాల గురించి ఖమ్మం జాయింట్‌ కలెక్టర్‌కు ఎలా తెలిసిందని ఆరా తీశాడు. అసలు విషయం తెలుసుకున్నాడు. ఇరుక్కున్నానని అర్ధం చేసుకున్నాడు. ఇక్కడ జరిగిందేమిటంటే ఖమ్మం జాయింట్‌ కలెక్టర్‌ ప్రతి బస్తామీద దాని బరుకు చెందిన తూకం రాయించారు. ఈ విషయాన్ని మోసం చేసిన మిల్లర్‌ జగన్‌ పసగట్టలేదు. హన్మకొండ జిల్లాకుచెందిన సివిల్‌ సప్లయ్‌ అదికారులు గుర్తించలేదు. వచ్చిన లారీల నుంచి వడ్లు దించుకున్నామా? అందులో నుంచి 2వేల బస్తాలు మాయం చేశామా? అన్నట్లు జగన్‌ ఆత్రపడ్డారు. అడ్డంగా ఇరుక్కున్నాడు. ఇప్పుడు లబోదిబో మంటున్నాడు. తన బాధను హన్మకొండ సివిల్‌ సప్లయ్‌ అదికారుల ముందు పెట్టాడు. వెతకబోయిన తీర కాళ్లకు తగిలినట్లు హన్మకొండ సివిల్‌ సప్లై అదికారులు జగన్‌ను నేటిదాత్రి దినపత్రిక వుంచారు. ఈ విషయాన్ని నేటి దాత్రి దినపత్రిక ఎప్పుడో ప్రచురించింది. ఓ తరాజులో నేటి దాత్రి దినపత్రిక పెట్టినట్లు, మరో తూకంలో ఎంత ఇస్తావ్‌ అన్న ప్రశ్నలు పెట్టేశారు. తప్పు జరిగింది. జగన్‌ తప్పుచేశాడు. కాని మాకేం తెలియదు. జగన్‌కు వడ్లు ఇవ్వడం వరకే చూసుకున్నాం. కాని జగన్‌ వడ్లు మాయం చేసిన సంగతి మా దృష్టికి రాలేదని అధికారులు తప్పించుకునే ప్రయత్నం చేశారు. కేసు తమ మీదకు రాకుండా పూర్తిగా జగన్‌ మీదకు తోసేసే స్కెచ్‌ వేశారు. దాంతో జగన్‌ అదికారుల కాళ్లా వేళ్లా పడే పరిస్దితి వచ్చింది. ఇదే సరైన అవకాశం అనుకున్నారు. తప్పిస్తే ఎంతిస్తావ్‌ అనే బేరానికి వచ్చారు. తూకమెంత తూగుతామని ప్రశ్నించడం మొదలుపెట్టారు. మేం అడిగినంత ఇస్తే తప్ప నిన్ను రక్షించలేమంటూ జగన్‌కే తెగేసి చెప్పేశారు. మేం అడిగింది తూకంలో వేస్తే అన్నీ మేం చూసుకుంటామని జగన్‌కు అదికారులు భరోసా ఇచ్చారు? హన్మకొండకు చెందిన అదే సివిల్‌ సప్లయ్‌ అధికారులు ఖమ్మం జేసి ఇచ్చిన రిపోర్టు తప్పని తాము నోట్‌ చేస్తామని, సమాదానం పంపిస్తామని జగన్‌కు చెప్పారు. ఈ విషయంలో జగన్‌ తప్పేం లేదని తేల్చేస్తాం. ఎలాంటి కేసు జగన్‌ మీదకు రాకుండా చూస్తామని హమీ ఇచ్చారు. ముఖ్యంగా నేటిధాత్రి దినపత్రికలో వచ్చిన కథనంతో జగన్‌ ఇక నీపని ఔట్‌ అంటూ బెదించారు. కేసులు ఎదొర్కొక తప్పదని భయపెట్టారు. నిన్ను లోపలికి పంపించేందుకు నేటి దాత్రి ఒక్క వార్త చాలంటూ జగన్‌కు చుక్కలు చూపించినట్లు తెలుస్తోంది. ఈ సంగతి తెలిసి అటు పొల్యూషన్‌ డిపార్టుమెంటు అధికారులు కదిలారు. ఇరిగేషన్‌ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఏక కాలంలో మూడు శాఖల అధికారులు జగన్‌ను ఉక్కిరి బిక్కిరి చేశారు. ఇంత దూరం వచ్చిన తర్వాత ప్రజా సంఘాలు ఊరుకుంటాయా? వాటి పని అవి మొదలు పెట్టాయి. దాంతో ఇంత మంది అధికారులకు ఏక కాలంలో సమర్పణలు అంటే నా ఒక్కడి వల్లకాదని జగన్‌ అధికారులకు తేల్చి చెప్పాడు. నాతో పాటు వున్న అన్ని మిల్లులపై కూడ చర్యలుంటాయని అదికారులు సహకరిస్తే, వసూలు చేసి ఇస్తానని జగన్‌ హమీ ఇచ్చాడు. ఇది సివిల్‌ సప్లై శాఖతోపాటు, పొల్యూషన్‌, ఇరిగేషన్‌శాఖల దిగజారుడు తనానికి ఇది పరాకాష్ట అని ప్రజా సంఘాలు అంటున్నాయి. జగన్‌ బేరం ఒప్పుకుంటే ఏకంగా ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ దే తప్పని నిరూపిస్తామని అధికారులు అంటున్నారంటే ఎంతగా దిగజారి పోయారో అర్ధం చేసుకోవచ్చు. ఆదర్శంగా వుండాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు ఇలా అడ్డమైన దారులు తొక్కుతున్నారు. అడ్డంగా సంపాదనకు ఎగబడ్డారు. తప్పులు చేస్తున్నారు. తప్పులు చేసిన వారిని కాపాడి సంపాదన పెంచుకుంటున్నారు. రైతులను నిండా మోసం చేసిన జగన్‌ను కాపాడే ప్రయత్నం గట్టిగానే చేస్తున్నారు. మిగతా మిల్లర్లతో మాట్లాడి అదికారులు చెప్పిన మూట సమర్పించడానికి జగన్‌ ఒప్పుకున్నట్లు సమాచారం. దాంతో హన్మకొండ అదికారులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. మిల్లర్లు, అధికారులు కలిసి కుమ్మక్కైతే ఇంటి దొంగలను ఈశ్వరుడు కూడా కాపాడలేడన్న సామెతను నిజం చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా మిల్లర్‌ జగన్‌ను ఎవరూ ఆపలేరు. ఈ విషయం ఖమ్మం అధికారులు తెలుసుకొని, వెంటనే రంగంలోకి దిగితే అసలు మోసగాళ్లంతా బైటకు వస్తారు. ఖమ్మం జేసి పంపిన రిపోర్టు తప్పని నిరూపించే ప్రయత్నం చేయకముందే అసలు నిజాలు బైట పెట్టి, చర్యలు చేపడితే అందరి బండారం బైటకొస్తుంది. హన్మకొండ సివిల్‌ సప్లై అదికారుల చేతి వాటమే కాదు, పొల్యూషన్‌, ఇరిగేషన్‌ అధికారుల అవినీతి బాగోతం అంతా బైటపడుతుంది.

శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ పునర్ ప్రతిష్టాపన.

శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ పునర్ ప్రతిష్టాపన మరియు ధ్వజస్తంభ శిఖర ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న

◆ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్

◆ డా౹౹ఎ.చంద్రశేఖర్, మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

న్యాలకల్ మండలంలోని మెటల్ కుంట గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి మందిరంలో స్వామి వారి విగ్రహ మరియు ధ్వజ స్తంభ శిఖర ప్రతిష్టాపన లో పాల్గొని స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది.

 

MP Suresh Kumar Shetkar

 

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు హనుమంత రావు పాటిల్, శ్రీనివాసరెడ్డి , రామలింగారెడ్డి ,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి, మాజీ జడ్పీటీసీ భాస్కర్ రెడ్డి,యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నరేష్ గౌడ్, PACS చైర్మెన్ సిద్దిలింగయ్య గారు, ఎయంసి.డైరెక్టర్ వంశీ, కాంగ్రెస్ నాయకులు శుక్లవర్ధన్ రెడ్డి,యువజన కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు జీవన్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రేమ్ రాథోడ్,మరియు గ్రామ కాంగ్రెస్ ముఖ్య నాయకులు ,ప్రజలు పాల్గొనడం జరిగింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version