పిచ్చిది.. ట్రాక్ పై కారును పరుగులు పెట్టించింది .

పిచ్చిది.. ట్రాక్ పై కారును పరుగులు పెట్టించింది:

శంకర్ పల్లి వద్ద భయభ్రాంతులు: రైళ్ల రాకపోకలకు విఘాతం

శంకరపల్లి, నేటి ధాత్రి

 

 

 

శంకర్ పల్లి వద్ద దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. ఓ యువతి.. పట్టాలపై కారును పరుగులు పెట్టించింది. 80 కిలోమీటర్ల వేగంతో కారు పరుగులు తీసింది. రైల్వే సిబ్బంది హెచ్చరిస్తోన్నప్పటికీ ఆమె లెక్క చేయలేదు. ఈ ఘటన ఆందోళనకు దారి తీసింది.ఈ తెల్లవారు జామున ఈ ఘటన సంభవించినట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సమాచారం అందిన వెంటనే రైల్వే భద్రత సిబ్బంది, స్థానిక పోలీసులు.. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. కారును స్వాధీనం చేసుకున్నారు.సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలోకి వస్తుందీ శంకర్ పల్లి రైల్వే స్టేషన్.

 

 

 

 

 

శంకర్‌పల్లి- నాగులపల్లి సెక్షన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపుగా మూడు కిలోమీటర్ల పాటు ఆ యువతి కారును వేగంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయింది. రైల్వే సిబ్బంది హెచ్చరిస్తోన్నప్పటికీ లెక్క చేయలేదు.శంకర్ పల్లి వద్ద గల రైల్వే గేటు మీదుగా ఆ యువతి కారులో రైలు పట్టాలపై వచ్చినట్లు తెలుస్తోంది. మార్గమధ్యలో ఆమెను గమనించిన స్థానికులు శంకర్ పల్లి, నాగులపల్లి స్టేషన్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీనితో హుటాహుటిన సిబ్బంది అప్రమత్తం అయ్యారు. కారును వెంబడించారు.

 

 

 

 

 

కారును ఆపాలంటూ హెచ్చరించినప్పటికీ ఆమె పట్టించుకోలేదు. చివరికి నాగులపల్లి వద్ద పట్టాలపైనే కారును అడ్డగించారు. దీన్ని సీజ్ చేశారు. దాదాపుగా గంట పాటు ఆ యువతి పట్టాలపై హల్ చల్ చేసినట్లు చెబుతున్నారు. ఈ ఘటనతో ఈ మార్గంలో రైళ్లను నిలిపివేయాల్సి వచ్చింది. బెంగళూరు- కాచిగూడ సహా వివిధ రైళ్లను సమీప స్టేషన్లల్లో ఆపివేశారు.ఫలితంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆ యువతిపై ఎటువంటి కేసులు నమోదు చేశారనేది ఇంకా తెలియరావట్లేదు. రైల్వే ఆస్తులను ముప్పు వాటిల్లేలా వ్యవహరించినందు వల్ల సంబంధిత సెక్షన్ల ఆధారంగా ఆమెపై కేసు నమోదు చేయవచ్చని అధికారులు చెబుతున్నారు.

సమంత బోల్డ్ ఫోటోలు వైరల్ మతి పోవాల్సిందే.!

సమంత బోల్డ్ ఫోటోలు వైరల్… మతి పోవాల్సిందే !

 

నేటిధాత్రి:

 

 

 

 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. భర్త విడాకులు ఇచ్చినప్పటికీ ఒంటరి జీవితాన్ని గడుపుతూ తన లైఫ్ ను లీడ్ చేస్తోంది సమంత. హీరోయిన్ గా, అలాగే నిర్మాతగా.. బిజినెస్ మ్యాన్ గా దూసుకు వెళ్లోంది సమంత. దాదాపు 14 సంవత్సరాలుగా టాలీవుడ్ ໐໕໖ (Tollywood Industry) .

అయితే అలాంటి సమంత.. తాజాగా దుబాయ్ లో (Dubai ) పర్యటించారు. ఈ సందర్భంగా దుబాయ్ అందాలను ఆస్వాదిస్తూ సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను పంచుకుంటున్నారు. దాదాపు మూడు రోజుల నుంచి సమంత దుబాయ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడికి ఓ ఖరీదైన హోటల్లో దిగిన సమంత.. ఎడారి దిబ్బలు, నైట్ లైఫ్, ఇలా అన్ని ఎంజాయ్ చేస్తోంది.

ఇక తాజాగా స్విమ్మింగ్ పూల్ లో స్విమ్ చేస్తూ ఓ బోల్డ్ ఫోటోను పంచుకుంది. బ్లాక్ డ్రెస్ లో స్నానం చేస్తూ కనిపించింది. ఈ ఫోటోలను స్వయంగా సమంత పంచుకోవడంతో వైరల్ గా మారింది. ఈ ఫోటోలు చూసిన ఆమె ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఏం అందం రా బాబు.. అంటూ సమంతను పొగుడుతున్నారు. ఇది ఇలా ఉండగా 2021 లో అక్కినేని నాగచైతన్య- సమంత విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version