సూపర్‌స్టార్ రజనీకాంత్ కూలీ చిత్రం విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తోంది.
సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) 171 చిత్రంగా డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కలయికలో బంగారం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న రూపొందుతున్న చిత్రం కూలీ (Coolie). భారీ బడ్జెట్‌తో ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగార్జున (Nagarjuna Akkineni), ఉపేంద్ర (Upendra), షౌబిన్ (Soubin Shahir), సత్యరాజ్(Sathya Raj), శృతిహాసన్ (Shruti Haasan) వంటి సౌత్ ఇండియా సూపర్ స్టార్లు కీలక పాత్రలు పోషించగా అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీతం అందించాడు. సన్ పిక్చర్స్ (Sun Pictures) నిర్మించింది.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అగష్టులో 14న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమానుంచి ఇటీవల విడుదల చేసిన గ్లిమ్స్ సినిమాపై అమాంతం అంచనాలు పెంచగా.. ఆ వీడియోలో రజనీ మినహా ఏ హీరో ముఖం డైరెక్టుగా కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోవడం విశేషం.ఇదిలాఉంటే ఈ సినిమా విదేశీ రైట్స్ విషయంలో ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ వార్త హాట్ టాపిక్ అయింది.
బాక్సాపీస్ వద్ద ‘కూలీ’ చిత్రం విదేశీ రైట్స్ ధర సరికొత్త రికార్డు నెలకొల్పనుంది. ప్రస్తుతం విదేశీ పంపిణీ హక్కుల బిజినెస్ ప్రారంభమైన క్రమంలో ఈ మూవీ రైట్స్ సొంతం చేసుకునేందుకు ప్రముఖ సంస్థ ఏకంగా రూ.70 నుంచి రూ.80 కోట్ల మేర చెల్లించేందుకు ముందుకొచ్చిందని వినికిడి. అయినప్పటికీ చిత్ర నిర్మాత కళానిధి మారన్ మరింత అధిక మొత్తాన్ని డిమాండ్ చేస్తున్నారని దాంతో ఈ ఫారిన్ రైట్స్ బిజినెస్ చర్చలు ఇంకా నడుస్తూనే ఉన్నాయని ఈ నెలాఖరున అన్నీ ఫైనల్ అవుతాయని సమచారం. ఈ సినిమా హక్కులను రూ.70 కోట్ల నుంచి రూ.80 కోట్లకు విక్రయిస్తే మాత్రం.. తమిళ చిత్ర పరిశ్రమలో ఈ రైట్స్ సరికొత్త మైలురాయిగా నిలుస్తుందని కోలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ స్ఫూర్తితో బిహార్‌కే చెందిన మరో చిచ్చరపిడుగు అయాన్ రాజ్ ట్రిపుల్ సెంచరీతో దుమ్మురేపాడు…
ముజ్‌ఫర్‌పూర్ (బిహార్): ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ స్ఫూర్తితో బిహార్‌కే చెందిన మరో చిచ్చరపిడుగు అయాన్ రాజ్ ట్రిపుల్ సెంచరీతో దుమ్మురేపాడు. డిస్ట్రిక్ క్రికెట్ మ్యాచ్‌లో సంస్కృతి క్రికెట్ అకాడమీ తరఫున 13 ఏళ్ల అయాన్ కేవలం 134 బంతుల్లో 327 పరుగులు సాధించాడు. అందులో 22 సిక్సర్లు, 41 ఫోర్లు ఉన్నాయి. అయాన్, వైభవ్ మంచి స్నేహితులు. వీరిద్దరూ కలసి ప్రాక్టీస్ కూడా చేసేవారు. ‘వైభవ్ ఎంతో ఎత్తుకు ఎదిగాడు. అతడి బాటలోనే నేనూ నడుస్తున్నాన’ని అయాన్ చెప్పాడు. రాజ్ తండ్రి కూడా క్రికెటర్ కావడం విశేషం.
‘శతమానం భవతి’, కార్తికేయ 2’ లాంటి పలు సూపర్ హిట్ చిత్రాల్లో కథానాయికగా తెలుగు ప్రేక్షకులను అలరించారు అనుపమ పరమేశ్వరన్. ఆమె నటించిన ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ అనే…
‘శతమానం భవతి’, కార్తికేయ 2’ లాంటి పలు సూపర్ హిట్ చిత్రాల్లో కథానాయికగా తెలుగు ప్రేక్షకులను అలరించారు అనుపమ పరమేశ్వరన్. ఆమె నటించిన ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ అనే మలయాళ చిత్రం ఈనెల 27న విడుదలవుతోంది. ఇందులో లాయర్‌గా సురేశ్ గోపీ నటించారు. ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న అనుపమ మాట్లాడుతూ ‘నాకు నటన రాదంటూ చాలా మంది ట్రోల్ చేశారు. అయినా దర్శకుడు ప్రవీణ్ నాకు అవకాశం ఇచ్చారు. ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ వంటి గొప్ప చిత్రంలో ఎంపిక చేశారు. నాపై నమ్మకంతో ఇలాంటి పాత్రను ఇవ్వడమే నాకు దక్కిన విజయంగా భావిస్తున్నాను. ఇక నుంచి ప్రేక్షకులకు నచ్చే సినిమాలు మాత్రమే అంగీకరించాలని నిర్ణయించుకున్నా. కొవిడ్ సమయంలో నా కెరీర్ పరంగా, జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాను’ అని చెప్పారు. కాగా, అనుపమ వ్యాఖ్యలపై సురేశ్ గోపీ స్పందించారు. ఒక నటిపై వివక్షను ప్రదర్శించడం మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇదే తొలిసారి కాదని అన్నారు. ‘అనుపమ మాట్లాడిన మాటలు ఆమె హృదయాంతరాళం నుంచి వచ్చాయి. గతంలో నటి సిమ్రాన్ విషయంలోనూ ఇదే విధంగా జరిగింది. మలయాళ చిత్రపరిశ్రమ ఆమెను చిన్నచూపు చూసి ఇండస్ట్రీ వదిలిపోయేలా చేసింది’ అని అన్నారు.
చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం (మెగా 157-వర్కింగ్ టైటిల్) షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా…
చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం (మెగా 157-వర్కింగ్ టైటిల్) షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా నయనతార నటిస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే ఉత్తరాఖండ్‌లోని మసూరీలో రెండో షెడ్యూల్ మొదలైంది. ఇందులో చిరంజీవి సహా ప్రధాన తారాగణం అంతా పాల్గొంటోంది. మంగళవారం నయనతార సెట్స్‌లోకి అడుగుపెట్టారు. ఈ షెడ్యూల్‌లో చిరంజీవి, నయనతారపై కీలక సన్నివేశాలతో పాటు ఓ పాటను చిత్రీకరించనున్నారు. దర్శకుడిగా వరుస విజయాలను అందుకుంటున్న అనిల్ రావిపూడి ప్రేమ, కుటుంబ విలువలతో హృద్యంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో చిరంజీవి పాత్ర చిత్రణ నవ్యపంథాలో ఉంటుంది, ప్రేక్షకులు ఆశించే అంశాలతో ఆసక్తికరంగా సాగుతుంది అని యూనిట్ తెలిపింది. షైన్‌స్ర్కీన్స్, గోల్డ్‌బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బేనర్‌పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి
ఓటీటీకి.. తెలుగు సీట్ ఎడ్జ్ సూపర్ నేచురల్ థ్రిల్లర్
shine junior college
ఓటీటీ ప్రేక్షకులను అలరించేందకు చాలా రోజుల తర్వాత ఓ స్ట్రెయిట్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ సిద్దమవుతోంది.
ఓటీటీ ప్రేక్షకులను అలరించేందకు చాలా రోజుల తర్వాత ఓ స్ట్రెయిట్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ (Viraatapalem) సిద్దమవుతోంది. మిస్ ఫర్‌ఫెక్ట్ సిరీస్ ఫేమ్ అభిజ్ఞ వూతలూరు (Abhignya Vuthaluru) లీడ్ రోల్‌లో, చరణ్ లక్కరాజు (Charan Lakkaraju) ప్రధాన పాత్రలో నటించగా కృష్ణ పోలూరు (Poluru Krishna) దర్శకత్వం వహించారు. గతంలో శ్రీ రామ్, శివబాలాజీలతో రెక్కీ (Recce) అనే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌ను రూపొందించి మంచి విజయం దక్కించుకున్న సౌత్ ఇండియన్ స్క్రీన్స్ బ్యానర్‌పై శ్రీరామ్ మలి ప్రయత్నంగా ఈ సిరీస్‌ను నిర్మించారు.
1980లలో ఓ మారుమూల గ్రామం విరాటపాలెం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆ ఊరికి ఉన్న శాపం వళ్ల అక్కడ ప్రతి వధువు తమ పెళ్లి రోజునే మరణిస్తుంటారు. దీంతో దశాబ్దంగా ఆ ఐర్లో పెళ్లిళ్లు అనేవి లేకుండా పోయి ప్రతి ఒక్కరూ తీవ్ర భయాందోళనలతో జీవిస్తుంటారు. ఈక్రమంలో ఒక పోలీస్ కానిస్టేబుల్ ఆ గ్రామానికి రావడం, అక్కడి శాపం గురించి తెలుసుకోవడం, ఆ రహస్యాన్ని ఛేదించడం అనే ఉత్కంఠభరితమైన కథనంతో అందరినీ ఆకట్టుకునేలా ఈ సిరీస్ ఉండబోతోంది.
మూఢనమ్మకాలతో కొట్టుమిట్టాడే ప్రాంతంలో భయం అనేది సమాజాన్ని ఎలా నియంత్రించగలదో, ధైర్యం అనేది దశాబ్దాల నిశ్శబ్దాన్ని ఎలా భంగపరచగలదో ఓ శక్తివంతమైన సందేశంతో ఈ సిరీస్‌ను మలిచారు. ఈ నేపథ్యంలోగ్రామంలో ఉండే రహస్యాలు, దాన్ని ఛేదించేలా ఇంట్రెస్టింగ్‌గా సాగే ఇన్వెస్టిగేషన్ కథకు అదిరిపోయే సూపర్‌నేచురల్ థ్రిల్లర్ అంశాలను మేళవించి చూసే ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్ ఇవ్వనున్నారు. ఇప్పుడీ సిరీస్ జూన్ 27 నుండి ZEE5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుండగా త్వరలో ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు కృష్ణ పోలూరు, నిర్మాత శ్రీరామ్, నటి అభిజ్ఞలు మాట్లాడుతూ.. ‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్’ సిరీస్‌లో ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుంది. ప్రతి వధువు తన పెళ్లి రోజున మరణిస్తుంది. దాంలో అది ఆ విలేజ్‌లో భయంగా, భయం నిశ్శబ్దంగా మారిపోతుంది. అలాంటి గ్రామంలోని ఆ నిశ్శబ్దాన్ని ఛేదించడమే ఈ సిరీస్ కథ అని అన్నారు. రియల్ లొకేషన్స్, గ్రామీణ వ్యక్తులతో చిత్రీకరించామని, ప్రేక్షకులు ఈ ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ (Viraatapalem) సిరీస్‌ను ఎప్పుడెప్పుడు వీక్షిస్తారా? అని ఆత్రుతతో ఎదురుచూస్తున్నామని అన్నారు.
మోడల్ స్కూల్ మరియు జూనియర్ కళాశాల ఝరాసంగం, మండల విద్యార్థినికి స్టేట్ ర్యాంక్
జహీరాబాద్ నేటి ధాత్రి:
shine junior college
విడుదల అయిన ఇంటర్ ఫలితాల్లో పురం అక్షిత రెడ్డి D/o పురం బసిరెడ్డి MPC(మొదటి సంవత్సరంలో)466/470 మార్కులతో రాష్ట్ర స్థాయి ర్యాంకు ఉత్తమ సాధించింది.ఈ సందర్భంగా విద్యార్థిని పురం అక్షిత రెడ్డికి ప్రిన్సిపల్ టీ తేనావతి మరియు అధ్యాపక బృందం మరియు కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.
◆ పోలింగ్ కేంద్రాలు, సిబ్బంది ఎంపిక, శిక్షణపై దృష్టి
◆ జిల్లాలకు చేరిన ఎన్నికల గుర్తులు
◆ సర్పంచ్‌కు 30.. వార్డు సభ్యులకు 20
◆ రాష్ట్రంలో 12,848 పంచాయతీలు..
జహీరాబాద్ నేటి ధాత్రి:
shine junior college
పల్లె పోరుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన కసరత్తు చేస్తోంది. నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా ఎన్నికల ప్రక్రియను సజావుగా చేపట్టడానికి సమాయత్తమవుతోంది.
సంగారెడ్డి,పల్లె పోరుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది.గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన కసరత్తు చేస్తోంది. నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా ఎన్నికల ప్రక్రియను సజావుగా చేపట్టడానికి సమాయత్తమవుతోంది. సిబ్బంది ఎంపిక, వారికి శిక్షణ, పోలింగ్ కేంద్రాల గుర్తిం పు, ఎన్నికల గుర్తులు తదితర అంశాలపై అధికారులు కొద్దిరోజులుగా కసరత్తు చేస్తున్నారు. ఇందు లో భాగంగా వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులకు గ్రామపంచాయతీ ఎన్నికల్లో నిర్వహించాల్సిన విధులను కేటాయించారు. తెలంగాణ లో గ్రామాల సంఖ్య పెరగడంతో బ్యాలెట్ బాక్సుల అవసరం మరింత ఏర్పడింది. అందుకే పక్క రాష్ర్టాల నుంచి బాక్సులు తెప్పిస్తున్నారు. అలాగే, గ్రామాలు, వార్డుల వారీగా కావాల్సిన బ్యాలెట్ పత్రాల అవసరాన్ని అంచనా వేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల ఎంపిక ఇప్పటికే పూర్తయ్యింది. ఇక, ఎన్నికల్లో విధులు నిర్వహించడానికి ఉపాధ్యాయులతోపాటు ఇతర శాఖల ఉద్యోగులను గుర్తించారు. పలుచోట్ల సిబ్బందికి శిక్షణ కొనసాగుతోంది. ఇక, ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులకు కేటాయించే గుర్తులు కూడా సిద్ధమైనట్టు సమాచారం.
పంచాయతీ గుర్తులివే..
గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గుర్తులపై తుది కసరత్తు పూర్తయ్యింది. సర్పంచ్ అభ్యర్థులకు 30 గుర్తులు, వార్డు సభ్యులకు 20 గుర్తులను ఆమోదించినట్లుగా తెలుస్తోంది. దాదాపు ఇవే గుర్తులు ఖరారయ్యే అవకాశం ఉంది.
సర్పంచ్ గుర్తులు:
ఉంగరం, కత్తెర, బ్యాటు, ఫుట్‌బాల్, లేడీ పర్సు, టీవీ రిమోట్, టూత్ పేస్టు, స్పానర్(పానా), చెత్త డబ్బా, బ్లాక్ బోర్డు, బెండకాయలు, కొబ్బరితోట, వజ్రం, బకెట్, డోర్ హ్యాండిల్, టీ జల్లెడ, చేతికర్ర, మంచం, పలక, టేబుల్, బ్యాటరీ లైట్, బ్రష్, క్రికెట్ బ్యాటర్, పడవ, బిస్కెట్, పిల్లనగ్రోవి, చైను, చెప్పులు, బెలూన్, క్రికెట్ వికెట్లు
రాష్ట్రంలోని పల్లెల్లో ప్రస్తుతం ఎన్నికల రిజర్వేషన్లే హాట్‌టాపిక్‌గా మారాయి. సామాజిక వర్గాల వారీగా ఆశావహులు పోటీకి సిద్ధమయ్యారు. పం చాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు అనుకూలించకుం టే స్థానిక ఎన్నికల వైపు గురిపెడుతున్నారు. పం చాయతీ ఎన్నికల్లో సగం దాకా మహిళా రిజర్వేషన్లు ఉండడంపైనా తర్జనభర్జన పడుతున్నారు. అయితే, రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. ఎన్నికల నిబంధనల ప్రకారం ఆయా గ్రా మాల్లో సామాజికవర్గాల జనాభాశాతం, మహిళల సంఖ్యతోపాటు గతంలో వరుసగా మూడుసార్లు వచ్చిన రిజర్వేషన్లను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నట్లుగా తెలిసింది. గతసారి వచ్చిన రిజర్వేషన్ ఈసారి మారవచ్చని అంటున్నారు. తమ గ్రామానికి ఫలానా రిజర్వేషన్‌ను కేటాయించాలని అధికారులకు వినతిపత్రాలు కూడా అందజేస్తున్నారు.మొత్తంగా ఎన్నికల కోడ్ వెలువడకముందే రిజర్వేషన్ల అంశం పల్లెల్లో ఉత్కంఠ రేపుతోంది. ఇక పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం రాష్ట్రవ్యాప్తంగా 12,848 గ్రామ పంచాయతీలను గుర్తించింది. వీటన్నింటికి ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన నివేదిక వివరాలను ‘ఆంధ్రజ్యోతి’ సంపాదించింది. దాని ప్రకారం మొత్తం 12,848 గ్రామ పంచాయతీల్లో 5,817 ఎంపీటీసీ స్థానాలుండగా, 570 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 868 గ్రామ పంచాయతీలు ఉండగా అక్కడ 352 ఎంపీటీసీ స్థానాలు, 33 జడ్పీటీసీ స్థానాలున్నాయి. ఇక, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో అత్యల్పంగా 34 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ జిల్లాలో 19 ఎంపీటీసీ, 3 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలకు జరగనున్నాయి.
అల్లూరి జిల్లాలలో భారీ ఎన్కౌంటర్ ముగ్గురు మావోయిస్టుల అగ్ర నేతల మృతి … ఏపీలోని అల్లూరు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో బుధవారం తెల్లవారు జామున భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు మావో యిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో మావోయిస్టులకు భారీ నష్టం జరిగింది. మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు ఉదయ్ అలియాస్ గాజర్ల రవి జోనల్ కమిటీ సభ్యురాలు అరుణ , అంజు మృతి చెందారు. . ఎన్‌కౌంటర్ ఘటనాస్థలి నుంచి మా వోయిస్టులు పరారయ్యారు. మరి కొంతమంది మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం .భూపాలపల్లి జిల్లా టేకు మట్ల మండలం వెలిశాల గ్రామా నికి చెందిన గాజుల రవి అలియాస్ ఉదయ్ 40 సంవత్సరాల ఉద్యమ ప్రస్థానం ముగిసింది., అప్పటి రాజ శేఖర్ రెడ్డి ప్రభుత్వంతో జరిగిన చర్చల ప్రతినిధిలో గాజర్ల రవి ఒకరు. సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఏవోబీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నారు. గాజర్ల రవి పై 25 లక్షల రివార్డు ఉంది గాజుల రవి మృతితో టేకుమట్ల మండలం వెలిశాలలో విషాదఛా యలు అలముకున్నాయి.
11వ “అంతర్జాతీయ యోగా దశాబ్ది ఉత్సవాల” జరుగున్న కార్యక్రమాలలో భాగంగా భారతదేశ ప్రధానమంత్రి పిలుపు మేరకు ఈ నెల 27 నుండి వచ్చే నెల 21 వరకు (25 రోజుల పాటు) జమ్మికుంట మండలంలో “ప్రాధమిక ఆరోగ్య కేంద్రం,ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్” GAD పోతీరెడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న”ఒకే భూమి ఒకే ఆరోగ్యం కోసం యోగా” కార్యక్రమం లో కరీంనగర్ జిల్లా ఆయుష్ ప్రాజెక్టు మేనేజర్ శ్రీ ప్రవీణ్ కుమార్ సారథ్యంలో…
మెడికల్ ఆఫీసర్ లు డాక్టర్ సంధ్యారాణి,GAD పోతీరెడ్డిపల్లి, ప్రిన్సిపాల్ CH.లచ్చయ్య, స్కూల్ స్టాఫ్, PET లు సిబ్బంది, పాల్గొన్న కార్యక్రమంను విజయవంతం చేసారు..
యోగ శిక్షణ కార్యక్రమలో. మెడికల్ ఆఫీసర్ సంధ్యా రాణి మాట్లాడుతూ… యోగా తో నిత్యం వాడే మందుల వాడకం తగ్గుతుందని చెప్పారు… ప్రిన్సిపాల్ లచ్చయ్య మాట్లాడుతూ… యువత శరీర శౌష్ణవం, వృద్ధి చెంది, ఆరోగ్యావంతమైన శరీరం ఏర్పడుతుందని…చెప్పారు..మరియు యోగా నిర్వాహకులు, ప్రఖ్యాత శిక్షకులు శ్రీ దేవునూరి శ్రీనివాస్ మాట్లాడుతూ…”భారతీయ జీవనశైలి లో అందరికి సంపూర్ణ ఆరోగ్యం కోసం యోగ నిత్య జీవితం లో భాగం చేసుకోవాలని ” పిలుపునిచ్చారు.
`తెలంగాణ సాయిధ పోరాటం కూనంనేని మర్చిపోయినట్లున్నాడు!
`కమ్యూనిజం సిద్దాంతాలకు తిలోదకాలిచ్చినట్లున్నాడు
`తెలంగాణలో విద్యుత్ ఉద్యమాలు చేసిన సిపిఐ వారసుడుగా మాట్లాడడం లేదు
`రాజకీయంగా కేసిఆర్ ను కూనంనేని ఏం మాట్లాడినా అభ్యంతరం లేదు
`ప్రజల సొమ్ముతో కట్టిన కాళేశ్వరం కూల్చాలనడం అవివేకం!
`కూనంనేని ఆంద్రా పక్షపాతి అని మరోసారి తేలింది
`ప్రాజెక్టుపై అవగాహన లేమి వ్యాఖ్యలు!
`తెలంగాణలో ఎర్రపార్టీలో కూనంనేని కుత్సిత స్వభావం
`పొత్తులో గెలిచినా నిజం మాట్లాడడం కమ్యూనిస్టుల నైజం
`కాళేశ్వరం బాగు చేసి నీళ్లివ్వాలని కోరాల్సిన కూనంనేని
`తెలంగాణ రైతును ఆగం చేసే సలహాలివ్వడం దురదృష్టకరం
హైదరాబాద్,నేటిధాత్రి:
కమ్యూనిస్టులు పేద పక్షపాతి సిద్దాంతాలు తిలోదకాలిచ్చినట్లున్నాయి. పాలకపక్షాలకు అనుబంధంగా మాట్లాడితే గాని మనుగడ సాగించలేవని నిర్ణయానికి వచ్చినట్లున్నాయి. అందులోనూ తెలంగాణ అంటే కమ్యూనిస్టుపార్టీలకు ఆది నుంచి చిన్న చూపే. వివక్షలకు కేంద్రమే.అందుకే తెలంగాణ ప్రగతి కోసం కమ్యూనిస్టులు మాట్లాడిరదిలేదు. ప్రశ్నించింది లేదు. కాని అడుగుడునా అభివృద్దికి అడ్డుపడ్డారన్న సంగతి చాలా మందికి తెలియదు. తెలంగాణలో ఏనాడు ప్రాజెక్టుల కోసం ప్రయత్నం చేయలేదు. పైగా తెలంగాణలో ప్రాజెక్టులను అడ్డుకున్న సందర్భం కూడా వుంది. కమ్యూనిస్టు పార్టీలు తెలంగాణలో ప్రాజెక్టుల విషయంలో ఏకతాటిపైకి వచ్చి అడ్డుకున్నసందర్బాలు కూడ వున్నాయి. అందుకే ఓ దశలో కేసిఆర్ దబ్బనం పార్టీలు కూడా వారిని విమర్శించారు. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, కాళేశ్వరం రద్దు చేయాల్సిందే అంటూ సిపిఐ ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావు సంచనల ప్రకటన చేశారు. కాలేశ్వరం అంటే కేసిఆర్, కేసిఆర్ అంటే కాళేశ్వరం అని గొప్పగా ప్రకటించుకున్న కేసిఆర్ ఇప్పుడు కమీషన్ మందు అబద్దాలు చెబుతున్నారన్నారు. నిజంగా కాళేశ్వరం గురించి తెలిసినా, ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడి తెలంగాణ రైతాంగం దృష్టిలో కూనం నేని సాంబశివరావు మరోసారి విలన్ అయ్యారని చెప్పక తప్పదు. తెలంగాణలో కాళేశ్వరం అంటే ఏమిటో ఆయనకు తెలియక మాట్లాడుతున్నాడా? లేక కాంగ్రెస్ గొంతుకై మాట్లాడుతున్నాడా? అన్నది ఆయనే చెప్పాలి. ఎందుకంటే కాళేశ్వరంలో భాగంగా మల్లన్న సాగర్ నిర్మాణం సమయంలో 50 టిఎంసిల రిజర్వాయర్ నిర్మాణం చేయొద్దని కమ్యూనిస్టులు పెద్దఎత్తున పోరాటం చేశారు. తెలంగాణకు ఏదో మేలు చేస్తున్నట్లు నటించారు. కాని ఇప్పుడు వారి వ్యహార శైలి ఏమిటో పూర్తిగా అర్ధమౌతోంది. అంటే సిపిఐ పార్టీకి కాళేశ్వరం నిర్మాణం చేయడమే ఇష్టం లేదని అర్ధమౌతోంది. కాళేశ్వరం నిర్మాణం జరిగితే ఆంద్రాకు ఇబ్బంది అవుతుంది? ఇదీ కమ్యూనిస్టుల ఆలోచనలాగా వుంది. నిజానికి తెలంగాణ ఉద్యమానికి కమ్యూనిస్టులు వ్యతిరేకం. కమ్యూనిస్టులది సమైక్య వాదం. విశాలాంద్ర నినాదం. అందుకే ఇంకా ఆ భావన నుంచి కమ్యూనిస్టులు బైటకు రాలేకపోతున్నారు. మంచికో చెడుకో సిపిఎం పార్టీ ఆది నుంచి అదే స్టాండ్ మీదవుంది. తెలంగాణ ప్రకటించిన నాటికికూడా సమైక్యాంధ్ర నినాదాన్నే ఎత్తుకున్నది. ఏపిలో సమైక్య ఉద్యమం సాగించింది. కాని సిపిఐ మాత్రం మనుగడ కోసం తెలంగాణ ఉద్యమానికి మద్దతునిచ్చింది కాని, తెలంగాణ వాదం ఆ పార్టీలో లేదని కూనం నేని వ్యాఖ్యలతో తేలిపోతోంది. ఓ వైపు తెలంగాణ సమాజం మొత్తం కాళేశ్వరంతో నీళ్లందాయని నమ్ముతుంటే రైతులు నెత్తి నోరు కొట్టుకొని మొత్తుకుంటుంటే కూనంనేని సాంబశివరావుకు తెలియడం లేదా? కాళేశ్వరం నీళ్ల ఖమ్మం జిల్లాలో కనిపించలేదా? ఇప్పటికీ ఎల్లంపల్లినీళ్లే తెలంగాణను ఆదుకుంటున్నాయా? అదే నిజమైతే తెలంగాణ ఉద్యమం ఎందుకొచ్చింది? తెలంగాణ ఉద్యమానికి సిపిఐ ఎందుకు ముద్దతిచ్చింది. తెలంగాణ ఉద్యమంలో న్యాయం ఎలా కనిపించింది? ఎల్లంపల్లితోనే తెలంగాణ సాగు సాగితే ఏటా తెలంగాణకు కరువెందుకు వచ్చింది? తెలంగాణ పల్లెలు వలసలు ఎందుకు వెళ్లిపోయాయి? పాలమూరు ఎందుకు వలసల జిల్లా అయ్యింది? మాట్లాడే ముందు కనీసం సోయితో కూనంనేని మాట్లాడితే బాగుండని తెలంగాణ వాదులు కోరుతున్నారు. కాలేశ్వరం వల్ల ఎక్క ఎకరాకు నీరందలేని అసత్యాలు మాట్లాడితే ప్రజలు స్వాగతిస్తారా? లేదా అన్న ఆలోచన కూడా లేకుండా ప్రకటనలు చేయొచ్చా? ఎల్లంపల్లి ద్వారా తెలంగాణ పంటలు పండితే 2014 వరకు తెలంగాణలో చెరువులెందుకు నిండలేదు. కాలువలెందుకు పారలేదు. వాగులు, వంకలు ఎందుకు జీవ కాలువలు కాలేదు. బోర్లు ఎందుకు వెయ్యి ఫీట్లు వేసినా నీళ్లు రాకపోయేవి. ఎండాకాలం సరిగ్గా పంట చేతికి వచ్చే సమయంలో చుక్క నీరు కూడా అందకపోయేది. తెలంగాణలో బావులన్నీ ఎందుకు ఎండిపోయాయి? తెలంగాణ రైత సాగు వదిలేసి ఎందుకు వలసలు వెళ్లినట్లు? హైదరాబాద్‌లో పెద్ద పెద్ద రైతులు కూడా సెక్యూరిటీ గార్డులుగా పనిచేసినట్లు? పాలమూరు నుంచి నిత్యం బొంబాయి, పూన, షోలాపూర్, బీవండి, సూరత్‌కు బస్సులు ఎందుకు నడిచినట్లు? ఈ సంగతులన్నీ కూనంనేనికి తెలియనివా? శ్రీరాం సాగర్ ప్రాజెక్టు కూడా కొంత కాలం ఆగితే నిర్మాణం చేసేవారు కాదు. అప్పుడే ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటుకావడంతోపాటు ప్రధాని నెహ్రూ చొరవతీసుకొని ప్రాజెక్టు శంకుస్ధాపన చేశారు. అయినా ఎన్నేళ్లు శ్రీరాం సాగర్ ప్రాజెక్టు సాగిందో కూనం నేనికి తెలియదా? 16లక్షల ఎకరాలకు సాగు నీరిచ్చేలా డిజైన్ చేసిన శ్రీరాం సాగర్ ను 14 ఎకరాలకు కుదించిన వారు ఎవరు? అలా నిర్మాణం చేసినా కనీసం ఐదు లక్షల ఎకరాలకు పారకం పారించారా? శ్రీరాంసాగర్‌లో నీళ్లున్నా తెలంగాణ రైతులకు నీళ్లు విడదల చేయమంటే చేసేవారా? తెలంగాణకు కరువొచ్చినా ఫరవాలేదని వదిలేసిన కాలం లేదా? ఎల్లంపల్లి ఎప్పుడు మొదలు పెట్టారు? ఎప్పుడు పూర్తి చేశారు. దాని వల్ల తెలంగాణ సాగు పెరిగిందా? కరువు తీరిందా? తెలంగాణ అదనపు స్ధిరీకరణ జరిగిందా? ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ గోసను కమ్యూనిస్టులు చూడలేదా? కాని తెలంగాణ ప్రయోజనాలు పట్టవు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం చేసి, ఆంద్రాలో అనేక రిజర్వాయర్లు నిర్మాణం చేస్తున్నా ఏనాడైనా సిపిఐ ప్రశ్నించిందా? రాయలసీమ కరువు మీద వున్న ప్రేమ పాలమూరు మీద సిపిఐ చూపించిందా? ఆంద్రాలో 70 టిఎంసిల కండలేరు నిర్మాణం చేస్తున్నప్పుడు కళ్లలో ఏం పెట్టుకున్నారు. అప్పుడు భూకంపాలు వస్తాయని ఎప్పుడైనా అన్నారా? వెలిగొండ 43 టిఎంసిలతో నిర్మాణం చేస్తుంటే ఏనాడైనా అడ్డుకున్నారా? ఈ ఎత్తిపోతల వల్ల ప్రజా దనం వృదా అని ప్రశ్నించారా? లేదు. ఆంద్రాలో రిజర్వాయర్ల నిర్మాణం కోసం ఉద్యమాలు చేశారు. తెలంగాణ ఎండబెట్టేందుకు సహకరించారు. పోతిరెడ్డి పాడు నుంచి మద్రాసు దాకా నీళ్లు వెళ్తుంటే తెలంగాణకు నీళ్లియ్యాలని కొట్లాడిన చరిత్ర సిపిఐకి వుందా? లేదు. ఆంద్రాలో ఊరకళ్లు, బ్రహ్మంగారి మఠం, అలుగునూరు, అవుకు ఇలా అనేక రిజర్వాయర్లు నిర్మాణం చేసినా అడ్డుకోలేదు. అంతెందుకు పోలవరం వల్ల ఖమ్మం ఉమ్మడి జిల్లాకు నష్టం జరుగుతుందని ఏనాడైనా మాట్లాడిన సందర్భం వుందా? భద్రాద్రి రాముడు మునిగిపోయే ప్రమాదమున్నా ప్రశ్నించారా? ఇప్పుడు బనకచర్లకు గోదావరి నది నుంచి 200టిఎంసిల నీరు తరలించుకుపోవాలని ఏపి ప్రభుత్వం చూస్తుంటే సిపిఐ కళ్లు మూసుకున్నదా? తెలంగాణలోని కాళేశ్వరం రద్దు చేస్తే ఏపికి నీళ్లు వరదలా వెళ్తాయి. అటు పోలవరానికి పుష్కలంగా నీరందుతాయి. బనకచర్లకు కూడా నీళ్లు పారుతాయి. బనకచర్ల కూడాఎత్తిపోతల పధకమే? అది ఎలా సక్రమమౌతుంది? దానికి విద్యుత్ ఖర్చు కాదా? ఉమ్మడి రాష్ట్రంలో నిర్మాణం చేసిన అనేక రిజర్వాయర్లు నిండేందుకు ఎత్తిపోతల పథకాలకు ఖర్చు కావడం లేదా? పోతిరెడ్డి పాడు వల్ల ఎంత విద్యుత్ వినియోగమౌతుందో తెలియదా? అన్నీ తెలుసు. కాని కూనం నేనికి తెలంగాణ ప్రయోజనాలు పట్టవు. తెలంగాణలో ఎమ్మెల్యేగా వుండాలి. ఆంద్రా ప్రయోజనాలు కాపాడాలి. తెలంగాణ ప్రజలు ఎప్పుడూ సమస్యలతో వుండాలి. కమ్యూనిస్టులు ఉద్యమాలతో ఉనికిని కాపాడుకోవాలి. ఆ పార్టీల మనుగడ కోసం ప్రజలు కష్టాల పడాలి. అన్నమో రామచంద్రా అంటుంటే ప్రజలను ఆదుకుంటున్నట్లు, వారి పక్షనా పోరాటం చేస్తున్నట్లు కమ్యూనిస్టులు నటించాలి. నాయకులుగా వెలుగొందాలి. సిపిఐ స్వార్ధపూరిత రాజకీయాల కోసం తెలంగాణ రైతులను ఆగం చేయాలి. గతంలో చంద్రబాబు రెండోసారి సిఎంగా గెలిచిన తర్వాత కరంటు చార్జీలు పెంచడం జరిగింది. అయితే అప్పుడు కమ్యూనిస్టులు తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేసినట్లు కలరింగ్ ఇచ్చారు. తెలంగాణ రైతులను రెచ్చగొట్టి వారి చావులకు కారణమయ్యారు. కాని ఏపి రైతులు నీటి తీరువాతో సాగు సాగిస్తుంటారు. అందులోనూ బోర్లు వినియోగిస్తుంటారు. వారికి కరంటు బిల్లులు భారమౌతాయని వారి పక్షాన పోరాటం చేసేందుకు తెలంగాణ రైతులను రెచ్చగొట్టారు. అప్పుడూ కమ్యూనిస్టుల నిజస్వరూపం తేలిపోయింది. తెలంగాణ వచ్చినా, ఆంద్రా ప్రయోజనాలే మోస్తోంది. కూనం నేని వ్యాఖ్యలు తెలంగాన రైతాంగానికి ఆగ్రహం తెప్పించింది.
`తెలంగాణ వస్తే నేనే సీఎం అని కేసీఆర్ చెప్పుకోలేదు.
`దళితుడు సీఎం అని చెప్పి అధికారంలోకి వచ్చిండు.
`రేవంత్ రెడ్డి నేనే సీఎం అని కూడా అనేక సార్లు అన్నాడు.
`వైఎస్. రాజశేఖరరెడ్డి సీఎం కావాలని కలలుగన్నాడు.
`అది నెరవేరడానికి ముప్పై సంవత్సరాలు కష్టపడ్డాడు.
`సొంత పార్టీలోనే అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు.
`ఆఖరుకు పాదయాత్ర చేసి సిఎం అయ్యారు.
`అప్పుడు కూడా నేనే సీఎం అని ఎప్పుడూ చెప్పలేదు.
`చంద్రబాబునాయుడు కూడా ఎప్పుడూ నేను సిఎం అవుతానని చెప్పింది లేదు.
`ఎన్టీఆర్ బతికున్నంత కాలం ఆయనే సిఎం అని అనేక సార్లు అన్నాడు.
`ఆఖరుకు ఎన్టీఆర్ కు పక్కన పెట్టి సిఎం అయ్యారు.
`నేను సీఎం అవుతా అని అవరోధాలెదురౌతున్నా చెప్పిన ఏకైక లీడర్ రేవంత్.
హైదరాబాద్ ,నేటిధాత్రి:
ప్రతి వ్యక్తికి ఒక లక్ష్యం వుంటుంది. చిన్నప్పుడు పెద్దయ్యాక ఏమౌతావని అడిగితే డాక్టర్, ఇంజనీర్, లాయర్, కలెక్టర్ ఇలాంటి మాటలు వింటుంటాం. ఇప్పుడు కొద్దిగా పరిస్దితి మారింది. సాఫ్ట్ వేర్ అంజనీర్ అనే పదం పిల్లలకు కూడా తెలిసిపోయింది. గత తరంలో మాత్రం ప్రభుత్వఉద్యోగాలు గురించి మాత్రమే తల్లిదండ్రులు చెప్పేవారు. ఒకవేళ తమ పిల్లలు మెకానిక్ అవుతా అంటే ఆ తల్లిదండ్రులు షాక్ అయిన సందర్భాలు కూడా వుంటాయి. ఇన్ని కోట్ల మందిలో అందరూ చెప్పిన సమాదానం కన్నా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు మాత్రం ప్రత్యేకం. చిన్నప్పుడు స్నేహితులతో ఎప్పుడు మాట్లాడినా లీడర్ నైతా అంటూ చెప్పేవారిన ఆయన సన్నిహితులు, చిన్న నాటి స్నేహితులు ఇప్పటికీ గర్తు చేస్తుంటారు. చిన్న నాటి నుంచే రేవంత్‌రెడ్డి లీడర్ లక్షణాలు పునికి పుచ్చుకున్నట్లు చెబుతారు. అలాగే ఆయన పెరిగి పెద్దై లీడర్‌గానే ఎదిగారు. సహజంగా లీడర్ కావాలనుకున్నప్పుడు రాజకీయ పార్టీలో కార్యకర్తగా, ఆ తర్వాత సర్పంచ్ ఇలా అంచెలంచెలుగా ఎదుగిన వారున్నారు. కాని ఒకే సారి జడ్పీటీసి అయిన నాయకులు చాలా తక్కువ. అది కూడా ఇండిపెండెంట్‌గా గెలవడం అంటే మాటలు కాదు. సామాన్యమైన విషయంకాదు. అందులోనూ ఉమ్మడి రాష్ట్రంలో బలంగా వున్న కాంగ్రెస్, తెలుగుదేశం, మరో వైపు బిఆర్‌ఎస్ పార్టీల హవా కొనసాగుతున్న తరుణంలో ఇండిపెండెంటుగా మిడ్జిల్ జడ్పీటీసి అయ్యారు. లీడర్‌గా తొలి మెట్టు ఎక్కేశారు. ప్రజా ప్రతినిధి అయ్యారు. తర్వాత వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఒంటరిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లోనూ ఇండిపెండెంటుగా ఎమ్మెల్సీ కావడం అంటే సామాన్యమైన విషయం కాదు. అప్పుడు కూడా బలమైన మూడు రాజకీయపార్టీలను కాదని ,రేవంత్‌రెడ్డి గెలవడం అనేది గొప్ప అవకాశం. అలా మండలిలో అడుగుపెట్టిన రేవంత్‌రెడ్డిని ఓ మాజీ ఎమ్మెల్సీ ఏం కావాలని ఎమ్మెల్సీ అయ్యారు? అని ప్రశ్నిస్తే సిఎం. అని క్షణం ఆలోచించుకోకుండా రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పారు. నిజానికి ఆ సమయంలో రేవంత్ రెడ్డి మాటను ఎవరూ నమ్మరు. అలాంటి సమాధానం ఎవరు చెప్పినా, మనసులో నవ్వుకుంటారు. లేక అవునా…అంటూ ధీర్ఘం తీస్తారు. ఎవరు ఏమనుకుంటే నాకేంటి? అనుకునే ఆత్మ విశ్వాసం నిండుగా వున్న రేవంత్ రెడ్డి సిఎం. కావాలన్న లక్ష్యమే ఇంత దూరం నడిపించింది. ఆయనలో ఆత్మవిశ్వాసమే కాదు, అతి విశ్వాసాన్ని కూడా నింపింది. లేకుంటే ఇంత దూరం వచ్చేవారు కాదు. సహజంగా ఎవరికైన ఒక దశలో అతి విశ్వాసం కూడా అవసరమౌతుందని రేవంత్‌రెడ్డి జీవితాన్ని చూస్తే అర్ధమౌతుంది. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, టిడిపిలకు మాత్రమే సిఎం అయ్యే చాన్సులు వస్తాయి. రేవంత్‌రెడ్డి ఎమ్మెల్సీ అయిన తర్వాత తెలుగుదేశంపార్టీలో చేరారు. అంటే ఉమ్మడి రాష్ట్రంలో రేవంత్‌రెడ్డికి తెలుగుదేశంలో సిఎం. అయ్యే అవకాశం వచ్చేదో లేదో కాని, తదాస్తు దేవతలు మాత్రం అప్పుడే దీవించారు. ఇంతలో తెలంగాణ ఉద్యమం బలపడిరది. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా వున్న వైఎస్ అకాల మరణం చెందారు. ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. తెలంగాణ రానే వచ్చింది. తెలంగాణ నుంచి తెలుగుదేశం క్రమక్రమంగా కనుమరుగౌతూ వచ్చింది. అయితే ఇక్కడ మరికొన్నివిషయాలు చెప్పుకోవాలి. నిజానికి రేవంత్‌రెడ్డికి తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు కావాలని బలంగా వుండేది. కాని ఆ పదవికి అడుగడుగునా అప్పుడున్న తెలుగుదేశం నాయకులు అడ్డుపడ్డారు. రేవంత్‌రెడ్డిని తెలంగాణ అధ్యక్షుడుకాకుండా అడ్డుపడ్డారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో మరింత బలహీనపడుతూ వచ్చింది. అప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వైపు చూశారు. ఏం మాయా మంత్రం చేశారో గాని కాంగ్రెస్‌లో చేరారు. చేరుతూనే వర్కింగ్ ప్రెసిడెంటు అయ్యారు. అయితే ఇక్కడ కూడా నల్లెరు మీద నడకసాగలేదు. కాంగ్రెస్‌లో ఎంట్రీ అంత సులువుగా జరగలేదు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన తర్వాత అవమానాలు తప్పలేదు. సీనియర్ నాయకులు బెదిరింపులు తప్పలేదు. అందుకు ఎదురీత రేవంత్‌రెడ్డికి తప్పలేదు. కాని ఆయన లక్ష్యం ఒక్కటే…తాను జీవితంలో సిఎం కావాలి! అనే లక్ష్యం ముందు అన్నీ చిన్నవిగా మారిపోయాయి. అటు కేసిఆర్ ప్రభుత్వ వేధింపులు, ఇటుకాంగ్రెస్ పార్టీలోసీనియర్ నాయకుల చిన్న చూపులు ఎన్ని వున్నా వెరవలేదు. బెదరలేదు. లక్ష్యం చేరే వరకు అలసిపోలేదు. అందుకే సిఎం అయ్యారు. ఆ సమయంలో కూడా తాను సిఎం. అవుతానన్న నమ్మకంతోనే ఆయన పార్టీని భుజాల మీద మోశాడు. కాంగ్రెస్ పార్టీని పదేళ్ల తర్వాత అధికారంలోకి తెచ్చాడు. తన పంతం నెగ్గించుకోవడమే కాదు, గమ్యం చేరాడు. లక్ష్యం నెరవేర్చుకున్నాడు. ఇలా రాజకీయాల్లో లక్ష్య సిద్దితోపాటు, కేసిఆర్‌ను పడగొట్టి నిలబతానని, సిఎం. అవుతానని చాలెంచ్ చేసిన ఏకైక నాయకుడు రేవంత్‌రెడ్డి. తెలుగు రాజకీయ చరిత్రలోనే ఇలా సిఎం. అయిన నాయకుడు వన్ అండ్ ఓన్లీ రేవంత్ రెడ్డి. సిఎం కావాలన్న కలను నెరవేర్చుకున్న మరో నాయకుడు ఎన్టీఆర్. నిజానికి ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదు. ఇక సినిమాల నుంచి తప్పుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కొత్త తరం సినీరంగంలోకి ప్రవేశిస్తోంది. ఆ సమయంలో రాజకీయాల వైపు మళ్లాలన్న ఆలోచన వచ్చింది. కాని ఏదో ఒక పదవి తీసుకోవాలని మాత్రమే అనుకున్నారు. అప్పటి కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఒకరిద్దరితో చర్చలు కూడా జరిపారు. కాని లాభం లేదన్న సమాధానం వినాల్సివచ్చింది. పైగా అవమానాలు కూడా ఎదురయ్యాయి. దాంతో ఎవరో ఇచ్చే పదవి నాకెందుకు? నేనే లీడర్లను తయారు చేస్తాను. ఇంత కాలం ఆదరించిన ప్రేక్షకులకు రుణం తీర్చుకుంటాను. సిఎం. అయి తన ఆత్మగౌరవాన్ని నిలుపుకుంటాననకున్నాడు. అప్పటికే రాజీవ్‌గాంధీ అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి అంజయ్యను అవమానించారన్న వార్త దావాణలంలా వ్యాపించింది. తెలుగువారి ఆత్మగౌరవం డిల్లీలో తాకట్టులో వుందన్న అభిప్రాయం ప్రజల్లో నెలకొన్నది. అదే సమయంలో తెలుగుజాతి విముక్తి, తెలుగు ఆత్మగౌరవం అంటూ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ప్రకటించారు. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అదికారంలోకి వచ్చారు. ఆ సమయంలో కాంగ్రెస్‌ను ఓడిరచి, సిఎం అయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో కొత్త రాజకీయ నీరును అందించారు. కాంగ్రెస్‌లో హేమా హేమీలనుకున్న నాయకులంతా కొత్త వారి చేతిలో ఓడిపోయారు. అసలు నవయువకులెంతో మంది మంత్రులయ్యారు. అలా తనకు జరిగిన అవమానం నుంచి సిఎం. అవుతానాన్నారు. అయ్యారు. ఈ ఇద్దరు తప్ప చరిత్రలో తాను సిఎం. కావాలని అనుకున్నవారు లేదు. అయినవారు లేరు. ఉమ్మడి రాష్ట్రంలో 1980 నుంచి సిఎం కావాలని కలలు గన్న వైఎస్ రాజశేఖరరెడ్డి 2004 వరకు ఎదరుచూడాల్సి వచ్చింది. సీనియర్ల ఎప్పుడు పోతారో..తాను సిఎం ఎప్పుడు అవుతానో అనుకునేవారని కొందరు చెబుతుండేవారు. కాని నేను సిఎం అవుతా ముందే చెప్పిన నాయకుడు కాదు. ఎమ్మెల్యే , మంత్రి అయిన తర్వాత సిఎం. ఆశలు చిగురించాయి. 2004కు ముందు ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర చేసి కాంగ్రెస్‌పార్టీని గెలిపించారు. పాదయాత్ర సమయంలో కూడా ఆయన ఎక్కడా నేనే సిఎం అవుతానని చెప్పింది లేదు. అధిష్టానం ఎవరికి అవకాశమిస్తే వాళ్లే సిఎం. అవుతారని చెప్పాడు. అంతే కాని రేవంత్‌రెడ్డిలా సిఎం. అవుతానని చెప్పలేదు. ఇక ఏపి ముఖ్యమంత్రిగా నాలుగోసారి పనిచేస్తున్న చంద్రబాబు నాయుడుకు సిఎం. కావాలన్న ఆశ వున్నప్పటికీ ఎప్పుడూ, ఎక్కడ చెప్పినట్లు లేదు. ఎన్టీఆర్ వున్నంత కాలం ఆయనే సిఎం. అని అనేక సార్లు చెప్పిన నాయకుడు చంద్రబాబు. కాకపోతే ఆ పరిస్ధితులు ఆయనను సిఎం. చేశాయి తప్ప, తాను సిఎం అవ్వడానికే రాజకీయాల్లో వచ్చానని ఏనాడు చెప్పలేదు. కకపోతే ఎవరికైనా మనసులో వుంటుంది. బైటకు పదిమందిలో పదే పదే చెప్పిన నాయకుడు రేవంత్ తప్ప మరేవరూ లేదు. అంతెందుకు తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టిన కేసిఆర్ కూడా తాను సిఎం. అవుతానని ఎప్పుడూ చెప్పలేదు. ఆంతరంగిక సమావేశాలలో అనేవారు అని కొంత మంది చెబితే వినడమే తప్ప ప్రజలకు నేరుగాచెప్పింది లేదు. ఆఖరుకు తెలంగాణ వచ్చిన తర్వాత బిఆర్‌ఎస్‌ను గెలిపిస్తే తొలి ముఖ్యమంత్రి దళితుడే అని ప్రచారం చేశారు. నేనే సిఎం.అని కేసిఆర్ ఎక్కడ చెప్పలేదు. అయితే నేను సిఎం అవుతానని చెప్పిన ఇద్దరు లీడర్లలలో మరోక విషయంలోనూ పోలిక వుంది. ఎన్టీఆర్ రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చారు. పేదలకు సన్న బియ్యం ఉచితంగా ఇచ్చి పేదల కడుపు రేవంత్ నింపుతున్నారు. ఈ విషయంలోనూ ఇద్దరూ చరిత్ర సృష్టించారు. చరిత్రలో నిలిచిపోతారు.
కేసముద్రం మున్సిపాలిటీలోని హరిహర గార్డెన్ ఫంక్షన్ హాల్ లో మంగళవారం మహబూబాబాద్ పార్లమెంట్ అడహక్ కమిటీ కన్వీనర్ గా కొండపల్లి రామచందర్ రావు అధ్యక్షత వహించగా రాష్ట్ర టిడిపి పార్టీ పరిశీలకులుగా యనాల అనంతరెడ్డి హాజరై కేసముద్రం టిడిపి మండల పార్టీ ఎన్నికలను నాయకుల, కార్యకర్తల మధ్య ఏకగ్రీవ ఎన్నిక నిర్వహించారు. కేసముద్రం టిడిపి మండల పార్టీ అధ్యక్షునిగా ఏశబోయిన ఎల్లయ్య ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర టిడిపి పార్టీ ఉపాధ్యక్షులు బండి పుల్లయ్య,రాష్ట్ర మాజీ కార్యదర్శిలు ఎం డి. ఇమామ్, వెంకటనారాయణ, మహబూబాబాద్ పార్లమెంటు మాజీ అధికార ప్రతినిధి ప్రేమ్ చంద్,కొరివి మండల పార్టీ అధ్యక్షుడు వీరస్వామి, మహబూబాబాద్ మాజీ మండల పార్టీ అధ్యక్షుడు బొమ్మ వెంకటేశ్వర్లు హాజరైనారు. అదేవిధంగా మండల పార్టీ ఉపాధ్యక్షులుగా యాసారపు నరసయ్య,ప్రధాన కార్యదర్శిగా బోడకుంట్ల సత్యనారాయణ, కార్యనిర్వాహక కార్యదర్శులు గూడేలు ముత్తయ్య,గుగులోత్ లక్ష్మణ్,భూక్య లచ్చిరాం, కార్యదర్శులుగా ఆవుల సారయ్య,షేక్ దలాల్ షరీఫ్, కోశాధికారిక గుర్రాల స్వరూపాలను ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షులుగా ఎన్నికైన యశోబోయిన ఎల్లయ్య మాట్లాడుతూ… మండల కేంద్రంలో టిడిపి పార్టీని మరింత బలోపేతం చేసి అభివృద్ధి దిశగా నడిపిస్తూ రానున్న స్థానిక ఎన్నికలలో టిడిపిని మంచి స్థానంలో నిలిపేలా కృషి చేస్తానని నా ఎన్నికకు సహకరించిన రాష్ట్ర జిల్లా మండల నాయకులకు కార్యకర్తలకు ప్రత్యక్ష కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.
సీఈఐఆర్ పోర్టల్ ద్వారా మొబైల్ ఫోన్ బాధితునికి ఫోన్ అందించిన పోలీసులు
జైపూర్ నేటి ధాత్రి:
shine junior college
జైపూర్ మండలం ఇందారం దక్కన్ గ్రామీణ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న బానోతు సురేష్ జూన్ 5వ తేదీన తన మొబైల్ ఫోన్ ఎక్కడో పోయినట్లు తెలిపారు. ఆందోళన చెందిన బాధితుడు జైపూర్ పోలీస్ స్టేషన్ లో జూన్ 13వ తేదీన తన మొబైల్ ఫోన్ పోయిందని దరఖాస్తు ఇవ్వగా పోలీస్ వారు సిఈఐఆర్ పోర్టల్ కంప్లైంట్ నమోదు చేసుకొని ట్రేస్ చేసి తన మొబైల్ 17వ తేదీ మంగళవారం బానోత్ సురేష్ కి జైపూర్ పోలీసులు అందజేయడం జరిగింది.ఎవరి ఫోను చోరీకి గురైన ఎక్కడైనా ఫోన్ మిస్సయిన ఆందోళన చెందకుండా సిఈఐఆర్ అప్లికేషన్ ద్వారా తమ మొబైల్ ఫోన్ తిరిగి పొందే అవకాశం ఉందని పోలీసులు తెలియజేశారు.
ప్రజా ప్రభుత్వంలో సంక్షేమాన్ని వెనకబడనివ్వం.. అభివృద్ధిని ఆగనివ్వమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క,రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, డీసీసీ అధ్యక్షుడు, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చేతుల మీదుగా కొత్తపల్లిగోరి మండలం చెన్నాపూర్ గ్రామంలో నూతనంగా రూ. 140 లక్షలతో నిర్మించిన సబ్ స్టేషన్ ను ప్రారంభించారు. అనంతరం మొరంచపల్లి నుండి మంజూరునగర్ వరకు వరకు సాగిన పెద్ద సంఖ్యలో ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించగా, ఈ ర్యాలీలో అతిథులు ప్రచార రథంపై ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అనంతరం మంజూరునగర్లో నవాబుపేట, ధర్మారావుపేట, మంజూరునగర్ గ్రామాల్లో నూతనంగా నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ… ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రజలపై ఒక్క రూపాయి భారం మోపకుండా వేల కోట్లతో సంక్షేమ పథకాలు తీసుకువస్తున్నామని అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు తీసుకురాబోతున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి మేలు చేయాలన్న తలంపుతో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం క్యాబినెట్ నిరంతరం కృషి చేస్తుందన్నారు.ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని అన్నారు. రూ.22,500 కోట్లు ఖర్చు చేసి 4.50 లక్షల మందికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించబోతున్నామని తెలిపారు. గత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి, కనీసం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. మేం అధికారంలోకి రాగానే సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేసి గ్రూప్ వన్ పరీక్షను విజయవంతంగా నిర్వహించామున్నారు.
Groundbreaking ceremony
ఏడాదిన్నర కాలంలో 57వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసాం, మరో 30 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయబోతున్నామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు యువతను ఆర్థికంగా ప్రోత్సహించేందుకు తొమ్మిది వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం స్వయం ఉపాధి పథకాన్ని తీసుకువచ్చామన్నారు. 5 లక్షల మంది నిరుద్యోగులు వారి కాళ్లపై వారు నిలబడేలా ప్రోత్సహించేందుకు తొమ్మిది వేల కోట్ల నిధులు ఖర్చు చేయనున్నామన్నారు. ప్రజా ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీని మొదటి ఏడాదిలోనే చేసిందన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతు రుణమాఫీ కోసం రూ. 21,500 కోట్లు ఖర్చు చేసామన్నారు. రూ.13 వేల కోట్లు ఖర్చు చేసి 90 లక్షల కుటుంబాలకు ఒక్కొక్కరికి ప్రతి నెల 6 కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో సగభాగంగా ఉన్న మహిళలు రాష్ట్రంలోని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి, గుడికి, లేదా పిల్లల బడికి వెళ్లేందుకు ప్రతి మహిళ ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యాన్ని ఇందిరమ్మ ప్రభుత్వం కల్పించిందన్నారు. పేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను అందించేందుకు యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ నిర్మిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాలల్లో గుమ్మడి శ్రీదేవి అప్పం కిషన్ విస్లావత్ దేవన్ పిప్పాల రాజేందర్ సుంకర రామచంద్రయ్య పెద్ద సంఖ్యలో నియోజకవర్గంలోని కాంగ్రెస్ శ్రేణులు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
మంత్రి భట్టి విక్రమార్క కు వినతి పత్రం ఇచ్చిన కేబుల్ ఆపరేటర్లు…
కరెంట్ పోల్ టాక్స్ ను రద్దు చేయాలని డిమాండ్.
భూపాలపల్లి నేటిధాత్రి:
shine junior college
ఆపరేటర్లకు భారంగా మారుతున్న పోల్ టాక్స్ ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని తెలంగాణ కేబుల్ ఆపరేటర్ల సంగం రాష్ట్ర అధ్యక్షుడు పాల్వంచ కోటేశ్వర్ రావు డిమాండ్ చేశారు…
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ని సింగరేణి ఫంక్షన్ హాల్ లో కేబుల్ ఆపరేటర్ల సంగం రాష్ట్ర అధ్యక్షుడు పాల్వంచ కోటేశ్వర్ ఆధ్వర్యంలో కేబుల్ ఆపరేటర్ల సమావేశం జరిగింది…ఈ కార్యక్రమంలో ఇండిపెండెంట్ కేబుల్ ఆపరేటర్ల సంగం రాష్ట్ర అధ్యక్షులు వేశాల రమేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు..ఈ సందర్భంగా కేబుల్ ఆపరేటర్లు ఎదురుకుంటున్న సమస్యల పై చర్చించారు…ముక్యంగా ఆపరేటర్లు ఎదురుకుంటున్న ప్రధాన సమస్య పోల్ టాక్స్ ను వెంటనే రద్దు చేయాలని ఆపరేటర్లు కోరారు..ప్రభుత్వాలకు,ప్రజలకు నిత్యం వారధి లా ఉండే కేబుల్ టీవీ వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ఆపరేటర్ల పై ఉందన్నారు…ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కేబుల్ ఆపరేటర్లకు కరెంట్ పోల్ టాక్స్ ను రద్దు చేస్తామని హామీ ఇచ్చిన తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఆ హామీ అమలు కాలేదన్నారు…అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన.. ఆచరణ లోకి రాలేదని కేబుల్ ఆపరేటర్లు తెలిపారు..ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కేబుల్ ఆపరేటర్ల సమస్యలను పట్టించుకోవాలని తెలంగాణ కేబుల్ ఆపరేటర్ల సంగం నాయకులు కోరారు..ఈ సందర్భంగా ఫంక్షన్ హాల్ నుండి అంబేద్కర్, జయశంకర్ విగ్రహం మీదుగా జెన్కో వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు…అనంతరం ఉపముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క కు కేబుల్ ఆపరేటర్లు వినతి పత్రం సమర్పించారు…పోల్ టాక్స్ ను రద్దు చేయాలని కోరారు..ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కేబుల్ ఆపరేటర్లు పాల్గొన్నారు…
మొహమ్మద్ ఫరీద్ ఉద్దీన్ ఫ్లైఓవర్ సింబల్‌బోర్డ్‌లో ఉర్దూ భాష విస్మరి విస్మరిస్తున్న ప్రభుత్వం.
జహీరాబాద్ నేటి ధాత్రి:
shine junior college
జహీరాబాద్‌లోని ఈద్గా ముందు ఉన్న కొత్త ఫ్లైఓవర్ వంతెన పైన ఉన్న సైన్ బోర్డుపై ఉర్దూలో ఎలాంటి రాతలు లేవు. AIMIM జహీరాబాద్ అధ్యక్షుడు మొహమ్మద్ అత్తర్ అహ్మద్ ఈ విషయం గురించి సమాచారం అందుకున్న వెంటనే, జమాత్ ప్రతినిధులు మా ఫ్లైఓవర్ వంతెన వద్దకు చేరుకుని, మొదట ఆ పనిని నిలిపివేసి, తెలంగాణ రాష్ట్ర రెండవ ప్రభుత్వం ఉర్దూలో మాట్లాడుతున్నప్పటికీ, ఉర్దూను విస్మరించారని మరియు R&B శాఖ ప్రతినిధులు వచ్చి ఈ సమస్యను పరిష్కరించే వరకు,అతను జహీరాబాద్ RDO సిబ్బంది తో R&B గురించి మాట్లాడాడని నోటీసు జారీ చేశాడు.
Ε.Ε మరియు A E తో ఫోన్‌లో మాట్లాడి, ఈ బోర్డుపై ఉర్దూ రాయడం పూర్తి చేయని వరకు,ఈ బోర్డును అమర్చడానికి మేము అనుమతించబోమని డిమాండ్ చేశాడు. దీనిపై, టౌన్ S.I వినయ్ కుమార్ R&B శాఖ ప్రతినిధులతో మాట్లాడి A.E సంధ్య ను ఫోన్ చేసి, వారిద్దరూ కలిసి 24 గంటల్లో దానిపై ఉర్దూ రాత పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏఐఎంఐఎం జాయింట్ సెక్రటరీ మొహియుద్దీన్ గౌరీ సాహబ్, అమీర్ బిన్ అబ్దుల్లా,షేక్ ఇలియాస్, వార్డెన్స్ అందగాడు షేక్ సద్దాం,మహమ్మద్ ముజీబ్ జమాత్ నాయకులు మహ్మద్ అలీం,మహ్మద్ ఫరూఖ్,మహమ్మద్ సమీర్, మహ్మద్ అజీమ్ తదితరులు పాల్గొన్నారు.
జూలై 7 న ఎమ్మార్పీఎస్ 31 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా చేయాలి.
జహీరాబాద్ నేటి ధాత్రి:
shine junior college
జహీరాబాద్ నియోజకవర్గ పట్టణ కేంద్రం గా స్థానిక రభాసా అతిథి గృహంలో అబ్రహం మాదిగ అధ్యక్షతన ఉల్లాస్ మాదిగ సమన్వయంతో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిలు గా విచ్చేసిన ఎమ్మార్పీఎస్ సంగారెడ్డి జిల్లా ఇంచార్జిలు రామరాపు శ్రీనివాస్ మాదిగ,విఎస్ రాజు మాదిగలు మాట్లాడుతూ…ఎమ్మార్పీఎస్ ఉద్యమం ఆవిర్భవించిన తరువాత,మందకృష్ణ తన పేరు పక్కన మాదిగ అని చేర్చుకున్న తరువాత మాదిగ సమాజానికి ఎనలేని దైర్యం కలిగింది. ఆ దైర్యంతోనే మాదిగలంతా తమ పేరు పక్కన కులం పేరు చేర్చుకొని ఆత్మ గౌరవాన్ని చాటుకున్నారని అన్నారు.రాజ్యాంగంలో పొందుపరిచిన ఎస్సీ రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన అందక పోవడం వల్లనే మాదిగలు అన్ని రంగాల్లో వెనుకబడిపోయారు.కనుక జనాభా ప్రాతిపదికన ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరించాలని మంద కృష్ణ మాదిగ నేతృత్వంలో ముప్పై ఏళ్ళు రాజీలేని పోరాటం సాగిందని అన్నారు.ఆ పోరాట ఫలితంగానే నేడు తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ చట్టం అమలులోకి వచ్చిందని,దాని ద్వారా మాదిగలకు 9% రిజర్వేషన్లు దక్కాయి.ఎన్నో త్యాగాల ద్వారా సాధించుకున్న రిజర్వేషన్ ఫలాలు మాదిగ విద్యార్థులు నిరుద్యోగులు అందిపుచ్చుకొని అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి రావాలని పిలుపునిచ్చారు.అలాగే ఎస్సీ వర్గీకరణతో పాటు ఆరోగ్యశ్రీ, వికలాంగులు , వృద్దులు, వితంతువుల, ఒంటరి మహిళల పెన్షన్లు, తెలంగాణ అమరుల కుటుంబాలకు ఉద్యోగాలు , మహిళల భద్రత కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు మొదలగునవి ఎమ్మార్పీఎస్ సాధించి అన్ని వర్గాలకు అండగా నిలిచిందని అన్నారు . కనుక దండోరా జెండా సమస్త అణగారిన వర్గాలకు అండగా ఉంటుందని అన్నారు. ఈ నేపథ్యంలో జూలై 7న ఎమ్మార్పీఎస్ 31 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా చేసుకోవాలని అన్నారు.ప్రతి గ్రామంలో దండోరా జెండా ఆవిష్కరణలు చేయాలని అన్నారు. ప్రతి గ్రామంలో సభలు జరిపి ఉద్యమానికి తోడుగా ఉన్న అన్ని కులాల పెద్దలను సత్కరించాలని అన్నారు.
ఇట్టి కార్యక్రమంలో… పెద్ద గీత మాదిగ మాదిగ మహిళ సమాఖ్య రాష్ట్ర నాయకురాలు,ఆనంద్ వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు,బుచెంద్రయ్య మాదిగ ఎమ్మార్పియిస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు,జాన్ సోషల్ మీడియా ఇంచార్జి సంగారెడ్డి,వివిధ మండల అధ్యక్షులు జైరాజ్ మాదిగ, టీంకు మాదిగ, మైకీల్ మాదిగ,నిర్మల్ మాదిగ, ప్రభాకర్ మాదిగ,సుకుమార్, కిట్టు, శ్రీనివాస్, ప్రేమ్, సుదర్శన్, దాస్, జీవన్,వీరయ్య మాదిగ,దేవయ్య, చంద్రకాంత్, శాంతకుమార్, మోహన్, చంద్రపాల్, దిలీప్, సంతోష్, సునీల్ కుమార్, ప్రశాంత్, లాజర్, సుందర్, సుశీల్ కుమార్, ప్రవీణ్, దుర్గాదాస్, మాదిగలు పాల్గొన్నారు.
శానిటేషన్ నిర్వహణలో అలసత్వం తగదు. బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్*
25, 26 డివిజన్ లలో శానిటేషన్ పరిశీలన…..
వంద రోజుల కార్యాచరణ ర్యాలీలో పాల్గొని శానిటేషన్ పై అవగాహన కల్పించిన కమిషనర్…
వరంగల్, నేటిధాత్రి :
shine junior college
శానిటేషన్ నిర్వహణలో అలసత్వన్ని వీడాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. మంగళవారం వరంగల్ నగర పరిధిలోని 25, 26 డివిజన్ లలో చార్ బౌలి ప్రాంతంలో కమిషనర్ క్షేత్రస్థాయిలో పర్యటించి సానిటేషన్ నిర్వహణను పరిశీలించారు. సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్ ను కమిషనర్ తనఖి చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జవాన్ లు సిబ్బంది మాన్యువల్ గా సంతకాలు చేయడంతో పాటు బయోమెట్రిక్ హాజరు కూడా ప్రతి రోజు ఉదయం, మధ్యాహ్నం విధులకు హాజరై, వెళ్లేటప్పుడు నమోదు చేయాలని , అటెండెన్స్ నమోదులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని బయోమెట్రిక్ అటెండెన్స్ ఆధారంగానే వేతనాల చెల్లింపు జరుగుతుందని అన్నారు. వందరోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఎల్లమ్మ గుడి వద్ద గల చౌరస్తా నుండి చార్ బౌలి వాటర్ ట్యాంక్ వరకు నిర్వహించిన ర్యాలీలో కమిషనర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో కలియతిరిగిన కమిషనర్ స్థానికులతో మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా రక్షిత చర్యలు తీసుకోవాలని, కార్పొరేషన్ సిబ్బందికి సహకరించాలని, తడి పొడి చెత్తను వేరుగా అందజేయాలని అవగాహన కల్పించి ఇందుకు సంబంధించిన కరపత్రాన్ని అందజేసి ఇందుకు సంబంధించిన స్టిక్కర్ ను గృహాలకు అతికించి నిర్వహించిన స్వచ్చ ప్రతిజ్ఞలో పాల్గొన్నారు.
చార్ బౌలి వాటర్ ట్యాంక్ ఆవరణలో నిర్వహిస్తున్న డి ఆర్ సి సి సెంటర్ తో పాటు నర్సరీనీ పరిశీలించి నిర్వహణ తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలో నిర్వహిస్తున్న బయోగ్యాస్ ప్లాంట్ ను సందర్శించి నిర్వహణ తీరును ప్రశంసించిన కమిషనర్ ప్లాంట్ సామర్ధ్యాన్ని పెంచడంతోపాటు మరింత బలోపేతం చేస్తూ మరో ప్లాంటు ఏర్పాటు కు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సి.ఎం.హెచ్.ఓ డా.రాజారెడ్డి ఇంచార్జి ఎస్ ఈ, సి పి లు శ్రీనివాస్ రవీందర్ రాడేకర్ వెటర్నరీ డాక్టర్ డా.గోపాల్ రావు ఏం హెచ్ ఓ డా.రాజేష్ ఏ సి పి ఖలీల్ సానిటరీ సూపర్ వైజర్ భాస్కర్ ఏ ఈ లు మొజామిల్ హబీబ్ శానిటరీ ఇన్స్పెక్టర్ శ్యామ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
మహదేవపూర్ మండల కేంద్రంలో బ్రాహ్మణపల్లి ఎస్సీ కాలనీ లో నూతన గ్రామ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు అదేవిధంగా మండల ఇన్చార్జి అంబాల చంద్రమౌళి సూచనకు మండల అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్ మాదిగ ఆధ్వర్యంలో గ్రామ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో గ్రామ శాఖ గౌరవ అధ్యక్షులు కాలువ మల్లయ్య గ్రామ అధ్యక్షులు పేట రాజు సమ్మయ్య ఉపాధ్యక్షులు అంబాల సంజీవ్ కార్యదర్శి నిట్టూరి అంకయ్య ప్రధాన కార్యదర్శి బొడ్డు రమేష్ ప్రచార కార్యదర్శి పేట రవి నూతన గ్రామ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది మండల అధ్యక్షుడు బెల్లంపల్లి సురేష్ మాదిగ మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు జరగబోయే ఊరు ఊరునా దండోరా జెండా జూలై 7న ఘనంగా ఆవిష్కరించుకొని ఈ దేశంలోనే మాదిగ జాతి ఒక శక్తివంతంగా ఎదిగి సబ్బండ కులాలకు పెద్దన్న పాత్ర పోషిస్తున్న మందకృష్ణ మాదిగ ఈ క్రమంలో జాతి చేసిన పోరాటాలు ఎన్నో ఉన్నాయని సామాజిక న్యాయం సాధించిన తరుణంలో విజయోత్సవాలు చేసుకోవాలని మండలంలో గ్రామాల ప్రజలు యొక్క దండోరా విజయాలని అందిపుచ్చుకున్న ప్రతి ఒక్కరు జూలై 7న జెండా కార్యక్రమంలో పాల్గొనాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆత్కూరి సారయ్య పేట దేవేందర్ మాదిగ యువసేన మండల అధ్యక్షులు మంత్రి రవితేజ చింతకుంట సదానందం చింతకుంట రాము తదితరులు పాల్గొన్నారు
శాయంపేట మండలం మైలారం గ్రామంలో గురు వారం అనగా19-06-2025 ఉదయం 10 గంటలకు వికసి త్ భారత్ యొక్క అమృత కాల సేవా సుపరిపాలన పేదల సంక్షేమానికి 11సంవత్సరాల మోడీ ప్రభుత్వం గడచిన సందర్భంగా సంకల్ప సభ నిర్వహించడం జరుగుతుందని బిజెపి మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ తెలిపారు ఈ సందర్భంగా కేంద్రంలోని నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు భారత దేశం అభివృద్ధి పథంలో వేగం గా ముందుకు సాగుతున్న తరుణంలో వికసిత్ భారత్ 2047 లక్ష్యంతో దేశవ్యాప్తంగా అమృతకాల సేవా సుపరి పాలన సంకల్పసభ విజయ వంతం కొనసాగుతున్నాయి. ఈ పరిణామాలలో భాగంగా గత 11 సంవత్సరాలలో పేదల సంక్షేమం, పారదర్శక పాలన, సంక్షేమ పథకాల సమర్థ అమ లుపై కేంద్ర ప్రభుత్వం చేసిన కృషిని ప్రజల మద్దతుతో మరింత బలపరచ డానికి ఈ సంకల్ప సభ నిర్వహించబడు తుంది కావున మండలంలోని రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి, మండల పతాధికారులు, సీనియర్ నాయకులు పార్టీ శ్రేయోభిలాషులు మరియు మండలంలోని పురప్రముఖు లు అందరూ హాజరై సంకల్ప సభను విజయవంతం చేద్దాం
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.