పశువులకు గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు
ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్.
భూపాలపల్లి నేటిధాత్రి
పాడి రైతులు తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా వేయించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. భూపాలపల్లి రూరల్ మండలం మోరంచపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ ఆవరణలో శుక్రవారం పశువైద్య, పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గాలికుంటు వ్యాధి నివారణ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యజమానులు తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా తప్పనిసరిగా వేయించాలని సూచించారు. పాడి రైతుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కార్యక్రమం నిర్వహిస్తున్నాయని చెప్పా రు. ఈ సంవత్సరం అధిక వర్షాలు కురిసినందున పశువులు వ్యాధుల బారిన పడుతున్నాయని అన్నారు. ఈ సందర్భంగా యజమానులకు పశువులకు బలాన్ని అందించే మల్టీ మిక్స్ పౌడర్ ప్యాకెట్లను అందజేశారు. అనంతరం జాతీయ పశువ్యాధుల నివారణ కార్యక్రమంకు సంబందించి గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ కుమారస్వామి సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
