ఒకే ఈతలో రెండు లేగ దూడలకు జన్మనిచ్చిన ఆవు
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఒకే కాన్పులో రెండు లేగ దూడలకు జన్మనిచ్చిన అరుదైన సంఘటన ఝరాసంగం మండల బోరేగావ్ గ్రామ పరిధిలోని బుధవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన చాకలి శంకర్ అనే పాడి రైతు ఆవు ఉదయం రెండు లేగ దూడలను జన్మనిచ్చింది. లేగ దూడలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాయని ఇలాంటి అరుదైన సంఘటనలు చోటు చేసుకోవడం విశేషమని రైతు తెలిపారు. ఒకే కాన్పులో ఆవు రెండు లేగ దూడలను ప్రసవించిన విషయం తెలుసుకున్న గ్రామస్తులు లేగ దూడలను చూసేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు.ఈ విషయం బోరేగావ్ గ్రామ నూతన సర్పంచ్ నాగేందర్ పటేల్ పై మండల పశువైద్యాధికారి హర్షవర్ధన్ రెడ్డిని సంప్రదించగా, ఒకే కాన్పులో జన్మించాయని, అవి సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే సిబ్బందిని పంపించి వైద్యం అందిస్తామన్నారు.
