గొర్రెలు–మేకల నట్టల నివారణ కార్యక్రమం
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో తేదీ 31-12-2025 నాడు గొర్రెలు–మేకల నట్టల నివారణ కార్యక్రమం మండలంలోని వివిధ గ్రామాలలో విజయవంతంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో
•దేవరంపల్లి గ్రామంలో సర్పంచ్ శ్రీ పాట్లోల రవికుమార్ గారు మరియు గ్రామ పెద్దలు,
•ఈదులపల్లి గ్రామంలో గ్రామ పెద్దలు శ్రీ పడమటి నాగేశ్వర్ గారు మరియు ఇతర గ్రామ పెద్దలు,
•మెదపల్లి గ్రామంలో గ్రామ పెద్దలు శ్రీ కొల్లూరు నరేందర్ రెడ్డి గారు మరియు ఇతర గ్రామ పెద్దలు
పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ నట్టల నివారణ కార్యక్రమం ద్వారా నేటి రోజున
•మొత్తం 490 గొర్రెలకు,
•మొత్తం 850 మేకలకు
నట్టల నివారణ మందులు వేయడం జరిగింది.
ఈ సందర్భంగా పశుసంవర్ధక శాఖ అధికారులు మరియు సిబ్బంది పశుపాలక రైతులకు నట్టల నివారణ కార్యక్రమం వల్ల పశువుల ఆరోగ్యం మెరుగుపడటం, ఉత్పాదకత పెరగడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
గ్రామాల పశుపాలక రైతులు మరియు గ్రామ పెద్దలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని, మండల పశుసంవర్ధక శాఖకు కృతజ్ఞతలు తెలిపారు.