పశువులకు గాలికుంటు వ్యాధి నివారణకు చర్యలు…

పశువులకు గాలికుంటు వ్యాధి నివారణకు చర్యలు

సర్పంచ్ సుందిళ్ల రాజేశ్వరి

జైపూర్,నేటి ధాత్రి:

 

జైపూర్ మండలం గంగిపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ సుందిళ్ల రాజేశ్వరి నేతృత్యంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ప్రారంభించినట్లు తెలిపారు.మంగళవారం గ్రామంలోని 270 పశువులకు పశు వైద్యులు టీకాలు వేశారు.ఈ సందర్భంగా పశు వైద్యులు వెంకటేష్ మాట్లాడుతూ.. పశువులలో నోటి,కాళ్లలో పుండ్లు,జ్వరం,మేత తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయని ఇది అంటూ వ్యాధి పాల ఉత్పత్తి కూడా 50% వరకు తగ్గుతుందని అన్నారు.పశువుల వ్యాధి నివారణ కొరకు ప్రభుత్వం సంవత్సరానికి రెండుసార్లు అంటే 6 నెలలకు ఒకసారి టీకాలు వేస్తుందని తెలిపారు.నాలుగు నెలల పైబడిన పశువులకు టీకాలు వేపించాలని,టీకాలు వేపించడం వల్ల పశువుల ఆరోగ్యం మెరుగుపడి పాల ఉత్పత్తి పెరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుందిళ్ల రాజేశ్వరి, పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ,పశు వైద్యులు వెంకటేష్,సిబ్బంది శృతి, మహబూబ్ అలీ,ప్రభాకర్, రైతులు సుందిళ్ల లచ్చయ్య, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

పశువులకు గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు…

పశువులకు గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు

ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్.

భూపాలపల్లి నేటిధాత్రి

 

పాడి రైతులు తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా వేయించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. భూపాలపల్లి రూరల్ మండలం మోరంచపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ ఆవరణలో శుక్రవారం పశువైద్య, పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గాలికుంటు వ్యాధి నివారణ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యజమానులు తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా తప్పనిసరిగా వేయించాలని సూచించారు. పాడి రైతుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కార్యక్రమం నిర్వహిస్తున్నాయని చెప్పా రు. ఈ సంవత్సరం అధిక వర్షాలు కురిసినందున పశువులు వ్యాధుల బారిన పడుతున్నాయని అన్నారు. ఈ సందర్భంగా యజమానులకు పశువులకు బలాన్ని అందించే మల్టీ మిక్స్‌ పౌడర్‌ ప్యాకెట్లను అందజేశారు. అనంతరం జాతీయ పశువ్యాధుల నివారణ కార్యక్రమంకు సంబందించి గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ కుమారస్వామి సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version