పశువులకు గాలికుంటువ్యాధి నివారణ టీకాలు తప్పనిసరి…

పశువులకు గాలికుంటువ్యాధి నివారణ టీకాలు తప్పనిసరి

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద

*అవగాహన ప్రచార రథాన్ని ప్రారభించిన కలెక్టర్

నర్సంపేట/గీసుగొండ,నేటిధాత్రి:

రైతులు తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు తప్పనిసరిగా వేయించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు.
గీసుకొండ మండలం దసరుతండా గ్రామపంచాయతీ పరిధిలోని దసరుతండా, మంగళతండా గ్రామాలలో ప్రజా పాలన–ప్రగతి 99 రోజుల ప్రణాళికలో భాగంగా గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం బుధవారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ అమృత అధ్యక్షత వహించగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పాడి రైతులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి వలన కలిగే నష్టాలు, పాడి పశువుల ప్రాధాన్యత మరియు వాటి ద్వారా మానవాళికి కలిగే లాభాలను వివరించారు.
జిల్లా పశువైద్య మరియు పశుసంవర్ధక శాఖాధికారి డాక్టర్ ఎం. బాలకృష్ణ మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి లక్షణాలు మరియు నివారణపై సంక్షిప్తంగా వివరించి, ముందస్తు టీకాలే ఉత్తమ రక్షణ అని రైతులకు సూచించారు.ఈ సందర్భంగా గాలికుంటు వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.

ఈ రథం జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లో పర్యటిస్తూ రైతులకు అవగాహన కల్పించనుంది.ఈ శిబిరంలో పాడి పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వడంతో పాటు, లేగదూడలు మరియు పెద్ద పశువులకు పురుగుమందులు అందించారు. అదేవిధంగా రైతులకు 75 శాతం సబ్సిడీపై పశుగ్రాస విత్తనాలు పంపిణీ చేశారు.గాలికుంటు వ్యాధి పశువుల పాల ఉత్పత్తిని గణనీయంగా తగ్గించి, రైతులకు ఆర్థిక నష్టం కలిగించే ముఖ్యమైన వ్యాధి. ఈ వ్యాధి వైరస్ ద్వారా వ్యాపించి, ముఖ్యంగా సంకరజాతి పశువుల్లో ఎక్కువగా కనిపిస్తుందని. మార్చి, ఏప్రిల్, ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలల్లో ఈ వ్యాధి అధికంగా ప్రబలుతుంది.

వ్యాధి నివారణ కోసం పశువులకు ముందుగానే టీకాలు వేయించడం అత్యంత అవసరం. ఈ నేపథ్యంలో గాలికుంటు వ్యాధి నిరోధక ఉచిత టీకాల కార్యక్రమాన్ని మార్చి 10 నుండి ఏప్రిల్ 9, 2026 వరకు నిర్వహిస్తున్నారు. 2030 నాటికి తెలంగాణ రాష్ట్రాన్ని గాలికుంటు వ్యాధి రహిత ప్రాంతంగా ప్రకటించే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.ఈ కార్యక్రమంలో మొత్తం 115 పశువులకు టీకాలు అందించామని స్థానిక పశువైద్య అధికారి డాక్టర్ గైని శ్రీనివాస్ తెలిపారు.ఈ కార్యక్రమంలో గీసుకొండ పశువైద్య అధికారి డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, కొమ్మాల పశువైద్య అధికారి డాక్టర్ గైని శ్రీనివాస్, డాక్టర్ రాధిక, సిబ్బంది చిరంజీవి, సుమన్, చందు, జితేందర్, గోపాల మిత్రులు ఇస్మాయిల్, రమేష్, రైతులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

టీకాలతో పశువుల్లో రోగనిరోధక శక్తి…

టీకాలతో పశువుల్లో రోగనిరోధక శక్తి

రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి

భూపాలపల్లి నేటిధాత్రి

 

రేగొండ మండల కేంద్రంలో పశువులకు సకాలంలో గాలికుంటు నివారణ టీకాలు వేయించడం ద్వారా పశువుల్లో రోగ నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటాయని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండల కేంద్రంలో పశు వైద్య పశు సంవర్ధక శాఖ జయశంకర్ భూపాలపల్లి జిల్లా వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ పశువ్యాధుల నివారణ కార్యక్రమం గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి వాకిటి శ్రీహరి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ లతో కలిసి పాల్గొన్నారు. పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేసిన అనంతరం మంత్రి మాట్లాడారు. పశువులకు టీకాలు వేయించటం ద్వారా పశువుల్లో రోగ నిరోధక శక్తి పెరిగి, వ్యాధుల ప్రభావం తగ్గుతుందన్నారు. గాలికుంటు వంటి వ్యాధులు పశువుల పాలు, ఉత్పత్తితో పాటు రైతుల ఆదాయంపై ప్రతికూల ప్రభావం చూపుతాయన్నారు. ప్రతీ ఒక్క రైతు తన పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని మంత్రి సూచించారు.

అనంతరం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ…. పశు సంపద తోడు ఉంటేనే వ్యవసాయం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. మన ఇళ్లల్లో పశుసంపద ఉంటే ఆర్థికంగా ప్రయోజనం కలుగుతుందన్నారు. రైతులు పశువులకు సరైన పోషకాలు కలిగిన దాణా మరియు మేత అందిస్తే పాల దిగుబడి పెరగడంతో పాటు వ్యవసాయంలో చేదోడు వాదోడుగా ఉంటాయన్నారు. ముఖ్యంగా చూడి పశువులకు తప్పకుండా గాలికుంటు నివారణ టీకాలు వేయించడం తప్పనిసరి అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో పశువర్ధక శాఖ జిల్లా అధికారి కుమారస్వామి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నరసయ్య మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీదేవి గండ్ర సత్యనారాయణరెడ్డి పున్నమి రవి తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version