బిజినపల్లి మండలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం నీ ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు
నేటి దాత్రి నాగర్ కర్నూలు జిల్లా
నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం లో PACS వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు ప్రారంభించారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రైతులకు సరియైన ధరలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్షణం అని ఇలాంటి కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు మద్దతు ధర మరింత బలోపితం అవుతుందని తెలిపారు
అనంతరం బిజినపల్లి మండల కేంద్రంలో ని అంబేద్కర్ చౌరస్తాలో బాబు జగ్వేన్ రావు గారి జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు మండల అధ్యక్షుడు రాములు మార్కెట్ డైరెక్టర్ వాళ్ళ నాయక్ మాజీ సర్పంచ్ తిరుపతయ్య మాజీ సింగల్ విండో చైర్మన్ వెంకటస్వామి మార్కెట్ డైరెక్టర్ రైతులు పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
