మృతుడి కుటుంబానికి మిత్రుల ఆర్థిక సాయం.

మృతుడి కుటుంబానికి మిత్రుల ఆర్థిక సాయం.

భూపాలపల్లి నేటిధాత్రి:

 

భూపాలపల్లి పట్టణంలో నీ సుభాష్ కాలనీకి చెందిన పులిగంటి రమేష్ గత వారం క్రితం గుండెపోటుతో మృతి చెందాడు గురువారం భూపాలపల్లి పట్టణానికి చెందిన పూర్వ పాఠశాల రాహుల్ విద్యానికేతన్ కు చెందిన తోటి మిత్రులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు లట్ట రాజబాబు ,ఉపాధ్యాయులు. లట్ట వెంకటేష్, మేడ వెంకటస్వామి. మృతుడి చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మిత్రులు మొదటి కుటుంబ సభ్యులకు రూ. 25 వేల తో పాటు 50 కిలోల బియ్యం ఇతర నిత్యవసర సరుకులు అందించారు.. కుటుంబ పెద్దను కోల్పోయిన కుటుంబానికి అండగా ఉంటామని ఈ సందర్భంగా మిత్రులు తెలిపారు
ఈ కార్యక్రమంలో మిత్రులు దుండ్రా.కుమార్ యాదవ్, గాదం రాజు, అల్లెపు సతీష్, చెక్క గోపి. నాన్డ్రి కమలాకర్ ,. బి కొండ నరేందర్ , ఏలుగుల సురేష్ , బొల్లం నరేష్, పూల్యాల తిరుపతి, ఎలాకంటి విజయ్, కాలనీ వాసులు కొడపాక శంకర్, రఘుపతి తదితరులుపాల్గొన్నారు

స్నేహితుని కుటుంబానికి చేయూత.

స్నేహితుని కుటుంబానికి చేయూత
మొగులపల్లి నేటి ధాత్రి:

 

మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని స్థానిక జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో తమతో పాటు చదువుకున్న 2007-08 పదవ తరగతి బ్యాచ్ కు చెందిన ఇప్పకాయల శ్రీను తండ్రి ఇప్పకాయల రాజేందర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా విషయం తెలుసుకున్న తోటి స్నేహితులు 10 వేల ఆర్థిక సాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో బండారి ఓదెలు, తిప్పారపు సురేందర్,ల్యాండిగా రాజేందర్, జునుమల తిరుపతి, నాగలగని రాజేందర్, పోతుగంటి దశరథం తదితరులు పాల్గొన్నారు.

జహీరాబాద్ బ్రిడ్జి పైన ఆక్సిడెంట్ కి గురైన ఖాజా కుటుంబానికి సహాయం.

జహీరాబాద్ బ్రిడ్జి పైన ఆక్సిడెంట్ కి గురైన ఖాజా కుటుంబానికి సహాయం చేసిన – జేపీ చారిటబుల్ అండ్ వెల్ఫేర్ ట్రస్ట్ ఫౌండర్ జ్యోతి పండాల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

కొన్ని రోజుల క్రితం కొత్తగా నిర్మించిన జహీరాబాద్ బ్రిడ్జి పైన ఆక్సిడెంట్ కి గురైన ఖాజా గారి కుటుంబానికి సహాయం చేయగలరని జ్యోతి పండాల్ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే, ఖాజా గారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులతో యాక్సిడెంట్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

అలాగే వారి కుటుంబం అంతా కూడా ఖాజా గారి సంపాదన పైన ఆధారపడి ఉన్నారు కాబట్టి వారికి ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు ఉండటం వల్ల రేషన్ కి కూడా చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని తెలిసి కాజా గారి ఇంటికి వెళ్లి బియ్యము, బ్లాంకెట్స్ మరియు పిల్లలకి బట్టలు అందజేయడం జరిగింది. అలాగే వారికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా తనకు కాల్ చేయమని జ్యోతి పండాల్ వారికి తెలియజేయడం జరిగింది.

సిఆర్పి రమేష్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి.

సిఆర్పి రమేష్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

– ప్రభుత్వం రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి

తొర్రూరు (డివిజన్) నేటి ధాత్రి

 

shine junior college

 

 

తొర్రూరు మండలంలోని చర్లపాలెం కాంప్లెక్స్ పరిధిలో సర్వ శిక్ష అభియాన్ (ఎస్ఎస్ఎ) లో సి ఆర్ పి గా విధులు నిర్వహిస్తూ శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సర్వి రమేష్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మహబూబాబాద్ జిల్లా ఎస్ఎస్ఎ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సోమవారం తొర్రూరు పట్టణంలోని స్థానిక బస్టాండ్ సెంటర్ వద్ద నిరసన వ్యక్తం చేసి మృతుడు రమేష్ కు నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వెల్తూరి మల్లేశం ,CRP ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రేగుల సహదేవ్ , మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు మారగోని జానకిరామ్ , షేక్ ఖాదర్ పాషా మాట్లాడుతూ ఎస్ఎస్ఏ లో గత 13 ఏళ్లుగా చాలీచాలని వేతనాలతో కాంట్రాక్ట్ పద్ధతిలో సిఆర్పి గా పని చేసిన రమేష్ అకాల మరణం బాధాకరమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మృతుని కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా అందించడంతో పాటు మృతుని భార్యకు ఉద్యోగం కల్పించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ బుచ్చయ్య, పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు సిఆర్పి రమేష్ మృతికి సంఘీభావం తెలియజేస్తూ వారి కుటుంబానికి ఉపాధ్యాయులు తమ వంతు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఎంఈఓ బుచ్చయ్య, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఎస్ ఎస్ ఏ ఉద్యోగులు రమేష్ అంతిమయాత్రలో పాల్గొని పాడే మోసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో crp ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహబూబ్ పాషా, రాష్ట్ర కోశాధికారి కంచర్ల మహేందర్, సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు మహంకాళి వీరన్న, వరంగల్ జిల్లా అధ్యక్షులు శ్రీధర్ , ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బాబులాల్,రు ,సంతోష్ ,కల్పన, ఉదయ్,రమేష్ పార్ట్ టైం ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, లక్ష్మణ్, నాగరాజు, రవి, వెంకటేశ్వర్లు, కరుణ పద్మావతి. తది తరులు పాల్గొన్నారు,

మృతునికుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేత.

మృతునికుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేత….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

shine junior college

 

తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన బంట్రోజు లక్ష్మీపతి గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి బియ్యం అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి సత్తు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పి పరామర్శించి నా వంతు సహాయంగా 50 కేజీల బియ్యాన్ని అందచేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారుఈ o దుకుగాను వారి కుటుంబ సభ్యులు బియ్యం అందజేసినందుకు గాను వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో సిరిసిల్ల ఎఎంసి వైస్ చైర్మన్ నేరెళ్ల నరసింహ గౌడ్. డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి. కృష్ణారెడ్డి. తిరుపతి. మనోజ్
శ్రీనివాస్ గౌడ్. నర్సింలు తదితరులు పాల్గొన్నారు

ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు..

ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు..ఎవరూ అదైర్యపడొద్దు

పేదలందరికీ విడతల వారీగా ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు

వివిధ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన, పత్రాల పంపిణీ

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

శాయంపేట నేటిధాత్రి:

 

 

 

పేదవాడి సొంతింటి కలను నిజం చేయడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ లక్ష్యం కాబట్టి మొదటి విడతలో ఇళ్లు రానివారు ఎవరూ అధైర్య పడొద్దని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణ రావు అన్నారు.

ఉద యం నుండి సాయంత్రం వరకు శాయంపేట మండలంలోని అన్ని గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించారు.

మండల పరిధిలోని పలు గ్రామాలల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

అనంతరం ఆయా గ్రామాలల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు మంజూరీ పత్రాలకు హన్మకొండ జిల్లా హౌసింగ్ పీడీ ఇతర అధికారులతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు.

పలు గ్రామాలలో ఏర్పాటు చేసిన సభా వేదిక లల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదవాడి సొంతింటి కలను నిజం చేయడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, ప్రజలకు ఉపయోగపడే పని చేస్తే వారి నుంచి వచ్చే స్పంద న బాగుంటుందన్నారు.

గత పాలకులు ఎమ్మెల్యే నివాసా లు, ప్రభుత్వ భవనాల మీద పెట్టిన శ్రద్ధ పేద ప్రజల ఇండ్లపై పెట్టలేదని, పేద ప్రజల సొంతింటి కలను విస్మరించిం దని అన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం రూ.22 వేల 500 కోట్ల రూపాయలను పేద ప్రజల సొంతింటి కల కోసం ఈ సంవత్సరంకేటాయిం చిందని, ఆర్థికంగా ఇబ్బందు లు ఉన్నప్పటికీ పేదల సంక్షే మం అజెండాగా పాలన కొనసాగుతుంది గుడిసెలో ఉంటున్న నిరుపేదలకు మొదటి విడతలో ప్రభుత్వం ఇండ్లు మంజూరు చేసింది ఇందిరమ్మ ఇండ్ల పథకం పారదర్శకంగా అమలు చేయా లని, ఎక్కడ లంచాలకు ఆస్కా రం లేకుండా ఇండ్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

రాజకీయపార్టీలకు అతీతంగా పేద, నిరుపేదలకు మొదటి విడతలో నిరోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నా మని ఎమ్మెల్యే అన్నారు.

ప్రభుత్వం పెట్టే ప్రతీ రూపాయి కూడా పేదలకు ఉపయోగపడా లని తాము ప్రయత్నిస్తు న్నామని ఎమ్మెల్యే అన్నారు.

గత ప్రభుత్వ హయాంలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కూడా ఇవ్వని ప్రతిపక్ష నాయకులు ప్రతీ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేస్తుంటే చూసి ఓర్వలేక శిలాఫలకాల ద్వంసానికి పాల్పడుతున్నారని ఎమ్మెల్యే అన్నారు.

Indiramma’s house

 

 

ప్రజా ప్రభుత్వం భూపాలపల్లి నియోజకవ ర్గంలో చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేకనే ఇటువంటి పనుల కు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు.

మేము చేస్తున్న అభివృద్ధి పనులకు అడ్డుతగిలితే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే హెచ్చరించారు.

పేదలకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేసిన శిలాఫలకాలను ధ్వంసం చేయడం పిరికిపంద చర్య అన్నారు.

బీఆర్ఎస్ గుండా యిజం మానుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

ఇందిరమ్మ ఇండ్ల మంజూరీ పత్రాలను అందుకున్న పలువురు లబ్దిదారులు మాట్లాడుతూ గత పదేళ్లుగా సొంతింటి కోసం అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ తమకు ఇళ్లు మంజూరు కాలేదని, సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సహాయంతో తమకు ఇండ్లు మంజూరు కావడం సంతో షంగా ఉందని పలువురు మహిళలు సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల అధికా రులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు,గ్రామస్తులు పాల్గొన్నారు

మృతిచెందిన కార్మికుని కుటుంబానికి 83 వేల వితరణ.

మృతిచెందిన కార్మికుని కుటుంబానికి 83 వేల వితరణ

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

 

భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని సుభాష్ కాలనీకి చెందిన ఎస్ఎన్ పిసి సింగరేణి కార్మికుడు నేరుపటి మొగిలి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు విషయం తెలుసుకున్న తోటి కార్మికులు 83 వేల రూపాయలను ఆర్థిక సహాయం అందించారు అనంతరం వారు మాట్లాడుతూ మృతుడు నేరుపటి మొగిలి కుటుంబానికి అండగా ఉంటామని కార్మికులు తెలిపారు ఈ కార్యక్రమంలో సెక్యూరిటీ ఆఫీసర్ మురళీమోహన్ రావు సీనియర్ ఇన్స్పెక్టర్ జగ్గ లక్ష్మి రాజ్యం కార్మికులు సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం.

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం.

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

 

 

 

 

శనివారం కల్వకుర్తి మండలం లోని తర్నికల్ గ్రామానికి చెందిన వర్కాల కృష్ణయ్య అనారోగ్యంతో బాధపడుతూ మరణించడం జరిగింది. ఈ విషయాన్ని తర్నికల్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు ద్వారా తెలుసుకున్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఉప్పల వెంకటేష్ మృతుడి కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించేశారు.ఈ కార్యక్రమంలో మాజీ మండల కో ఆప్షన్ రుక్ముద్దీన్, మాజీ వార్డు సభ్యులు దేవయ్య, మాణిక్యరావు, వెంకటరత్నం, కృష్ణయ్య, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇండ్లతో పేద కుటుంబానికి పెద్ద పండుగ..

ఇందిరమ్మ ఇండ్లతో పేద కుటుంబానికి పెద్ద పండుగ..

-కాంగ్రెస్ తోనే పేదలకు సొంతింటి కల సాకారం

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

రేవంత్ రెడ్డి ప్రభుత్వం అర్హత గల నిరుపేదలకు అందిస్తున్న ఇందిరమ్మ ఇండ్లతో పేద కుటుంబానికి నేడు పెద్ద పండుగ అయ్యిందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు.

కాంగ్రెస్ తోనే పేదలకు సొంతింటి కల సాకారం అవుతుందని, పేద ప్రజల జీవితాల్లో నేడు అసలైన పండుగ వాతావరనం కనిపిస్తుందని మాధవరెడ్డి రెడ్డి తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగంగా శుక్రవారం నర్సంపేట పట్టణానికి చెందిన, 01,04,14,15,17,18,వార్డుల్లో మంజూరు అయిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఇండ్లకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ముగ్గులు పోయించి కొబ్బరికాయలు కొట్టారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లులేని ఊరు ఒక్క గ్రామం కూడా లేదని అన్నారు.

పదేళ్లలో పరిపాలించిన బిఆర్ఎస్ పాలకులు ఒక్క ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవని ఆరోపించారు. పేద ప్రజల సంక్షేమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు.

అర్హులకు మాత్రమే ఇళ్లు ఇచ్చేలా ప్రభుత్వ యంత్రాంగం, ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

ప్రజా ప్రభుత్వంలో అర్హులకు న్యాయం చేయాలనేదే నా ఆకాంక్షాన్ని, ప్రతిపక్షాల మోసపూరిత మాటలలో పడద్దని ఎమ్మెల్యే దొంతి చెప్పారు.

ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హామీ ఇచ్చారు.

 

MLA Donthi Madhav Reddy

 

 

ఈ కార్యక్రమాలలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, హౌసింగ్ డిఈ విష్ణువర్ధన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ భాస్కర్,టిపిసిసి సభ్యులు పెండెం రామానంద్,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బత్తిని రాజేందర్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు ఓర్సు తిరుపతి, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు భూసాని సుదర్శన్, బీరం భరత్ రెడ్డి,పట్టణ కాంగ్రెస్ కార్యదర్శి చిప్ప నాగ, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ప్రచార కార్యదర్శి జన్ను మురళీ, నర్సంపేట నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ములుకల మనీష్, పున్నం రాజు తదితరులు తదితరులు పాల్గొన్నారు.

మిత్రుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన.

మిత్రుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన బాల్యమిత్రులు ..

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:-

 

 

 

చిన్ననాటి కాలంలో వారితో పాటు చదువుకున్న మిత్రుడు ఇటీవల గుండెపోటుతో మృతి చెందడంతో ఆ కుటుంబానికి తోటి విద్యార్థులు గురువారం ఆర్థిక సహాయం అందజేశారు. పొత్కపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2002-2003 సంవత్సరంలో వారితోపాటు విద్యను అభ్యసించిన ఎనగందుల రాజు ఇటీవల మల్లయ్య పల్లె గ్రామంలో గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో అప్పట్లో రాజు తో చదువుకున్న మిత్రులందరూ రాజు కుమార్తె పేరు మీద ఉన్నత చదువులు కొరకు రూ. ఇరవై ఐదు వేల రూపాయలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మేడిదుల రవీ గుండ్లపల్లి శ్రీనివాస్ వంగ కుమార్ గడ్డం ఉపేందర్ ఐలయ్య రవి పాల్గొన్నారు.

ప్రతీ నిరుపేద కుటుంబికుని కల ఇందిరమ్మ ఇల్లు.

ప్రతీ నిరుపేద కుటుంబికుని కల ఇందిరమ్మ ఇల్లు…

కరీంనగర్ నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రామడుగు, కొక్కరకుంట, వన్నారం గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మరవేని తిరుమల. ఈసందర్భంగా కాంగ్రెస్ పార్టీ రామడుగు మండల అధ్యక్షులు జవ్వాజి హరీష్ మాట్లాడుతూ మండల అధికారులు గ్రామాల్లో ప్రతీ ఇంటికి తిరిగి ఎలాంటి రాజకీయ ప్రలోభాలు లేకుండా సరైన లబ్ధిదారులకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని, ఎక్కడ కూడా అవకతవకలు జరగకుండా చూసుకోవాలని, లబ్ధిదారులు సైతం ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇళ్లు నిర్మించుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో గోపాలరావుపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పిండి సత్యం, వెన్న రాజమల్లయ్య, రామడుగు కార్యదర్శి శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాడే శంకర్, పంజాల శ్రీనివాస్ గౌడ్, ఇందిరమ్మ కమిటీ మెంబర్స్ కర్ణ శీను, పొన్నం మల్లేశం, బత్తిని అజయ్, రామడుగు మండలం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జవ్వాజి అజయ్, తదితరులు పాల్గొన్నారు.

వీరస్వామి కుటుంబాన్ని పరామర్శించిన ఎస్సై..

వీరస్వామి కుటుంబాన్ని పరామర్శించిన ఎస్సై..

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

దుగ్గొండి మండలంలోని సీనియర్ ఈనాడు పత్రిక రిపోర్టర్ బైగాని వీరస్వామి గౌడ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.కాగా బుదవారం దుగ్గొండి ఎస్సై నీలోజు వెంకటేశ్వర్లు మృతిని కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మృతుడి కుటుంబానికి పరామర్శించిన పీసీసీ సభ్యులు.

మృతుడి కుటుంబానికి పరామర్శించిన పీసీసీ సభ్యులు

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

నర్సంపేట పట్టణ 19వ చెందిన మండల యాదగిరి మరణించగా టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బత్తిని రాజేందర్, వరంగల్ జిల్లా ఓబీసీ చైర్మన్ ఓర్సు తిరుపతి, మాజీ వైస్ ఎంపీపీ చింతల సాంబరెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్ర యాకుబ్ రెడ్డి, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మాదాసి రవికుమార్, మాజీ కౌన్సిలర్ ఎలకంటి విజయ్ కుమార్, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు మెరుగు సాంబయ్య, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి నాడెం నాగేశ్వర్లు, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యదర్శి బిట్ల మనోహర్, 8వ వార్డు అధ్యక్షులు గిరగాని రమేష్, 16వ వార్డు ఇన్చార్జ్ బాణాల శ్రీనివాస్, 5వ వార్డు వర్కింగ్ ప్రెసిడెంట్ కొప్పు అశోక్, మాజీ వార్డు మెంబర్ గాజుల రమేష్, కొంకిస కిరణ్ గౌడ్, రచ్చ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన శాసనసభ్యులు.

మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన శాసనసభ్యులు గండ్ర సత్తన్న

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండల కేంద్రానికి చెందిన అల్లెపు హరీష్ ఇటీవలే మృతి చెందగా విషయం తెలుసుకున్న భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు వారి వెంట మండల పార్టీ అధ్యక్షులు భూపాల్ పల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రేపాక రాజేందర్ మాజీ ఎంపీపీ వడ్లకొండ నారాయణ గౌడ్ గణపురం టౌన్ ప్రెసిడెంట్ ఓరుగంటి కృష్ణ భూపాలపల్లి జిల్లాయువజన కాంగ్రెస్ నాయకులు పోశాల మహేష్ గౌడ్ సీనియర్ నాయకులు దూడపాక దుర్గయ్య మాజీ వార్డ సభ్యులు గ్రంథం ఓధాకర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు

 బాధిత కుటుంబానికి భరోసా.

 బాధిత కుటుంబానికి భరోసా

నిజాంపేట నేటి ధాత్రి:

గత 15 రోజుల క్రితం నిజాంపేట మండలం నందిగామ గ్రామానికి చెందిన ఆకుల నాగరాజు ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న లీలా గ్రూప్స్ చైర్మన్ మోహన్ నాయక్ బాధిత కుటుంబానికి 5 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమం లో టెలికామ్ బోర్డ్ మెంబర్ ఆకుల రమేష్, బాలరాజ్, సురేష్ నాయక్ లు ఉన్నారు.

జువ్వెంతుల లక్ష్మారెడ్డి కుటుంబనికి.

జువ్వెంతుల లక్ష్మారెడ్డి కుటుంబనికి
సిరిసిల్ల జిల్లా రెడ్డి సంఘం పరామర్శ

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

 

 

రాజన్న సిరిసిల్ల జిల్లా రెడ్డి సంక్షేమ సంఘము సంయుక్త కార్యదర్శి బోయినపల్లి మండలం మర్లపేట గ్రామానికి చెందిన జువ్వెంతుల లక్ష్మారెడ్డి ఈరోజు గుండెపోటుతో మరణించినందున వారి కుటుంబాన్ని పరామర్శించి జిల్లా రెడ్డి సంఘము తరపున దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వీరితో పాటుగా జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు ఎగుమామిడి కృష్ణారెడ్డి, కోశాధికారి ఏడమల హనుమంత రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ తీపి రెడ్డి కిషన్ రెడ్డి రామన్నపేట మాజీ సర్పంచ్ కమటం అంజిరెడ్డి,రెడ్డి సంఘం జిల్లా నాయకులు మిట్టపల్లి శ్రీనివాస్ రెడ్డి ఏమి రెడ్డి సురేందర్ రెడ్డి గ్రామ రెడ్డి సంఘం సభ్యులు పాల్గొని సానుభూతి వ్యక్తం చేశారు.

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన !

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అఖిల భారత యాదవ మహాసభ సభ్యులు

మల్లాపూర్ మే 15 నేటి ధాత్రి:

మల్లాపూర్ మండలం గొర్రెపల్లి గ్రామానికి చెందిన మాదం నాగరాజు ప్రమాదవశాత్తు ఇటీవల విద్యుత్ షాక్ తగిలి మరణించడం జరిగింది మండలానికి చెందిన అఖిలభారత మహాసభ మండల యాదవ సభ్యులు ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. వారికి ఆర్థికంగా అండగా ఉంటామని అదేవిధంగా ప్రభుత్వపరంగా ఏదైనా అవసర నిమిత్తం అందుబాటులో ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ధనరేకుల సంతోష్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు బండ మల్లేష్, కార్యవర్గ సభ్యులు బండారి వెంకటేష్, మండల అధ్యక్షుడు సంగ గంగారాజం, జిల్లా యూత్ అధ్యక్షులు రేబ్బటి రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి మహేష్, మామిడి తిరుపతి, రాజలింగం మాదం రాజేందర్, రాజు గణేష్ , అంజయ్య, హరీష్ తదితరులు పాల్గొన్నారు.

మృతురాలు కుటుంబానికి బియ్యం అందజేత.

మృతురాలు ఎల్లవ్వ కుటుంబానికి బియ్యం అందజేత….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి :

 

 

తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామానికి చెందిన. గ్రామపంచాయతీ కార్మికురాలు పోచ ఎల్లవ్వ. మృతిచెందగా. వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేక వారి కుటుంబాన్ని చూసి చదివించి వారి కుటుంబానికి. సత్తు శ్రీనివాస్ రెడ్డి 50 కేజీల బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా నిరుపేద కుటుంబానికి చెందిన ఎల్లవ్వ అర్థిక స్థితి బాగోలేక వారి కుటుంబానికి చూసి చలించి వారి కుటుంబానికి అండగా నిలిచేందుకు ముందుకు వచ్చిన దాతలు ఇందులో భాగంగా.తన వంతు సహాయంగా. 50 కేజీల బియ్యాన్ని అందజేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి సత్తు శ్రీనివాస్ రెడ్డి. అలాగే మృతి చెందిన. గ్రామపంచాయతీ. కార్మికురాలు . ఎల్లవ్వ కుటుంబ పరిస్థితి బాగా లేనందున. ప్రభుత్వ పరంగా గాని గ్రామపంచాయతీ పరంగా గాని వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో. ఫిషరీష్ జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నమనేని ప్రశాంత్. గ్రామ శాఖ అధ్యక్షులు ఆసరి మహిపాల్ రెడ్డి. మండల మహిళా అధ్యక్షురాలు హరిక రెడ్డి. రాజేష్. బాలయ్య. తంగళ్ళపల్లి రవి. పెద్ది పరిసరం గౌడ్. బుర్ర బబ్లు. చెక్కపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు

సురేందర్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎంపీ.!

కుర్మ సురేందర్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎంపీ వంశీకృష్ణ

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

క్యాతనపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ కుర్మ సురేందర్, పార్టీ నాయకులు కుర్మ సుగుణాకర్ ల యొక్క నాన్న కుర్మ రామయ్య ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను సోమవారం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యాన్ని అందించారు.కుటుంబానికి అండగా ఉంటామని,అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ఎంపీ వంశీకృష్ణ తెలిపారు.పరామర్శ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, జిల్లా అధికార ప్రతినిధి ఒడ్నాల శ్రీనివాస్, పలిగిరి కనకరాజు, పల్లె దినేష్, కనకం వెంకటేశ్వర్లు, వెంకటస్వామి, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన.!

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన
తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి
చందుపట్ల కీర్తి రెడ్డి
మొగులపల్లి నేటి ధాత్రి:

మొగులపల్లి మండలం గ్రామం వేములపల్లి లోఇటీవల మృతి చెందిన బాధిత కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి బుధవారం రోజున పరామర్శించారు. వారి వెంట నాయకులు మాజీ ఎంపీటీసీ గాజుల రజిత మల్లయ్య రాజు గౌడ్ చంద్రసేన ఎర్ర రాజేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version