ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కాంగ్రెస్.!

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

జైపూర్,నేటి ధాత్రి:

 

 

జైపూర్ మండలం టేకుమట్ల గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి,పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ఆదేశాల మేరకు శనివారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు.రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని,ఏ సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో వరి పంట ఎక్కువ దిగుబడి అవుతుందని అన్నారు. రూ.2లక్షల రుణమాఫీ చేసి రైతు పక్ష పాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలిచిందని తెలిపారు.సన్న వడ్ల ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికె దక్కిందని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు చల్ల సత్యనారాయణ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ గుండు తిరుపతి,వైస్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,గ్రామ రైతులు, సెంటర్ ఇన్చార్జి బల్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ ఉనికి కోల్పోవడం ఖాయం.!

కాంగ్రెస్ ఉనికి కోల్పోవడం ఖాయం. రజతోత్సవసభ తో

భారత రాజకీయాల్లో రజితోత్సవ సభ చారిత్రాత్మకం

గండ్ర యువసేన జిల్లా నాయకులు

గడ్డం రాజు.

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

మండలకేంద్రంలో గండ్ర యువసేన జిల్లా నాయకులు గడ్డం రాజు మొగుళ్ళపల్లిలొ జరిగిన పాత్రికేయుల సమావేశంలొ రజతోత్సవ సన్నాహక సమావేశంను ఉద్దేశించి రాష్ట్రంలో ఉనికిని కోల్పోవడం ఖాయమని అన్నారు. ఆయన మట్కాడుత
ఏప్రిల్ 27న వరంగల్ లో జరిగే రజతోత్సవ సభకు సమాయత్తం చేయడం కొరకు పర్యటన చేస్తున్నానాని రజతోత్సవ సభకు ప్రజలు నాయకులు కార్యకర్తలు వస్తున్నారని భారత రాజకీయ చరిత్రలో ఈ సభ చారిత్రాత్మక అవుతుంది అన్నారు.కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను మాయమాటలతో మభ్యపెట్టి అధికారంలోకి వికారంలోకి వచ్చి ఏ ఒక్క హామీని నెరవేర్చడం లేదని గడ్డం రాజు ఆవేదన వ్యక్తంచేశారు ప్రజాసంక్షేమం గాలికి వదిలేసి ప్రజలను గోసా పడుతున్నారని స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు మొగుళ్ళపల్లి మండలం నుంచి అధిక సంఖ్యలో విజయోత్స సభకు పాల్గొనాలని గడ్డం రాజు పిలుపునిచ్చారు.

బిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకుడు.!

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను చూసి పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకుడు

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

న్యాల్కల్ మండల మామిడిగి గ్రామానికి చెందిన బక్క రెడ్డి పెంట రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి
శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు గారి నాయకత్వములో పనిచేయడానికి బిఆర్ఎస్ పార్టీలోకి చేరారు. వారిని పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే.ఈ కార్యక్రమంలో చంద్రన్న,తుక్క రెడ్డి,మాణిక్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి.!

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి గారీ సొంత నిధులతో బోర్ ఏర్పాటు

జహీరాబాద్. నేటి ధాత్రి:

డైవర్స్ కాలనీలో నీటి సమస్యను స్థానిక ప్రజలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి గారీ దృష్టికి తీసుకెళ్లగా వారు స్పందించి బోర్ వేయిస్తానని హామీ ఇచ్చారు.దీంతో గురువారం రోజున బోర్ డ్రిల్ చేసేందుకు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి పూజా కార్యక్రమం నిర్వహించి కొబ్బరికాయ కొట్టి బోర్ తవ్వకాన్ని ప్రారంభించారు.ప్రజలు నీటితో కష్టాలు పడకుండా ఉండేందుకు బోర్ డ్రిల్ చేయిండం పట్ల స్థానిక ప్రజలు హర్షవ్యక్తం చేస్తూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డా౹౹ఉజ్వల్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈకార్యక్రమంలో ఎస్సీ సెల్ రాష్ట్ర వైస్ చైర్మన్ భీమయ్య,పట్టణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పట్లోళ్ళ.శ్రీకాంత్ రెడ్డి,యూత్ అసెంబ్లీ అధ్యక్షుడు పి.నాగిరెడ్డి,అశ్విన్ పాటిల్, ప్రతాప్ రెడ్డి,రంగా అరుణ్ కుమార్,యూత్ కాంగ్రెస్ న్యాల్కల్ మండల అధ్యక్షుడు జి.కిరణ్ కుమార్ గౌడ్,సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కె.జగదీశ్వర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అసెంబ్లీ అధ్యక్షుడు జమిలాలోద్దిన్,మైనార్టీ సెల్ టౌన్ అధ్యక్షుడు జావిద్,బి.మల్లికార్జన్,అక్బర్,హర్షద్ పటేల్,ముస్తఫా,నిజాం,బర్కత్ మరియు డైవర్స్ కాలనీ ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీని వీడి బి.ఆర్.ఎస్. పార్టీలో.!

కాంగ్రెస్ పార్టీని వీడి బి.ఆర్.ఎస్. పార్టీలో చేరిన నాయకులు
మాజీ మంత్రి దయాకర్ రావు సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్న మాజీ సర్పంచ్ ఉప, సర్పంచ్
కక్కిరాల పల్లిలో ఖాళీ అవుతున్న కాంగ్రెస్ పార్టీ

నేటిధాత్రి ఐనవోలు/హన్మకొండ:-

ఐయినవోలు మండలం కక్కిరాల పల్లి గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ కంచర్ల రమేష్, ఉప సర్పంచ్ బొల్లం ప్రకాష్ మంగళవారం మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో బి. ఆర్. ఎస్ పార్టీలో చేరడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ఈ మోసపూరిత కాంగ్రెస్ మాటలు విని మేం మోసపోయామని ప్రజలు అంటున్నారని,కెసిఆర్ ఒక విజన్ తో పని చేస్తే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవగాహన లోపంతో ప్రజలను ఆగం పట్టిస్తున్నారని విమర్శించారు. బోగస్ మాటలు చెప్పి ప్రజలను బోల్తా కొట్టించిన ఈ కాంగ్రెస్ పార్టీని తొందరలోనే బొంద పెట్టే రోజులు వస్తున్నాయని వారు అన్నారు.వీరితోపాటు బీ. ఆర్. ఎస్ పార్టీలో కాటబోయిన కుమారస్వామి, గాడుదల లింగయ్య, చిర్ర రాజేందర్, తల్లపెల్లి నాగరాజు, మడ్లపల్లి రాజు,ఆరూరి అరుణ్, నూనె సాంబరాజు, జోగు సతీష్, జోగు రమేష్, గుబ అరుణ్ కుమార్, కోల శ్రీనివాస్, ఆరూరి లలిత, ఆరూరి పూల, బర్ల సుమలత, ఆరూరి అనిత ఇంకా భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నుండి కార్యకర్తలు పార్టీలో చేరటం జరిగింది.ఈ కార్యక్రమంలో బి. ఆర్. ఎస్ మండలం వర్కింగ్ ప్రెసిడెంట్ తక్కలపల్లి చందర్ రావు మండల కన్వీనర్ తంపుల మోహన్, మండల ఇంచార్జ్ గుజ్జ గోపాలరావు, నాయకులు పల్లకొండ సురేష్, గ్రామ పార్టీ బీఆర్ఎస్ అధ్యక్షుడు అల్లం సోమయ్య, టిఆర్ఎస్ నాయకులు మరుపట్ల దేవదాస్,దుప్పెల్లి కొమురయ్య, గడ్డం రఘువంశీ గౌడ్ పాల్గొన్నారు.

రజతోత్సవ సభతో కాంగ్రెస్ ఉనికి కోల్పోవడం ఖాయం.

రజతోత్సవ సభతో కాంగ్రెస్ ఉనికి కోల్పోవడం ఖాయం.

మాజి సీఎం కె.సి.ఆర్ పిలుపుతో ప్రజల నుండి అనూహ్య స్పందన

వనపర్తి నేటిదాత్రి :

 

 

వనపర్తి మండలం కాశీం నగర్ గ్రామరజతోత్సవ సన్నాహక సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ ఒక ప్రకటన లో విలేకరుల కు తెలిపారు
ఏప్రిల్ 27న వరంగల్ లో జరిగే రజతోత్సవ సభకు సమాయత్తం చేయడం కొరకు పర్యటన చేస్తున్నానాని శ్రీదర్ తెలిపారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రజతోత్సవ సభకు ప్రజలు నాయకులు కార్యకర్తలు వస్తున్నారని భారత రాజకీయ చరిత్రలో ఈ సభ చారిత్రాత్మక అవుతుంది అన్నారు.కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను మాయమాటలతో మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి డబ్బుల సంచులు డిల్లీకి తరలించడం పనిగా పెట్టుకున్నారు అని శ్రీదర్ ఆవేదన వ్యక్తంచేశారు ప్రజాసంక్షేమం గాలికి వదిలేసి ప్రజలను గోసా పడుతున్నారని స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని శ్రీధర్ అన్నారు
మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సహకారంతో వనపర్తి నియోజకవర్గ ప్రజలు భా రీ ఎత్తున పాల్గొని తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కె.సి.ఆర్ కు అండగా నిలుస్తారని అన్నారు. ఈ కార్యక్రమం లో పెద్దగూడెం మాణిక్యం రాము వెంకటయ్య నీలేష్ బీసం వెంకటయ్య నరసింహా లక్ష్మణ్ గౌడ్ రామన్ గౌడ్ బీ ఆర్ ఎస్ కార్యకర్తలు ప్రజలు పోల్గొన్నారని వాకిటి శ్రీదర్ తెలిపారు

ఓబులాపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడి రాజీనామా.

ఓబులాపూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడి రాజీనామా

మల్లాపూర్ ఏప్రిల్ 18 నేటి ధాత్రి

 

కాంగ్రెస్ పార్టీ కోరుట్ల కాంసెన్సీ ఇంచార్జ్ జువ్వడి నర్సింగ రావు గారు, నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలను కలుపుకోలేక పోతున్నారు మల్లాపూర్ మండలంలో పది సంవత్సరాలు కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్య కర్తలు తీవ్ర ఆవేదనలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వారందరికీ న్యాయం చేయాలని కోరుకుంటూ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నేను గత పది సంవత్సరాలుగా పార్టీ కోసం పైసలు ఖర్చు పెట్టుకున్నాను కష్టపడ్డాను ఫలితంగా నాకు అవమానాలే ఎదురు అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నర్సింగరావు గారు నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పట్టించుకోకపోవడంలేదు నిరసన గా కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానని తెలియపరుస్తున్నాను
పల్లె శేఖర్ ముదిరాజ్.
.

సిపిఐ 11వ మహాసభను జయప్రదం చేయండి.

సిపిఐ కరీంనగర్ నగర11వ మహాసభను జయప్రదం చేయండి.

సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సహాయ కార్యదర్శి పైడిపల్లి రాజు

కరీంనగర్, నేటిధాత్రి:

 

ఈనెల 18వ తేదీన సిపిఐ కరీంనగర్ నగర పదకోండవ మహాసభ నగరంలోని గణేష్ నగర్ లో గల బద్ధం ఎల్లారెడ్డి భవన్ లో ఉదయం 10:30 గంటలకు జరగనుందని ఈయొక్క మహాసభకు నగరంలోని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని మహా సభను విజయవంతం చేయాలని కసిరెడ్డి సురేందర్ రెడ్డి, పైడిపల్లి రాజులు కోరారు. ఈయొక్క మహాసభకు ముఖ్య అతిథులుగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామిలు హాజరై ప్రసంగిస్తారని వారు తెలిపారు. ఈయొక్క నగర మహాసభలో కరీంనగర్ నగరంలోని అరవైవ డివిజన్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించడం జరుగుతుందని, రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ పోటీ చేయుటకు కార్యకర్తలను సంసిద్ధం చేయడం జరుగుతుందన్నారు. నగరంలో గత రెండు సంవత్సరాలుగా అభివృద్ధి పనులు అటకెక్కాయని గత ప్రభుత్వం ఆగ మేఘాల మీద అనేక పనులను శంకుస్థాపనలు చేసి వదిలేసిందని చాలా ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తామని ఎన్నికల ముందు చెప్పి పూర్తిగా మరిచిపోయారని ఆరోపించారు. స్మార్ట్ సిటీ పనుల్లో పూర్తిగా అవినీతి అక్రమాలు జరిగాయని, మానేర్ రివర్ ఫ్రంట్ తీగల వంతెన పనుల్లో పూర్తిగా నాణ్యత లోపించి రోడ్డు పూర్తిగా ధ్వంసమవుతుందని గత మున్సిపల్ పాలకవర్గం పూర్తిగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డందని భూకబ్జాలు, ఇండ్లు కడితే కమిషన్లు, ఇంటి నెంబర్ కు డబ్బులు తీసుకుని నానా రకాలుగా ప్రజలను ఇబ్బంది పెట్టారని ఈసమస్యలతో పాటు నగరంలో ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్ల స్థలాల కోసం రేషన్ కార్డుల కోసం అర్హులైన వారికి పెన్షన్ల కోసం రానున్న కాలంలో భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుని ముందుకెళ్ళుటకు ఈమహాసభ ఎంతగానో ఉపయోగపడుతుందని వారు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం, ఆరు గ్యారెంటీలు అర్హులైన వారికి అందే వరకు ఉద్యమాలతో ఒత్తిడి తీసుకువచ్చి పేద ప్రజలకు సంక్షేమ పథకాల ఫలాలు అందే వరకు పోరాట కార్యాచరణ చేస్తామని సురేందర్ రెడ్డి, పైడిపల్లి రాజు తెలిపారు. ఈమహాసభ నగర ప్రజల దశ దిశ మార్చేందుకు ఉపయోగపడుతుందన్నారు. కావున నగర ప్రజలు మహాసభలో అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు.

సిపిఐ కరీంనగర్ నగర11వ మహాసభను జయప్రదం చేయండి.

సిపిఐ కరీంనగర్ నగర11వ మహాసభను జయప్రదం చేయండి.

సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సహాయ కార్యదర్శి పైడిపల్లి రాజు

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

ఈనెల 18వ తేదీన సిపిఐ కరీంనగర్ నగర పదకోండవ మహాసభ నగరంలోని గణేష్ నగర్ లో గల బద్ధం ఎల్లారెడ్డి భవన్ లో ఉదయం 10:30 గంటలకు జరగనుందని ఈయొక్క మహాసభకు నగరంలోని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని మహా సభను విజయవంతం చేయాలని కసిరెడ్డి సురేందర్ రెడ్డి, పైడిపల్లి రాజులు కోరారు.

ఈయొక్క మహాసభకు ముఖ్య అతిథులుగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామిలు హాజరై ప్రసంగిస్తారని వారు తెలిపారు. ఈయొక్క నగర మహాసభలో కరీంనగర్ నగరంలోని అరవైవ డివిజన్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించడం జరుగుతుందని, రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ పోటీ చేయుటకు కార్యకర్తలను సంసిద్ధం చేయడం జరుగుతుందన్నారు.

నగరంలో గత రెండు సంవత్సరాలుగా అభివృద్ధి పనులు అటకెక్కాయని గత ప్రభుత్వం ఆగ మేఘాల మీద అనేక పనులను శంకుస్థాపనలు చేసి వదిలేసిందని చాలా ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తామని ఎన్నికల ముందు చెప్పి పూర్తిగా మరిచిపోయారని ఆరోపించారు.

Congress

స్మార్ట్ సిటీ పనుల్లో పూర్తిగా అవినీతి అక్రమాలు జరిగాయని, మానేర్ రివర్ ఫ్రంట్ తీగల వంతెన పనుల్లో పూర్తిగా నాణ్యత లోపించి రోడ్డు పూర్తిగా ధ్వంసమవుతుందని గత మున్సిపల్ పాలకవర్గం పూర్తిగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డందని భూకబ్జాలు, ఇండ్లు కడితే కమిషన్లు, ఇంటి నెంబర్ కు డబ్బులు తీసుకుని నానా రకాలుగా ప్రజలను ఇబ్బంది పెట్టారని ఈసమస్యలతో పాటు నగరంలో ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్ల స్థలాల కోసం రేషన్ కార్డుల కోసం అర్హులైన వారికి పెన్షన్ల కోసం రానున్న కాలంలో భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుని ముందుకెళ్ళుటకు ఈమహాసభ ఎంతగానో ఉపయోగపడుతుందని వారు తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం, ఆరు గ్యారెంటీలు అర్హులైన వారికి అందే వరకు ఉద్యమాలతో ఒత్తిడి తీసుకువచ్చి పేద ప్రజలకు సంక్షేమ పథకాల ఫలాలు అందే వరకు పోరాట కార్యాచరణ చేస్తామని సురేందర్ రెడ్డి, పైడిపల్లి రాజు తెలిపారు. ఈమహాసభ నగర ప్రజల దశ దిశ మార్చేందుకు ఉపయోగపడుతుందన్నారు. కావున నగర ప్రజలు మహాసభలో అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు.

అంబేద్కర్ గారికి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ.

జహీరాబాద్ పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

డా.బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని జహీరాబాద్ పట్టణంలోని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలవేసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం జహీరాబాద్ పట్టణంలో డా౹౹బాబా సాహెబ్ అంబెద్కర్ జయంతి ఉత్సవ కమిటీ వారు నిర్వహించిన డా౹౹బాబా సాహెబ్ అంబెద్కర్ జయంతి ఉత్సవ సభకి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈసందర్భగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి మాట్లాడుతూ..ఆర్థికవేత్త రాజా నీతిజ్ఞుడు భారత రాజ్యాంగ రూపకర్త మహానీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి జహీరాబాద్ పట్టణంలో పూలమాలవేసి నివాళులర్పించడం చాలా సంతోషకరంగా ఉందన్నారు.యావత్ భారత్ మొత్తం రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గారి ఆశయాలను సాధించాలని ఈ సందర్భంగా కోరుకున్నారు.ఈకార్యక్రమంలో జహీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పి.నర్సింహారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మంకాల్ సుభాష్.కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర వైస్ చైర్మన్ భీమయ్య,డిసిసి ఉపాధ్యక్షుడు ముల్తాని,మాజీ జెడ్పీటీసీలు రాందాస్,నరేష్,మాజీ సర్పంచ్ నర్సింహారెడ్డి,మాజీ కౌన్సిలర్లుశేఖర్,తాహేరా బేగం,మైనార్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు జమిలాలోద్దిన్,యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు న్యాల్కల్ మండల అధ్యక్షుడు జి.కిరణ్ కుమార్ గౌడ్,మాజీ ఏఎంసి వైస్ చైర్మన్ అక్బర్,బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోపాల్,మైనార్టీ సెల్ టౌన్ అధ్యక్షుడు జావిద్,హర్షద్ పటేల్,అశ్విన్ పాటిల్,తాహేర్ పాటిల్,కె.జగదీశ్వర్ రెడ్డి,రాజు నాయక్,సునీల్,నర్సింహా యాదవ్,అక్షయ్ జాడే,రాజు,జహీర్ అరబ్బీ,ప్రమోద్, జగదీష్,మోహిన్,నిజాం మరియు అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు,మాజీ సర్పంచ్ లు,మాజీ యం.పి.టి.సిలు,మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర.

జై బాపు. జై భీమ్. జై సంవిధాన్ . భాగంగా. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ. కాలనీ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. జై బాపూ. జై భీమ్. జై సంవిధాన్. కార్యక్రమాన్ని నిర్వహించారు ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్పులు తెచ్చే విధంగా కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కుట్ర పన్నుతుందు అని. కులాల మతాల మధ్య విభేదాలు సృష్టించి పబ్బం గడుపుకోవడానికి బిజెపి విధానమని. కేంద్రం కుట్రలను ప్రజలకు వివరించేందుకు రాహుల్ గాంధీ గ్రామ గ్రామాన పాదయాత్ర చేపట్టారని రాజ్యాంగాన్ని మార్చాలన్న బిజెపి కుట్రలను రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్రలో దేశంలో ప్రజలందరికీ వివరించారని గత బి ఆర్ ఎస్ ప్రభుత్వాన్ని కాదని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టారని ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ రేవంత్ రెడ్డి జనరంజక పాలన అందిస్తున్నారని 50 వేల ఉద్యోగులను భర్తీ చేయడమే కాకుండా నిరుద్యోగ యువకులకు రాజీవ్ వికాస్ పథకం ద్వారా స్వయం ఉపాధి చూసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని గత ప్రభుత్వం రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుల్లో ముంచిన ఈ ప్రభుత్వం.అభివృద్ధి ఎక్కడ ఆపలేదని ఒక్కొక్క హామీలు నెరవేస్తూ. ప్రజాపాలన సాగుతుందని మత కుల ద్వేషాలు రెచ్చగొట్టాలని బిజెపి కుట్రలను తిప్పి కొట్టడానికి రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు భారత్ జూడో యాత్ర కొనసాగించాలని బిజెపి కుట్రలను రాహుల్ గాంధీ ప్రజలకు తెలియజేశారని రాహుల్ గాంధీ యాత్రలో బిజెపి పార్టీ 200 సీట్లకే పరిమితమైందని సన్న బియ్యం పథకంతో మీ కంచంలో అన్నమై వచ్చిండు అని దానికి కారణం ఇచ్చిన మాట ప్రకారం రాహుల్ గాంధీ.రేవంత్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వతంత్రాన్ని పోరాటాల ద్వారా సాధించిందని ప్రభుత్వ పాలకులు గత బి ఆర్ ఎస్ ప్రభుత్వ భూములను దోచుకుని తిన్నారు అని తెలంగాణ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పిన అవినీతి అక్రమార్కులు కేసీఆర్ కుటుంబం నెంబర్ వన్ అందుకే సీటు దించి ప్రజలు చీ వా ట్లుపెట్టారని గత ప్రభుత్వంలో ఈ ప్రాంతం ఎంత దోపిడీ గురైందో అందరికీ తెలుసు అని ప్రజా జం జకా పరిపాలన అందిస్తున్న రేవంత్ రెడ్డికి అండగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేశారు రాష్ట్ర ప్రజలు అందరూ ఈ ప్రభుత్వానికిఅండగా ఉండాలని తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

కాంగ్రెస్ పార్టీకి యువకులే పట్టుకొమ్మలు..

కాంగ్రెస్ పార్టీకి యువకులే పట్టుకొమ్మలు

-కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు కె ప్రతాప్

మొగుళ్లపల్లి నేటి ధాత్రి :

 

కాంగ్రెస్ పార్టీకి యువకులే పట్టుకొమ్మలని కాంగ్రెస్ పార్టీ మొట్లపల్లి గ్రామ ఉపాధ్యక్షుడు కె ప్రతాప్ అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి యూత్ కాంగ్రెస్ ఒక కుడి భుజం లాంటిదని, కాంగ్రెస్ పార్టీకి యువకులే పట్టుకొమ్మలని, పార్టీకి యూత్ సేవలు కీలకమని ఈ సందర్భంగా అభివర్ణించారు. ఏఐసీసీ నుంచి మండల కమిటీ వరకు ఏ పిలుపు వచ్చిన సమర్థవంతంగా ఎదుర్కొని, పార్టీ కార్యకలాపాలలో ముందుండి పార్టీని నడిపించే విధంగా యూత్ కాంగ్రెస్ ఎప్పుడు ముందుండాలని ఆయన యూత్ కాంగ్రెస్ నాయకులకు సూచించారు.

సన్న బియ్యం భోజనం చేసిన కాంగ్రెస్ మహిళలు.

చేనేత కార్మికుడి ఇంటిలో సన్న బియ్యం భోజనం చేసిన కాంగ్రెస్ మహిళలు

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలో బి.వై నగర్ లోని చేనేత కార్మికుడి ఇంటిలో సన్న బియ్యం భోజనం చేసిన సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప తిరుపతి రెడ్డి మరియు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత -నలినీకాంత్ మాట్లాడుతు గత ప్రభుత్వహయాంలో దొడ్డు బియ్యం పంపిణీ చేస్తే, నేడు కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంతన్న హయాంలో పేద, ప్రజలందరికీ సన్న బియ్యం పంపిణీ చేయడం జరిగినది.

నేడు సిరిసిల్ల జిల్లాలోని మహిళలందరూ కూడా వాళ్ల పిల్లలకి వాళ్ళ కుటుంబ సభ్యుల అందరికీ కూడా కడుపునిండా భోజనం తింటున్నారని పేద ప్రజలందరి కళ్ళలో సంతోషం వ్యక్తం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మహిళా కాంగ్రెస్ నాయకురాలు మడుపు శ్రీదేవి, మరియు జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కోడం అరుణ, జిల్లా మహిళా వైస్ ప్రెసిడెంట్ సామల రోజా సుధ, సిరిసిల్ల మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎండి కాజా పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూట్ల తిరుపతి.

పలు కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూట్ల తిరుపతి.

చిట్యాల, నేటిధాత్రి :

 

 

చిట్యాల మండలం లోని నైన్ పాక గ్రామంలో నల్లబెల్లి మల్లమ్మ చనిపోగా వారి పార్థివ దేహానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపినారు.. జూకల్ గ్రామంలోని అన్నం కొమురయ్య చనిపోగా వారి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు అనంతరం తాడిశెట్టి లక్ష్మి మరణించగా వారి పార్థివ దేహానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని ఆమె ఇవ్వడం జరిగినది..నవాబుపేట గ్రామ కరోబార్ జిల్లాల కుమార్ ప్రమాదవశత్తు బైక్ నుండి పడి చనిపోగా చిట్యాల ప్రభుత్వ హాస్పటల్ కి వెళ్లి వారి పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలపడం జరిగినది.ఈ కార్యక్రమంలో నైన్ పాక గ్రామ శాఖ అధ్యక్షుడు తొట్ల రాజయ్య , కంకనాల శంకర్ , పాలడుగుల రఘుపతి , బిక్కనూరి విజయ్ జూకల్ గ్రామ శాఖ అధ్యక్షుడు సూర నరేందర్ , మండల ఉపాధ్యక్షుడు దొంతి రాంరెడ్డి , రేగురి స్వామి రెడ్డి , మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లకొండ కుమార్ , నాగరాజు , అందుగుల రాజు , మధుకర్ , రాము , మధు , సదనందం , చింతల సుమన్ , మేకల రాజయ్య తదితరులు పాల్గొన్నారు…

కాంగ్రెస్ పార్టీకార్యకర్త కుటుంబానికి ఆర్థిక సహాయం.

కాంగ్రెస్ పార్టీకార్యకర్త కుటుంబానికి ఆర్థిక సహాయం.

కల్వకుర్తి/నేటి దాత్రి:

 

 

కల్వకుర్తి నియోజక వర్గంలో కర్కల్ పహాడ్ గ్రామానికి చెంది ఎమ్మెల్యే అనుచరుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సిలివేరు శ్రీను గత నెల అనారోగ్యంతో మృతి చెందాడు. ఇవాళ ఉదయం శ్రీను భార్యను పిల్లను ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఇంటికి పిలిపించుకుని మీకు మేము పార్టీ అండగా ఉంటుంది ఎవ్వరు అదర్యపడొద్దని భరోసా ఇచ్చి అపద్ధర్మం కింద కొంత రూ. 2 లక్షల ఆర్థిక సహాయ అందించారు . తన పిల్లల మంచి భవిష్యత్తు పై చదువులకోసం సహాకారం చేస్తా అన్నారు శ్రీను తనకోసం చాలా కష్టపడి పనిచేశాడు గుర్తుకు చేసుకుంటూ ఇలాంటి సంఘటనలు దురదృష్టకరం అని కుటుంబ సభ్యులను భరోసానిచ్చారు.

కాంగ్రెస్ ప్రభుత్వం.. పేదల ప్రభుత్వం.

కాంగ్రెస్ ప్రభుత్వం.. పేదల ప్రభుత్వం.

రేషన్ కార్డు లేక.. బడుగు బలహీన వర్గాలు దూరం

511 కొత్త రేషన్ కార్డులు పంపిణీ.

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి.

మహబూబ్ నగర్/ నేటి ధాత్రి

 

ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహబూబ్ నగర్ గ్రామీణ మండలానికి చెందిన 511 మంది లబ్దిదారులకు నూతన రేషన్ కార్డులను ఆయన పంపిణీ చేశారు. అనంతరం ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత పది సంవత్సరాలుగా ఒక్క లబ్దిదారుడికి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డు ఇవ్వలేదని, రేషన్ కార్డులు ఇవ్వకపోవడం వల్ల బడుగు బలహీన వర్గాల ప్రజలకు తీరని నష్టం జరిగిందని ఆయన ఆరోపించారు. రేషన్ కార్డు లేకపోవడం వలన ప్రభుత్వ సంక్షేమ పథకాలు వారికి అందలేదని, రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు పేద ప్రజలు వినియోగించుకోలేక పోయారని అందువల్ల వారు ఆర్థికంగా కూడా చాలా నష్టపోయారని ఎమ్మెల్యే మండిపడ్డారు. ప్రజా ప్రభుత్వం లో సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో అధికారంలోకి రాగానే.. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. విద్య, వైద్యం, ఉపాధి పైన అధిక శ్రద్ధ చూపిస్తూ.. అన్ని వర్గాల ప్రజల సంక్షేమ పథకాలు అందిస్తున్నాం అని అన్నారు. గత 75 సంవత్సరాల కాలంలో ఎన్నడూ సాధ్యం కానిది ప్రజా ప్రభుత్వంలో రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఉచితంగా 6 కేజీల సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. రైతుల వద్ద సేకరించిన సన్న వడ్లను బియ్యంగా మార్చి తిరిగి ప్రజలకే పంచడం నిజంగా విప్లవాత్మక నిర్ణయం ఎమ్మెల్యే అన్నారు. రేషన్ షాపుల్లో సన్న బియ్యాన్ని అందరూ తప్పకుండా వాడుకోవాలని ఆయన సూచించారు. మీ బాగుకోసం పనిచేసే కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, ఐఎన్టీయుసి రాములు యాదవ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, మత్స్యకారుల సంఘం అధ్యక్షులు గంజి ఆంజనేయులు, అవేజ్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్స్ ఖాజా పాషా, చిన్న , మోసిన్ , నాయకులు శ్రీనివాస్ యాదవ్, అర్షద్ అలి, కిషన్ నాయక్, గోవింద్ యాదవ్, ధర్మాపూర్ నర్సింహారెడ్డి, పోతన్ పల్లి మోహన్ రెడ్డి, గోపాల్, చర్ల శ్రీనివాసులు, అజిజ్ అహ్మద్, తులసిరాం నాయక్, మన్యం కొండ నరేందర్ రెడ్డి, , తహసీల్దార్ సుందర్ రాజ్, ఎంపిడిఓ కరుణశ్రీ, తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ గ్రామ యూత్ కమిటీ ఎన్నిక.

కాంగ్రెస్ గ్రామ యూత్ కమిటీ ఎన్నిక.

చిట్యాల, నేటిధాత్రి

 

చిట్యాలమండలంలోని తిరుమలాపురం గ్రామంలో శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ* గారి ఆదేశాల మేరకు *చిట్యాల మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లకొండ కుమార్అధ్యక్షతన తిరుమలాపురం యూత్ గ్రామ కమిటీని ఎన్నుకోవడం జరిగింది.తిరుమలాపురం గ్రామ యూత్ అధ్యక్షులుగాకంచర్ల రాంబాబుఉపాధ్యక్షులుగాగద్దల రాజు, చెన్న శ్రీకాంత్
వర్కింగ్ ప్రెసిడెంట్* : కంచు తిరుపతి
ప్రధాన కార్యదర్శిగాఆరెల్లి సురేష్, జెన్నే సాగర్
ప్రచార కార్యదర్శిగా ఆరెల్లి రామ్ చరణ్ (బన్నీ)
సహాయ కార్యదర్శిగాగోపగాని మనోహర్, గజ్జి తిరుపతి
కోశాధికారిగానగరపు సాయి
సోషల్ మీడియాగాగోపగాని మహేష్
కార్యవర్గ సభ్యులుగా
జంగంపెల్లి పవన్
కాలవేనీ నవీన్
గజ్జి నరేష్
జెన్నె సంజీవ్
దాసారపు సురేష్ తోట వెంకన్న
నల్ల రాకేష్
కాలవేణి దినేష్
గోపగాని రజనీకాంత్
నార్లపురం రాజీరు
కంచు దినేష్
జెన్నె ప్రశాంత్
. జెన్నె అశోక,ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు గజ్జి రవి, గోపగాని శివకృష్ణ, ఎలగొండ చిరంజీవి, గోల్కొండ నాగరాజు, గోపగాని వెంకటేశ్వర్లు, ఆరెల్లి సదానందం, కంచర్ల కిట్టు, ఎలగొండ శ్రీకాంత్* తదితరులు పాల్గొన్నారు.

పేదల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ద్యేయం.

పేదల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ద్యేయం

కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు నల్ల లింగారెడ్డి

సీనియర్ నాయకులు చర్లపల్లి శ్రీధర్ గౌడ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

పేదల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయంగా పని చేస్తుందని, ఇచ్చిన మాట నెరవేర్చేందుకు నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని ప్రజా ప్రభుత్వం పేద ప్రజలను అభివృద్ధి పథంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తుందని గ్రామ శాఖ అధ్యక్షులు నల్ల లింగారెడ్డి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ఎల్లారెడ్డిపల్లి గ్రామ రేషన్ షాప్ డీలర్ మండల అధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల భద్రయ్య అధ్యక్షతన ఏర్పాటుచేసిన సన్నబియ్యం కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా తాహసిల్దార్ జాలి సునీత హాజరై సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామ సీనియర్ నాయకులు నల్ల లింగారెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నిరుపేద కుటుంబానికి ఉగాది రోజు నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తుందని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ..సంవత్సరంన్నర కాలంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తుందన్నారు. గతంలో దొడ్డు బియ్యం ఎవరు తినకపోయేదని అట్టి బియ్యాన్ని దళారులకు అమ్ముకునే వారిని తెలిపారు ఇప్పుడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సన్నబియ్యం ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకుంటారని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో మండల గిరిదారు శివరామకృష్ణ గ్రామ కార్యదర్శి శ్రీకాంత్ చర్లపల్లి శ్రీధర్ మాజీ ఉపసర్పంచ్ నాగరాజు సిపిఐ మండల కార్యదర్శి నిమ్మల రాజయ్య ఏ ఐ టి యు సి మండల కార్యదర్శి చంద్రమౌళి డాక్టర్ చారి కలపెల్లి స్వామి వనపర్తి ముండయ్య కల్లపల్లి కొమురయ్య రేషన్ కార్డు హోల్డర్లు తదితరులు పాల్గొన్నారు

కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుంది.

కార్యకర్తల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుంది

భూక్య రమేష్ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే మురళి నాయక్, అధ్యక్షులు భరత్ చందర్ రెడ్డి

కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి

 

 

కేసముద్రం మండలం ఇంటికన్నె గ్రామపంచాయతీ పరిధిలో ముత్యాలమ్మ తండాకి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త భూక్యా రమేష్ నాయక్ ఇటీవలే అనారోగ్యంతో మృతిచెందగా శుక్రవారం వారి చిత్రపటానికి పుష్పగుచ్చం సమర్పించి,వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం అందజేసిన మహబూబాబాద్ శాసనసభ్యులు భూక్యా మురళి నాయక్, డిసిసి అధ్యక్షులు జెన్నరెడ్డి భరత్ చందర్ రెడ్డి

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవ రెడ్డి,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు,మాజీ పిఎసిఎస్ చైర్మన్ బండారు వెంకన్న, పిసిసి సభ్యులు దశ్రు నాయక్,డిసిసి ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి, బండారు దయాకర్, గ్రామ కమిటీ అధ్యక్షులు రాజులపాటి మల్లయ్య,మాజీ సర్పంచ్ సారయ్య, ఎలేందర్,గ్రామ కాంగ్రెస్ నేతలు, తదితరులు పాల్గొన్నారు.

విద్య, వైద్యం కాంగ్రెస్ ముఖ్య ద్యేయం.

విద్య, వైద్యం కాంగ్రెస్ ముఖ్య ద్యేయం
• ఎమ్మెల్యే రోహిత్ రావు

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

విద్య, వైద్యన్నీ అందిచడమే కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్య ద్యేయమని మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. ఈ మేరకు శుక్రవారం నిజాంపేట మండల కేంద్రంలో పర్యటించి జై బాపు, జైసంవిధాన్ లో భాగంగా మండలం లో ర్యాలీ నిర్వహించారు. అలాగే సన్న బియ్యం, ఆరోగ్య ఉప కేంద్రన్నీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో చేయలేని అభివృద్ధినీ కాంగ్రెస్ 15 నెలల్లో చేసి చూపిస్తుందని కొనియడారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, వైద్య కళాశాల ను కాంగ్రెస్ హయాంలో ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ రమాదేవి, కాంగ్రెస్ నాయకులు చౌదర సుప్రభాతరావు, మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి పంజా మహేందర్, పట్టణ అధ్యక్షుడు నసిరుద్దీన్, సత్యనారాయణ, లింగం గౌడ్, గుమ్ముల అజయ్, దేశెట్టి సిద్దారములు, సత్యనారాయణ రెడ్డి,శ్యామల మహేష్, అధికారులు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version