శుక్రవారం అర్ధరాత్రి నిజాంపేట మండలం కల్వకుంట గ్రామంలోని పెద్దమ్మ గుడిలో గుర్తు తెలియని దుండగులు హుండీ పగలగొట్టి అందులోనీ డబ్బులు దొంగిలించినట్టు ఫిర్యాదు రాగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేష్ తెలిపారు. అలాగే వెంకటాపూర్, నార్లపూర్ గ్రామాల్లోనీ ఆలయాలలో చోరీకి ప్రయత్నం జరిగిందని కానీ ఏలాంటి నష్టం జరగలేదని పోలీసులు పేర్కొన్నారు.
హన్మకొండ జిల్లా పరకాల మండలంలోని మల్లక్కపేట గ్రామంలోగల శ్రీభక్తంజనేయ స్వామి దేవస్థానంలో శుక్రవారం రోజున ఆలయ హుండీలను ఆలయ చైర్మన్ అంబీరు మహేందర్ మరియు ఆలయ ఈఓ వెంకటయ్య,ఇన్స్పెక్టర్ ఆర్.అనిల్ కుమార్ పర్యవేక్షణలో లెక్కించడం జరిగింది.ఆరునెలల వ్యవది గల రెండు హుండీలను లెక్కించగా 82355 రూపాయలు ఆలయ కమిటీ తెలిపారు.ఈ సందర్బంగా ఆలయ కమిటీ చైర్మన్ మహేందర్ మాట్లాడుతూ గతంలో కంటే ఈసారి ఆలయ ఆదాయం పెరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో శరత్ అయ్యగారు,ధర్మకర్తలు దొమ్మటి శంకరయ్య,దావు జ్యోతి,చిట్టిరెడ్డి రాజిరెడ్డి,బిళ్ళ రాజిరెడ్డి,నిట్టే బాలరాజు,సిబ్బంది పాల్గొన్నారు.
రాళ్ల బండి శ్రీనివాస్ ను సన్మానించిన దేవస్థానం ఆలయ కమిటీ,
నేటి ధాత్రి మొగుళ్లపల్లి:
హనుమాన్ జయంతి ఉత్సవాలలో భాగంగా మొగుళ్లపల్లి మండలం ముట్లపల్లి శ్రీ అభయాంజనేయ దేవస్థానం లో ఆలయ కమిటీ నిర్వాహకులు అక్షర దర్బార్ భూపాలపల్లి క్రైమ్ రిపోర్టర్ రాళ్ల బండి శ్రీనివాస్ ను ఘనంగా సన్మానించారు,ఆలయ అభివృద్ధికి కృషి చేసినా డాక్టర్ భజ్జూరి వెంకట రాఘవులు ఆదిత్య హాస్పిటల్ యాజమాన్యం ను డాక్టర్ రఘుపతి రెడ్డి శ్రీ పెళ్లి రంజిత్ కిరణ్ ఇతర దాతలను ఆలయ కమిటీ నిర్వాహకులు సత్కారం చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గూడూరి రఘుపతి రెడ్డి డ్యాగా రమేష్ సామల మాధవ రెడ్డి అన్నారెడ్డి మాజీ సర్పంచ్ నరహరి పద్మ వెంకట రెడ్డి ఆలయ అర్చకులు రంగన్న చార్యులు భజన మండలి సభ్యులు పాల్గొనారు
శ్రీరేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకొన్న తెలంగాణ గౌడ సంక్షేమ సంఘ నాయకులు
కరీంనగర్ నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా బొమ్మకల్ గ్రామంలోని శ్రీరేణుక ఎల్లమ్మ జాతర సందర్బంగా శ్రీ రేణుక మాత ను గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నల్లగొండ తిరుపతి గౌడ్ నాయకులు దర్శనం చేసుకొని సందర్శించడం జరిగింది. ఈసందర్భంగా తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నల్లగొండ తిరుపతి గౌడ్ మాట్లాడుతూ రేణుకా మాత ఆశీస్సులు ప్రతి ఒక్క గౌడ బిడ్డకు ఉండాలని ఆ తల్లి ఆశీర్వాదం తోటి సుఖశాంతులు ప్రజలకు వెదజల్లాలని, అష్టైశ్వర్యాలు నిండు నూరేళ్లు కలకాలం జీవించాలని ఆభగవంతుని ప్రార్థించారు. ఎంతో నిష్టతో చేసే రేణుకా మాత బోనాల కార్యక్రమాలు ఘనంగా బొమ్మకల్ గ్రామంలో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈసంవత్సరం రేణుకా మాత ఆశీర్వాదంతో గౌడ కులస్తులు అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలని విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాలు అందించాలని వారు కోరారు. ఈకార్యక్రమంలో కరీంనగర్ మండలం అధ్యక్షులు బుస శ్రీనివాస్ గౌడ్, తిమ్మాపూర్ మండలం అధ్యక్షులు రావుల శ్రీనివాస్ గౌడ్, మానకొండూర్ నియోజకవర్గం ఇంచార్జి గోపాగోని నవీన్ గౌడ్, బొమ్మకల్ గ్రామ గౌడ సంఘ నాయకులు, కుటుంబ సభ్యులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని, ఆలయ రజతోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా మందమర్రి పంచముఖ హనుమాన్ ఆలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. త్రిదండి రామానుజ జీయర్ స్వామి ఆధ్వర్యంలో 108 మంది పూజారుల మంత్రోచ్ఛారణ 108 కళాశాలతో వాయు పుత్రునికి అభిషేకం నిర్వహించారు.
Hanuman Jayanti
భక్తుల శ్రీరామ నామ స్మరణ నడుమ 108 కళాశాలలోని పంచామృతాలు, పండ్ల రసాలు, వివిధ జలాలు పంచామృతాలతో స్వామి వారికి జరిపించిన అభిషేకం చూసి భక్త జనులు పులకరించిపోయారు. ఈ సందర్భంగా ఐదు రోజులుగా జరుగుతున్న రామాయణ హోమం ఈరోజుతో ముగిసింది. అంతకుముందు ఆలయం పై భాగంలో సుదర్శన చక్రాన్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గణపురం మండల కేంద్రంలో కాకతీయులు నిర్మించిన కోట గుళ్ళు ఆలయ నిర్మాణం ఎంతో అద్భుతమని తెలంగాణ స్టేట్ ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి అన్నారు.
మంగళవారం ఆయన శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోట గుళ్ళ ను సందర్శించారు.
ఈ సందర్భంగా కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారికి ఘన స్వాగతం పలికారు.
మొదట గణపతి, నందీశ్వర గణపేశ్వర స్వాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పూజా కార్యక్రమాలు అనంతరం ఆలయ కమిటీ పక్షాన శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు.
పూజా కార్యక్రమాల అనంతరం ఆయన ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామప్ప శిల్ప సంపదని పోలిన విధంగా కోటగుళ్లు ఎంతో అద్భుతంగా ఉన్నాయని తను వరంగల్ లో పని చేసిన సమయంలో ఎప్పుడు ఇక్కడికి రాలేదని ఈ ఆలయంలో పూజలు జరుగుతున్న విషయం తమకు తెలియదన్నారు.
మొట్టమొదటిసారి ఆలయాన్ని సందర్శించడం జరిగిందని ఇక్కడి వాతావరణం తనకెంతో నచ్చిందని అన్నారు.
Temple
కాటేశ్వరాలయం నందిమండపం నాట్య మండపాలను ప్రత్యేకంగా పరిశీలించారు. సుమారు గంటపాటు ఆలయ ప్రాంగణంలోనే గడిపారు.
అనంతరం హరిత అతిథి గృహం ప్రాంగణంలో ఉన్న శివ ద్వారా పాలక విగ్రహాలను పరిశీలించారు.
మరోసారి కుటుంబ సమేతంగా ఆలయాన్ని సందర్శిస్తారని అన్నారు.
ఆయన వెంట చిట్యాల సిఐ మల్లేష్, భూపాలపల్లి సిఐ దొమ్మాటి నరేష్ కుమార్ గౌడ్ గణపురం ఎస్ఐ రేఖ అశోక్ తదితరులు ఉన్నారు.
పుట్టినరోజు సందర్భంగా హనుమాన్ మాల ధారణ స్వాములకు భిక్ష
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలోని నాగవీధిలో పసునూటి సౌమ్య శంకర్ ల కుమారుడు పసునూటి అభిరామ్ పుట్టినరోజు సందర్భంగా గణపురంలోని హనుమాన్ మాలాధారణ స్వాములకు తడి బిక్ష అనంతరం పొడి బిక్ష కార్యక్రమం చేయడం జరిగింది. హనుమాన్ మాల దారణ స్వాములు భిక్ష ఘనంగా చేసి పసునూటి అభిరామను స్వాములు సుఖసంతోషాలతో విద్య బుద్ధి కలిగి ఉండాలని దీవించారు.
భద్రాచలం నుండి శ్రీ సీతారాముల కల్యాణ ముత్యాల తలంబ్రాలు
ఉమామహేశ్వర సేవా సమితి అధ్యక్షులు ఆకుల సుభాష్ ముదిరాజ్
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంలోని ధర్మ రావు పేట గ్రామంలో భద్రాచలం నుండి శ్రీ సీతారాముల కళ్యాణ ముత్యాల తలంబ్రాలు అందించడం జరిగింది.. ప్రతి సంవత్సరం గోటితలంబ్రాలను శ్రీ ఉమామహేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో భద్రాచల సీతారాముల కల్యాణానికి పంపించడం జరుగుతుంది వారు కూడా శ్రీరామనవమి కళ్యాణం తర్వాత మళ్లీ మనకు ఆ కళ్యాణ తలంబ్రాలను పంపించడం అనాదిగా వస్తుంది ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా శ్రీలక్ష్మి మేడం తలంబ్రాలను పంపించడం జరిగింది . ఈ ముత్యాల తలంబ్రాలను గోటి తలంబ్రాల కార్యక్రమంలో పాలుపంచుకున్నటువంటి ప్రతి ఒక్క సభ్యునికి అందించడం జరుగుతుంది దాదాపు 200 మంది జయశంకర్ జిల్లాతో పాటు ములుగు జిల్లా వారు కూడా ఈ కార్యక్రమాన్ని శ్రీ ఉమామహేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో చేయడం జరిగింది . ధర్మరావుపేట తో పాటు బస్సు రాజు పల్లి 1000 క్వాటర్స్ తిరుమలగిరి కాశీందేవ్ పేట గ్రామాల వారికి పంపించడం జరుగుతుందని ఉమామహేశ్వర సేవా సమితి అధ్యక్షులు ఆకుల సుభాష్ ముదిరాజ్ తెలిపారు
శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి రజతోత్సవ వేడుకల సందర్భంగా మిథిలా ప్రాంగణంలో సోమవారం రమణీయంగా సుదర్శన నారసింహ హోమం నిర్వహించారు.
యాగశాలలో తీర్థ గోష్టి ప్రారంభించిన శ్రీశ్రీశ్రీ త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి అనంతరం మిథిలా ప్రాంగణంలో శ్రీ సుదర్శన నారసింహ యాగం ఆరంభానికి మంగళ శాసనం అందించారు.
Maha Yagam
అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించడం కోటి సూర్య ప్రభల భగవానుడి ప్రకాశం వల్లే తొలగి పోతాయని చెప్పారు.
ప్రహ్లాదుడు అపారమైన భక్తి ప్రపత్తులు కలిగిన వాడని, ఆ అపర భక్తుడి కోసమే విష్ణువు నారసింహుడి రూపంలో వచ్చి హిరణ్యకశిపుడిని అంతం చేసిన విధానాన్ని జీయర్ స్వామి ఈ సందర్భంగా చాలా విశదీకరించారు.
విష్ణు తత్వాన్ని చూపుతూ..
సన్మార్గంలో నడిపించే వాడు సుదర్శనుడు. సుదర్శన భగవానుడు అని చెప్పారు.
Maha Yagam
ఆరాధిస్తే ప్రతి వస్తువులో ప్రతి చోటా దేవుడు ఉంటాడని జీయర్ స్వామి ఉద్బోధించారు.
ఇష్టి శాలలో ఈ యాగానికి పూర్ణాహుతి ప్రకటించిన అనంతరం..
యాగశాల హోమ గుండం వద్ద సైతం పూర్ణాహుతి హవనంతో కార్యక్రమం ముగిసినట్లు ప్రకటించారు.
Maha Yagam
కార్యక్రమంలో యాజ్ఞికులు సముద్రాల శ్రీనివాస చార్యులు, గోవర్ధనగిరి అనంతచారీ, కుమారాచార్యులు నవీన్ చార్యులు, శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి స్థానా చార్యులు డింగరి కృష్ణ చైతన్య చార్యులు, శ్రీకాంతా చార్యులు, నరసింహ చార్యులు, ఆలయ ధర్మకర్త దివంగత సురేందర్ రావు కుటుంబ సభ్యులు, మందమర్రి ఆలయ కమిటీ సభ్యులు, వేద పండితులు, హనుమాన్ దీక్ష స్వాములు, భక్తులు పాల్గొన్నారు.
కోటగుళ్లలో జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ దంపతుల పూజలు
గోశాల నిర్వహణకు రూ. 56వేల వితరణ
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ లో ఆదివారం సుబ్రహ్మణ్య షష్టి పర్వదినాన్ని పురస్కరించుకొని భూపాలపల్లి జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కోడూరు నవీన్ కుమార్ సుమతి దంపతులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారిని సాదరంగా ఆహ్వానించి గణపతి, నందీశ్వరుడు, గణపేశ్వరునికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం గోశాల నిర్వహణలో భాగంగా పనిచేస్తున్న పానిగంటి గణేష్ కు వేతనం కింద రూ 56 వేలను అందజేశారు. ఈ సందర్భంగా గోశాల గోమాతలకు నవీన్ కుమార్ సుమతి దంపతులు పండ్లను అందజేశారు. అనంతరం డాక్టర్ దంపతులను శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు. గోశాల నిర్వహణకు వేతనాన్ని అందజేసిన నవీన్ కుమార్ సుమతి దంపతులకు కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.
నేడు హనుమాన్ మాల ధారణ వేసిన స్వాములకు బిక్ష అన్న ప్రసాదం
బోనాల ఉమా రాజమౌళి రిటైర్డ్ ఉపాధ్యాయులు
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో దక్షిణ ముఖ హనుమాన్ టెంపుల్ చెరువు కట్ట వద్ద భిక్ష అన్న ప్రసాదం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది గ్రామంలోని హనుమాన్ భక్తులందరూ గ్రామస్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించగలరని వారు కోరారు సమయం: మధ్యాహ్నం 2:00 గంటలకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాజమౌళి అన్నారు
రామకృష్ణాపూర్ పట్టణంలో అభయ అంజనేయ స్వామి జయంతిని పురస్కరించుకొని స్థానిక విజయగణపతి దేవాలయ ఆవరణలోని హనుమాన్ ఆలయంలో పూజారి సతీష్ శర్మ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలోని యజ్ఞశాలలో నిర్వహించిన మహా యజ్ఞంలో హనుమాన్ మాలాధారులు పాల్గొన్నారు. పట్టణంలోని భక్తులు ఆయురారోగ్యాలతో సుఖ జీవనం సాగించాలని, స్వామివారి ఆశీస్సులు భక్తులకు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం భక్తులకు మహా అన్నదాన కార్యక్రమాన్ని చేశారు.
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం మేదపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ జగద్గురు మహాత్మా బసవేశ్వర విగ్రహావిష్కరణ ఈనెల 18న నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. సంబంధిత కరపత్రాన్ని, గోడపత్రికను శుక్రవారం బర్దిపూర్ శ్రీ దత్తగిరి ఆశ్రమంలో పీఠాధిపతులు మహామండలేశ్వర్ శ్రీశ్రీశ్రీ 1008 వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహారాజ్, డాక్టర్ మహంత్ సిద్దేశ్వరానందగిరి మహారాజ్ విడుదల చేశారు. వివిధ గ్రామాల నుంచి భారీ సంఖ్యలో హాజరై బసవేశ్వర విగ్రహావిష్కరణను విజయవంతం చేయాలని భక్తులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
న్యాల్కల్ మండలం రాజవరంలోని స్వయంభు వరసిద్ధి వినాయక ఆలయంలో సంకటహర చతుర్థి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వరసిద్ధి గణపతికి అర్చకులు పంచామృతాలతో ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను జరిపించారు. గరికలతో మహా పూజ కార్యక్రమాన్ని చేశారు. గణపతికి ప్రత్యేక అలంకరణ చేశారు. భక్తులు గణపతిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
ఎండ తీవ్రతకు సరస్వతీ పుష్కరాల్లో ఎక్కడి వారు ఆక్కడే.
కిక్కిరిసిన సెలవ పందిర్లు.
మహాదేవపూర్ -నేటి ధాత్రి:
సరస్వతి పుష్కరాల సందర్భంగా పుణ్య స్నానాలు దర్శనాలకు వచ్చిన భక్తులు ఎండ తీవ్రతకు తట్టుకోలేక ఇప్పటివరకు ఐదుగురు అస్తవ్యస్తకు గురికావడం జరిగింది. వీరిలో ఒకరు పారిశుద్ధ్య కార్మికుడు విధులు నిర్వహిస్తున్న క్రమంలో సొమ్మసిల్లి పడిపోవడం జరిగిందని సమాచారం. మిగతా నలుగురు భక్తులు కరీంనగర్ వరంగల్ భద్రాద్రి కొత్తగూడెం, జిల్లాకు చెందిన వారిని తెలిసింది. అస్తవ్యస్తకు గురైన వారందరికీ ప్రధమ చికిత్స కేంద్రానికి తరలించి చికిత్సను అందించడం జరుగుతుందని, ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు సమాచారం. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో పుష్కర స్నానాలకు వచ్చిన భక్తులందరూ చలవ పందిళ్లకు పరిమితం కావడంతో చలవ పందిళ్లు భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. సాయంత్రం నాలుగు తర్వాత భక్తులు గోదావరి స్థానానికి వెళ్లే పరిస్థితి కనబడుతుంది.
నర్సంపేట మండలం ఇటుకాలపల్లి గ్రామంలో శ్రీ సూరమాంబ -శ్రీ కంఠ మహేశ్వరుని కల్యాణం కన్నుల పండుగగా జరిగింది.ఐదు రోజుల పాటు గౌడ కులస్తుల ఆధ్వర్యంలో శ్రీ కంఠ మహేశ్వరునికి ఉత్సవాలు నిర్వహించారు.మొదటి రోజు ఆలయంలో మామిడి తోరణాల అలంకరణ, గౌడ కులస్తులకు మాలాదారణ, పటం కథ, రెండో రోజు గ్రామ దేవత లకు ప్రత్యేక పూజలు, మూడో రోజు జాలాభిషేకం, నాలుగో రోజు శ్రీ సూరమాంబ దేవి -శ్రీ కంఠ మహేశ్వరునికి కళ్యాణం,శ్రీ రేణుక-ఎల్లమ్మ తల్లి, జమదగ్ని పండుగ,బోనాల సమర్పణ, కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఉత్సవాల భాగంగా బోనాల కార్యక్రమం లో గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ హాజరయ్యారు. శ్రీ కంఠ మహేశ్వరుని ఆలయంలో రేణుకా ఎల్లమ్మ,వనం మైసమ్మ,సూరమంబా దేవి, శ్రీ కంఠ మహేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం బొట్టు పెద్ద మనుషులు కట్ల సుధాకర్ గౌడ్, బుర్ర వెంకటేశ్వర్లు గౌడ్, సంఘం అధ్యక్షులు బుర్ర ఆనందం గౌడ్, కార్యదర్శి కక్కెర్ల కుమారస్వామి గౌడ్, కోశాధికారి తాళ్లపెల్లి అశోక్ గౌడ్, పిఏసిఎస్ వైస్ చైర్మన్ మేరుగు శ్రీనివాస్ గౌడ్, కట్ల కనుకయ్య గౌడ్, మచ్చిక రవీందర్ గౌడ్, బూడిద రవీందర్ గౌడ్, బూడిద శివ కోటి గౌడ్, ఆరెల్లి హరికిషన్ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ లు ఆరెల్లి వేణు గౌడ్, బోడిగే వినయ్ గౌడ్,మాజీ ఎంపీపీ మోతె పద్మ నాబరెడ్డి, మాజీ జెడ్పి టీ సి కోమాండ్ల గోపాల్ రెడ్డి, ఎంపిటీసీ వీరన్న నాయక్, మాజీ పిఏసిఎస్ చైర్మన్ దుపాటి ఆనంద్ గౌడ్,యువజన నాయకులు బోడిగే క్రాంతి గౌడ్, కుమార్ గౌడ్, రాకేష్ గౌడ్, రంజిత్ గౌడ్, రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మే 9.ఆపరేషన్ సిందూర్ లో ధైర్యంగా పోరాడుతున్న భారత సైన్యానికి మద్దతుగా రాయికల్ పట్టణంలోని నాగారం హనుమాన్ ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కశ్మీర్ లో పహాల్గామ్ ఘటన తరువాత ప్రతి భారతీయునిలో ఆవేదనకు ప్రతీకారంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ పైన భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ నిర్వహించడం అనేది భారత్ శక్తి యుక్తులకు నిదర్శనమన్నారు. భారత సైనిక దళాలు ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలను విజయవంతంగా ధ్వంసం చేసిన నేపథ్యంలో వారికి భారతీయులు ప్రతి ఒక్కరు మద్దతు తెలుపాలన్నారు.ఇండియా – పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో భారత సైన్యానికి, భారత భూభాగానికి, దేశ ప్రజలకు ఎటువంటి నష్టం జరగకూడదని,ఈ యుద్ధంలో భారత్ ఘన విజయం సాధించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ దాసరి గంగాధర్,కాంగ్రెస్,బిజెపి,బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు మ్యాకల రమేష్,కుర్మ మల్లారెడ్డి,ఎలిగేటి అనిల్,లయన్స్ క్లబ్ అధ్యక్షులు మచ్చ శేఖర్, నాయకులు మచ్చ నారాయణ,గాజెంగి అశోక్, వాసం దిలీప్,చింతకుంట సాయికుమార్,బొమ్మకంటి నవీన్, సుమన్,భరత్,మహేష్,పవన్,అశోక్, రంజిత్ అర్చకులు సంతోష్. వాసం ప్రసాద్. తదితరులు పాల్గొన్నారు.
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం దుంపేట్ గ్రామంలో కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు గా బావించే స్వయంభూ గా వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి జాతర మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవ వేడుక అంగరంగ వైభవంగా భక్తుల సమక్షంలో కనుల పండగ కొనసాగింది.
స్వామివారి కల్యాణ మహోత్సవ కార్యక్రమంలో గ్రామ ప్రజలు భక్తులు వివిధ గ్రామాల ప్రజలు పాల్గొని స్వామివారిని దర్శించుకుని పునీతులు కావడం జరిగింది.
శ్రీ జగద్గురు రేవణ సిద్దేశ్వర స్వామి చండికాంబ మాత జయంతి ఉత్సవాలు.
జహీరాబాద్ నేటి ధాత్రి:
శ్రీ జగద్గురు రేవణ సిద్దేశ్వర స్వామి చండికాంబ మాత సమేత జయంతి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు ధ్వజారోహణం,శిఖర పూజ, కార్యక్రమాలు నిర్వహించారు ఇట్టి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులు
Mata Jayanti celebrations.
శ్రీ చంద్రశేఖర శివచార్య మహాస్వామి బెమల్ ఖేడ్, బసవలింగ అవధూత గిరి మహరాజ్ , మాతృశ్రీ మఠం శివలీలమ్మ, రాచయ్య స్వామి, కేతకీ టెంపుల్ చైర్మన్ చంద్రశేఖర్ పాటిల్, మాజీ ఎంపిటిసి శంకర్ పాటిల్, సిద్దయ్య స్వామి, నాగరాజ్ పటేల్,లింగం గౌడ్ , ఈశ్వరప్ప పాటిల్, తదితర భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు అందజేశారు.
కరీంనగర్ జిల్లా చోప్పదండి మండలం దేశాయిపేట గ్రామ చెరువు వద్ద ఆదివారం పురాతన నంది, శివలింగం విగ్రహాలు లభ్యమయ్యాయి.
ఈవిషయం గ్రామంలోని ప్రజలకు తెలియడంతో విగ్రహాల దగ్గర కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు.
విగ్రహాలు లభ్యమైన చోటనే శివాలయం నిర్మించాలని కొందరు అభిప్రాయం తెలుపగా, పూజారులను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని మరి కొందరు, ఆలయ నిర్మాణానికి వేరే స్థలం తీసుకొని విగ్రహాలు ప్రతిష్టించాలని గ్రామ నాయకుల మద్య చర్చ జరుగుతోంది.
ఈకార్యక్రమంలో మాజీ సర్పంచ్ గుంట రవి, మాజీ ఉపసర్పంచ్ సింగిరెడ్డి వెంకటరాంరెడ్డి, మార్కెట్ డైరెక్టర్ రవీందర్, దుబ్బాక మల్లేశం, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.