రామకృష్ణాపూర్ పట్టణంలోని విజయ గణపతి ఆలయంలో కొలువైన ఆంజనేయ స్వామి విగ్రహానికి హనుమాన్ భక్తులు గోవిందుల రమేష్, వెంకట నరసింహ స్వామి ఇద్దరు కలిసి సూర్య చక్రం రూపకల్పన చేయించి ఆంజనేయ స్వామికి అలంకరించారు. నిత్యం తిరుగుతూ ఉండే సూర్య చక్రం ఆంజనేయ స్వామికి అలంకరించే అవకాశం లభించడం సంతోషంగా ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాంపల్లి సతీష్ శర్మ, ప్రవీణ్ శర్మ,హనుమాన్ భక్తులు రవి, ముద్దసాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కోరిన కోర్కెలు తీర్చే కలి యుగదైవం శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయం
నేటి నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
కాకతీయుల కళావైభ వానికి ప్రతీక ఈ దేవా లయం
రాష్ట్రంలోనే రెండో పుణ్యక్షే త్రంగా ప్రసిద్ధి గాంచిన దేవాల యం
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలకేంద్రం లోని శ్రీ మత్స్యగిరి స్వామి కలియుగంలో కోరిన కోర్కెలు తీర్చే దైవముగా ప్రసిద్ధిగాంచిన కాకతీయ రాజుల కళా వైభవా నికి ప్రత్యేకగా నిలిచిన మత్స్య గిరి స్వామి దేవాలయం.ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ పౌర్ణమి పంచమ రాత్రి ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ మత్స్యగిరి స్వామి తిరు కళ్యాణ బ్రహ్మో త్సవాలను ఘనంగా నిర్వహిం చడం ఆనవాయితీగా వస్తుంది కాబట్టి శనివారం నుండి బుధవారం వరకు కార్యక్రమం కోసం చలువ పందిళ్లు వేసి ఏర్పాట్లు చేసినట్లు దేవాలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ సామల బిక్షపతి తెలిపారు.ఆలయ చరిత్ర గురించి గుడి చైర్మన్ మాట్లాడుతూ శాయంపేట గ్రామపొలిమేరలోని మచ్చర్ల య్య గుట్టపై. శ్రీ మత్స్యగిరి స్వామి ఆరు శతాబ్దాల క్రితం సుమారు 569 సంవత్సరాల క్రితం కొలువుదీరినట్లు పూర్వీ కులు పేర్కొంటున్నారు.మహావి ష్ణువు దుష్టశిక్షణకై దశావతా రాలలో భాగంగా మొదట మత్స్యవతారంగా వెలసినట్లు చెబుతున్నారు మచ్చర్లయ గుట్ట వద్ద గ్రామ్య భాషలో శాలివాహన శకంలో వేయిం చిన శిలాశాసనం ద్వారా ఆనాటి దేవాలయ చరిత్ర తెలియజేస్తుంది గుట్ట లోపల బండరాయిపై సహజ సిద్ధంగా మచ్చా అవతారంలో స్వామి వారు దర్శనమిస్తారు.
Lord Vishnu
ఈ గుట్ట లోపటికి వెళ్లేందుకు ఒకే ఒక చిన్న మార్గం ఉంటుంది ఇక్కడ 14 దేవాలయాలు 24 మంది అర్చకులు ఉండేవారని ఈ శిలా శాసనం ద్వారా తెలుస్తుం ది అప్పుడు నిర్మించిన దేవుని చెరువు నేటికీ అదే దేవుని చెరువు పేరుతో పిలువబడు తున్నది కాకతీయ సామంత రాజు కొత్త గట్టు సీమ పాలకు డు రేచర్ల దర్శనాయుడు తన తల్లిదండ్రులు సింగమాంబ సింగమ నాయుడు దేవాల యం నిర్మించినట్లు తెలుస్తుంది కాలక్రమంలో మచ్చర్లయ గుట్ట వద్ద నుంచి గ్రామం దూరంగా వెళ్లిపో యింది గ్రామం మధ్య లో రాతితో శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయాన్నినిర్మించా రు.
Lord Vishnu
దేవాలయ గోపురం పైన మహావిష్ణువు దశావతారాలు భక్తులకు దర్శనమిస్తాయి. కల్యాణోత్సవ కార్యక్రమం తేదీ మే 10 శనివారం ఉదయం తోలక్కం ప్రారంభం పుట్ట బం గారు సేవ మధ్యాహ్నం ధ్వజా రోహణం గరుడ ముద్దా (సంతానం లేని దంపతులు గరుడ ముద్ద ప్రసాదం స్వీకరించగలరు) సాయంత్రం ఎదురుకోళ్లు తేదీ 11 బుధవారం ఉదయం 11 గంటలకు కళ్యాణోత్సవం మధ్యాహ్నం 1 గంటలకు మహా అన్నదాన కార్యక్రమం తేదీ 12 సోమవారం ఉదయం పూర్ణాహుతి సాయంత్రం 6 గంటలకు గజవాహన సేవ గుట్టమీదికి పోవడం తేదీ 13 మంగళవారం సాయంత్రం రథోత్సవం అలుకతీరుట తేదీ 14 బుధవారం ఉదయం చక్ర వరీ సాయంత్రం నాకబలి నాగవల్లి పండిత సన్మానం తో ఉత్సవాలు ముగిస్తాయని దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి తెలిపారు.
వేసవి ఎండలతో అనేక రుగ్మతలు వ్యాపిస్తుండటం సహజం. డీ హైడ్రేషన్ నుంచి ఫుడ్ పాయిజనింగ్ వరకూ కొన్ని వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. చాలా వ్యాధులు వైరస్ల వల్ల వస్తాయి. పరిశుభ్రతకు ఎక్కువ శ్రద్ధ వహించాలి. తరచుగా చేతులు, కాళ్లు కడుక్కోవాలి. ప్రయాణం చేసేటప్పుడు హ్యాండ్ శానిటైజర్ ఉపయోగించటం మర్చిపోవద్దు. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవటం చాలా అవసరం. వేసవిలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యల వివరాలు ఇవిగో …
వడదెబ్బ (సన్‌స్ట్రోక్) : ఎండలో ఇష్టానుసారంగా తిరిగినా, నీరు తక్కువగా తీసుకున్నా వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. శరీర ఉష్ణోగ్రత 104 డిగ్రీల కంటే ఎక్కువగా ఉన్నా, అయోమయం, గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, చెమట పట్టకపోవటం, కాళ్ళూ చేతుల నొప్పులు, శరీరం తిమ్మిరి, వాంతులు, తలనొప్పి, స్పృహకోల్పోవటం వంటివి వడదెబ్బ లక్షణాలు. వడదెబ్బ తగిలిన వ్యక్తి శరీరాన్ని చల్లబర్చాలి. తడిగుడ్డతో శరీరమంతా తుడవాలి. నీళ్లు తాగించి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లటం ఉత్తమం. ఈ సమస్య రాకుండా ఉండాలంటే తీరు ఎక్కువగా తాగాలి. నిమ్మరసం, కొబ్బరినీరు, గ్లూకోజ్ డి వంటివి తీసుకోవాలి. ఇంట్లో ఎలక్ట్రోరల్ ఫౌడర్ లేదా ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉంచుకోండి. అవి అందుబాటులో లేకపోతే చక్కెర, ఉప్పు కలిపిన నీరు తాగండి.
Summer diseases
విషాహారం (ఫుడ్‌పాయిజనింగ్) : ఆహారం ద్వారా వ్యాపించే వ్యాధులు వేసవిలో సాధారణం. ఇవి ఎక్కువగా హానికారక బ్యాక్టీరియా, పరాన్నజీవుల వల్ల వస్తాయి. అధిక వేడికారణంగా ఆహారం త్వరగా పాడవుతుంది. అలాంటి ఆహారం తీసుకోవటం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఆహారం చెడిపోకుండా చూసుకోవాలంటే బాగా ఉడికించాలి. వండిన ఆహారాన్ని బయట వేడిలో ఉంచినప్పుడు బ్యాక్టీరియా పెరుగుతుంది. ఈ సమస్యను అధిగమించేందుకు తాజా ఆహారాన్ని తినటం ముఖ్యం. మసాలాలతో కూడిన ఆహారాన్ని తగ్గించాలి. కంటి ఇన్ఫెక్షన్ : ఈ కాలంలో కనిపించే కొన్ని సాధారణ కంటి వ్యాధుల్లో కంటి వాపు, అలెర్జీ, కంజక్టివైటిస్ ఉంటాయి. తగినంత విశ్రాంతి కళ్లకు ఇవ్వాలి. వాటిపై ఒత్తిడి తగ్గించాలి. మీ కళ్ళు, ముఖాన్ని క్రమం తప్పకుండా శుభ్రమైన నీటితో కడగాలి. ఎండలో బయటకు వెళ్తే కళ్లజోడు వాడటం మంచిది. సమస్యలు వస్తే డాక్టరు సిఫారసు మేరకు ఐడ్రాప్స్, మందులు వాడాలి. చర్మ సమస్యలు : సూర్యుడి అతినీలలోహిత కిరణాలు వల్ల చర్మంలోని కణాలు దెబ్బతింటాయి. ఎండలో ఎక్కువగా తిరిగితే చర్మం కమిలిపోతుంది. అధిక తేమ, వేడి కారణంగా చర్మంపై ఎరుపు దద్దుర్లు, స్వేద గ్రంథులు మూసుకుపోవటం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. చెమట వల్ల మచ్చలు, దురద మంట వస్తుంది. చర్మ సమస్యలు రాకుండా ఉండా లంటే వేసవిలో సన్‌స్క్రీన్ లోషన్లు వంటివి కూడా ఉపయోగించొచ్చు. వాడిన దుస్తులను ఉతక్కుండా మళ్లీ వాడకూడదు. చెమట ఎక్కువగా పడుతున్నం దున స్నానం రెండుమూడు సార్లు చేయొచ్చు. శరీరానికి గాలి తగిలేలా వదులైన, చెమట పీల్చే కాటన్ దుస్తులు ధరించటం మేలు. అతిసార : ఎండవేడి కారణంగా ఆహారం త్వరగా పాడైపోతుంది. అలాంటి ఆహారం తీసుకుంటే వేసవిలో విరోచనలు సాధారణం. కలుషిత ఆహారం తినటం, నీరు తాగటం, మద్యపాన అలవాట్లు డయేరియాకు దారితీస్తాయి. అతిసారం నుంచి దూరంగా ఉండటానికి నీటిని మరిగించిన తర్వాత మాత్రమే తాగటం అలవాటుగా చేసుకోవాలి. కూరగాయలను ముక్కలుగా చేయటానికి ముందు, తర్వాత వాటిని బాగా కడగాలి. ఇళ్లల్లో ఆహార పదార్థాలపై ఈగలు వాలకుండా చూసుకోవాలి. పాడైనవి కాకుండా వేడి వేడి ఆహార పదార్థాలు తీసుకోవటం మేలు. చికెన్‌పాక్స్ : చికెన్‌పాక్స్ (అమ్మోరు) చాలా సాధారణ వేసవి వ్యాధుల్లో ఒకటి. ఇది అధిక జ్వరంతో శరీరంపై ఎరుపురంగులో ఉండే చిన్న దద్దుర్లు రూపంలో ప్రారంభమవుతుంది. ఇది పిల్లల్లో తక్కువ రోగ నిరోధకశక్తి ఉన్న వారిలో సాధారణంగా కనిపిస్తుంది. ఇది అంటువ్యాధి. అందువల్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. ఇది సోకినప్పుడు బయటకు తిరగకుండా ఇంట్లో ఉండటమే మేలు. మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. త్వరగా తగ్గే వీలుంది. తట్టు : మీజిల్స్ మరో సాధారణ వేసవి వ్యాధి. మీజిల్స్‌కు కారణమయ్యే పారామిక్సో వైరస్ వేసవిలో వేగంగా సంతానోత్పత్తి చేస్తుంది. దీని ప్రారంభ లక్షణాలు దగ్గు, అధిక జ్వరం, గొంతునొప్పి, కళ్లు ఎర్రబడటం, తరువాతి దశలో, చిన్న తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. మీజిల్స్ దద్దుర్లు శరీరం అంతటా కనిపిస్తాయి. మందులు వాడితే తగ్గిపోతుంది.
Summer diseases
కామెర్లు : నీటి ద్వారా సంక్రమించే వ్యాధి. ఇది హైపటైటిస్ ఎ వల్ల వస్తుంది. ప్రధానంగా కలుషిత మైన ఆహారం, నీటి వినియోగం వల్ల వస్తుంది. సకాలంలో చికిత్స చేయకపోతే ఈ వ్యాధి కాలేయం పనితీరును ప్రభావితం చేస్తుంది. ఇది పిత్తం అధిక ఉత్పత్తికి దారితీస్తుంది. టైఫాయిడ్ : జ్వరం వస్తే సొంత వైద్యంతో నిర్లక్ష్యం చేయొద్దు. జ్వరంతోపాటు తలనొప్పి, నీరసంగా ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అపరిశుభ్ర ఆహారం, నీరు తీసు కోవటం వల్ల ఈ సమస్య వస్తుంది. కలుషిత ఆహారం, నీటి వనరులు బ్యాక్టీరియాకు సంతానోత్పత్తికి ప్రదేశంగా మారతాయి. టైఫాయిడ్ వస్తే బలహీనత, ఆకలిలేకపోవటం, కడుపులో నొప్పి, అధిక జ్వరం వంటి లక్షణాలు కన్పిస్తాయి. గవదబిళ్ళలు : వేసవి వ్యాధుల్లో గవదబిళ్లలు అత్యంత అంటువ్యాధి. ఈ వైరల్ వ్యాధి పిల్లలను ప్రభావితం చేస్తుంది. ఈ అంటువ్యాధి సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వ్యాపిస్తుంది. లాలాజల గ్రంథివాపు, కండరాలనొప్పి, జ్వరం, తలనొప్పి, ఆకలి లేకపోవటం, బలహీనత వంటి లక్షణాలు కన్పిస్తాయి. తలనొప్పి : అధిక ఉష్ణోగ్రతలతో తలనొప్పి ఎక్కువగా కనిపిస్తుంది. వేడి వల్ల వచ్చే తలనొప్పి శరీరం వేడికి ప్రతి స్పందించటం వల్ల కూడా వస్తుంది. పైన పేర్కొన్న వ్యాధులకు అధునాతనమైన మందులు అందుబాటులో ఉన్నాయి. డాక్టరు సలహా మేరకు వాటిని ఉపయోగిస్తే అవి నియంత్రణలోకి వస్తాయి.
ఈ చిట్కాలు పాటించండి ….
– తరచూ మంచినీరు, నిమ్మకాయ ద్రావణంతోపాటుగా ఎక్కువ మజ్జిగ తీసుకోవాలి – నారింజ, దానిమ్మ వంటి పండ్లను తినాలి – మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకూ బయటకు వెళ్లకండి – క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి సూర్యకాంతికి గురి కావడాన్ని తగ్గించండి. ఉదయం లేదా సాయంత్రం మాత్రమే వ్యాయామం వంటి కార్యక్రమాలను చేయండి. – కళ్ల సంరక్షణ కోసం కూలింగ్ గ్లాసులు పెట్టుకోవాలి – లేతరంగు, తేలికైన వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి – బ్యాక్టీరియాతో ఉండే స్ట్రీట్‌ఫుడ్ తినొద్దు – ప్యాకింగ్ చేసిన పండ్లు, కూరగాయలు తీసుకోవద్దు – పండ్లు, కూరగాయల వినియోగాన్ని పెంచండి. – ఆల్కాహాల్, కెఫైన్ తీసుకోవద్దు – కూల్‌డ్రింక్స్ తాగొద్దు.
ఝరాసంగం: జిల్లాస్థాయి అధికారులు కింది స్థాయి అధికారులకు ఎన్నిసార్లు షోకాజ్ నోటీసులు ఇచ్చిన, అధికారులు ఆదేశాలు జారీచేసిన కింది స్థాయి సిబ్బంది ఏమాత్రం పట్టించుకోవడం లేదు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని బోజ్యానాయక్ తండా పంచాయతీ పరిధిలోని పూర్యా నాయక్ తండా, రామ్ చందర్ నాయక్ తండా , టోప్యా నాయక్ తండాలలో పలు సమస్యలు నెలకొన్నాయి. గురువారం పలు తండాలను పరిశీలించగా బోజ్యానాయక్ తండా లో సగం మందికి మాత్రమే నీటి సరఫరా జరుగుతుంది. మరి కొంతమందికి నీటి సరఫరా కావడం లేదు. గ్రామపంచాయతీ ట్రాక్టర్ గత మూడు నెలల నుంచి పనిచేయకపోవడంతో మూలన పడింది.పాఠశాల ఆవరణలో నర్సరీ పెంపకం నిర్లక్ష్యంగా కనిపించింది. రామ్ చందర్ నాయక్ తండా కు సరైన రోడ్డు మార్గం లేదు. పూర్యా నాయక్ తండా లో మినీ ట్యాంక్ వద్ద అపరిశుభ్రంగా ఉంది. మురికి కంపు కొడుతుంది. తండావాసులకు సరిపడా నీటి సరఫరా జరగడం లేదు. టోప్యా నాయక్ తండాలలో ఇటీవలనే నూతనంగా మంచినీటి బోర్లు వేశారు. బోర్ నుంచి తండా వరకు పైప్ లైన్ వేయకపోవడంతో ఓ మహిళ రైతుకు చెందిన వ్యవసాయ పైపులను అమర్చి నీటిని అందిస్తున్నారు. సిసి రోడ్లు అసలుకే కనిపించలేదు. నాలుగు తండాలో కలిపి అనుసంధాన రోడ్లు లేక వైద్యం, ఇతర గ్రామాలకు వెళ్లే గిరిజనులు, బడికి వెళ్ళే విద్యార్థులు వృద్ధులు, మహిళలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే టోప్యా నాయక్ తండాకు గ్రామపంచాయతీ కార్యదర్శి సందర్శించడం లేదని గిరిజన వాసులు వాపోయారు.
సమస్యలు పరిష్కరిస్తాం.. ఎంపీడీవో సుధాకర్
బోజ్యానాయక్ తండా గ్రామపంచాయతీలో నెలకొన్న పలు సమస్యలపై ఝరాసంగం మండల అభివృద్ధి అధికారి సుధాకర్ వివరణ కోరగా సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. పైప్ లైన్ విషయంలో ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.
ముఫ్తీ అబ్దుల్ సబూర్ ఖాస్మీ క్నావిజ్ వక్ఫ్ బచావ్ ప్రచారం ముస్లిం పర్సనల్ లా బోర్డ్ జహీరాబాద్ సమాచారం ప్రకారం, వక్ఫ్ సవరణ బిల్లు 2025 కు వ్యతిరేకంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ యొక్క వక్ఫ్ బచావ్ దస్తూర్ బచావ్ ప్రచారం యొక్క కేంద్ర నిరసన సర్వసభ్య సమావేశం 2025 మే 24, శనివారం, అసర్ ప్రార్థనల తర్వాత రాత్రి 10 గంటల వరకు జహీరాబాద్ ఈద్గా మైదాన్‌లో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ అధ్యక్షుడు ఫకీహ్ అస్ర్ హజ్రత్ మౌలానా ఖలీద్ సైఫుల్లా రెహ్మాని అధ్యక్షతన జరుగుతుంది. ఈ సమావేశంలో, అన్ని ఆలోచనా విధానాల బాధ్యతాయుతమైన స్నేహితులు, రాజకీయ పార్టీల బాధ్యతాయుతమైన స్నేహితులు మరియు ఇతర మతాల నాయకులు ప్రసంగాలు చేస్తారు. ముస్లిం పర్సనల్ లేబర్ బోర్డు వ్యవస్థాపక మరియు కార్యనిర్వాహక సభ్యులు కూడా పాల్గొంటారు. మతం లేదా మతంతో సంబంధం లేకుండా ముస్లిం సోదరులందరూ ఈ నల్ల చట్టానికి వ్యతిరేకంగా నిర్వహించే నిరసన సమావేశంలో పాల్గొని తమ ఐక్యత, జాతీయ గర్వం, మత గౌరవం మరియు సజీవ దేశాన్ని ప్రదర్శించాలని అభ్యర్థించారు.మీ ఉనికికి రుజువును అందించండి మరియు ఈ వివాదాస్పద నల్ల చట్టానికి వ్యతిరేకంగా మీ సమిష్టి నిరసనను నమోదు చేయండి.
‘హిందూత్వ’ నుంచి ‘కుల రాజకీయాల’వైపు మారక తప్పని పరిస్థితి
దీర్ఘకాలంలో ప్రాంతీయ పార్టీలకే అనుకూలమయ్యే అవకాశం
కులరహిత సమాజం లక్ష్యం నెరవేరదు
కులవ్యవస్థ మరింత బలోపేతమవుతుంది
దేశంలో 50వేల కులాల్లో కేటగిరీలుగా విభజన ఎలా సాధ్యం?
బీజేపీకి అచ్చొచ్చిన ‘కలిసుంటే లాభం’ నినాదం
హైదరాబాద్,నేటిధాత్రి:
జనగణనతో పాటు కులగణన కూడా చేపడతామని కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. కులగణన చేపట్టిన ఘనత, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దీన్ని తప్పనిసరిగా చేయాల్సిన పరిస్థితి కల్పించింది కూడా తామేనని కాంగ్రెస్ చెప్పుకోవడం సహజమే. దీన్ని బీజేపీ కొట్టిపారేస్తున్న సంగతి వేరేవిషయం. ఈ కులగణన ద్వారా రాజకీయంగా లబ్దిపొందాలని రెండు కూటములు యత్నిస్తున్నాయనేది నిష్టుర సత్యం. ఇదిలావుండగా ఇప్పటి వరకు కులాలపేరుతో హిందూ సమాజాన్ని విడదీయవద్దంటూ ‘హిందూత్వ’ రాజకీయాలకు పరి మితమైన బీజేపీ కులగణన చేపట్టాలని నిర్ణయించడానికి కొన్ని బలమైన కారణాలే వున్నాయను కోవాలి. త్వరలో బిహార్‌లో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకత్వంలో విపక్షాలు ఈ కులగణను ఒక ప్రధాన అస్త్రంగా మలచుకోవడం ఒక కారణం కాగా, రెండోది గత లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో కేవలం 33 సీట్లకే పరిమితం కావడం మరో కారణమన్న విశ్లేషణలు వస్తున్నాయి. మొత్తం 80 స్థానాలు కలిగిన యు.పి.లో 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 62 స్థానాల్లో గెలుపు సాధించగా గత ఎన్నికల్లో దాదాపు సగం సీట్లు కోల్పోవడం పార్టీ నాయకత్వా న్ని పునరాలోచనలో పడేసింది. ముఖ్యంగా 400 సీట్లు లక్ష్యంతో ఎన్నికల ప్రచారం చేసిన బీజేపీ యూపీలో ఘోరంగా దెబ్బతినడానికి కారణం ఇక్కడి కుల రాజకీయాలు, రిజర్వేషన్లను రద్దుచే స్తారని విపక్షాలు ప్రతికూల ప్రచారం చేయడం, పార్టీ టిక్కెట్ల జారీలో లోటుపాట్లుగా పార్టీ గుర్తిం చి ఆ దిశగా దిద్దుబాటు చర్యలకు దిగింది. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చేది యు.పి. లో గెలుచుకున్న స్థానాలే నిర్ణయిస్తాయన్నది తెలిసిన విషయమే. ఇవే ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ 37 స్థానాలు గెలుచుకొని బీజేపీని వెనక్కి నెట్టేసింది. ఇక కాం గ్రెస్ ఆరు స్థానాలతో సరిపెట్టుకుంది. ఈ మార్పుకు కారణమేంటన్న ప్రశ్నకు, గత దశాబ్దకా లంగా బీజేపీకి వెన్నుదనున్నగా వున్న ఓబీసీ మరియు దళిత ఓటర్లు దూరం కావడమన్నది నిపుణులు చెబుతున్న సమాధానం.
కులగణనవైపు బీజేపీ మొగ్గు
సమాజ్‌వాదీ పార్టీకి ప్రధాన ఓటు బ్యాంకు ముస్లింలు, యాదవులు కాగా దీన్ని మరింత విస్తరిం చేందుకు అఖిలేష్ యాదవ్ వెనుకబడిన, ఆదివాసి, దళిత, అల్పసంఖ్యాక (పీడీఏ) వర్గాల ఓట్లకోసం అనుసరించిన వ్యూహం ఫలించడం కూడా బీజేపీ సీట్లు కోల్పోవడానికి ఒక కారణం. ఈ నేపథ్యంలో ఆర్.ఎస్.ఎస్. రంగంలోకి దిగి బీజేపీ ఓటమికి కారణాలను విశ్లేషించడం మొదలుపెట్టింది. ఇందుకోసం వివిధ సమావేశాలు నిర్వహించి, ‘తాము కులగణనకు వ్యతిరేకం కాదని, కాకపోతే ఇది రాజకీయ ప్రేరేపితం కారాదు’ అని గత ఏడాది సెప్టెంబర్‌లో తన అభిప్రాయం వ్య క్తం చేసింది. సెప్టెంబర్ 2న పాలక్కాడ్ (కేరళ)లో జరిగిన మూడురోజుల సదస్సులో ఆర్.ఎస్.ఎస్. పబ్లిసిటీ ఇన్చార్జ్ సునీల్ అంబేద్కర్ సంస్థ అభిప్రాయాన్ని బహిర్గతం చేశారు. అదేనెల సె ప్టెంబర్ 17న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ జనగణనతో పాటు కులగణన జరిపే అంశాన్ని కొట్టిపారేయలేదు. దీనికి సంబంధించిన వివరాలను తర్వాత వెల్లడిస్తానని ఆయన చెప్పారు. కులగణనపై బీజేపీ వైఖరిలో వస్తున్న మార్పును గుర్తించిన అఖిలేష్ యాదవ్ అప్పటివరకు యు.పి. ప్రభుత్వాన్ని ‘ఠాకూర్ అనుకూలం’ అంటూ చేస్తున్న విమర్శలవాడిని తగ్గించారు. 2024 నంబర్ నెలలో యుపీపీఎస్సి ఛైర్మన్ సంజయ్ శ్రీనెట్‌కు వ్యతిరేకం గా విద్యార్థులు చేపట్టిన ఆందోళనలో పాల్గన్న అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఏకంగా ‘‘ఠాకూర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్’’ అంటూ ఆరోపించారు. 2025లో ఆయన రాజ్‌పుత్‌ల వివిధ ప్రభుత్వ సంస్థల్లో రాజపుత్‌ల ఆధిపత్యంపై దాడులను మరింత తీవ్రం చేశారు. ముఖ్యంగా ప్రయాగ్‌రాజ్, ఆగ్రా, మెయిన్‌పురి, చిత్రకూట్, మహోబాల్లో నియమించిన పోలీసు అధికార్లలో అధిక సంఖ్యాకులు రాజ్‌పుత్ వర్గంవారేనంటూ ఆయన చేసిన ఆరోపణలను పోలీసువర్గాలు ఖండిరచడం తర్వాతి పరిణామం.
మోహన్ భాగవత్ నరేంద్రమోదీ సమావేశం
జనగనణతో పాటు కులగణన కూడా చేపట్టాలని కేంద్ర కేబినెట్ సమావేశంలో ఏప్రిల్ 30న తీసుకున్న నిర్ణయాన్ని యు.పి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వాగతించారు. ఈ మంత్రివర్గ నిర్ణయానికి ముందు ప్రధాని నరేంద్రమోదీని మొట్టమొదటిసారి ఆర్.ఎస్.ఎస్. చీఫ్ మోహన్ భాగవత్ సమావేశమవడం కీలక పరిణామం. 7`లోక్ కళ్యాణ్‌మార్గ్‌లోని ప్రధాని అధికార నివాసం లో వీరిద్దరూ దాదాపు గంటసేపు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య చర్చకు వచ్చిన కీలక అంశాల్లో కులగణన కూడా వుండవచ్చు. ఎందుకంటే అంతకుముందు ఈ సామాజిక`ఆర్థిక సర్వేను, సంపద పంపిణీ వంటి కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పేర్కొన్న అంశాలను ‘అర్బన్‌నక్సల్స్’ ఆలోచనా సరళిగా ప్రధాని నరేంద్రమోదీ విమర్శిస్తూ వచ్చారు. ఇప్పుడు కులగణన ద్వారా గత పార్లమెంట్ ఎన్నికల్లో తాను కోల్పోయిన పీడీఏ మరియు ఓబీసీ ఓట్లను తిరిగి తన ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. ముఖ్యంగా కులగణన తర్వాత కుల జనాభాను బట్టి సం క్షేమ పథకాలు అమలు చేయడం ద్వారా ఆయా వర్గాల ఓట్లను పొందవచ్చనేది ఏ రాజకీయ పార్టీ అయినా అనుసరించే వ్యూహం. ఇందుకు బీజేపీ అతీతం కాదు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి మరో 24 నెలల సమయం వున్న నేపథ్యంలో, కోల్పోయిన వర్గాల ఓట్లను తిరిగిపొందడానికి కులగణన వ్యూహాన్ని బీజేపీ ఉపయోగించుకునే అవకాశాలే ఎక్కువ. అదీకాకుండా కేంద్రంలో అధికారంలోకి రావాలంటే ఉత్తరప్రదేశ్ ఎంతో కీలకమని ప్రధాని నరేంద్రమోదీ వి శ్వసించినంతగా మరే ఇతర నాయకుడు విశ్వసించడని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. ఇదిలావుండగా కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని యూపీలోని చాలామంది బీజేపీ కీలక నేతలు సమర్థిస్తున్నారు. ముఖ్యంగా 2024లో కోల్పోయిన ఓట్లను తిరిగి పొందడానికి ఇది ఎంతో ఉపయోగకరమని అభిప్రాయపడుతున్నారు.
కులాల ఆధారంగా పార్టీలు
నిజం చెప్పాలంటే యు.పి.లోని దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీలు కులాలపై ఆధారపడి ఏర్పడిన వే కావడం విశేషం. ఉదాహరణకు సమాజ్‌వాదీ పార్టీ యాదవులకు, బహుజన్ సమాజ్‌వాది పార్టీ జాతవ్‌లకు, సుహల్దేవ్ భారతీయ సమాజ్‌వాదీ పార్టీ రాజ్‌భార్లకు, నిషాద్ పార్టీ నిషాదులకు, రాష్ట్రీయ లోక్‌దళ్ జాట్లకు, అప్నాదళ్ కుర్మీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. వాస్తవానికి బీజేపీ ‘హిందూత్వ’ అనే సిద్ధాంతానికి తప్ప ఏ ఒక్క కులానికి మద్దతివ్వదు. కానీ కులగణన నేప థ్యంలో జనాభా ఆధారంగా కులాలపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడటం ఖాయం. కులగణన వల్ల కలిగే మరో పరిణామమేంటంటే, ప్రస్తుతం ఆధిపత్యం వహిస్తున్న తక్కువ జనాభా కలిగిన కులాలకు ప్రాతినిధ్యం తగ్గి, ఇప్పటివరకు రాజకీయ ప్రాధాన్యత లేని అధిక జనాభా కలిగిన కులాలకు ప్రాధాన్యత పెరుగుతుంది. అంటే యాదవులు, రాజ్‌పుత్‌వర్గాల ప్రాధాన్యం తగ్గే అవకా శాలే ఎక్కువ. మరోవిషయమేంటంటే అట్టడుగున వున్న వెనుకబడిన వర్గాలు, జాతవ్ యేతర ఎస్సీ వర్గాల ఓట్లు తమ ఖాతాలో పడతాయని బీజేపీ అంచనా. ఇదే సమయంలో 2024లో స మాజ్‌వాదీ పార్టీకి ఓటు వేసిన కుర్మీల రాజకీయ ప్రాబల్యం కూడా తగ్గే అవకాశముంది. ఇది బీజేపీకి లాభదాయకమవుతుందని స్థానిక బీజేపీ నేతల అంచనా.
వ్యూహం మార్చిన అఖిలేష్ యాదవ్
2024లో అఖిలేష్ యాదవ్ పీడీఏను ప్రధాన అజెండాగా తీసుకొని ఎన్నికల ప్రచారం కొనసా గించారు. కులగణన నేపథ్యంలో 2027 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు ఈ వ్యూహం పనిచేయదు. దీన్ని గుర్తించిన అఖిలేష్ యాదవ్ లోక్‌సభ ఎన్నికల తర్వాత, అప్పటివరకు అనుసరిస్తున్న ‘ఠాకూర్’లను వ్యతిరేకిస్తూ అనుసరించిన వ్యూహాన్ని మార్చి ఇప్పుడు రాజ్‌పుత్‌లపై దృష్టిపెట్టారు. ఎస్.పి. ఎం.పి. రాంజీలాల్ సుమన్ రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా మేవార్ (రాజస్థాన్) రాజ్పుట్ రాజు రాణా సంగాను ‘‘ద్రోహి’’గా వర్ణించడం ఇందులో భాగమే అనుకోవాలి. దీన్ని ఎస్సీలు, రాజ్‌పుత్‌లకు మధ్య ఉన్న సయోధ్యను చెడగొట్టడానికి చేసే కుట్రగా రాజ్‌పుత్ నాయకు లు పరిగణిస్తున్నారు. నిజం చెప్పాలంటే యు.పి.లో ఠాకూర్ (రాజ్‌పుత్‌ల్లో ఒక వర్గం)లంటే తీవ్రవ్యతిరేకత వ్యక్తమవుతుంటుంది. దీన్ని అనుకూలంగా మలచుకోవడానికే అఖిలేష్ యాదవ్ ప్ర యత్నిస్తున్నారనుకోవాలి. ఇంతగా ఠాకూర్లపై విమర్శలు గుప్పిస్తున్న అఖిలేష్ యాదవ్, ఆయనతండ్రి ములాయంసింగ్ యాదవ్‌ల హయాంలో ప్రభుత్వంలోని అన్ని ముఖ్యమైన పోస్టుల్లో యాదవ్‌లతో నింపేశారన్న ఆరోపణలు విపరీతంగా వెల్లువెత్తాయి. సమాజ్‌వాదీ పార్టీ ఓటమికి ‘యాదవ్ రాజ్’ ప్రధాన కారణమన్న విశ్లేషణలు కూడా వచ్చాయి. ఇదిలావుండగా కులగణన కారణంగా రాష్ట్రంలోని అగ్రవర్ణాల (బ్రాహ్మణులు, బనియాలు) వారు తమ హక్కులను కోల్పోయామన్నభావనకు లోనుకాకుండా బీజేపీ జాగ్రత్తపడాల్సి వుంటుంది. పార్టీకి ఈ వర్గాల్లో గట్టి పట్టుంది.
కులగణన వల్ల బీజేపీ తాను సంప్రదాయంగా అనుసరిస్తూ వస్తున్న ‘హిందుత్వ’ సిద్ధాంతానికి దూరం కావలసి వస్తుందన్న అభిప్రాయం వ్యక్తం చేసే నాయకులు లేకపోలేదు. ఇది శాశ్వతంగాపార్టీని కుల రాజకీయ ఊబిలోకి నెట్టేస్తుందన్న భయం వారిలో వ్యక్తమవుతోంది. ఇందుకు ఉదాహరణగా వి.పి.సింగ్ అమలుచేసిన మండల్ కమిషన్ నివేదిక ఉదంతాన్ని వివరిస్తున్నారు. ఈ కమిషన్ నివేదిక ప్రకారం ఓబీసీలకు 27% రిజర్వేషన్‌ను వి.పి.సింగ్ ప్రభుత్వం అమలుచేసింది. కానీ తర్వాతికాలంలో దీనివల్ల బాగా లాభపడిరది ప్రాంతీయ పార్టీలు మాత్రమే! ఈ నేపథ్యంలో కులగణన వల్ల రాబోయేకాలంలో బీజేపీకి నష్టం కలుగుతుందన్న ఆందోళన వారిలో వ్యక్తమవు తోంది.
ఉత్తరప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల్లో జరిగిన నష్టం నేపథ్యంలో, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హిందూత్వపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించారు. ‘విడిపోతే నష్టపోతాం’ అన్న నినాదం హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో బాగా పనిచేసి, బీజేపీ అధికారంలోకి రావడానికి దోహదం చేసింది. కుల రాజకీయం అనేది ‘సైద్ధాంతిక పోరాటం లేకుండానే ఓటమి పాలవడం తప్ప మరోటికాదు’ అ న్నది బీజేపీలోని కొందరు నాయకుల అభిప్రాయం. కాంగ్రెస్ అనుసరించే కుల రాజకీయాలు బీజేపీకి సరిపోవన్నది వారి దృఢవిశ్వాసం. అసలు దేశవ్యాప్తంగా కులగణన చేపట్టడం ఎంతవరకుసాధ్యముతుందనేది మరి కొందరు సంధిస్తున్న ప్రశ్న. దేశవ్యాప్తంగా 50వేల కులాలున్నప్పుడు ఎన్ని కేటగిరీలుగా విడగొడతారు? అదీకాకుండా ఒక వ్యక్తి తాను ఫలానా కులానికి చెందినవాడినని చెప్పినప్పుడు ఏవిధంగా దాన్ని నిర్ధారిస్తారు? ఒకవేళ కులగణన సమాచారం ప్రకారం రిజర్వేషన్ కోటాను 50శాతం కంటే పెంచుతారా? అనేది మరో ప్రశ్న. ఎస్సీ/ఎస్టీల్లో ఉపకుల వర్గీ కరణ చేయవచ్చని 2024 ఆగస్టులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పును అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ. అయితే ఈవిధమైన వర్గీకరణ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి వ్యతిరేకమని బీజేపీ వాదిస్తోంది. మొత్తంమీద చెప్పాలంటే కులగణన వల్ల కులవ్యవస్థ మరింత బలోపేతమవుతుంది. కులరహిత వ్యవస్థకోసం కృషిచేయాలన్న మన నాయకుల ఆశయాలకు ఇది గండికొట్టే అవకాశాలే ఎక్కువ!
ప్రతివ్యూహంతో చైనాకు చెక్ పెడుతున్న భారత్ ఫలితం భారత్ నిర్దేశిందిగానే వుంటుంది
ప్రపంచ దేశాలకు భారత్ అత్యంత అవసరం
భారత్‌ను వదులుకోవడానికి ఏదేశం సిద్ధంగా లేదు
తన స్థానాన్ని ఆక్రమిస్తున్న భారత్‌పై చైనా అక్కసు
యుద్ధం కోరుకుంటున్న పాకిస్తాన్
భారత్ వ్యూహంతో పాక్ ఉక్కిరిబిక్కిరి
చైనా కూడా ఎక్కువకాలం మద్దతివ్వలేని స్థితి
చివరకు భారత్‌కు అనుకూలంగానే రానున్న ఫలితం
పరిశ్రమల్లో ప్రధాన వస్తువుల ఉత్పత్తి జరిగే సమయంలో కొన్ని ఉప ఉత్పత్తులు కూడా ఉత్పన్నవడం సహజం. అదేవిధంగా ఒక లక్ష్యంతో ఒక కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు, దానివల్ల కొన్ని అ నుబంధ ఫలితాలు రావడం జరుగుతుంటుంది. పహల్గామ్ సంఘటన నేపథ్యంలో భారత్ చేపట్టిన ఉగ్రవాదుల ‘ఉత్పత్తి’ కేంద్రాలపై జరిపిన దాడులు విజయవంతం కావడమే కాదు, ప్రపంచానికి భారత్‌ను ఒక కొత్తకోణంలో చూపాయి. ఇప్పటివరకు ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్‌గా, పెట్టుబడులకు అనుకూల దేశంగా తనను తాను నిరూపించుకున్న భారత్ ఇప్పుడు సీమాంతర ఉ గ్రవాదం పీచమణచడంలో మరే ఇతర దేశం అనుసరించని రీతిలో వ్యవహరించి పాకిస్తాన్‌లోని తొమ్మిది ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసి తన సత్తాలోని ప్రత్యేకత ఏంటో ప్రపంచానికి చూపింది. ఒక లక్ష్య సాధనలో వ్యవస్థల సమన్వయం ఎంత పకడ్బందీగా వుండాలనేది చెప్పడంలో ప్రపంచానికే ఒక మార్గదర్శకంగా వ్యవహరించింది. ఆధునిక ఎలక్ట్రానిక్ యుద్ధనీతిలో తనకు తిరుగులేదని రుజువుచేసింది. ఇక అసలు విషయానికి వస్తే, కుంచించుకుపోతున్న ఆర్థిక వ్యవస్థ ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకు అప్రతిహతంగా ప్రపంచ మార్కెట్లను శాసించిన చైనా, తనను సవాలు చేసే రీతిలో భారత్ ఎదగడం ఎంతమాత్రం తట్టుకోలేక పోతున్నది. ఒకవైపు అమెరికాతో వాణిజ్య యుద్ధం, యూరప్ సహా ఇతర దేశాల మార్కెట్లలో ప్రవేశం క్రమంగా కుం చించుకు పోతున్న తరుణంలో, తన మార్కెట్‌ను క్రమంగా ఆక్రమిస్తున్న భారత్‌పై ఆగ్రహంతో రగిలిపోతున్న చైనా విచిత్ర పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. కోపంతో మనపై దాడి చేయలేదు, అట్లాగని అక్కున చేర్చుకోలేదు, ఇదే సమయంలో విస్మరించనూ లేదు. విరోధాభాసలాంటి ఈ పరిస్థితిని అధిగమించి భారత్‌పై కక్ష తీర్చుకోవాలంటే దానికి వున్న మార్గం పాకిస్తాన్! తాను ఏది చేయాలనుకున్నా పాక్ ద్వారానే సాధించడానికి ప్రయత్నిస్తుంది. ‘డ్రాగన్’ ఈ జిత్తులమారితనానికి ‘ఏనుగు’ (భారత్) రెచ్చిపోవడంలేదు. ఆగ్రహంతో ఊగిపోవడంలేదు కూడా. కానీ ఒక పద్ధతి ప్రకారం తనదైన వ్యవహారశైలితో నిశ్శబ్దంగా పనిచేసుకొని పోతూ, క్రమంగా ఎక్కడికక్కడ ‘నట్లు’ బిగించుకుంటూ వూపిరి ఆడకుండా చేస్తున్నది. దీన్ని ‘డ్రాగన్’, ‘ఏనుగు’ అనే దిగ్గజ ప్రత్యర్థుల మధ్య కొనసాగుతున్న ‘ప్రచ్ఛన్న’ పోరాటం అనుకోవచ్చు. పాక్ దుస్సాహసం వెనుక ‘అండ’ పహల్గాం సంఘటన వెనుక పాకిస్తాన్ హస్తమున్నదనేది తిరుగులేని సత్యం. అమాయకులైన ప ర్యాటకులను దారుణంగా చంపేయడం ద్వారా భారత ప్రభుత్వాన్ని, ప్రజలను రెచ్చగొట్టాలన్నది దాని ఉద్దేశం. అయితే ఇక్కడ పాక్ ఆశించిన స్థాయిలో ఉగ్రవాదులు వ్యవహరించలేకపోయారు. మరి పాకిస్తాన్ ఇటువంటి దుస్సాహసానికి ఎందుకు ఒడిగట్టిందనేది సహజంగా ఉదయించే ప్రశ్న. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో గతంలో చేపట్టిన ఉగ్రవాద చర్యలకు ప్రతిక్రియ ఏవిధంగా ఉన్నదీ పాకిస్తాన్‌కు అనుభవైకమే. మళ్లీ ఇటువంటి దుస్సాహసానికి పాల్పడితే పరిస్థితి దారుణంగా వుంటుందనేది కూడా పాక్‌కు తెలియంది కాదు. దేశంలో అల్లకల్లోలం చెలరేగుతున్నప్పుడు నియంతలు, సైనిక పాలకులు సాధారణంగా బాహ్య శత్రువును చూపి దేశాన్ని ఐక్యంగా వుంచ డానికి యత్నిస్తారు. ప్రస్తుతం పాకిస్తాన్ కూడా అదే చేసి ప్రజల దృష్టిని మరల్చాలనుకున్న వ్యూ హం బూమరాంగ్ అయింది. మోదీ ప్రభుత్వం ఇంతటి తీవ్రస్థాయిలో స్పందిస్తుందని బహుశా ఊహించి వుండకపోవచ్చు. ఈ ప్రతిక్రియను తట్టుకునే ఆర్థిక సామర్థ్యం పాక్‌కు లేదు. సైనిక సామర్థ్యం అంతకంటే లేవు. అయినప్పటికీ కొరివితో తలగోక్కోవడానికి సిద్ధపడిరదంటే దానికి ఏదో ఒకరకమైన మద్దతు కచ్చితంగా వున్నట్టే! అదే చైనా! చైనాభారత్ సంబంధాల్లో సందిగ్ధత 2020లో గల్వాన్ సంఘటన తర్వాత భారత్‌ాచైనాల మధ్య దారుణంగా దెబ్బతిన ద్వైపాక్షిక సంబంధాలు ఇప్పుడిప్పుడే గాట్లో పడుతున్నాయి. అమెరికాతో వాణిజ్య వైరం కూడా చైనాను దిగొచ్చే లా చేసింది. మానససరోవర యాత్ర తిరిగి ప్రారంభం, దౌత్య సంబంధాలు క్రమంగా మెరుగుపడుతున్నాయి. పైకి సజావుగా, అంతా ప్రశాంతంగా సాగిపోతున్నట్టు కనిపిస్తున్నా, చైనా హృదయాంతరాళాల్లో ఎక్కడో వ్యక్తం చేయలేని భయంతో కూడిన ఆందోళన! వేగంగా ఎదుగుతున్న భారత్ ముందు ఇక ఎంతోకాలం తన ఆధిపత్యం నిలవదన్న సత్యం దాని మెదడును తొలిచేస్తోంది. మరోవైపు భారత్‌ను నిరోధించలేదు అట్లాగని విస్మరించనూ లేదు. ఇదొక విచిత్ర సందిగ్ధ పరిస్థితి! నిజం చెప్పాలంటే 21వ శతాబ్దంలో భారత్‌ాచైనాల మధ్య ఎంతమాత్రం పొంతన లేని దశ కొనసాగింది. చైనా ఒక స్థాయికి చేరుకోగా, భారత్ ఇంకా తన స్థాయిని మరింత పెంచుకోవడానికి అలుపెరుగని పోరాటం చేస్తూనే వుంది. 2010 తర్వాత మౌలికసదుపాయాలు, సాంకేతికరంగం మరియు వాణిజ్య రంగాల్లో భారత్‌ను పూర్తిగా వెనక్కు నెట్టేసింది. ఇక భారత్‌ను ప ట్టించుకోవాల్సిన అవసరం లేదనకుంటున్న తరుణంలో 2017లో డోక్లాం సంఘటన పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. భారత సైన్యం ఢీ అంటే ఢీ అనే స్థాయిలో నిలబడేసరికి, చైనా వెనక్కు త గ్గాల్సి వచ్చింది. 2020లో జరిగిన గల్వాన్ సంఘనలో భారత్ తన కార్యశీలతను రాజకీయ దృఢత్వాన్ని విస్పష్టంగా ప్రదర్శించడం చైనాను కలవర పరచింది. ఆ తర్వాత కోవిడ్ మహమ్మారి ఒక్కసారి విజృంభించడంతో చైనాతో సహా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ కుప్పకూలి పోయా యి. ఈ అఘాతం నుంచి భారత్ చాలా వేగంగా బయటపడగా, చైనా తన చురుకుదనాన్ని కో ల్పోయి వెనుకబడిరది. ముఖ్యంగా ఎన్ని ఉద్దీపన చర్యలు తీసుకున్నా ఫలితం లేకపోగా, ప్రతి ద్రవ్యోల్బణం ఆర్థిక వ్యవస్థను మరింత బలహీనం చేసింది. మార్కెట్లో డిమాండ్ పడిపోవడం, రుణ సంక్షోభం చైనాను అతలాకుతలం చేశాయి. అప్పటివరకు భారత్‌ను తనతో సరిసమాన దేశంగా చైనా ఎప్పుడూ పరిగణించలేదు. కేవలం ప్రాంతీయ శక్తి స్థాయికే పరిమితం చేసి తాను గ్లోబల్ స్థాయికి ఎదగడానికి అమెరికాతో పోటీపడటం మొదలుపెట్టింది. కానీ అమెరికాతో పోటీపడాలన్న ఆకాంక్ష మాట అట్లా వుంచి, భారత్ వేగంగా పుంజుకొనడంతో, ప్రపంచ యవనికపై భారత్‌ాచైనాలను సరిసమానంగా చూడటం మొదలైంది. 2025లో ట్రంప్ హయాం వచ్చిన త ర్వాత వాణిజ్య యుద్ధం మొదలుకావడంతో చైనా పరిస్థితి మరింత తల్లక్రిందులైంది. ఈ వాణిజ్య యుద్ధంలో రెండుదేశాలు నష్టపోయినప్పటికీ, దెబ్బ అధికంగా తగిలింది చైనాకే! మొత్తం వాణిజ్య సరఫరా శృంఖలాలు దెబ్బతినడం, దేశంలో ఉత్పత్తుల నిల్వలు అమాంతం పెరిగిపోవడం,మార్కెట్ల కొరతతో చైనా ఆర్థికంగా అతలాకుతలమైంది. ప్రత్యామ్నాయంగా భారత్ ప్రతి లావాదేవీలో తనకు లాభం లేకుండా అడుగు ముందుకేయని అమెరికా, ఈ వాణిజ్యయు ద్ధంలో ముందుకే వెళ్లడానికి ప్రధాన కారణం భారత్ ప్రత్యామ్నాయంగా కనబడటం! అమెరికా వ్యూహాత్మక అవసరాలు తీర్చే స్థితిలో భారత్ వుండటంతో, చైనాపై ఒత్తిడి పెరిగింది. భారత్‌కు వాణిజ్యపరంగా విస్తృతమవుతున్న సరఫరా శృంఖల వ్యవస్థ, భౌగోళిక సమతుల్యతను సాధించ డం వంటి అంశాలను చైనా మీడియా సంస్థలు క్రమంగా గుర్తించడం మొదలైంది. కేవలం భారత్ వుండటం వల్లనే అమెరికా తనను ఒక చట్రంలో బిగించగలుగుతోందన్న సత్యం కూడా చైనాకు అర్థమవసాగింది. ఈ నేపథ్యంలో తనకు పొరుగునే వుంటూ, తన ఆధిపత్యాన్ని సవాలు చే స్తూ, గ్లోబల్ పవర్‌గా ఎదుగుతున్న భారత్ ఒక పెద్ద సవాలుగా మారింది. దీన్ని ఏదోవిధంగా కట్టడి చేయకపోతే నిండా మునగడం ఖాయమన్నది కూడా అవగతమైంది. 1980 దశకంలో చైనా ఎదుగుదలకు అమెరికా నేతృత్వంలోని పాశ్చాత్యదేశాలు ఎంతగానో స హకరించాయి. కానీ భారత్ పరిస్థితి అదికాదు. తాను పశ్చిమదేశాల ప్రభావానికి లోనుకాకుండాస్వతంత్రంగా, తన సొంత పంథాలో ముందుకెళుతూ ఎదుగుతోంది. స్వతంత్రంగా ఎదుగుతున్నభారత్‌ను కట్టడిచేయడం చైనాకు సాధ్యంకాని పని! ఒకవేళ అట్లా చేయాలనుకుంటే భారత్`యుఎస్‌లు మరింత సన్నిహతమవుతాయి. సైనికంగా బెదిరిద్దామను కుంటే, డోక్లామ్, గల్వాన్ సం ఘటనలు చైనాకు తన పరిమితేంటో స్పష్టం చేశాయి. మరో సంఘర్షనకు దిగడమంటే ఆత్మహ త్యా సదృశమేనన్న సంగతి చైనాకు బాగా తెలుసు. భారత్ సహకారం తప్పనిసరి ఈ నేపథ్యంలో అమెరికాను పక్కనబెట్టే విధంగా ప్రత్యామ్నాయ ఆర్థిక, వాణిజ్య వ్యవస్థను నిర్మిస్తే ప్రస్తుత దుస్థితినుంచి బయటపడవచ్చు. అందుకు బ్రిక్స్ వంటి వేదికలు అవసరం. ఈ వేదికను ఉపయోగించుకొని బ్రిక్స్‌కు ప్రత్యేక కరెన్సీ రూపకల్పన, డాలర్‌కు ప్రత్యామ్నాయ చెల్లింపుల వి ధానాన్ని అమల్లోకి తేవడం వంటి ప్రక్రియలు చేపట్టాలి. ఇందుకు మళ్లీ భారత్ సహకారం తప్పనిసరి. ఇండియా ముందుకు రాకపోతే చైనా వ్యూహాలు చెత్తబుట్టలోకి వెళ్లిపోతాయి. ఎందుకంటే వాణిజ్యపరంగా భారత్ లేకుండా, యు.ఎస్.కు ప్రత్యామ్నాయంగా అనుసరించే మార్గాలను ప్రపంచం విశ్వసించదు. రష్యాకు ఇది బాగా అర్థమైంది. చైనాకు తెలిసొచ్చింది. అయినప్పటికీ చై నాలోని అహంకారం భారత్ ఎదుగుదలను అడ్డుకోవాలనే కోరుతుంది. ఇందుకోసం కొంత రిస్క్‌ను భరించడానికి కూడా సిద్ధమే! వేగంగా ఎదుగుతున్న భారత్ తనకు పెను సవాలుగా మారక తప్పదు. అట్లాగని పశ్చిమదేశాల ఆర్థిక ఆధిపత్యాన్ని నిరోధించాలంటే భారత్ సహాయం తప్పదు! అందువల్లనే మనదేశంపై దాడిచేయలేదు, అట్లాగని కౌగిలించుకోనూ లేదు, ఇదేసమయంలో విస్మరించడం అసలు సాధ్యమూ కాదు. ఈ విచిత్రపరిస్థితి నేపథ్యంలోనే తనకు అత్యంత విశ్వాస పాత్రుడైన పాకిస్తాన్‌ను పావుగా ఉపయోగించుకొని భారత్‌ను దెబ్బకొట్టే వ్యూహాన్ని అనుసరిస్తోంది. పహల్గాం సంఘటనలో పాక్‌కు మద్దతు వ్యూహాత్మకంగా ఇటువంటి జటిల పరిస్థితిలో, పాకిస్తాన్‌ను ఒక ఉపకరణంగా వాడుకునే సాను కూలత చైనాకు లభించింది. పహల్గాం సంఘటనలో పాకిస్తాన్‌కు కేవలం మద్దతివ్వడమే కాదు, మనదేశంలోకి పాక్ చొరబాట్లకు గట్టి మద్దతునిస్తోంది. పహల్గామ్ దాడిలో ఉగ్రవాదులు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినట్టు తేలింది. ముఖ్యంగా హువావే ఉపగ్రహ ఫోన్లు, చైనాకు చెందిన అత్యాధునిక ‘ఆల్ట్రాసెట్ ఎన్క్రిప్షన్ టెక్నాలజీ’ ఈ ఉగ్రవాదులకు అందు బాటులోకి రావడం గమనార్హం. ఈ సాంకేతిక పరిజ్ఞానం తమను గుర్తించకుండా సహాయపడు తుంది. ఈ ప్రత్యేక ఉపకరణాలను చైనా కంపెనీలు తయారుచేశాయి. వీటిని పాక్ సైన్యం ఉపయోగిస్తుంటుంది. ఇవి సరిహద్దు ప్రాంతంలో ఏర్పాటుచేసిన కంట్రోల్ స్టేషన్ల ఫ్రీక్వెన్సీకి అను సంధానమై పనిచేస్తుంటాయి. వీటి సహాయంతో కుదించిన సమాచారాన్ని చైనా ఉపగ్రహాల ద్వారా పాకిస్తాన్‌కు అందజేస్తుంటారు. కేవలం సైన్యానికి పరిమితమయ్యే ఈ అత్యాధునిక సాంకేతికపరిజ్ఞానం, కశ్మీర్లో ఉగ్రవాద చర్యలకు పాల్పడే మిలిటెంట్ల చేతికి రావడం చైనా అధికార్లకు తెలియదంటే అంతకంటే అమాయకత్వం మరోటుండదు. దౌత్యపరంగా పాకిస్తాన్‌కు పూర్తిస్థాయి మద్దతునిస్తోంది. ఐక్యరాజ్య సమితిలో పాక్ మిలిటెంట్లను అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ప్రకటించనీయకుండా ఎప్పటికప్పుడు అడ్డుకుంటోంది. అంతేకాదు పహల్గాం సంఘటనకు పాక్ మిలిటరీకి సంబంధమున్నదన్న సంగతి స్పష్టమైనా, పాకిస్తాన్ చెబుతున్న ‘నిష్పాక్షిక విచారణ’కు మద్దతివ్వడం గమనార్హం. అంతకంటే మరో ముఖ్య విషయమేంటంటే, పాకిస్తాన్ సార్వభౌమత్వానికి భంగం వాటిల్లితే తాము అండగా నిలుస్తామని చైనా వ్యూహకర్త విక్టర్ గావో పేర్కొనడం కూడా ఇక్కడ ప్రస్తావనార్హం. యుద్ధం కోరుకుంటున్న దేశాలు నిజం చెప్పాలంటే ప్రంపంచంలోని ప్రతి బలీయమైన దేశం పైకి ఎన్ని మాటలు చెప్పినా అంతర్గతంగా భారత్`పాక్‌ల మధ్య యుద్ధం రావాలనే కోరుకుంటున్నాయి. ఈయుద్ధం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ కుదేలయి, ప్రపంచంలో భారత్`పాకిస్తాన్ అనే స్థాయికి దిగజారాలన్నది చైనా కోరిక! ప్రస్తుతం ప్రపంచ దేశాలు భారత్‌ను తనతో సమానంగా పరిగణించడం చైనాకు ఎంతమాత్రం ఇష్టంలేదు. పాకిస్తాన్‌తో యుద్ధం వస్తే, భారత్ తనతో బేరసారాలాడే బలీయతను కోల్పోయి, కాళ్లబేరానికి వస్తుందన్నది అమెరికా అంచనా. ఇక రష్యా విషయానికి వస్తే ఇప్పటికే యుక్రెయిన్ యుద్ధంలో ఏకాకిగా మారిన తాను, ప్రస్తుతం భారత్‌కు నమ్మకమైన మిత్రుడుగా కొనసాగుతు న్నప్పటికీ మరో భౌగోళిక రాజకీయ సంక్షోభంలోకి తలదూర్చి మరింత ఒంటరి కావడానికి ఇష్ట పడటం లేదు. ఇక పాకిస్తాన్‌కు ఇప్పుడు యుద్ధం అత్యవసరం. ఇప్పటికే దీనికి సంబంధించిన ట్రిగ్గర్ను నొక్కేసింది. పదేపదే భారత్‌ను రెచ్చగొడుతోంది. యుద్ధం వస్తేనే తనకు మద్దతిస్తామ న్న దేశాలనుంచి ఆర్థిక సహాయాన్ని పొందగలుగుతుంది. కానీ ఎక్కడెక్కడో ఉన్న సైన్యాన్ని సరి హద్దులకు తరలించడం దానికి తలకు మించిన భారంగా మారింది. భారత్ ఆలస్యం చేసినకొద్దీ,తరలించిన సైన్యం యుద్ధసన్నద్ధత నిర్వహణకు విపరీతంగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఫలితంగా ఇప్పటికే ఆర్థికంగా కుదేలైన పాక్ మరింత దిగజారే పరిస్థితి ఏర్పడక మానదు. ఆవిధంగా ఒక్క బుల్లెట్ కూడా పేల్చకుండా పాక్ ‘రక్తమోడక’ తప్పదు. భారత్‌ను ‘వెయ్యి గాయాలతో రక్త మోడిస్తాం’ అని ప్రతిజ్ఞ చేసిన పాక్ ఇప్పుడు తాను అదే దుస్థితిని ఎదుర్కొనాల్సి వస్తుంది. అందుకనే పాకిస్తాన్ ప్రతి చిన్న విషయానికి భారత్ సహనాన్ని పరీక్షించే రీతిలో రెచ్చగొడుతోంది. భారత్‌ను తక్కువగా అంచనా వేస్తున్న ప్రపంచం నిజం చెప్పాలంటే ప్రపంచ దేశాలు భారత్ అనుసరించే భౌగోళిక రాజకీయాన్ని చాలా తక్కువగాఅంచనా వేస్తున్నాయి. రష్యా`చైనా ఒకవైపు, పశ్చిమ దేశాలను మరోవైపు ఏ కారణం లేకుండా నే మనదేశం అయోమయంలో వుంచుతుందనుకోవడం అమాయకత్వమే అవుతుంది. బ్రిక్స్ నుంచి క్వాడ్ వరకు భారత్ సభ్యురాలే అన్న విషయం మరచిపోకూడదు. అన్ని భౌగోళిక రాజకీయ కూటముల్లో భారత్ భాగస్వామి. అందువల్ల ఏ దేశమూ భారత్ లేకుండా ముందడుగు వేయడంసాధ్యంకాదు. అట్లాగని ఏకాకినీ చేయలేవు. ఒకరకంగా చెప్పాలంటే భారత్ రెండంచుల కత్తిపై చిన్న గాయం కాకుండా నడిచే రీతిలో దౌత్యాన్ని కొనసాగిస్తోంది. భారత్ వేసే ప్రతి అడుగులో భావావేశం వుండదు, కేవలం ఒక పద్ధతిప్రకారం, వ్యూహాత్మకత మాత్రమే వుంటుంది. పాకిస్తాన్‌పై నీటి ఒత్తిడిని క్రమంగా పెంచుతూ వచ్చింది. 2016 నుంచి సింధూనది ఉపనదులపై భారత్ డ్యామ్‌లు నిర్మిస్తూ వస్తున్న సంగతి కొందరికే తెలుసు. ఇప్పుడు ఈ నీటిపై ఆధిపత్యం సాధించడం ద్వారా, పాక్‌లో వ్యవసాయాన్ని, విద్యుత్‌ను, ఆహార భద్రతను నియంత్రించవచ్చు. ఇదే సమయంలో భారత సైన్యం ఫార్వర్డ్ పోస్టుల్లో కొనసాగుతాయి. దీని వల్ల పాక్ సైన్యం అనుక్షణం అప్రమత్తంగా వుండాలి. ఇది దానికి ఆర్థిక భారం! ఇదేసమయంలో భారత దౌత్యప్రతినిధులు తమపని కానిచ్చేస్తున్నారు. ఫలితంగా ప్రపంచ దేశాల ఒత్తిడి కేవలం పాకిస్తాన్‌పై మాత్రమే కాదు దాని మద్దతుదార్లపై కూడా బాగా పెరిగిపోయింది. ఇక చైనా విషయానికి వస్తే, ఇప్పటికే పన్నుల యుద్ధంలో కుదైలైన ఆర్థిక వ్యవస్థ నేపథ్యంలో, ఈ పాకిస్తాన్ ‘వ్యూహాత్మక భారాన్ని’ మోసే పరిస్థితిలో లేదు. ఇది మరింతకాలం కొనసాగితే చైనా పరిస్థితి ఇంకా దిగజారుతుంది. ఇప్పటికే యూరప్, అమెరికా, రష్యాల్లో జాతీయవాద భావాలు పెరుగుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే సరిహద్దుల్లో మాత్రమే కాదు ప్రపంచ వ్యవస్థపై కూడా భారత్ తన ముట్టడిని కొనసాగిస్తోంది. పాకిస్తాన్‌పై సైనిక చర్య వుండవచ్చు. ఎన్నో భారమైన నిద్రలేని రాత్రులు గడిచిన తర్వాత, నీ రు`ఆహారం కొరత ఏర్పడినప్పుడు, ఆర్థికంగా పూర్తిగా దెబ్బతిన్న తర్వాత, నిరంతరం సైనికుల తరలింపు వల్ల సైన్యం బలహీనమైనప్పుడు దాని నైతిక స్థైర్యం పూర్తిగా దెబ్బతింటుంది. అప్పుడుభారత్ చేసే దాడి తీవ్రతను అంచనా వేయడానికుండదు. పాకిస్తాన్‌ను ఒక పేపర్ మాదిరిగా మడత పెట్టేస్తుంది. అప్పుడు ప్రపంచానికి తామకు కావలసింది లభిస్తుంది. కానీ అది భారత్ నిర్దే శించిన పరిధిలో మాత్రమే వుంటుంది!
`ఎంత ఖర్చు చేసినా కాళ్లు వారసాపుకునేంత ఇల్లు దొరకదు
`బతకలేం బాబోయ్ అంటున్న మధ్యతరగతి
`అటు ధరలు, ఇటు పన్నలు
`సంపాదన మూరెడు..ఖర్చు బారెడు
`నెలనెల అప్పులు…నెలాఖరున పస్తులు
`బైటకు చెప్పుకోలేక మధ్య తరగతి అవస్థలు
`పరువు కోసం పాకులాట…బతుదెరువు చాలక యాతన
`సంపాదన నెలల మధ్యలోనే హరతి కర్పూరం
`ఎంత పొదుపు చేద్దామనుకున్నా చాలీచాలని వేతనం.
`పని చేస్తేగాని పూట గడవదు
`ఈ రోజు సంపాదనలో రూపాయి రేపటికి మిగలదు
`మధ్య తరగతి సమస్యలు పార్టీలకు పట్టవు
`పాలకులకు అసలే పట్టవు. పేదల బతుకులు మారవు
`పెరుగుతున్న ధరలు…నెలాఖరున అప్పులు
`సగటు వ్యక్తి వీపు మీద మోయలేని భారాలు
పేదోడి బతుకులు పెరగవు. పెద్దోడి బతుకులు తరగవు. మధ్య నలిగిపోయేది మధ్య తరగతి వాడే..కష్టాలు, నష్టాలు మోసేది ఆ మిడిల్ క్లాస్ వాడే అని పెద్దలన్నారు. అందుకే మధ్య తరగతి ప్రజలు ఎప్పుడూ నానా కష్టాలు పడుతూనే వుంటారు. కష్టాలన్నీ ఎదుర్కొంటూనే వుంటారు. ఏ చిన్న సమస్య వచ్చినా పేదోడు దేవుడి మీద భారం అనుకుంటాడు. పెద్దోడు నాకేం తక్కువ. అని ఎదుర్కొంటాడు. కాని మధ్య తరగతి వాడే దేవుడి మీద భారం వేయలేదు. ఎదుర్కొనేందుకు ధైర్యం చేయడు. ఎవరికీ చెప్పుకోలేక సతమతమౌతుంటాడు. కష్టాలు తీరే రోజులు రాకపోతాయా? అని ఎదురుచూస్తుంటాడు. ఆశాజీవిగా బతుకుతుంటాడు. కాని ఎదుగుదల లేకపోగా, కుంచించుకుపోయే జీవితాలను చూసుకుంటూ కుమిలిపోతుంటాడు. తన జీవితాన్ని తానే ప్రశ్నించుకోలేడు. తనను తాను సముదాయించుకోలేడు. ఎందుకొచ్చిన కష్టం రా అని కలత చెందుతూనే వుంటాడు. ఉన్నదాంట్లోనైనా సంతృప్తి పడదామనుకుంటే తరిగిపోతున్న వయసు, చాలీ చాలని సంపాదనతో మరింత వేధనకు గురౌతుంటాడు. అదీ మధ్య తరగతి బతుకు. అయితే గతంలో మధ్య తరగతి వాడిని చీకు చింతలేని బతుకులు అనుకునేవారు. ఉన్నదానితో సంతృప్తిపడుతూ జీవించే వేతన, జీవులు కష్ట జీవులు అని అనుకునేవారు. ఉరుమొచ్చినా, మెరుపొచ్చినా ఎప్పుడూ ఒకేలా వుండే జీవితాలు అని సమాజం కూడా మధ్య తరగతి ప్రశంసిస్తూ వుండేది. చీకు చింత లేని జీవులుగా మాట్లాడుకునేవారు. అటు సంపాదన చాలడం లేదనో, ఇటు పొదుపుతో రూపాయి చేతిలో వుందన్న ఆనందం మధ్య తరగతి ప్రజలకు వుండేది. కాని ఇప్పుడు ఆ కాలం పోయింది. మధ్య తరగతి వాడు చితికిపోవడమే కాదు, ఉతికి ఆరేబడుతున్నాడు. కన్నీళ్లను దిగమింగుకుంటూ బతుకుతున్నాడు. అవి కూడా పక్కవాడికి కనిపించకుండా చూసుకుంటున్నాడు. పైకి గంభీరంగా బతుకుతున్నా, లోలోన కుతకులలాడుకుంటూ బతుకుతున్నాడు. ఒక రకంగా నిత్యం ఆలోచనలతో, వేదించే సమస్యలతో రోగాల పుట్ట కూడా అవుతున్నాడు. అన్ని రకాలుగా దేశాన్ని సాదుతున్నాడు. తాను ఆవిరైపోతున్నాడు. ఆకలి ఎంత దహిసున్నా కడుపులో తల పెట్టుకోలేదు. లోపలిబాధలు పైకి కనిపించుకోనివ్వడు. పది మందిలో వున్నా సంతోషంగా వుండలేదు. ఒంటరిగా వుండి నిలబడలేదు. ఏ రకంగా చూసినా మధ్య తరగతి వాడు నేను ఒక మనిషినే అన్న విషయాన్ని రోజు రోజుకూ మర్చిపోతున్నాడు. తన బాధలను చూసి కడుపార ఏడ్వలేడు. పది మంది ముందు పలుచన కాలేదు. కడుపు చింపుకుంటే తన కాళ్ల మీదే పడుతుందని తెలిసిన ఆకలి మేదావి మధ్య తరగతి వాడు. తానే కాదు, తన కుటుంబ సభ్యుల కష్టాలన్నీ ఒక్కడే మోసే వాడు. ఎంతటి విపత్కరమైన పరిసి ్దతులైనా సరే తన కుటుంబ సభ్యులకు కూడా చెప్పకుండా కడుపులో దాచుకుంటాడు. ఏ ప్రశ్నకు సమాదానం చెప్పలేని వాడు. ఎవరినీ నిందించలేని వాడు. కడుపు కాలుతున్నా ఏడుపును ఆపుకుంటూ, ఆనందాన్ని నటించగల గొప్ప ఆశాజీవి మధ్య తరతగి వాడు. రోజుల తరబడి ఆకలి కేకలు కడుపులో వినిపిస్తున్నా, సముదాయించుకుంటూ కాలం గడుపుతున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే బతకలేకి చితికిపోతున్నాడు. బతికుండగానే చితికిపోయే పరిస్దితుల్లో మగ్గిపోతున్నాడు. బతికుండగానే నిత్య నరకం చూస్తున్నాడు. ఎందుకు పుట్టించావు దేవుడా అని ఏడుస్తాడే గాని, దేవుడిని కూడా నిందించలేడు. పాపఖర్మల ఫలితమేమే అనుకుంటూ బతుకులీడుస్తుంటాడు. కాలం పరుగెత్తున్నంత వేగంగా పరుగెత్తలేక, అలసిపోతున్నాడు. ఆగమౌతున్నాడు. సమాజాన్ని దాటి ముందుకు వెళ్లలేకపోతున్నాడు. పల్లెల్లో బతకలేడు. అక్కడ గుంట జాగ వున్నా చూసుకొని మురిసిపోయేవాడు. కాని పల్లె లో కూడా గూడు లేక విలవిలలాడుతున్నాడు. పల్లె పొమ్మంటే పట్నం చేరి నానా కష్టాలు పడుతున్నాడు. గతంలో పల్లెల్లో కూడా మధ్యతరగతి వాడు ఎంతో హుందాగా బతికేవాడు. వృత్తిపనులు చేసుకుంటూ కాలం గడుపుకునేవాడు. కాని ఇప్పుడు రైతుకు తప్ప పల్లెలో వృత్తిదారులకు భూములులేవు. కనీసం నిలువ నీడ లేదు. దాంతో ఎటు పోతున్నామో తెలియని అమోయమంలో పడి బతుకులీడుస్తున్నాడు. చాలీ చాలని జీతాలు. వచ్చే ఆ సంపాదనలో అన్నీ సర్ధుకోవాలి. ఆకలి పస్తులను బందువులను చేసుకోవాలి. కిరాయికి వుండలేదు. అది హైదరాబాద్ లాంటి నగరమే కాదు, జిల్లా కేంద్రాలైనా, చిన్న చిన్న పట్టణాలైనా సరే ఆకాశాన్నంటున్న కిరాయిలే సగం సంపాదనను ఊడ్చుకుపోతున్నాయి. మధ్య తరగతి వాడికి గతంలో పల్లెల్లో వున్న పని ఇప్పుడు లేదు. కమ్మరి చేసే కుండలు ఎవరూ కొనడంలేదు. చాకలి చేత ఇస్త్రీలు చేయించుకోవడం లేదు. పద్మశాలీల మగ్గం పని చేయడం లేదు. మేర వారి మిషన్ తిరగడం లేదు. కమ్మరి కొలిమి ఎప్పుడో పాడుపడి పోయింది. వడ్రంగి పనులు చేసుకునేవారు లేరు. ఏ వృత్తి బతికిలేదు. అక్కడక్కడ వున్నా బతకు సాగడం లేదు. దాంతో పట్నం చేరి గొడ్డు చాకిరి చేసినా సంపాదన అంతంత మాత్రమే అవుతోంది. నగరాల్లో ఖర్చు సంపాదనను వెక్కిరిస్తోంది. ఎందుకంటే మధ్యతరగతి వాడు కూలీ చేయలేదు. పార పట్టలేడు. బస్తాలు మోయలేదు. అంతో ఇంతో చదువున్న చదువుతో జీతం తక్కువైనా పరపతి తగ్గొద్దనుకుంటాడు. అదే మధ్య తరగతికి ఉరిని మిగిల్చుతోంది. దాంతో వచ్చిన ఆదాయం ఏ మూలకు సరిపోవడం లేదు. సగం ఇంటి బాడుగ మింగేస్తోంది. మిగతా సగం పిల్లల చదువుకు ఊడ్చుకుపోతోంది. మిగిలిని ఆ కాస్త నెలంతా సరిపోక ఆకలి తిష్టవేసి వేపుకుతింటోంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్ధితుల్లో మధ్యతరగతి వాడి జీతం మొత్తం చెల్లించినా, కాళ్లువారసాపుకునేంత ఇల్లు దొరకదు. పెద్దింట్లో కిరాయికి వుండలేడు. దాంతో బతకలేంబాబోయ్ అంటూ రోదిస్తున్నాడు. చాలీచాలని జీతాలతో పెరుగుతున్న ధరలను తట్టుకోలేడు. కారం మెతుకులు తినలేడు. ఉన్నదానిలో సంతృప్తిగా తినకుండా వుండలేదు. తనను తాను పోషించుకోలేకోయినా, సంపాదనంతా ఖర్చు చేస్తూ దేశాన్ని సాదుతున్నాడు. దేశానికి పన్నుల మీద పన్నులు కడుతున్నాడు. తన నడుములు విరగ్గొట్టుకుంటున్నాడు. వీపు మీద పన్నులు విమానం మోత మోగిస్తున్నా భరిస్తున్నాడు. ఎందుకంటే మధ్య తరగతి వాడి సంపాద ఎటు కొలిచినా మూరడే వుంటుంది. జీతం వచ్చాక నోట్లను ఎన్ని సార్లు లెక్కించినా ఒక్కరూపాయి పెరగదు. రూపాjైునా పేరుగదా? అని పలు సార్లు లెక్కించుకునే మధ్యతరగతి ప్రజలు ఇప్పటికీ వున్నారు. ఆ ఆశతో బతుకుతున్నారు. పరువు తప్ప దేనిని లెక్కచేయడు. పరువు కోసం పాకులాడుతుంటాడు. ఐన వారు ఎవరొచ్చినా కష్టపడుతున్నానని చెప్పుకోడు. కష్టం గురించి పది మందితో పంచుకోడు. అంతెందుకు తను పడే వేధన , యాతన ఇంట్లో వారికి కూడా చెప్పుకోడు. కుటుంబ సభ్యులు ఏ కోరిక కోరినా చూద్దాం అంటారే గాని, లేదని ఎప్పుడూ చెప్పడు. అదీ మధ్య తరగతి మనస్తత్వం. తన నెల సంపాదన నెల మధ్యలోనే హరతి కర్పూరమౌతున్నా బతుకుపై భరోసాతో సాగుతుంటాడు. వచ్చే నెల బాగుంటుందేమో అని ఆశపడుతూ బతుకుతుంటాడు. చాలీ చాలని వేతనమైనా సరే..ఎలా వున్నారంటే అంతా బాగున్నామనే చెబుతుంటాడు. నిత్యం పని చేస్తేగాని పూట గడవదు. రోజు సంపాదనలో ఇంటికి చేరే సరికి రూపాయి మిగలదు. తెల్లారి జేబు చూసుకుంటే చిల్లి గవ్వ కనిపించదు. మధ్య తరగతి ప్రజల సమస్యలు పాలకులకు పట్టవు. రాజకీయ పార్టీలకు అర్దంకావు. పెరుగుతున్న ధరలు, నెలాఖరున అప్పులు మధ్య తరగతికి అవే ఆస్ధులు. చెప్పుకునేందుకు గొప్పలు. నవ్వుతూ బతకాలిరా..తమ్ముడూ అని పాట పాడుకుంటూ సాగలేదు. పేద వాడి పాట వింటూ నిలబడలేదు. పెద్ద వాడు కారులో పోతూ వింటున్న పాట పూర్తిగా వినిపించక పరుగెత్తైనా వినాలననుకుంటాడు. శక్తి చాలదని ఉసూరు మంటాడు. నిత్యం సమస్యల మంటల్లో మాడి మసైపోతున్నా, మళ్లీ తెల్లవారి ఫెయిర్ అండ్ లౌలీ పెట్టుకొని అద్దంలో ముఖం చూసుకొని సంబరపడతాడు. అదీ మధ్యతరగతి వాడు..ఆశల తోరణానికి వారసుడు. ఎండిపోయిన మామిడాలు వచ్చే పండుగ దాకా తీసేయ, మళ్లీ పండగెప్పుడు వస్తుందా? అని ఎదరుచూస్తుంటాడు…ఆ ఒక్క రోజైనా పండుగ చేసుకుంటున్నానని సంబరపడిపోతుంటాడు.
గణపురం మండలంలోని అప్పయ్య పల్లి గ్రామానికి చెందిన ఒంటెరు భాస్కర్ కు చెందిన పాడి గేదే బుధవారం రాత్రి విద్యుత్ షాక్ తో మృతి చెందింది. ఉదయం మేత కోసం బయటకు వెళ్లిన పాడి గేదె సాయంత్రం. ఇంటికి రాకపోవడంతో ఉదయం భాస్కర్ బయటకు వెళ్లి చూడగా ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ షాక్ తో మృతి చెంది కనిపించింది. సుమారు 70 వేల ఈరోజు చేసే గేదె మృతి చెందడంతో రైతు భాస్కర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు.
గత రెండు రోజుల క్రితం కాళేశ్వరం కారులో వెళ్ళివస్తూ కాటారం మండల పరిధిలో లారీ ఆక్సిడెంట్లో తీవ్రంగా గాయపడి,హనుమకొండలోని లాస్య హాస్పిటలలో చికిత్స పొందుతున్న పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బొచ్చురమేష్ మరియు వారి కుటుంబ సభ్యులను పరామర్శించన ఎన్ఎస్యూఐ రాష్ట్ర మాజీ కార్యదర్శి,పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు డాక్టర్. మడికొండ శ్రీను.అనంతరం జరిగిన సంఘటన గురుంచి వివరాలు తెలుసుకుని,వారి కుటుంబ సభ్యులు త్వరగా కోలుకోవాలని ఆశాభావం వ్యక్తపరిచారు.
నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దుర్గం సురేష్ గౌడ్ మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని మొట్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గూడూరి రఘుపతి రెడ్డి-అరుణ దంపతుల కుమారుడు గోవర్ధన్ రెడ్డి-కావ్య దంపతుల వివాహ వేడుకలు హన్మకొండ జిల్లాలోని పరకాల పట్టణంలో గల ఎంఎన్ రావు గార్డెన్ లో ఘనంగా జరిగాయి. ఈ వివాహ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన మొగుళ్లపల్లి మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దుర్గం సురేష్ గౌడ్ నూతన వధూవరులకు అక్షింతలు వేసి..ఆశీర్వదించారు. మూడుముళ్ల బంధంతో..ఏడడుగుల అనుబంధంతో ఏకమైన ఈ జంట నిండు నూరేళ్లు పిల్లాపాపలతో, అష్టైశ్వర్యాలతో, సుఖశాంతులతో, పాడి పంటలతో వర్ధిల్లాలని ఆయన కాంక్షించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు తాళ్లపల్లి గోదారి, గట్టు శ్రీకాంత్ తదితరులున్నారు.
జమ్మికుంట లో పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి అన్నదాన కార్యక్రమం బొమ్మల గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన దేశిని కోటి సుంకరి రమేష్ ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తాలో కేక్ కటింగ్ మొక్కలు నాటిన యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బొడిగ శ్రీకాంత్ జమ్మికుంట :నేటిధాత్రి
హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మరియు రవాణా శాఖ మంత్రి ప్రభాకర్58వ పుట్టినరోజు సందర్భంగా దేశిని కోటి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జమ్మికుంట బొమ్మల గుడి శివాలయంలో పొన్నం ప్రభాకర్ పేరున ప్రత్యేకమైన పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది .
Ponnam Prabhakar’s birthday
అలాగే పట్టణంలోని గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుంకరి రమేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది * జమ్మికుంట మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బుడిగే శ్రీకాంత్ ఆధ్వర్యంలో జమ్మికుంట పట్టణంలోని స్థానిక మోత్కల గూడెం ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటి యువజన కాంగ్రెస్ జమ్మికుంట మండల పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు వీరందరూ మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ విద్యార్థి దశలోనే రాజకీయ ప్రవేశం చేసి NSUI రాష్ట్ర అధ్యక్షులుగా కరీంనగర్ పార్లమెంటు సభ్యులుగా ప్రజలకు ఎన్నో రకాల సేవలు అందించారని కొనియాడారు ఈ కార్యక్రమాలలో ఎర్రబెల్లి రాజేశ్వరరావు సుంకరి రమేష్ సాయిన్ రవి జమ్మికుంట మాజీ కౌన్సిలర్ బొంగుని వీరన్న మారపల్లి బిక్షపతి ఎలగందుల స్వరూపా శ్రీహరి పిట్టల శ్వేతా రమేష్ పానుగంటి సారంగం దిడ్డి రామ్మోహన్ కు దాడి రాజన్న గొల్లి పూలమ్మ మొగిలి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట స్వప్న కాంగ్రెస్ నాయకులు పూదరి శివ మరి రామ్ రెడ్డి పందాల అజయ్ ముద్దమల్ల రవి పోతుల శ్రీనివాస్ అశోక్ రాజ్‌కుమార్ శ్రీను యూత్ కాంగ్రెస్ నాయకులు పార్లపల్లి నాగరాజు ఎండి సజ్జు పాతకాల రమేష్ రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు మండల కార్యదర్శులు రవి అజయ్ సేవాదళ్ నియోజకవర్గం అధ్యక్షులు వినోద్ రెడ్డి వార్డుల అధ్యక్షులు నరికే సుమన్ బుల్లి రమేష్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాజ పొనగంటి కుమార్ పొన్నగంటి రాజు గాంధీ యువజన నాయకులు శ్రీకాంత్ శ్రీనివాస్ పాల్గొన్నారు
*వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
* మొగుళ్ళపల్లి నేటిధాత్రి:*
మొగుళ్లపల్లి మండలం పర్లపెల్లి గ్రామంలో జీవనజ్యోతి గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ముఖ్య అతిథులుగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు డిఎం సివిల్ సప్లై చంద్రబోస్ ఎమ్మార్వో సునీత రెడ్డి ఎంపీడీవో సుభాష్ చిట్యాల వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ మహమ్మద్ రఫీ వారితో కలిసి ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు మద్దతు ధర పొందాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకే వరి ధాన్యాన్ని తీసుకురావాలన్నారు దళారులను నమ్మి మోసపోకుండా జాగ్రత్త పడాలని రైతులకు సూచించారు రైతు సంక్షేమం కొరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే అన్నారు అంబాల రవి వర్మ సీసీలు ప్రవీణ్ శ్రీనివాస్ బాపురావు వరి ధాన్యం కొనుగోలు కేంద్రనిర్వహికులు జీవనజ్యోతి గ్రామైక్య సంఘ ఓబీలు మరియు ఎస్ హెచ్ జి సభ్యులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జిల్లా నాయకులు మండల నాయకులు గ్రామపంచాయతీ కార్యదర్శి అమాలి సంఘాలు మహిళా సంఘాలు గ్రామ ప్రజలు రైతులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
అదునపు బకెట్లు అనుమతి ఇస్తేనే క్వారీలు ప్రారంభిస్తాం.
నెలల నుండి డంపింగ్ చేసి ఉన్న లోడింగ్ కు సమీరా అంటున్న కాంట్రాక్టర్ లు.
గత నెల రీచులన్నీ ఆన్లైన్ చేసిన, పట్టించుకోని కాంట్రాక్టర్.
ప్రస్తుతం కొనసాగిస్తున్న ఇసుక రీచ్ లో ఎన్ని అక్రమాలు జరిగిన డోంట్ కేర్.
లోడింగ్ చేయనున్న కాంట్రాక్టర్ పై చర్యలకు బదులు, టీజీఎండిసి తమాషాగా చూస్తుంది.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇసుక పాలసీ కు టీజీఎండిసి తూట్లు పొడుస్తుంది.
మహాదేవపూర్ -నేటి ధాత్రి:
ఇసుక అక్రమాలు ఇసుక క్వారీల నిర్వహణ విషయంలో టి జి ఎం డి సి అధికారులు ప్రభుత్వ ఆదేశాలను అమలుపరిచాల్సింది పోయి, కాంట్రాక్టర్లకు వారు చెప్పిందే వేదం అంటూ సై అంటున్నారు. మండలంలో ఇసుక క్వారీల నిర్వహణ, విషయంలో టి జి ఎం డి సి, అధికారులు, నూతన ఇసుక పాలసీని అమలు పరిచాల్సింది పోయి, పాలసీ యొక్క విధానాలను తూట్లు పొడుస్తున్నారు, ఇసుక రీచుల్లో అక్రమ వసూళ్లకు, ప్రత్యక్షంగా కాంట్రాక్టర్లకు సహకరిస్తూ కాంట్రాక్టర్ల సూపర్వైజర్లతో సమానంగా టీజీఎండిసి సిబ్బంది, వసూళ్లు చేసి ఇవ్వడం, శరమాములుగా కొనసాగుతుంది. మరోవైపు దర్జాగా కాంట్రాక్టర్ సిబ్బంది ప్రతి లారీ వద్ద సీరియల్ నంబర్ పాసింగ్ లోడింగ్ లాంటి పేర్లతో వేల రూపాయలను దండుకోవడం జరుగుతుంటే, అధికారులు తమకేమీ తెలువది అనే విధంగా వ్యవహరించడం జరుగుతుంది. అంతేకాకుండా కొత్త ఇసుక రీచుల ప్రారంభం విషయంలో, టీజీఎండిసి అధికారులు ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయాల్సింది పోయి, కాంట్రాక్టర్ల వెసులుబాటు అక్రమ సంపాదనకు మొగ్గు చూపుతూ వారు చెప్పింది వేదం అంటూ కాంట్రాక్టర్ల గుప్పిట్లో టీజీఎండిసి అధికారులు, కొత్త రీచుల ప్రారంభం ఇసుక రీచుల్లో ఇసుక డంపింగ్ చేసి ఉన్నప్పటికీ లోడింగ్ కై ఆదేశాలు జారీ చేసే సత్తా లేకుండా పోయింది. దీనికి సాక్షాలు మండలంలో అనేక ఇసుక రీచుల్లో డంపింగ్ చేసి ఉన్న ఇసుక కుప్పలు సాక్ష్యం.
TGMDC
కాంట్రాక్టర్ల గుప్పిట్లో టీజీఎండిసి.
ప్రజల సొమ్ముతో జీతం తీసుకుంటున్న టీజీఎండిసి ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కి, ఇసుక కాంట్రాక్టర్ల గుప్పిట్లో కీలుబొమ్మలా మారి, అక్రమ వసూళ్ల వ్యవహారం పై నిశ్శబ్దాన్ని పాటిస్తూ, కొత్త ఇసుక రీచుల ప్రారంభం విషయంలో, కాంట్రాక్టర్లకు వెసులుబాటు అక్రమ వసూళ్లు అదనపు బకెట్ల వ్యవహారం ప్రారంభం కై ,టి జి ఎం డి సి, పై ఒత్తిళ్లు, చీకటి ఒప్పందాలకు వేచి చూస్తూ, ప్రస్తుత అదనపు వసూళ్ల వ్యవహారంతో ఇసుక కాంట్రాక్టర్లకు, కడుపు నిందడం లేదని, అదునపు బకెట్లు 2500 నుండి 5000 వరకు రెండు బకెట్లు వేస్తేనే తమ కడుపు నిండుతుందని, కాంట్రాక్టర్ల విన్నపం మేరకు టీజీఎండిసి కాంట్రాక్టర్ల చేతిలో కీలుబొమ్మగా మారి, కొత్త ఇసుక క్వారీల ప్రారంభం చేపట్టాల్సింది పోయి, సుమారు నాలుగు నెలల నుండి, కాంట్రాక్ట్ దక్కించుకున్న ఇసుక కాంట్రాక్టర్లు, ఇప్పటికీ కేటాయించిన గ్రామాల్లో భూముల కొనుగోళ్ల విషయం పేరుతో, కాలయాపన చేయడం, మరోవైపు కొన్ని ఇసుక రీచ్ లు ఇప్పటికే డంపింగ్ చేసి ఉన్నప్పటికీ, ఆ రీచ్ ల నుండి ఇసుక రవాణా చేయించకపోవడం, వెనుక దాగి ఉన్న రహస్యం, అదనపు బకెట్ కు అనుమతి ఇస్తేనే, ఇసుక రీచులన్నీ పెద్ద మొత్తంలో ప్రారంభించడం జరుగుతుందని, టి జి ఎం డి సి కు కాంట్రాక్టర్లు వివరించడం జరిగింది అని అందుకే కొత్త ఇసుక క్వారీల ప్రారంభం డంపింగ్ చేసిన ఇసుక రీచుల నుండి రవాణాకు ఆలస్యం చేయడం జరుగుతుంది.
TGMDC
నెలల నుండి డంపింగ్ చేసి ఉన్న లోడింగ్ కు సమీరా అంటున్న కాంట్రాక్టర్ లు.
మేడిగడ్డ బ్యారేజ్ పరిధిలో 14 ఇసుక రీచులకు 2014 సంవత్సరంలో 14 ఇసుక రీచులకు టెండర్ వేయడం జరిగింది. 14 క్వారీలు కూడా టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఆగస్టు 2014 నాటికి తమ కాంట్రాక్టర్ అగ్రిమెంట్లు పూర్తి చేసుకోవడం జరిగింది. కానీ వీటిలో కేవలం రెండు ఇసుక క్వారీలు మాత్రం ఇసుక రవాణా చేయడం జరుగుతుంది. మిగతా 12 ఇసుక రీచ్ లు వాటిలో మహాదేవపూర్ ఒకటి, రెండు, మూడు ,నాలుగు, బొమ్మ పూర్ పేరుతో నాలుగు, బ్రాహ్మణ పెళ్లి పేరుతో రెండు,ఎల్కేశ్వరం పేరుతో రెండు, బెంగులూర్, పేరుతో ఒకటి, వీటిలో సుమారు నాలుగు క్వారీలు డంపింగ్ పూర్తిచేసుకుని నెలలు గడుస్తున్నప్పటికీ, ఇసుక రవాణా చేయడానికి ససేమీరా అంటున్నారు కాంట్రాక్టర్, అలాగే మిగితా 8 ఇసుక రీచ్‌లు, ఇప్పటివరకు భూమి పేరుతో కాలయాపన చేయడం జరుగుతుంది. ఇలా ఇప్పటికి సంవత్సర కాలం పూర్తి చేసుకున్నప్పటికీ, ఇసుక క్వారీలు నిర్వహించకపోవడం, కాంట్రాక్టర్లపై టీజీఎండిసి తక్షణ చర్యలు తీసుకొని, ఇతరులకు కాంట్రాక్ట్ అప్పజెప్పి ఇసుక రవాణా చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ, టీజీఎండిసి కేవలం కాంట్రాక్టర్ల కొరకు శాఖ పని చేస్తుందనే విధంగా నేటి వరకు, గత సంవత్సరం, జూన్‌లో టెండర్ ప్రక్రియ ప్రారంభమై జూలై నాటికి అగ్రిమెంట్ పూర్తి చేసుకున్నప్పటికీ, నేటికి ఇసుక రవాణా కొనసాగడం జరగలేదంటే, టీజీఎండిసి నిర్లక్ష్యంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడినట్టా కాదా. కాంట్రాక్టర్లకు టీజీఎండిసి పరోక్షంగా సహకరిస్తుందని స్పష్టంగా కనబడుతుంది.
TGMDC
గత నెల రీచులన్నీ ఆన్లైన్ చేసిన, పట్టించుకోని కాంట్రాక్టర్.
ఇక టీజీఎండిసి పరిస్థితి ఎంత ఘోరంగా మారిందంటే, టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ల ఇసుక క్వారీల పేర్లను టీజీఎండిసి గత నెల 16వ తేదీ నుండి 30వ తేదీ వరకు సుమారు 15 రోజులు,ఆరు రిచులపేర్లు ఆన్లైన్లో పెట్టడం జరిగింది. కానీ కాంట్రాక్టర్లు ఎవరు కూడా టీఎస్ఎండిసిని పట్టించుకోకపోవడంతో టీజీఎండిసి ఇసుక రీచుల పేర్లను ఆన్లైన్ లో పెట్టడం నిలిపివేసింది. టీజీఎండిసి ఆన్లైన్లో పెట్టిన ఇసుక రీచుల పేర్లు ఇవే, మహాదేవపూర్ ఒక్కటి, ఎలికేశ్వరం ఒక్కటి, బొబ్బాపూర్ రెండు, బొమ్మపూర్ 3, బొమ్మపూర్ నాలుగు, మహాదేవపూర్ నాలుగు, టీజీ ఎంబీసీ అధికారుల ఆదేశాలు కాంట్రాక్టర్ల వద్ద ఎంత విలువతో ఉన్నాయో దీన్నిబట్టి అర్థమవుతుంది. మహాదేవపూర్ వన్ క్వారీలో ఇసుక నాలుగు నెలల నుండి స్టోర్ ఉన్నప్పటికీ రవాణాకు టీఎస్ ఎండిసీ ఆదేశాలకు రిజెక్ట్ చేసిన కాంట్రాక్టర్, మరోవైపు ప్రస్తుతం కొనసాగుతున్న పలువుల ఎనిమిది ,పలుగుల తొమ్మిది, మహాదేవపూర్ పుసుపుపల్లి, ఇసుక రిచుల్లో ఇసుక అక్రమాల వ్యవహారం అక్రమ వసూళ్ల దందా, మూడు పూలు ఆరు కాయలుగా కొనసాగుతున్నప్పటికీ, టీజీఎండిసి అధికారులకు వాటిపై చర్యలకు ధైర్యం లేకుండా పోయింది. ఇప్పటికీ ఇసుక రీచ్ లో స్టాక్ చేసి ఉన్న ఇసుక రవాణాకు ఆదేశాలు ఇవ్వాల్సిన టిజిఎండిసి ఇసుక కుప్పలను తమాషాగా చూస్తుంది. మరోవైపు ఇప్పటికే ప్రారంభించి సగానికి పై ఇసుక క్వాంటిటీని రవాణా చేయాల్సిన టి జి ఎం డి సి, కేవలం కాంట్రాక్టర్లకు అక్రమ సొమ్మును దోచిపెట్టడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న అధికారులవ్యవహారం, ప్రభుత్వ నూతన ఇసుక పాలసీ విధానానికి తూట్లు పొడుస్తూ, కేవలం కాంట్రాక్టర్ల వద్ద మెప్పు పొంది అక్రమ సొమ్ము కాంట్రాక్టర్లతో పాటు తాము కూడా పోగు చేసుకుందామని ఒక చీకటి ఒప్పంద లక్ష్యంగా అడుగులు వేయడం జరుగుతుందని స్పష్టంగా కనబడుతుంది. ఇలా టీజీఎండిసి వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వానికి వంద శాతం చెడ్డ పేరు తెచ్చే విధంగా వ్యవహరిస్తుందని ఇప్పటికే ఇసుక రీచుల్లో అక్రమ వసూళ్ల వ్యవహారంతో టీజీఎండిసి బండారం బయటపడడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం టీజీఎండిసి కింది స్థాయి నుండి ఉన్నత అధికారి వరకు తక్షణమే ఇసుక రీచులు ఇప్పటివరకే ప్రారంభించకుండా ఉండడానికి కారణం, ప్రస్తుతం కొనసాగుతున్న ఇసుక రీచ్ లో అక్రమాల వ్యవహారంపై విచారణకు ఆదేశించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వివిధ వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను. ఆశీర్వదించిన స్థానిక శాసనసభ్యులు మాణిక్ రావు, సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ ,డిసిఎన్ఎస్ చైర్మన్ శివ కుమార్,మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప, మాజి ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్ ,జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, న్యాల్కల్ మండల పార్టీ అధ్యక్షులు రవీందర్,మాజి కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయ చైర్మన్ నీల వెంకటేశం ,పాక్స్ చైర్మన్ మచ్చెందర్ గారు, మాజి మున్సిపల్ చైర్మన్ తంజిం, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు బండి మోహన్ , మాజి సర్పంచ్ లు ,ఎంపీటీసీ లు ,గ్రామ పార్టీ అధ్యక్షులు తదితరులు.
ఝరాసంగం మండలంలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి దేవాలయానికి బుధవారం కుటుంబ సమేతంగా సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ దర్శించుకున్నారు. ముందుగా ఆలయ రాజగోపురం ముందు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం ఆలయ గర్భగుడిలోని పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి కి రుద్రాభిషేకం నిర్వహించారు.ఆలయ ఆవరణలోని అమృత గుండంలో జల లింగానికి ప్రత్యేక పూజలు చేసి గుండం పూజా నిర్వహించారు. ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదములు అందజేశారు. ఆలయ కార్య నిర్వహణ అధికారి శివ రుద్రప్ప పూలమాల శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ నరేష్, ఆలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.
మంచిర్యాల జిల్లాలోని ముల్కల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న సమ్మర్ క్యాంప్ విద్యార్థులకు షీ టీం సభ్యులు అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా షీ టీం సభ్యులు మాట్లాడుతూ… ఆకతాయిల ఆట కట్టించి మహిళలకు రక్షణ కల్పించేది షి టీం కర్తవ్యం అని, మహిళలు ఏదైనా సమస్య వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని,అలాగే సైబర్ నేరాల గురించి అవగాహన కల్పిస్తూ వచ్చిన ఫిర్యాదు పై తక్షణమే షీ టీం పోలీసులు స్పందించి సంబంధిత విభాగాలకు సమాచారం అందజేయడం ద్వారా ఫిర్యాదు చేసిన మహిళకు షీ టీం బృందాలు సహాయం చేస్తాయని తెలిపారు.ఆకతాయిల నుండి మరి ఏ ఇతర వేధింపులకు గురవుతున్న మహిళలు ఫిర్యాదు చేయాలనుకుంటే 6303923700 నెంబర్ సంప్రదించాలని కోరారు. అలాగే అత్యవసర సమయంలో డయల్ 100 కి ఫిర్యాదు చేయాలన్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జి షీ టీం సభ్యులు శ్రవణ్,జ్యోతి,శ్రీలత, విద్యార్థులు,టీచర్స్ పాల్గొన్నారు.
శుభకార్యాలలో పాల్గొన్న మాజీ జెడ్పిటిసి జోరుక సదయ్య మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
భూపాలపల్లి జిల్లామొగుళ్లపల్లి మండలంలో ని మోట్లపల్లి గ్రామ వాస్తవ్యులు గూడూరి రఘుపతి రెడ్డి -అరుణ దంపతుల కుమారుడు గోవర్ధన్ రెడ్డి వెడ్స్ కావ్య రెడ్డి (m.n రావు గార్డెన్ పరకాల) గార్ల వివాహ మహోత్సవంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు
పెద్ద కోమటిపల్లి గ్రామ బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు దురిశెట్టి సంపత్_ సప్న గార్ల కుమార్తె శరణ్య గారి నూతన ఫల పుష్ప అలంకరణ కార్యక్రమ0లో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన *మాజీ జెడ్పిటిసి జోరుక సదయ్య *
జహీరాబాద్ ఆర్డీవో రామ్ రెడ్డిని రైతు హక్కుల సాధన సమితి సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చిట్టెంపల్లి బాలరాజ్ మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. రైతుకు భూ భారతి చట్టంపై అవగాహన, ఉండేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. రైతు సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ.. రైతు సమస్యలు త్వరగా పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నేతలు, తదితరులు పాల్గొన్నారు.
భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తానీలును బహిష్కరించాలని
జహీరాబాద్ నేటి ధాత్రి:
భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు వైద్యనాథ్ ఆధ్వర్యంలో కోహిర్ మండల ఎంఆర్ఓ గారికి మరియు కోహిర్ మండల పిఎస్ ఎస్ఐ గారికి మెమొరండం ఇవ్వడం జరిగింది.భారతదేశంలో అక్రమంగా పాకిస్తానీ జాతీయలను మరియు ఉగ్రవాదులను వెంటనే భారతదేశం నుండి బహిష్కరించాలని భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిని మరియు సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు పెడుతున్న వారిని దేశద్రోహ చట్టం కింద కేసులు నమోదు చేయాలని కోరడం జరిగింది. ఇందులో మండల అధ్యక్షులు వైద్యనాథ్ మరియు ఓబిసి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కిష్టన్న, సీనియర్ నాయకులు నర్సింలు, సతీష్ రెడ్డి, నాగరాజు, వంశ వర్ధన్ రెడ్డి, వంశీ, మహేందర్ రెడ్డి, శ్రీకాంత్, శివకుమార్, ఈశ్వర్ యాదవ్, శ్రీనివాస్, శ్రీశైలం, దశరథ్ రెడ్డి, తదితరులు పాల్గొనడం జరిగింది.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.