బెంగాల్‌లో హిందువులకు రక్షణ కరవు

అల్లరిమూకల దాడుల్లో ప్రాణాలు అరచేతపట్టుకొని పారిపోయిన హిందువులు

మైనారిటీలకు రక్షణగా వుంటానన్న మమతా బెనర్జీ

అధికారం తప్ప బాధితుల గోడుపట్టని ప్రభుత్వం

హింసకు కారణమైనవారికి అండగా వుండటం ఎంతవరకు న్యాయం?

కేంద్ర బలగాలు వస్తే తప్ప పరిస్థితి అదుపులోకి రాలేదు

బెంగాల్‌లో సమన్యాయం ఎక్కడ? కేవలం మైనారిటీ న్యాయం తప్ప!!

డెస్క్‌,నేటిధాత్రి: 

హింసాత్మక రాజకీయాలకు, అరాచకానికి మారుపేరుగా పశ్చిమబెంగాల్‌ తయారైంది. వక్ఫ్‌బిల్లును పార్లమెంట్‌ ఆమోదించి, రాష్ట్రపతి ఆమోదముద్ర పడిన తర్వాత ఏప్రిల్‌ 8నుంచి అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్‌లో ముర్షిరాబాద్‌ జిల్లాలో ముస్లిం మెజారిటీలుగా వున్న షం షేర్‌గంజ్‌, సుతి ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగాయి. వాహనాలు, దుకాణాలు, ఇళ్లను యదేచ్ఛగా తగులబెట్టారు. రాళ్లు రువ్వడంతో కొందరు పోలీసులు గాయపడ్డారు. హిందువుల ఇళ్లపై యదేచ్ఛగా దాడులు జరగడంతో సుమారు 300 కుటుంబాలు పొరుగునే వున్న మాల్డా ప్రాంతానికి పారిపోయాయి. వీరంతా బైష్ణవ్‌నగర్‌లోని పర్లాల్‌పూర్‌ హైస్కూల్‌లో ఆశ్రయం పొందుతున్నారు. ధూలియాన్‌ ప్రాంతానికి చెందిన చాలామంది భాగీరథి నదిలో పడవల ద్వారా బైష్ణవ్‌నగర్‌కుపారిపోయారు. అల్లరిమూకలు తాగునీటి ట్యాంకుల్లో విషం కలపడమే కాకుండా, పురుషులను చితకబాది, మహిళలను వేధింపులకు గురిచేయడమే కాదు తక్షణమే ఈ ప్రాంతం నుంచి వెళ్లి పోవాలని డిమాండ్‌ చేయడంతో ప్రాణాలు అరచేతపట్టుకొని పారిపోవాల్సి వచ్చిందని ధూలియాన్‌ ప్రాంత వాసులు చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. మరికొందరు పక్క రాష్ట్రమైన రaార్ఖండ్‌కు పారిపోయారు. షంషేర్‌గంజ్‌లో ఒక కుటుంబానికి చెందిన హరగోవింద్‌ దాస్‌ అనే 72ఏళ్ల వృద్ధుడు, ఆయన కుమారుడు చరణ్‌దాస్‌ (40)లను బయటకు ఈడ్చుకువచ్చి హతమార్చినట్టు వార్తలు వచ్చాయి. వీరి కుటుంబ సభ్యులను చితకబాదారు. ఈ దారుణంపై పోలీసులు ఎటువంటి వ్యాఖ్య చేయకపోవడంగమనార్హం. అల్లర్లకు పాల్పడుతున్న మూకలపై పోలీసులు కాల్పులు జరిపిన ప్పుడు ఇజాజ్‌ అహ్మద్‌ (25) అనే యువకుడు గాయపడ్డట్టు అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ (శాంతిభద్రతలు) జావెత్‌ షమీమ్‌ తెలిపారు. ఇతడిని ఆసుపత్రి లో చేర్పించగా చికిత్స పొందుతూ మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు.

పార్లమెంట్‌ ఆమోదం పొందిన వక్ఫ్‌బిల్లుపై రాష్ట్రపతి ఏప్రిల్‌ 5న సంతకం చేసిన తర్వాత, నాలుగు రోజులకు అంటే 8వ తేదీన ముర్షిరాబాద్‌లో అల్లర్లు జరిగినా పోలీసులు వాటిని అదుపులోకి తెచ్చారు. తర్వాత ఏప్రిల్‌ 11న ఒక ప్రదర్శన సందర్భంగా అల్లర్లు ప్రారంభమై విధ్వంసకాండ చెలరేగింది. హిందువుల ఆస్తులు యదేచ్ఛగా లూటీలు చేయడమే కాకుండా వారి దుకాణాలను, వాహనాలను అల్లరిమూకలు తగులబెట్టాయి. గత శనివారం కలకత్తా హైకోర్టు కేంద్రబలగాలనురంగంలోకి దించాలని ఆదేశించడంతో, వాటి ప్రవేశం తర్వాత అల్లర్లు అదుపులోకి వచ్చాయి. ఈ విధ్వంసకాండ నేపథ్యంలో కోల్‌కతాలో బీజేపీ నేతృత్వంలో పెద్ద నిరసన ర్యాలీ జరిగింది. మమతా బెనర్జీ తక్షణమే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని, రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ నేతలు డిమాండ్‌ చేశారు. హిందువులపై దాడులు, వారి ఆస్తుల లూటీలు జరిగాయని ఈ విధ్వంసకాండపై నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీతో విచారణ జరపాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుసుకాంత ముజందార్‌ డిమాండ్‌ చేశారు. ఇక తృణమూల్‌ కాంగ్రెస్‌ ‘‘బంగ్లాదేశ్‌ నుంచి అల్లరి మూకలను కావాలనే ఇక్కడికి రప్పించి బీజేపీ ఈ విధ్వంసరచన చేసిందని, ఈ అల్లరి మూకలు తిరిగి బంగ్లాదేశ్‌కు పారిపోయాయంటూ’’ ఆరోపించింది. శాంతిభద్రతలను కాపాడటంలో విఫలమైంది కాకుండా, ఈవిధంగా ఆరోపించడం తృణమూల్‌ కాంగ్రెస్‌కే చెల్లింది. ఇదిలావుండగా పరూలియా బీజేపీ ఎం.పి. జ్యోతిర్మయి సింగ్‌ మహతో కేంద్ర మంత్రి అమిత్‌షాకు ఒక లేఖ రాశారు. ఇందులో ఆమె పశ్చిమ బెంగాల్‌లోని ఐదు జిల్లాల్లో సాయుధ దళాల ప్రత్యేక అధికార చట్టాన్ని అమల్లోకి తేవాలని కోరారు. సీనియర్‌ బీజేపీ నేత సుబేందు అధికారి మాట్లాడుతూ తృణ మూల్‌ కాంగ్రెస్‌ పాలనలో రాడికల్‌ మూకలు రెచ్చిపోతున్నాయని, ముర్షిరాబాద్‌ జిల్లా ఇప్పుడు వీరి హింసాకాండకు సాక్ష్యంగా నిలిచిందన్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ అనుసరిస్తున్న మితిమీరిన బుజ్జగింపు రాజకీయాలు హిందువులకు ప్రాణసంకటంగా మారిందన్నారు. అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలున్నాయా? అంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ముర్షిదాబాద్‌ జిల్లాలో ప్రాణా లు అరచేత పట్టుకొని పారిపోతున్న ప్రజల ఫోటోలను ఆయన ప్రదర్శించారు. అయితే బీజేపీ చూపిస్తున్నవన్నీ ఫేక్‌ ఫోటోలంటూ తృణమూల్‌ రాజ్యసభ ఎం.పి. సాగర్‌ ఘోష్‌ ఆరోపించారు.

అరాచకానికి కూడా ఒక హద్దుంటుంది. మమతా బెనర్జీ పాలనలో ఆ హద్దులు కూడా చెరిపేసినట్టు వర్తమాన పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. వక్ఫ్‌ బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేసిన తర్వాత నాలుగు రోజులకు అల్లర్లు చెలరేగాయంటే దీని అర్థం ఏమిటి? ఇప్పటికే సర్వభ్రష్ఠ పాలనతో రాష్ట్రాన్ని అధోగతి పాల్జేసిన మమతాబెనర్జీ ఇంకా తన పదవీకాంక్షకోసం మరెంతమంది హిందువుల ఉసుర్లు తీసుకుంటారనేది ప్రశ్న. హింసకు పాల్పడిన మూకలను అదుపులోకి తీసుకురాక పోగా, వక్ఫ్‌బిల్లును రాష్ట్రంలో అమలు చేయనని, మైనారిటీలకు రక్షణగా వుంటానని ప్రకటించా రంటే మమతా బెనర్జీని ఏమనుకోవాలి? ఒకపక్క వందలాది హిందూ కుటుంబాలు ప్రాణాలు అరచేతపట్టుకొని స్వస్థలాలను వదిలేసి పారిపోతే, బాధితులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం, ఏకంగా అల్లర్లకు కారకులైనవారికి అండగా నిలవడమేంటి? రాజకీయంగా అభిప్రాయ భేదాలుం టే రాజకీయంగానే పరిష్కరించుకోవాలి తప్ప, హిందువులు బలిపశువులవుతున్నా పట్టించుకోని మమతా బెనర్జీ వైఖరి ఖండనార్హం. కేంద్ర బలగాలు వస్తే తప్ప అల్లర్లు సర్దుమణగలేదంటే, అల్లరి మూకలకు ప్రభుత్వం అండగా వున్నట్టేగా అర్థం? ఓట్లకోసం, అధికారం కోసం అమాయక హిందువులను బలి తీసుకోవడమేంటి? ఇంత జరిగినా బాధితులకు అండగా వుంటామన్న ఒక్క ప్రకటన కూడా మమతా బెనర్జీ నోటివెంట రాకపోవడం ఎంత విచిత్రం? పశ్చిమ బెంగాల్‌లో అసలు ప్రభుత్వం ఎవరికోసం పనిచేస్తున్నది? ఇటీవల యు.పి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ఒక సందర్భంలో మాట్లాడుతూ ‘‘వందమంది ముస్లింల మధ్య 50మంది హిందువులు బతకగలరా?’’ అని ప్రశ్నించారు. కుహనా సెక్యులర్‌ వాదులు దీనిపై నానా రాద్ధాంతం చేశారు. మరిప్పుడు బెంగాల్‌లో జరుగుతున్నదేంటి? దీనిపై ఒక్కరూ నోరు మెదపరు. మీడియా కూడా పెద్దగా ప్రాధాన్యం ఇవ్వదు. ఎందుకంటే బాధితులు హిందువులు కదా! అదే ఏ ఒక్క ముస్లిం బాధపడి నా ప్రపంచమంతా కొట్టుకుపోయినంత రాద్ధాంతం చేస్తారు! అందరూ మనుషులే! అందరి ప్రా ణాలు సమానమే. దేశంలో ఎక్కడాలేని గొడవలు కేవలం పశ్చిమ బెంగాల్‌లోనే…అది కూడా బంగ్లాదేశ్‌ సరిహద్దులో వున్న ముర్షిరాబాద్‌ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఎందుకు జరుగుతున్నాయి? వ్యవసాయ బిల్లుల విషయంలో కేవలం పంజాబ్‌, హర్యానాలకు చెందిన ‘రైతులమని చెప్పుకుంటున్నవారు’ ఆందోళనకు దిగారు. మిగిలిన రాష్ట్రాల్లో ఎక్కడా వీటిపై గొడవ జరగలేదు. ఎందుకంటే రైతులకు ఈ చట్టాలవల్ల కలిగే ప్రయోజనం తెలుసు. కానీ పంజాబ్‌, హర్యానాల్లోని దళారీలు ఇంతటి అల్లర్లకు బాధ్యులు. చివరకు ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను ఉపసం హరించుకుంది. కానీ నష్టపోయింది రైతులు, ప్రయోజనం పొందింది దళారీలు. ఇప్పుడు పశ్చి మ బెంగాల్‌లో అల్లర్లు, విధ్వంసకాండకు పాల్పడినవారికి పూర్తి రక్షణ, బుజ్జగింపులు కాగా హిందువులకు మాత్రం కష్టాలు, కన్నీళ్లు! ఈ ప్రాంతాల్లో స్వస్థలాల్లోనే హిందువులు బతకలేని పరిస్థితినెలకొంటే, ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు?

తృణమూల్‌ కాంగ్రెస్‌లో ఇటీవల బయల్పడిన విభేదాల నేపథ్యంలో, పార్టీపై మమతా బెనర్జీ క్ర మంగా పట్టు కోల్పోతున్నారన్న అనుమానాలు పొడచూపాయి. బీజేపీ క్రమంగా బలపడుతూ, తృణమూల్‌పై ఎప్పటికప్పుడు పైచేయి సాధిస్తున్న తరుణంలో, ప్రజల దృష్టిని మరల్చడానికే ఈ అ లర్లను సృష్టించారా? అన్నది తేలాలి. మెజారిటీ ప్రజల మనోవేదన, ఆక్రందనల నేపథ్యంలో వ చ్చే అధికారం ఆనందాన్నిస్తుందా? ప్రస్తుతం బెంగాల్‌ వాతావరణం చూస్తుంటే, ఒకప్పుడు కశ్మీర్‌ లో హిందువులు అనుభవించిన దుర్భర పరిస్థితులు గుర్తొస్తున్నాయి. బుజ్జగింపు రాజకీయాలు పరాకాష్టకు చేరి, దాల్చిన వికృతరూపానికి బెంగాల్‌ ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తోంది.

అంబెడ్కర్ జయంతి వేడుకలు. 

సిరిసిల్ల జిల్లా సాహితీ సమితి ఆధ్వర్యంలో అంబెడ్కర్ జయంతి వేడుకలు. 

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

 

రాజన్న సిరిసిల్ల జిల్లా సాహితి సమితి అధ్యక్షులు డాక్టర్ జనపాల శంకరయ్య అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్ కార్య నిర్వహణలో లక్ష్మణ్ ప్రింటర్స్ లో 11 గంటలకు అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి .అధ్యక్షులు డాక్టర్ జనపాల శంకరయ్య మాట్లాడుతూ భారతరత్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజ్యాంగ రచనల్లో ప్రధాన పాత్ర వహించిన డాక్టర్ అంబేద్కర్ సేవలు ఎనలేనివి. దేశ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి అందరికీ ఆమోదయోగ్యమైన రాజ్యాంగ రచన చేసిన భారతరత్న బాటలో అందరం కలసి నడుద్దాం అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్, సహధ్యక్షులు కోడం నారాయణ, ఉపాధ్యక్షులు బూర దేవానందం, ముడారి సాయి మహేష్, గుండెల్ని వంశీ, దొంత దేవదాసు ,సిరిసిల్ల తిరుపతి, అంకారపు రవి కవులు, రచయితలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అంబేద్కర్ జయంతి వేడుకలు. 

దీక్షకుంటలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. 
నెక్కొండ,నేటిధాత్రి:*

నెక్కొండ మండలం దీక్షకుంట గ్రామంలో మాల మహానాడు ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించుకున్నారు.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన సందర్భంగా నెక్కొండ మండల మాల మహానాడు కన్వీనర్, కో కన్వీనర్ కారు కరుణాకర్, పోనగంటి స్వామిరావు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారతదేశానికి చేసిన సేవలు మర్చిపోకుండా ఆయన ప్రజలు ఆయనను దేవుడని కొలవాలని భారత రాజ్యాంగం నిర్మాణం కోసం ఆయన ఎన్నో త్యాగాలను చేసి బడుగు బలహీన వర్గాలకు కొరకు అహర్నిశలు కృషి చేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు.ఆయన జయంతిని ప్రపంచవ్యాప్తంగా పండుగలాగా బడుగు బలహీన వర్గాల ప్రజలు మేధావులు అంగరంగ వైభవంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను జరుపుకోవాలని వారు కొనియాడారు ఈ కార్యక్రమంలో జామండ్ల రంజిత్, కారు అనిల్, బొల్లెపల్లి విష్ణు, చీర కుమారస్వామి, సర్కిల్ రవి, చీపురు భాస్కర్, పోనకంటి ప్రశాంత్, పులి సుధాకర్, దునకన రఘుపతి, చీపురు స్వామి, తదితరులు పాల్గొన్నారు.

సామాజిక ఉద్యమ కెరటం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్

సామాజిక ఉద్యమ కెరటం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్

ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్

ఎంసిపిఐ(యు) ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సామాజిక ఉద్యమ కెరటం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ అని ఆయన స్ఫూర్తితో భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకొని దేశాన్ని కాపాడుకోవాలని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అన్నారు.భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ 134వ జయంతి సందర్భంగా ఎంసిపిఐ(యు) ఆధ్వర్యంలో స్థానిక ఓంకార్ భవన్ లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళిలర్పించారు.ఈ సందర్భంగా పెద్దారపు రమేష్ మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశాన్ని మతం భాషా ప్రాంతం పేరుతో విచ్ఛిన్నం చేసి అధికారాన్ని కాపాడుకునేందుకు దోపిడి పాలకులు నిరంతరం ప్రయత్నిస్తున్నారని ఈ క్రమంలో అన్ని వర్గాలకు సమన్యాయం కోసం ఏర్పాటుచేసిన భారత రాజ్యాంగాన్ని సైతం మార్చేందుకు బిజెపి మతోన్మాద పాలకులు ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఎన్నో కలలుకని దేశాన్ని సామాజికంగా ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాజ్యాంగాన్ని రచిస్తే అందు విరుద్ధంగా పాలకులు వివరిస్తూ అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారని అలాంటి వారే మళ్లీ అంబేద్కర్ పేరు జపం చేయడం సిగ్గుచేటు అన్నారు. అంబేద్కర్ ఆశయాలను భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు గోనె కుమారస్వామి హన్మకొండ జిల్లా కార్యదర్శి ఎన్ రెడ్డి హంసారెడ్డి రాష్ట్ర నాయకులు మందరవి జిల్లా సహాయ కార్యదర్శి నర్ర ప్రతాప్ రాష్ట్ర జిల్లా నాయకులు సుంచు జగదీశ్వర్ చంద్రయ్య రాజిరెడ్డి కొమురయ్య సావిత్రి నాగేష్ ఉదయ రవి మల్లికార్జున్ నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళులు.

రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళులు.

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామంలో గల గ్రామ పంచాయితీ కార్యదర్శి శ్రావణకుమారి ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళులు అర్పించారు.అంబేద్కర్ 135 వ జయంతికి పురస్కరించుకొని గ్రామ పంచాయితీ కార్యాలయం వద్ద వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పెద్ది శ్రీనివాస్ రెడ్డి,అంగన్వాడి టీచర్ జహీరబేగం,మాజీ ఉప సర్పంచ్ బరిగెల భక్కయ్య,గ్రామస్తులు ఎల్లారెడ్డి, ఉప్పుల ఐలయ్య,రాజు,తదితరులు పాల్గొన్నారు. 

అంబేద్కర్ ఆలోచనలే దేశానికి ఆదర్శం.

అంబేద్కర్ ఆలోచనలే దేశానికి ఆదర్శం

కాంగ్రెస్ పార్టీ నాయకులు మంతెన సమ్మయ్య

జైపూర్,నేటి ధాత్రి:

 

భీమారం మండల కేంద్రంలోని ఆవడం ఎక్స్ రోడ్ చౌరస్తాలో సోమవారం ఘనంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మంతెన సంపత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా మంతెన సమ్మయ్య మాట్లాడుతూ మూడు సంవత్సరాల నుంచి అంబేద్కర్ విగ్రహం స్థాపన కొరకు ఆరట పడుతున్నామని చెన్నూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి విన్నవించారు.అంబేద్కర్ ఆలోచనలే దేశానికి ఆదర్శమని,సమాజంలోని అసమానతలు దురహంకారం పై అలుపెరుగని పోరాట యోధుడు,సమ సమాజ స్వప్నికుడు.దళిత బహుజన వర్గాల ఆశాజ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు.భారత రాజ్యాంగ రూపకర్త జాతీయవాది అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు అన్ని గ్రామాలలో ఘనంగా జరుపుకోవడం జరిగింది.అంబేద్కర్ ఏ ఒకరికి, ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదని సమాజంలోని ప్రజలందరీ వాడని ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగం రాసిన వ్యక్తి ప్రజల హక్కులను కాపాడిన మహోన్నత వ్యక్తి అని అన్నారు.తన జీవితమంతా అణగారిన వర్గాల అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేసిన మహోన్నత వ్యక్తి జాతీయ ఉద్యమంలో అంబేద్కర్ తన జీవితంలో చిన్నప్పటి నుంచి సమాజం ఎన్నో అవమానాలు ఎదురైన వేను తిరగక వాటిని ధైర్యంగా ఎదుర్కొని తన కృషితో కేంద్ర మంత్రి పదవి పొందారు.అంబేద్కర్ జీవిత కాలంలో అనేక సబ్జెక్టులలో 32 డిగ్రీలు పొంది గౌరవ డాక్టరేట్ పట్టాలు పొందిన భారతీయుడుగా నిలిచారన్నారు.విద్యాభ్యాసం తర్వాత ఆర్థికవేత్తగా,ప్రొఫెసర్ గా,న్యాయవాదిగా కొనసాగారు.స్వతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగం రాసి పేద వర్గాలకు అండగా నిలబడిన వ్యక్తి అంబేద్కర్ తన జీవిత చివరన బుద్ధుని బోధనలు నచ్చి బౌధమతం స్వీకరించారు.మహిళా హక్కులు,కార్మికుల హక్కులు ఇతర అన్ని వర్గాల పేద ప్రజల కోసం తన జీవితకాలం పోరాటం చేసిన మహోన్నత వ్యక్తిగా ఈ సమాజం చూడాలని ఎవరు తక్కువ చేసి చూడకూడదని సూచించారు.చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో భీమారం మండల నాయకులు,గ్రామ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

సిఎస్ఐ చర్చిలో ఘనంగా మట్టల ఈస్టర్.

సిఎస్ఐ చర్చిలో ఘనంగా మట్టల ( ఈస్టర్) పండుగ

నేటి ధాత్రి/ భద్రాచలం

 

 

స్థానిక సీఎస్ఐ చర్చిలో మట్టల పండుగను ఆదివారంఘనంగా నిర్వహించినారు ఈ సందర్భంగా ఉదయం నుంచే భక్తులు రావడంతో చర్చి పరిసర ప్రాంతాలు ఈత మట్టలతో ప్రత్యేకంగా ఆకర్షణంగా కనిపించాయి భక్తులు ఈత మట్టలతో భక్తి గీతాలు ఆలపిస్తూ చర్చి చుట్టూ తిరిగారు అనంతరం చర్చిలో జరిగే ప్రత్యేక ప్రార్థనలు పాల్గొన్నారు ఏసుప్రభు జెరుసలెం పట్టణంలో ప్రధమంగా ప్రవేశించినప్పుడు అక్కడి ప్రజలు ఏసు ప్రభువును గాడిద పై తీసుకొని వస్తూ పెద్ద ఎత్తున వివిధ రకాల ఈత మట్టలతో ఘన స్వాగతం పలుకుతారు దీనినే క్రైస్తవులు మట్టల ( ఈస్టర్) పండుగగా ఆచరిస్తారు ఈ సందర్భంగా పాస్ట్రేట్ ,& గ్రూప్ చైర్మన్ రేవ , కె . టీ .విజయ్ కుమార్ భక్తులను ఉద్దేశించి దైవ సందేశం చేశారు.
ఈ కార్యక్రమంలో పాస్టర్ గడిదేసి సాల్మన్ , పస్ట్రేట్ & గ్రూప్ సెక్రెటరీ, రితీష్ రెడ్డి, ట్రెజర్ , వై .ప్రసాద్ రావు, మరియు కమిటీ సభ్యులు జోసెఫ్ కుమార్ ,రాజు రవికిషోర్ ,మధు సంతాయ్య. పాల్గొన్నారు

డా.బి.ఆర్.అంబేద్కర్ గారి జయంతి.!

భారత రాజ్యాంగ పితామహుడు డా.బి.ఆర్.అంబేద్కర్ గారి జయంతి

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు పట్టణం లోని *రహదారి,మున్సిపల్,బాబు మోహన్ కాలనీ,లో గల విగ్రహాలకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్ రావు మాట్లాడుతూ భారత రాజ్యాంగ శిల్పిగా,ప్రజాస్వామ్య పరిరక్షకునిగా,సంఘసంస్కర్తగా,విఖ్యాతుడైన అంబేద్కర్ గారికి భారత ప్రభుత్వం భారతరత్న అవార్డు ఇవ్వడం అభినందనీయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప,మాజి ఆత్మ చైర్మన్ లు విజయ్ కుమార్ , పెంట రెడ్డి,జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి ,పాక్స్ చైర్మన్ చైర్మన్ మచెందర్, సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్,మొహి ఉద్దీన్,ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్,యువ నాయకులు మిథున్ రాజ్,మహిళ పట్టణ అధ్యక్షురాలు మంజుల, జాగృతి అధ్యక్షురాలు అనుషమ్మ, బి ఆర్ ఎస్వీ అధ్యక్షులు రాకేష్ ,ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు శివప్ప,బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

భారత రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళులు.

భారత రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళులు.

#డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్ఫూర్తి తో యువత ముందుకు సాగాలి.

#మండలంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

 

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో బస్టాండ్ ఆవరణలో అంబేద్కర్ విగ్రహానికి .
బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, సిపిఎం, పార్టీలతోపాటు దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు . అలాగే వివిధ ప్రభుత్వ కార్యాలయంలో అధికారులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి జయంతి వేడుకలను పురస్కరించుకుని దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు కార్యక్రమంలో మండల తాసిల్దార్ ముప్పు కృష్ణ, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు భానోత్ సారంగపాణి, ఫ్యాక్స్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్ రావు, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఉడుగుల ప్రవీణ్ గౌడ్,కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి, చార్ల శివారెడ్డి, మాలోతు రమేష్, వైనాల అశోక్, బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్, పెరుమాండ్ల కోటి, బచ్చు వెంకన్న, బోట్ల ప్రతాప్,సిపిఎం నాయకులు కడియాల వీరాచారి,, మనోహర్, బొడిగ సమ్మయ్య, దళిత సంఘాల నాయకులు బట్టు సాంబయ్య, బోట్ల నరేష్, పవన్, పరికి కోర్నెల్, రత్నం, జన్ను జయరాజ్, గౌడ సంఘ నాయకులు సట్ల శ్రీనివాస్ గౌడ్, పెరుమాండ్ల రాజ్ కుమార్ గౌడ్, ముత్యాల కుమార్ గౌడ్, గాధ గాని రమేష్ గౌడ్, తదితరులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల చేసి ఘన నివాళులర్పించారు.

అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న.!

అంబేద్కర్ గారి జయంతి వేడుకల్లో పాల్గొన్న టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్) మాజీ చెర్మెన్ వై.నరోత్తం..

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

బారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా టిఎస్ఎస్ సిసిడిసి ఎస్సి కార్పొరేషన్ మాజి చెర్మెన్ వై.నరోత్తం పార్టీ నాయకులతో కలిసి పట్టణంలో గల అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు,ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వై.నరోత్తం మాట్లాడుతూ దేశానికి అంబేద్కర్ గారు అందించిన సేవలు ఆమోగమని భారత దేశ స్వపరిపాలన ఆదర్శంగా నిలవాలనే లక్ష్యంగా అంబేద్కర్ గారు దేశ రాజ్యంగాన్నీ తీర్చిదిద్దారని అన్నారు,వారు ఆశయాలను కొనసాగిస్తూ వారు చూపిన మార్గంలో మనమందరం నడుచుకోవాలని అన్నారు,ఈ కార్యక్రమంలో నాయకులు డి.మాణిక్ ప్రభుగౌడ్ రైతు హక్కుల సాధన సమితి అధ్యక్షులు సి.బాల్ రాజ్,శివ కుమార్,పి.జి.ఈశ్వర్,యస్, గోపాల్,చెంగల్ జైపాల్,బి. వేణుగోపాల్,యస్.శ్రీనివాస్, రాజేందర్,దిలీప్,ప్రేమ్ కుమార్, ప్రకాష్,సునీల్, తదితరులు పాల్గొన్నారు.

నాగారం లో రాజ్యాంగ నిర్మాత జయంతి వేడుకలు.

నాగారం గ్రామంలో రాజ్యాంగ నిర్మాత జయంతి వేడుకలు

అంబెడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన డాక్టర్ సిరంగి సంతోష్,రాజభద్రయ్య

పరకాల నేటిధాత్రి

 

మండలం లోని నాగారం గ్రామంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్,మున్సిపల్ మాజీ చైర్మన్ మార్తా రాజ భద్రయ్య అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ పరకాల మండల అధ్యక్షులు కాసగాని రాజ్ కుమార్ గౌడ్,జిల్లా కౌన్సిల్ మెంబెర్ బాబు యాదవ్,కన్వీనర్ కొమ్మిడి మహేందర్ రెడ్డి,కార్యక్రమ కో కన్వీనర్ లు దుమల నగేష్,కునూరు విరస్వామి,జనరల్ సెక్రటరీ జంగిలి రాజేందర్ రావు,కోశాదికారి ఎదునూరి లింగయ్య,సీనియర్ నాయకులు గుండబోయిన నర్సయ్య,పుచ్చకాయల మల్లారెడ్డి,బీజేవైఎం నాయకులు కాసగాని సాయి కుమార్,బూత్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి,బిక్షపతి,గొట్టే మొగిలి,పైడిపెల్లి మాజీ సర్పంచ్ సురేష్,పోచారం బూత్ అధ్యక్షులు గంపలపెళ్ళి రాజు,లక్ష్మిపురం బూత్ అధ్యక్షులు సంపత్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

డాక్టర్ బి.ఆర్అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించాలి.

డాక్టర్ బి.ఆర్అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించాలి.

చిట్యాల,నేటిధాత్రి

 

 

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్ని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చిట్యాల మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని బిజెపి చిట్యాల మండలాధ్యక్షులు బుర్ర వెంకటేష్ గౌడ్ అన్నారు.
అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ఇప్పుడు వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ భారతదేశ ప్రజాస్వామ్య దేశంగా రూపుదిద్దుకున్నదంటే అదికేవలం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే సాధ్యమైందనిఅన్నారూ ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా మన భారత దేశంలో రాజ్యాంగం ప్రజాస్వామ్యబద్ధంగా కొనసాగుతుంది అంటే ఆ మహనీయుని కారణంగ భారత రాజ్యాంగంవ్యవహరిస్తున్నదని కుల మత విభేదం లేకుండా ఓటు అనే ఆయుధం ద్వారా బానిస సంకెళ్లను తొలగించడంజరిగిందని*
భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ గ కాశయాలను కొనసాగిచలనిఅన్నారు,
ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు చెక్క నరసయ్య ఓబిసి జిల్లా అధ్యక్షులు తీగల జగ్గయ్య గుండ సురేష్ గజనాల రవీందర్ సదానందం శ్రీహరి గుర్రపు రవీందర్ మైదం శ్రీకాంత్ కింసారపు ప్రభాకర్ వల్లాల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

‘ఘనంగా అంబేద్కర్ జయంతి’.

‘ఘనంగా అంబేద్కర్ జయంతి’

బాలానగర్ /నేటి ధాత్రి.

 

బాలానగర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సోమవారం భారత రాజ్యాంగ నిర్మాత బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతిని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు మాట్లాడుతూ.. అంబేద్కర్ ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించాడని, అంటరానితనం అస్పృశ్యత నివారణకు కృషి చేశారన్నారు. బహుజనులకు ఆరాధ్యుడన్నారు. అనంతరం అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి, వెంకటాచారి, యాదయ్య, శ్రీశైలం, నుప్ప ప్రకాష్, కొంగళ్ళ శ్రీను, శంకర్ నాయక్, లక్ష్మయ్య, వెంకటయ్య, జంగయ్య, మాసయ్య తదితరులు పాల్గొన్నారు.

వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన.!

వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రేవూరి

 

నడికూడ,నేటిధాత్రి:

 

 

మండల కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర గ్రామైక్య ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం పరకాల శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐకేపీ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రా లకు ధాన్యాన్ని తరలించి,ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు.దీనివల్ల 500 రూపాయల బోనస్ కూడా రైతులకు చేకూరుతుందన్నారు.రైతుల ఆర్థిక అభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.మద్దతు ధర క్వింటాలుకు ‘ఎ ‘ గ్రేడ్ రకం రూ. 2320.సాధారణ రకానికి ధర 2300‌. ఉందన్నారు.ఈ కార్యక్రమం లో మండల తహాసిల్దార్ గుండాల నాగరాజు, ఎంపీడీవో విమల,ఏఎం సీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి, ఏవో జైసింగ్, పి డి‌. శ్రీనివాస్, డిపిఎం ప్రకాష్,ఏపీఎం రమాదేవి,మహిళా సమైక్య సభ్యులు వివోఏ గోనె‌ల కవిత,జంగిలి శిరీష, చెన్నబోయిన పవిత్ర,దుండి స్రవంతి,రావుల కావ్య.కాంగ్రెస్ పార్టీ నడికూడ మండల అధ్యక్షులు బుర్ర దేవేందర్ గౌడ్,ప్రధాన కార్యదర్శి కుడ్ల మలహల్ రావు,గ్రామ కమిటీ అధ్యక్షుడు తాళ్ల నవీన్, సమన్వయ కమిటీ సభ్యులు పర్నెం మల్లారెడ్డి,పెద్ద బోయిన రవీందర్ యాదవ్, పాడి ప్రతాప్ రెడ్డి,కోడెపాక కరుణాకర్,హమాలీలు, రైతులు,తదితరులు పాల్గొన్నారు.

రాజ్య స్థాపకుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్…

ప్రజాస్వామ్య గణతంత్ర లౌకిక రాజ్య స్థాపకుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్…
ఆత్మగౌరవ అస్తిత్వ ఉద్యమాలకు దశాదిశాలు చూపిన స్ఫూర్తిదాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్…
-జక్కి శ్రీకాంత్
(జాతీయ యువజన అవార్డు గ్రహీత)

వర్దన్నపేట (నేటిదాత్రి):

 

 

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలో మహానీయుల జయంతి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. మహనీయుల జయంతి ఉత్సవాల కమిటీ కన్వీనర్ జాతీయ యువజన అవార్డు గ్రహీత జక్కి శ్రీకాంత్ ఆధ్వర్యంలో జరుగుతున్న “మహానీయుల స్ఫూర్తి యాత్ర” నేడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జన్ను నరసయ్య, మాస్ రాష్ట్ర అధ్యక్షులు జన్ను రాములు,బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మచ్చ రాజు, ముగింపు యాత్రలో పాల్గొని మహానీయుల చిత్రపటాలతో స్వామి వివేకానంద విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది.

Dr. B.R. Ambedkar

 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంటరానితనం వివక్షల పై అలుపెరుగని పోరాటం చేసి అస్తిత్వ ఉద్యమాలకు దిశా దశలు చూపిన స్ఫూర్తిదాత ఆర్థికవేత్త రాజనీతిజ్ఞుడు భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నేటి తరానికి స్ఫూర్తి అని అన్నారు. పొలిటికల్ పవర్ ఇస్ మాస్టర్ కి అని ఈ దేశానికి పాలకులు కావడమే మన లక్ష్యమని ఇంతకాలం బాధితులుగా ఉన్నాం ఇక మనం పాలకులుగా మారుదామని బహుజనులను చైతన్యపరిచిన మహా పురుషుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారు. 1931లో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని దళితులకు హక్కులు కల్పించిన దళిత అభ్యుదయ వారి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు ప్రపంచానికి జ్ఞానాన్ని పంచి నేడు ప్రపంచం మొత్తం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని జ్ఞాన దినోత్సవంగా జరుపుకోవడం ఈ దేశానికి ఎంతో గర్వకారణమని అన్నారు.

Dr. B.R. Ambedkar

 

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ పొలిటి బ్యూరో సభ్యులు ఈరెల్లి శ్రీనివాస్, తెలంగాణ అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు కంచర్ల మహేష్, వరంగల్ జిల్లా కో కన్వీనర్ జంగిలి భాస్కర్, జాతీయ బిసి సంక్షేమ సంఘం వర్ధన్నపేట నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మామిండ్ల చెన్నయ్య, తెలంగాణ అంబేద్కర్ సంఘం వర్ధన్నపేట పట్టణ అధ్యక్షులు నందిపాక భాస్కర్, కొండేటి మహేందర్, ఎమ్మార్పీఎస్ నాయకులు చాడ కరుణాకర్, దళిత శక్తి నాయకులు ఆరోగ్యం, విజయలక్ష్మి, శ్రీనివాస్, రాజు రమేష్, తదితరులు పాల్గొన్నారు

అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కొనసాగించాలి.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కొనసాగించాలి
-జక్కి శ్రీకాంత్
వర్దన్నపేట (నేటిదాత్రి)

 

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలోని వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు ప్రజలు పాల్గొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి, మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్ జాతీయ యువజన అవార్డు గ్రహీత జక్కి శ్రీకాంత్ ఆధ్వర్యంలో జరుగుతున్న “మహనీయుల స్ఫూర్తి యాత్ర” లో గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ జిల్లా నాయకులు దోమకొండ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరుపట్ల బాబు, బిజెపి వర్ధన్నపేట ప్రధాన కార్యదర్శి డోలి సతీష్, కాంగ్రెస్ పార్టీ మండల మైనార్టీ నాయకులు మహమ్మద్ జాఫర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వడ్డే నారాయణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ కుల పెద్దమనుషులు బిరు యాకయ్య, బిర్రు మామునూర్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీపాది శ్రీనివాస్, తక్కలపల్లి వెంకటేశ్వరరావు, కాంభోజ యాకయ్య, కాంభోజ సాయిలు, బిర్రు కుమారస్వామి, బిర్రు చంద్రయ్య పిటి, మంద ఎల్లయ్య, సమ్మయ్య, వెంకటయ్య, సమ్మయ్య, సాయిలు, వివిధ కుల నాయకులు పాల్గొన్నారు

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు.

ఏ వై ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు.

చిట్యాల, నేటిధాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లాచిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు జన్నే యుగంధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవ కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి కేక్ కట్ చేసిన చిట్యాల మాజీ జెడ్పిటిసి గొర్రె సాగర్ ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు అల్లం రవీందర్ పిఎసిఎస్ చైర్మన్ కుంభం క్రాంతి కుమార్ రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తూరీ రాజిరెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ పిట్ట సురేష్ మండల ప్రధాన కార్యదర్శులు మడికొండ రవీందర్రావు ఏరుకొండ రాజేందర్ మండల నాయకులు బైరం భద్రయ్య పాండ్రాల వీరస్వామి దామెర రాజు మేడిపల్లి శ్రీనివాస్ వల్ల కొండ లింగారెడ్డి చిదిరాల సరోజన వినవంక శ్రీదేవి మైదము కరుణ ముల్కోజు ప్రవీణ్ సిద్ధోజు శ్రీకాంత్ చారి కైరిక రాజు గుండు నగేష్ కట్కూరి రాజేందర్ కట్కూరి కుమార్ (గని) అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

పూలమాలలు వేసి నివాళులర్పించిన.!

డా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే శివసీన రెడ్డి
వనపర్తి నేటిదాత్రి :

 

భారతరత్న డాక్టర్ బి. ఆ ర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వనపర్తి లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈసందర్భంగా వారు మాట్లాడుతూ
రాజ్యాంగ నిర్మాతగా అంబేద్కర్ ఒక సామాజిక సంస్కర్త, న్యాయవేత్త, ఆర్థికవేత్త మరియు అణగారిన వర్గాల హక్కుల పోరాట యోధుడు.దళిత కుటుంబంలో జన్మించిన ఆయన కుల వివక్షను ఎదుర్కొన్నప్పటికీ విద్యను అభ్యసించడానికి అడ్డంకులను అధిగమించి, కొలంబియా విశ్వవిద్యాలయం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల నుండి డిగ్రీలను సంపాదించారని అన్నారు
ఈ కార్యక్రమంలో కేతపల్లి విష్ణువ
ర్డన్ రెడ్డి పి సి సి దెలిగేట్ టి శంకర్ ప్రసాద్ అధికారులు ఆర్డీవో తహిసిల్ దార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోర్డినెటర్ డి వెంకటేష్ ఒక ప్రకటన లో తెలిపారు_

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు.

ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

-డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పిస్తున్న వేముల మహేందర్ గౌడ్

జయంతి అంటే పాలతో ఫోటోలు కడగడం కాదు..ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవడం…

అణగారిన వర్గాల ఆశాజ్యోతి..పేదల పక్షాన నిలబడిన మహోన్నతమైన నాయకుడు బి.ఆర్ అంబెడ్కర్

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

మనుషుల్ని మనుషులుగా చూడని ఈ దేశంలో మనుషులంతా సమానమేనని, తాను రచించిన రాజ్యాంగం ద్వారా నిరూపించిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ అన్నారు. సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని ఆయన హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహేందర్ గౌడ్ మాట్లాడారు. సామాజిక అసమానతలను రూపుమాపేందుకు ఎన్నో అవమానాలు, కుల వివక్షతను ఎదుర్కొని దేశంలో ఎన్నో సంఘసంస్కరణలకు ఆద్యం పోసి వెలి వాడల నుంచి దేశానికే రాజ్యాంగాన్ని అందించిన గొప్ప దార్శనికుడు, బడుగు బలహీన వర్గాల బహుజన బాంధవుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. నేటితరం వారి స్ఫూర్తి, త్యాగాలను ఆదర్శంగా తీసుకుని..కుల వివక్షతకు..కుల నిర్మూలనకు..అగ్రవర్ణాల అణచివేతకు..వ్యతిరేకంగా ముందుకు సాగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు ఎతైన విగ్రహాలు నెలకొల్పి..జయంతులు..వర్ధంతుల సందర్భంలో మాత్రమే అంబేద్కర్ ను గుర్తు చేసుకునే ఒరవడిని కాకుండా వారి స్ఫూర్తిని, చరిత్రను భావితరాలకు అందించేందుకు కృషి చేయాలని కోరారు.

అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ.

డా బి ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ

ముఖ్య అతిథిగా హాజరైన పరకాల శాసనసభ్యులు రేవూరి

కాశిబుగ్గ నేటిధాత్రి

 

 

భారత రాజ్యాంగ నిర్మాత డా బి ఆర్ అంబేద్కర్ 134 వ జయంతి సందర్భంగా ఆదివారం గీసుగొండ మండల కేంద్రంలో కీర్తిశేషులు తుప్పరి సూర్యనారాయణ జ్ఞాపకార్థం సందర్భంగా వారి కుమారుడు తుప్పరి వికాస్ ఏర్పాటుచేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆవిష్కరించారు.అనంతరం గీసుగొండ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు దౌడు అనిల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవూరి మాట్లాడుతూ భారత దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన రాజ్యాంగాన్ని రూపొందించే స్థాయికి ఎదిగిన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాసి పేద ప్రజల బతుకుల్లో వెలుగులు నింపారని అన్నారు. అటువంటి మహానేత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు సహకరించిన దాతలకు, కష్టపడ్డ ప్రతి వ్యక్తికి పేరు పేరునా అభినందిస్తున్నట్లు తెలిపారు.రాజ్యాంగ స్ఫూర్తిని అంబేడ్కర్ ఆశయాలను దెబ్బతీసేలా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని వారి కుట్రను తిప్పికొట్టేందుకే జై బాపు,జై భీమ్,జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నదని అన్నారు. అణగారిన వర్గాలకి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఆశాకిరణం అని బడుగు బలహీనుల జీవితాల్లో వెలుగు నింపిన మహనీయుడు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version