సమీకృత మార్కెట్ బిల్డింగ్ బిల్లులు ప్రభుత్వం వెంటనే చెల్లించాలి..
◆-: 5 కోట్ల 50 లక్షల బిల్లులు బకాయిలు రావాలి : కాంట్రాక్టర్ మీర్ జవీద్ అలీ
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్. 11 కోట్ల నిధులతో మంజూరైన సమీకృత ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ను అప్పటి ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు తన్నీరు హరీష్ రావు మంజూరు చేశారు. మార్కెట్ బిల్డింగ్ మంజూరు అనంతరం టెండర్ ప్రాతిపదికన జేజే కన్స్ ట్రాక్షన్ గ్రూప్ కి దక్కిందని, టెండరు దక్కించుకున్న కొద్దిరోజులకె పనులను మొదలుపెట్టి ఉన్నత అధికారుల ఆదేశాలు, ఇంజినీరింగ్ విభాగానికి చెందిన అధికారుల సూచనల మేరకు పనులను వేగవంతంగా పూర్తి చేస్తూ ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు పనులను పూర్తి చేయడం జరిగిందని సంబంధిత కాంట్రాక్టర్ మీర్ జవీద్ అలీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 11 కోట్ల నిధులతో అనగా 5 కోట్ల 50 లక్షలు టీయూఎఫ్ఐడిసి నిధులు మాత్రమే ప్రభుత్వం చెల్లించిందని, 4 కోట్ల 50 లక్షలు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ (ఎస్డీఎఫ్) నిధులు, 1 కోటి రూపాయలు పట్టణ ప్రగతి కింద కేటాయించారు. ఎస్డీఎఫ్, పట్టణ ప్రగతి కింద ఉన్న నిధులు 5 కోట్ల 50 లక్షల రూపాయలు ఇప్పటివరకు చెల్లించలేదు. ఇదే విషయమై ఎన్నోసార్లు జిల్లా ఉన్నత అధికారులు మార్కెట్ బిల్డింగ్ కి వచ్చి చెల్లింపులు చేస్తాము మీరు బిల్డింగ్ తళలను సంభందిత విభాగానికి అప్పగించాలని అప్పటి కలెక్టర్ వల్లూరి క్రాంతి, అదనపు కలెక్టర్ రాజర్షి షా ఎన్నోసార్లు వచ్చి ప్రకటించిన కార్యరూపం దాల్చలేదు. ఇదే విషయమై కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన కొద్దిరోజుల వ్యవధిలోనే పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో 23 ఫిబ్రవరి 2024 నాడు న జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వారం రోజుల్లో 5 కోట్ల 50 లక్షల బిల్లులు చెల్లింపులు చేస్తామని సంబంధిత అధికారులు, బిల్డింగ్ కాంట్రాక్టర్ అయిన తన సమక్షంలో ప్రకటించాడం జరిగిందని, వారి ప్రకటన అనంతరం కొన్ని షరతులతో బిల్డింగ్ కింది భాగమైన మొదటి అంతస్తు తాళాలను సంబంధిత అధికారులకు అప్పగించడం జరిగిందని, వారు ప్రకటన చేసి రెండేళ్లు గడిచిన ఇప్పటివరకు బిల్లులు జమకాలేదని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బకాయిలను చెల్లించలని కోరారు. ఇప్పటికే మార్కెట్ బిల్డింగ్ పనులను పూర్తి చేసి దాదాపు నాలుగేళ్లు గడుస్తున్న మిగిలిన 5 కోట్ల 50 లక్షల రూపాయలు రాక సంబంధిత కాంట్రాక్టర్, కన్స్ ట్రాక్షన్ గ్రూపు ఇబ్బందులు ఎదుర్కొంటుంది. చూడాలి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి బిల్లులు చెల్లించి మార్కెట్ బిల్డింగ్ ను టెండర్ లో దక్కించుకున్న వారికి ఎప్పుడు కేటాయిస్తుందో వేచిచూడాలి.
