మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రవేశాలను సద్వినియోగం చేసుకోవాలి
కాంగ్రెస్ మైనార్టీ నాయకులు జాఫర్ రిజ్వి
పరకాల నేటిధాత్రి
ఉచిత విద్య వసతి సౌకర్యాలతో తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీలో 2026-2027 సంవత్సరానికి గాను ప్రవేశాలు ప్రారంభమైన సందర్భంగా శుక్రవారం రోజున విద్యార్థులను నమోదు చేసుకోవడానికి ముస్లిం మైనార్టీల గృహాలకు వెళ్లి ఐదవ తరగతి ప్రవేశాలు అన్నీ వర్గాలకు 6,7,8తరగతిలో మైనారిటీ వర్గాలకు మాత్రమే ఖాళీలు ఉన్నచోట ప్రవేశాలు కల్పించడానికి కాంగ్రెస్ నాయకులు జాఫర్ రిజ్వి ఇంటింటికి తిరిగి ప్రచారము నిర్వహించారు.అయన ఈ సందర్బంగా మాట్లాడుతూ అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రులను కళాశాల మైనారిటీ రెసిడెన్షియల్ గురించి చెప్పి విద్యార్థులను పరకాల మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ ఓగులాపురంలో గల స్కూల్లో ప్రవేశములు చేయించాలని విద్యార్థుల పేర్లు నమోదు చేయించి తమ పిల్లలను పాఠశాలలో చేర్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఇంగ్లీష్ టీచర్ ఎకు సంపత్ కుమార్,మైమున బేగం ఉర్దూ టీచర్,మైనారిటీ నాయకులు జాఫర్ రిజ్వి పాల్గొన్నారు.
