హిందూ ధర్మంపై అవగాహన పెంచాలి: బ్రహ్మనందా మాయి…

హిందూ ధర్మంపై అవగాహన పెంచాలి: బ్రహ్మనందా మాయి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

న్యాల్కల్: మాత బ్రహ్మనందా మాయి ట్రస్ట్ అధినేత శ్రీ శ్రీ శ్రీ బ్రహ్మనందా మాయి, ప్రతి ఇంట్లో భగవద్గీత ఉండాలని, నిత్యం పూజలు చేయడం ద్వారా ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుందని అన్నారు. హిందూ ధర్మం మన సంస్కృతి, సంప్రదాయాలకు మూలస్తంభమని, యువత ధర్మం పట్ల ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. ధర్మాచరణతో సమాజంలో సానుకూల మార్పులు వస్తాయని ఆమె పేర్కొన్నారు. హైదరాబాద్లోని ఆమె నివాసంలో న్యాల్కల్ మండలం బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు ఓంకార్ యాదవ్ ఆమెను కలిసి సత్కరించారు. కార్యక్రమంలో డా. జనార్దన్ రెడ్డి, నర్సప్ప, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version